
మహిళలూ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి!
రోజుకు ఒక్క అరగంట కేటాయించండి!
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా అంబానీ (Nita Ambani) మహిళల కోసం ఓ ప్రత్యేక సందేశాన్ని పంచుకున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ సతీమణి నీతా ఫిట్‌నెస్ గురించి, ఆమె ష్యాషన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆరు పదుల నిండిన వయసులో కూడా అనేక కార్యక్రమాలతో చాలా చురుగ్గా నిర్మాణాత్మకంగా ఉంటారు ఇదే విషయాన్ని గుర్తుచేస్తూ మార్చి 8న నీతా అంబానీ మహిళల కోసం ఒక వీడియోను షర్ చేశారు. ఫిట్‌నెస్ రొటీన్‌లో క్రమశిక్షణ, అభిరుచిరెండింటినీ మిళితం చేయాలని సూచించారు.
అన్ని వయసుల మహిళలు తమ ఆరోగ్యం , శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వ్యాయామం మనలో సానుకూల ధోరణిని పెంచుతుంది,మనసుకు ప్రశాతంనిస్తుంది అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట సందడిగా మారింది. తాను ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు, ఎలాంటి వ్యాయామం చేస్తారో, తన జీవన శైలి వివరాలను పంచుకున్నారు. అలాగే మహిళలు తమ ఆరోగ్యం, శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వాలని నీతా అంబానీ సూచించారు. ప్రస్తుతం తన వయసు 61 ఏళ్లని.. ఆరేళ్ల వయస్సునుంచి డ్యాన్స్ ప్రాక్టీస్, వ్యాయాం చేస్తూ ఇప్పటికీ ఎంతో ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా తన ఫిట్‌నెస్ దినచర్య గురించి కూడా వివరించారు. రోజూ 30 నిమిషాల పాటూ ఫిట్‌నెస్ కోసం కేటాయిస్తానని, వాకింగ్, జిమ్, స్విమ్మింగ్ చేస్తానని తెలిపారు. చురుగ్గా ఉండటం చక్కెర, చక్కెర ప్రత్యామ్నాయ పదార్థాలను కూడా తీసుకోనని వెల్లడించారు. రోజుకి 5-7వేల అడుగులు నడవడంతోపాటు శాఖాహారంమాత్రమే తీసుకుంటూ, సరైన మోతాదులో ప్రోటీన్, పోషకాలు ఉండేలా జాగ్రత్తపడతానని చెప్పారు.

ముఖ్యంగా అంతేకాదు మహిళలు తమను తాము జాగ్రత్తగా చూసుకోవడానికి, దీనికి సంబంధించిన చర్యను ప్రారంభించడానికి సమయం మించిపోలేదని గుర్తు చేశారు. ముఖ్యంగా 30 ఏళ్ల తర్వాత మహిళలు తమను తాము జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరమన్నారు. కండరాలు బలహీనపడతాయి. ఎముకల బలం తగ్గుతుంది. అందుకే మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. ఒక్క అరగంట : నీతా అంబానీ ఫిట్‌నెస్ మంత్రా వైరల్ వీడియో ‘‘61 ఏళ్లలో నేనుచేయగిలిగనపుడు.. మీరెందు చేయలేరు.. కదలండి! ఒక్క అరగంట మీకోసం కేటాయించుకోండి!!’’ అంటూ నీతా అంబానీ మహిళలకు పిలుపునిచ్చారు.
