International Women's Day 2025
-
గ్రేటర్ ఓర్లాండోలో నాట్స్ మహిళా దినోత్సవం
గ్రేటర్ ఓర్లాండోలో నాట్స్ క్రమంగా తెలుగు వారికి చేరవయ్యేలా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా నాట్స్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. గ్రేట్ ఓర్లాండో లోని తెలుగు మహిళలు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. శక్తి పౌండేషన్ మధురిమ, మా దుర్గ సాయి టెంపుల్ చెందిన అనితా దుగ్గల్, గ్లోబల్ ఎడ్యుకేషన్ ఇన్షియేటివ్కి చెందిన పార్వతీ శ్రీరామ, సృజని గోలి, శుభ, విమెన్ ఫర్ ఛారిటీకి చెందిన రత్న సుజ, నిషితలు ఈ కార్యక్రమానికి తమ వంతు సహకారం అందించారు.కాలిఫోర్నియా నుంచి శిరిష ఎల్లా ఈ మహిళ దినోత్సవానికి ముఖ్య అతిధిగా వచ్చి అందరిలో స్ఫూర్తిని నింపారు. సంతోష్, వేణు మల్ల, రాజశేఖర్ అంగ, లక్ష్మీ, ఎంటర్ ప్రెన్యూర్ వర్ణ, ఫోటోగ్రాఫర్ కార్తీక్‌లు వాలంటీర్లుగా తమ విలువైన సేవలకు అందించారు. మా ఫుడ్స్, నాటు నాటు సంస్థలు ఈ మహిళా దినోత్సవానికి ఫుడ్ స్పాన్సర్లుగా వ్యవహారించాయి.మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి! -
#WomenPower : హంపీ టెంపుల్లోని ఈ సారథుల గురించి తెలుసా?
విజయనగర సామ్రాజ్య వైభవానికి నిలువెత్తు సాక్ష్యం కర్ణాటక రాష్ట్రంలోని హంపి క్షేత్రం. హంపిలోని ప్రధాన ఆకర్షణల్లో ఒకటి విట్టల దేవాలయం. 15వ శతాబ్దానికి చెందిన ఈ దేవాలయం వారసత్వ సంపద, సంస్కృతీ విశేషాలతో నిండి ఉంటుంది. ఈ ఆలయాన్ని విట్టలకు అంకితం చేశారు కనుక దీన్ని జయ విట్టల ఆలయం అని కూడా పిలుస్తారు. విట్టలను విష్ణువు అవతారం అని అంటారు. ఆర్కిటెక్చర్, డిజైన్ విజయనగర ఆలయ నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తాయి. సైన్స్‌కు కూడా అంతుచిక్కని అద్భుతాలకు నిలయం. ద్రావిడ నిర్మాణ శైలితో, విస్తృతమైన అలనాటి కళాకారుల ప్రతిభతో అపురూపంగా చెక్కిన శిల్పాలను చూసినపుడు తనువు రోమాంచిత మవుతుంది. ఇక్కడున్న మహా మండపం, దేవి మందిరం, కళ్యాణ మండపం, రంగ మండపం, ఉత్సవ మండపం, రాతి రధం వంటి వాటిల్లో కళావైభవం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ముఖ్యంగా చేతితో (గంధపు చెక్కలతో) మీటగానే సప్త స్వరాలను పలికించే సంగీత స్తంభాలు ఇలా ఒకదానికొకటి సందర్శకులు మంత్రముగ్ధుల్ని చేస్తాయి. అయితే దీన్ని ప్రత్యేకతను రక్షించే చర్యల్లో భాగంగా టూరిస్టులు ఈ స్థంభాలను తాకడానికి వీల్లేదు. దీనికి బదులుగా ఇక్కడ స్వరాలను వినాలనుకుంటే, దానికి వీలుగా ఆయా స్థంభాల వద్ద క్యూఆర్ కోడ్లుంటాయి. వాటిని మన మొబైల్ ద్వారా స్కాన్ చేసి సంబంధింత సంగీత స్వరాలను వినే వెసులుబాటు ఉంది. అయితే ఇక్కడ ఇంకో విశేషం కూడా ఉంది. అదేంటో తెలుసుకుందా రండి. అంతటి విశిష్టమైన ఆలయ ప్రతిష్టను కాపాడేందుకు అక్కడి అధికారులు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. విట్టల ఆలయానికి దాదాపు రెండు కిలోమీటర్ల దూరంనుంచే ప్రైవేటు వాహనాలకు అనుమతి ఉండదు. దీనికి పర్యాటకుల కోసం కాలుష్యరహిత వాహనాలను ఏర్పాటు చేశారు. వీటిల్లో మాత్రమే పర్యాటలకు విట్టల దేవాలయ సమీపానికి వెళ్లే అవకాశం ఉంటుంది. తద్వారా పొల్యూషన్ ఎక్కువ కాకుండా జాగ్రత్త పడ్డారు. సారథులంతా మహిళలేఅయితే ఈ వాహనాలకు అందరూ మహిళా డ్రైవర్లే ఉండటం మరో ప్రత్యేకత. టూరిస్టులను విట్టల ఆలయానికి వద్దకు తీసుకెళ్లి, మళ్లీ తీసుకు వచ్చే బాధ్యత ఈ మహిళా డ్రైవర్లదే. సందర్శకులను తీసుకెళ్లి దింప, మళ్లీ వచ్చేటపుడు తిరుగు ప్రయాణంలో ఉన్నవారిని బయటికి తీసుకు వస్తారు. అలా సందర్శకుల రద్దీని నివారించే ఏర్పాటు కూడా అని చెప్పవచ్చు.ఈ సందర్భంగా మహిళా డ్రైవర్లను సాక్షి. కామ్ పలకరించింది. వారి అనుభవాల గురించి ముచ్చటించింది. గతరెండేళ్లుగా ఇక్కడ పనిచేస్తున్నామని వెల్లడించారు. తమకు ముందుగా శిక్షణ ఇచ్చి మరీ ఈ ఉద్యోగంలోకి తీసుకున్నారని తెలిపారు. ఎనిమిది గంటల డ్యూటీ ఎంతో సరదాగా గడిచిపోతుందని చెప్పారు. నిత్యం ఎంతోమంది సందర్శకులను, చాలామంది విదేశీ పర్యాటకులను చేరవేస్తూ ఉంటామని, వారి ఆనందం చూస్తే తమకు చాలా సంతోషంగా ఉంటుందని, నిజానికి చాలా గర్వంగా కూడా ఉంటుందని చెప్పారు. అలాగే టూరిస్టులతో తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో మాట్లాడతామన్నారు. -
ఫిలడెల్ఫియాలో తానా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
తానా మిడ్-అట్లాంటిక్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఫిలడెల్ఫియాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. పెన్సిల్వేనియా రాష్ట్రంలోని వెస్ట్ చెస్టర్ నగరంలో పియర్స్ మిడిల్ స్కూల్ లో నిర్వహించిన ఈ వేడుకలకు వెయ్యికి మందికి పైగా హాజరై సాంస్కృతిక కార్యక్రమాలు, స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు, డైనమిక్ ఫ్యాషన్ షో, స్టాల్ల్స్, రుచికరమైన విందుతో ఆరు గంటల నాన్ స్టాప్ వినోదాన్ని ఆస్వాదించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గత ఐదున్నర దశాబ్దాల నుండి డెలావేర్ రాష్ట్రంలోని డోవర్ నగరంలో విశేషసేవలు అందిస్తున్న ప్రముఖ చిన్న పిల్లల వైద్యురాలు డాక్టర్ జానకి కాజా గారిని తానా బోర్డు ఆఫ్ డైరెక్టర్ రవి పొట్లూరి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ జానకి కాజా అమెరికా వచ్చినప్పటి నుంచి అనుభవాలను వివరిస్తూ స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేసారు. మన జన్మభూమి భారతదేశం లాగానే కర్మభూమి అమెరికా చాలా గొప్ప దేశమని 1971 లో అమెరికా లో అడుగుపెట్టినప్పటి నుండి ఈరోజు వరకు ఆసుపత్రికి వెళ్లినా, 86 దేశాలు పర్యటించినా మన భారతీయ సంప్రదాయం మరచిపోకుండా తాను ఇప్పటికీ చీర మాత్రమే ధరిస్తానని చీర మన సాంస్కృతిక గర్వానికి చిహ్నంగా ఉంటుందని పేర్కొంటూ మహిళల జీవితం సవాళ్లతో కూడినదని పట్టుదలతో, దృఢసంకల్పంతో అవకాశాలు అందిపుచ్చుకుని జీవితంలో ఎదగాలని ఆకాంక్షించారు. తానా మిడ్ అట్లాంటిక్ మహిళల బృందం ఈ కార్యక్రమం విజయవంతం కోసం అవిశ్రాంతంగా పనిచేసింది. మిడ్-అట్లాంటిక్ మహిళా కమిటీ ఛైర్ సరోజా పావులూరి నేతృత్వంలోని బృందం ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. వ్యాఖ్యాత లక్ష్మి మంద ఎనర్జిటిక్ హోస్టింగ్‌తో అలరించారు. రాజేశ్వరి కొడాలి, భవాని క్రొత్తపల్లి, సౌజన్య కోగంటి, రవీనా తుమ్మల, భవానీ మామిడి, మైత్రి రెడ్డి నూకల, నీలిమ వోలేటి , రమ్య మాలెంపాటి, బిందు లంక, దీప్తి కోకా తదితరుల కృషిని హాజరైన వారందరూ అభినందించారు.తానా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రవి పొట్లూరి తన ప్రసంగంలో మహిళలకు అభినందనలు తెలిపారు. తానా ఫౌండేషన్ మరియు ఇతర సేవా సంస్థల ద్వారా అమెరికాలోనే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా మిలియన్ల డాలర్లు వెచ్చించి ఎనలేని సేవలందిస్తున్న బాబు రావు, డాక్టర్ జానకి కాజా దంపతులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు. డెలావేర్ మిడిల్ టౌన్ నమస్తే ఇండియా రెస్టారంట్ సహా వాలంటీర్లు మరియు క్రాస్ రోడ్స్ రెస్టారంట్, జో కేధార్, రాజన్ అబ్రహం ఇతర దాతలకు అభినందనలు తెలిపారు.2025 జూలై 3 నుంచి 5 వరకు డెట్రాయిట్లో 24వ తానా మహాసభలు జరగబోతున్నాయని తెలిపారు. అందమైన అలంకరణలకు ఫణి కంతేటి మరియు సంగీతాన్ని అందించినందుకు మూర్తి నూతనపాటి, రమణ రాకోతు, ఫోటోగ్రఫీ విశ్వనాధ్ కోగంటిలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తానా మిడ్ అట్లాంటిక్ ప్రాంతీయ ప్రతినిధి వెంకట్ సింగు, సతీష్ తుమ్మల, సునీల్ కోగంటి, టీం స్క్వేర్ చైర్మన్ కిరణ్ కొత్తపల్లి, కృష్ణ నందమూరి, రంజిత్ మామిడి, గోపి వాగ్వాల, సురేష్ యలమంచి, చలం పావులూరి, ప్రసాద్ క్రొత్తపల్లి, కోటి యాగంటి, రవి ముత్తు, రాజు గుండాల, శ్రీనివాస్ అబ్బూరి, సుబ్బా ముప్పా, లీలాకృష్ణ దావులూరి, జాన్ ఆల్ఫ్రెడ్, హేమంత్ ఎర్నేని, సనత్ వేమూరి, హరీష్ అన్నాబత్తిన, రంజిత్ కోమటి, సంతోష్ రౌతు, ఉత్తమ్, హేమరాజ్, రాజా గందె, నాగ రమేష్, కృషిత నందమూరి, ప్రసాద్ కస్తూరి తదితరులు ఈ వేడుకలను విజయవంతం చేయడంలో కృషి చేశారు. -
Women's Day మహిళా ఆర్టిస్టుల ‘సిరి శక్తి’ మెగా ఆర్ట్ ఎగ్జిబిషన్
సిరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెయింటింగ్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మెగా ఆర్ట్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తోంది. ‘సిరి శక్తి’ పేరుతో అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. చిత్రకళలో ప్రతిభను చాటుకుంటున్న మహిళల నైపుణ్యాన్ని గుర్తిస్తూ హైదరాబాద్‌లోని మసాబ్ ట్యాంక్‌లో ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది. మార్చి 8 నుంచి 15వ తేదీవరకు జరుగుతున్న ఈ ప్రదర్శనలో ఎనిమిదేళ్లనుంచి 88 ఏళ్ల వయస్సున్న 118 మంది మహిళా ఆర్టిస్ట్‌లు తమ పెయింటింగ్స్‌ను ప్రదర్శిస్తున్నారు. అంతేకాదు ఈ ఎనిమిది రోజుల వేడుకలో ఒక్కో రోజును ఒక్కో ప్రత్యేకతగా ఈ ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తున్నారు. కళారంగంలో నిష్ణాతులైన విశిష్ట అతిధులను ఆహ్వానిస్తున్నామని సిరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెయింటింగ్ సారధులు, డైరెక్టర్ స్వామి, శివ కుమారి దంపతులు వెల్లడించారు. ఇప్పటివరకు వరకు సందర్శకుల నుంచి మంచి ఆదరణ లభించిందని, రానున్న మూడు రోజుల ప్రదర్శనను కూడా విజయవంతం చేయాలని శివ కుమారి విజ్ఞప్తి చేశారు. వీరిలో ప్రముఖ డిజైనర్ శిల్పారెడ్డి, ప్రొ. పద్మావతి, నటి గీతా భాస్కర్, ప్రముఖ ఆర్టిస్ట్ శిల్పి డా. స్నేహలతా ప్రసాద్, డా. హిప్నో పద్మా కమలాకర్ తదితరులున్నారని తెలిపారు. ఈ ప్రత్యేక కార్యక్రమం సృజనాత్మకత, ప్రతిభా, నైతిక విలువలను ప్రతిబింబించేలా, విశేషమైన ప్రాముఖ్యతను సంతరించుకునేలా కృషి చేశామని తెలిపారు. అలాగే ఈ కార్యక్రమాన్ని ‘8’ అనే ప్రత్యేక సంఖ్యను ప్రాతిపదికగా రూపకల్పన చేయడం మరో విశేషమని పేర్కొన్నారు.గత 30 ఏళ్లుగా హిమాయత్‌నగర్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో సిరి ఇన్స్టిట్యూట్ ద్వారా అనేకమందికి శిక్షణనిస్తున్నామని, ఇందులో మహిళలు, ఉద్యోగాలు చేసుకుంటున్నవారు, పదవీ విరమణ చేసినవారు, విద్యార్థులు ఇలా అన్ని వయసుల వారికి చిత్రకళను బోధిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు వేలాది మంది విద్యార్థులకు ఆయిల్, అక్రిలిక్, సాండ్ పెయింటింగ్, తంజావూర్ పెయింటింగ్, 3డీ క్లే ఆర్ట్, స్కెచింగ్ తదితర వివిధ మాధ్యమాల్లో శిక్షణ ఇవ్వడంతోపాటు, అనేక చిత్ర ప్రదర్శనలను విజయవంతంగా నిర్వహించామని వెల్లడించారు. వేదిక : JNAF ALU కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, మసాబ్ ట్యాంక్, హైదరాబాద్ వివరాలకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు.ఫోన్: 3643419662, 9948887211 -
'అప్పుడే అలా ప్రతిజ్ఞ చేశాను': గౌతమ్ అదానీ
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. ప్రముఖ పారిశ్రామికవేత్త, అదానీ గ్రూప్ చైర్మన్ 'గౌతమ్ అదానీ' (Gautam Adani) లింగ సమానత్వం, అన్ని రంగాలలో మహిళల సాధికారత పట్ల తన నిబద్ధతను వెల్లడించారు. తన ప్రయాణాన్ని రూపొందించిన బలమైన మహిళల గురించి మాట్లాడుతూ.. ''బనస్కాంత నుండి బోర్డ్‌రూమ్‌ల వరకు: నా ప్రపంచాన్ని తీర్చిదిద్దిన మహిళలు" అనే పేరుతో ఓ పోస్ట్ చేశారు.లింగ సమానత్వం అంటే..తన మనవరాళ్లు.. తమ కలలను సాధించడంలో మహిళలు ఎటువంటి అడ్డంకులు ఎదుర్కోని ప్రపంచాన్ని నిర్మించాలనే తన సంకల్పాన్ని ఆదానీ వివరించారు. నన్ను, నా ప్రయాణాన్ని దృఢంగా రూపందించుకోవడంలో.. నా తల్లి, భార్య సహాయం చేశారని చెప్పారు. లింగ సమానత్వం అంటే.. ''కేవలం మహిళలకు అవకాశాలు కల్పించడం మాత్రమే కాదు, ఇది మానవ మనుగడకు ఎంతో అవసరం'' అని నొక్కి చెప్పారు.అవధులు లేని ప్రపంచాన్నిదశాబ్దం క్రితం, నా మొదటి మనవరాలి సున్నితమైన వేళ్లను నేను పట్టుకున్నప్పుడు, నేను నిశ్శబ్దంగా ఒక ప్రతిజ్ఞ చేసాను. ఆమె ఆకాంక్షలకు అవధులు లేని ప్రపంచాన్ని నిర్మించడంలో సహాయం చేయాలని అనుకున్నాను. ఇప్పుడు అందమైన ముగ్గురు మానవరాళ్లను చూస్తుంటే.. నా వాగ్దానం మరింత గుర్తుకొస్తోందని అదానీ చెప్పుకొచ్చారు.ఇదీ చదవండి: ప్రపంచ కుబేరుడితో నాల్గవ బిడ్డకు జన్మనిచ్చింది: ఎవరీ షివోన్ జిలిస్?క్యాలెండర్లో ఒక తేదీఅంతర్జాతీయ మహిళా దినోత్సవం కేవలం క్యాలెండర్లో ఒక తేదీ కాదు, మనం సాధించిన పురోగతిని.. ముందుకు సాగుతున్న ప్రయాణాన్ని గుర్తుచేస్తుంది. వ్యక్తిగతంగా.. తల్లి నుంచి ప్రేరణ పొందిన చిన్న పిల్లవాడిగా, నాయకత్వంలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లను చూస్తున్న వ్యాపారవేత్తగా, నా భార్య ప్రీతి అదానీ ఫౌండేషన్ పట్ల అచంచలమైన అంకితభావంతో ప్రేరణ పొందిన భర్తగా.. నన్ను దాదూ అని ఆప్యాయంగా పిలిచే అమ్మాయిల కోసం పరిమితులు లేని ప్రపంచం గురించి కలలు కంటున్న తాతగా నన్ను నేను చూసుకుంటున్నాను.ప్రతిభకు హద్దులు లేవుగౌతమ్ అదానీ.. తన కంపెనీ ఓడరేవులలో ఒకదానిని సందర్శించినప్పుడు తనకు ఎదురైన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకున్నారు. అక్కడ నాయకత్వ పాత్రల్లో మహిళలు లేకపోవడాన్ని గమనించారు. ఇదే ఆయనలో మార్పు తీసుకురావడానికి దోహదపడింది. నాయకత్వ పాత్రల్లో మహిళలు లేకపోవడానికి కారణం.. సామర్థ్యం లేకపోవడం కాదు, పురుషాధిక్యంతో వివిధ రంగాలలో మార్గాలు లేకపోవడం అని తెలుసుకున్నారు. మహిళల ప్రతిభకు హద్దులు లేవు, వారికి కూడా సమాన అవకాశాలు కల్పించాలి. కాబట్టి అన్ని రంగాల్లోనూ మహిళలకు సమానమైన అవకాశాలు కల్పించాలని మహిళా దినోత్సవం సందర్భంగా అదానీ సంకల్పించారు. -
నారీ శక్తికి సలాం
నవాసరీ (గుజరాత్): ఏ సమాజంలోనైనా, దేశంలోనైనా మహిళలను గౌరవించడమే ప్రగతి దిశగా తొలి అడుగని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. మహిళల సారథ్యంలో సమాజ ప్రగతి దిశగా భారత్ కొన్నేళ్లుగా ముందుకు సాగుతోందన్నారు. ‘‘నారీ శక్తికి నా నమస్సులు. మహిళల ఆత్మగౌరవానికి, భద్రతకు, సాధికారతకు మా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. వారిపై నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు నూతన చట్టాల్లో మరిన్ని కఠినమైన నిబంధనలు పొందుపరిచాం. వలస పాలన నాటి కాలం చెల్లిన చట్టాల స్థానంలో తెచి్చన పూర్తి దేశీయ చట్టాల్లో అత్యాచారం వంటి దారుణ నేరాలకు మరణశిక్షకు వీలు కల్పించాం. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు తదితరాల ద్వారా మహిళలకు సత్వర న్యాయం అందిస్తున్నాం. వారిపై తీవ్ర నేరాల్లో 45 నుంచి 60 రోజుల్లోపే తీర్పులు వచ్చేలా చర్యలు చేపట్టాం. విచారణ క్రమంలో బాధిత మహిళలకు ఎలాంటి ఇబ్బందులూ ఎదురవకుండా నిబంధనలు పొందుపరిచాం’’అని వివరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం గుజరాత్లో నవాసరీ జిల్లా వన్శ్రీ బోర్సీ గ్రామంలో ప్రత్యేక కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం లక్షన్నర మందికి పైగా మహిళలు హాజరైన భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించారు. ‘‘ఆడపిల్ల ఆలస్యంగా ఇంటికొస్తే పెద్దవాళ్లు లక్ష ప్రశ్నలడుగుతారు. అదే మగపిల్లాడు ఆలస్యమైతే పట్టించుకోరు. కానీ అతన్ని కూడా కచ్చితంగా నిలదీయాలి’’అని తల్లిదండ్రులకు సూచించారు. ప్రపంచంలోకెల్లా సంపన్నుడిని నేనే తాను ప్రపంచంలోకెల్లా సంపన్నుడిని అంటూ ఈ సందర్భంగా మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇది విని కొందరికి ఆశ్చర్యంతో కనుబొమ్మలు ముడిపడవచ్చు. కానీ ఇది నిజం. కాకపోతే సంపదపరంగా కాదు. కోట్లాది మంది తల్లులు, సోదరీమణులు, కూతుళ్ల ఆశీస్సులు నాకున్నాయి. ఆ రకంగా నేను అందరి కంటే సంపన్నుడిని. వారి ఆశీస్సులే నాకు అతి పెద్ద బలం, నా పెట్టుబడి. అవే నాకు తి రుగులేని రక్షణ కవచం కూడా’’అని వివరించారు. ప్రధాని సోషల్ ఖాతాల్లో... మహిళల విజయగాథలు పలు రంగాల్లో తమదైన ముద్ర వేసిన పలువురు మహిళా ప్రముఖులు శనివారం ప్రధాని మోదీ సోషల్ మీడియా హాండిళ్లను ఒక రోజు పాటు తామే నిర్వహించారు. తమ విజయగాథలను పంచుకున్నారు. కలలను నిజం చేసుకునేందుకు అమ్మాయిలు ధైర్యంగా ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. చెస్ గ్రాండ్‌మాస్టర్ ఆర్ వైశాలి, పారిశ్రామికవేత్తగా మారిన రైతు అనితా దేవి, అణు శాస్త్రవేత్త ఎలినా మిశ్రా, అంతరిక్ష శాస్త్రవేత్త శిల్పీ సోనీ తదితరులు వీరిలో ఉన్నారు. గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞా్ఞనంద సోదరి అయిన వైశాలి ఆరేళ్ల వయసు నుంచే చెస్ ఆడుతున్నారు. రైతు ఉత్పత్తుల కంపెనీ ద్వారా తన గ్రామానికి చెందిన వందలాది మంది మహిళలకు ఉపాధి కల్పించినట్టు అనితాదేవి వివరించారు. ఇది వారికి సంపాదనతో పాటు ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం కూడా కల్పించిందన్నారు. మహిళలకు ఆర్థిక సాధికారత అవసరాన్ని ఫ్రాంటియర్ మార్కెట్స్ సీఈఓ అజితా షా వివరించారు. అనంతరం వారి విజయగాథలను ప్రస్తుతిస్తూ మోదీ పలు పోస్టులు చేశారు. వికసిత భారత్ లక్ష్యసాధనలో మహిళలదే కీలక పాత్ర అని అభిప్రాయపడ్డారు. మహిళా పోలీసుల రక్షణ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నవాసరీ సభలో ప్రధాని మోదీకి పూర్తిగా మహిళలతో కూడిన అంగరక్షక దళం భద్రత కల్పించడం విశేషం. బహిరంగ సభతో పాటు ఆయన రక్షణ బాధ్యతలను కూడా 2,500 మందికి పైగా మహిళా పోలీసు సిబ్బందే చూసుకున్నారు. వీరిలో 2,145 మంది కానిస్టేబుళ్లు, 187 మంది ఎస్సైలు, 61 మంది ఇన్స్పెక్టర్లు, 19 మంది డీఎస్పీలు, ఐదుగురు ఎస్పీలు, ఒక డీఐజీ తదితరులున్నారు. హెలిప్యాడ్ వద్ద మోదీ రాక మొదలుకుని సభనుద్దేశించి ప్రసంగం, లఖ్పతీ దీదీ లబి్ధదారులకు సన్మానం, అనంతరం ఆయన వెనుదిరిగేదాకా సర్వం వారి కనుసన్నల్లోనే సాగింది. మొత్తం ఏర్పాట్లను అదనపు డీజీపీ నిపుణా తోర్వానే పర్యవేక్షించారు. పురుష సిబ్బంది పార్కింగ్, ట్రాఫిక్ విధులకే పరిమితమయ్యారు. ఇంతటి భారీ కార్యక్రమ భద్రత ఏర్పాట్లను పూర్తిగా మహిళా పోలీసు సిబ్బందే చూసుకోవడం దేశంలో ఇదే తొలిసారి. -
వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఘనంగా మహిళా దినోత్సవం
సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. పార్టీ మహిళా నేతలు ముందుగా మహానేత వైఎస్సార్ విగ్రహానికి నివాళులరి్పంచి, ఆయనను స్మరించుకున్నారు. కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో మహిళల సాధికారత అంటే వైఎస్సార్, ఆ తర్వాత వైఎస్ జగన్ మాత్రమే గుర్తుకొస్తారని చెప్పారు. మహిళలకు చేసిన వాగ్దానాలు అమలు చేయకుండా వారిని గాలికి వదిలేయడం చంద్రబాబుకు అలవాటుగా మారిందన్నారు. తనను గెలిపించిన కుప్పంలోనే ఎకరాలకు ఎకరాలు గంజాయి సాగు చేస్తుంటే చంద్రబాబుకు కనిపించడం లేదా.. అని ప్రశ్నించారు. హోం మంత్రి సొంత జిల్లా ఉమ్మడి విశాఖలో ఎకరాలుకు ఎకరాలు గంజాయి పండిస్తున్నా, ముఖ్యమంత్రి ఉన్న గుంటూరు డ్రగ్స్‌కు అడ్డాగా మారినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి మాట్లాడుతూ టీడీపీ కూటమి పాలనలో మహిళల పరిస్థితి దారుణంగా మారిందని చెప్పారు. మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు నిత్యకృత్యంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. కూటమికి ఎందుకు ఓటేశామా.. అని మహిళలు బాధపడుతున్నారని చెప్పారు. కార్యక్రమంలో గుంటూరు తూర్పు నియోజకవర్గం పార్టీ సమన్వయకర్త షేక్ నూర్ ఫాతిమా, గంగాధర నెల్లూరు సమన్వయకర్త కృపాలక్ష్మి, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కొత్తపల్లి రజనితో పాటు పార్టీ మహిళా నేతలు ఎం శ్రీదేవి, కేవీవీ స్వప్న, టి.స్వప్నలత, బొజ్జా సుజాత, పి. చైతన్య రెడ్డి, దాసరి దర్యాబీ పలువులు మహిళా నేతలు పాల్గొన్నారు.మహిళలను నట్టేట ముంచడం బాబుకు అలవాటే..: ఆర్కే రోజానవ మాసాల్లో మహిళలను నవ విధాలుగా మోసం చేసిన కూటమి ప్రభుత్వానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిపే అర్హత లేదని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. ఆమె శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా తో మాట్లాడారు. చంద్రబాబు ఎన్నికలకు ముందు ఆకర్షణీయమైన హామీలతో మహిళలను నమ్మించి, అధికారంలోకి రాగానే మొండిచేయి చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో మహిళలు సా మాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా నిలదొక్కుకునేలా అన్ని విధాలా అండగా నిలిచిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రతి పథకాన్ని మహిళ పేరు మీద ఇచ్చి, ఆ ఇంట్లో మహిళ గౌరవాన్ని పెంచడమే కాకుండా మగవారితో సమానమైన స్థానం కల్పించి, మహరాణుల్లా చూసుకున్నా రని గుర్తుచేశారు. వారి భద్రత కోసం దిశ యాప్, దిశా పోలీస్ స్టేషన్లను తీసుకొచ్చి వారికి అండగా నిలిచారని చెప్పారు. కానీ కూటమి ప్రభుత్వం వాటన్నింటినీ నిర్వీర్యం చేసిందన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనితకు మహిళలు అంటే గౌరవమే లేదన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో 30 వేల మంది మహిళలు అక్రమ రవాణా అయ్యారంటూ ఊగిపోయిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు అధికారంలో ఉండి కూడా వారిని ఇళ్లకు ఎందుకు తేవట్లేదని నిలదీశారు. సుగాలి ప్రీతి కేసు విషయంలో ఆయన శైలి చూస్తే ఆయనేమిటో అర్థమవుతుందన్నారు. హామీల అమలేది? వరుదు కళ్యాణి ఓట్ల కోసం కూటమి పార్టీలు మహిళలకు ఇచ్చిన హామీల అమలు ఏమైందని వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరు దు కళ్యాణి ప్రశ్నించారు. మహిళా భద్రతను కూ టమి గాలికొదిలేసిందని దుయ్యబట్టారు. జగన్ కంటే ఎక్కువ మేలు చేస్తామంటూ సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించి, ఇప్పుడు వాటిని ఎగ్గొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. మహాశక్తి పేరుతో పెద్ద ఎత్తున ప్రచారం చేశారని, ఇప్పటి వరకు ఒక్క మహిళకు కూడా ఈ పథకం కింద మేలు జరగలేదన్నారు.మహిళా దినోత్సవం ఒక మహత్తర కార్యక్రమంవైఎస్సార్సీపీ ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజారాణిసాక్షి, న్యూఢిల్లీ: మహిళా దినోత్సవం అనేది ఒక వేడుక కంటే ఎక్కువని వైఎస్సార్సీపీ అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజారాణి చెప్పారు. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని శనివారం ఢిల్లీలోని ఆంధ్రా అసోసియేషన్ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఎంపీ తనూజారాణి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సతీమణి గంగాపురం కావ్య, కేంద్ర సహాయ మంత్రి భూపతి శ్రీనివాస వర్మ సతీమణి భూపతి వెంకటేశ్వరీదేవి, వ్యవసాయ శాఖ జాయిండ్ సెక్రటరీ పెరిన్ దేవి, ఢిల్లీ విద్యాశాఖ డైరెక్టర్ వేదిత రెడ్డి, గైనకాలజిస్ట్ డాక్టర్ కమలారావు, సఫ్దర్‌గంజ్ హాస్పిటల్ నర్సింగ్ ఆఫీసర్ కరుణ కుమారికి ప్రపంచ మహిళా దినోత్సవ పురస్కారాలను ప్రదానం చేశారు. ఆంధ్ర అసోసియేషన్ నార్త్ ఢిల్లీ సెక్రటరీ సౌజన్య, సెంట్రల్ ఢిల్లీ సెక్రటరీ శారద, ప్రమీళ, కళ్యాణి, వసంత, సుశీలలు అవార్డులను అందజేశారు. -
ఎన్ని కాన్పులైనా ప్రసూతి సెలవులిస్తాం
మార్కాపురం/తర్లుపాడు: ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు ఇకపై ఎన్ని కాన్పులైనా ప్రసూతి సెలవులు ఇస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. గతంలో తానే జనాభా నియంత్రణ పాటించాలని చెప్పానని, అయితే భవిష్యత్తు ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్రంలో జనాభా పెరగాల్సిన అవసరం ఉందని.. ఈ నేపథ్యంలో ఎంతమంది పిల్లలను కన్నా మహిళా ఉద్యోగుల ప్రయోజనాలకు ఇబ్బంది కలగకుండా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా మార్కాపురంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు బదులిచ్చారు. ఆయన ఏమన్నారంటే.. మహిళలను లక్షాధికారులుగా మారుస్తా. ఈ ఏడాదిలో లక్ష మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారుచేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నాను.రాష్ట్రంలో వంద మంది మహిళా పారిశ్రామికవేత్తలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలి. పాతికేళ్ల క్రితం నేను డ్వాక్రా గ్రూపులను తయారుచేస్తే అందరూ విమర్శించారు. కానీ, ఇప్పుడు వారు రాజకీయ, ఆర్థిక శక్తిగా మారడం ఎంతో సంతోషంగా ఉంది. మహిళా దినోత్సవం రోజున రాష్ట్ర ప్రభుత్వం 21 కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. డ్వాక్రా మహిళలు తయారుచేసిన ఉత్పత్తులకు ప్రపంచస్థాయి గుర్తింపు, మార్కెటింగ్ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. పరిశ్రమలు స్థాపించే మహిళలకు 45 శాతం రాయితీ కల్పించి ప్రోత్సహిస్తాం.ఈరోజున రాష్ట్రంలో డ్వాక్రా సంఘాలు రూ.లక్ష కోట్ల అప్పు తీసుకునే స్థాయికి వచ్చాయి. మహిళల కోసమే ర్యాపిడో, అరకు కాఫీ, ఫ్లిప్‌కార్ట్ వంటిసంస్థలతో ఒప్పందం చేసుకున్నారు. ప్రతి మేజర్ పంచాయతీలో అరకు కాఫీ కేంద్రాన్ని మహిళలు ఏర్పాటుచేయాలి. టెక్నాలజీని ఉపయోగించుకుని వర్క్ ఫ్రం హోం ద్వారా మహిళలు రాణించాలి. ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఈ ఏడాది నుంచి ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం పథకం వర్తింపజేస్తాం. మే నుంచి అన్నదాత సుఖీభవ పథకాలను అమలుచేస్తాం. ప్రపంచంలో ఉండే ప్రముఖ కంపెనీలు, వ్యక్తులను మన రాష్ట్రానికి తీసుకొస్తా. ఈ రోజున డ్వాక్రా మహిళలకు రూ.1,826.43 కోట్ల రుణాలు అందిస్తున్నాం. డ్వాక్రా మహిళలు సొంత ఊరిలోనే ఉండి వ్యాపారాలు చేయాలి. టీవీల్లో, బయట, సోషల్ మీడియాల్లో మహిళల గురించి ఎవరైనా అసభ్యంగా మాట్లాడితే క్షమించేది లేదు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ నిరోధానికి ఈగల్ వ్యవస్థను ఏర్పాటుచేశాం. దీపం పథకం కింద ఏడాదికి మూడు సిలిండర్లు అందిస్తున్నాం. వెలిగొండకు గోదావరి, కృష్ణా నీళ్లు పారిస్తా.. ఈ సమావేశంలో ఒక మహిళ, విద్యారి్థని అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు బదులిస్తూ.. తానే వెలిగొండకు శంకుస్థాపన చేశానని, తానే పూర్తిచేసి గోదావరి, కృష్ణా జలాలను వెలుగొండ ద్వారా ఈ ప్రాంతానికి పారిస్తానని చెప్పారు. అలాగే, బనకచర్ల–గోదావరి ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని తరలిస్తామన్నారు. త్వరలో మార్కాపురం జిల్లాను ఏర్పాటుచేస్తానని, అప్పుడు ఈ ప్రాంత సమస్యలు తీరతాయని ఆయన చెప్పారు. మహిళా లబ్ధిదారులకు చంద్రబాబు ఈ–ఆటోలు, బైక్‌లు అందించారు. మహిళలు, పిల్లల రక్షణకు సంబంధించిన శక్తియాప్‌ను డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ఐజీపీ రాజకుమారి, ఎస్పీ దామోదర్ల సమక్షంలో సీఎం ప్రారంభించారు. ఎమ్మెల్యే పనితీరు ఆశాజనకంగా లేదు.. అనంతరం టీడీపీ కార్యకర్తలతో జరిగిన ముఖాముఖిలో చంద్రబాబు మాట్లాడుతూ ఇక్కడి ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పనితీరు ఆశాజనకంగాలేదన్నారు. పార్టీ కోసం పనిచేసే వారికి అండగా ఉంటానన్నారు. ఇక మహిళా దినోత్సవం రోజున జరుగుతున్న ఈ సమావేశంలో 50 శాతం మహిళలు ఉండాల్సి ఉండగా, కేవలం ఒక్క శాతమే ఉన్నారంటే పరిస్థితిని ఏవిధంగా సమర్థించుకుంటారని ప్రశ్నించారు. సామాజికంగా, రాజకీయంగా ఓటు బ్యాంకు పెంచే బాధ్యత తనదని తెలిపారు. ఇదిలా ఉంటే.. సీఎం బందోబస్తుకు వచ్చిన పోలీసులు ఎండ వేడికి తట్టుకోలేకపోయారు. ఒంగోలు ఏఆర్ కానిస్టేబుల్ రమణయ్య స్పృహతప్పి పడిపోయారు. -
క్రిప్టో మార్కెట్ వైపు అతివల అడుగులు: కారణం ఇదే..
క్రిప్టో కరెన్సీ విలువ రోజురోజుకి వృద్ధి చెందుతున్న తరుణంలో.. చాలామంది చూపు దీనిపై పడింది. అయితే క్రిప్టో కరెన్సీలో పెట్టుబడిపెడుతున్న వారిలో పురుషులే అధికంగా ఉన్నప్పటికీ.. స్త్రీల సంఖ్య కూడా కొంత పెరిగిందని, దేశంలోని ప్రముఖ క్రిప్టో ఎక్స్ఛేంజ్ 'జియోటస్' వెల్లడించింది.మహిళా పెట్టుబడిదారులు భారత క్రిప్టో మార్కెట్లోకి మునుపటి కంటే ఎక్కువగా ప్రవేశిస్తున్నారు. ఈ సంఖ్య 20 శాతం పెరిగిందని జియోటస్ స్పష్టం చేసింది. మహిళా పెట్టుబడిదారులు దీర్ఘకాలిక పెట్టుబడులలో మాత్రమే కాకుండా.. బిట్‌కాయిన్, ఎథెరియం వంటి వాటిలోకి ప్రవేశిస్తున్నారు.మహిళలు క్రిప్టో కరెన్సీవైపు ఎక్కువ ఆసక్తి చూపించడానికి ప్రధాన కారణం.. చదువుకున్న వారికి డిజిటల్ అవగాహన, పెట్టుబడికి సంబంధించిన అవగాహన పెరగడం అని తెలుస్తోంది. యువత ఎక్కువగా క్రిప్టోలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతున్నట్లు ఆర్ధిక నిపుణులు కూడా చెబుతున్నారు.ఇదీ చదవండి: శివ్ నాడార్ కీలక నిర్ణయం.. కుమార్తెకు భారీ గిఫ్ట్ఇప్పుడు పెద్ద పెద్ద పట్టణాల్లో ఉన్న మహిళలు మాత్రమే కాకుండా. టైర్ 2, టైర్ 3 నగరాల్లోని మహిళలు కూడా వివిధ రంగాలలో పెట్టుబడులు పెడుతున్నారు. ఇందులో క్రిప్టో కరెన్సీ కూడా ఉంది. రాబోయే రోజుల్లో మహిళా పెట్టుబడిదారుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉందని జియోటస్ అంచనా వేస్తోంది. -
లేడీస్ బ్యాంక్ ఎక్కడుందో తెలుసా?
