
ఎన్నో రకాల రెస్టారెంట్ వంటకాలు చూసుంటారు. కానీ ఇలాంటి వంటకాల తీరుని మాత్రం అస్సలు ?చూసుండరు. ఆర్డర్ చేస్తే ఎప్పుడొస్తుందా.. ? అని గంటలతరబడి వెయిట్ చేయాలి. తీరా ఆర్డర్ చేసిన ఫుడ్ వచ్చాకా..తినడం మర్చిపోతాం. అలా ఉంటుంది ఆ రెస్టారెంట్ వడ్డించే తీరు. వంటకాలు లిస్ట్ పెద్దదే..ఆ డెజర్ట్‌లు వడ్డించే తీరు ఊహకు దొరకదు..ప్రశంసకు అందదు అన్నట్లుగా ఉంటాయి ఆ వంటకాలు. ఇంతకీ ఇదంతా ఎక్కడంటే..
కోపెన్‌హాగన్‌లోని రెఫ్‌షాలియోన్ జిల్లాలో ఉన్న ఆల్కెమిస్ట్ అనే రెస్టారెంట్‌లో ఇలా చిత్రమైన రీతీలో వంటకాలను వడ్డిస్తారు. ఈ రెస్టారెంట్ రెండు మిచెలిన్ స్టార్‌లను దక్కించుకుంది. అక్కడ భోజనం ఓ గొప్ప విషయాన్ని బోధిస్తాయి. అందుకోసం అయినా అక్కడకు వెళ్లి తీరాల్సిందే అని చెప్పొచ్చు. అక్కడ ప్రతి వంటకాన్ని.. పాకకళకు థియేటర్ అండ్ మల్టీమీడియా ఆర్ట్‌తో మిళితం చేసి.. కస్టమర్లకు సర్వ్ చేస్తుంది.
వడ్డించే ప్రతి వంటకం..ఆహార కొరత, పర్యావరణ ఆందోళనలు, సామాజిక న్యాయం వంటి ప్రపంచ సమస్యలను కళ్లకు కట్టినట్లు చూపించినట్లుగా క్రియేటివిటీగా అందిస్తారు. అంతేకాదండోయ్ మెనూలో మొత్తం 40 రకాల వంటకాలను అందిస్తుంది. ఆర్డర్ కోసం గంటల తరబడి వెయిట్ చేయక తప్పదు. పైగా ధరలు కూడా కళ్లు చెదిరిపోయే రేంజ్‌లో ఉంటాయి. ఈ హోటల్‌లో తినాలంటే ముందుగానే రిజర్వ్ చేసుకోవాలి..ఆర్డర్ కోసం ఎలాంటి వాళ్లైనా.. తప్పక వెయిట్ చేయాల్సిందే.
అక్కడ తింటే సుమారు రూ. 60 వేలు పైనే ఖర్చు అవుతుందట. అత్యంత డిమాండ్ ఉన్న ఈ రెస్టారెంట్‌లో వంటకాలకు సంబధించిన వీడియోని ఓ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ నెట్టిట షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోలో గతేడాది ఆ రెస్టారెంట్‌లో అందించిన వంటకాలు కనిపిస్తాయి. తినదగిన సీతాకోక చిలుకల రూపంలో డిజర్ట్ చూస్తే ప్రోటీన్ వనరులుగా కీటకాలును తినొచ్చు అని హైలెట్ చేస్తుంది.
ఇంకా పచ్చి జెల్లీ ఫిష్, తినదగిన ప్లాస్టిక్‌లో చుట్టబడిన చేప (సముద్ర కాలుష్యం గురించి అవగాహన కల్పించే లక్ష్యంతో), సోర్ క్రీంతో చదును చేయబడిన కోడి తల, పాడైనట్లు కనిపించే చీజ్, బోనులో కోడి పాదాలు (ఇది వ్యవసాయం పరిస్థితిని వివరించడం కోసం), పంది, జింక రక్తంలతో చేసిన స్వీట్(రక్తదానం ప్రాముఖ్యత కోసం)..ఇలా ప్రతి వంటకం ఒక్కో ప్రపంచ సమస్యను వివరించేలా అద్భుతమైన కళా నైపుణ్యంతో ప్రెజెంట్ చేశారు.
వాటిని చూస్తే మతిపోవడం ఖాయం అనేలా ఉంటాయి. నెటిజన్లు మాత్రం మరీ ఇంత లగ్జరీయస్ గానా..! అని, మరికొందరూ..ఆహారం రూపంలో ప్రపంచ సమస్యలను హైలెట్ చేసేలా కళను కూడా జోడించడం అంటే మాటలు కాదు అని సదరు రెస్టారెంట్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
(చదవండి: పాపం ఆ సీఈవో.. ‘శరీరం’ చెప్పేది వినలేదు! ఆఖరికి ఇలా..)