సనత్‌నగర్: ఇంటిని అందంగా తీర్చిదిద్దడమే కాదు.. కుటుంబాన్ని నడిపించడంలోనూ మహిళల పాత్ర ఎనలేనిది. ఓ వైపు ఇంటి బాధ్యతలను నెరవేరుస్తూ.. మరోవైపు ఉద్యోగ విధులను బాధ్యతాయుతంగా చేపడుతున్న మహిళలు కోకొల్లలు. అయితే అందరి ఆర్థిక అవసరాలు తీర్చే బ్యాంకింగ్ రంగంలోనూ మహిళలు కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే నగరంలోని సుందర్‌నగర్ బ్రాంచ్‌లో మాత్రం నూటికి నూరు శాతం మహిళా ఉద్యోగులే ఖాతాదారులకు సేవలందిస్తున్నారు. క్యాషియర్ దగ్గర నుంచి మేనేజర్ వరకూ అందరూ మహిళామణులే విధులు నిర్వహిస్తుండడంతో దీనికి లేడీస్ బ్యాంక్‌గా ముద్ర పడింది. చదవండి: International Women's Day 2025 : యాక్సలరేట్ యాక్షన్ అంటే? మాటలేనా!2023 డిసెంబర్లో మేనేజర్‌గా సునీత బాధ్యతలు స్వీకరించిన అనంతరం అన్ని పోస్టుల్లోనూ మహిళలే భర్తీ అయ్యారు. ప్రస్తుతం ఈ బ్యాంకులో రమ్య, శృతి, సృజన, లక్ష్మీ, జ్యోతిర్మయి, ధీరజ తదితర మహిళా ఉద్యోగులు వివిధ హోదాల్లో విధులు నిర్వహిస్తూ.. ఖాతాదారులకు ఎంతో ఓపిగ్గా సేవలందిస్తున్నారు. -
‘మూల సంత’ సూర్యకళ : మహిమాన్వితం
మనం జీవించి ఉన్నాం, జీవిస్తున్నాం.. అంటే అనుక్షణం ప్రకృతి నుంచి తీసుకుంటూనే ఉన్నామని అర్థం. మనం తీసుకున్నంత తిరిగి ఇవ్వాలని ప్రకృతి కోరుకోదు. విధ్వంసం చేయకపోతే చాలనుకుంటుంది. ప్రకృతి తనను తాను స్వస్థత పరుచుకుంటుంది. కానీ ఆ సమయం కూడా ఇవ్వనంత వేగంగా కాలుష్యభరితం చేస్తున్నాం. ప్రకృతిని పరిరక్షిస్తూ సాగిన మన భారతీయ జీవనశైలిని మర్చిపోయాం. మనం మరిచిపోయిన ఆరోగ్యకరమైన జీవనశైలిని గుర్తు చేయాలి, ఆచరణలోకి తెచ్చే వరకూ చైతన్యవంతం చేస్తూనే ఉండాలనే ఉద్దేశంతో పదిహేనేళ్లుగా గ్రీన్ వారియర్‌గా మారారు సూర్యకళ మోటూరి. జీవనశైలి మార్పు ఇంటి నుంచే మొదలవ్వాలని, అది మహిళ నుంచే ప్రారంభం కావాలని, అందుకోసం ఆమె మహిళలను చైతన్యవంతం చేయడానికి పూనుకున్నారు. గ్రామభారతి అధ్యక్షబాధ్యతలు నిర్వర్తిస్తున్న ఏకైక మహిళ సూర్యకళ మహిళాదినోత్సవం సందర్భంగా సాక్షితో పంచుకున్న వివరాలివి. – సాక్షి, సిటీబ్యూరోహైదరాబాద్‌లో పుట్టి పెరిగిన సూర్యకళ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్లో పీజీ చేసి నగరంలోని ఓ ఎమ్ఎన్సీలో ఉద్యోగం చేస్తున్నారు. జాతీయోధ్యమ నాయకుల జీవితగాథలను చదివినప్పుడు ఆ కాలంలో పుట్టనందుకు ఆవేదన చెందేవారామె. రాజీవ్ దీక్షిత్ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు.. ‘దేశం కోసం పని చేయడానికి ఎప్పుడూ ఏదో ఒక సామాజిక అవసరం ఉండనే ఉంటుంది. దానిని తెలుసుకుని పని చేయాలి’ అనే ఆలోచన రేకెత్తింది. సుభాష్ పాలేకర్ శిక్షణలో వాలంటీర్‌గా పని చేసినప్పుడు జరిగిన సంఘటన ఆమెను ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు మళ్లించింది. అక్కడికి వచ్చిన ఒక మహిళారైతు ఇచ్చిన కందిపప్పును ఇంటికి తెచ్చుకుని వండుకున్నారు. ఆ రుచి అమృతంలా అనిపించిందన్నారు సూర్యకళ. ప్రతి ఒక్కరూ అలాంటి ఆహారాన్ని తినాలని కోరుకున్నారు. సేంద్రియ వ్యవసాయం, నీటి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ విభాగాల్లో పని చేయసాగారు. ‘శిక్షణా తరగతులు నిర్వహించి సేంద్రియ వ్యవసాయంపై ‘మా గ్రామభారతి స్వచ్ఛంద సంస్థ’ విజయవంతమైంది. కానీ ఆ ఉత్పత్తులకు మార్కెట్ లేకపోతే ఆ రైతు నిలదొక్కుకునేదెలా అనే ప్రశ్నకు సమాధానంగా ఒక వేదికను రూపొందించాను. ఆర్గానిక్ ఫుడ్ విషయంలో అవగాహన కల్పించడంలో మీడియా చాలా బాగా పని చేస్తోంది. చైతన్యం వచ్చింది కానీ ఉత్పత్తులు అందుబాటులో లేవు. దాంతో ‘మూలసంత’ పేరుతో వాటిని నగరానికి తీసుకొచ్చే బాధ్యత చేపట్టాను. కార్పొరేట్ కంపెనీల్లో మూలసంతలు పెడుతున్నాం. ఇటీవల ఇన్ఫోసిస్‌లో 30 స్టాళ్లతో సంత పెట్టాం. మహిళలను సంఘటిత పరిచి ఆర్గానిక్ ఉత్పత్తులను వారి వంటింటి వరకూ తీసుకెళ్లేలా చేయగలిగాం. నీటి వృథాను అరికట్టడం వంటి విషయాల్లో ఆలోచన రేకెత్తించడం నుంచి పెళ్లి, ఇతర వేడుకల్లో పర్యావరణ హితమైన వేదికల ఏర్పాటు వరకూ కృషి చేశాం. పదిహేనేళ్ల నా ప్రస్థానంలో ఏమి సాధించానని చూసుకుంటే మన వేడుకలు కనిపిస్తాయి. ఆహ్వాన పత్రికల, రిటర్న్ గిఫ్ట్‌లు, భోజనం వడ్డించే ప్లేట్ల వరకూ ప్రతిదీ బయో డీగ్రేడబుల్ థీమ్‌ని అనుసరిస్తున్నారు. మా ప్రయత్నం ఏ మాత్రం వృథా కాలేదు. ఒక మంచి బాట వేయగలిగాం’ అన్నారు సూర్యకళ. చదవండి: International Women's Day 2025 : యాక్సలరేట్ యాక్షన్ అంటే? మాటలేనా!చోదకశక్తి మనమే! ఇంటిని నడిపేది మహిళే. ఇంట్లోకి వచ్చే ఏ వస్తువూ ప్రకృతికి హానికలిగించేదిగా ఉండకూడదు.. అనే నియమాన్ని మహిళలు పాటిస్తే చాలు. ప్రకృతిని కాపాడుకోడం కోసం మేము వేదికల మీద మాట్లాడితే ఆ ప్రయత్నం చైతన్యవంతం వరకే పరిమితం. ఆచరణ ఇంటి నుంచే మొదలు కావాలి, అది మహిళతోనే మొదలు కావాలి. అందుకే సమాజహితమైన ఏ పని అయినా మహిళల నుంచి మొదలైతే అది విజయవంతమవుతుంది. మన పిల్లల భవిష్యత్తు కోసం నిధులు, పొలాలు సమకూరుస్తుంటాం. అంతకంటే ముఖ్యమైన పని పిల్లలకు ఆరోగ్యకరమైన భూమిని అందించడం. మహిని రక్షించే మహిమాని్వతమైన శక్తి మహిళకే ఉంది. మహిళలుగా మనం చేయాల్సిన సమాజసేవ, దేశసేవ ఇది. – సూర్యకళ మోటూరి, గ్రీన్ వారియర్, అధ్యక్షురాలు, గ్రామభారతి -
Trekker Sindhu: తనయ నడిచే.. తండ్రిని గెలిపించే!
ఆధునిక మహిళల విజయాలు వ్యక్తిగతానికి మాత్రమే పరిమితం కావడం లేదు. తమ పిల్లల నుంచి పేరెంట్స్ వరకూ సక్సెస్ ఫుల్ అనిపించుకునేలా కూడా చేస్తున్నాయి. అలాంటి ఓ యువతి.. కృష్ణా రామా అనుకుంటూ కూర్చోవాలి అని సమాజం నిర్దేశించిన వయసులో ఉన్న తండ్రిని యువకులతో సమానంగా ట్రెక్కింగ్‌లో రాణించేలా తీర్చిదిద్దింది. సాక్షి, సిటీబ్యూరో రిటైర్మెంట్ తర్వాత శ్రమ పడకూడదని తల్లిదండ్రులను ఇంటి దగ్గరే ఉంచి ఇల్లు, నౌకర్లు, కారు వగైరా సౌకర్యాలన్నీ అమర్చి జాగ్రత్తగా చూసుకునే కూతుళ్లు, కొడుకులను చూసి ఉంటాం. కానీ 60 ఏళ్ల వయసులో తండ్రిని కొండలు, గుట్టలు ఎక్కించి వేల కిలోమీటర్లు తనతోపాటు నడిపించిన కూతుర్ని చూశామా? అంటే.. ‘మా అమ్మాయే నా చేత తొలి అడుగులు వేయించింది..’ అంటూ సంతోషంగా చెబుతారు ఆమె తండ్రి ఏబీఆర్పీ రెడ్డి. కొండాపూర్‌లో నివసించే సింధు రెగ్యులర్‌గా కొండలు, గుట్టలు ఎక్కేసే సిటీ ట్రెక్కింగ్ లవర్స్‌లో ఒకరు. వ్యాపార వ్యవహారాల నుంచి విశ్రాంతికి షిఫ్ట్ అయిన వెంటనే తన ట్రెక్కింగ్ హాబీని తండ్రికి వారసత్వంగా అందించారు. తద్వారా ఓ మంచి ట్రెక్కర్‌గా మారేందుకు మాత్రమే కాదు 73 ఏళ్ల వయసులో రికార్డ్స్ సృష్టించేందుకు కూడా దోహదపడ్డారు. మార్కెటింగ్ రంగంలో ఉన్న సింధు ఇప్పటి వరకూ ఎనిమిది చెప్పుకోదగ్గ సాహసవంతమైన ట్రెక్స్ని పూర్తి చేశారు. సింధు ఇటు ఆటలు, అటు సాహసాలతో ఆత్మ సంతృప్తికే ప్రాధాన్యత ఇస్తూ.. విలాసాల వెనుక పరుగులు తీసేవారికి ఓ గుణపాఠంలా నిలుస్తున్నారు. ‘వయసు అనేది ఒక నెంబర్ మాత్రమే అంతా మైండ్‌సెట్‌లోనే ఉంది అని నేను నమ్ముతాను’ అంటారు సింధు. అందుకే అరవైలో ఉన్న తండ్రిని సైతం తనతో పాటు సాహస యాత్రలవైపు నడిపించారు. చదవండి: International Women's Day 2025 : యాక్సలరేట్ యాక్షన్ అంటే? మాటలేనా!‘నాన్న మొదటి నుంచీ చాలా ఫిట్‌గా ఉంటారు. బిజినెస్ నుంచి ఫ్రీ కాగానే జిమ్‌లో చేరడమే కాకుండా నాతో పాటు ట్రెక్కి రమ్మని ప్రోత్సహించాను’ అంటూ గుర్తు చేసుకున్నారు.. తాను 23 ఏళ్ల వయసులో ట్రెక్కింగ్ ప్రారంభించిన సింధు.. రన్నింగ్, సైక్లింగ్ ఇలా ప్రతి హాబీనీ తండ్రితో కలిసి పంచుకున్నారు. ‘నాన్నకు చిన్నప్పుడు సాహస యాత్రలు చేసే అలవాటు ఉండేది, అయితే వర్క్‌లో పడిపోయాక దాన్ని మరచిపోయారు. నేను దానిని మళ్లీ గుర్తు చేశా అంతే’ అంటూ చెప్పారామె. గత డిసెంబర్లో తన తండ్రితో కలిసి చేసిన ట్రెక్.. ఎప్పటికీ మరచిపోలేనిదని అంటారామె. అప్పటి వరకూ ఒక్కసారి కూడా ట్రెక్కింగ్ అనుభవం లేని తండ్రి తొలిసారే ఉత్తరాఖండ్‌లో 12వేల కిమీ అధిరోహించి రికార్డ్ సృష్టించారు. అయితే నాన్న ఫిట్నెస్ గురించి నాకు తెలుసు. అలాగే ఎప్పుడైతే మా అడ్వెంచర్ గ్రూప్‌లో జాయిన్ చేశానో.. దాని నుంచి నాన్న కూడా బాగా ఇన్స్పైర్ అయ్యారు.’ అంటూ వివరించారామె.మైండ్‌సెట్‌లోనే అంతా ఉంది.‘వయసు అనేది ఒక నెంబర్ మాత్రమే అంతా మైండ్‌సెట్‌లోనే ఉంది అని నేను నమ్ముతాను’ అంటారు సింధు. అందుకే అరవైలో ఉన్న తండ్రిని సైతం తనతో పాటు సాహస యాత్రలవైపు నడిపించారు. ‘నాన్న మొదటి నుంచీ చాలా ఫిట్‌గా ఉంటారు. బిజినెస్ నుంచి ఫ్రీ కాగానే జిమ్‌లో చేరడమే కాకుండా నాతో పాటు ట్రెక్కి రమ్మని ప్రోత్సహించాను’ అంటూ గుర్తు చేసుకున్నారు.. తాను 23 ఏళ్ల వయసులో ట్రెక్కింగ్ ప్రారంభించిన సింధు.. రన్నింగ్, సైక్లింగ్ ఇలా ప్రతి హాబీనీ తండ్రితో కలిసి పంచుకున్నారు. ‘నాన్నకు చిన్నప్పుడు సాహస యాత్రలు చేసే అలవాటు ఉండేది, అయితే వర్క్‌లో పడిపోయాక దాన్ని మరచిపోయారు. నేను దానిని మళ్లీ గుర్తు చేశా అంతే’ అంటూ చెప్పారామె. గత డిసెంబర్లో తన తండ్రితో కలిసి చేసిన ట్రెక్.. ఎప్పటికీ మరచిపోలేనిదని అంటారామె. అప్పటి వరకూ ఒక్కసారి కూడా ట్రెక్కింగ్ అనుభవం లేని తండ్రి తొలిసారే ఉత్తరాఖండ్‌లో 12వేల కిమీ అధిరోహించి రికార్డ్ సృష్టించారు. అయితే నాన్న ఫిట్నెస్ గురించి నాకు తెలుసు. అలాగే ఎప్పుడైతే మా అడ్వెంచర్ గ్రూప్‌లో జాయిన్ చేశానో.. దాని నుంచి నాన్న కూడా బాగా ఇన్స్పైర్ అయ్యారు.’ అంటూ వివరించారామె. -
సమానత్వం,సాధికారతకోసం కలిసి పనిచేద్దాం : అపోలో సునీతా రెడ్డి
అపోలో హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సునీతా రెడ్డి మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్బంగా అపోలో హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సునీతా రెడ్డి మహిళలకు శుభాకాంక్షలు అందించారు. 1995 బీజింగ్ డిక్లరేషన్ , ప్లాట్‌ఫామ్ ఫర్ యాక్షన్ నుండి ప్రపంచవ్యాప్తంగా మహిళా హక్కులను ముందుకు తీసుకెళ్లడంలో సాధించిన పురోగతిని గుర్తించాలన్నా ఈ సందర్బంగా పేర్కొన్నారు. అయితే, ఎక్కువ మంది బాలికలు పాఠశాలలో చదువుతున్నప్పటికీ మరియు కీలకమైన సేవలను పొందుతున్నప్పటికీ, పురోగతి సమానంగా లేదనీ, గణనీయమైన సవాళ్లు ఇంకా కొనసాగుతు న్నాయని గుర్తు చేశారు. ముఖ్యంగా అట్టడుగు వర్గాలలోని బాలికలకు, కొన్ని సంఘర్షణ ప్రాంతాలకు , వాతావరణ సంక్షోభం,మహమ్మారి ద్వారా ప్రభావితమైన బాలికలకు చేరడం లేదన్నారు.‘మన సమిష్టి బలాన్ని పెంపొందించుకుంటూ, మహిళలు, బాలికలు తమ పూర్తి సామర్థ్యాన్ని సాధించకుండా అడ్డుకునేవ్యవస్థాగత అడ్డంకులను తొలగించుకునేందుకు, నిజంగాసమానమైన, సమ్మిళిత వాతావరణాలను సృష్టించడానికి మనం కలిసి పనిచేయాలి. తరువాతి తరానికి సాధికారత కల్పించడం చాలా ముఖ్యం. శాశ్వత మార్పుకు ఉత్ప్రేరకాలు , భవిష్యత్తును నడిపించడానికి రూపొందించడానికి హక్కులు, వనరులు మరియు అవకాశాలతో వారి సన్నద్ధం కావాలి’’ అన్నారామె.మహిళల హక్కులు మరియు లింగ సమానత్వాన్ని ప్రోత్సహించే చొరవలలో వ్యూహాత్మక పెట్టుబడులు ఏ బాలికను వదిలి వెళ్ళకుండా చూసుకోవడంలో సహాయపడతాయి.తమ స్వాభావిక ప్రభావ మూలధనాన్ని ఉపయోగించుకోని, రాబోయే తరాలకు సాధికారత , సమానత్వం యొక్క వారసత్వాన్నిఅందించాలని ఆమె మహిళా నాయకులను కోరారు.. అందరికీ న్యాయమైన సమానమైన ప్రపంచాన్ని నిర్మించేక్రమంలో మహిళలు, బాలికలందరికీ 'హక్కులు, సమానత్వం, సాధికారత'ను స్పష్టమైన వాస్తవికతగా మార్చేలా కలిసి పనిచేద్దామని ఆమె పిలుపునిచ్చారు. చదవండి: International Women's Day 2025 : యాక్సలరేట్ యాక్షన్ అంటే? మాటలేనా! -
మహిళలూ ఒక్క అరగంట మీ కోసం : నీతా అంబానీ సందేశం వైరల్ వీడియో
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ (Nita Ambani) మహిళల కోసం ఓ ప్రత్యేక సందేశాన్ని పంచుకున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ సతీమణి నీతా ఫిట్నెస్ గురించి, ఆమె ష్యాషన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆరు పదుల నిండిన వయసులో కూడా అనేక కార్యక్రమాలతో చాలా చురుగ్గా నిర్మాణాత్మకంగా ఉంటారు ఇదే విషయాన్ని గుర్తుచేస్తూ మార్చి 8న నీతా అంబానీ మహిళల కోసం ఒక వీడియోను షర్ చేశారు. ఫిట్నెస్ రొటీన్లో క్రమశిక్షణ, అభిరుచిరెండింటినీ మిళితం చేయాలని సూచించారు. అన్ని వయసుల మహిళలు తమ ఆరోగ్యం , శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వ్యాయామం మనలో సానుకూల ధోరణిని పెంచుతుంది,మనసుకు ప్రశాతంనిస్తుంది అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట సందడిగా మారింది. తాను ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు, ఎలాంటి వ్యాయామం చేస్తారో, తన జీవన శైలి వివరాలను పంచుకున్నారు. అలాగే మహిళలు తమ ఆరోగ్యం, శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వాలని నీతా అంబానీ సూచించారు. ప్రస్తుతం తన వయసు 61 ఏళ్లని.. ఆరేళ్ల వయస్సునుంచి డ్యాన్స్ ప్రాక్టీస్, వ్యాయాం చేస్తూ ఇప్పటికీ ఎంతో ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా తన ఫిట్నెస్ దినచర్య గురించి కూడా వివరించారు. రోజూ 30 నిమిషాల పాటూ ఫిట్నెస్ కోసం కేటాయిస్తానని, వాకింగ్, జిమ్, స్విమ్మింగ్ చేస్తానని తెలిపారు. చురుగ్గా ఉండటం చక్కెర, చక్కెర ప్రత్యామ్నాయ పదార్థాలను కూడా తీసుకోనని వెల్లడించారు. రోజుకి 5-7వేల అడుగులు నడవడంతోపాటు శాఖాహారంమాత్రమే తీసుకుంటూ, సరైన మోతాదులో ప్రోటీన్, పోషకాలు ఉండేలా జాగ్రత్తపడతానని చెప్పారు.ముఖ్యంగా అంతేకాదు మహిళలు తమను తాము జాగ్రత్తగా చూసుకోవడానికి, దీనికి సంబంధించిన చర్యను ప్రారంభించడానికి సమయం మించిపోలేదని గుర్తు చేశారు. ముఖ్యంగా 30 ఏళ్ల తర్వాత మహిళలు తమను తాము జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరమన్నారు. కండరాలు బలహీనపడతాయి. ఎముకల బలం తగ్గుతుంది. అందుకే మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. ఒక్క అరగంట : నీతా అంబానీ ఫిట్నెస్ మంత్రా వైరల్ వీడియో ‘‘61 ఏళ్లలో నేనుచేయగిలిగనపుడు.. మీరెందు చేయలేరు.. కదలండి! ఒక్క అరగంట మీకోసం కేటాయించుకోండి!!’’ అంటూ నీతా అంబానీ మహిళలకు పిలుపునిచ్చారు. -
కుమార్తెకు భారీ గిఫ్ట్: శివ్ నాడార్ కీలక నిర్ణయం
వారసత్వ ప్రణాళికను క్రమబద్దీకరించడానికి.. ఫ్యామిలీ హోల్డింగ్లను ఏకీకృతం చేయడానికి, ఒక ముఖ్యమైన చర్యలో భాగంగా.. దేశంలో మూడో అతిపెద్ద ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఫౌండర్ 'శివ్ నాడార్' (Shiv Nadar) కీలక నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని.. హెచ్‌సీఎల్ కంపెనీలో మాత్రమే కాకుండా.. ప్రమోటర్ కంపెనీలైన వామ సుందరి ఇన్వెస్ట్మెంట్స్ (ఢిల్లీ) ప్రైవేట్ లిమిటెడ్‌లలోని తనకు చెందిన మొత్తంలో 47 శాతం వాటాను తన కుమార్తె 'రోష్ని నాడార్ మల్హోత్రా'కు బదిలీ చేస్తూ గిఫ్ట్ డీడ్లను అమలు చేశారు.ఈ బదిలీలకు ముందు, శివ్ నాడార్.. రోష్ని నాడార్ మల్హోత్రా రెండు సంస్థలలోనూ వరుసగా 51%, 10.33% వాటాలను కలిగి ఉన్నారు. లావాదేవీల తరువాత, HCL కార్పొరేషన్, VSIPL లలో రోష్ని వాటాలు 57.33 శాతానికి పెరిగాయి, శివ్ నాడార్ వాటా 4 శాతానికి చేరుకున్నాయి.రోష్ని నాడార్ మల్హోత్రా (Roshni Nadar Malhotra)టెక్ దిగ్గజం, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకులు 'శివ్ నాడార్'కు ఏకైక సంతానంగా ఢిల్లీలో 1982లో జన్మించిన రోష్ని.. వసంత్ వ్యాలీ పాఠశాలలో చదువుకున్నారు. నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీ నుంచి కమ్యూనికేషన్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ, కెలాగ్స్ యూనివర్సిటీ నుంచి ఎంబిఏ చేశారు. చదువు పూర్తి కాగానే బ్రిటన్‌లో న్యూస్ ప్రొడ్యూసర్‌గా కెరీర్ ప్రారంభించారు. 27 సంవత్సరాలు వచ్చేసరికి తండ్రి ప్రారంభించిన వ్యాపారంలో భాగస్వాములయ్యారు. హెచ్‌సీఎల్‌లో చేరిన సంవత్సరానికే ఆ కంపెనీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా మాత్రమే కాకుండా కంపెనీ సీఈఓగా బాధ్యతలు కూడా చేపట్టారు.ఇదీ చదవండి: నెలకు ఒకరోజు సెలవు.. దిగ్గజ కంపెనీ కీలక నిర్ణయం -
ఉమెన్స్ డే ఎందుకు.. శ్రృతీహాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు
కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రుతీహాసన్(Shruti Haasan )..తనదైన నటనతో తక్కువ సమయంలోని స్టార్ హీరోయిన్గా ఎదిగింది. కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్ స్టార్ హీరోలందరితోనూ కలిసి సినిమాలు చేసింది. చివరిగా సలార్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. కోలీవుడ్ టు బాలీవుడ్.. అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తున్నప్పటికీ శ్రుతీ హాసన్‌పై పెద్దగా పుకార్లేవి రాలేదు. ఏ విషయంలో అయినా ఆమె నిక్కచ్చిగా ఉండమే దానికి కారణం. ఏ అంశంపై అయినా తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేస్తుంటారు. తాజాగా అంతర్జాతీయ మహిళా దినోత్సవంపై కూడా శ్రుతీ తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ..అసలు ఉమెన్స్ డేని జరుపుకోవడం దేనికని ప్రశ్నించింది. మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రుతీ మాట్లాడుతూ.. ‘మేల్ డే అనేది లేనప్పడు ప్రత్యేకంగా ‘ఉమెన్స్ డే’ ఎందుకు ? అంటే ఇంకా స్త్రీ వెనకబడి ఉందని చెప్పడానికే ఈ స్పెషల్ డేస్ జరుపుకుంటున్నారా? అలాగే ఉమెన్ ఓరియెంటెడ్’ సినిమా అంటారు. ‘మేల్ ఓరియెంటెడ్’ మూవీ అనరు. ముందు ఈ తేడా పోవాలి. మహిళా దినోత్సవం అనేది ప్రత్యేకంగా లేని రోజు ఉమెన్ ఎదిగినట్లు లెక్క’అని తనదైన శైలీలో చెప్పుకొచ్చింది. -
61 ఏళ్ల వయసులో నీతా అంబానీ ఫిటెనెస్ సీక్రెట్ ఇదే..
రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతా అంబానీ(61) ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటూ లక్షలాది మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె తన రోజువారీ ఫిట్నెస్ షెడ్యూల్‌ను పంచుకున్నారు. ముఖ్యంగా 30 ఏళ్లు పైబడిన మహిళలు ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యత ఇవ్వాలని నొక్కి చెప్పారు. ఈమేరకు ఒక వీడియో విడుదల చేశారు. అదికాస్తా వైరల్ అవుతోంది.వీడియోలో నీతా అంబానీ తెలిపిన వివరాల ప్రకారం..‘రోజూ 5,000 నుంచి 7,000 అడుగులు నడుస్తాను. నేను చురుకుగా ఉండటానికి సరళమైన ప్రభావవంతమైన మార్గం ఇది. దినచర్యలో భాగంగా నిత్యం జిమ్ వ్యాయామాలు, స్విమ్మింగ్, యోగా, ఆక్వా వ్యాయామాలు ఉంటాయి. అదనంగా డ్యాన్స్ చేస్తాను. ఇది నన్ను శారీరకంగా ఫిట్‌గా ఉంచడంతోపాటు మానసిక స్థితికి ఎంతో తోడ్పాటు అందిస్తోంది. ప్రతిరోజూ #StrongHERMovement(ట్విటర్-ఎక్స్‌లో ట్యాగ్)లో చేరి ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి మరింత దృఢంగా మారి ఎన్నో విజయాలు సాధించాలి’ అన్నారు.‘షుగర్-ఫ్రీ’ లైఫ్స్టైల్నీతా అంబానీ ఫిట్నెస్ జర్నీలో ఆహారం కీలక అంశమని తెలిపారు. ఆర్గానిక్, ప్రకృతి ఆధారిత ఆహార పదార్థాలపై దృష్టి సారించాలని సూచించారు. తాను ఎప్పుడూ శాకాహారం తీసుకుంటానని పేర్కొన్నారు. ఆమె షుగర్(చక్కెర ఉండే పదార్థాలు) అధికంగా ఉండే ఆహారానికి దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. సమతుల భోజనం, ప్రోటీన్లు, పోషకాలు సమృద్ధిగా ఉండేలా జాగ్రత్త పడతానని చెప్పారు.ఆరోగ్యానికి 30 నిమిషాలుUnstoppable at 61! This International Women’s Day, Mrs. Nita Ambani shares her inspiring fitness journey and invites women of all ages to prioritize their health and wellbeing. With her dedicated workout routine, she shows us that age is just a number. Join the #StrongHERMovement… pic.twitter.com/CyhfT1zm9r— Reliance Industries Limited (@RIL_Updates) March 8, 2025మహిళలు రోజుకు కనీసం 30 నిమిషాలపాటు వారి ఆరోగ్యానికి సమయం కేటాయించాలని నీతా అంబానీ సూచించారు. ఫిట్నెస్ అంటే వయసుతో పోరాడటం కాదని, దాన్ని పాజిటివిటీతో స్వీకరించడం అని నొక్కి చెప్పారు. నీతా ఫిట్నెస్ సందేశం అన్ని వయసుల మహిళలకు ఎంతో ఉపయోగపడుతుంది. అతివల స్వీయ సంరక్షణ, శ్రేయస్సుకు ఎంతో దోహదం చేస్తుంది. ఫిట్‌గా, యాక్టివ్‌గా ఉండాలనుకునేవారికి వయసుతో సంబంధం లేదని నిరూపిస్తూ ఆమె ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. -
women's day 2025 అవగాహన ఉంటే అద్భుతాలు సృష్టించవచ్చు!
‘అన్నం ముద్దను మన నోటికి చేర్చే రైతు కష్టానికిఅవగాహన, సాంకేతికత, ఆర్థిక వెన్నుదన్ను అందిస్తేవ్యవసాయ రంగంలో అద్భుతాలు సృష్టించవచ్చు’ అంటున్నారు డాక్టర్ నీరజా ప్రభాకర్. శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చరల్ యూనివర్శిటీకి ఫస్ట్ ఉమన్ వైస్ ఛాన్సలర్‌గా చేసి, అగ్రికల్చర్యూనివర్శిటీలో హార్టికల్చర్ డిపార్ట్మెంట్కి హెడ్‌గా, సీనియర్ ప్రొఫెసర్‌గా ఉన్నారు. 42 ఏళ్లుగా ఈ రంగంలో చేస్తున్న కృషిని, చోటు చేసుకుంటున్న మార్పులను, నేటి తరం ఆలోచనలనూ మన ముందు ఆవిష్కరించారు. ‘‘రైతు నేలలో విత్తనాలు వేసిన రోజు నుంచి నీటి సదు΄ాయాలు, భూసారం, వాతావరణం, తెగుళ్లు.. అన్నింటినీ దాటుకొని రైతు కష్టం మన చేతికి వచ్చేవరకు ఏయే దశలు దాటుతుంది అనే విషయాల పట్ల అందరికీ అవగాహన ఉండాలి. అప్పుడే ఈ రంగంలో అద్భుతాలు సృష్టించగలం. ఉల్లిపా యలు వేసిన మార్గం..మాది వ్యవసాయం కటుంబం. చదువుకునే రోజుల నుంచి ఉల్లిపాయలపై మార్కెట్లో వచ్చే హెచ్చు తగ్గులు ఎప్పుడూ విస్మయానికి లోను చేస్తుండేవి. ఆ ఆలోచనతోనే 1983లో ఎమ్మెస్సీ హార్టీ్టకల్చర్, అటు తర్వాత ‘ఉల్లిపాయలు– నీటి యాజమాన్యం’ మీద పీహెచ్డీ చేశాను. 1994 లో సంగారెడ్డి ఎఆర్వో నర్సరీ ఇంచార్జ్‌గా జాయిన్ అయ్యాను. ఆ తర్వాత మూడేళ్లకు ఉల్లి ధరలుæపెరగడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో రైతులు ఉల్లి సాగులో ఎక్కువ దిగుబడి సాధించడానికి శిక్షణాతరగతులు నిర్వహించాం. అక్కణ్ణుంచి మామిడి, జామ, స΄ోట, సీతాఫలం అంటు మొక్కలతోపాటు జామ, పనస వంటి పండ్లు, మల్లె మొక్కల... అమ్మకాలు కూడా ప్రాంరంభించాం.ప్రాంతానికి తగిన విధంగాఏ ప్రాంతానికైనా అక్కడి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా పండే పంటలు కొన్ని ఉంటాయి. వాటిని గుర్తించి అన్ని సీజన్లలో ఎలా పండించవచ్చో సాధించి చూ΄ాం. వెజిటబుల్ రీసెర్చ్ స్టేషన్ (అఖిల భారత సమన్వయ సంస్థ కూరగాయల పరిశోధన)లో ఆరేళ్లు పని చేశాను. రైతుల దగ్గరకు వెళ్లి, వాళ్లు ఎంచుకున్న సాగు పద్ధతులు స్వయంగా తెలుసుకొని, మార్పులూ చేశాం. బీర, దోస, సొరకాయ, గుమ్మడి.. మొదలైన వాటిలో క్రాసింగ్,, హైబ్రీడ్స్ మీద వర్క్ చేశాను.పారిశ్రామిక రంగానికి జత చేయాలిఆ తర్వాత 15 ఏళ్లు అధ్యాపకురాలిగా ఉన్నాను. సీనియర్ ప్రొఫెసర్‌గా ప్రమోషన్ ఆ తర్వాత 20 రోజుల్లోనే కొండాలక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్శిటీ కి ఫస్ట్ రెగ్యులర్ వైస్ ఛాన్స్లర్ పోస్టింగ్ వచ్చింది. దేశంలోనే హార్టికల్చర్ యూనివర్శిటీస్‌లో ఫస్ట్ ఉమన్ వైస్ ఛాన్సలర్‌గానూ గుర్తింపు లభించింది. మొదటిసారి విద్యార్థులనుపారిశ్రామిక రంగానికి అటాచ్ చేస్తూ స్కిల్స్ నేర్పించే విధంగా ప్రోగ్రామ్స్ చేశాం. కమర్షియల్ హార్టికల్చర్, నర్సరీ, ఫ్లోరికల్చర్, మష్రూమ్స్‌పై పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ, డ్రై ఫ్లవర్ టెక్నాలజీ, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్‌తో తయారుచేసే నిల్వ పదార్థాలు, సుగంధ తైలాల తయారీలోనూ ట్రైనింగ్ ఇచ్చాం. టెర్రస్ గార్డెన్ కాన్సెప్ట్స్, మామిడిపై పరిశోధన, ప్రదర్శనలు, డ్రాగన్ ఫ్రూట్ సాగులను ప్రోత్సహించాం. వివిధ దేశాల నుంచి వచ్చిన వ్యవసాయ శాస్త్రవేత్తలతో మన రైతులకు, స్టూడెంట్స్‌కు మధ్య చర్చలు జరిపాం.నవతరం దృష్టి మారాలి..ఐదారేళ్ల నుండి ఈ రంగంలోకి వచ్చే అమ్మాయిల సంఖ్య పెరుగుతోంది. అయితే, అమ్మాయిలు ఫీల్డ్కి వెళ్లడానికి ఇష్టపడటం లేదు. అవగాహన కలిగినవారు వెనుకంజ వేస్తే వ్యవసాయ రంగం సమతుల్యత దెబ్బతింటుంది. ఈ రంగంలోకి వచ్చేవారు పొలాలకు వెళ్లడానికి ఉదయం, సాయంత్రం సమయాలను ఎంచుకోవడం వంటి స్మార్ట్ వర్క్ నేర్చుకోవడం కూడా ముఖ్యం. రైతులు ఏ విధంగా కష్టపడతారో ఈ రంగంలోకి వచ్చి శిక్షణ తీసుకున్నవారు కూడా అంత కష్టపడాల్సి ఉంటుంది. చేసే పనిలో అంకితభావం ఉంటే మంచి ఫలితాలను ΄÷ందగలం’’అని వివరించారు.- నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
International Women's Day 2025 : స్వీయ ప్రేమ ముఖ్యం
విత్తనంలో మహావృక్షం దాగి ఉంటుందనేది అనుభవజ్ఞులు చెప్పిన మాట. ఆ మాటలను ఆచరణలో పెట్టి ఫలాలను పంచేవారు ఎప్పుడూ సమాజంలో స్ఫూర్తిమంతంగా నిలుస్తారు. మహిళగా ఏడుపదుల అనుభవాన్ని, తన ఆలోచనలను పంచుకున్నారు సికింద్రాబాద్ బోయినపల్లిలో ఉంటున్న కావేరీ సీడ్స్ డైరెక్టర్ జి.వి.వనజాదేవి. ‘కుటుంబం, సమాజం పట్ల బాధ్యతలు నిర్వర్తించాలంటే మహిళలు అన్నింటికన్నా ముందు స్వీయ ప్రేమ కలిగి ఉండటం అవసరం’ అంటున్నారామె. విమెన్స్ డే 2025 థీమ్మరింత వేగంగా... మరింత నిర్మాణాత్మకంగా ఈ సంవత్సరం విమెన్స్ డే క్యాంపెయిన్ థీమ్... యాక్సిలరేట్ యాక్షన్.లింగ సమానత్వాన్ని సాధించడానికి ఉత్తమమైన మార్గాలను ఎంచుకోవడంతో పాటు ఆ పనిని మరింత వేగంగా, నిర్మాణాత్మకంగా చేయాలి. ‘యాక్సిలరేట్ యాక్షన్’లో మహిళల పురోగతికి ఉపయోగపడే వ్యూహాలు, ఆలోచనలు ఉంటాయి. ‘లింగ సమానత్వానికి ఎన్నో అడ్డంకులు ఉన్నాయి’ అని నిరాశపడిపోవడం కంటే ఆశావహ దృక్పథంతో తగిన కార్యాచరణతో ముందుకు వెళ్లడం అవసరం. ‘యాక్సిలరేట్ యాక్షన్’కు సంబంధించిన ఒక నినాదం... సపోర్ట్ ది సపోర్టర్స్. మనకు ఎవరైతే మద్దతు ఇస్తున్నారో వారికి మద్దతు ఇవ్వడం ద్వారా లింగ సమానత్వం కోసం వేసే అడుగులను వేగవంతం చేయవచ్చు. మహిళలకు సహాయపడేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంస్థలు పనిచేస్తున్నాయి. వాటికి సంఘీభావం తెలియజేయాలి.మనం ఏ రకంగా యాక్సిలరేట్ యాక్షన్‌లో భాగం కావచ్చు?వివక్షను సవాలు చేయడం, మహిళల విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడం, మనకు తెలిసిన విషయాలను ఇతర మహిళలతో కలిసి పంచుకోవడం, మహిళల నాణ్యమైన విద్య, ఆరోగ్యం గురించి పనిచేయడం, మహిళల సృజనాత్మకతను ప్రోత్సహించడం లాంటివి ఎన్నో ఉన్నాయి. గత కాలం, ప్రస్తుతం కాలం అంటూ మహిళ విషయంలో ప్రత్యేకించి చెప్పలేం. ఏ రోజుల్లోనైనా మహిళ సంఘర్షణలతోనే దోస్తీ చేస్తుంది. ఆమె ఆలోచనలన్నీ కుటుంబం చుట్టూతానే కేంద్రీకృతమై ఉంటాయి. తల్లిదండ్రులు, తోబుట్టువులు, పెళ్లయ్యాక భర్త, అత్తింటివాళ్లు, పిల్లలు .. ఒత్తిడితో కూడిన జీవనంలోనే తనని తాను నిరూపించుకోవడానికి, నిలబడటానికిపోరాటం చేస్తూనే ఉంటుంది. అయితే, ఈ క్రమంలో తనని తాను మర్చిపోతుంది. పెళ్లి తర్వాత కుటుంబపోషణలో లీనమైపోతూ తన ఆరోగ్యం గురించి పట్టించుకోదు, చక్కగా ముస్తాబు అవడాన్ని పట్టించుకోదు. నిజానికి తనని తాను ప్రేమించుకోవడం మర్చిపోతుందనిపిస్తుంది. చదవండి: International Women's Day 2025 : యాక్సలరేట్ యాక్షన్ అంటే? మాటలేనా!ఆత్మస్థైర్యమే బలంమాది కరీంనగర్ జిల్లాలోని గట్ల నరసింగాపూర్ గ్రామం. పెద్ద కుటుంబం. ఎప్పుడూ నలుగురికి పెట్టగలిగే స్థితిలోనే ఉన్నాం. ఉమ్మడి కుటుంబంలో అందరినీ కలుపుకుని ΄ోతూ, బాధ్యతలను నెరవేరుస్తూ, నా ఉనికిని కోల్పోకుండా కాపాడుకున్నాను. పెళ్లినాటికి డిగ్రీ చదువు పూర్తయ్యింది. మా వారు జి.వి.భాస్కరరావుకి వ్యవసాయ రంగం అంటే ప్రేమ. అగ్రికల్చర్ బీఎస్సీ చేశారు. పుట్టిన గడ్డపైన తనని తాను నిరూపించుకోవాలని తపన. అందుకు నేను మద్దతుగా నిలిచాను. కావేరీ సీడ్స్ మొదలుపెట్టినప్పుడు ఒడిదొడుకులు ఎదుర్కొన్నాం. సమస్య వచ్చింది కదా అని అక్కడే వదిలేస్తే ఈ రోజు కావేరీ సీడ్స్ ఉండేది కాదు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో 50కి పైగా మా సీడ్ యూనిట్స్ ఉన్నాయి. ఈ ఏడాది వ్యవసాయ రంగంలో విద్యార్థులను తీర్చిదిద్దడానికి కావేరీ యూనివర్శిటీ కూడా ప్రారంభించాం.దిద్దుబాటుకుటుంబం, పిల్లల బాగోగులు, కంపెనీలో చేదోడుగా ఉండటం .. ఒక దశ తర్వాత బాధ్యతలు తీరి కాస్త తీరిక దొరకడంతో చేయాలా అని ఆలోచిస్తున్నప్పుడు చిన్నజీయర్ స్వామి వారి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆకర్షించాయి. అప్పుడే జైలుశిక్ష అనుభవిస్తున్న మహిళల గురించి తెలిసింది. ఖైదీలుగా ఉన్నవారి సమస్యలను అర్థం చేసుకోవడానికి చంచల్‌గూడ, చర్లపల్లి జైలుకు ‘వికాస తరంగిణి’సభ్యులతో కలిసి వెళ్లాను. క్రమం తప్పకుండా మహిళా ఖైదీలను కలవడం, కౌన్సెలింగ్ ఇవ్వడం, వారి పిల్లలను తిరిగి స్కూళ్లలో చేర్పించడం వంటి కార్యక్రమాలు చేశాం. మంచి ఫలితాలు రావడంతో కరీంనగర్, రాజమండ్రి, వరంగల్, విజయవాడ, వైజాగ్‌లలోని జైళ్లలోనూ కౌన్సెలింగ్ కార్యక్రమాలకు ఆహ్వానం అందింది. మహిళాఖైదీలు జైలు నుంచి విడుదలయ్యాక వారి జీవనం సానుకూలంగా గడిచే ఏర్పాట్లు చేయడం ఎంతో తృప్తిని కలిగించింది. క్యాన్సర్ అవగాహన కార్యక్రమాల్లో పాల్గొనడం, కాన్సర్ రోగులకు చికిత్స అందేలా చూడటం, మా ఊరితోపాటు చుట్టుపక్కల గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేయడం, మహిళారైతుల సమస్యలను తీర్చడం, చదువుకునే విద్యార్థులకు క్యాంపులు, మహిళలకు శిక్షణాతరగతులు నిర్వహించడం.. ఇలా సామాజిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశాలు లభించాయి. వ్యవసాయ రంగంలో మహిళలు రావడం అంటే గత కాలం కూలీలుగానే చూసేవాళ్లం. కానీ, ఇప్పుడలా కాదు. ఉన్నతవిద్యతో వ్యవసాయం రంగంలో మార్పులు తీసుకురావడానికి యువతరం ముందుకు వస్తుంది. మా యూనివర్శిటీలో చేరిన విద్యార్థుల సంఖ్యే అందుకు నిదర్శనం. ముందుగా మహిళలు తమని తాము ప్రేమించుకోవాలి. ఆరోగ్యం, సంరక్షణ, చదువుతో తనకు తానుగా ఎదుగుతూనే కుటుంబ బాధ్యతలను నిర్వర్తించాలి. ఒక్కో విజయాన్ని అందుకుంటూ సమాజంలో వెనకబడినవారిని తనతో కలుపుకుంటూ ముందుకు వెళ్లాలి. దైనందిన జీవనం ప్రశాంతంగా, సంతోషంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటే ఒత్తిడులను కూడా సులువుగా అధిగమించవచ్చు.’’ తన అనుభవసారాన్ని కళ్లకు కట్టారు వనజాదేవి. -నిర్మలా రెడ్డి సాక్షి, ఫీచర్స్ ప్రతినిధి -
‘సాక్షి’ గెస్ట్ ఎడిటర్‌గా వల్లూరు క్రాంతి
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: జిల్లా వ్యాప్తంగా వచ్చిన వార్తలను పరిశీలించి.. వాటిని క్షుణ్ణంగా చదివి.. ఆ వార్తల ప్రాధాన్యత క్రమాన్ని ఎంపిక చేశారు సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి. పాలన పరమైన విధుల్లో నిత్యం బిజీగా ఉండే కలెక్టర్ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం హైదరాబాద్‌లోని సాక్షి ప్రధాన కార్యాలయంలోని సంగారెడ్డి జిల్లా ఎడిషన్‌కు గెస్ట్ ఎడిటర్‌గా వ్యవహరించారు. వివిధ రంగాల్లో రాణిస్తున్న, ప్రతిభ చూపుతున్న మహిళలకు సంబంధించి విలేకరులు రాసిన ప్రత్యేక కథనాలు ఆమె చదివారు. వాటి ప్రాధాన్యతను కూడా గుర్తించి సబ్ ఎడిటర్లతో చర్చించి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. జిల్లా పేజీల డిజైన్లను పరిశీలించారు. అలాగే వివిధ మండలాలు, పట్టణాల నుంచి వచి్చన వార్తలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ క్రాంతి మాట్లాడుతూ ఈ కథనాలు మహిళలకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని కితాబిచ్చారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకెళ్లేలా వారిని ప్రోత్సహిస్తూ.. స్ఫూర్తిదాయక కథనాలు మరిన్ని రావాలని ఆకాక్షించారు. దినపత్రికకు గెస్ట్ ఎడిటర్‌గా వ్యవహరించడం తనకు ఎంతో మంచి అనుభూతిని ఇచి్చందన్నారు. పత్రిక నిత్యం ప్రజాసమ స్యలను వెలికి తీస్తుండటంతో.. ఆ సమస్యలు అధికార యంత్రాంగం దృష్టికి వస్తాయని.. తద్వారా అధికార యంత్రాంగం వాటి పరిష్కారం కోసం కృషి చేస్తారన్నారు. అధికారుల దినచర్య న్యూస్పేపర్లతోనే ప్రారంభమవుతందని చెప్పారు. పత్రిక పాఠకునికి చేరడం వెనుక ఆయా విభాగాలు ఎలా పనిచేస్తాయో తెలిసిందని అన్నారు. -
International women's day 2025: 115 ఏళ్లు గడిచాయి? ఎక్కడుందీ సమానత్వం?
అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రకటించి 115 సంవత్సరాలైంది. అమానవీయమైన అణచివేతను, వివక్షను ఎదుర్కొన్న మహిళా కార్మికులు నెత్తురు ధారబోసి హక్కులకోసం తెగించి పోరాడారు. ఫలితంగా 8 గంటల పని దినాన్ని, వేతన పెంపుదలను, మరికొన్ని హక్కులను సాధించుకున్నారు. అయినప్పటికీ మహిళలు నేటికీ అనేక సవాళ్లను ఎదుర్కొంటూ కనిపిస్తున్నారు. మన సమాజంలో, ఆర్థిక, రాజకీయ వ్యవస్థలో మహిళా లోకం పురుషుల కంటే తక్కువగానే ఉంటూ వస్తోంది. ఇంట్లోనూ, బయట ఉద్యోగాల్లోనూ – మహిళలు పూర్తి బాధ్యతను మోస్తున్నప్పటికీ – ఈ అసమానత కొనసాగుతుంది. మహిళలు బలమైన పోరాటాలు చేస్తున్నప్పటికీ, వారి మీద లైంగిక హింస పెరుగుతూనే వుంది. దళిత, మైనారిటీ మహిళలు ఎక్కువగా దాడులకు గురి అవుతున్నారు. ప్రొఫెసర్లు, సైంటిస్టులు, డాక్టర్ల దగ్గర నుండి పారిశుధ్య కార్మికుల వరకు – అందరికీ కాంట్రాక్టు, తాత్కాలిక పనులే తప్ప ప్రభుత్వ ఉద్యోగాలు లేవు. ఈ పనుల్లో కూడా మహిళలకు సమాన పనికి సమాన వేతనాలు రావడం లేదు. ఉద్యోగ బీమా పథకాన్ని కోల్పోవడం అంటే మహిళలను ప్రసూతి ప్రయోజనాలకుదూరంగా పెట్టినట్లే. చదవండి! International Women's Day 2025 : యాక్సలరేట్ యాక్షన్ అంటే? మాటలేనా!1970లో పురుడు పోసుకున్న ‘ప్రగతిశీల మహిళా సంఘం’ ఎన్నో సమరశీల పోరాటాలు నిర్వహించింది. నిర్బంధానికి అణచివేతకు గురయ్యింది. అనేక మంది వీరవనితలు అమరులయ్యారు. 12 రాష్ట్రాల్లో గుర్తింపు కలిగిన మహిళా పోరాటాలు నిర్వహించింది. భూమికోసం, ఇళ్ళస్థలాలకోసం, స్త్రీ పురుష సమానత్వంకోసం లైంగిక హింసకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలను నిర్మించాం. ఈ క్రమంలో 2013లో సంస్థ చీలికకు గురయ్యింది. ఫలితంగా మహిళా ఉద్యమాలు తీవ్రంగా నష్టాన్ని చవిచూసాయి. వీటిని సమీక్షించుకొన్న తర్వాతరెండు సంస్థలు కలిసి భవిష్యత్‌లో ఒకే సంస్థగా పనిచేయాలని నిర్ణయించుకున్నాయి. మార్చి 8వ తేదిన అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం సందర్భంగా విలీనం కావాలని రెండు సంస్థలు భావించాయి. ఈ విలీనానికి ఒంగోలు వేదిక కాబోతుంది. – బి.పద్మ, ప్రధాన కార్యదర్శి,ప్రగతిశీల మహిళా సంఘం (పీవోడబ్ల్యూ), ఏపీ -
International Women's Day 2025 : యాక్సలరేట్ యాక్షన్ అంటే? మాటలేనా!
అంతర్జాతీయమహిళాదినోత్సవం అంటే మహిళాహక్కుల గురించి చర్చించుకోవడం. వారి హక్కులరక్షణ, మహిళా సాధికారతను సాధించడం ఎలా దానిపై అవగాహన కలిగిఉండటం. ఈ ఏడాది థీమ్ ‘యాక్సలరేట్ యాక్షన్’ అంటే...లింగ సమానత్వానికి సంబంధించిన చర్యల్ని వేగవంతం చేయడం. అంటే మహిళా విద్యా అవకాశాలను మెరుగుపర్చడం, ఉద్యోగ అవకాశాలను మరిన్ని కల్పించడం. సమిష్టిగా, లింగ సమానత్వం కోసం చర్యలను వేగవంతం చేయడం. ప్రపంచ ఆర్థిక వేదిక డేటా ప్రస్తుత పురోగతి రేటు ప్రకారం, పూర్తి లింగ సమానత్వాన్ని చేరుకోవడానికి 2158 వరకు పడుతుంది. అంటే ఇప్పటి నుండి దాదాపు ఐదు తరాలు పడుతుంది దీనికి సంబంధించి అసలు యాక్సలరేట్ యాక్షన్ అనేది ఎలా ఉండాలి అనే అంశంపై పాపులేషన్ ఫస్ట్ డైరెక్టర్ డాక్టర్ ఎ.ఎల్. శారదతో సాక్షి. కామ్ సంభాషించింది. ఆ వివరాలు మీకోసం...యాక్సలరేట్ యాక్షన్ అంటే మహిళలకు విలువైన సేవలను, వనరులను మరింత వేగంగా, నిర్మాణాత్మకంగా అధికంగా అందుబాటులోకి తీసుకు రావడం. సపోర్ట్ ది సపోర్టర్స్ అనే నినాదానికి కనుగుణంగా ఉమ్మడిగా సాగిపోవడం అన్నారామె. అది మాత్రమే కాకుండా, నాణ్యమైన సేవలను అందించడం అనే లక్ష్యంగా ఈ కార్యాచరణ సాగాలి. వారికి మరిన్ని అవకాశాలను కల్పించడం అనేది ప్రధానంగా ఉండాలి. ఇది సామూహికంగా సాగాలి. నామమాత్రపు చర్యలుగా గాకుండా చిత్తశుద్ధిగా సాగాలి. కేవలం మాటలు, వాగ్దానాలకు పరిమితం గాకుండా, చేతలు, చర్యలుగా ఉండాలి.గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు కూడా ఉపయోగపడేలా చర్యల్ని వేగవంతం చేయాలంటే వివిధ సంస్థలు, వ్యక్తులతో కలిసి జమిలిగా పనిచేయాలి. అపుడు మాత్రమే ఆశించిన ఫలితాలు సాధించగలం. కానీ మహిళలకు సేవలను అందుబాటులోకి తీసుకు రావడం అంటే.. మహిళల అభివృద్ధి అంటే ఆడబిడ్డల పెళ్లికి ఎంతో కొంత డబ్బులు ఇవ్వడం, లేదా ఇతర ఉచిత పథకాలు అనుకుంటాయి ప్రభుత్వాలు. కానీ ఇలాంటి పథకాల వల్ల ఆయా పార్టీలకు ఓట్లు వస్తాయోమోగానీ, మహిళలకు పెద్దగా ఒరిగేదేమీ ఉండదు. మహిళల నాణ్యమైన విద్య, ఆరోగ్యం, క్రియేటివిటీ, నైపుణ్య శిక్షణ, వనరులను అందుబాటులోకి తీసుకు రావడం లాంటివి జరగాలి. ప్రాక్టికల్‌గా లింగ వివక్షను రూపు మాపేందుకు, అందుకు తగిన మెరుగైన అవకాశాలు కల్పించేందుకు కృషి చేయాలి. సాధికారత సాధించేలా వారికి తోడ్పాటు అందించాలి. వారి జీవన పరిస్థితుల మెరుగుదలకు కావాల్సిన వనరులు కల్పించాలి. దీంతోపాటు వనరుల రక్షణలో మహిళలకు శిక్షణ ఇవ్వాలి. ఉదాహరణకు నీటి వసతి కల్పించాలి అంటే తాతాల్కిక పరిష్కారాలతోపాటు నీటి నిల్వలను ఎలా కాపాడాలి, బావులను తవ్వడం లాంటి అంశాలపై దీర్ఘకాలిక ప్రణాళిక ఉండాలి. దీనిపై మహిళలకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలి. సమస్య ఏదైనా పరిష్కారం మూలాల్లోకి వెళ్లాలి. సమాజంలో వివిధ కమ్యూనిటీలు, వ్యక్తులను ఇందులో భాగస్వామ్యులను చేయాలి. బాలికల అక్షరాస్యత శాతం ఎందుకు పడిపోతోంది అనే పరిశోధన జరగాలి. ప్రాంతీయ భాషల్లో అర్థమయ్యేలా విద్యాబోధన జరగాలి. ఇది శాస్త్రీయపరంగా, ఆధునిక బోధనా పద్దతులు ద్వారా జరగాలి. అపుడు మాత్రమే పిల్లలకు చదువుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది.చర్యలు ఏమైనా ప్లాన్ ఓరియెంటెడ్‌గా గాకుండా, పీపుల్ ఓరియెంటెడ్‌గా ఉండాలి. ఆయా సమస్యల పరిష్కారానికి సంబంధించిన అంశాలపై దృష్టి పెట్టాలి. వాటిపై అవగాహన కల్పించాలి. జంగా చర్యల్ని వేగవంతం చేయడం అంటే పేపర్‌మీద లెక్కలుగా గాకుండా ఫలితాలు, వాస్తవంగా ప్రయోజనకరంగా ఉండాలి. అపుడు మాత్రమే ఈ థీమ్‌కు సాఫల్యత చేకూరుతుంది. ఆ దిశగా ప్రభుత్వాలు కృషి చేయాలి. మహిళా హక్కుల కోసం పనిచేస్తున్న వ్యక్తులు, సంస్థలు,నెట్‌వర్క్‌తో గ్రూపులతో చర్చించి చర్యలు తీసుకోవాలి అన్నారు. పాపులేషన్ ఫస్ట్ ఆధ్వర్యంలో తాము ఇలాంటి సేవలనే అందిస్తున్నామని, అనేక మంది సంస్థలు, వ్యక్తులతో జమిలిగా పనిచేసి, ఫలితాలు సాధిస్తున్నామని శారద చెప్పారు. అలాగే లింగ వివక్ష నిర్మూలన సమాన అవకాశాల్లో ఎంత సాధించాం అనేది ఒక్కసారి ఆలోచించుకుంటే.. చాలామార్పును సాధించాం అనడంలో ఎలాంటి సందేహం లేదు. పురుషాధిక్య భావజాలం, ఆధిపత్యం ఇంకా కొనసాగుతున్నప్పటికీ, జరుగుతున్న అన్యాయాలపై, హక్కులపై అవగాహన పెరిగింది. ఎందుకిలా అని ప్రశ్నించే తత్వం, పోరాట స్ఫూర్తి పెరిగింది. నిజం చెప్పాలంటే మహిళలు చాలా అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో కూడా చాలా ముందుకు పోతున్నారు. కానీ గుణాత్మకమైన మార్పు సాధించాలంటే ఇది సరిపోదు. 90 శాతం మహిళలు ఇంకా వెనుకబడే ఉన్నారన్నారు. వీరి పురోగతి రేటును వేగవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలను, చిత్తశుద్ధిగా, నిబద్ధతతో మరింత వేగవంతం చేయాల్సింది ఉందన్నారు శారద. పాపులేషన్ ఫస్ట్పాపులేషన్ ఫస్ట్ అనేది మహిళా సాధికారత, లింగ సమానత్వం ,సమాజ సమీకరణ కోసం అంకిత భావంతో పనిచేస్తున్న సంస్థ. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుండి సోషియాలజీలో డాక్టరేట్ చేసిన డా. శారద పాపులేషన్ ఫస్ట్ ఫౌండర్ డైరెక్టర్‌గా ఉన్నారు. శారద నేతృత్వంలోని పాపులేషన్ ఫస్ట్ జెండర్ సెన్సిటైజేషన్‌ను గుర్తించి, దాని కోసం పనిచేసే అనేకమంది (ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా) జర్నలిస్టులకు ‘లాడ్లీ’ మీడియా పేరుతో అవార్డులు అందించి ప్రోత్సహిస్తుంది. ఇంకా అవగాహనా వర్క్‌షాప్‌లు నిర్వహిస్తుంది. ఫెలోషిప్‌లు అందిస్తుంది. డా.శారద సెంట్రల్ బోర్డ్ ఫర్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) సభ్యురాలిగా కూడా ఉన్నారు. గత మూడు దశాబ్దాలుగా బాలికా విద్యా , మహిళా హక్కులు, సమానత్వం కోసం కృషి చేస్తున్నారు. మహిళామూర్తులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు -
International Women's Day 2025: మహిళా విముక్తిలో ఓ అంకం
‘కన్యాశుల్కం’ నాటకం గుర జాడను అత్యుత్తమ నాటక రచ యి తగా తెలుగు సాహిత్యంలో నిలిపింది. ఈ నాటకాన్ని ‘జగన్నాథ విలాసినీ సభ’ 1892 ఆగస్టులో మొదట ప్రదర్శించింది. కన్యాశు ల్కంలో ప్రధానమైన సమస్య సుబ్బి పెళ్లి తప్పించటం! ఆడవాళ్లకి ఏ ఆలోచనాశక్తి లేదని, చులకనగా వారిని చూసే నాటి సమాజంలో మహిళలను ధైర్యవంతులుగా చిత్రించి మహిళల చరిత్రను పునర్లిఖించారు గురజాడ. సుబ్బమ్మ లేక సుబ్బి ఈ కథకి మూలం. నాటకంలో ఎక్కడా కనిపించదు. వెంకమ్మ – కృష్ణరాయపురం అగ్రహారీ కుడు అగ్నిహోత్రావధాన్ల భార్య. బుచ్చమ్మ-అగ్ని హోత్రావ ధాన్ల పెద్ద కూతురు, వితంతువు. మీనాక్షి - రామచంద్రా పురం అగ్రహారీకుడు లుబ్ధావధాన్ల కుమార్తె, వితంతువు. మధురవాణి–విజయనగరానికి చెందిన వేశ్య. పూట కూళ్ళమ్మ విజయనగరంలో పూట కూళ్ళిల్లు నడిపే వితంతువు. వెంకమ్మ అన్నగారు కరటక శాస్త్రి. ఇతడు కృష్ణరాయ పురం అగ్రహారంలో ఉన్న చెల్లెలి ఇంటికి వచ్చినపుడు సుబ్బి పెళ్ళి విషయం తెలుస్తుంది. ఈ సంబంధం ఇష్టంలేనివెంకమ్మ అన్న కరటకశాస్త్రిని ఈ సంబంధం తప్పించమని వేడుకుంటుంది. ఎలాగైనా మేనకోడలు పెళ్లి తప్పించాలని పథకాన్ని రూపొందిస్తాడు అతడు.మధురవాణిది నాటకంలో కీలకమైన పాత్ర. ఆమె వేశ్య. విజయనగరంలో ఉండే మధురవాణి కారణాంతరాల చేత రామచంద్రపురం అగ్రహార నివాసి, ఊరి కరణం రామప్ప పంతులి ఇంటికి చేరుతుంది. సుబ్బితో పెళ్లి ఖాయం చేసు కున్న లుబ్ధావధాన్లు రామచంద్రపుర వాసి. రామప్పపంతులు నయవంచకుడని ఆమె తొంద ర్లోనే కనిపెట్టేసింది. స్వతహాగా ఎదుటివారికి సాయం చెయ్యాలనే సద్బుద్ధి కలి గిన మధురవాణి... లుబ్ధావధాన్ల పెళ్లి రామప్ప పంతులు కుదిర్చాడని తెలిసిన వెంటనే ‘ఈ పెళ్లి మాన్పించకపోతే నేను మీతో మాట్లాడను’ అంటుంది. ఆ తరువాత అసలు కథ మొదలైంది.కరటకశాస్త్రి తన ప్రణాళిక అమలు చెయ్యటానికి రామప్ప పంతులు ఇంటికి వస్తాడు. అక్కడ మధుర వాణిని చూసి తన మేనకోడలి పెళ్లి తప్పించమని కోరతాడు. ఆమె అంగీకరించి కొన్ని సలహాలు ఇస్తుంది. తన ‘కంటె’ని పెళ్లిలో పెళ్లికూతురికి పెట్టటానికి కూడా ఒప్పుకుంటుంది. ఆడవేషంలో ఉన్న కరటకశాస్త్రుల శిష్యుడు మహేష్‌ని ఇచ్చి పెళ్ళి జరిపించి, తద్వారా సుబ్బి పెళ్లి ఆపటంలో మధురవాణి చాకచక్యాన్ని ప్రదర్శించింది. తర్వాత లుబ్ధావధా న్లను పెళ్లి చేసుకున్న మహేష్...మధురవాణి దగ్గరకు వచ్చి ఆమె ‘కంటె’ ఆమెకి ఇచ్చేస్తాడు. మధురవాణి ఆడపిల్ల వేషంలో ఉన్న మహేష్‌కు దాసరి వేషం వేసి ఊరు దాటిస్తుంది.‘కంటె’ కోసం రామప్ప పంతుల్ని ఇబ్బంది పెట్టడంతో అతడే హెడ్ కానిస్టేబుల్‌తో లుబ్ధావధాన్ల మీద ఖూనీ కేసు పెట్టిస్తాడు. ఈ వ్యవహారంలో లుబ్ధావధాన్లను కేసునుంచి బయట పడెయ్యడానికి మధురవాణి, సౌజన్యా రావు పంతులు ఇంటికి వెళుతుంది. అదే సమయంలో గిరీశం కూడా ఆ ఇంటికి వస్తాడు. బుచ్చమ్మని లేవదీసుకు పోయిన గిరీశం అంతటితో తృప్తిపడక లుబ్ధావధాన్ల ఆస్తి చేజిక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తూ అక్కడికి వచ్చాడు. గిరీశం నిజస్వరూపం తెలుసుకున్న సౌజన్యా రావు పంతులు బుచ్చమ్మను పూనాలో విడోస్ హోవ్ుకు పంపే ఏర్పాట్లు చేస్తాడు. నాటకంలో మీనాక్షి పాత్ర కూడా ముఖ్యమైనదే. ముసలి తండ్రి పెళ్లి కరటకశాస్త్రి శిష్యుడు మహేశంతో జరి పించటంలో సిద్ధాంతికి సంపూర్ణ సహకారం అందిస్తుంది. ఒక రాత్రివేళ రామప్ప పంతులితో తమ ఇంట్లో తండ్రికి దొరికిపోతుంది. తండ్రి బయటికి గెంటేస్తాడు. ఈ చర్యకి మీనాక్షి ఏమీ జంకకుండా ‘‘... ఈ జన్మలో ఈ ఇంట్లో అడు గుపెట్టను’’ అంటూ రామప్ప పంతు లుతో వెళ్లిపోతుంది.ఇక గంపెడు చాకిరీ చేస్తూ నెత్తిన ముసుగేసుకుని జీవి తాన్ని గడుపుతున్న బుచ్చమ్మ ఆలోచనాశక్తి, తెంపరితనం ఉన్న మహిళ. బుచ్చమ్మకి గిరీశం తన కళ్లముందు నిలిపిన రంగుల లోకం... అందరి ముత్తయిదువలలాగ జీవించాలనే ఆశని కల్గించింది. ఇంకో పక్క గిరీశం తన ఈ నిర్ణయం వల్ల ముసలాడితో చెల్లెలి పెళ్లి ఆగిపోతుందని నచ్చ చెప్పాడు. ధైర్యంగా ఆమె గిరీశంతో అగ్ని హోత్రావధాన్ల కళ్లుగప్పి వెళ్లి పోయింది. విజయనగరంలో పూటకూళ్ల ఇల్లు నడుపుకునే పూటకూళ్లమ్మ ఇంట్లో పనీపాటూ చేసు కుంటూ, ఆకతాయిగా తిరిగే మాయలాడు గిరీశం... ఆమెని మోసగించినందుకు అతడిని చీపురు తీసుకుని వెంటబడు తుంది. దానితో కృష్ణరాయ పురం అగ్రహారం వెంకటేశంతో చేరతాడు గిరీశం. లుబ్ధా వధాన్లకి వరసకి తమ్ముడైన గిరీశం: సుబ్బిని పెళ్లి చేసు కోవద్దంటూ లుబ్ధావధాన్లకి అర్థం అయ్యేటట్లు, భయ పెడుతూ ఉత్తరం రాస్తాడు. కాబట్టి సుబ్బి పెళ్లి ఆపటంలో పూటకూళ్లమ్మ కూడా తెలీకుండానే పెద్దసాయం చేసింది. గిరీశం కృష్ణరాయపురం చేరేటట్టు చేసింది.కన్యాశుల్కం నాటకం సుబ్బి కొరకే, సుబ్బికోసమే నడి చింది. చెప్పాలంటే అదృశ్యంగా కథ నడిపింది సుబ్బే. తలా ఒక చెయ్యివేసి దుర్మార్గాన్ని అడ్డుకున్నది మహిళా శక్తి! అదే గురజాడ మహిళలకు చూపిన వెలుగుదారి. డా. తుర్లపాటి రాజేశ్వరి వ్యాసకర్త కేంద్ర సాహిత్య అకాడెమీ అనువాద పురస్కార విజేత -
అతిరథులు ఈ అతివలు..
ఈ సృష్టిలో శక్తి మంతమైనవి రెండే అంశాలున్నాయి.. అందులో ఒకటి ప్రకృతి, మరొకటి మగువ అని ఆనాడే ఓ ప్రఖ్యాత రచయిత చెప్పాడు. సమాజమంతా మహిళలను కీర్తిస్తూ.. మహిళా సాధికారత అంటూ గొంతెత్తుతున్నప్పటికీ.. తమ గౌరవాన్ని, గొప్పతనాన్ని కాపాడుకోడానికి ఆ తల్లులు నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో పలువురి స్ఫూర్తిదాయక మహిళల ఇతివృత్తాలను తెలుసుకుందాం.. సాహిత్యం.. సావాసం..తన ప్రయాణమంతా సాహిత్యంతోనే.. తన మనసంతా ప్రకృతిమయం. గొప్ప గొప్ప విషయాలు ఎక్కడో ఉండవు.. కాస్త తరచి చూస్తే మనచుట్టూనే, మన మధ్యే ఉంటాయంటారు ప్రముఖ రచయిత స్వర్ణ కిలారి. సామాజిక ఇతివృత్తాలతో పలు ప్రభావ వంతమైన కథలు, రచనలు, అనువాదం చేసిన స్వర్ణ కిలారి.. మహిళల ట్రావెలింగ్ అనుభవాలతో ఇంతియానం అనే పుస్తకానికి సంపాదకీయం రాశారు. విశ్వవ్యాప్త ప్రయాణాలు చేసిన మగువలు.. విభిన్న అంశాల పై వారి అనుభవాలు, ఆలోచనలకు అక్షరరూపం తీసుకొచ్చారు. మరికొద్ది రోజుల్లో ఇంతియానం 2.0 సైతం రాబోతోంది. ఈ నేపథ్యంలో తన స్ఫూర్తివంతమైన ఆలోచనలు ఆమె మాటల్లోనే..ది షూటింగ్ స్టార్ స్ఫూర్తితో..రచనలన్నా, సాహిత్యమన్నా నాకెంతో ఇష్టం. ఇందులో భాగంగానే నాకు బాగా నచ్చిన కొన్ని పుస్తకాలను తెలుగులోకి అనువాదం చేశాను. ఇందులో కేరళకు చెందిన బాల మేధావి క్లింట్ బయోగ్రఫీ లిప్తకాలపు స్వప్నం, ది గోట్ లైఫ్ అనే ప్రముఖ రచనను మేక బతుకు పేరుతో తెలుగులోకి అనువాదం చేశాను. వ్యక్తిగతంగా నల్ల బంగారం, 13 వంటి రచనలు చేశాను. ఒక రచన కోసం నార్త్ థాయ్‌లాండ్ వెళ్లిన సమయంలో.. ఉన్న కొద్ది ఆస్తిని అమ్మి ప్రపంచ యాత్ర చేసిన అమ్మాయి నవ్య నాథ్ రాసిన ది షూటింగ్ స్టార్ బుక్ చదివి ఆశ్చర్యపోయాను. ఇలా మన తెలుగువారి ట్రావెలాగ్స్‌తో మంచి పుస్తకం తీసుకురావాలని అప్పుడే నిర్ణయించుకుని పని ప్రారంభించాను. ఇందులో భాగంగా మన తెలుగు మహిళలు చేసిన అద్భుత ప్రయాణాలు, అనుభవాలు చూసి స్ఫూర్తిని పొందాను. ఇందులో ఒంటరిగా ప్రయాణలు చేసిన వారు ఎందరో ఉన్నారు. ఇంటి నుంచి బయటకి వచ్చి ఉద్యోగాలు చేయడమే గగనమైన తరుణంలో స్థానిక ఆదిలాబాద్, కాకినాడ అడవులు మొదలు.. విదేశాల్లోని దండకారణ్యాలు, నగరాలు, సంస్కృతులు ఎన్నెన్నో వింతలు, విశేషాలను ఆస్వాదించిన మహిళ ప్రయాణ కథలు నాకు జీవితకాల సంతృప్తినిచ్చాయి. ఇలా 45 మంది కథలతో మొదటి పుస్తకం ముద్రించాను. ప్రస్తుతం మరో 55 మంది వనితల ప్రయాణ కథలతో ఇంతియానం 2.0ను తీసుకురానున్నాను. ఆడవారి ట్రావెలాగ్ వినూత్నంగా, విభిన్నంగా ఉంటుంది. వారు చూసే కోణం, ఆస్వాదించే విధానం కాస్త భిన్నంగా ఉంటుంది. ఉమెన్ ట్రావెంలింగ్ అంత సులభం కూడా కాదు. సామాజికంగా, శారీరకంగా, మానసికంగా పలు అంశాలు సహకరించవు. ఈ సారి మహిళల సోలో కథలతో పాటు తల్లీ కూతుళ్లు వంటి వైవిధ్యాలున్నాయి. వ్యక్తిగతంగా నేను మెక్సికో, బాలి, శ్రీలంక, అమెరికా, భూటాన్ వంటి దేశాలు ప్రయాణించాను. నా రచన 13 కోసం ఉత్తర థాయిలాండ్ వెళ్లి అక్కడ చియాంగ్ రాయ్ గుహలో చిక్కుకున్న 13 మంది పిల్లల నిజజీవిత కథను, వ్యథను రాశాను. భవిష్యత్తులో మరిన్ని రచనలు చేయాలనుంది. – స్వర్ణ కిలారి, ప్రముఖ రచయిత్రి, హైదరాబాద్వైకల్యాన్ని జయించి.. తానోక దివ్యాంగురాలు.. చిన్నప్పటి నుంచి అందరిలానే తానూ వివక్షకు గురైంది. ముందే దివ్యాంగురాలివి, అందులోనూ అమ్మాయివి.. నువ్వేం చేయగలవు, నీ వల్ల ఏమీ కాదు అనే మాటల తూటాలు ఆమె మనసును విచి్ఛన్నం చేశాయి. ఎలాగైనా తనను తాను నిరూపించుకోవాలి, ఎవరి, జాలి, సహాయంపైన ఆధార పడకూడదని నిశ్చయించుకుని ఇంటిని వదిలి హైదరాబాద్ నగరానికి చేరుకుంది. సంపూర్ణంగా తన పనులు తాను చేసుకోలేకపోయినా, అందరిలా నడవలేకపోయినా.. కుంగిపోకుండా కంప్యూటర్ వర్క్ నేర్చుకుని, డీటీపీ వర్క్ చేసి తన ఖర్చుల వరకూ సంపాదించుకునేది. తానే కాదు తనలాంటి మరికొందరికి ఆశ్రయం ఇవ్వాలని ‘ఆద్య నిలయం ట్రస్ట్’ ఏర్పాటు చేసి మరి కొందరు మహిళా దివ్యాంగులకు ఉచితంగా ఆశ్రయం, ఆహారం, వసతులను అందిస్తోంది. ఈ క్రమంలో తమకు కూడా మగతోడు ఉంటే బాగుంటుంది.. వైకల్యం దేహానికే కానీ మనసుకు కాదు. అందరిలాగే తమకు కూడా అనుభూతులు, కోరికలు, ఇష్టాలు ఉంటాయని.. మిత్రుల సూచనతో మరో దివ్యాంగ వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. అలా తను సతీష్ అనే దివ్యాంగుడినిపెళ్లి చేసుకోవడమే కాకుండా తనలాంటి మరికొందరికి పెళ్లిల్లు చేయిస్తోంది. మరికొందరికి బాసటగా.. దివ్యాంగులకు మొదటి వివక్ష వారి కుటుంబాల నుంచే మొదలవుతుంది. నువ్వేం చేయలేవు.. జీవితాంతం వారు పెట్టింది తింటూ ఇంట్లో ఓ మూలన కూర్చో అనే సందర్భాలే ఎక్కువ. ఇలాంటి తరుణంలో మా ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ, మా కష్టంతో ముందుకు సాగుతున్నాం. ఇలా మరికొందరు దివ్యాంగులకు ఆశ్రయం ఇస్తూ ఒక కుటుంబంగా బతుకుతున్నాం. మా ప్రయాణంలో ఆర్థికంగా, సామాజికంగా, మానసికంగా తోడ్పాటును అందించిన వారు ఎందరో ఉన్నారు. నా పెళ్లిని సర్వ్ నీడి అనే స్వచ్ఛంద సంస్థ జరిపించింది. నా మొదటి పెళ్లి రోజు సందర్భంగా ఆత్మీయుల్లో ఒకరు డబ్బులు ఇచ్చి పార్టీ చేసుకోమన్నారు. ఆ డబ్బుతో నేను మరికొందరు దివ్యాంగుల జంటలకు పెళ్లి పరిచయ వేదిక ఏర్పాటు చేశాను. ఇప్పటి వరకూ ఐదు జంటలకు చేశాను. మరికొన్ని చేసే ప్రయత్నంలో ఉన్నాను. – క్రిష్ణప్రియ, ఆద్య నిలయం ట్రస్ట్, హైదరాబాద్ -
Women's Day 2025: ఆమేదే అధికారం!
సాక్షి, హైదరాబాద్ : కోటిమందికి పైగా ప్రజలకు వివిధ సేవలందిస్తున్న మహా నగరపాలకసంస్థ (జీహెచ్ఎంసీ)లో మహిళలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. అటు పాలకమండలిలో, ఇటు అధికారుల్లోనూ వారు తమ సేవలందిస్తున్నారు. పాలకమండలికి నేతృత్వం వహించే మేయర్, డిప్యూటీ మేయర్ ఇద్దరూ మహిళలే కావడం విశేషం. అంతేకాదు 150 మంది కార్పొరేటర్లకు గాను 50 శాతం రిజర్వేషన్లతో 75 మందికి మాత్రమే అవకాశమున్నప్పటికీ, 79 మంది మహిళలు కార్పొరేటర్లుగా ఎన్నిక కాగా, వారిలో ఒకరు మృతి చెందడంతో ప్రస్తుతం 78 మంది.. 78 వార్డులకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారి వార్డుల్లో ప్రజల సమస్యలు తీర్చడంలో, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు అధికారులపై ఒత్తిడి తేవడంలో వారిదే ముఖ్య భూమిక. ఇక పారీ్టల పరంగా చూస్తే బీఆర్ఎస్లో 26 మంది, బీజేపీలో 23 మంది, ఎంఐఎంలో 18 మంది, కాంగ్రెస్‌లో 11 మంది తమ వార్డుల్లో పనులు చేస్తున్నారు. అధికారుల్లో.. ఇక జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం అధికారుల్లోనూ 14 మంది అడిషనల్ కమిషనర్లకుగాను ఆరుగురు మహిళలే. వారు ఆర్థికం, ఆరోగ్యం, ఎన్నికలు, జీవవైవిధ్యం, డిపార్ట్మెంటల్ ఎంక్వైరీస్ వంటి కీలక విభాగాలను నిర్వహిస్తున్నారు. ఇటీవలి వరకు పరిపాలన విభాగం బాధ్యతలు నిర్వర్తించిన అధికారిణి బదిలీ కావడం తెలిసిందే. సీఎఫ్ఏ, ఎస్టేట్స్ ఆఫీసర్, ఏపీఆర్ఓ, ఐటీ జాయింట్ కమిషనర్, స్పోర్ట్స్ జాయింట్ కమిషనర్, చీఫ్ హార్టికల్చరిస్ట్, సీఎంఓహెచ్లతో పాటు ఎస్ఈలుగా, ఈఈలుగా తదితర ఉన్నత పదవుల్లో మహిళలే ఉన్నారు. సర్కిళ్లలోనూ.. మరో ఆరుగురు మహిళలు సర్కిళ్లలో డిప్యూటీ కమిషనర్లుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సర్కిల్ స్థాయిలో ఏ పని కావాలన్నా వారిని సంప్రదించాల్సిందే. అన్ని పనుల పర్యవేక్షణ, అజమాయిషీ వారివే. క్షేత్రస్థాయిలో పనులు చేయాల్సింది వారే. ప్రజల సమస్యలు స్థానికంగానే పరిష్కారమయ్యేందుకు వారిదే కీలకపాత్ర కావడం తెలిసిందే. పారిశుద్ధ్యంలోనూ వీరే.. అధికారాల్లోనే కాదు. స్వేదం చిందించడంలోనూ అతివలే కష్టపడుతున్నారు. క్షేత్రస్థాయిలో నగరాన్ని శుభ్రపరుస్తున్నదీ మహిళలే. జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కారి్మకుల్లో 18 వేల మందికి పైగా మహిళలే ఈ నగరాన్ని శుభ్రం చేస్తున్నారు. నగరాన్ని తల్లుల్లా పరిశుభ్రంగా ఉంచుతున్నారు. తరుణీ తరుణం!లక్టీకాపూల్: మహిళా ప్రజాప్రతినిధులు, ఉద్యోగినులు ఆహ్లాదంగా ఆటాపాటలతో గడిపారు. మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్‌రెడ్డి, అడిషనల్ కమిషనర్లు పంకజ, సుభద్రాదేవి, అలివేలు మంగతాయారు, సరోజ, గీతా రాధిక, జాయింట్ కమిషనర్ ఉమా ప్రకా‹Ù, డీఎంహెచ్ఓ డా.పద్మజ తదితరులు శుక్రవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. వేడుకలను డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్ రెడ్డి, కమిషనర్ ఇలంబర్తి, ఇతర మహిళా ఉన్నతాధికారులతో కలిసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన మహిళా శానిటరీ వర్కర్లను మేయర్, డిప్యూటీ మేయర్ ఘనంగా సత్కరించారు. వివిధ పోటీల్లో గెలుపొందిన మహిళా ఉద్యోగులకు బహుమతులు ప్రదానం చేశారు. -
పుణ్యమూర్తివి నీవమ్మా.. మా ఇంటి కావలి తల్లివి నీవమ్మా
ఆధునిక సమాజంలో మహిళలకు గౌరవం దక్కడం ఇప్పిడిప్పుడే మొదలైంది. స్త్రీ విద్య.. స్త్రీలకు ఉద్యోగాలు.. రాజకీయ పదవులు.. సామాజిక హోదా ఈమధ్యనే పెరుగుతూ వస్తోంది. కానీ, ఈ మారుమూల పల్లెల్లో స్త్రీమూర్తులను సాక్షాత్తుగా దేవతలుగా కొలుస్తారు. తమ ఇంటి ఇలవేల్పులుగా ఆరాధిస్తారు. తమ కుటుంబాలను కాపాడే శక్తిగా.. అమ్మవారిగా పూజిస్తారు.. తమ ఇంట పండిన పంటలో తోలి గంపను ఆమెకు సమర్పిస్తారు.. తమ ఇంట వండిన వంటలు తొలిముద్దను ఆమెకు సమర్పిస్తారు. ఇంట్లో ఏదైనా పండగొచ్చినా పబ్బమొచ్చినా ఇళ్లలో వండుకునే పిండివంటల్లో తొలివాయి ఆమెకే ఇచ్చి.. అమ్మా నీ చలవతోనే మేమంతా చల్లగా ఉన్నాం.. నువ్విచ్చిన ఆస్తిపాస్తులు.. ఆశీస్సులతో ఇలా సాగుతున్నాం.. నువ్వు లేకున్నా నీ జ్ఞాపకాలు చాలు.. ఇదిగో నిన్ను చూస్తూ బతికేస్తాం అంటూ భక్తి.. ప్రేమ నిండిన కళ్ళతో ఆ స్మారకాలవద్ద పవిత్రంగా ప్రమిదలు వెలిగిస్తారు.. ఏదైనా ఇంట్లో ఒక మహిళా పుణ్యస్త్రీగా కన్నుమూస్తే ఆమెను పేరంటాలుగా గౌరవిస్తారు. ఆమె పేరిట ఒక స్మారక చిహ్నాన్ని నిర్మిస్తారు.. వీటిని గుండాం అంటారు. భర్తకన్నా ముందే తనువు చలించడం ఒక మహిళకు దైవత్వాన్ని తెచ్చిపెడుతోంది. అంటే ఆమె పుణ్యస్త్రీగా ముత్తైదువుగా కన్నుమూసి ఆ ఇంటి వారి పాలిట ఇలవేల్పుగా కొలువైపోతుంది. భారతీయ సమాజంలో విధవగా జీవించడం మహిళ ఒక శాపంలా భావిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో భర్తకన్నా ముందుగానే ప్రాణం విడిచివెళ్లిన స్త్రీ ఏకంగా దైవత్వాన్ని సంతరించుకుని ఆయా కుటుంబాల్లో దేవతలుగా కొలువుదీరుతారు. విజయనగరం జిల్లాలోని రాజాం, రేగిడి, వంగర, సంతకవిటి మండలాల్లో వందలాది పల్లెల్లో ఈ ఆచారం ఉంది.పంటపొలాలకు.. పాడిపశువుల నువ్వే అండాదండాఇక్కడ పొలాల్లో, రోడ్లకు ఇరువైపులా కనిపిస్తున్న ఈ చిన్న చిన్న నిర్మాణాలను ఇక్కడి స్థానికులు గుండాలు అని పిలుస్తారు. ఇటువంటి గుండాలు ప్రతీ గ్రామంలో వందల సంఖ్యలో ఉంటాయి. బొమ్మనాయుడువలస, బొద్దూరు, గుళ్ళ సీతారాంపురం, గడ్డి ముడిదాం, ఉణుకూరు, అరసాడ, కాగితాపల్ల వంటి పల్లెల్లో ప్రతి ఇంటికీ ఇలాంటి గుండాలు ఒంటరి.. వారువారు స్థోమతను బట్టి తమ పొలాల్లోను.. కల్లంలోనూ వీటిని నిర్మించి అందులో ఆ మహిళా ఆత్మను ప్రతిష్టించి ఆ గుండంలో ఆమె జీవించి ఉన్నట్లుగా భావిస్తారు. ఆ ఇంట జరిగే శుభ కార్యాల్లో తోలి కబురు ఆమెకే చెబుతారు. గర్భిణీలు.. పెళ్లికూతుళ్ళు కూడా అక్కడకు వెళ్లి దీపం పెట్టి.. నీలాగే గొప్ప ముత్తైదువులా జీవించేలా ఆశీర్వదించాలమ్మా అని ప్రార్థిస్తారు. అంతేకాకుండా పంటపొలాలు.. పాడిపశువులను సైతం ఆ పేరంటాలు కాపాడుతుందని.. వ్యవసాయపనుల సందర్భాల్లో ఎలాంటి ఇబ్బందులు.. ప్రమాదాలు కూడా రాకుండా ఆమె కావలి ఉంటుందని .. ఇంటికి చీడపీడలు.. అనారోగ్యాలు రానివ్వకుండా ఆ పేరంటాలు అడ్డంగా నిలబడుతుందని విశ్వాసంతో ఉంటారు. అందుకే ప్రతి గుండానికి లలితమ్మ పేరంటాలు.. లక్షమ్మ పేరంటాలు.. రాధమ్మ పేరంటాలు అని పేర్లు పెడుతూ మరణించిన తరువాత కూడా తమ భక్తిప్రపత్తులు చాటుకుంటారు. ఈ గ్రామాల్లో వందలాది ఇలాంటి స్మారకాలు ( గుండాలు) కనిపిస్తాయి. వాటికి ఏటా రంగులు వేసి.. చక్కగా ముస్తాబు చేసి అందులో తమ ఇంటి ముత్తైదువను చూసుకుంటారు. ఈరోజుల్లో మహిళలను గౌరవించడం మాట అటుంచి వారికి రక్షణ కూడా లేకుండా పోతున్న పరిస్థితుల్లో ఉండగా వందల ఏళ్ళనుంచీ ఆ పల్లెవాసులు మహిళలకు ఏకంగా దేవతా స్థానం కల్పించి మరణించాక కూడా ఆమెను తమ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చూస్తూ.. ఏటా కొత్తబట్టలు.. పిండి వంటలు.. పళ్ళు ఫలాలు.. సమర్పిస్తారు.. ఇది కదా అసలైన మహిళా సాధికారత.. ఇది కదా మహిళలకు అసలైన గౌరవం..-సిమ్మాదిరప్పన్న. -
బీవోబీ గ్లోబల్ ఉమెన్ ఎన్ఆర్ఈ, ఎన్ఆర్వో ఖాతా
న్యూఢిల్లీ: బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) మహిళల కోసం ప్రత్యేకంగా.. ‘బీవోబీ గ్లోబల్ ఉమెన్ ఎన్ఆర్ఈ అండ్ ఎన్ఆర్వో సేవింగ్స్ ఖాతాను’ ప్రారంభించింది. ఆటో స్వీప్ సదుపాయంతో ఇది ఉంటుంది. తద్వారా ఖాతాలో పరిమితికి మించి ఉన్న బ్యాలెన్స్ డిపాజిట్‌గా మారిపోయి, అధిక వడ్డీ రాబడి లభిస్తుంది. అలాగే, ఈ ఖాతాదారులకు గృహ రుణాలు, ఆటో రుణాలపై రాయితీ రేట్లు, తక్కువ ప్రాసెసింగ్ చార్జీలు ఉంటాయని బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రకటించింది. 17 దేశాల్లో 60,000 టచ్ పాయింట్ల ద్వారా 16.5 కోట్ల అంతర్జాతీయ కస్టమర్లకు బీవోబీ సేవలు అందిస్తోంది. బీవోబీ ప్రీమియం ఎన్ఆర్ఈ, ఎన్ఆర్వో సేవింగ్స్ ఖాతా విషయంలోనూ మార్పులు చేసింది. మహిళా దినోత్సవం సందర్భంగా అంతర్జాతీయంగా ఉన్న భారతీయ మహిళలకు ప్రీమియం బ్యాంకింగ్ సేవలను అందించే లక్ష్యంతో బీవోబీ ఉమెన్ ఎన్ఆర్ఈ అండ్ ఎన్ఆర్వో ఖాతాను రూపొందించినట్టు బ్యాంక్ ఆఫ్ బరోడా ఈడీ మీనా వహీద్ ప్రకటించారు. -
మహిళలు.. ‘ఫండ్’ రాణులు!
అన్ని రంగాల్లోనూ ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న మగువలు... స్టాక్ మార్కెట్లోనూ తగ్గేదేలే అంటూ ‘బుల్’ రైడ్ చేస్తున్నారు. లక్షల కోట్ల రూపాయల విలువైన మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలో ఇన్వెస్టర్ల నిధులను పక్కాగా నిర్వహిస్తూ ఫండ్ మేనేజర్లుగా సత్తా చాటుతున్నారు. తాము ఇంటినే కాదు.. అవకాశమిస్తే, ఫండ్ హౌస్‌లను కూడా మగాళ్లకు దీటుగా చక్కబెట్టగలమని నిరూపించుకుంటున్నారు. మహిళల నిర్వహణలో ఉన్న ఫండ్ ఆస్తులు ‘ఇంతింతై.. అన్నట్లుగా ఏడాది వ్యవధిలో రెట్టింపై రూ.13.45 లక్షల కోట్లకు ఎగబాకడం విశేషం!! అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎంఎఫ్ రంగంలో రాణిస్తున్న అతివలపై స్పెషల్ ఫోకస్... దేశంలో మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ దూకుడు లాగే.. మహిళా ఫండ్ మేనేజర్లు కూడా జోరు పెంచారు. ఈ ఏడాది జనవరి నాటికి వారి సంఖ్య 49కి పెరిగింది. ఏడాది క్రితం ఉన్న 42 మందితో పోలిస్తే కొత్తగా ఏడుగురు జతయ్యారు. ఇదే కాలంలో మగ ఫండ్ మేనేజర్లు ఇద్దరు మాత్రమే పెరగడం గమనార్హం. ఇక మగువల నిర్వహణలో ఉన్న ఫండ్ ఆస్తులు కూడా రూ.13,45 లక్షల కోట్లకు ఎగిశాయి. గతేడాది జనవరితో పోలిస్తే రెట్టింపైంది. దేశంలో ఎంఎఫ్ సంస్థల నిర్వహణలో ఉన్న మొత్తం ఆస్తులు (ఏయూఎం) రూ.67.25 లక్షల కోట్లు కాగా, ఇందులో మహిళా ఫండ్ మేనేజర్లు/కో–ఫండ్ మేనేజర్లు నిర్వహిస్తున్న అసెట్స్ విలువ 20 శాతానికి జంప్ చేసింది. అయితే, మొత్తం ఎంఎఫ్ ఫండ్ మేనేజర్లు 482 మందిలో మహిళల వాటా ఇంకా తక్కువగానే ఉన్నప్పటికీ, గత ఏడాది కాలంలో మగాళ్లతో పోలిస్తే మగువల సంఖ్య ఎక్కువగా పెరగడం ఈ రంగంలో వారి భవిష్యత్తుపై మరింత ఆశలు రేకెత్తిస్తోంది.25 ఎంఎఫ్‌లు... 339 స్కీమ్‌లు దేశవ్యాప్తంగా 25 మ్యూచువల్ ఫండ్ సంస్థల్లో అతి వలు ఫండ్ మేనేజర్లుగా రాణిస్తున్నారు. మొత్తం 339 ఫండ్ స్కీమ్‌లను మేనేజ్ చేస్తున్నారు. కాగా, 6 ఫండ్ సంస్థల్లో ముగ్గురు కంటే ఎక్కువ మహిళా ఫండ్ మేనేజర్లు ఉండగా, 6 ఫండ్ హౌస్‌లలో ఇద్దరు చొప్పున, 13 సంస్థల్లో కనీసం ఒకరు ఉన్నారు. అన్నింటికంటే ఎక్కువగా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్‌లో ఏడుగురు మహిళా ఫండ్ మేనేజర్లు రూ.2.27 లక్షల కోట్ల విలువైన 66 స్కీమ్‌లను నిర్వహిస్తున్నారు. భారత్‌లో అతిపెద్ద ఫండ్ హౌస్‌గా నిలుస్తున్న ఎస్బీఐ ఎంఎఫ్లోలో ఐదుగురు మగువలు రూ.1.88 లక్షల కోట్ల ఆస్తులను (14 స్కీమ్‌లు) మేనేజ్ చేస్తున్నారు. ఇక నిప్పన్ ఇండియా ఎంఎఫ్‌లో ఇద్దరు అతివలు రూ.1.53 లక్షల కోట్ల అసెట్లను (26 స్కీమ్‌లు) నిర్వహిస్తున్నారు.రూ.6.13 లక్షల కోట్లు ...తాజా గణాంకాల ప్రకారం దేశంలోని 49 మహిళా ఫండ్ మేనేజర్లలో టాప్–5 మగువలు మేనేజ్ చేస్తున్న ఫండ్ అసెట్స్ రూ.6.13 లక్షల కోట్లు (45.55 శాతం)గా ఉంది. ఇందులో ఎస్బీఐ ఎంఎఫ్‌కు చెందిన మాన్సి సజేజా రూ.1.41 లక్షల కోట్ల అసెట్లను నిర్వహిస్తూ.. భారత్‌లో నంబర్ వన్ మహిళా ఫండ్ మేనేజర్‌గా నిలిచారు. నిప్పన్ ఇండియా ఎంఎఫ్ కింజల్ దేశాయ్ (రూ.1.37 లక్షల కోట్ల అసెట్స్), యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ కృష్ణా ఎన్ (రూ.1.34 లక్షల కోట్లు) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ఇక ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఎంఫ్ అశ్విని షిండే 47 స్కీమ్‌లతో అత్యధిక స్కీమ్‌లను మేనేజ్ చేస్తున్న వారిలో టాప్‌లో ఉన్నారు. తర్వాత స్థానాల్లో మిరే అసెట్ ఇండియా ఎంఎఫ్ ఏక్తా గాలా (30 స్కీమ్‌లు), నిప్పన్ ఇండియా ఎంఎఫ్ కింజల్ దేశాయ్ (24 స్కీమ్‌లు) నిలిచారు. పురుషుల విషయానికొస్తే.. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఎంఎఫ్‌కు చెందిన మనీష్ బాంతియా రూ.3.49 లక్షల కోట్ల అసెట్లను మేనేజ్ చేస్తూ.. దేశంలో టాప్ ఫండ్ మేనేజర్‌గా కొనసాగుతున్నారు.ఇన్వెస్టర్లుగానూ... ఇటీవల కాలంలో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడంతో పాటు ట్రేడింగ్ చేస్తున్న అతివల సంఖ్య కూడా భారీగా పెరుగుతూ వస్తోంది. 2021 నుంచి చూస్తే ఏటా కొత్తగా 3 కోట్ల డీమ్యాట్ ఖాతాలు జతవగా.. ప్రతి నలుగురు ఇన్వెస్టర్లలో ఇప్పుడు 1 మహిళా ఇన్వెస్టర్ ఉండటం వారి జోరుకు నిదర్శనం. జనవరి నాటికి దేశంలో మొత్తం డీమ్యాట్ ఖాతాల సంఖ్య 18.8 కోట్లకు చేరుకుంది. ఇందులో దాదాపు 23.9 శాతం మహిళలవే కావడం గమనార్హం. కాగా, మ్యూచువల్ ఫండ్స్ ఫోలియోల (ఖాతాల) సంఖ్య 22.92 కోట్లకు చేరింది. 2021 మే నెలలో తొలిసారి 10 కోట్ల మైలురాయిని చేరగా.. నాలుగేళ్లలోనే దాదాపు 13 కోట్ల ఫోలియోలు కొత్తగా జతవ్వడం ఫండ్స్‌లోకి పెట్టుబడులు ఏ రేంజ్లో వచ్చి పడుతున్నాయనేందుకు నిదర్శనం. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
కష్టాన్నే నమ్ముకోవాలి
హాస్యచతురత.. సమయస్ఫూర్తి అని గూగుల్ చేస్తే సుమ కనకాల అని వస్తుందేమో! అందుకే ఇన్నేళ్లయినా ఆమె యాంకరింగ్‌కి ఆదరణ తగ్గలేదు.. తన పేరుతోనే షోలకు ఫాలోయింగ్‌ని పెంచే స్థాయికి చేరుకుంది.. ఆ తరం నుంచి ఈ తరం దాకా అందరికీ అభిమాన హోస్ట్‌గా మారిపోయింది..ఇంటర్నేషనల్ విమెన్స్ డే ఉత్సవాన ఆమె గురించి ఆమె మాటల్లోనే..‘నేను పుట్టింది కేరళలోని పాలక్కాడ్‌లో. పెరిగింది మాత్రం హైదరాబాద్‌లోనే. అందుకే చిన్నప్పటి నుంచీ తెలుగు తెలుసు. మెట్టుగూడ రైల్వేక్వార్టర్స్‌లో ఉండేవాళ్ళం. తార్నాకలోని సెయింట్ ఆన్స్ హైస్కూల్లో చదివాను. రైల్వే డిగ్రీ కాలేజ్‌లో గ్రాడ్యుయేషన్ చేశాను. తెలుగులో ఫ్లుయెన్సీ ఉండాలని మా అమ్మగారు పట్టుబట్టడం వల్ల స్కూల్లో తెలుగును సెకండ్ లాంగ్వేజ్‌గా తీసుకున్నాను. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత రైటర్స్, డైరెక్టర్స్ ద్వారా కొంత తెలుగు నేర్చుకున్నాను. తెలుగుమీద నాకు పూర్తి పట్టు రావడంలో నా భర్త రాజీవ్ హెల్ప్ కూడా ఉంది. పుట్టింట్లో ఉన్నప్పుడు మాత్రమే మలయాళం .. మిగతా అంతా తెలుగే!దూరదర్శన్ మాత్రమే.. ఈ ఫీల్డ్‌లోకి చిత్రంగా వచ్చాను. నేను చేసిన ఓ డాన్స్ప్రోగ్రామ్ నచ్చి, దూరదర్శన్ సీరియల్స్ అసిస్టెంట్ డైరెక్టర్ ఉమామహేశ్వరరావు గారు ఫోన్ చేశారు.. ‘ప్రదీప్ గారి డైరెక్షన్‌లోని ఓ సీరియల్లో మమ్మల్ని కాస్ట్ చేయాలనుకుంటున్నాం.. మీకు ఇంట్రెస్ట్ ఉందా?’ అంటూ! నాకు లేదు కానీ మా పేరెంట్స్ సరదాపడ్డారు. దాంతో ఓకే అన్నాను. అలా తెలుగు టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టాను. అప్పుడు దూరదర్శన్ చానల్ మాత్రమే ఉండేది. అందులో ఎక్కువగా సింగిల్ ఎపిసోడ్సే ఉండేవి. అందుకనే నేను సింగిల్ ఎపిసోడ్స్‌లోనే ఎక్కువగా చేశాను. కొన్ని సినిమా బేస్డ్ప్రోగ్రామ్స్కి యాంకరింగ్ కూడా చేశాను. శాటిలైట్ చానల్స్ స్టార్ట్ అవగానే పూర్తిగా యాంకరింగ్‌కి షిఫ్ట్ అయిపోయాను. ‘అంత్యాక్షరి’, ‘వన్స్ మోర్’ నుంచి ‘అవాక్కయ్యారా’,‘స్టార్ మహిళ’ లాంటి ఎన్నో షోస్‌ని హోస్ట్ చేశాను. ‘స్టార్ మహిళ’ నేను మరచిపోలేని షో. దాదాపు 12 సంవత్సరాలపాటు అయిదు వేల షోస్ చేసి లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాను. ఆ షోతో ఎంతో మంది మహిళలు తమ వ్యక్తిత్వాలతో నన్ను ఇన్స్పైర్ చేశారు. సొంత మనిషిలా ఆదరించారు. అవకాశముంటే మళ్లీ ఆ షో చేయాలనుకుంటున్నాను. తెలుగువారితో ఆ అనుబంధం రోజురోజుకీ బలపడుతోంది. జీన్స్, క్యాష్.. ఇప్పుడు ‘సుమ అడ్డా’ప్రోగ్రామ్స్‌కి దొరుకుతున్న ఆదరణే అందుకు సాక్ష్యం. ఇప్పుడు.. నా యూట్యూబ్ చానల్లో ‘చాట్ షో’ని స్టార్ట్ చేశాను. అలాగే ‘షెఫ్ మంత్ర’ అనే కొత్త షో కూడా మొదలైంది. ‘ప్రేమంటే’ అనే ఒక సినిమాలో కీ రోల్ చేస్తున్నాను. దేవాలయాల మీద ‘అవర్ టెంపుల్స్’ అనే సిరీస్ చేయాలి అనుకుంటున్నాను. టాలెంట్‌కి ఆకాశమే హద్దు. ఒక రీల్ షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే చాలు.. వైరల్ అయిపోవచ్చు. ఫోన్లలో రీల్స్‌తో ఎంటర్టైన్ అవుతున్న కాలం ఇది. కాబట్టి అందులో కూడా నా ఎంటర్టైన్మెంట్ పోర్షన్‌ను అందిస్తున్నాను. లీజర్టైమ్ దొరికితే.. వెబ్ సిరీస్, మూవీస్ చూస్తాను.నాకు అత్యంత మెమరబుల్ మూమెంట్ నా పిల్లలే! ప్రొఫెషన్‌కి సంబంధించి అయితే .. నంది అవార్డ్ తీసుకోవడం! సామాజిక బాధ్యతనూ పంచుకునేందుకు మహిళల ఆరోగ్యం, సాధికారత, అలాగే ట్రాఫికింగ్ నుంచి బయటపడ్డ అమ్మాయిల స్వావలంబన, పిల్లల ఆరోగ్యం గురించి పనిచేసే ‘ఫెస్టివల్స్ ఫర్ జాయ్’ అనే ఎన్జీవోను మూడేళ్ల కిందట స్టార్ట్ చేశాను. భవిష్యత్‌లో మరికొన్నిప్రాజెక్ట్స్ చేపట్టాలని ప్లాన్ చేస్తున్నాం. నేను నమ్మేదొక్కటే.. కష్టాన్ని నమ్ముకుంటే అవకాశాల తలుపులు తెరుచుకుంటాయి. అప్పుడు అందరూ అందరికీ ఇన్స్పిరేషన్గా నిలుస్తారు’ అంటూ ముగించారు సుమ కనకాల. బహుభాషలతో ప్రయోజనంయాంకరింగ్ పర్సనల్ క్యారెక్టర్‌కి ప్రతిబింబం లాంటిది. ఈ విషయంలో నాకున్న జోవియల్ నేచర్, సమయస్ఫూర్తి చాలా హెల్ప్ అయ్యాయి. దాంతోపాటు నాకు బహుభాషలు తెలిసుండటమూ ప్లస్ పాయింట్ అయింది. మాతృభాష మలయాళం అవడం, తమిళ్, హిందీ కూడా వచ్చి ఉండటం, ఇంగ్లిష్ లో ఫ్లుయెన్సీ వల్ల.. ఏవైనా అవార్డ్ ఫంక్షన్స్‌కి రెండు, మూడు భాషల వాళ్ళు వచ్చినప్పుడు కమ్యూనికేట్ చేయడం, వాళ్ల సినిమాల గురించి మాట్లాడటం చాలా ఈజీ అయిపోతోంది.ప్రొఫెషన్లో ఎదురయ్యే సవాళ్ళను సమయస్ఫూర్తితోనే నెగ్గుకొస్తాను. నావి ఎక్కువగా లైవ్ షోసే కాబట్టి ఎడిటింగ్‌కి స్కోప్ ఉండదు. నాకు నేనే ఎడిటర్‌గా వ్యవహరించుకోవాలి. ఆచితూచి మాట్లాడాలి. నేను నటించిన సీరియల్స్, సినిమాలు నాకు చాలా నేర్పించాయి. ఈప్రొఫెషన్కు చక్కటి బాట వేశాయి. మా అత్తగారివైపు అందరూ ఇదే ఫీల్డ్‌కు చెందిన వాళ్లవడం నాకు కలిసొచ్చింది. వర్క్, లైఫ్ బ్యాలెన్స్ సాధ్యమైంది. మా ఇంట్లో నా షోస్‌కు బిగ్గెస్ట్ ఫ్యాన్స్.. మా అత్తగారు, మా అమ్మగారు. – శిరీష చల్లపల్లి -
కోటి మంది డ్వాక్రా మహిళలకు ధోకా
నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. యావత్ ప్రపంచం మహిళల హక్కులు, ఆర్థిక స్వావలంబన, ఉన్నతి కోసం మాట్లాడుకుంటున్న తరుణంలో చంద్రబాబు సర్కారు ఏకంగా మహిళా దినోత్సవం రోజే వారి సాధికారతకు తూట్లు పొడిచింది! అక్కచెల్లెమ్మల అభ్యున్నతి కోసం ఏర్పాటైన స్త్రీ నిధి బ్యాంకును పూర్తిగా నిర్వీర్యం చేస్తూ అడుగులు వేస్తోంది. కూటమి సర్కారు కొత్త పథకాలు విద్యాలక్ష్మి, కల్యాణలక్ష్మి కోసం ఇచ్చే రుణాలను స్త్రీ నిధి బ్యాంకు నుంచి ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీంతో బ్యాంకు మనుగడే ప్రశ్నార్థకంగా మారుతోంది.అదే అంతకు ముందు గత ఐదేళ్లూ మహిళా సాధికారతే ధ్యేయంగా వైఎస్ జగన్ ప్రతి అడుగూ వేశారు. అన్ని పథకాలను మహిళల పేరిటే అమలు చేసి ఆర్థిక ఆసరా కల్పించారు. ప్రతి పథకానికి బడ్జెట్లో తగినన్ని నిధులు కేటాయించి చిత్తశుద్ధిని చాటుకున్నారు. వైఎస్సార్ కల్యాణమస్తు, షాదీ తోఫా కార్యక్రమాల ద్వారా ఏకంగా రూ.427.27 కోట్ల మొత్తాన్ని అర్హులకు పారదర్శకంగా అందించారు.సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పొదుపు సంఘాల మహిళలకు స్త్రీ నిధి బ్యాంకు ఇచ్చే రూ.4 వేల కోట్ల రుణాల్లో రూ.1,000 కోట్ల చొప్పున కళ్యాణలక్ష్మీ, విద్యాలక్ష్మీ పథకాలకు నాలుగు శాతం వడ్డీకి రుణాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. మొత్తం రుణాల్లో నాలుగో వంతు రుణాలను తక్కువ వడ్డీకి ఇవ్వడం వల్ల స్త్రీ నిధి సంస్థ ఆర్థికంగా తీవ్రంగా నష్టపోనుంది. గత ఐదేళ్లలో స్త్రీ నిధికి సంబంధించి దాదాపు రూ.4 వేల కోట్లు నిరంతరం పొదుపు సంఘాల మహిళల వద్ద రుణాలు రూపంలో ఉన్నాయి. పథకాల అమలుకు చిత్తశుద్ధితో బడ్జెట్లో నిధులు కేటాయించకుండా ఇలా అడ్డదారిలో మళ్లించడం వల్ల పొదుపు సంఘాల వ్యవస్థ దెబ్బతింటుందనే ఆందోళన మహిళల్లో వ్యక్తమవుతోంది. కళ్యాణలక్ష్మి, విద్యాలక్ష్మి పథకాలకు బడ్జెట్లో నిధులు కేటాయించకుండా మహిళలను మోసం చేసిన టీడీపీ కూటమి ప్రభుత్వం ‘స్త్రీ నిధి’ నిధులను వాడుకోవాలని నిర్ణయించింది. కోటి మందికి పైగా ఉన్న పొదుపు మహిళలకు తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చే సంస్థ నిధులను వాడుకోవడం అంటే.. ఆ మేరకు డ్వాక్రా మహిళల రుణాల లభ్యత తగ్గించడమేననే ఆందోళన వ్యక్తమవుతోంది. అత్యవసర సమయాల్లో ఆర్థిక తోడ్పాటు అందించే స్త్రీ నిధి బ్యాంకును నష్టాల ఊబిలోకి గెంటేస్తోందని, సర్కారు నిర్వాకాలతో సంస్థ మూతపడితే పేద మహిళల ఆర్థిక అవసరాలకు తోడ్పాటు కరువై దిక్కుతోచని పరిస్థితి నెలకొంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పథకాల అమలుకు బడ్జెట్లో నిధుల కేటాయింపులు లేకుండా.. స్త్రీ నిధి ద్వారా రుణాలు ఇప్పించాలన్న కూటమి సర్కారు యోచనపై అధికారులు విస్తుపోతున్నారు. 7 శాతం వడ్డీకి అప్పులు తెచ్చి... 4 శాతం వడ్డీకి రుణాలివ్వాలట! సొంత నిధులు తక్కువగా ఉండే స్త్రీ నిధి బ్యాంకు ఇతర బ్యాంకుల నుంచి ఏడు శాతం వడ్డీకి తీసుకొచ్చిన డబ్బులనే 11 శాతం వడ్డీకి పొదుపు మహిళలకు రుణంగా ఇస్తూ ఉంటుంది. ఏడు శాతానికి పైన తీసుకొనే నాలుగు శాతం వడ్డీలో రెండు శాతం వడ్డీ డబ్బులను తిరిగి గ్రామ, మండల సమాఖ్యలకు, మిగిలిన 2 శాతం వడ్డీ డబ్బులను స్త్రీ నిధి సిబ్బంది జీతాలు, సంస్థ నిర్వహణకు వినియోగిస్తుంటారు. స్త్రీ నిధి సంస్థ ఏడు శాతం వడ్డీకి తెచ్చుకుంటున్న నిధులను ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా ఆలోచన చేస్తున్న కళ్యాణలక్ష్మీ, విద్యాలక్ష్మీ పథకాల లబ్దిదారులకు నాలుగు శాతం వడ్డీకే రుణాలు ఇప్పించేలా కసరత్తు చేశారు. ఈ ప్రక్రియకు సంబంధించి ప్రణాళిక ఇప్పటికే దాదాపు కొలిక్కి వచ్చింది. అంటే మూడు శాతం చొప్పున వడ్డీ డబ్బులను స్త్రీ నిధి బ్యాంకు నష్టపోవాల్సి ఉంటుంది. ఈ పథకాలు అమలు చేయడం వల్ల స్త్రీ నిధి సంస్థకు ఆర్థికంగా వాటిల్లే నష్టానికి సంబంధించి తిరిగి చెల్లింపులు, అదనపు సాయం అందించడం గురించి ఇప్పటిదాకా ప్రభుత్వ స్థాయిలో జరిగిన కసరత్తులో ఎక్కడా కనీసం చర్చ జరగలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. పూర్తిగా స్త్రీ నిధి సంస్థ నిధులతోనే ఈ పథకాలను అమలు చేసేలా అడుగులు పడుతున్నాయి. ఒకవైపు వడ్డీకి తెచ్చుకునే డబ్బులను మరోవైపు అంతకంటే తక్కువ వడ్డీకి రుణాలుగా ఇవ్వడం ద్వారా స్త్రీ నిధి సంస్థ నష్టాల ఊబిలోకి వెళ్లి మూతపడే అవకాశం ఉంటుందని మహిళా సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. స్త్రీ నిధి బ్యాంకు నిబంధనలివీ..స్త్రీ నిధి బ్యాంకు అందించే రుణాలను పేద మహిళల కుటుంబాల జీవనోపాధుల పెంపు లేదా ఆదాయ అభివృద్ధి కార్యక్రమాల కోసమే వెచ్చించాలి. రుణాలను సద్వినియోగం చేసుకుని మహిళల ఆదాయం పెరిగేలా తోడ్పాటునివ్వాలి. స్త్రీ నిధి నిబంధనలు గాలికి.. సాధారణంగా పొదుపు సంఘాల్లో సభ్యులుగా ఉండే మహిళలు బ్యాంకు లింకేజీ కార్యక్రమంలో కమర్షియల్ బ్యాంకు ద్వారా రుణాలు పొందుతుంటారు. బ్యాంకు లింకేజీ ద్వారా మహిళలు పొందే రుణాలను మూడు నాలుగేళ్ల కాల పరిమితితో నెలవారీ కిస్తీ రూపంలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం క్యాష్ అండ్ క్రెడిట్ విధానం అమలులో ఉన్నా.. ఒక్కో సంఘం మూడు నాలుగేళ్లకు ఒకసారే బ్యాంకు లింకేజీ లోన్లు తీసుకుంటాయి. పొదుపు సంఘం ద్వారా మహిళలు ఒకసారి బ్యాంకు లింకేజీ రుణం పొందిన తర్వాత అత్యవసర సమయాల్లో స్త్రీ నిధి ద్వారా అదనపు ఆర్థిక రుణాన్ని పొందుతుంటారు. పొదుపు మహిళలకు బ్యాంకు లింకేజీ కార్యక్రమంలో రుణాలిచ్చినా, స్త్రీ నిధి ద్వారా రుణాలిచ్చినా నిబంధనల ప్రకారం ఆయా కుటుంబాల జీవనోపాధుల పెంపు లేదా ఆదాయ అభివృద్ధి కార్యక్రమాల కోసమే వెచ్చించాలి. ఆ రుణాలను ఉపయోగించుకొని తమ ఆదాయం పెంచుకోవాలి. అయితే కూటమి సర్కారు ఆలోచన దీనికి భిన్నంగా ఉంది. స్త్రీ నిధి బ్యాంకు నిబంధనలను తుంగలో తొక్కి కొత్త పథకాలకు మళ్లిస్తోంది. జగన్ హయాంలో ప్రభుత్వమే నేరుగా సాయం.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఐదేళ్ల పాటు పేద కుటుంబాల పిల్లల చదువులకు అండగా నిలుస్తూ అమ్మ ఒడి, వసతి దీవెన, విద్యాదీవెన పథకాల ద్వారా తిరిగి చెల్లించే అవసరం లేకుండా నేరుగా పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేసింది. కళ్యాణమస్తు, షాదీ తోఫా కార్యక్రమాల ద్వారా రూ.427.27 కోట్ల మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేని విధానంలో అర్హులకు అందించింది. ఎన్నికల ముందు ఎడాపెడా హామీలను గుప్పించి అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు లబ్ధిదారులంతా తప్పనిసరిగా తిరిగి చెల్లించాల్సిన రుణాల రూపంలో విద్యాలక్ష్మీ, కళ్యాణలక్ష్మీ పథకాల అమలుకు సిద్ధమైంది. ఇందుకోసం 12 ఏళ్లుగా కోటి మందికి పైగా పొదుపు మహిళల ఆర్థిక అవసరాలు తీర్చిన స్త్రీ నిధి సంస్థను బలి పెడుతోంది. స్త్రీ నిధిని నష్టాల్లోకి నెట్టి నిర్వీర్యం చేసేలా అడుగులు వేయటాన్ని మహిళా సంఘాలు, రాజకీయ వర్గాలు తప్పుబడుతున్నాయి. నిధులు మళ్లిస్తే ఊరుకోం స్వయం సహాయక సంఘాల మహిళల జీవనోపాదులను మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన స్త్రీ నిధి నిధులను ఇతర అవసరాలకు మళ్లిస్తే ఊరుకునేది లేదు. ఎన్నికల సమయంలో కూటమి పార్టీలు ప్రకటించిన కళ్యాణలక్ష్మి, విద్యాలక్ష్మి పథకాలకు ప్రభుత్వం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించాలి. ఆ పథకాల అమలుకు బడ్జెట్లో కేటాయింపులు లేకపోవడం అన్యాయం. పొదుపు మహిళల అభ్యున్నతికి ఉద్దేశించిన స్త్రీ నిధిని మళ్లించేందుకు యత్నిస్తుండటం దారుణం. దీనివల్ల పొదుపు మహిళల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. ఈ ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలి. – పి.నిర్మలమ్మ, ఐద్వా సీనియర్ నాయకురాలు, కర్నూలుస్త్రీ నిధిని మళ్లించడం దారుణం టీడీపీ కూటమి ప్రభుత్వం మహిళా సంక్షేమ పథకాలకు గండికొడుతోంది. మహిళా సాధికారిత గురించి గొప్పలు చెబుతూ కల్యాణలక్ష్మి, విద్యాలక్ష్మి పథకాలకు బడ్జెట్లో నిధులు కేటాయించకపోవటాన్ని బట్టి పాలకులకు చిత్తశుద్ధి లేదని రుజువవుతోంది. స్త్రీ నిధి బ్యాంకు రుణాలను ఇతర పథకాలకు మళ్లించే యత్నాలు సిగ్గుచేటు. ప్రభుత్వ మోసపూరిత విధానాలను మహిళలు గమనిస్తున్నారు. – ఎం.విజయ, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ప్రకాశం జిల్లా అధ్యక్షురాలు ఊరుకునేది లేదు.. కూటమి ప్రభుత్వం స్త్రీ నిధిని ఇతర పథకాలకు మళ్లిస్తే ఊరుకునేది లేదు. ఇలాంటి అనాలోచిత నిర్ణయాలతో డ్వాక్రా మహిళలకు రుణాలు తగ్గే ప్రమాదం ఉంది. బ్యాంకు నిబంధనలను తుంగలో తొక్కి అసంబద్ధ నిర్ణయాలు తీసుకోవడం సరికాదు. – చిట్టెమ్మ, డ్వాక్రా సంఘం సభ్యురాలు, చిత్తూరు జిల్లా.నిధులు కేటాయించకపోవడం దారుణం కళ్యాణలక్ష్మీ, విద్యాలక్ష్మి పథకాలకు బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం దారుణం. డ్వాక్రా మహిళల సాధికారతకు రుణాలు సమకూరుస్తున్న స్త్రీ నిధి బ్యాంకు నిధులను ఈ పథకాలకు మళ్లిస్తే డ్వాక్రా మహిళలకు సమస్యలు తప్పవు. డ్వాక్రా నిధులతో కుటుంబాలను నెట్టుకొస్తున్న పేద వర్గాల మహిళలు మళ్లీ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితిని ఈ ప్రభుత్వం కల్పిస్తోంది. డ్వాక్రా మహిళలకు స్త్రీ నిధి రుణాలు అందని పరిస్థితి ఉత్పన్నం కానుంది. డ్వాక్రా మహిళలకు ద్రోహం తలపెట్టే యత్నాలను విరమించుకోవాలి. కళ్యాణలక్ష్మి, విద్యాలక్ష్మి పథకాలకు పూర్తి స్థాయిలో నిధులు కేటాయించాలి. డ్వాక్రా మహిళలకు ఇబ్బంది లేకుండా బ్యాంకు రుణాలను సక్రమంగా అందించి ఆర్థికంగా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. – ఇ.చంద్రావతి, శ్రామిక మహిళా సంఘాల ప్రతినిధి, కాకినాడ జిల్లా -
లీడర్షిప్ కావాలి
నేను ఐపీఎస్ జాయిన్ అయినప్పుడు అంటే 1995లో పోలీస్ డిపార్ట్మెంట్లో రెండు లేదా మూడు శాతం మాత్రమే మహిళలు ఉండేవారు. ఐపీఎస్ క్యాడర్లో ఇంకా తక్కువ.. ఎంతంటే నేను ఏ పోస్ట్‌కి వెళ్లినా ఆ పోస్ట్‌లో ఫస్ట్ ఉమన్‌ని నేనే అయ్యేంత! కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. మా బ్యాచ్‌లో పదమూడు మంది మహిళలం ఉంటే ఇప్పుడు 60 మంది వరకూ ఉంటున్నారు. ఇంతకుముందు పోలీసులు అంటే కేవలం పురుషులే అన్న ఇమేజ్ ఉండేది. ఇప్పుడది మారిపోయింది. డిపార్ట్మెంట్లోని అన్ని స్థాయుల్లోకి మహిళలు వస్తున్నారు. తెలంగాణలో 33 శాతం రిజర్వేషన్ కల్పించింది ప్రభుత్వం. దాంతో మహిళల సంఖ్య పెరుగుతోంది. అందుకే ఇప్పుడు పోలీస్ అంటే మహిళలు కూడా అనే ఇమేజ్ స్థిరపడిపోయింది. పోలీస్ స్టేషన్స్‌లో సౌకర్యాలూ విమెన్ ఫ్రెండ్లీగా మారుతున్నాయి. తెలంగాణనే తీసుకుంటే.. ప్రతి స్టేషన్లో మహిళల కోసం సపరేట్ వాష్ రూమ్స్‌ని కట్టించాం. కొన్ని జిల్లాల్లో అయితే బేబీ కేర్ సెంటర్స్‌ని కూడా ఏర్పాటు చేశాం. ఈ మధ్య సైబరాబాద్ కమిషనరేట్‌లో కూడా బేబీ కేర్ సెంటర్‌ను పెట్టారు. ఇదివరకు బందోబస్త్‌లు, గణేశ్ నిమజ్జనానికి మహిళా పోలీస్‌లు డ్యూటీకి వెళితే వాష్‌రూమ్స్ ఉండక చాలా అవస్థపడాల్సి వచ్చేది. ఇప్పుడు మొబైల్ వాష్‌రూమ్స్ సౌకర్యం వచ్చింది. ఎక్కడ బందోబస్త్ ఉంటే అక్కడికి ఈ మొబైల్ వాష్‌రూమ్‌ని పంపిస్తున్నారు. ఇలా మహిళలు చక్కగా పనిచేసుకోవడానికి అనుగుణమైన వసతులు ఏర్పాటవుతున్నాయంటే మహిళల పనికి గుర్తింపు, డిమాండ్ వచ్చినట్టే కదా!దృష్టి పెడతారు.. ఏ రంగంలో అయినా ఎంతమంది మహిళలు వస్తే అంత వేగంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. మొత్తం వ్యవస్థలోనే విమెన్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఏర్పడుతుంది. అంతేకాదు లీడర్షిప్ రోల్స్‌ని పొందే అవకాశం వస్తుంది. లీడర్షిప్ రోల్స్‌లో మహిళలు ఉంటే స్త్రీల అవసరాల మీద దృష్టిపెడతారు. సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయి.చెప్పుకోదగ్గదే కానీ.. మహిళా సాధికారత సాధించాలంటే ముందు స్త్రీల హక్కుల గురించి స్త్రీలతోపాటు సమాజమూ తెలుసుకోవాలి. స్త్రీ సెకండ్ సిటిజన్ కాదు.. తోటి ΄ûరురాలే అన్న స్పృహ రావాలి. అది ఇంటినుంచే మొదలవ్వాలి. నన్ను మా బ్రదర్‌తో సమానంగా చదివిస్తేనే కదా నా ఐపీఎస్ కల సాధ్యమైంది. అలా కొడుకైనా కూతురైనా ఇద్దరూ సమానమే.. హక్కులు, అవకాశాలు ఇద్దరికీ సమానమే అనే భావన పేరెంటింగ్‌లో కనిపించాలి. తర్వాత స్కూల్లో టీచింగ్‌లోనూ భాగం కావాలి. అప్పుడే అది సమాజంలో రిఫ్లెక్ట్ అవుతుంది. స్త్రీల పట్ల గౌరవం పెరుగుతుంది. ఆడపిల్లలు చదువును నిర్లక్ష్యం చేయకూడదు. ఆర్థికస్వాతంత్య్రానికి అదే మెట్టు! కాబట్టి అమ్మాయిలు అందరూ చదువు మీద దృష్టిపెట్టాలి. ఎలాంటి టాస్క్లకైనా సిద్ధమే! ఏ రంగంలో అయినా మహిళలు శారీరక శ్రమలో కానీ.. బుద్ధికుశలతలో కానీ పురుషులతో సమంగా ఉంటున్నారు. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా! మహిళలు కదా అని తేలికపాటి టాస్క్‌లు ఇవ్వడం ఉండదు. కీలకమైన బాధ్యతలనూ అప్పగిస్తారు. నన్నే తీసుకుంటే నేను మావోయిస్ట్ ఏరియాల్లో కూడా పని చేశాను. కాబట్టి మహిళలకు సమాన అవకాశాలే ఉన్నాయి.. ఉంటాయి.. ఉండాలి కూడా!– సరస్వతి రమ -
శ్రమతోనే సక్సెస్
పూసర్ల వెంకట సింధు... ఒలింపిక్స్‌లో పతకాలు సాధించింది.కామన్వెల్త్... వరల్డ్ చాంపియన్‌షిప్‌లలో స్వర్ణాలు సొంతం చేసుకుంది.ప్రపంచవేదికల మీద దేశ పతాకాన్ని సగర్వంగా ఎగురవేసింది.భారత మాత మెడలో పతకాల హారం వేసి బంగారు సింధు అయింది.ఈ ఏడాది మహిళాదినోత్సవాన్ని శ్రీమతి సింధుగా వేడుక చేసుకుంటోంది.సాధికారత దిశగా పయనిస్తున్న మహిళలకు అభినందనలు చెప్పింది.ఈ తరంలో మహిళలు బిజినెస్, స్పోర్ట్స్‌తోపాటు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. కేవలం తమకు తాము నిలదొక్కుకోవడంతో సరిపెట్టడం లేదు, ఆ రంగంలో నంబర్ వన్‌గా నిలవడానికి శ్రమిస్తున్నారు. నంబర్ వన్ లక్ష్యాన్ని సాధిస్తున్నారు కూడా. ఈ స్ఫూర్తిని, ఇదే పంథాను కొనసాగించాలని అభిలషిస్తున్నాను. సక్సెస్‌కు దారి! ప్రతి ఒక్కరూ తమ కోసం తాము కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. వాటిని చేరుకోవడానికి తగినంత శ్రమించాలి. సక్సెస్ అనే లక్ష్యాన్ని చేరడానికి ఉన్న ఏకైక దారి హార్డ్‌వర్క్. హార్డ్‌వర్క్‌తో మాత్రమే విజయానికి చేరువ కాగలుగుతాం. అది కూడా ఒక నెల శ్రమతోనో ఏడాది శ్రమతోనో శిఖరాన్ని చేరాలని ఆశించకూడదు. కొన్నేళ్ల కఠోరశ్రమ, అంకితభావంతో శ్రమించినప్పుడే సక్సెస్ మనదవుతుంది. అయితే కొందరికి సక్సెస్ కొంత త్వరగా రావచ్చు, మరికొందరికి ఆలస్యం కావచ్చు. మన మీద మనం నమ్మకాన్ని కోల్పోకూడదు. ఆశను వదులుకోకూడదు, నిరాశపడకూడదు. మనం మనవంతుగా శ్రమిస్తూ ఉండాలి. సక్సెస్ వచ్చినప్పటి నుంచి మరింత బాధ్యతగా పని చేయాలి. సక్సెస్ అనే శిఖరాన్ని చేరాం అని రిలాక్స్ కాకూడదు. నంబర్ వన్‌కి చేరడానికి నేనలాగే కష్టపడ్డాను, కష్టపడుతూనే ఉంటాను కూడా. అమ్మానాన్న... భర్త! ఇప్పటి వరకు నన్ను, నా ఆర్థిక వ్యవహారాలను అమ్మానాన్న చూసుకునేవారు. టోర్నమెంట్‌కి తోడుగా నాన్న వచ్చేవారు. ఇప్పుడు మా వారు వస్తున్నారు. నా గురించి అన్నీ వాళ్లే చూసుకుంటారు. నా ఫోకస్ అంతా ఆట మీదనే కేంద్రీకరించడానికి తగిన వెసులుబాటునిస్తున్నారు. పేరెంట్స్ నడిపించాలి! దేశానికి కొత్తతరం క్రీడాకారులు తయారు కావాలి. క్రీడాకారులను తయారు చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. పిల్లలకు స్పోర్ట్స్ మీద ఆసక్తి ఉన్నప్పటికీ తల్లిదండ్రుల సహకారం లేకపోతే క్రీడాకారులు తయారుకారు. పిల్లలను క్రీడల దిశగా నడిపించడం పేరెంట్స్ చేతిలోనే ఉంటుంది. ఆటలు, చదువు రెండూ కీలకమే. రెండింటినీ ఎలా బాలెన్స్ చేసుకోవాలో నేర్పించగలిగింది కూడా పేరెంట్సేనని నా అభి్రపాయం. పేరెంట్స్‌కి కోరిక ఉన్నప్పటికీ పిల్లలకు ఆడాలనే ఆసక్తి లేకపోతే ఆ పిల్లలు దీర్ఘకాలం కొనసాగడం కష్టం. అలాగే ఆటల పట్ల ఆసక్తి ఉన్న పిల్లలకు పేరెంట్స్ సహకారం లేకపోతే తొలి అడుగు కూడా పడదు. అందుకే తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యం.సింధుగానే గుర్తించాలి! సమాజం నన్ను సింధుగానే గుర్తించాలి. ‘పీవీ సింధు’ అనగానే చేతిలో రాకెట్‌తో నా రూపం కళ్ల ముందు మెదులుతుంది. అలా నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాను. దేశం కోసం ఆడగలిగే స్థాయికి చేరాను. దేశం కోసం ఆడాను. దేశానికి ఎన్నో పతకాలను సాధించాను. దేశానికి గౌరవాన్ని పెంచడంలో నా శ్రమ కూడా ఉందని సంతోషపడుతున్నాను. ఈ గుర్తింపు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
సమతుల్యత సాధించాలి
‘‘ఏ రంగంలోనైనా నాయకత్వం వహించడానికి దూరదృష్టి, కొత్త ఆవిష్కరణలపై అవిశ్రాంత కృషి అవసరం. సాంకేతికతంగా వస్తున్న మార్పులను అమలు చేయడంలో, టీమ్ వర్క్‌ను బలోపేతం చేయడంలో ముందుండాలి. బలమైన నాయకులుగా ఉండాలంటే పనిలో నైపుణ్యాలతో పాటు వైవిధ్యాన్నీ పెంపొందించాలి. సక్సెస్ ఉద్దేశం ఒక్కరమే ఎదగడం కాదు, అర్థవంతమైన మార్పుతో మనతోపాటు ఉన్నవారితో కలిసి నడవడం.సమతుల్యం చేయడంలోనే సవాళ్లువైద్య రంగంలో మహిళలు అతిపెద్ద కీలక పాత్ర పోషిస్తున్నారు. అయినప్పటికీ నిత్యం సవాళ్లను ఎదుర్కొంటూనే ఉన్నారు. వృత్తిపరంగా ఎదగడంలోనూ, వ్యక్తిగత బాధ్యతలతో బాలెన్స్ చేయడం అనేది అతిపెద్ద అడ్డంకిగా మారింది. కెరీర్– ఇల్లు రెండింటినీ సమర్థంగా నిర్వహించడానికి సమాజం ఇప్పటికీ మహిళలపై చెప్పలేనన్ని అంచనాలను ఉంచుతోంది. రెండుచోట్లా మహిళలు అభివృద్ధి చెందడానికి వీలు కల్పించే వాతావరణం ఉండాలి. అలా లేకపోవడంతో ‘ఆమె సమర్ధత’కు ప్రతిబంధకాలు ఏర్పడుతున్నాయి. మన సమాజంలో మరొక సవాల్ లోతుగా పాతుకుపోయిన లింగ వివక్ష. నాయకత్వ అవకాశాలను పరిమితం చేసేది ఇదే.నాయకత్వం జెండర్‌తో కాదు సామర్థ్యం వల్లే సాధ్యం అని నిరూపించడానికి మహిళ మరింత కష్టపడి పనిచేయాలి. మహిళల అభివృద్ధి నుండి మహిళల నేతృత్వంలోని అభివృద్ధికి మరింత చురుగ్గా వ్యవహరించాలి. డెసిషన్ మేకర్స్ జాబితాలో ఎక్కువ మంది మహిళలకు స్థానం ఉండేలా చూసుకోవాలి. మిగతావాటికన్నా వైద్యరంగం భిన్నమైనది, లోతైనది కూడా. ఎందుకంటే ఇక్కడప్రాణాలను కాపాడటం, ఆరోగ్య ఫలితాలలో మంచి మార్పులు తీసుకురావడంపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. టెక్నాలజీని అందిపుచ్చుకోవడం, సరిహద్దులను దాటి ఆలోచించడం, యథాతథ స్థితి కొనసాగేలా టీమ్స్‌ను ప్రోత్సహించడం... వంటివి వేగంగా అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలో మనల్ని ముందు ఉంచుతుంది.నెట్‌వర్క్‌ను నిర్మించుకోవాలిసాధారణంగా మహిళలు రిస్క్ తీసుకొని, తమ స్థానాన్ని సాధించేందుకు వెనకాడతారు. మీ ముందు చూపును, అంతర్దృష్టిని నమ్మండి. బలమైన మద్దతునిచ్చే నెట్‌వర్క్‌ను నిర్మించుకోండి. విజయం ఎప్పుడూ ఒంటరి ప్రయాణం కాదు. మిమ్మల్ని సవాలు చేసేవారు, మార్గదర్శకులు, సహచరులు, టీమ్స్‌తో ముందుకు కదలాలి. నేర్చుకోవడాన్ని ఎప్పుడూ ఆపవద్దు. సవాళ్లను సోపానక్రమాలుగా స్వీకరించాలి. ప్రతి అడ్డంకిని నూతనంగా ఆవిష్కరించడానికి, అభివృద్ధి చెందడానికి ఒక అవకాశం అనుకోవాలి. మహిళా వ్యవస్థాపకులు పరిశ్రమలను రూపొందిస్తున్నారు, ఇది మన సమయం అని గుర్తించండి’’ అంటూ మహిళాభ్యున్నతికి మార్గదర్శకం చేస్తున్నారు డాక్టర్ సంగీతారెడ్డి. మార్పులు తప్పనిసరిరోల్ మోడల్స్ మార్గదర్శకత్వంతో పాటు అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకు వెళ్లాలి. వ్యవస్థాగత అడ్డంకులను పరిష్కరించాలి. పనిప్రదేశంలో సమాన వేతనం, నిష్పాక్షికమైన కెరీర్ పురోగతికి మద్దతు ఇవ్వాలి. ముఖ్యంగా, మహిళల అభివృద్ధి నుండి మహిళల నేతృత్వంలోని అభివృద్ధికి మారాలి. మహిళలు ఆరోగ్య సంరక్షణలో పాల్గొనేవారు మాత్రమే కాదు, భవిష్యత్తుకు చురుకైన రూపశిల్పులుగా మారాలి.– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
అప్పుడే మహిళ ఎదిగినట్లు లెక్క!: శ్రుతీహాసన్
‘‘సమస్య ఎక్కడైనా ఉంటుంది. ఎలా ఎదుర్కొంటున్నామన్నదే ముఖ్యం. సమస్యలకు భయపడి పారిపోతే ఓడిపోతాం... ధైర్యంగా ఎదుర్కొంటే గెలుస్తాం’’ అంటున్నారు శ్రుతీహాసన్. తన తల్లి సారిక సినిమాలు చేసినప్పటి పరిస్థితులను, ఇప్పుటి పరిస్థితులను పోల్చి కొన్ని విషయాలు చెప్పారు శ్రుతి. ఇంకా ‘మహిళా దినోత్సవం’ సందర్భంగా ‘సాక్షి’కి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో శ్రుతీహాసన్ చెప్పిన విషయాలు తెలుసుకుందాం.∙మీ అమ్మగారి కెరీర్‌ని చూశారు... అప్పటి ఆమె కెరీర్ పరిస్థితులను ఇప్పటి మీ కెరీర్‌తో పోల్చుకున్నప్పుడు ఏమనిపిస్తోంది? అప్పటి పరిస్థితుల గురించి అమ్మ నాతో చెప్పేవారు. ‘ఈక్వాలిటీ’ విషయంలో అప్పుడు ప్రాబ్లమ్ ఉండేదట. ఉమెన్‌కి చాలా తక్కువప్రాధాన్యం ఉండేదట. అలాగే అప్పట్లో ‘పీరియడ్స్’ గురించి బాహాటంగా మాట్లాడడానికి సిగ్గుపడేవాళ్లు. అసలు బయటకు చెప్పకూడదన్నట్లు ఉండేది. ఇబ్బందిగా ఉన్నా బయటకు చెప్పకుండా షూటింగ్ చేసేవాళ్లు. ఇప్పుడు పీరియడ్స్ ఇబ్బంది గురించి ఓపెన్‌గా చెప్పి, ఆ రోజు పని మానుకునే వీలు ఉంది.∙మరి... మీ జనరేషన్ హీరోయిన్లతో పోల్చితే అప్పటివారు ఏ విషయంలో హ్యాపీ? మాటల విషయంలో... అప్పట్లో కాస్త ఓపెన్‌గా మాట్లాడగలిగేవాళ్లు. కానీ ఇప్పుడు ఏం మాట్లాడితే ఏం వస్తుందోనని మాటలకు కత్తెర పెట్టాల్సిన పరిస్థితి. అయితే నేనలా కాదు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతాను. అది అందరికీ తెలిసిన విషయమే. సోషల్ మీడియా వల్ల ఏం మాట్లాడలేకపోతున్నారు. అన్ని కళ్లూ మనల్నే చూస్తున్న ఫీలింగ్. అంతెందుకు? పదిహేనేళ్ల క్రితం నేను కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు ఇలా లేదు. రిలాక్సింగ్‌గా ఉండేది.ఇప్పుడు ఫొటోలు తీసేసి, సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. ఆ ప్రెజర్ చాలా ఉంది. ఈ ఒత్తిడి వల్ల పబ్లిక్‌లోకి వచ్చినప్పుడు చాలామంది ఎక్కువ జాగ్రత్తగా ఉంటున్నారు. మా అమ్మ జనరేషన్లో ఉన్నంత కూల్‌గా ఉండలేని పరిస్థితి. ఇంకా చెప్పాలంటే స్కూల్ పిల్లలకు కూడా తిప్పలు తప్పడంలేదు. ‘అలా ఉన్నావు... ఇలా ఉన్నావు’ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఇలా చిన్నప్పుడే ప్రెజర్ మొదలై పోతోంది. అయితే ఇప్పటి ఈ పరిస్థితిని నేను విమర్శించడంలేదు. మార్పుని స్వీకరించడమే. ∙ఇండస్ట్రీలో ‘క్యాస్టింగ్ కౌచ్’ ఎదుర్కొన్న నటీమణులు చాలామంది ఉన్నారు... మీకు అలాంటివి? నాకలాంటి చేదు అనుభవాలు లేవు. ఒకవేళ నాకు నచ్చని పరిస్థితి ఎదురైందంటే నిర్మొహమాటంగా చెప్పేస్తాను. నా పాలసీ ఒక్కటే. నేను ఎవరినైనా ఇష్టపడితే టూ హండ్రెడ్ పర్సెంట్ ఇష్టపడతాను... నాకు కంఫర్ట్‌గా ఉన్న చోట ఉంటాను. నాకు నచ్చని చోట ఉండను... నచ్చని మనుషులను నా లైఫ్‌లో నుంచి ఎగ్జిట్ చేసేస్తాను. ఇంకో విషయం ఏంటంటే... మనకు ఏదైనా నచ్చలేదనుకోండి గొడవపడక్కర్లేదు... అరిచి చెప్పక్కర్లేదు. ‘నాకు నచ్చలేదు’ అని కూల్‌గా చెప్పి, సమస్యకు ఫుల్స్టాప్ పెట్టేయాలి. ∙మీలా చాలామంది ధైర్యంగా ఉండలేరు... నిర్భయంగా మాట్లాడలేరు... వారికి మీరిచ్చే సలహా? భయాలు వదలండి. దయచేసి మీ మనసులోని సమస్యలను బయటకు చెప్పండి. మనసులోనే ఉంచుకుంటే ఆరోగ్యం చెడిపోతుంది. మనకు ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్లతో షేర్ చేసుకోవాలి. అయితే వారికన్నా కూడా ఒక మంచి కౌన్సెలర్ అవసరం. వాళ్లయితే మన మానసిక స్థితిని బాగా అర్థం చేసుకుని సలహాలు ఇవ్వగలుగుతారు. ఫిజికల్‌గా హెల్దీగా ఉండాలంటే ‘మెంటల్ హెల్త్’ చాలా ముఖ్యం. ∙కమల్‌హాసన్‌గారి కూతురు కావడం వల్లే మీకు ఇండస్ట్రీలో ఇబ్బందులు ఎదురు కాలేదనుకోవచ్చా? బ్యాక్‌గ్రౌండ్ అనేది ప్లస్సే... కాదనడంలేదు. నాన్నగారి పేరు నాకు హెల్ప్ అయింది. అయితే శ్రుతీహాసన్ అంటే కమల్‌హాసన్ కూతురు అనే విషయాన్ని మరచిపోయేలా చేయాలి. అప్పుడే నేను సక్సెస్ అయినట్లు. నా వర్క్‌తో నేను నిరూపించుకుని నాకంటూ పేరు తెచ్చుకున్నాను. పని పరమైన ఇబ్బందులు కామన్. అలాంటివి ఎప్పుడూ మా నాన్నగారికి చెప్పలేదు. నేనే సాల్వ్ చేసుకుంటుంటాను.∙‘మహిళా దినోత్సవం’ జరుపుకుంటారా? నా ఫ్రెండ్స్‌తో ‘అన్ని రోజులూ మనవే’ అంటుంటాను. ‘మేల్ డే’ అని లేదు. మరి... ‘ఉమెన్స్ డే’ ఎందుకు? అంటే... ఇంకా స్త్రీ వెనకబడి ఉన్నట్లేనా? అలాగే ‘ఉమెన్ ఓరియంటెడ్’ సినిమా అంటారు. ‘మేల్ ఓరియంటెడ్’ మూవీ అనరు. ముందు ఈ తేడా పోవాలి. మహిళా దినోత్సవం అనేది ప్రత్యేకంగా లేని రోజున ఉమెన్ ఎదిగినట్లు లెక్క. సినిమా ఇండస్ట్రీలో టెక్నికల్ డిపార్ట్మెంట్లో మహిళలు తక్కువగా ఉండటానికి కారణం? ఒకప్పటితో పోల్చితే ఇప్పుడు మహిళల శాతం ఎక్కువే ఉంది. లేడీ టెక్నీషియన్స్ ఇంకా పెరుగుతారు. అంతెందుకు? నేను ఈ మధ్య లీడ్ రోల్ చేసిన ‘ది ఐ’ మూవీకి డైరెక్టర్,ప్రొడ్యూసర్, ఇంకా ఇతర విభాగాల్లో మహిళలే ఎక్కువ. ఆ విధంగా ఈ సినిమా నాకు స్పెషల్. -
ఎందరో మహానుభావులు
స్వాతంత్య్ర శతాబ్ది ఉత్సవాల నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలని కాంక్షిస్తున్న నేపథ్యంలో వివిధ రంగాలకు నిర్దిష్ట లక్ష్యాలు నిర్వచించుకున్నాం. ఈ లక్ష్యం నెరవేరడంలో సైన్స్ కీలకపాత్ర పోషించనుంది. అయితే, భారతీయ శాస్త్ర రంగం అక్కడక్కడ కొన్ని సంస్థల్లో కనిపించే అద్భుతంగా ఉండకూడదు. సామాజిక సమస్యల పరిష్కారానికి అన్నిచోట్లా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేలా మారాలి. ఇవన్నీ జరగాలంటే, ప్రాథమిక విద్య నుంచి స్నాతకోత్తరం వరకూ శాస్త్ర రంగంలో పెట్టుబడులు గణనీయంగా పెరగాలి. ప్రభావశీల పరిశోధనలకు ఇచ్చే ప్రోత్సాహకాలు, బహుమతులు పెరగాలి. స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేట్‌రంగంతో ప్రభుత్వ భాగస్వామ్యం, సమాజంలోని అట్టడుగు వర్గాలు ముఖ్యంగా మహిళల ప్రాతినిధ్యం పెరగాలి.హేతుబద్ధమైన, ససాక్ష్యాలతో కూడిన పరిష్కారాలను చూపడం మొదలుపెడితే ప్రజాభిప్రాయం శాస్త్రవేత్తల నిర్ణయాలతో ఏకీభవిస్తుందని కోవిడ్ సమయంలో నిరూపితమైంది. మన అభివృద్ధిని అడ్డుకునే... పరిష్కారం లేని, రిస్క్ కారణంగా ప్రైవేట్ రంగం పెట్టుబడులు పెట్టని శాస్త్రపరమైన సమస్యలపై తక్షణం ప్రభుత్వం దృష్టి పెట్టాలి.బయో–ఈ3, నేషనల్ క్వాంటమ్ మిషన్ , డీప్ ఓషన్ మిషన్ వంటివి ఇలాంటి సమస్యల పరిష్కారం దిశగా శాస్త్రవేత్తల దృష్టిని కేంద్రీకరించేందుకు ప్రయత్నించాయి. ప్రోత్సాహకరమైన విషయం ఏమిటంటే, ఈ ఏడాది బడ్జెట్లో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో చేపట్టిన కార్యక్రమాలకు కేటాయింపులు రెట్టింపు కంటే పెరగడం.దేశంలోని శాస్త్ర పరిశోధనశాలల్లో మూలనపడ్డ అద్భుతమైన ఆవిష్కరణలు ఉన్నాయడంలో నాకు ఎలాంటి సందేహమూ లేదు. ప్రోత్సాహకాల లేమితో ఇవి ముందుకు కదలడం లేదు. వాయు కాలుష్యం, నీటిలోని సీసం, ఆర్సెనిక్ విషాల ఏరివేత, వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్ కాలుష్యం, ముఖ్యంగా జలవనరులకు సంబంధించిన సమస్యలను శాస్త్ర పరిశోధన సంస్థలు కలిసికట్టుగా చేపట్టాలి. దేశ సమస్యలకు శాస్త్ర ఆధారిత పరిష్కారాలు కనుక్కునేందుకు అవసరమైన మౌలిక పరిశో ధనలకు కేంద్రం సంస్థాగత గ్రాంట్ల రూపంలో అధి కంగా సాయపడాలి. ఇదే సమయంలో అప్లికేషన్స్, వాటి వాణిజ్యీకరణ, పరిశోధనలను మరింత విస్తృత స్థాయికి తీసుకెళ్లడం వంటివి భాగస్వామ్య ఏర్పా ట్లతో ప్రోత్సహించవచ్చు. దేశంలో శాస్త్ర పరిశోధన సంస్థల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపు తున్న సంస్థలు క్రమేపీ పెరుగుతున్నాయి. టాటా గ్రూపు లాంటివి వందేళ్లుగా ఈ పని చేస్తున్నాయి. ప్రభుత్వ నిధులకు ప్రైవేట్ పెట్టుబడులు, దేశీ దాతలు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులు తోడైతే సమాజానికి ఉపయోగపడే పరిశోధనలకు ఊతమివ్వవచ్చు. మహిళలకు సముచిత స్థానం...భారతీయ మహిళలు చాలా రంగాల్లో అంతర్జాతీయ స్థాయిలో రాణించారు. పురిటిబిడ్డను కోల్పోయిన బాధ ఆనందీబాయి జోషీని ఎన్నో అడ్డంకులు అధిగమించి వైద్యశాస్త్రం చదువుకునేలా చేసింది. అది కూడా అమెరికాలోని పెన్సిల్వేనియా మహిళా కళాశాలలో. 1886లోనే ఈ ఘనత సాధించిన తొలి భారతీయ వైద్యురాలు ఆమె. దురదృష్టవశాత్తూ ఆ మరుసటి ఏడాదే ఆమె క్షయ వ్యాధికి బలైనా... ఎంతో మంది మహిళలు వైద్యం, వైద్య పరిశోధనల రంగాలను ఎంచుకునేందుకు స్ఫూర్తిగా నిలిచారు.ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి కానీ... ‘స్టెమ్’ రంగాల్లో (సైన్ ్స, టెక్నాలజీ, ఇంజినీరింగ్ అండ్ మేథమేటిక్స్) భారతీయ మహిళల భాగస్వామ్యం తక్కువ. ఈ రంగాల్లో కోర్సులందిస్తున్నసంస్థలపై ఇటీవల ఒక అధ్యయనం జరిగింది. అక్కడి బోధన సిబ్బందిలో కేవలం 16.6 శాతం మంది మాత్రమే మహిళలు. నేషనల్ ఇన్ స్టిట్యూషనల్ రీసెర్చ్ ఫ్రేమ్‌వర్క్(ఎన్ ఐఆర్ఎఫ్) జాబితాలోని టాప్ ఎనిమిది సంస్థల్లో ఇది 10 శాతానికి మించడం లేదు. ఈ మహిళల్లోనూ 26.2 శాతం మంది మాత్రమే సీనియర్ స్థానాల్లో ఉన్నారు. దీన్నిబట్టే మహిళల విషయంలో ఎన్ని అసమానతలు ఉన్నాయో అర్థమవుతుంది. మహిళలు నాయకత్వ స్థానాల్లో ఉంటే సంస్థల సమర్థత పెరుగుతుందనీ, వ్యవహారాలు పారదర్శకంగా ఉంటాయనీ, పనులు సమతుల్యతతో సాగుతాయనీ దశాబ్దాల అధ్యయనాలు చెబుతున్నాయి. దేశంలోని శాస్త్ర, వైద్య సంస్థల్లోని ఈ అసమానతలను సరిదిద్దాలంటే మొత్తం వ్యవస్థలో మార్పులు చేయాల్సి ఉంటుంది. వనరుల కేటాయింపు, టాలెంట్ మేనేజ్మెంట్, పదోన్నతులు, బదిలీల వంటిఅంశాలపై నిర్ణయాలు తీసుకునే వ్యవస్థల్లో మహిళలకు తగిన భాగస్వామ్యాన్ని తప్పనిసరి చేయాలి. అన్ని స్థాయుల్లోనూ మహిళలకు ఉద్యోగాల విషయంలో తగిన సలహాలు ఇచ్చేందుకు, శిక్షణ వంటివి కల్పించేందుకు ఏర్పాట్లు ఉండాలి. శిశు సంరక్షణ, డే కేర్ సర్వీసులు, ప్రసూతి సెలవులు, పిల్లలకు పాలు పట్టేందుకు ప్రత్యేకమైన గదులు, పని వేళల్లో వెసలుబాటు, ఇంట్లోంచే పని చేసే అవకాశాలు అన్ని స్థాయుల్లోనూ కల్పించాలి. మహిళలు మళ్లీ ఉద్యోగాల్లో చేరేందుకు ఈ చర్యలు ఉపయోగపడతాయి. వ్యవసాయం, ఆహార భద్రత, అంతరిక్ష ప్రయోగాలు, రక్షణ రంగ తయారీ, టీకాలు, వ్యాధి నిర్ధా రణ, ఫార్మా, ఐటీ వంటి అనేక రంగాల్లో భారతీయ శాస్త్రవేత్తల సామర్థ్యం, నాయకత్వం రెండింటికీ ఇప్పటికే ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది. ఈ విజయాల నుంచి స్ఫూర్తి పొందుదాం.-వ్యాసకర్త ‘ఎం.ఎస్. స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ ’ చైర్పర్సన్(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)-డా‘‘ సౌమ్య స్వామినాథన్ఆమె కోసం అతనుసందర్భంస్త్రీలు– ఎవరి నొప్పికి వారే మందు వేసుకుంటూ, ఎవరి యుద్ధం వాళ్ళే చేస్తూ, ఆకాశంలో సగాలమని నినదిస్తూ, పడుతూ, రెట్టింపు బలంతో లేస్తూ– చలిచీమల కవాతుకి అర్ధ శతాబ్ది. కడచి వచ్చిన కాలాలను ఈ మహిళా దినోత్సవం రోజున పాఠకురాలిగా తిరిగి చూడటమంటే వెన్ను నిలబెట్టిన అక్షరాలని కావిలించుకోవడం. ఎన్నెన్ని కథలు, కవిత్వాలు, నవలలు, నాటకాలు, వ్యాసాలు మీకోసం మేమున్నామని భుజంమీద చేయివేసి కన్నీరు తుడిచాయి! అక్షరాలలో దట్టించిన ధైర్యం, విశ్వాసం, విజ్ఞానం, పోరాటం నలుగడలా కమ్ముకుని స్త్రీశక్తి విస్ఫోటనమై ఎన్నెన్ని కొత్త విలువలు బారులు తీరాయి! ఇప్పటి, మునుపటి తరాల ముందుచూపు కవులకి, రచయితలకివందనాలు. ఆడపిల్లలను అమ్ముకుంటున్న రోజుల్లో, అతిబాల్య, అతివృద్ధ వివాహాల మారకంలో స్త్రీ వస్తువైన రోజుల్లో– ‘మగడు వేల్పన పాతమాట, ప్రాణసఖుడ’ని చెప్పి, ‘ఆధునిక మహిళ చరిత్ర పునర్లిఖిస్తుంద’ని నమ్మిన క్రాంతదర్శికి కృతజ్ఞతలు. ఒకటీ అరా ఘటనలు పట్టుకుని స్త్రీలు ఎంత నేరస్థులో నిరూపించడానికి వర్తమాన మీడియా ప్రయత్నిస్తున్న కాలాన– ‘స్త్రీల మీద ప్రపంచానికి యింత అపనమ్మకం గనుకనూ స్త్రీని శీలం విషయమై damn చెయ్యడమూ, గాయం చెయ్యడమూ ఇంత సులభం గనుకనూ స్త్రీ శీలం తన సొమ్మని పురుషుడు అనుకోవడం వల్లనూ స్త్రీని శిక్షించే అధికారం ప్రతి పురుషునికీఉండటం వల్లనూ స్త్రీ ఇంత మోసగత్తె అబద్ధీకురాలు ఐ జీవితమంతా నటిస్తోంద’ని స్త్రీల చెడుగు వెనుక కారణాలను బట్టబయలు చేసిన స్వేచ్చా మూర్తిని స్మరించుకుంటూ ముంజేతిపై నాలుగు ముద్దులు. స్త్రీల నవ్వు, నడక, మాట దుస్తులబట్టి ఆమెలైంగిక వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తున్న ఈ మాయదారి కాలంలో– చెడిపోయిన మనుషులను, సవతి తల్లి, కొడుకుల ప్రేమబంధాన్ని ఒప్పించేలా రాసి, ‘మనిషి నుంచి మనిషికి సాధ్యమైనంత హెచ్చు ఉపకారమూ సాధ్యమైనంత తక్కువ అపకారమూ జరిగేలా చూసు కోవడమే నీతి. తక్కిన బూటకపు నీతి నియమాలను నమ్మకండి’ అన్న భావ విప్లవకారునికి శాల్యూట్. ఉన్నదంతా కుటుంబానికి పెట్టి, అన్నిటికోసం చేయి సాచాల్సి వచ్చే స్త్రీలకి కొదవలేని మనదేశంలో– ‘అది నా ఇల్లు కాదా అని అడిగావు. అది నా ఇల్లు కాదు. ఒకప్పుడు నాదే అనుకున్నాను. ఆ ఇల్లు, మా ఆయన పెంచుకొంటున్న కుక్కదెట్లా కాదో, నాదీ అట్లానే కాదు. ఆయన కుక్కనీ అపేక్షగానే చూసుకొంటారు. నన్నూ ఆపేక్షగానే చూసుకొంటారు. అంతమాత్రాన ఆయనకులాగా మాకు ఇంటిమీద హక్కులుండవు. మేము మా బాధ్యతలు నిర్వహించడం ద్వారా ఆయన ఆపేక్షని ప్రతిఫలంగా పొందగలిగాము.అంతే!’ అని ధీమాగా చెప్పిన ఆమె కోసం ఒకఇంటిని దృఢంగా నిర్మించిన మంచి రచయితకు ధన్యవాదాలు.అరవై దాటితే ఇక జీవితం బోనస్ అంటూ స్త్రీలకి ప్రో ఏజింగ్ మెళకువలను తిరస్కరించే సమాజంలో – ‘చీకటిని చూసో, పరిసరాలలోని అపరిచితత్వాన్ని చూసో భయం వేసినప్పుడు, ఆకలితో బెంగతో జ్వరంతో జీవనలౌల్యాల తీరనిమంకుతనంతో అల్లాడినప్పుడు, ఒక్కసారి గుక్కపట్టి ఏడ్వాలనిపిస్తుంది. లాలన, రక్షణ ఇవ్వగలిగే ఒకే ఒక్క అమ్మని పిలవాలనిపిస్తుంద’ని తల్లి విలువని గుర్తించిన పసిబాలునికి కావిలింతలు. తన కుటుంబ స్త్రీలు తప్ప తక్కినవారంతా అవైలబుల్ వస్తువులుగా కనపడే మెజారిటీ మగ సమాజంలో– ‘బాగ్ ఒక మూలకి పడేసి, కుర్చీలోంచి నా కాళ్ళు తీసి అక్కడ కూర్చుని కళ్ళు మూసుకుని ‘యాభై వచ్చాయి.రెండునెలల నుంచి మెన్సెస్ రాలేదు. ఇప్పుడేమో రెండురోజుల నుంచి బ్లీడింగ్’ (I know that is not the complete story) ‘‘ఊ’’ అంటాను. ‘ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పటికి పది అయ్యింది.బ్లూ ఫిలిమ్స్ చూస్తూ కూర్చున్నాడు. ఓపిక లేదన్నా వినలేదు, బ్లీడింగ్ అవుతుందని చెబుతున్నా...’ అనేక ఆమెలపై సాగే హింసలను ఒకచోట ముద్దచేసి కళ్లముందు పెట్టుకుని ఆ నెప్పినంతా తానే తీసేసు కోవాలన్నంతగా తపించే పువ్వులాంటి మనసున్న కవికి కరచాలనం. స్త్రీల విలువను గుర్తించేవారు...ఇతర మతాలు, ఆచారాలు, అలవాట్ల పట్ల వల్లమాలిన ద్వేషాన్ని నూరిపోస్తున్న మెజారిటీ మత రాజకీయ చదరంగంలో– ‘పువ్వులు రాల్చుకునీ రాల్చుకునీ/ నన్ను కాడగా మిగిల్చావు/ ఇంకా ఏం మిగిలిందని/ ఈ కంకాళంపై కారుమబ్బు కప్పి నడిపిస్తున్నావు/ నా ముఖానికి వేలాడేసిన నఖాబ్/ ఎత్తి చూశావా ఎన్నడైనా/ నా కళ్లు/ రెండు అమాస చంద్రుళ్లను మోస్తుంటాయ్’ అంటూ స్వజనులు చూపే వివక్షని నిలదీసిన సాహసికి సలాములు. స్త్రీలు, తాము ఎవరిని ఎపుడు పెళ్లి చేసుకోవాలో సొంతంగా నిర్ణయం తీసుకోగల హక్కుని నిరాకరించే కుటుంబాలున్న సామాజిక చట్రంలో– ‘మీ ఊరికి మా వాడకి మధ్య ఎద్దుతునకల దండెం కడదాం /కాస్త మీ ఇంట్లో ఉన్న జంధ్యం తీసుకు రారాదూ /కులం గీతలు దాటిన ప్రేమలు చంపబడుతున్న చోట /పారుతున్న నెత్తుటి ప్రవాహంలో నిలబడి అడుగుతున్నా/ రావే పిల్లా రా/ హద్దులన్నీ చెరిపేసి/ సరిహద్దులు లేని సమాజంలోకి నడుద్దా’మంటూ స్త్రీలు కులాలు దాటగలరని నమ్మి, చేయందించిన ప్రేమికునికి వందనం. కొందరుంటారు, తమ ఆధిపత్యాలకి తామే గండికొట్టుకుని చుట్టూ తనకలాడుతున్న ఆరాట పోరాటాలతో మమేకమయ్యేవారు. కొందరున్నారు తమ జీవితాల్లో మేలిమి భాగమైన స్త్రీల విలువని గుర్తించి అక్షరాలలో నిలబెట్టినవారు. వారందరి తపనని, ప్రేమని, అక్కరని, బాధ్యతని గుర్తు చేసుకుంటూ, అభినందిస్తూ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.-వ్యాసకర్త ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఏపీ కార్యదర్శిmalleswari.kn2008@gmail.com-కె.ఎన్. మల్లీశ్వరి -
అంతర్జాతీయ మహిళా దినోత్సవం: అద్భుతమైన సందేశం
ప్రపంచ వ్యాప్తంగా.. వివిధ రంగాలలో మహిళలు సాధించిన విజయాలకు గుర్తుగా, వారిని గౌరవించడానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని (International Women’s Day) జరుపుకుంటారు. ఈ సందర్భంగా గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ 'ప్రియాంక చిగురుపాటి' (Priyanka Chigurupati) ఓ సందేశాన్ని ఇచ్చారు.మహిళా దినోత్సవం అనేది.. ఒక వేడుక కంటే ఎక్కువ. ఇది ప్రతి మహిళలో దాగి ఉన్న శక్తిసామర్త్యాల జ్ఞాపకం. మన దేశంలో మహిళా వ్యవస్థాపకులు కేవలం వ్యాపారాలను మాత్రమే కాకుండా.. భవిష్యత్తులను రూపొందిస్తున్నారు. నేడు స్టాక్ మార్కెట్లోకి కొత్తగా అడుగుపెడుతున్న నలుగురు వ్యక్తులలో ఒకరు స్త్రీ కావడం గమనార్హం, గర్వించదగ్గ విషయం. ఇది కేవలం గణాంకాల కోసం చెప్పుకునే సంఖ్య కాదు.. వారు సొంతంగా నిలబడుతున్నారు అనేదానికి నిదర్శనం అని ప్రియాంక అన్నారు.మహళలు పురోగతి సాధించాలంటే.. ఒంటరి ప్రయత్నం కాకుండా, సమిష్టిగా కృషి చేయాల్సి ఉంటుంది. ఇది వ్యవస్థాగత అడ్డంకులను ఛేదించడానికి, ఆర్థిక.. వృత్తిపరమైన అభివృద్ధికి, స్త్రీ సామర్థ్యాన్ని గుర్తించడానికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.గ్రాన్యూల్స్.. నిజమైన సాధికారత పని ప్రదేశానికంటే ఉత్తమంగా ఉంటుంది. మహిళలను నాయకులుగా, ఆవిష్కర్తలుగా, సమాజంలో మార్పు తీసుకొచ్చేవారిగా అభివృద్ధి చెందే పర్యావరణ వ్యవస్థలను రూపొందించడమే కంపెనీ ఉద్దేశ్యం. వీరు శాస్త్రీయ పురోగతులను నడిపిస్తున్నా, విజయవంతమైన సంస్థలను నడుపుతున్నా లేదా ఆర్థిక భవిష్యత్తును రూపొందిస్తున్నా వారిని ఇంకా అభివృద్ధి చెందేలా చేయాలి. దీనికోసం మహిళా దినోత్సవం నుంచే పాటు పడాలని చెప్పారు. -
వారిని సోషల్ మీడియాకు ఎడిక్ట్ చేయాలని..
అనాదిగా స్త్రీ ఒక ప్రకృతి శక్తిగా, ఉత్పత్తి పరికరాల సృష్టికర్తగా, చరిత్ర నిర్దేశకురాలుగా ఉంది. పితృస్వామ్య ఆధిపత్యం వచ్చేవరకూ ఆమెది విజయ గమనమే. మానవజాతి శైశవ దశలో తన సంతానాన్ని కాపాడుకోవటానికి కాయలు, దుంపలు, పళ్ల లాంటి ఆహార సేకరణలో తల్లే ప్రధాన పాత్ర వహించింది. ఇప్పటికీ ఆహార సేకరణ దశలో ఉన్న జాతుల్లో మాతృస్వామ్యం అమలులో ఉంది. నిప్పు ఉపయోగాన్ని తెలుసుకున్న కాలంలో, జలచరాలైన చేపలు, పీతలు, నత్తలు (Snails) తినే కాలంలో, నదీ తీర నాగరికతలను రూపొందించే కాలంలో స్త్రీ శ్రమయే కీలకం. వేటాడి తెచ్చిన మాంసాన్ని వండవలసిన అవసరాన్ని కూడా స్త్రీయే ముందుగా గమనించి ఉంటుంది. శరీరాన్ని కప్పుకోవాలనే ఆలోచన, కట్టుకోవటానికి చెట్టు బెరడును ఉపయోగించాలనే ఆలోచన స్త్రీకే వచ్చి ఉంటుంది. కుండను చేయడం ద్వారా నీటిని, ధాన్యాన్ని నిలవచేయడం, నేలలో విత్తునాటడం ద్వారా ఆహార సృష్టి... ఇలా నూత్న జీవన వ్యవస్థలను ఆమె సృష్టిస్తూ వెళ్ళింది.సింధు నాగరికతలో స్నాన వాటికలు ప్రసిద్ధంగా విలసిల్లాయి. వీటి ప్రభావం తరువాత ఆర్యుల సంస్కృతి మీదా కనిపిస్తుంది. ఆ తరువాత దేవాలయాలకు అనుబంధంగా ఉమ్మడి స్నానఘట్టాలు రూపొందాయి. వీటి వద్ద అప్సరసలు లేదా జల దేవతలు ఉంటారని ఆనాడు నమ్మేవారు. ఈ స్నానఘట్టాల నిర్మాణంలో స్త్రీ ప్రాధాన్యత, స్త్రీ ఉమ్మడి తత్వానికి సంబంధించిన సంస్కృతి దృగ్గోచరమవుతుంది. మాతృభావన వీరి మతపరిణామ క్రమంలో ఆనాటికే రూపుదిద్దుకొని వున్నదని చెప్పటానికి మొహంజెదారో, హరప్పా లలో దొరికిన ఫలకాలు బలమైన ఋజువు అని పురావస్తు శాస్త్రజ్ఞుడు సర్ జాన్ మార్షల్ పేర్కొన్నారు. ప్రాచీన భారతీయులు స్త్రీ మూర్తిని (ప్రకృతి మాతగా) ఆరాధించినట్టు సింధూ లోయలో దొరికిన విగ్రహాలను బట్టి తెలుస్తుంది. ఇటువంటి ప్రతిమలే మెసపటోమియా, పశ్చిమాసియా, ఆసియా మైనర్లోనూ లభించాయి. స్త్రీమూర్తి ఆరాధన సింధూ లోయ (Indus Valley) నుంచి నైలునది వరకు వ్యాపించి వున్నట్లు భావించవచ్చు.కానీ ఆ తరువాత అనేక పరిణామాలు భారతదేశంలో చోటు చేసుకుంటూ వచ్చాయి. ముఖ్యంగా మనుస్మృతి భావజాలం వల్ల స్త్రీ అణచివేత బహుముఖంగా ప్రారంభమైంది. ధర్మ సూత్రాలు స్త్రీ వ్యక్తిత్వానికి సంకెళ్ళు వేశాయి. స్త్రీ విద్య నిరోధానికి గురైంది. మనుస్మృతి (Manusmriti) క్రీ.పూ. రెండవ శతాబ్దిలో రాయబడి ఉంటుందని అంబేడ్కర్ అన్నారు. బౌద్ధయుగం అంతరించి హిందూ రాజ్యాలు ఆవిర్భవించే క్రమంలో పుష్యమిత్ర దీన్ని బ్రాహ్మణ రాజ్య నిర్మాణానికి సాధనంగా వాడుకున్నారు. వర్ణవ్యవస్థ పునరుద్ధరణ, స్త్రీ అణచివేత ఇందులో ప్రధానమైన అంశాలుగా ముందుకు వచ్చాయి.కొనసాగాల్సిన పోరాటం వీటన్నింటిని ఎదుర్కొంటూ స్త్రీ యుగ యుగాల ప్రస్థానం కొనసాగిస్తూ వచ్చింది. అనేక అవాంతరాలను అధిగమించి జీవన గమనంలో కొత్త పుంతలు తొక్కింది. ఆమెను అణగదొక్కడం పురుషుని వల్ల కాదు అని తెలుసుకోవడానికి చాలాకాలం పట్టింది. ఎందుకంటే ఆమె విద్యుల్లత. ఆమె ప్రకాశానికి తట్టుకోలేక పురుషుడు ఆమెకు సంకెళ్ళు బిగించాడు. ఆమె ఆ సంకెళ్ళను పటాపంచలు చేసి ముందుకు వెళుతోంది. స్త్రీకి శరీర సౌందర్యమే కాదు, మనో సౌందర్యమూ ఉంది. ఆమె మనస్సు వెన్నకంటే మెత్తనిది. ఆమె హృదయ వాది. ఆమె హృదయము లోతైనది. సూర్యగోళాలను, చంద్ర గోళాలను మనము పరిశీలించవచ్చు కాని స్త్రీ అంతరంగాన్ని అందుకోగలిగిన శక్తి ఇంకా పురుషుడికి రాలేదు. ఆ విషయంలో పురుషుడు అబలుడు. ఆమె అమ్మే కాదు, గొప్ప నాయకురాలు. భారత రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్ము త్రివిద దళాల సైనిక వందనాన్ని స్వీకరించారు. భారతదేశ కళాత్మక దృష్టి ఎంత గొప్పదో ద్రౌపదీ ముర్ము ఒక గిరిజన స్త్రీగా అత్యున్నత సింహాసనాన్ని అధిష్ఠించి నిరూపించారు.‘ఆడపిల్ల గడప దాటకూడదు’ అనే భావాలు పాతవైనాయి. ఆడపిల్లలు దేశాంతరాలకు వెళ్ళి చదువుకొంటున్నారు. పిల్లల్ని పెంచే విధానంలో చాలా మార్పులు వచ్చాయి. ఈనాడు స్త్రీలలో వస్తున్న గుణాత్మకమైన మార్పు ‘నేను సంపాదిస్తూ బతకా’లనే అంశం. కేవలం గృహిణిగా ఇంట్లోనే ఉండటానికి స్త్రీ ఈనాడు ఇష్టపడటం లేదు. ఈ మార్పులన్నీ రావడానికి ఎన్నో ఉద్యమాలు జరిగాయి. మహారాష్ట్రలో సావిత్రిబాయి ఫూలే, జ్యోతిరావు ఫూలే, అంబేడ్కర్ ఉద్యమాలు; బ్రహ్మసమాజం, ఆర్య సమాజాలు చేసిన పోరాటాలు, తమిళనాడులో పెరియార్ రామస్వామి నాయకర్ చేసిన పోరాటం, కేరళలో నారాయణ గురు చేసిన విద్యా పోరాటం... ఇవన్నీ స్త్రీల అభ్యున్నతికి మార్గం వేశాయి. చదవండి: ఆకాశంలో సగమైనా.. వివక్షేనా?అయినప్పటికీ స్త్రీలు పితృస్వామ్య ఆధిపత్యానికి ఎదురీదుతూనే ఉన్నారు. వారిని వస్తు వ్యామోహితులుగా మార్చాలనీ, సోషల్ మీడియాకు ఎడిక్ట్ చేయాలనీ ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. గృహహింస పెరుగుతోంది. బాల్య వివాహాలు ఆగడం లేదు. కొడుకుతో సమానంగా కూతురికి ఆస్తి ఇవ్వడం ఆచరణలో అమలు కావడం లేదు. రాజకీయాల్లో స్త్రీలను అవమానించే ధోరణులు పెరుగు తున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో పాలకవర్గాలు, పితృస్వామ్య ఆధిపత్యాలను కొనసాగిస్తున్నాయి. వీటన్నింటిని స్త్రీలు ఎదుర్కొనే క్రమంలో ఇంకా పోరాటాన్ని చేయాల్సి ఉంది. ఇది మహిళా సాధికారతా యుగం. ఈ యుగ స్ఫూర్తిలో భాగంగా మనమూ నడుద్దాం. తల్లిని, చెల్లిని, సహచరిణిని, తోటి స్త్రీని గౌరవిద్దాం. వారి చైతన్యానికి తోడు నిలబడదాం. అదే నిజమైన రాజ్యాంగ స్ఫూర్తి.- డాక్టర్ కత్తి పద్మారావు దళితోద్యమ నాయకులు -
International Women's Day 2025: హోమ్ మేకర్‌కు వేతనమేదీ?
ప్రతీ ఏడాది మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం (International women's day) జరుపుకుంటాం. వివిధ రంగాల్లో మహిళలు సాధించిన విజయాలను గుర్తించి సెలబ్రేషన్స్ జరుపుకుంటారు. అలాగ ప్రపంచంలో మహిళలు ఎదుర్కొంటున్న వివక్షతను, సవాళ్లపై విస్తృతంగా చర్చించడం వాటి పరిష్కారానికి తీసుకోవలసిన చర్యలపై సమాలోచన చేయడం. మహిళా సాధికారత, హక్కులు, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రాజకీయ సహకారాలపై అవగాహన కల్పించడమే దీని లక్ష్యం. ప్రతి ఏడాదీ లాగానే ఈ ఏడాది యాక్సలరేట్ యాక్షన్(Accelerate Action) అనేథీమ్తో మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. మహిళా సాధికారతకు, అభివృద్ధికి తోడ్పడూ వ్యూహాలు, వనరులు, చొరవలను గుర్తించి వేగంగా అమలు చేయాలనేది దీని ఉద్దేశం. ఈ సందర్బంగా ఎమ్.డి. మునీర్, సీనియర్ జర్నలిస్ట్ ప్రత్యేక వ్యాసం.ప్రపంచంలో కోట్లాది మంది గృహిణులకు వేతనం ఎందుకు ఉండ కూడదు అనే విషయం ప్రస్తుతం చర్చానీయాంశం అయింది. చైనాలోని బీజింగ్‌లో ఒక విడాకుల కేసులో కోర్టు గత ఏడాది ఇచ్చిన తీర్పు ఈ చర్చకు దారితీసింది. అయితే ఇంటిపనులు, పిల్లల పెంపకం – సంరక్షణ లాంటివి చూసే గృహిణులకు జీతాలు ఎవరు ఇవ్వాలి అనేదే సమస్య! పురుషుల కన్నా 3 నుంచి 4 గంటలు ఎక్కువ పనిచేస్తారు గృహిణులు. వంట చేయడం, ఇంటిని, వంట సామగ్రిని శుభ్రం చేయడం, పిల్లలు, భర్త, ఇతర కుటుంబ సభ్యుల బట్టలు ఉతకడం వంటి పనులే కాక... తల్లి, భార్య, సోదరి పాత్రల్లో ఎన్నో బాధ్యతలు నిర్వహిస్తుంది. అందుకే ఆమెకు జీతం ఇవ్వాలనే డిమాండ్ ఊపందుకుంటోంది.తమిళనాడులో గృహిణికి వేతనం అంశం సినీనటుడు కమల హాసన్ తన పార్టీ మేనిఫెస్టోలో పెట్టారు. ఇది కూడా గత ఏడాది పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. బీజింగ్ కోర్టు తన తీర్పులో 5 సంవత్సరాలు భర్తతో ఉండి ఇంటి పనులు చూసుకున్నది కాబట్టి, తన కెరీర్‌ను కోల్పోయింది కాబట్టి, రూ. 5 లక్షల పైచిలుకు పరిహారం జీతం కింద ఇవ్వాలని పేర్కొంది. ఈ తీర్పును ప్రపంచం మొత్తంలో 60 కోట్లకు పైగా జనం సోషల్ మీడియాలో చూశారు. గ్రామీణ మహిళ ప్రతి రోజు 14 గంటలు పనిలో ఉంటుంది. గ్రామీణ పురుషులతో పోలిస్తే 2.5 గంటలు ఇది ఎక్కువ అని పరిశోధకులు అంటున్నారు. ఉద్యోగం చేసే పురుషుల కన్నా మహిళల పని నాలుగింతలు ఎక్కువ. ఇంత చేస్తున్నా గుర్తింపు, ఆదాయం లేకపోగా వేధింపులు, అత్యాచారాలు, హత్యా చారాలు. క్రిమినల్ జస్టిస్ వైఫల్యం వల్ల దేశంలో ఆడబిడ్డలపై గృహహింస పెరుగుతోంది. హోమ్ మేకర్లకు జీతం వస్తే... పురుషుల ఆలోచనా విధానంలో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. గృహిణికి కుటుంబంపై ఆధారపడకుండా ఆర్థిక స్వేచ్ఛ లభిస్తుంది. రక్షణకు... ఒక గ్యారంటీ, నమ్మకం ఏర్పడుతుంది. కుటుంబంలో గౌరవం దక్కుతుంది. -
ఆకాశంలో సగమైనా... వివక్షేనా?
కశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా... అత్యాచారాలకు గురైన శవాలు. మనువాదం, ఫాసిజం, పితృస్వామ్యం దేశంలో నలుదిశలా ఊరేగు తున్నాయి.’ ‘ముళ్ళపొదల్లో ఓ ఆడ శిశువు... చెత్త కుండీలో మరో ఆడ శిశువు... ఇద్దరూ అప్పుడే భూమి మీద పడిన పసికూనలు.’ఇలాంటి వార్తలు నిత్యం వస్తుంటాయి. ఎన్నో అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు వస్తున్నాయి, పోతున్నాయి. కానీ మహిళల సామాజిక స్థితిగతుల్లో మార్పు రావటం లేదు. ఈ పరిస్థితుల్లో ఈ ఆజాదీ ఎవరిది అన్న ప్రశ్న వస్తుంది. రోజురోజుకూ స్త్రీలపై హింస, వివక్ష రకరకాల రూపంలో పెరిగిపోతూ ఉంది. ఇలా ఎందుకు జరుగుతోంది? ముందు తరాల వారికి హింస లేని సమాజాన్ని అందించ లేమా? ఆకాశంలో సగమైన స్త్రీలు శ్రమ, ఉత్పత్తిలో సగానికి తక్కువ ఏమీ కాదు. కానీ తాను పూర్తిగా పరా ధీనగా జీవిస్తోంది భారత స్త్రీ.స్త్రీలు ఎప్పుడూ మగవాడి కను సన్నుల్లో జీవించాలి. చిన్నప్పుడు తండ్రి, పెళ్లి తర్వాత భర్త, ముసలితనంలో కొడుకుల అధీనంలో జీవించాలి. ఇలా స్త్రీలను బందీని చేయటం ఈ సమాజం మొదటి నేరం. ఇక ‘కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ’ అంటూ స్త్రీలను పురుషునికి సొంత ఆస్తిగా మలి చారు. ఇలా భూస్వామ్య, పితృ స్వామిక సంస్కృతిని వ్యవస్థీకృతం చేశారు. ఈ పరిస్థితి మారాలి. రాజ్యాంగంలోని 14, 15, 16 తదితర అధికరణాలు లింగ వివక్షకు వ్యతిరేకంగా రూపొందించబడ్డాయి. అలాగే అనేక చట్టాలు చేయబడ్డాయి. కానీ అమలుకు నోచుకోని కారణంగా స్త్రీలపై కుటుంబ, లైంగిక హింస రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. స్త్రీలకు ఆర్థిక స్వాతంత్య్రం, స్వేచ్ఛ, స్వావలంబన లేకపోవడం (ఆర్థిక పరాధీనత) అసమానత, వివక్షలకు మూలం. దీనికి కారణం భూస్వామిక పితృస్వామ్యమే. ఇక పెట్టుబడిదారీ సంస్కృతి మహిళల శరీరాన్ని వ్యాపార వస్తువుగా మార్చివేసింది. 1961లో వరకట్న నిషేధ చట్టం చేసినప్పటికీ, వరకట్నం గౌరవంగా అమలు చేయ బడుతోంది. ఆడ శిశువులను గర్భంలోనే చంపుతున్నారు. ఫలితంగా దేశంలో స్త్రీల జనాభా తగ్గిపోతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే తరం మూల్యం చెల్లించక తప్పదు. 1991 నుంచి దేశంలో ప్రపంచీకరణ దశ మొదలై పాశ్చాత్య విష సంస్కృతి పెచ్చరిల్లి స్త్రీ శరీరం సరుకుగా, అంగడి బొమ్మగా, విలాస వస్తువుగా మార్చబడింది. ఫలి తంగా స్త్రీలపై లైంగిక హింస పెరిగి పోయింది. ఈ విష సంస్కృతి కారణంగా మన దేశంలో ప్రతి గంటకు ఐదుగురిపై అత్యాచారాలు జరుగు తున్నాయని గణాంకాలు చెబుతున్నాయి.మహిళల సమస్యలు చర్చించుకొని, పరిష్కరించుకోవడానికి చట్ట సభలలో కనీసం స్త్రీలకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఏనాడూ పార్లమెంట్లో మహిళా ప్రతినిధులు 15 శాతానికి మించి లేరు. సామాజిక పరిణామంలో మొదట స్త్రీలకు మంచి గౌరవం ఉండేది. మాతృస్వామ్య వ్యవస్థే ఇందుకు ఉదాహరణ. ఆ తర్వాత వ్యక్తిగత ఆస్తి,వర్గ సమాజం ఏర్పడ్డాక స్త్రీలకు ఆస్తి హక్కు లేకుండా పోయింది.దీంతో స్త్రీలకు విలువ పోయి, వంటింటి కుందేలు అయిపోయింది. స్త్రీల దోపిడీకి, వివక్షకు మూలం పెట్టుబడిదారీ మార్కెట్ ఉత్పత్తి విధానం. తీవ్ర ఆర్థిక అసమానతలతో కూడిన ఈ విధానం నశించాలి. సోషలిజం రావాలి. ఇదే స్త్రీల విముక్తికీ, అన్ని సామాజిక సమస్యల పరిష్కారానికీ మార్గం.– ఎల్. గజేంద్రమ్మ, ఉపాధ్యాయురాలు ‘ 97054 93054 -
మహిళా దినోత్సవం– పుష్ప విలాసం
అనేక దేశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మహిళలకు ఇచ్చే పువ్వులుప్రాంతాలను బట్టి మారుతూ ఉంటాయి. ఈ పువ్వులలో ఎక్కువప్రాచుర్యం పొందింది... యెల్లో మిమోసా. మహిళలకు యెల్లో మిమోసా పువ్వులను బహుమతిగా ఇచ్చే సంప్రదాయం ఇటలీలో ఉంది. సున్నితత్వాన్ని, బలాన్ని సూచించే యెల్లో మిమోసాను ఇటాలియన్ ఫెమినిస్ట్‌లు మహిళా హక్కుల ఉద్యమానికి చిహ్నంగా ఎంచుకున్నారు. మార్చి ప్రారంభంలో మిమోసా వికసిస్తుంది కాబట్టి వారు ఈ పువ్వును ఎంచుకున్నారు. -
సక్సెస్ 'కీ' పవర్ డ్రెస్సింగ్
పవర్ డ్రెస్సింగ్ అనేది ఫ్యాషన్ ఎంపికలను అధిగమిస్తుంది. ఇది స్వీయ అవగాహన, వృత్తిపరంగా తమను తాము చూపాలనుకునే విధానాన్ని ప్రభావితం చేస్తుంది. సరైన దుస్తులు మానసిక కవచంగా పనిచేస్తాయి. మహిళలు కార్పొరేట్ రంగంలోకి ప్రవేశించడం, వృత్తినైపుణ్యాలను ప్రదర్శించడం, గౌరవాన్ని పొందడం లక్ష్యంగా పవర్ డ్రెస్సింగ్ ఉద్భవించింది.1920లలో జాకెట్, స్కర్ట్‌తో మహిళల పవర్ డ్రెస్సింగ్ వెలుగులోకి వచ్చింది. ఇది మహిళల దుస్తులు ధరించే విధానంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. సౌకర్యం విషయంలో రాజీపడకుండా ఆధునికంగా కనిపించడానికి వీలు కల్పించింది. పనిలో లింగసమానత్వాన్ని ప్రోత్సహించడానికి ఇది ఒక ముఖ్యమైన అడుగు. ‘విజయం కోసం డ్రెస్సింగ్’ అనడానికి నిదర్శనంగా ఇంటర్నేషనల్ ఉమెన్ డ్రెస్సింగ్ బ్రాండ్ ‘క్వా’ ఒక ఆన్లైన్ పోల్ నిర్వహించింది. ఇందులో 100 మంది మహిళల్లో 99 మంది పవర్ డ్రెస్సింగ్ వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తెలిపారు.వృత్తికి తగిన డ్రెస్సింగ్ఉపాధ్యాయులు, వైద్యులు, రాజకీయ నాయకులు, ఐఎఎస్ అధికారులు, ఆర్కిటెక్ట్‌లు, కార్పొరేట్ లీడర్లు, వ్యాపార మహిళలు, ఆర్థిక నిపుణులు వంటి విభిన్న స్థాయిలలో పనిచేసే మహిళలకు పనిజీవితంలో సౌకర్యాన్ని, నమ్మకాన్ని ఇచ్చే వర్క్‌వేర్ అవసరం. ఒక కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ శక్తిని వెలికితీసేందుకు ప్యాంటుతో పాటు డిజైనర్ బ్లేజర్‌ను ధరిస్తారు. ఒక రాజకీయ వ్యక్తి పరిపూర్ణతకు అనుగుణంగా చీర లేదా కుర్తాను ధరించవచ్చు. టీచర్ లేదా డాక్టర్ తమ వృత్తినైపుణ్యానికి రాజీ పడకుండా తమ పనిని నిర్వహించడానికి సౌకర్యవంతమైన కుర్తా లేదా ఇండో–వెస్ట్రన్‌ను ఎంచుకోవచ్చు. విధి నిర్వహణలోని మహిళలు భారతీయ ప్రింట్లను ఆధునిక కట్లతో కలిపే దుస్తులను ధరించడానికి ఇష్టపడతారు. ఈ కాంబినేషన్ కూడా ప్రత్యేకంగా ఉంటుంది.పవర్ డ్రెస్సింగ్‌కి ప్రేరణ కోసం...→ వృత్తికి అనుగుణమైన దుస్తులు ధరించాలి. అప్పుడు పనితీరులో కూడా మెరుగుదల ఉంటుంది → పర్యావరణ స్పృహతో కూడిన ఫ్యాషన్‌ని అనుసరించడం మేలు. కాలర్ బ్లౌజ్‌లు, ఫంక్షనల్ పాకెట్స్, తక్కువ జ్యువెలరీ... వీటిలో ప్రధానమైనవి → డ్రెస్ నాణ్యత, ఫిటింగ్ మీరు హుందాగా, శక్తిమంతంగా ఉన్నారని తెలియజేస్తుంది → ఎవరికి వారు ఓన్ స్టైల్‌ను అభివృద్ధి చేసుకోవాలి. తమ డ్రెస్సింగ్ ద్వారా తమని తాము వ్యక్తీకరించుకోవడమూ అవసరమే. రంగులతో ప్రయోగాలు, ఫిట్‌గా ఉండే దుస్తుల ద్వారా మీరేమిటనేది చాటవచ్చు → ప్యాంట్ సూట్స్, కో–ఆర్డ్ సెట్స్, మిడీస్, జాకెట్స్.. ఇలా ఏ డ్రెస్ ఎంపిక అయినా ఇస్త్రీ చేసిన దుస్తులను ధరించండి. లేత రంగులు, తక్కువ ఆభరణాలతో సింపుల్‌గా ఉండేలా చూసుకోండి.సందర్భానికి తగిన ఎంపికలుభారతీయ వనిత హుందాతనానికి, మనదైన సంస్కృతికి, చక్కదనానికీ బహుముఖాల డ్రెస్సింగ్ శైలులను ఎంచుకుంటోంది. సందర్భానికి తగిన ఎంపిక ఇప్పుడు సాధారణంగా ఉంటోంది..డ్రేపింగ్ శైలులతో ఎవర్‌గ్రీన్‌గా నిలుస్తూ మహిళను పవర్ ఫుల్‌గా చూపుతోంది చీర. మన దేశీయ చేనేతలైన కంచి, బనారసి, చందేరీ, పోచంపల్లి, నారాయణపేట్, ధర్మవరం, ... ఇలా మనదేశంలో ఒక్కో ప్రాంత ప్రత్యేకతను, భారతీయ సంస్కృతిని ప్రపంచానికి ఘనంగా చూపుతున్నాయి. ఈ చేనేతల కట్టుతో మన మహిళలు తమ హుందాతనాన్ని ప్రపంచానికి చాటుతున్నారు.సల్వార్ కమీజ్భారతీయ మహిళల ఫార్మల్ దుస్తులలో మరొక ప్రధానమైనది సల్వార్ కమీజ్. సౌకర్యం, శైలి రెండింటినీ ఈ డ్రెస్ అందిస్తుంది. అధికారిక కార్యక్రమాలు, పార్టీలకు అనుకూలంగా ఉంటుంది. క్లిష్టమైన ఎంబ్రాయిడరీ అలంకరణతో వెలిగే అనార్కలీ సూట్లు గొప్పగా వెలుగుతుంటే, మరోవైపు స్ట్రెయిట్కట్ సూట్స్ ్ర΄÷ఫెషనల్ లుక్‌ని అందిస్తున్నాయి. ఆఫీస్‌వేర్‌గానూ, సంప్రదాయం, అధునిక మినిమలిజం మధ్య సమతుల్యతను అందిస్తున్నాయి.ఇండో– వెస్ట్రన్ ఫ్యూజన్భారతీయ దుస్తులలో అంశాలను పాశ్చాత్య సిల్హౌట్‌లతో మిళితం చేయడం దీని ప్రత్యేకత. ఆధునిక అభిరుచులకు అనుగుణంగా ప్రత్యేకమైన, స్టైలిష్ దుస్తులను సృష్టిస్తాయి. కుర్తా, పలాజో సెట్ అందుకు ఒక ఉదాహరణ. సాంస్కృతిక కార్యక్రమాలకు ఉల్లాసభరితంగానూ, అనువైనదిగానూ నిలిచింది ధోతీ ప్యాంట్‌ను కుర్తాతో జత చేయడం.వెస్ట్రన్ గౌన్లు పాశ్చాత్య శైలి దుస్తులలో ప్రధానంగా చెప్పుకునేవి గౌన్లు. అధికారిక కార్యక్రమాలలో గణనీయమైన ప్రజాదరణ పొందాయి. ఎ–లైన్ గౌన్లు, ఫ్యూజన్ టచ్ కోసం భారతీయ మోటిఫ్స్, ఎంబ్రాయిడరీతో ఇవి పార్టీలు, అధికారక విందులు, సమావేశాలలో ఈవెనింగ్ గౌన్లు అద్భుతమైన ఎంపికను అందిస్తున్నాయి. సిల్క్, శాటిన్ లేదా వెల్వెట్ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన గౌన్లపై బీడ్‌వర్క్, స్వీక్వెన్లు కలిగి మహిళ చక్కదనానికి, ఆధునికతకు అద్దం పడుతూ రిచ్ లుక్‌ను ఇస్తున్నాయి. ఫార్మల్ వేర్మన దేశం ఉష్ణమండలం అవడం వల్ల సౌకర్యం కోసం ఖాదీ, కోటా డోరియా వంటి కాటన్స్‌ను ఎంచుకుంటున్నారు. వీటిమీద ఎంబ్రాయిడరీలు, టై అండ్ డైలు, పెయింటింగ్‌లా ఉన్నవాటితో తమని తాము కొత్తగా ఆవిష్కరించుకుంటున్నారు.ఇతర అలంకారాలకూ...మ్యాచింగ్, ఎంబ్రాయిడరీ, సందర్భానికి తగిన విధంగా దుస్తుల ఎంపిక ఎలా ఉంటుందో, అలాగే ఫుట్‌వేర్ ఎంపిక కూడా ముఖ్యమైన జాబితాలో ఉంది. బంగారు, వజ్రాలు, కుందన్, పోల్కీ.. ఆభరణాలు సంప్రదాయ దుస్తులకు, ఆక్సిడైజ్డ్ ఆధునిక దుస్తులకు ఎంపికగా మారాయి. ఇండో–వెస్ట్రన్ శైలులు ఆభరణాల జాబితాలోనూ ప్రథమంగా ఉంటోంది. రీసైక్లింగ్ బెస్ట్ ఛాయిస్టెక్స్టైల్ ఇండస్ట్రీలో సస్టెయినబుల్, ఇండియన్ ఆర్ట్, ఇండియన్ టెక్స్టైల్, కెమికల్ ఫ్రీగా ఉండే హ్యాండ్లూమ్స్ని మహిళలు ఇష్టపడుతున్నారు. పవర్‌లూమ్స్, సింథటిక్స్ని దూరం పెడుతున్నారు. అంతర్జాతీయంగానూ ఎక్స్పరిమెంటల్ ప్యాషన్లోనూ రీ సైక్లింగ్ మీద దృష్టి ఎక్కువ ఉంటుంది. పాత కాలం నాటి బామ్మల పట్టుచీరలను కూడా తిరిగి ఉపయోగిస్తున్నారు. కట్ సిల్టౌట్స్, ఎంబ్రాయిడరీలో థ్రెడ్ వర్క్.. వంటి పాత కాలం స్టైల్స్ ఎంచుకుంటున్నారు. ఉదాహరణకు.. పాత బనారసి, పాత కంచి శారీస్‌ను తీసుకొని ప్యాచ్‌వర్క్‌తో మరో కొత్త డిజైనర్ శారీని తయారుచేస్తున్నారు. ఇండో–వెస్ట్రన్స్ విషయంలో చూస్తే రీ సైక్లింగ్కి బాగా డిమాండ్ ఉంది. ఉన్న వాటినే రీ క్రియేట్ చేస్తున్నారు. అమ్మమ్మ, అమ్మల చీరలను ఇన్నోవేషన్‌గా రీ సైక్లింగ్ చేయించుకొని తమ పెళ్లిళ్లకు ధరిస్తున్నారు. ఒక డ్రెస్‌ను పది మోడల్ డ్రెస్సులుగా ధరిస్తున్నారు. ప్రకృతి పట్ల బాధ్యతగా ఉండేది మహిళలే కాబట్టి. ఈ అవగాహన మహిళల నుండి వచ్చిందే. నార్త్ ఇండియన్స్ కూడా పాత చీరలు, వస్త్రాలతో ప్యాచ్‌వర్క్ చేసి బ్యాగ్స్, ఫుట్‌వేర్, క్విల్ట్‌లను సృష్టిస్తున్నారు. ఇది ఇంకా విస్తృతం అవుతుంది. మా దగ్గర పాతికమంది మహిళలు మేం ఉపయోగించగా మిగిలిన వేస్ట్ ఫ్యాబ్రిక్స్‌తో టాజిల్స్, రిబ్బన్స్, పౌచ్‌లు, జ్యువెలరీ, బ్యాంగిల్స్ తయారు చేసి అమ్ముతున్నారు. ఇవి ఇండోవెస్ట్రన్ ఔట్‌ఫిట్స్‌కు స్టైలిష్ లుక్‌నిస్తాయి. యువతరం, మహిళల ఆలోచనలకు తగినట్టుగా కెమికల్ ఫ్రీగా ఫ్యాషన్ ఇండస్ట్రీ తయారు కావడం ముదావహం. ‘పవర్ డ్రెస్’నుచూపినవారిలో...∙భారతదేశపు మొట్టమొదటి మహిళా ఫొటోజర్నలిస్ట్ హోమై వ్యారవల్లా. బ్రిటిష్ కాలం నుండి కొత్తగా స్వతంత్రదేశంగా మారడాన్ని డాక్యుమెంట్ చేయడంలో ప్రసిద్ధి చెందారు. గుజరాత్ రాష్ట్రంలో పుట్టిన ఆమె పార్సీ సమాజానికి చెందింది. తన వృత్తికి తగినట్టుగా హై రౌండ్ నెక్ బ్లౌజ్, లేతరంగు కాటన్ చీరలను ధరించేవారు. గౌన్లు, పలాజో ప్యాంట్లు ధరించి ఆమె తనదైన స్టైల్ స్టేట్మెంట్ను సృష్టించారు → నేతలలో తలమానికమైన ఇందిరాగాంధీ నేత చీరల కట్టు ఇప్పటికీ ఆమె ఆహార్యాన్ని కళ్లకు కడుతుంది. పాలిటిక్స్‌లో తన చీరకట్టు, హెయిర్ స్టైల్‌తో పవర్ఫుల్ ఐకాన్‌గా నిలిచారు. ఒక నిర్దిష్ట సందేశాన్ని ఇవ్వడానికి డ్రెస్సింగ్‌ని ఒక శక్తిమంతమైన మాధ్యమంగా ఉపయోగించారు. ఆమె చూపిన మార్గంలో చాలామంది మహిళా రాజకీయ వేత్తలు నేత చీరలను ధరించడం చూస్తున్నాం → సినీతారలు సందడి చేసే ఈవెంట్లను చూస్తే తమదైన స్టైలింగ్ డ్రెస్సులతో ఆకట్టుకునే తారలు ఎందరో. వారిలో ఎవర్‌గ్రీన్‌గా నిలిచే బాలీవుడ్ నటి రేఖతోపాటు దీపికా పదుకొనే, ప్రియాంకా చోప్రా, కరీనా, సోనమ్ .. వంటి తారలు ఏ ఈవెంట్లోనైనా తమ స్టైల్స్టేట్మెంట్ను చూపుతుంటారు. ఇటీవల నీతాఅంబానీప్రాచీన కళకు, రిచ్లుక్కి ఐకాన్‌గా మారడం గమనిస్తున్నాం. -
కుటుంబాలను నడిపిస్తోంది మహిళలే : గో డాడీ అధ్యయనం...
భారతీయ మహిళలే చిన్న తరహా వ్యాపారాల (Indian Female Small Business Owners) ద్వారా తమ కుటుంబాలను నడిపిస్తున్నారు. తమ చిన్న వ్యాపారాలకు మరింత శక్తిని అందించేందుకు కృత్రిమ మేధస్సు (ఏఐ) స్వీకరణకు కూడా సై అంటున్నారు. సాంకేతిక సేవలకు పేరొందిన గోడాడీ (GoDaddy) సంస్థ నిర్వహించిన తాజా గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సర్వే ఈ విషయాన్ని వెల్లడించింది. మహిళలు స్థిరత్వంతో విజయాన్ని పునర్నిర్వచించు కుంటున్నారని, కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి, వ్యాపార అవకాశాలు ఆవిష్కరణల కొత్త శకానికి ప్రేరణనిచ్చేందుకు సాంకేతికతను ఉపయోగిస్తు న్నారని వెల్లడించింది. లఘు, చిన్న తరహా వ్యాపారాలలో పావు వంతు (27%) కంటే ఎక్కువ మహిళల యాజమాన్యంలో ఉన్నాయని అధ్యయనం తేల్చింది, వీటిలో 74% సాంకేతికత విస్తరించిన గత ఐదు సంవత్సరాలలోనే తమ వ్యాపారాన్ని ప్రారంభించినట్లు కూడా తెలిపింది. మహిళలు తమ సొంత వ్యాపారాలను నడపడమే కాదు, అచంచలమైన విశ్వాసంతో రాణిస్తున్నారు. ప్రతీ ఐదుగురిలో నలుగురు (79%) తమ వ్యాపారాలు వచ్చే సంవత్సరంలో పెద్ద, మెరుగైన వనరులు కలిగిన కంపెనీలతో పోటీ పడటానికి ఏఐ సహాయపడుతుందని ఆశిస్తున్నారు. ఉదాహరణకు, భారతీయ మహిళలు ఏఐఆర్వో వంటి ఏఐ సాధనాలను ఉపయోగించడం ద్వారా వారానికి 12 గంటలు ఆదా చేస్తున్నారని కూడా వెల్లడైంది.. సృజనాత్మక ఆలోచనలతో ముందుకు రావడానికి 63%మంది, కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి లేదా ప్రస్తుత వాటిని మెరుగుపరచడానికి 55%మంది వ్యాపార భవిష్యత్తును ప్లాన్ చేయడానికి 46% మంది సమయం వెచ్చిస్తున్నారు.చదవండి: ప్రముఖ గాయనితో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వివాహం, ఫోటోలు వైరల్ -
డైరెక్టరవుదామనుకుని : మహిళా సినిమాటోగ్రాఫర్ సక్సెస్ స్టోరీ
మేము సైతం అంటూ అనేక రంగాల్లో మహిళలు దూసుకుపోతున్నారు. తమ ప్రతిభను చాటుకుంటున్నారు. ఆకాశంలో సగం.. అవకాశాల్లోనూ సగం అంటూ తమ టాలెంట్‌ను నిరూపించుకుంటున్నారు. ముఖ్యంగా పురుషులకే పరిమితం అని భావించే రంగాల్లో ప్రవేశించి ప్రతిభకు జెండర్‌తో సంబంధం లేదని నిరూపిస్తూ అద్భుతమైన విజయాలు సాధిస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కెమెరా మహిళగా వెండి తెరపై అడుగు పెట్టి, బెస్ట్ సినిమాటోగ్రాఫర్‌గా పేరు తెచ్చుకున్న ఒడిశాకి చెందిన ఫల్గు సత్పతి గురించి తెలుసుకుందాం. దశాబ్దానికి పైగా ఈ వృత్తిలో కొనసాగుతూ తన క్రియేటివిటీతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.ఫల్గుకి ఒడిస్సీ నృత్యం అంటే చిన్నప్పటినుంచీ ఇష్టం ఏర్పడింది. అయిదేళ్ల వయస్సులోనే తల్లి ప్రోత్సాహంతో ఒడిస్సీ నేర్చుకుంది. గురువు పల్లవి దాస్ వద్ద శిక్షణ పొందింది. అనేక ప్రదర్శనలిచ్చింది. నృత్యాకారిణిగా రాణించింది. దీంతో పాటు, బాల్యంనుంచే నాటకాల పట్ల ఆకర్షితురాలైంది. బాలనటిగా, బిజయ్ మొహంతి, తాండ్రా రే వంటి అనుభవజ్ఞులతో కలిసి దూరదర్శన్‌లో నటించింది. కనిపించాను. ఈ సందర్భంలోనే వెండితెర వెలుగుల వెనుక ఇంకా చాలామంది ఉంటారని గమనించింది. సినిమాలంటే ఇష్టంగా మారింది. అమ్మమ్మ ఒడియా సినిమాలు చూడటానికి థియేటర్స్‌కి వెళ్లేది. కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా , ప్రతీ అంశాన్ని విమర్శనాత్మకంగా పరిశీలించేది ఫల్గు. ఒకసారి అనుకోకుండా 'కరణ్ అర్జున్' చూసి దర్శకత్వంపై మోజు పెంచుకుంది.ఈ క్రమంలో ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూట్ BPFTIO (బిజు పట్టనాయక్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఒడిశా)గురించి అక్కడ దీనికి సంబంధించిన కోర్సులో చేరాలని ప్రయత్నించింది. కానీ సెలెక్ట్ కాకపోవడంతో సినిమాటోగ్రఫీలో చేరేలా చేసింది. ఎందుకంటే దర్శకుడు తర్వాత కెమెరామన్ పనితీరు అత్యద్భుతమని ఆమె నమ్మకం. అయితే, ఇక్కడ చదువుకుంటున్న క్రమంలో , సినిమా తీయడం వెనుక చాలా మంది నిపుణులు, కష్టపడి పనిచేసే వ్యక్తులు ఉన్నారని ఫల్గు గుర్తించింది. ఇక్కడ చదువు పూర్తైన తరువాత, కాలేజీలో తన సీనియర్ దగ్గర తొలుత ఒక రియాలిటీ షోకి పనిచేసింది. తర్వాత సుశాంత్ మణి, శుభ్రాంశు దాస్‌లాంటి పేరెన్నికగన్న ఛాయాగ్రాహకులతో కలిసి వర్క్ చేసింది.తొలి ప్రాజెక్ట్‌తోనే ప్రశంసలుఫల్గు తొలి స్వతంత్ర ప్రాజెక్ట్ , ఒడియా చిత్రం 'పుష్కర. డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ (DOP) గా ఎన్నో ప్రశంసలు అందుకుంది. ఇంకా శిక్షా మండల్, ఫౌజీ కాలింగ్ (హిందీ ఫీచర్ ఫిల్మ్) , దివానా దివానీ, హలో ఇన్ లవ్, సపనార పాథే పాథే', 'లవ్ యు జెస్సికా', 'ము తారా కియే' వంటి ఒడియా చిత్రాలకు అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్‌గా కూడా పనిచేసింది. అనేక రియాలిటీ షోలకు వెబ్ సిరీస్‌లకు కూడా సహాయ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసింది.'బెటర్ హాఫ్' అనే మరాఠీ చిత్రానికి వర్క్ చేసింది. ఫల్గు కెమెరా పనితనానికి నిదర్శనంగా ‘పడే ఆకాశ’ ఈ మహిళా దినోత్సవానికి విడుదల కానుంది. దివ్యాంగుల హక్కుల కోసం వీల్ చైర్ నుంచే అలుపెరుగని పోరాటం చేస్తున్న ఒడియా మహిళ డా. శ్రుతి మహాపాత్ర జీవితం ఆధారంగా తెరకెక్కిందీ సినిమా. అంతేకాదు ఒడియాలో మంచి హిట్ సాధించిన పుష్కర మూవీకి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన ఘనత కూడా ఫల్గుదే కావడం విశేషం. ఇన్స్టిట్యూట్లో పరిచయమైన నటుడు హరా రాత్ని 2013 లో వివాహం చేసుకుంది.ఆకాశమే హద్దు..‘‘మహిళ సినిమాటోగ్రఫీ అనే ఈ వృత్తిని ఎంచుకోవడం అంత సులభం కాదు. శారీరకంగా , మానసికంగా చాలా కష్టపడాలి. కానీ జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే, పోరాడాలసిందే. ఈ విషయంల అత్తమామలు నా కుటుంబం మద్దతు చాలా ఉందని తెలిపింది. ఫల్గు. సమాజంలోని కట్టుబాట్ల నుంచి అమ్మాయిలను విముక్తి పొందనివ్వాలి. గొప్పగా ఆలోచించి, విజయాలు సాధించేలా వారిని ప్రోత్సహించాలి. ఈ ప్రపంచంలో ఏదీ తమ జీవితాల్లో విజయం సాధించకుండా ఆపదని అమ్మాయిలు గ్రహించాలి. ఆకాశమే హద్దు అనే దృఢ సంకల్పంతో ఎదగాలి’’ అంటుంది ఫల్గు. కెరీర్‌కు సంబంధించి మనం ఏ సినిమాకు పనిచేస్తున్నాం అన్నది ఎంత ముఖ్యమో, ఎవరితో కలిసి పనిచేస్తున్నాం అన్నదీ అంతే ముఖ్యం అంటుంది. -
International women's day 2025: ఈ నెల 9న రన్ ఫర్ హర్
మాదాపూర్: మహిళలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ఈ రన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వివైబ్ సీఈవో రఘవీణసజ్జ తెలిపారు. మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో బుధవారం రన్ ఫర్ హర్ పేరిట పరుగు నిర్వహించనున్న కార్యక్రమానికి సంబందించిన వివరాలను విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 9వ తేదీన రన్‌ఫర్ హర్ కార్యక్రమాన్నినిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమాన్ని మంత్రి సీతక్క ప్రారంభిస్తారని తెలిపారు. ఈ రన్‌కు సంబందించిన బ్రోచర్, టీషర్టు, మెడల్స్‌ను ఆవిష్కరించారు. ఇందులో 3కె, 5కె, 10కె విభాగంలో ఈ పరుగును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాయదుర్గంలోని నాలెడ్జీ సిటీ పార్కు వద్ద పరుగును ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. 200 మందికి పైగా వైద్యులు, వివిధ రంగాలకు చెందిన నిపుణులు, మహిళలు, పురుషులు, చిన్నారులు పాల్గొననున్నట్టు తెలిపారు.డబుల్స్ డైవ్ చాలెంజ్‌కు పదేళ్లు సాక్షి, సిటీబ్యూరో: సింక్రోనీ ఆధ్వర్యంలో నిర్వహించే ‘డబుల్స్ డైవ్ చాలెంజ్’ పది సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా సింక్రోనీ బృందం ఆధ్వర్యంలో ప్రత్యేక వేడుక నిర్వహించారు. నగరంలోని నోవోటెల్ హెచ్ఐసీసీ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో సింక్రోనీ సంస్థకు చెందిన దాదాపు 500 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. తమ ‘డబుల్స్ డైవ్ ఛాలెంజ్’లో భాగంగా.. ఉద్యోగులు పేద విద్యార్థుల విద్యకు అవసరమైన వనరులను రూపొందించడంతో పాటు వారి సృజనాత్మకతకు సహకారం అందిస్తారని సింక్రోనీలో ఇ–చాట్ వైస్ ప్రెసిడెంట్, సెంట్రల్ రీజినల్ ఎంగేజ్మెంట్ హబ్ లీడర్ రాజ్ కోలా తెలిపారు. యూ అండ్ ఐ ట్రస్ట్ ప్రయత్నంలో భాగంగా హ్యాండ్‌మేడ్ బుక్మార్క్లు, ఆకర్షణీయమైన పద శోధన మెటీరియల్స్‌తో పాటు విజ్ఞాన అంశాలను పెంపొందించే చాట్బోర్డులు, పుస్తకాలను అందిస్తామన్నారు. నిర్మాణ్ సంస్థ సహకారంతో ప్రాణాలను రక్షించే నైపుణ్యాలపై అవగాహన కల్పిస్తామని, ఇందులో సీపీఆర్, ప్రథమ చికిత్స శిక్షణ తదితర అంశాలున్నాయని పేర్కొన్నారు. ఈ విధంగా ఒక జట్టుగా పదేళ్ల పాటు కృషి చేయడం అభినందనీయమని వివరించారు. మహిళామణుల ఆరోగ్యం కోసం..సాక్షి, సిటీబ్యూరో: అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో ఖైరతాబాద్‌లోని జలమండలి కార్యాలయంలో మహిళా ఉద్యోగుల కోసం బుధవారం ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రి, జలమండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరాన్ని వాటర్‌బోర్డు ఎండీ అశోక్‌రెడ్డి ప్రారంభించారు. వంద మందికిపైగా మహిళా ఉద్యోగులు పాల్గొని పరీక్షలు చేయించుకున్నారు. వైద్యులు వీరికి బీపీ, షుగర్, ఈసీజీ, కంటి చూపు, దంత పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో కిమ్స్ ఆసుపత్రి వైద్యురాలు డా.ఎం.మాధవి, ఫైనాన్స్ సీజీఎం కేదారేశ్వరి, జలమండలి ఉమెన్స్ మినిస్టీరియల్ స్టాఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షురాలు శైలజ, జనరల్ సెక్రటరీ బిల్కిస్ భాను తదితరులు పాల్గొన్నారు. ఆర్ట్ ఫర్ హోప్ సామాజిక మార్పు కోసం కళను సాధనంగా మార్చాలనే సందేశంతో హ్యుందాయ్ మోటర్ ఇండియా ఫౌండేషన్ ‘ఆర్ట్ ఫర్ హోప్’ పేరిట ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ విషయాన్ని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. దీని ద్వారా 50 మంది ప్రతిభావంతులైన కళాకారులను ఎంపిక చేస్తున్నామని, వీరికి రూ.60 లక్షల మొత్తం గ్రాంట్‌గా అందిస్తున్నామన్నారు. ఎంపికైన చిత్రకారుల కోసం దేశ రాజధానిలో భారీ ప్రదర్శన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. -
గృహ సామ్రాజ్యానికి మహారాణి..!
ఒక ఉత్తమ సమాజ స్థాపనకు వెన్నెముక కుటుంబం కనుక పురుషుడు బయటి సామ్రాజ్యానికి అధిపతి అయితే స్త్రీని ఆ గృహ సామ్రాజ్యానికి మహారాణిగా చేసింది ఇస్లాం. పిల్లల ఆలన భర్త పాలన చేస్తూ, ఎలాంటి ఆర్థిక బాధ్యతలు లేకుండా స్త్రీని మినహాయించింది. ఏ విషయంలోనూ ఆడపిల్లను తక్కువగా చూడరాదని, మగపిల్ల వాడిని అధికుడిగా చూడరాదనీ, ఇద్దరిపట్ల సమానమైన ప్రేమను చూపించాలనీ, భ్రూణ హత్యలను నిషేధిస్తూ ఆడపిల్లను అన్యాయంగా హతమార్చితే కఠిన శిక్షకు గురవుతారని హెచ్చరించింది. తల్లి పాదాల చెంత స్వర్గం ఉందని ప్రకటించి స్త్రీ జాతి ఔన్నత్యాన్ని పతాక స్థాయికి చేర్చిన ఘనత ఇస్లాం ధర్మానికే దక్కుతుంది.1400 సంవత్సరాలకు పూర్వమే స్త్రీలకు ఓటు హక్కును కల్పించి, తన తండ్రి, భర్త, పిల్లల ఆస్తిలో వాటాను కల్పిస్తూ, ఆమెకు ఆస్తిహక్కును ప్రకటించింది. వివాహ విషయంలో తనకిష్టమైన వరుడిని ఎంపిక చేసుకునే విషయమై ఆమె సమ్మతి తీసుకోవాలనీ, దుర్మార్గుడైన భర్త నుండి ‘ఖులా‘ అనే ప్రక్రియ ద్వారా విడిపోయి తనకు తానుగా జీవించే హక్కును కలిగి ఉండడమే కాక పునర్వివాహం చేసుకునే హక్కునూ ప్రసాదించింది. కనుకనే తనకన్నా వయసులో 15 ఏళ్ల పెద్దదైన హజరత్ ఖదీజా అనే వితంతువును పాతికేళ్ల నిండు యవ్వనంలో వివాహమాడి స్త్రీ జాతి కీర్తిని సమున్నత స్థాయికి చేర్చారు ప్రవక్త ముహమ్మద్ (సం). స్త్రీ సహ ధర్మచారిణి అంటూ మీరు తిన్నదే ఆమెకు తినిపించండని సమాజానికి హితవు పలికారు. విద్యనభ్యసించడం స్త్రీ పురుషుల విధి అని విద్యనభ్యసించడాన్ని ప్రోత్సహించడమే కాక, సమాజానికి స్ఫూర్తిదాయకమైన స్త్రీ మూర్తులను అందించింది ఇస్లాం. ఇస్లామీయ చరిత్ర లో హజరత్ ఆయిషా (ర) ప్రముఖ విద్వాంసురాలిగా, హజరత్ షిఫా(ర) ప్రముఖ గైనకాలజిస్టు గా, హజరత్ ఖదీజా(ర )అంతర్జాతీయ స్థాయిలో వ్యాపారవేత్తగా సమాజానికి అమూల్యమైన సేవలందించారు. ప్రముఖ మేధావి ఫాతిమా అల్ ఫహ్రీ మురాకోలో స్థాపించిన ‘అల్ ఖరావీన్’ యూనివర్సిటీ ప్రపంచంలోనే అతి పురాతన విశ్వవిద్యాలయంగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ లో నమోదయ్యింది. హదీసు విద్యావేత్తలలో మహిళా ఉపాధ్యాయులుగా పేరుగాంచి ఇస్లామీయ చరిత్రకు వన్నెతెచ్చిన వనితలు కోకొల్లలు. మహిళలు తమ కార్య పరిధిలో ఉంటూనే మౌలికమైన బాధ్యతలతో పాటు సమాజంతో చక్కటి బాంధవ్యాన్ని ఏర్పరచుకోగలరనే స్ఫూర్తినిచ్చింది ఇస్లాం ధర్మం..– బతూల్ హుమైర్వీ(చదవండి: -
కార్మిక శక్తిలో 70 శాతం మహిళలే
న్యూఢిల్లీ: 2047 నాటికి వికసిత్ భారత్ (అభివృద్ధి చెందిన దేశం) లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర కార్మిక శాఖ కార్యదర్శి సుమితా దావ్రా ప్రకటించారు. అప్పటికి శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని 70 శాతానికి పెంచనున్నట్టు చెప్పారు. సేవల రంగంలో మహిళల ప్రాతినిధ్యంపై సీఐఐ నిర్వహించిన సదస్సులో భాగంగా ఆమె మాట్లాడారు. కొన్ని రంగాల్లో మహిళలు మరింత పెద్ద ఎత్తున పాలుపంచుకునేందుకు గొప్ప అవకాశాలున్నట్టు చెప్పారు. జాతీయ విద్యా విధానం కింద మహిళల విద్యార్హతల పెంపుపై దృష్టి సారించాల్సి ఉందన్నారు. మహిళల ఆధ్వర్యంలోని స్టార్టప్‌లు, సంస్థలకు వెంచర్ క్యాపిటల్ మద్దతుకు పిలుపునిచ్చారు. ‘‘మహిళా వ్యాపారవేత్తలకు వెంచర్ క్యాపిటల్ మద్దతు ఎంతో కీలకం. వారు నాయకులుగా మారేందుకు, నిర్ణయాలు తీసుకునేందుకు మార్గదర్శకం అవసరం’’అని సుమిత దావ్రా పేర్కొన్నారు. వివక్ష ..శ్రామికశక్తిలో మరింత మంది మహిళలు భాగస్వాములు కాకుండా వివక్ష వారిని అడ్డుకుంటున్నట్టు సుమితా దావ్రా పేర్కొన్నారు. వేతనం, నాయకత్వ బాధ్యతల్లో, ఉద్యోగ భద్రతలో అసమానతలు ఉన్నట్టు చెప్పారు. అయితే గడిచిన ఆరేళ్లలో ఆరి్థక కార్యకలాపాల్లో మహిళల పాత్ర పెరిగినట్టు చెప్పారు. అలాగే, విద్యావంతులైన మహిళలు ఉద్యోగాల్లో చేరడంలో, స్థిరమైన ఆర్జనలోనూ పురోగతి ఉన్నట్టు వివరించారు. ‘‘టెక్నాలజీ, ఫైనాన్స్ రంగాలతోపాటు తయారీలోనూ మహిళలు రాణిస్తుండడాన్ని చూస్తున్నాం. మహిళలకు సంబంధించి వర్కర్ పాపులేషన్ రేషియో (డబ్ల్యూపీఆర్) గత ఆరేళ్లలో రెట్టింపైనట్టు డేటా తెలియజేస్తోంది’’అని సుమితా దావ్రా చెప్పారు. హిందుస్థాన్ జింక్‌లో 30 శాతం మహిళలే 2030 నాటికి తమ కంపెనీ ఉద్యోగుల్లో 30 శాతం మహిళలే ఉండాలన్న లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఉన్నట్టు వేదాంత గ్రూప్ కంపెనీ హిందుస్థాన్ జింక్ (హెచ్‌జెడ్‌ఎల్) ప్రకటించింది. ప్రస్తుతం హిందుస్థాన్ జింక్ ఉద్యోగుల్లో మహిళలు 25% ఉన్నారు. -
ఒక ఆలోచన...విజేతను చేసింది
నళిని ఓ ఫుడ్ప్రెన్యూర్. జంషెడ్పూర్, టాటానగర్‌లో పుట్టారు. ప్లస్ టూ వరకు అక్కడే చదివారు. ఆ తర్వాత ఒడిశా, భువనేశ్వర్‌లో డిగ్రీ, ఎంబీఏ చేశారు. బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేశారు. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మీద కలిగిన ఆసక్తి ఆమెను మార్కెటింగ్ వైపు అడుగులు వేయించింది. పాలు, పాల ఉత్పత్తుల మార్కెటింగ్‌లో సక్సెస్ అయ్యారు. కరోనా పాండమిక్ ఆమె కెరీర్‌ని మలుపు తిప్పింది. సొంతంగా ఏదైనా చేయాలనే ఆసక్తి ఆమెతో మిల్లెట్ మిరకిల్ చేయించింది. బ్రెడ్ తయారీలో ఉన్న ఆసక్తి కొద్దీ ఆ ఫార్ములాని మిల్లెట్స్ మీద ప్రయోగం చేశారు. అగ్రికల్చర్, ఫుడ్ సైంటిస్టుల పరీక్షలను నెగ్గిన నళిని విజయవంతమైన తన ప్రయోగానికి పేటెంట్ ఫైల్ చేశారు. మహిళాదినోత్సవం సందర్భంగా ఆమె ‘సాక్షి’తో పంచుకున్న వివరాలివి.ఇది నా పేటెంట్ ప్రోడక్ట్! చపాతీ అంటే ప్రకటనలో చూపించినట్లు మూడువేళ్లతో తుంచేటంత మృదువుగా ఉండాలి. మిల్లెట్స్ ఆరోగ్యానికి మంచివని చపాతీ చేస్తే తినడం కష్టంగా ఉంటోంది. పరిష్కారం ఏమిటి? దీనిని ఛేదించగలిగితే సక్సెస్ చేతికందినట్లే. ఇందుకోసం నళిని తన ఆలోచనకు పదును పెట్టారు. తన సాధన ఫలించి ఆమె సాధన ఫలించి, ఇంట్లో వాళ్లు సంతృప్తిగా తిన్నారూ.. తిన్నారు. దీనినే తన ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కి మార్గం చేసుకోవచ్చు కదా! అనుకోవడంతోనే సంబంధిత అనుమతుల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఆమె చేసిన రెడీ టూ కుక్, రెడీ టూ ఈట్ మిల్లెట్ చపాతీలు ఆ పరీక్షల్లో నెగ్గాయి. నిల్వ ఉండడానికి ఆర్టిఫీషియల్ ప్రిజర్వేటివ్స్ ఏమీ వాడడం లేదని, పోషకాల లభ్యత బాగుందని హైదరాబాద్, రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం ఫుడ్æ సైంటిస్టులు నిర్ధారించారు. పరీక్షలలో నెగ్గిన తర్వాత తన ఫార్ములాను పరిరక్షించుకోవడం కోసం పేటెంట్ ఫైల్ చేశారు నళిని. అగ్రికల్చరల్ యూనివర్సిటీ... ఫుడ్ డెవలప్మెంట్ విభాగంలోని ఇన్‌క్యుబేటర్‌లో ప్రయోగదశలను నిర్వహించడానికి అవకాశం ఇవ్వడంతోపాటు అగ్–హబ్, నిధి ప్రయాస్ గ్రాంట్లు ఇచ్చి ప్రోత్సహించింది. తన ఆలోచన, ప్రభుత్వం నుంచి అందినప్రోత్సాహంతో పరిశ్రమ స్థాపించగలిగానని చెప్పారు నళిని. ‘‘రెండు–మూడు సంవత్సరాల గ్రౌండ్ వర్క్ తర్వాత తెరమీదకు వచ్చాను. ప్రస్తుతం పరిమితంగానే ఉత్పత్తి చేస్తూ నగరంలోని క్యూ మార్ట్, స్టార్ హోటళ్లకు అందిస్తున్నాను. పేటెంట్ వచ్చిన తర్వాత మార్కెటింగ్ మీద దృష్టి పెడతాను. ఒక కొత్త ఉత్పత్తిని ఊహించుకుని, నా జ్ఞానాన్ని మేళవించి, నిరంతరాయంగా శ్రమించి సాధించుకున్న విజయం ఇది. నా ఆలోచన, ప్రయోగానికి పేటెంట్ సాధించుకోవడం అనే ఊహే ఆనందంగా ఉంది’’ అన్నారు నళిని. మల్టీ టాస్కింగ్ మహిళలకు కొత్త కాదు! మల్టీ టాస్కింగ్‌లో మహిళలు సిద్ధహస్తులు. ఇంటి బాధ్యతలను నిర్వహించడమే అందుకు నిదర్శనం. గృహిణి బాధ్యతలకే పరిమితం కాకుండా ఇంకా ఏదైనా చేయాలనే ఆసక్తి ఉన్న వాళ్లు చాలామంది ఉన్నారు. కానీ వాళ్లలో ఎక్కువ మంది అలా అనుకుంటూనే రోజులు గడిపేస్తుంటారు. ధైర్యం చేసి తొలి అడుగు వేస్తే నడక దానంతట అదే కొనసాగుతుంది. అయితే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో అడుగుపెట్టేముందు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే... మరుసటి రోజు నుంచే లాభాల కోసం చూడరాదు. రాబడి పెరిగి ఆదాయం వచ్చే వరకు శ్రమించగలిగిన సహనం ఉండాలి. లాభాల బాట పట్టిన తర్వాత కూడా అలాగే శ్రమను కొనసాగించాలి. – నళిని, ఫౌండర్, కిబేస్, హైదరాబాద్ – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
నిర్వహణలోనూ రాణిస్తాం
ఒకరు వైద్యశాస్త్రం చదివాక... తన సేవలకు ఆ పరిధి సరిపోదేమోనని సివిల్ సర్వీసెస్ రాసి... ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి హెల్త్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. మరొకరు ఓ పెద్ద హాస్పిటల్‌కు వైస్ ప్రసిడెంట్... ఇంకొకరు మరో పేరుమోసిన హాస్పిటల్‌కు సీవోవో... మరికొందరు హాస్పిటల్ డైరెక్టర్లు. వైద్యశాస్త్రం చదివి మహిళా వైద్యులుగా పేరు పొందినవాళ్లు చాలామందే ఉన్నారు. కానీ హాస్పిటల్ రంగంలో ఎంటర్ప్రెన్యూర్లుగా, ఆరోగ్యరంగ సారథులుగా ఉంటూ సారథ్యం వహిస్తున్న వారు కాస్త తక్కువే గానీ ఇప్పుడు వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇలా వైస్ ప్రెసిడెంట్లుగా, సీవోవోలుగా, కీలకమైన స్థానాల్లో ఉండి రాష్ట్రానికీ, హాస్పిటళ్లకూ దిశానిర్దేశం చేస్తూ... వాటిని ముందుండి నడిపిస్తూ ప్రధాన బాధ్యతలు తీసుకొని పనిచేస్తున్న మహిళా వైద్యుల స్ఫూర్తిమంతమైన మాటలివి.పల్లెనాడి పట్టడానికి ఐఏఎస్‌గా...నా మీద చిన్నప్పట్నుంచీ మా నాన్నగారి ప్రభావం ఎంతో ఉంది. గతంలో ఆంధ్రప్రదేశ్, మిజోరా రాష్ట్రాల్లో అనేక శాఖల్లో పనిచేస్తూ సమాజానికి అంకితభావంతో సేవలందించిన మంచి ఉద్యోగి ఆయన. పల్లె ప్రాంతల్లో పనిచేసే సమయంలో మా నాన్న ఎదుర్కొన్న సవాళ్లూ, వాటిని ఆయన పరిష్కరించిన తీరు... ఇవన్నీ చూస్తూ పెరిగాను నేను. ఆయన అనుభవాలన్నీ అటు తర్వాత నాకెంతో ఉపకరించాయి. గ్రామీణప్రాంతాల్లో నాన్న ఎదుర్కొన్న సవాళ్లకు ఆరోగ్యసేవల ద్వారానే ఉత్తమమైన పరిష్కారం అందించవచ్చని అనిపించడంతో నేను ఎంబీబీఎస్ చేశా. నా ఇంటర్న్‌షిప్ సమయంలో మారుమూల పల్లెల్లో పనిచేస్తున్నప్పుడు నేను కనుగొన్న కొన్ని లోపాలను మంచి పాలనతోనే అధిగమించవచ్చని నాకు అనిపించింది. దాంతో సివిల్ సర్వీసెస్ రాశా. అలా నేను డాక్టర్ నుంచి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌గా మారాను. ఎంత పెద్ద ప్రయాణమైనా... మొట్టమొదటి అడుగుతో మొదలవుతుందనే సూక్తిని నమ్మిన నేను ఈశాన్య రాష్ట్రాలకు సేవలందించాక ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో అందునా వైద్యశాఖ ద్వారానే నా సేవలందిస్తున్నా. మన సమాజమే పితృస్వామ్య సమాజమైనప్పటికీ మహిళలు తమ సామర్థ్యాలు చూపుతూ చాలా రంగాల్లో తమ సత్తా చాటుతున్నారు. ఒక్కోసారి తమ పురుష ప్రత్యర్థుల కంటే మహిళల సామర్థ్యాలే మెరుగ్గా ఉంటున్నాయని చెప్పవచ్చు. ఒక్కోసారి మా నాన్నవాళ్ల తరం కంటే మా తరం బాగానే పురోగమిస్తోందనిపిస్తోంది. నిజానికి మా వైద్యశాఖలో పనిచేసే సిబ్బందిలో చాలామంది మహిళలే ఉన్నారు. సమాజంలో ఈ వివక్ష ఉన్నప్పటికీ నా మట్టుకు నేను మంచి సామర్థ్యంతో,ప్రొఫెషనలిజమ్‌తో కష్టపడి పనిచేస్తే ఈ వివక్షనూ అధిమించవచ్చనే ఉద్దేశంతో పనిచేస్తున్నాను. గత 24 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రానికంతటికీ నా సేవలందించేలా మనస్ఫుర్తిగా పనిచేయడం నాకు గుండెల నిండా ఆనందాన్ని, తృప్తిని ఇస్తోంది. హెల్త్ సెక్రటరీగా రాష్ట్రంలోని అట్టడుగు, బడుగువర్గాల వారందరికీ మా ప్రభుత్వ సేవలందాలనేదే నా మొట్టమొదటి లక్ష్యం. మేము అమలు చేసిన కార్యక్రమాలతో మెరుగైన స్క్రీనింగ్ పరీక్షలూ, వైద్యపరీక్షలతో ఎన్నో మాతృమరణాలూ, శిశుమరణాలూ... వీటన్నింటినీ గణనీయంగా తగ్గించగలిగాం. మారుమూల గిరిజన్ప్రాంతాల్లో వ్యాధినిర్ధారణ కేంద్రాలూ, ఐటీడీఏలకు అంబులెన్స్ సర్వీసులపై దృష్టి నిలిపాం. చిన్న పల్లెల్లో చదివే ప్రతిభావంతులైన పిల్లలకూ వైద్యవిద్య అందాలనే సదుద్దేశంతో ఎనిమిది కొత్త మెడికల్ కాలేజీలూ, 16 నర్సింగ్ కాలేజీలూ, 28 పారామెడికల్ కాలేజీలతోపాటు మహిళా శిశు సంక్షేమ శాఖ సమన్వయంతో... ఎంతో వివక్షకు లోనవుతున్న ట్రాన్స్‌జెండర్ వాళ్ల ఆరోగ్యం కోసం ఓ తొలి ప్రయత్నంగా 33 క్లినిక్‌లు ఏర్పాటు చేసే దిశగా పనిచేశాం. ఓ ప్రభుత్వ ఉద్యోగిగా సివిల్ సర్వీసెస్‌లో ఉంటూ నా పనుల ద్వారా సమాజంలో ఎంతో మార్పు తెచ్చామన్న తృప్తి ప్రతిరోజూ ప్రతిక్షణం ఉండటమే ఈ వృత్తిలో ఉన్నందుకు నాకు దక్కే సంతృప్తి. – డాక్టర్ క్రిస్టినా జడ్ చోంగ్తూ, సెక్రటరీ టు ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సంకల్ప బలంతోనే సాధన సులభంఒక హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్‌గా, మా టీమ్‌లోని ఉద్యోగులకు స్ఫూర్తిని అందించే మెంటార్‌గా, మా హెచ్ఆర్ టీమ్‌లకూ, పారామెడికల్ స్టాఫ్‌కూ మార్గనిర్దేశనం చేస్తూ, వారికి నేతృత్వం వహించే పనిచేయడాని కంటే ముందు నేను మా తల్లిదండ్రులకు ఏకైక సంతానాన్ని. దాంతో నా తల్లిదండ్రుల బాధ్యతలూ నేనే నిర్వహించాలి. దాంతోపాటు నా భర్తకు అవసరమైన నైతిక స్థైర్యాన్ని, నా అత్తమామలకు అవసరమైన సేవలందిస్తూ ఇలా ఇంటిబాధ్యతలు చూస్తూనే... కెరియర్ పరంగా ఓ ఎంట్రప్రెన్యూర్‌గా హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ బాధ్యతలు చేపట్టా. ఓవైపు ఇంటిబాధ్యతలూ, మరోవైపు కెరియర్ బాధ్యతలు... ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ మా సంస్థ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నా. సంకల్పబలం ఉంటే కష్టసాధ్యమైన లక్ష్యాలనూ ఛేదించగలం అనేది నేను నమ్మే తారకమంత్రం. ఈ మాట ఎందుకు చె΄్పాల్సి వస్తోందంటే... నేను రెండోసారి గర్భవతిగా ఉన్నప్పుడు నా రేడియాలజీ పీజీ పూర్తి చేశా. అటు తర్వాత ప్రతిష్ఠాత్మమైన ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్’లో ఏఎమ్పీహెచ్ ప్రోగ్రామ్ పూర్తికావడంతోనే ప్రీతీ హాస్పిటల్స్ గ్రూపునకు ఆపరేషన్స్ అధినేతగా బాధ్యతలు తీసుకున్నా. ప్రస్తుతం నేను మా సంస్థలో వందల సంఖ్యలో పనిచేస్తున్న ఉద్యోగులకు నేతృత్వం వహిస్తున్నా. ఈ క్రమంలో మా సంస్థలో జెండర్ వివక్ష ఉండకూడదనే ఉద్దేశంతో వీలైనంత మేరకు మహిళా ఉద్యోగులనే నియమిస్తున్నాం. రోజు డ్యూటీ ముగిసి ఇంటికెళ్లే సమయానికి... మేం మా పేషెంట్ల పట్ల మాత్రమే కాకుండా... సమాజంలోని నిరుపేదల విషయంలోనూ సహానుభూతితో వ్యవహరిస్తున్నామన్న తృప్తే మమ్మల్ని ముందుకు నడిపించే మరో స్ఫూర్తిమంత్రమంటూ వినమ్రంగా చెబుతున్నాను. – డాక్టర్ రూప పుట్టా, సీనియర్ రేడియాలజిస్ట్, డైరెక్టర్ అండ్ కో ఫౌండర్ ఆఫ్ ప్రీతీ యూరాలజీ అండ్ కిడ్నీ హాస్పిటల్స్, హైదరాబాద్ సారథ్యం అంత కష్టమేమీ కాదు!ప్రస్తుతం నా వయసు 37 ఏళ్లైతే... మా హాస్పిటల్ వయసు 32 ఏళ్లు. అంటే నా ఊహ తెలిసినప్పటినుంచి మా అమ్మతో పాటు హాస్పిటల్, క్లినిక్... ఇలా నిత్యం వైద్యుల మధ్యనే మెలగుతున్నా. నా ఇంటర్మీడియట్ టైమ్‌లో బైపీసీ తీసుకుని వైద్యరంగం వైపునకు వెళ్లడం అనివార్యంగా జరిగిపోయింది. మాకు ఓ సొంత హాస్పిటల్ ఉండటం... అలాగే మేము నడుపుతున్న మెడికల్ కాలేజీలూ ఉండటం వల్ల అక్కడ హాస్పిటల్ సారథిగా కీలకమైన అడ్మినిస్ట్రేషన్ స్థానంలోకి నేను వెళ్లడం చాలా సులువు అని కొంతమందికి అనిపించవచ్చు. అయితే ఈ పురుషులప్రాధాన్య ప్రపంచంలో ప్రతి సవాలునూ, ప్రతి సమస్యనూ పరిష్కరించుకుంటూ రావడం, ఓ మహిళగా ప్రతి నిమిషం, ప్రతిక్షణం తనను తాను నిరూపించుకుంటూ ఉండటం, ఆ స్థానాన్ని పదిలంగా నిలబెట్టుకోవడం, అందులో పదికాలాలు నిలదొక్కుకోవడం చాలా కష్టమైన పని. ఇక్కడ మనం చేయాల్సిందొక్కటే... మన హద్దులను మనమే మరింతగా విస్తృత పరచుకుంటూ, మన పరిధిని మనమే మరింత విశాలం చేసుకుంటూ మన తోటివారినీ మనతోపాటు ముందుకు తీసుకెళ్తూ ఉండటమే. ఓ మహిళగా నా టీమ్‌ను ఈ దిశగా నడిపిస్తూ నా డాక్టర్లూ, నా సిబ్బందీ వీళ్లందరూ మంచి కౌన్సెలర్లుగా సహానుభూతితో పనిచేసేలా చేయగలగడం, మంచి ఆరోగ్యాన్ని అందించడం ప్రస్తుతం నేను చేస్తున్న పని. చాలాకాలం పాటు హాస్పిటళ్ల చుట్టూ తిరుగుతూ ఉండాల్సిన నిరుపేద పేషెంట్లకూ, గ్రామీణప్రాంతపు రోగులకూ ఈ సౌకర్యాలన్నీ ఇవ్వగలుగుతూ వస్తున్నామన్న ఓ అద్భుతమైన భావనే నాకు సంతృప్తినిస్తుంది. – డాక్టర్ గాయత్రి కామినేని, ఆర్థోపెడిక్ సర్జన్ అండ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో), కామినేని హాస్పిటల్స్, హైదరాబాద్మేనేజ్మెంట్లో మేమే బెస్ట్!మొదట నేను ఓ డాక్టర్‌గానే సేవలందిస్తా అనుకున్నా. కానీ ఓ ఎంట్రప్రెన్యూర్‌గా, ఓ హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేయడం వల్ల చాలా విస్తృతస్థాయిలో సేవలందించడానికి మనకు సాధ్యమవుతుందని గ్రహించాను. సరిగ్గా ఇదే సమయంలో విజయవాడలో డాక్టర్ భాస్కర్రావుగారు కిమ్స్ తమ హాస్పిటల్ శాఖనుప్రారంభించారు. ఆ టైమ్‌లో అసిస్టెంట్ మెడికల్ డైరెక్టర్‌గా కిమ్స్‌లో పనిచేయడం మొదలుపెట్టా. హాస్పిటల్ నడిపించడమెలాగో నేర్చుకోవడం కోసం ప్రతిరోజూ నేను గుంటూరు నుంచి విజయవాడకు వెళ్లి... అక్కడ ప్రతి విభాగంలో ఉండే కష్టనష్టాలూ, సాధకబాధకాలు బాధకాలూ తెలుసుకుంటుండేదాన్ని. ఆ రంగంలో నాకున్న ఆసక్తి కారణంగా ప్రతిరోజూ గుంటూరు నుంచి విజయవాడకు వస్తూ పోతూ ఉండటాన్ని కంటిన్యువస్‌గా నాలుగేళ్లపాటు కొనసాగించా. అటు తర్వాత హైదరాబాద్‌లోని కొండాపూర్ కిమ్స్ విభాగానికి మెడికల్ డైరెక్టర్‌గా, ఇప్పుడు కిమ్స్ హాస్పిటల్స్ తాలూకు వైస్‌ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నాను. పేదలూ, బడుగువర్గాల నుంచి ప్రతిభావంతులైన మహిళలను ఎంచుకుని వారు సమర్థంగా పనిచేయగల స్థానాల్లో వారి నియామకాలు జరిగేలా చూసినప్పుడు... సమాజానికి అవసరమైన పని చేశామన్న సంతృప్తి ఉంటుంది. రేపు ఇంతకంటే మెరుగ్గా చేయాలన్న సంకల్పమూ ఉంటుంది. – డాక్టర్ హరిణి చేబ్రోలు, వైస్ ప్రెసిడెంట్ (రెవిన్యూ సైకిల్ మేనేజ్మెంట్), కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ కెరియర్ మెట్లపై‘ఫెమ్’నిస్టులం!అందరూ మహిళా డాక్టర్లే ఉంటూ, మహిళలతోనే నడిచే ఓ పూర్తిస్థాయి మహిళల హెల్త్‌కేర్ సెంటర్‌ను మేము ఏర్పాటు చేయడానికి వెనక ఓ చిన్న కథ ఉంది. చిన్నపిల్లల వైద్యుడూ, రోజుల పిల్లల స్పెషలిస్తూ (నియోనేటాలజిస్ట్) అయిన నా భర్త దగ్గరికి తమ పిల్లలను తీసుకొచ్చే తల్లులు తనను నిత్యం ఓ ప్రశ్న అడుగుతుండేవారు. ‘ఏమండీ... ఎవరైనా మహిళా రేడియాలజిస్టు ఉన్నారా?... ఎక్కడైనా ఓ లేడీ బ్రెస్ట్ సర్జన్ దొరుకుతారా?’’ అన్నదే చాలామంది ప్రశ్న. దీంతో ఆ రంగాల్లో మహిళా వైద్యుల అవసరముందనే విషయం మా దృష్టికి వచ్చింది. దాంతోపాటు మరో అంశమేమిటంటే... మా అమ్మ గారు క్యాన్సర్ విజేత. ఆమెకు క్యాన్సర్ చికిత్స జరుగుతున్న సమయంలో నేను ఆమె వెంట వెళ్తూ ఉండేదాన్ని. ఎవరైనా మహిళా వైద్యురాలి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆమె చాలా సౌకర్యంగా ఫీలవుతుండటాన్ని గ్రహించా. అలాంటి అనుభవాల నుంచి పుట్టిందే మా ఫెమ్‌సిటీ హాస్పిటల్. ఓ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగాలనుకునే మహిళకు జస్ట్ 9 టు 5 జాబ్ చేయడం కుదరని పని. మనం ఎంచుకునే కెరియర్ అంతకంటే ఎక్కువే డిమాండ్ చేస్తుంటుంది. ఉదాహరణకు... నా చిన్నారి బేబీకి జన్మనివ్వడానికి కేవలం నాలుగు గంటల ముందు కూడా నేను నా టీమ్‌తో పనిలో నిమగ్నమయ్యే ఉన్నాను. అంతేకాదు... నా టీమ్‌తో ఏదో చర్చిస్తూ, వాళ్లకు మార్గనిర్దేశనం చేసిన మరో నాలుగ్గంటల తర్వాతే నా బేబీని నా చేతుల్లోకి తీసుకున్నా. నిజానికి మహిళలు తమ చుట్టూ ఉండేవాళ్ల ఆరోగ్యాన్నీ, సంక్షేమాన్ని, భద్రతనూ ఎల్లప్పుడూ కోరుకుంటూ, వాళ్లకేప్రాధాన్యమిస్తుంటారు. అందుకే ఈ సమాజానికి మరో తరాన్ని ఇస్తూ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ముందుండే మహిళలతో సాటి మహిళగా కనెక్ట్ అవుతూ, ఆమెకు మానసిక, శారీరక ఆరోగ్యానందాలను ఇవ్వడం చాలా కీలకమైన అంశంగా ఫీలవుతుంటాను. ఫెమ్‌సిటీ కేర్స్ అనే ఫౌండేషన్ సహాయంతో ఖర్చులు భరించలేని, అఫర్డ్ చేయలేని అనేక మందికి శానిటరీ న్యాప్కిన్స్ పంపిణీ, నెలల పిల్లలకూ, చిన్న చిన్నపిల్లల వైద్యం, అనేక మందికి సర్జరీలూ ఉచితంగా అందిస్తున్నాం. ఇలాంటి సేవలెన్నో మా మహిళా, చిన్నపిల్లల హాస్పిటల్ ద్వారా నిరంతరం అందించగలుగుతున్నామన్నదే నాకు సంతృప్తినిచ్చే అంశం. – ఎల్మిరా సిద్దీఖీ, కౌ–ఫౌండర్ అండ్ డైరెక్టర్ (పబ్లిక్ రిలేషన్స్), ఫెమ్‌సిటీ హాస్పిటల్స్, హైదరాబాద్రంగుల కళఇంటర్నేషనల్ విమెన్స్ డే సింబల్, పోస్టర్ డిజైన్లలో సాధారణంగా పింక్ కలర్లో కనిపిస్తుంటుంది. నిజానికి ఎన్నో ఏళ్లుగా ఇంటర్నేషనల్ విమెన్స్ డేఅంటే ఊదా, ఆకుపచ్చ, తెలుపు రంగులు మాత్రమేప్రాచుర్యం పొందాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వెబ్సైట్ ప్రకారం... ఊదా రంగు గౌరవానికి, న్యాయానికి, ఆకుపచ్చ ఆశకు, తెలుపు స్వచ్ఛతకు ప్రతీక. యూకేలోని ఉమెన్స్ సోషల్ అండ్ పొలిటికల్ యూనియన్ (డబ్ల్యూ ఎస్పీయూ–1908) ద్వారా ఈ రంగులుప్రాచుర్యంలోకి వచ్చాయి. -
లాలస: స్త్రీలందరికీ ఆమె ఆదర్శమా? అనుసరణీయమా?
గాఢంగా చీకట్లు కమ్మిన ఒక రాత్రి– ఆకాశాన్ని చీలుస్తూ ఒక మెరుపు మెరుస్తుంది... మనల్ని, మన పరిసరాలనీ మన కళ్ళకే చూపించి మాయమై పోతుంది. ఆ మెరుపును మన ఇంటి దీపంలాగా గోడకు వేలాడదీసుకుందామంటే కుదరదు. కుదిరి నా భరించటానికి ఆ ఇంటికి శక్తి చాలదు. ఆ క్షణకాలపు వెలుగులో ఏం చూడగలరో, పరిసరాలను ఎంత చక్కదిద్దుకోగలరో ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాల్సిందే. సరిగ్గా ఆ మెరుపులాంటిదే లాలస! చలం రాసిన ‘జీవితాదర్శం’లో నాయిక. లాలస నాకు నచ్చింది అని చెప్పిన వాళ్ళకు కొన్ని ప్రశ్నలు ఎదురవుతాయి– స్త్రీలందరికీ ఆమె ఆదర్శమా? అనుసరణీయమా? ఆ దారిలో నడవటం ఆడవాళ్ళకు క్షేమమా? అంటూ. అన్నిటికీ జవాబు ఒకటే– కాదు. మరెందుకు మాట్లాడుకోవాలి లాలస గురించి? స్త్రీ పురుష సంబంధాలు– అధికారం వల్లనో, అవసరాల కోసమో సాగేవిగా ఉండరాదని, అవి హృదయగతమైన సంబంధాలుగా ఉండాలని చెప్పినందుకు, వాటిలో కపటమూ మోసమూ చోటు చేసుకున్నప్పుడు ఎంత బలమైన నిర్మాణమైనా లోలోపల గుల్లబారి కూలిపోక తప్పదని చెప్పటానికి తనను తానొక ప్రయోగశాలగా మార్చుకున్నందుకు లాలస గురించి మాట్లాడుకోవాలి.లాలస నమ్మి, ఆచరించిన ‘హృదయవాదం’ అతి ప్రమాదకరమైనది. ఉనికిలో వున్న ఏ ఆదర్శ నమూనాలోనూ అది ఇమడదు. ‘నీతిమంతమైన’ ఏ నిర్మాణమూ దాన్ని భరించదు. నిజానికి లాలస పేచీ పడింది నీతితోనూ, ఆదర్శాలతోనూ కానేకాదు. ‘నీతి చాలా గొప్ప విషయమూ, అవసరమైన విషయమూ’ అని గౌరవించే లాలస ఆ నీతులూ, ఆదర్శాలూ హృదయం లోంచి పుట్టే సహజ ప్రేరణలుగా కాకుండా ఉత్తి రిచువల్స్గా తయారవటాన్ని అసహ్యించుకుంటుంది. స్త్రీలను సమానులుగా మనస్ఫూర్తిగా గుర్తించకుండా, అలా ఉన్నట్టుగా కనబడే వ్యక్తులకు సామాజిక గౌరవం ఉన్నందుకే ఆలా నడుచుకునే హి΄ోక్రటిక్ ఆదర్శ జీవులను ఆమె నిలదీస్తుంది. అయితే ఇలా విమర్శించినంత మాత్రాన తానొక ఆదర్శ వ్యక్తిననే భ్రమలు ఆమెకేమీ లేవు. ‘నువ్వు నాకు ఆదర్శమైన పురుషుడివి కావు... ఆదర్శమైన స్త్రీ కూడా లేదు. కానీ, నేనొకతె ను ఉన్నానని నమ్ముతున్నావు, దురదృష్టవంతుడివి కనుక’ అని తను పెళ్ళాడబోతున్న వ్యక్తితో నిస్సంకోచంగా చెప్పగలదు లాలస. ఆదర్శవంతమైన మనుషులు, అత్యంత కఠినమైన స్వీయ ప్రయత్నంతో రూపొందగలరే తప్ప, సామాజిక నిర్బంధంతో కాదని ఆమె నమ్మకం. ఆ ప్రయత్నంలో ఎగుడు దిగుళ్ళూ, తప్పటడుగులూ ఉండి తీరుతాయి. ఏ విలువల ప్రాతిపదికన బయల్దేరుతామో వాటిని కోల్పోయే స్థితికి దిగజారే ప్రమాదమూ ఎదురు కావచ్చు. వీటన్నిటికీ సిద్ధపడి, ఒక విలువను ప్రతిపాదించగల స్థాయికి చేరిన వ్యక్తి లాలస. జనసామాన్యాన్ని కూడగట్టి నడిపించటానికీ, ఆచరణాత్మకమైన నిర్మాణాలను రూపొందించటానికీ పనికొచ్చే నాయకులు కాదు లాలస వంటి వ్యక్తులు. చదవండి: కనపడని నాలుగో సింహం..!ఆ పనుల కోసం రూపొందాయని చెప్పే మార్గాలు మూఢనమ్మకాలుగా మారిపోకుండానూ, ఆ నిర్మాణాలు గిడసబారి పోకుండానూ హెచ్చరించే అనుభవాల ప్రయోగశాలలు వీళ్ళు. మార్పు కొరకు జరిగే ప్రతి ఉద్యమమూ మానవీయమైన సహజ చర్యగా సాగాలని, ఆదర్శాలన్నవి మనుషుల వ్యక్తిత్వాల్లో అసంకల్పితంగా భాగమై పోయేంత సహజ స్పందనలుగా మారాలనీ కలలుగనే మానవులు. అలాంటి కలలు గన్న పాత్రగా లాలస పాఠకులకు నచ్చుతుంది.- కాత్యాయని -
కనపడని నాలుగో సింహం..!
సినిమాల్లో ‘శుభం’ కార్డు పడే సమయంలో ‘యూ ఆర్ అండర్ అరెస్ట్’ అంటూ ఇన్స్పెక్టర్ పరుగెత్తుకు వచ్చి నేరస్థుడికి అలవోకగా సంకెళ్లు వేస్తాడు. అయితే నిజజీవితంలో అలా కాదు. నేరస్థుడిని పట్టుకోవడానికి లక్ష సవాళ్లు ఎదురవుతాయి. అలా అని నేరస్థుడిని పట్టుకోవడంలో ఆలస్యం జరగకూడదు. ‘నేరస్థుడిని త్వరగా పట్టుకోవాలి’ అనే తొందరపాటు కూడా ఉండకూడదు. ‘99 మంది దోషులు చట్టం నుంచి తప్పించుకున్నా... ఒక్క అమాయకుడు శిక్షకు గురి కాకూడదు’ అనే మాట ఉండనే ఉంది! క్రైమ్ సీన్ సవాలు విసురుతుంది. ఎవరైతే ఆ సవాలును స్వీకరించి, తమ తెలివితేటలు, శక్తిసామర్థ్యాలకు పదును పెట్టి, ఏ పుట్టలో ఏ పాము ఉందో కనిపెట్టి నిందితుడిని కటకటాల వెనక్కి తీసుకువెళతారో... వారే క్రైమ్‌సీన్ ఆఫీసర్లు. క్లూస్‌టీమ్‌లో భాగంగా పనిచేసే క్రైమ్‌సీన్ ఆఫీసర్లు (సీఎస్ఓ) నేరం జరిగిన వెంటనే ఘటనాస్థలికి వెళ్లి అణువణువూ అధ్యయనం చేసి, దర్యాప్తు అధికారులుగా ఉండే పోలీసులు నిందితులను పట్టుకోవడానికి అవసరమైన ఆధారాలు అందిస్తారు. హైదరాబాద్ క్లూస్‌టీమ్‌లో మొత్తం 43 మంది సీఎస్ఓలు ఉండగా వీరిలో ఆరుగురే మహిళలు. పోలీసులు మనకు కనిపించే మూడు సింహాలైతే... ఈ ‘సీఎస్ఓ’లు కంటికి కనిపించని నాలుగో సింహం. ‘క్లూ’లు అందించడంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన గుడిబోయిన ఇందిర, దానం ఎలిజబెత్‌లు ఎన్నో ముఖ్యమైన కేసుల దర్యాప్తులో కీలక పాత్ర పోషించారు... హైదరాబాద్‌లోని నేరేడ్మెట్ (Neredmet) ప్రాంతానికి చెందిన గుడిబోయిన ఇందిర 2015 నుంచి హైదరాబాద్ (Hyderabad) క్లూస్ టీమ్‌లో సీఎస్ఓగా పని చేస్తోంది. తన పదేళ్ల సర్వీసులో ఎన్నో నేరస్థలాలకు వెళ్లి కీలక ఆధారాలు సేకరించి కేసు చిక్కు ముడి వీడడంలో కీలక పాత్ర పోషించింది. ఆ కేసులలో కొన్ని...నిందితుడు... ఇదిగో... ఈ ఇంట్లోనే!హైదరాబాద్‌లోని మెట్టుగూడ (Mettuguda) నల్లపోచమ్మ ఆలయం దగ్గర నివసించే రేణుక పెద్ద కుమారుడు యశ్వంత్ మౌలాలీలోని రైల్వే కాంట్రాక్టర్ దగ్గర పని చేసి మానేశాడు. ఫిబ్రవరి ఆరోతేదీన కొంతమంది దుండగులు తమ ఇంట్లోకి చొరబడ్డారని, తల్లితోపాటు తనపై కత్తితో దాడి చేశారని యశ్వంత్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఇద్దరికీ తీవ్రగాయాలు కావడంతో ఈ హత్యాయత్నం కేసు సంచలనం సృష్టించింది. విధి నిర్వహణలో భాగంగా సీఎస్ఓ ఇందిర యశ్వంత్ ఇంటికి వెళ్లింది. ఘటనాస్థలిలో ఉన్న పరిస్థితులతోపాటు ఆ ఇంటి పరిసరాలను అధ్యయనం చేసింది. రేణుక ఒంటిపై ఉన్న కత్తిపోట్లు ఎదుటివాళ్లే పొడిచినట్లు ఉన్నప్పటికీ యశ్వంత్ గాయాలపై అనుమానం వచ్చింది. దీనికితోడు వారి ఇంటికి బయటనుంచి గడియపెట్టి ఉందనే విషయం తెలుసుకున్న ఇందిర మరింత లోతుగా ఆరా తీసింది. ఈ నేరంలో మూడో వారి ప్రమేయం లేదంటూ పోలీసులకు నివేదించింది. దీంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేయగా యశ్వంతే నిందితుడని తేలింది. కుటుంబ కలహాలు, పెళ్లి కావట్లేదనే బాధతో డిప్రెషన్ కు గురైన యశ్వంత్ ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన తల్లికి కత్తిపోట్లు పడ్డాయి. దీంతో భయాందోళనలకు గురైన యశ్వంత్ తనపై కేసు కాకుండా ఉండటానికి ‘ఎవరో మాపై హత్యాయత్నం చేశారు’ అంటూ నాటకం ఆడాడు. కుమారుడిని జైలుకు పంపడం ఇష్టంలేక పోలీసులను తప్పుదోవ పట్టించింది రేణుక. చివరకు ఇందిర చొరవతో కేసు కొలిక్కివచ్చి యశ్వంత్‌పై హత్యాయత్నం కేసు నమోదైంది.స్క్రూ డ్రైవర్ ముక్కే... పక్కాగా పట్టించింది!నాలుగేళ్ల క్రితం బేగంపేటలో ఒక ఇంట్లో చోరీ జరిగింది. నేరస్థలిని సందర్శించిన ఇందిర అక్కడ విరిగిన స్క్రూడ్రైవర్ ముక్కను గుర్తించింది. బాధితులు పక్కింటివారిపై అనుమానం వ్యక్తం చేయడంతో వారింట్లో సోదాలు చేశారు. అక్కడ మిగిలిన స్క్రూ డ్రైవర్ దొరకడంతో వారే నిందితులుగా తేలి కేసు కొలిక్కివచ్చింది.సూసైడ్ నోట్ కనిపెట్టి... అతడి ఆట కట్టించిందికుటుంబ కలహాల నేపథ్యంలో గత వారం వారాసిగూడ ప్రాంతంలో ఒక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఆ సమయంలో ఆమె భర్త కూడా ఇంట్లోనే ఉండటంతో ఇది హత్యగా అనుమానించారు. ఘటనాస్థలికి వెళ్లిన ఇందిర మృతురాలి శరీరంతోపాటు ఆమె వస్త్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి సూసైడ్ నోట్ వెలికి తీసింది. ఆత్మహత్యకు ప్రేరేపించడం, వేధింపుల కేసు భర్తపై నమోదైంది. తట్టిఅన్నారంలోని జీవీఆర్ కాలనీకి చెందిన దానం ఎలిజబెత్ 2015 నుంచి హైదరాబాద్ క్లూస్ టీమ్‌లో సీఎస్ఓగా పని చేస్తోంది. ఇప్పటి వరకు అనేక కేసుల దర్యాప్తులో కీలకంగా మారిన ఆధారాలను సేకరించి అందించింది. గత ఏడాది చివరలో హబీబ్‌నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చిన ‘గుండెపోటు మరణం’ ఎలిజెబెత్ అందించిన ఆధారాలతోనే హత్యగా తేలింది.డస్ట్‌బిన్‌లో దాగిన రహస్యంకురుమబస్తీకి చెందిన రేణుక ఇంటి అరుగుపై ఉదయం ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రహదారిపై నడుచుకుంటూ వెళ్తుండగా గుండెపోటు వచ్చి ఉంటుందని, తమ అరుగుపై పడుకుని ప్రాణాలు విడిచి ఉంటాడని రేణుక పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న హబీబ్‌నగర్ పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో మృతుడు ఏ బ్యాట్రీలేన్కు చెందిన ఖాలేద్‌గా గుర్తించారు. రేణుక ఇంట్లోనూ సోదాలు చేయాలని పోలీసులు క్లూస్ టీమ్‌ను కోరారు. ఎలిజబెత్ అక్కడకు వెళ్లి రేణుక ఇంటిలో అణువణువూ పరిశీలించింది. రేణుక మంచం పైన కనిపించిన కొన్ని వెంట్రుకలు ఖాలేద్ వెంట్రుకలతో సరిపోలాయి. రేణుక వంటగదిలో ఉన్న డస్ట్‌బిన్‌లో ఓ కొత్త కాటన్ టవల్ పడి ఉండటం ఎలిజబెత్ దృష్టిలో పడింది. కొత్త టవల్ డస్ట్‌బిన్‌లో ఉండటం, అదీ కిచెన్లోది కావడంతో అనుమానించింది. ఆ టవల్ తడిగా ఉండటంతోపాటు కొన్ని రకాలైన మరకలు ఉన్నట్లు కనిపెట్టింది. వీటి ఆధారంగా రేణుక హత్య చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు సమాచారం అందించింది ఎలిజబెత్. దీంతో అధికారులు రేణుకను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అనుకోకుండా హత్య చేశానని, తన సోదరుడు వెంకటేష్ సాయంతో మృతదేహాన్ని ఇంట్లోంచి బయటకు తీసుకువచ్చి అరుగుపై పడుకోబెట్టానని రేణుక ఒప్పుకుంది. చదవండి: 'ఇ-నాలుక' రుచిని కోల్పోయిన వాళ్లకు వరం..!రేణుక–ఖాలేద్ల మధ్య కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. ఆరోజు రేణుక ఇంటికి వెళ్లిన ఖాలేద్ తన కోరిక తీర్చమని కోరగా ఆమె అంగీకరించలేదు. ఆ సమయంలో జరిగిన గొడవలో బెడ్‌పై పడిన ఖాలేద్ నోరు, ముక్కు టవల్‌తో మూసేసి హత్య చేసింది. రేణుకతోపాటు ఆమె సోదరుడిని పోలీసులు అరెస్టు చేశారు. -
నాకు నచ్చిన పాత్ర విమల
నచ్చటం అనేది నిరపేక్ష అంశం కాదు. ప్రత్యేకించి సాహిత్య పాత్రలు నచ్చటం– అవి చదివిన కాలం నాటి మన వయసు, ఆలోచనా స్థాయి, భావుకత్వ శక్తి వీటన్నిటిని బట్టి ఉంటుంది. అందువల్ల ఒకసారి నచ్చింది అలాగే ఉండిపోతుంది అనుకొనటానికి లేదు. ఒకొకసారి యూటర్న్ కూడా తీసుకోవచ్చు. లేదా గుణాత్మకంగా పరిణామామూ చెందవచ్చు. నా సాహిత్య సహవాసం ఆరోతరగతి నుండి వారపత్రికలలో సీరియల్‌గా వచ్చే స్త్రీల నవలలు చదవటంతో మొదలైంది (1966 –67). ఆ వరుసలో రంగనాయకమ్మ స్వీట్ హోమ్ (Sweet Home) నవలలోని విమల పాత్ర నాకు చాలా నచ్చింది. పన్నెండు పదమూడేళ్ల వయసులో విమల నాకెందుకు నచ్చింది? ఇళ్లల్లో కనబడే దాంపత్య సంబంధాల్లోని గంభీర ముద్రను, ఒద్దికను చెరిపేస్తూ భర్తతో అల్లరిగా, చిలిపిగా, చనువుగా ప్రవర్తించే ఆ పాత్ర విశిష్ట వ్యక్తిత్వం నన్ను ఆకర్షించిందా? అప్పటికి నేను చదివిన నవలల్లోని స్త్రీ పాత్రలకు భిన్నంగా తాను లోపల ఏమి అనుకొంటున్నదో దానిని ఎవరేమనుకొంటారో అని లోలోపల అణిచేసుకోకుండా బయటకు అనగల ధీరత్వం వలన విమల నాకు అపురూపంగా అనిపించిందా? ఆ క్రమంలో తాను స్త్రీ, భార్యే అయినా ప్రత్యేకవ్యక్తిని అన్న నిరంతర చైతన్యంతో జీవించటం వల్ల నాకు నచ్చిందా? ఏమో !? నాకవన్నీ ఆ రోజుకు ఇంత స్పష్టంగా తెలుసునని చెప్పలేను. కానీ ఆ నవల చదువుతూ సమ న్యాయానికి, సహజీవన సౌందర్యానికి సంబంధించిన అవ్యక్త అనురాగం ఏదో నా లోలోపల ఊపిరి పోసుకొంటుంటే విమల ప్రేమలో పడిపోయానన్నది వాస్తవం. ఆ తరువాత ఎన్నిసార్లు ఆ నవల (Novel) చదివానో లెక్కలేదు. విమల ఎందుకు నచ్చిందో ఆ కారణాలు రోజురోజుకీ మరింత విశదం అవుతూ వస్తున్నాయి. స్త్రీకి సహజ లక్షణాలుగా సమాజం నిర్దేశిస్తున్న విలువలను తిరస్కరించటం విమలను ప్రత్యేకంగా నిలబెడుతుంది. శాంతం, సహనం స్త్రీ«ధర్మాలు అనే బోధలు ఆమె సహించలేదు. పతివ్రతలుగా జీవించటం, మరణించటం స్త్రీకి ఆదర్శం చేసిన వ్యవస్థపై ఆమెకు కోపం. స్త్రీకి భర్త పట్ల అనురాగం స్వచ్ఛందంగా సహజ మానవీయ సంబంధాల నుండి కలగవలసినదే కానీ పై నుండి నిర్బంధం వల్ల కాదు అన్నది ఆమె నిశ్చితాభిప్రాయం. భర్త కోసం తాను ఇష్టంగా ఇంటి పని ఎంతైనా చేయవచ్చు కానీ, ఇంటి పని స్త్రీలదే అంటే మాత్రం విమల ఒప్పుకోదు. వంటిల్లు మగవాడిది కూడా అని చెప్పగలిగిన సమాన హక్కుల చైతన్యం ఆమెది. ఆమె సంస్కరణ కుటుంబానికి పరిమితమైనదే. కానీ కుటుంబంలో భార్యాభర్తల సంబంధాలలో ప్రజాస్వామీకీకరణను కలగనగలిగిన ఆధునిక మధ్యతరగతి యువతిగా విమల నాకు నచ్చిందనుకొంటాను. కుటుంబానికి అవతల నాకు అంతగా నచ్చిన మరొక స్త్రీ పాత్ర మధురవాణి. -
నాకు నచ్చిన పాత్ర మనోరమ: మృణాళిని
తెలుగులో సుప్రసిద్ధమైన నవలల్లో ఒకటి రాచకొండ విశ్వనాథశాస్త్రి ‘అల్పజీవి’. ఇది చదివిన వారందరికీ సుబ్బయ్య పాత్ర, చైతన్యస్రవంతి శిల్పం మాత్రమే గుర్తుంటాయి. కానీ అందులో కథకు అతి కీలకమైన స్త్రీ పాత్ర ఉంది. ఆమే మనోరమ. నవలలో వస్తువు సుబ్బయ్యలోని ఆత్మన్యూనత. అదే ఆ పాత్రను అల్పజీవిని చేసిన అంశం. ఆ ఆత్మన్యూనత తగ్గడానికి ప్రేరణ మనోరమ (Manorama) సాన్నిహిత్యం. అందరిచేతా ‘నంగిరి పింగిరి గాడు’, ‘భయస్థుడు’, ‘అసమర్థుడు’ అనిపించుకున్న సుబ్బయ్య, భార్య చేత ‘మగడు మగాడు కాకపోతే భార్యల గతి ఇంతే’ అని ఈసడించుకోబడ్డ సుబ్బయ్య, నవల చివర్లో ‘ఈ ఆడది కష్టంలో ఉందని తెల్సుకుందికి అట్టే కష్టం లేదు... చేతనైతే సాయం చేయవచ్చు’ అని మనోరమ గురించి అనుకునే స్థాయికి ఎదగడానికి, తన అల్పత్వాన్ని అధిగమించడంలో తొలి అడుగు వేయడానికి కారణం ఆ మనోరమే. మనోరమను ‘నల్లచీర మనిషి’ అని పరిచయం చేస్తాడు రచయిత. స్కూలు టీచరు (School Teacher) అని చెబుతాడు. ఆమె గతం మనకుగానీ, సుబ్బయ్యకు గానీ చెప్పడు. మాట తీరును బట్టి కలుపుగోలు మనిషి, ముప్ఫయ్యో పడిలో ఉన్న అందమైన స్త్రీ అని మాత్రమే ఆ పరిచయంలో అర్థమవుతుంది. మనోరమ తెలుగు నవలాసాహిత్యంలోనే విలక్షణమైన పాత్ర. కొంతవరకూ మార్మిక పాత్ర కూడా. నవలలో సుబ్బయ్యను మనిషిలా చూసిన ఏకైక వ్యక్తి. అతన్ని అన్ని బలహీనతలతో సహా అభిమానించిన వ్యక్తి. ఏ ఫలాపేక్ష లేకుండా అతని కష్టాలన్నీ సానుభూతితో వినడమే కాక, అతనికి శారీరకంగానూ దగ్గరైన వ్యక్తి. అతని ప్రాణానికి కంటకుడిగా మారిన గవరయ్యను తన ఊరివాడన్న చిన్న సెంటిమెంటును గుర్తుచేసి, నచ్చజెప్పి, సుబ్బయ్యకు ఆపద తప్పించిన ఉపకారి.మనశ్శాస్త్రవేత్త ఆల్ఫెడ్ర్ ఆడ్లర్ సిద్ధాంతం ప్రకారం ఆత్మన్యూనతకు లోనై, సమాజం నుంచి పారిపోవాలనుకునే వ్యక్తికి కుటుంబం నుంచి కానీ సమాజం నుంచి గానీ ఒక ఆధారం, ఊరట లభిస్తే ఆ బలహీనత నుంచి కోలుకుంటారు. ఆ ఊరటకు ప్రతీకే మనోరమ. మగవాడికి, ఒక అపరిచితురాలైన అందమైన స్త్రీ తన సాన్నిహిత్యాన్ని కోరుతున్నది అన్న ఒక్కటి చాలు – అహం తృప్తి పడ్డానికీ; న్యూనత తగ్గడానికీ. పురుషుల సైకాలజీకి సంబంధించిన ఈ అంశానికి ప్రతినిధిగా మనోరమను సృష్టించి, రావిశాస్త్రి తన రచనాప్రతిభను చాటుకున్నారు. చదవండి: 'నా ఇన్స్పిరేషన్ మా అమ్మ'..!: సొనాలీ బెంద్రేరచయిత మనోరమ అంతరంగాన్ని చిత్రించకపోవడం వల్ల వచ్చిన నష్టమేమీ లేదు. నవల చివర్లో మాత్రం ఆమె ఎందుకో బాధపడుతోందన్న సూచన చేస్తాడు. దాని వివరాలేవీ చెప్పడు. ఎందుకంటే ఇది సుబ్బయ్య కథ. మనోరమ కథ కాదు. కానీ, ఎప్పుడూ తన ఏడుపు మాత్రమే ఏడ్చుకునే సుబ్బయ్య ఒక మనిషిగా మారడానికి మనోరమలో కలిగిన ఈ వ్యాకులమే నాంది పలికింది. ఆ పాత్ర ప్రయోజనం ఈ నవలకు సంబంధించినంతవరకూ అంతే కావచ్చు. ఈ రకంగా రావిశాస్త్రి మనోరమకు అన్యాయం చేసి వుండవచ్చు కూడా... కానీ, రావిశాస్త్రి ఎందుకోసం సృష్టించినా, గుండె నిండా ఔదార్యం, మనసు నిండా ప్రేమ కలిగిన మనోరమ తెలుగు నవలా సాహిత్యంలో గుర్తుంచుకోదగ్గ స్త్రీ పాత్ర. -
International Women's Day: సినీ మేడమ్స్
కథానాయికలు(Actress) కనిపిస్తేనే వెండితెరకు నిండుదనం. సినిమాల ఘనవిజయాల్లో వారి పాత్ర గణనీయం దర్శకత్వం, రచన, నిర్మాణ నిర్వహణ, సినిమాటోగ్రఫీ.. వంటి తెరవెనుక పాత్రల్లోనూ కొందరు మహిళలు రాణిస్తున్నారు. తెరపైనా, తెరవెనుకా రాణించే సినీ మేడమ్స్ ముచ్చట్లు.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం(International Women's Day) సందర్భంగా...దీపిక కొండిమన సమాజంలో పురుషాధిక్యత, లింగ వివక్ష, అసమానతలు వంటి రకరకాల అవరోధాలు మహిళల అభివృద్ధికి సవాలుగా నిలుస్తున్నాయి. ఈ సమస్యలు అన్ని రంగాల్లోనూ ఉన్నాయి. వెండితెరపై కథానాయికలుగా మహిళలు వెలుగొందే సినీరంగం కూడా ఈ సామాజిక రుగ్మతలకు అతీతం కాదు. ఎన్ని సమస్యలు ఉన్నా, ఏటికి ఎదురీదుతూ ఎప్పటికప్పుడు తమ సత్తా చాటుకుంటున్న మహిళలు కూడా సినీరంగంలో ఉన్నారు. వారే నేటితరాలకు స్ఫూర్తి ప్రదాతలు. తాజాగా ఆర్మాక్స్ మీడియా భారతీయ చలనచిత్ర పరిశ్రమలోని మహిళా ప్రాతినిధ్యంపై ఓ వుమానియా! 2024 నివేదిక విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, సినిమాలను ప్రేమించి, సినిమాల కోసం పనిచేసే సినీ మేడమ్స్ గురించిన ప్రత్యేక కథనం..‘ఓ వుమానియా!’... భారతీయ చలన చిత్రపరిశ్రమలోని మహిళా ప్రాతినిధ్యంపై వెలువడిన నివేదిక. గత నాలుగేళ్లుగా ప్రముఖ మీడియా కన్సల్టింగ్ సంస్థ ‘ఆర్మాక్స్ మీడియా’ ఏటా ఈ నివేదికను విడుదల చేస్తూ వస్తోంది. ఈ నివేదికను ఫిల్మ్ కంపానియన్ స్టూడియోస్ వీడియో రూపంలో నిర్మించగా, ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ‘అమెజాన్ ప్రైమ్’ విడుదల చేసింది. తాజాగా ‘ఓ ఉమానియా–2024’ నివేదిక ప్రస్తుత ధోరణులపై మరింత లోతైన వివరాలను అందించింది. సినిమా నిర్మాణం, సినీ నిర్మాణ సంస్థల్లోని కార్పొరేట్ నాయకత్వం, మార్కెటింగ్ వంటి కీలక రంగాలలో మహిళా ప్రాతినిధ్యంలోని అసమానతలను గుర్తించింది.2023లో మొత్తం తొమ్మిది (తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ, పంజాబీ, బెంగాలీ, గుజరాతీ) భారతీయ భాషలలో విడుదల చేసిన 169 సినిమాలు, సిరీస్‌లను విశ్లేషించింది. వీటిని మళ్లీ థియేట్రికల్ సినిమాలు (70), డిజిటల్ స్ట్రీమింగ్ సినిమాలు (30), సిరీస్(69)లుగా విభజించింది.ఇందులో మన దక్షిణాది నుంచి లియో, జవాన్, ఆదిపురుష్, వాల్తేరు వీరయ్య, పొన్నియిన్ సెల్వన్ 2, భగవంత్ కేసరి, 2018, దసరా, విరూపాక్ష, సార్, హాయ్ నాన్న, భోళాశంకర్, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి, ఇంటింటి రామాయణం సహా పలు సినిమాలు ఎంపికయ్యాయి. బాలీవుడ్ నుంచి జైలర్, ఓ మై డాడ్ 2, మిషన్ మజ్ను, ది ఆర్చీస్, లస్ట్ స్టోరీస్ 2 వంటి పలు చిత్రాలున్నాయి. స్వీట్ కారం కాఫీ, మోడర్న్ లవ్ చెన్నై, షైతాన్, దూత, సేవ్ ది టైగర్స్, కుమారి శ్రీమతి సిరీస్‌లు సిరీస్ విభాగంలో సెలెక్ట్ అయి, మంచి మార్కులు సాధించాయి. ట్రైలర్ టాక్‌టైమ్‘ఓ వుమానియా’ నివేదిక ప్రకారం, మహిళలు ట్రైలర్లలో 29 శాతం టాక్‌టైమ్‌కు పరిమితమయ్యారు. గత రెండేళ్లలో ఇది నామమాత్రంగా పెరిగినప్పటికీ, ఓటీటీ స్ట్రీమింగ్ (OTT Streaming) సినిమాలు ప్రమోషనల్ ట్రైలర్లలో మహిళలకు ఎక్కువ టాక్‌టైమ్ కేటాయించే ధోరణిని చూపిస్తున్నాయి. వీటిల్లో కొన్ని 55 శాతం ట్రైలర్ టాక్‌టైమ్‌తో అగ్రస్థానంలో ఉన్నాయి.తెలుగు: బూ, హాయ్ నాన్న; హిందీ: మేడ్ ఇన్ హెవెన్ సీజన్ 2, వెడ్డింగ్.కాన్, సాస్ బహు ఔర్ ఫ్లెమింగో, జానే జాన్, రెయిన్బో రిష్ట, తాలీ; మరాఠీ: జిమ్మ; తమిళం: స్వీట్ కారమ్ కాఫీపాత బెచ్‌డెల్ పరీక్షసినిమాల్లో స్త్రీలను ఎలా ప్రదర్శిస్తున్నారో కొలిచే కొలమానం ‘బెచ్‌డెల్’ పరీక్ష. దీనిని 1985లో కార్టూనిస్ట్ అలిసన్ బెచ్‌డెల్ రూపొందించారు. అప్పటి నుంచి దశాబ్దాలుగా ఈ పరీక్షను చిత్రపరిశ్రమలో లింగవివక్షపై అంతర్జాతీయ కొలమానంగా పరిగణించారు. ఒక సినిమాలో కనీసం ప్రతి రెండు సన్నివేశాల్లో ఇద్దరు పేరున్న మహిళలు మాట్లాడుతుంటే, ఆ సినిమా బెచ్‌డెల్ టెస్ట్‌లో నెగ్గినట్లు పరిగణిస్తారు. అయితే, సినిమాల కంటే సిరీస్‌లకు ఎక్కువ రన్‌టైమ్ ఉంటుంది. కాబట్టి దానిని దృష్టిలో ఉంచుకొని, ఆ ప్రమాణాన్ని ప్రస్తుతం సిరీస్‌లకు రెండు నుంచి మూడు సన్నివేశాలుగా మార్చారు.నవరత్నాలుచలనచిత్ర పరిశ్రమలోని మొత్తం తొమ్మిది విభాగాల్లో పనిచేసే మహిళల స్థితిగతులను ఈ నివేదిక విశ్లేషించింది. దర్శకత్వం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, రైటింగ్, ప్రొడక్షన్, డిజైనింగ్, సంగీతం వంటి కీలక విభాగాలలో 15 శాతం మాత్రమే మహిళలు ఉన్నారు. దీన్ని ఓటీటీ, థియేట్రికల్‌గా విభజిస్తే థియేట్రికల్‌కు 6 శాతం మాత్రమే! దక్షిణాదిలో ఈ సంఖ్య చాలా తక్కువ. గత ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య ఒక శాతం తగ్గింది. ఓటీటీలో మాత్రం పరిస్థితి మెరుగ్గా ఉంది. స్ట్రీమింగ్ సినిమాలు, సిరీస్ రెండింటిలోనూ 20 శాతం కంటే ఎక్కువ స్థానాల్లో మహిళలు నాయకత్వం వహిస్తున్నారు. 18 శాతం కంటే ఎక్కువగా మహిళా నాయకత్వం ఉన్న విభాగాలలో ఎడిటింగ్ ముందంజలో ఉంది. డైరెక్టర్ స్థానాల్లో 8 శాతం మాత్రమే మహిళలు ఉన్నారు, గత సంవత్సరంతో పోలిస్తే ఇది కొంచెం తగ్గింది.టూల్‌కిట్ టెస్ట్నాలుగు భిన్నమైన ప్రశ్నలతో తయారుచేసిన ఒక టూల్‌కిట్‌ను కూడా ఈ నివేదిక విడుదల చేసింది. ఈ టూల్‌కిట్ ఆధారంగా విశ్లేషించిన స్ట్రీమింగ్ సినిమాల్లో కేవలం 31శాతం మాత్రమే లింగ సమానత్వ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాయి. వీటిలో సిరీస్‌లు ముందంజలో ఉన్నాయి, వాటిలో 45 శాతం పరీక్షలో ఉత్తీర్ణత సాధించాయి. సినిమాలు, సిరీస్‌లు తదితరమైన వాటి నిర్మాణంలో వివిధ విభాగాలకు మహిళలు నాయకత్వం వహించినప్పుడు వాటిలో మహిళలకు సముచిత ప్రాతినిధ్యం లభించిందని, అవి బాగా విజయవంతమయ్యాయని ఈ నివేదిక వెల్లడించింది. థియేట్రికల్ సినిమాల్లో 18 శాతం మాత్రమే మహిళల నాయకత్వంలో రూపొందాయి.మహిళల ప్రాతినిధ్యంపై ప్రశ్నావళిపురుషులు లేని సంభాషణ, డైలాగ్ కనీసం ఒకటైనా ఉందా? కథానాయకుడితో ప్రేమ లేదా కుటుంబ సంబంధం లేని పాత్రను పోషించిన ఒక మహిళా పాత్ర ఉందా?2. షో/సినిమా కథకు కీలకమైన ఆర్థిక, గృహసంబంధ, సామాజిక నిర్ణయాలను తీసుకోవడంలో, కనీసం ఒక్కరైనా చురుకైన మహిళ పాత్రను పోషిస్తున్నారా? కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమాలు, సిరీస్‌లలో పురుష పాత్రలపై వ్యతిరేక దృక్పథాన్ని వ్యక్తపరచే అంశం ఉందా?షో/సినిమా స్త్రీలను లైంగికంగా చిత్రీకరించడం లేదా మహిళలపై హింసను సాధారణంగా లేదా ఆమోదయోగ్యంగా చిత్రీకరిస్తుందా?మొదటి మూడు ప్రశ్నలకు సానుకూల సమాధానం ‘అవును’, అయితే నాల్గవ ప్రశ్నకు అది ‘లేదు’ అని సమాధానాలు వచ్చినట్లయితేనే, తమ సినిమాలో లేదా సిరీస్‌లో మహిళలకు సముచిత ప్రాతినిధ్యం దక్కుతున్నట్లు నిర్మాతలు ఎవరికి వారే తేల్చుకోవచ్చు. అందుకు ఈ ప్రశ్నావళి ఉపయోగపడుతుంది.మహిళా జట్టు సినిమాల హిట్టుపూర్తి మహిళా బృందంతో చిత్రీకరించిన తొలిచిత్రం ‘ది మైడెన్’. 2018లో అలెక్స్ హూమ్స్ రచించి, దర్శకత్వం వహించిన ఈ సినిమాను విక్టోరియా గ్రెగరీ ‘న్యూ బ్లాక్ ఫిల్మ్స్’ నిర్మించింది. ఇందులో ఒక అమ్మాయి సెకండ్ హ్యాండ్ నౌకను కొని, నౌకాయానం నేర్చుకొని, రేసులో ఎలా గెలుస్తుందో చూపించారు. ఇదేవిధంగా మహిళలు ప్రధానంగా, ఎక్కువ సంఖ్యలో ఉండి ఎన్నో సినిమాలు తీశారు. వాటిల్లో ముఖ్యమైనవి, చెప్పుకోదగినవి ‘ది వుమెన్’. 1939లో విడుదలైన ఈ సినిమాలో ఒక్క పురుషుడు కూడా కనిపించడు. మొత్తం 130 మంది మహిళలు ఇందులో నటించారు.అలాగే ‘స్టీల్ మాగ్నోలియాస్’ సినిమాలో లూసియానా పట్టణంలోని ఒక స్త్రీల బృందం జీవితం, ప్రేమను చూపిస్తుంది. ‘ఎ లీగ్ ఆఫ్ దేర్ ఓన్’ ఇదొక బేస్‌బాల్ బృందం కథ. తక్కువ అంచనాలతో విడుదలైన ఈ సినిమా ఎంతోమంది చేత కంటతడి పెట్టిస్తుంది. 1993లో విడుదలైన ‘ది జాయ్ లక్ క్లబ్’ సినిమా చైనీస్ మహిళల వలసలు, తల్లుల మధ్య సంబంధాలను అద్భుతంగా చిత్రీకరించింది. 2018లో విడుదలైన ‘ఓసెన్స్ 8’ చిత్రం, మహిళలు దోపిడీలు చేస్తే ఎలా ఉంటుందో కాస్త నవ్విస్తూనే అందరినీ ఆశ్చర్యపరచేలా చూపించింది.తెలుగు తెర మెరుపులు..మహానటి సావిత్రిమహానటి సావిత్రి గొప్ప నటిగానే కాకుండా, దర్శకురాలిగానూ పేరు సంపాదించుకున్నారు. హీరోయిన్గా కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే ఆమె దర్శకత్వంలో ప్రయోగం చేశారు. సావిత్రి దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘చిన్నారి పాపలు’. 1968లో ‘శ్రీమాతా పిక్చర్స్’ నిర్మాణ సంస్థ విడుదల చేసిన ఈ చిత్రానికి సావిత్రి స్వయంగా కథారచన చేశారు. వాణిజ్యపరంగా ఇది విఫలమైనప్పటికీ, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ‘మాతృదేవత’, ‘వింత సంసారం’ వంటి సినిమాలకు కూడా ఆమె దర్శకత్వం వహించారు. బహుముఖ ప్రజ్ఞశాలి భానుమతి తెరపై కథానాయికగానే కాదు, తెర వెనుక అనేక విభాగాల్లోనూ పనిచేసిన నటి భానుమతి రామకృష్ణ. ‘చండీరాణి’ సినిమాతో డైరెక్టర్‌గా మారిన ఆమె, ‘నాలో నేను’ అనే పుస్తకంతో పాటు, మరెన్నో పాటలకు రచన, గాత్రం అందించారు. భర్త రామకృష్ణతో కలసి చిత్ర నిర్మాణంలోనూ పాలు పంచుకున్నారు. కళారంగంలో ఆమె చేసిన కృషికి జాతీయ చలనచిత్ర అవార్డుతోపాటు, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులను అందుకున్నారు. రికార్డు నెలకొల్పిన విజయనిర్మల సినీ ప్రపంచంలోకి ఒంటరిగా అడుగుపెట్టి, తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న మహిళ విజయనిర్మల. కేవలం నటిగానే కాదు, నిర్మాతగా, దర్శకురాలిగా వెండితెరపై తన పేరుకు తగ్గట్లుగానే ఎన్నో విజయాలు సాధించారు. ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించి, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్ట్స్‌లో స్థానం సంపాదించుకున్నారు. సినీ సీతమ్మ అంజలీదేవిసీతాదేవి అనగానే ఠక్కుమని గుర్తొచ్చే నటి అంజలీదేవి. అభినయ సీతమ్మగా పాపులర్ అయిన ఆమె నటిగా, డ్యాన్సర్‌గానే కాదు, నిర్మాతగానూ చేశారు. తన భర్త ఆదినారాయణరావుతో కలసి నెలకొల్పిన ‘అంజలీ పిక్చర్స్’ నిర్మాణ సంస్థ ద్వారా ‘భక్త తుకారం’, ‘చండీప్రియ’ సహా మొత్తం 27 సినిమాలను నిర్మించారు. కృష్ణవేణి ఎన్టీఆర్‌లాంటి మహానటుడిని చిత్రసీమకు పరిచయం చేసిన, ప్రముఖ నిర్మాత చిత్తజల్లు కృష్ణవేణి బాలనటిగా రంగప్రవేశం చేశారు. ఇటీవల మరణించిన ఆమె, మీర్జాపురం రాజావారితో వివాహం అనంతరం ‘జయా పిక్చర్స్’ బాధ్యతలనూ తీసుకున్నారు. తర్వాత ‘శోభనాచల స్టూడియోస్’గా పేరు మార్చి ఎన్నో చిత్రాలను నిర్మించారు. ఆమె కుమార్తె అనురాధ కూడా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 17 సినిమాలు నిర్మించి, అత్యధిక చిత్రాలను నిర్మించిన మహిళా నిర్మాతగా లిమ్కా బుక్ రికార్డ్స్ సాధించారు. కృష్ణవేణి తన 98 ఏళ్ల వయసులో 2022లో ‘సాక్షి ఎక్సలెన్స్’ అవార్డుల్లో భాగంగా ‘జీవిత సాఫల్య పురస్కారం’ అందుకున్నారు. మరెందరో!నటి జీవితా రాజశేఖర్ ‘శేషు’ సినిమాతో దర్శకురాలిగా మారి, ‘సత్యమేవజయతే’, ‘మహంకాళి’ వంటి సినిమాలను రూపొందించారు. సూపర్‌స్టార్ కృష్ణ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మంజుల ఘట్టమనేని ‘మనసుకు నచ్చింది’ సినిమాకు దర్శకత్వం వహించారు. మరెన్నో సినిమాలకు నిర్మాతగానూ వ్యవహరించారు. తొలి చిత్రం ‘ఆంధ్రా అందగాడు’ సినిమాతో విమర్శలు అందుకున్న సుధ కొంగర, తాజాగా ఆకాశమే హద్దు అనిపించారు.‘ద్రోహి’, ‘గురు’ చిత్రాలతో పాటు, ‘ఆకాశమే నీ హద్దు రా’ సినిమాతో వరుస విజయాలు అందుకున్నారు. ‘అలా మొదలైంది’ చిత్రంతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చిన నందినిరెడ్డి, ‘కళ్యాణ వైభోగమే’, ‘ఓ బేబీ’ మరెన్నో విజయవంతమైన చిత్రాలను చిత్రీకరించారు. దశాబ్దంపాటు, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచే సి, తొలిచిత్రం ‘పెళ్లి సందడి’తో విజయం సాధించారు డైరెక్టర్ గౌరీ రోణంకి. నిర్మాణ రారాణులుసినీ ప్రపంచంలో నిర్మాతలుగా రాణిస్తున్న రాణులు కూడా లేకపోలేదు. దిల్‌రాజు కుమార్తె హన్షితా రెడ్డి, తండ్రి బాటలోనే సుమారు 50కి పైగా సినిమాలు నిర్మించారు. మెగా కుటుంబం నుంచి వచ్చిన నిహారిక కొణిదెల కూడా ఇటు ప్రొడక్షన్ రంగంలో గుర్తింపు తెచ్చుకున్నారు. పలు వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిల్మ్స్ నిర్మించారు. చిన్న సినిమాలే కాదు, భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించారు, నిర్మాత అశ్వనీ దత్ కూతుర్లు అయిన స్వప్న దత్, ప్రియాంక దత్. అన్నపూర్ణ స్టూడియోస్ సీఈఓ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుప్రియ యార్లగడ్డ కూడా ఎన్నో చిత్రాలను నిర్మించింది. వీరితో పాటు నటి సమంత ‘ట్రలాలా మూవింగ్ పిక్చర్స్’ , నయనతార ‘రౌడీ పిక్చర్స్’, జ్యోతికలు వివిధ ప్రొడక్షన్ హౌస్‌లు స్థాపించి, తమదైన రీతిలో రాణిస్తున్నారు. చిత్రపరిశ్రమలో వైవిధ్యం, స్త్రీ పురుష సమానత్వం ఉన్నట్లయితే, సమాజంలో సానుకూల మార్పులకు అవి దోహదపడతాయి. వినోదరంగంలో మహిళలకు మరిన్ని అవకాశాలను సృష్టిస్తూ, వైవిధ్యభరితమైన, సమ్మిళితమైన, సమానమైన పరిస్థితులను కల్పించాలి. ప్రతి ఒక్కరూ స్త్రీలను చూసేలా, వినగలిగేలా, సానుకూలంగా చెప్పుకునేలా చేయాలి. అప్పుడే సినిమా బతుకుతూ, మరెందరినో బతికిస్తుంది. -
Kanyasulkam నాకు నచ్చిన పాత్ర మధురవాణి-ఓల్గా
ఎవరు సృష్టించిన పాత్ర వారికి నచ్చడం గురించి కాదు... కఠినమైన నిష్కర్షయిన విమర్శకుడిగా మారి చూసిన రచయితకు ముచ్చట గొలిపిన పాత్ర మధురవాణి. కన్యాశుల్కం కథానాయిక, నాయకుడు కూడా మధురవాణే. వేశ్యాకులంలో పుట్టింది. సంగీత, సాహిత్యాలలో సుశిక్షితురాలు. మంచివారి ఎడల మంచిగానూ చెడ్డవారి ఎడల చెడ్డగానూ ప్రవర్తించమన్న తల్లి మాటల విలువ తెలుసుకున్నది. అయితే చాలాసార్లు ముఖ్యంగా తోటి స్త్రీలకు సహాయపడే సందర్భాలలో ఆమె తన పట్ల చెడ్డగా ఉన్నవారి పట్ల కూడా మంచిగనే ఉంది. మానవ సంబంధాలలో ఎంత సున్నితంగా, ఆత్మగౌరవంతో ఉండవచ్చో మధురవాణి నుంచి మనం నేర్చుకోవచ్చు. మనస్తత్వం, చతురత, హాస్య ప్రియత్వం, కార్యసాధనా సామర్థ్యం, కత్తుల వంటి విమర్శలను పువ్వుల వలే విసరగల దక్షత, ఎదుటివారు తనను అవమానిస్తున్నారని తోస్తే గొంతు నులమకుండానే వారికి ఊపిరాడనీయకుండా చేయగల నేర్పు, తనను తాను కాచుకోగల ఒడుపు. ఇంత అందంగా గొప్పగా మధురవాణిని ఎలా రూపుదిద్దగలిగాడో గురజాడ!స్నేహం, ప్రేమలకు మాటలాడటం నేర్పి మన తెలుగు వారికి మంచిచెడ్డలు తెలియచెప్పేందుకు సృష్టించిన పాత్ర మధురవాణి. భారతీయ సాహిత్యంలో కూడా మధురవాణికి సాటి వచ్చే పాత్రలు ఒకటి రెండు కంటే ఉండవు. కన్యాశుల్కం ఆచారానికి బానిసవబోతున్న సుబ్బిని బలైపోతున్న బుచ్చమ్మను మధురవాణి రక్షించడమే కన్యాశుల్కం నాటక సారాంశం. అణిచివేతకు గురైన స్త్రీలు ఒకరికొకరు తోడైతే విముక్తి చెందగలరనే ఆశను కల్పించింది మధురవాణి. తనకు పేర్లు కూడా తెలియని ఎన్నడూ చూడని సుబ్బికి, వెంకమ్మకి, బుచ్చమ్మకి, మీనాక్షికి సహాయం చేయాలనే ఆలోచన ఆమెలోని మానవత్వానికి నిదర్శనం. అనివార్యంగా తనలో కలిగిన ఆలోచనలకు ఆచరణాత్మక రూపమే మధురవాణి. నీతి కలిగిన మనిషి. దయగలిగిన మనిషి. ఆమె దయకు పాత్రం కాని మనిషి కన్యాశుల్కంలో ఎవరున్నారు?మధురవాణి కాకుండా మరోపాత్ర పేరు చెప్పమంటే క్షణం ఆలోచించకుండా నేను చెప్పే మరో స్త్రీ పాత్ర ‘శాంతం’. ఉప్పల లక్ష్మణరావు గారి ‘అతడు ఆమె’ నవలలో కథానాయిక. ఇక కొడవటిగంటి కుటుంబరావు ‘కస్తూరి’, ‘స్వరాజ్యం’ చలం నవలా నాయికలు ... ఇలా ఎన్ని పేర్లయినా ఉంటాయి. కాని మధురవాణి మధురవాణే. -
ఆ ‘సగమే’ అసలు బలం
శరీరంలో ఐరన్ లేమి స్త్రీలను బాధిస్తూ ఉంటుంది. గర్భధారణ, ప్రసవ సమయాలలో ఎంతో కీలకమైన ఐరన్ కోసం స్త్రీలు ఆహారం, మందుల మీద ఆధారపడుతుంటారు. ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ అంచనా ప్రకారం నేడు ప్రపంచ వ్యాప్తంగా 15 నుంచి 49 ఏళ్ల మధ్య ఉన్న స్త్రీలు 50 కోట్ల మంది ఐరన్ డెఫిషియెన్సీతో బాధ పడుతున్నారు.కాని వీరు తమ స్వభావంలో ఉక్కుగుణాన్ని మాత్రం ఎన్నడూ వదులుకోరు. వీరు మాత్రమే కాదు ప్రతి స్త్రీ తన జీవనంలో, పరిస్థితులను ఎదుర్కొనడంలో ఉక్కు మహిళే. ఆ మహిళ తెలుగు నాట మారుమూల పల్లెలో ఉండొచ్చు. ప్రపంచంలో వేరే మూలన మరో గూడెంలో ఉండొచ్చు. మహిళా దినోత్సవం ‘స్థానికం’గా నిర్వహించే తంతు కాదు.ఇది అంతర్జాతీయ వేడుక. ప్రపంచ మహిళలను ఏకం కావాలని కోరే సందేశ సందర్భం. 1910లో కోపెన్‌హెగెన్‌లో 17 దేశాల నుంచి వచ్చిన 99 మంది మహిళలు ‘శ్రామిక మహిళల హక్కుల దినోత్సవం’ కోసం పిలుపు ఇచ్చినప్పుడు అది అంతర్జాతీయ మహిళా దినోత్సవం కావాలనే కోరుకున్నారు. కారణం భూమ్మీద ఏ మూలన ఉన్న స్త్రీ అయినా స్థూలంగా ఎదుర్కొనే సమస్యలు ఒకటేనని భావించడం. అందరూ కలిసి సమస్యల పై పోరాడాలని కోరుకోవడం.ఇన్నేళ్లు గడిచినా రూపంలో, సారంలో స్త్రీలు అనేక సవాళ్లను ఎదుర్కొంటూనే ఉన్నారు. యుద్ధాలు వస్తే వారు తమ ఇంటిని, భర్తను, సంతానాన్ని కోల్పోతున్నారు. ప్రభుత్వాలు అభివృద్ధి పేరుతో చేసే తవ్వకాలు, కట్టే పెను కట్టడాలు, ప్రకటించే సుందరీకరణాలు మొదటగా స్త్రీలు శ్రమపడి అల్లిన గూళ్లనే ధ్వంసం చేస్తున్నాయి. చట్టపరమైన అనుమతి కలిగిన వ్యసనాలు... మద్యపానం, ధూమపానం పురుషుల ఆరోగ్యాన్ని దెబ్బ తీసి స్త్రీల మీద పెను ఒత్తిడి పెడుతున్నాయి. తాజాగా ఆన్లైన్ ట్రేడింగ్ అడిక్షన్ లక్షల కొద్ది అప్పును కుటుంబం మీద కుమ్మరించేలా చేస్తోంది. కడుపున పుట్టిన సంతానం పాలిట డ్రగ్స్, గంజాయి పెను పడగలు విప్పి ఉన్నాయి. స్త్రీ తన చేతులతో ఒండి పెట్టాల్సిన ఆహారం కలుషితాలను కలిగి బతుక్కు ఏమాత్రం గ్యారంటీ ఇవ్వలేకపోతోంది. నిత్యావసర ఖర్చులను స్త్రీయే అజమాయిషీ చేసి ఎంత పొదుపు చేయాలనుకున్నా అనారోగ్య ఖర్చు, చదువు ఖర్చు స్త్రీల ప్రధాన కార్యక్షేత్రమైన ‘ఇంటిని’ పూర్తిగా సంక్షోభంలో పడేస్తున్నాయి.దేశం సరిహద్దులోని సైన్యం, కేంద్ర, రాష్ట్రాలలో ప్రభుత్వ యంత్రాంగం వల్ల మాత్రమే నడుస్తోంది అనుకుంటే పొరపాటు. వీటన్నింటి మధ్య ఉక్కుగుణాన్ని వదుల్చుకోని స్త్రీలే దేశాన్ని నడుపుతున్నారు. అయినప్పటికీ వీరి స్థయిర్యాన్ని దెబ్బ తీయడానికి తగిన పీడనలను ఈ సమాజం వదులుతూనే ఉంది. లైంగిక వేధింపులు, సామూహిక అత్యాచారాలు, యాసిడ్ దాడులు, ప్రేమకు ‘నో’ చెప్తే హత్యలు, ఉద్యోగ ఉపాధి రంగాల్లో జీతభత్యాల వివక్ష, చట్ట సభల్లో ఇంకా దొరకని వాటా, గృహ హింస, వరకట్నం, తీరికే ఇవ్వని ఇంటి చాకిరి, పిల్లల పెంపకం, ఆడపిల్ల జననానికి అననుకూలత... ఇవన్నీ ప్రపంచవ్యాప్త స్త్రీలతో పాటు భారతీయ మహిళలకు మూగదెబ్బలుగా మారుతున్నాయి.నిజానికి ఇప్పుడు వారి బాధ్యత ఇంకా పెరిగింది. స్త్రీలు ముందుకు వస్తే తప్ప సరికాని సమస్యలు పెరుగుతున్నాయి. పురుషులు తెస్తున్న దేశాల మధ్య యుద్ధం, పర్యావరణ విధ్వంసం, ΄పౌర హక్కుల విఘాతం, న్యాయ వివక్ష, మత విద్వేషం, తప్పుడు వాట్సప్ సమాచారాల పంపిణి, బలహీనులపై బెదిరింపు... ఇవన్నీ మొదట ఎవరో మనకు తెలియని స్త్రీ ఇంటికే హాని కలిగించవచ్చుగాని కాలక్రమంలో అవి ప్రతి ఇంటికీ చేరుతాయి.స్త్రీలు తాము నివసించే ఇంటి లోపలి, బయటి ఆవరణాలను ప్రజాస్వామ్య స్వభావంతో ఉంచడానికి... సుహృద్భావన పెంచడానికి... పిల్లలకు అందరూ కలిసి ఆడే ఆటస్థలాలు ఇవ్వడానికి... సంపద కాస్తయినా దిగువ వర్గాలకు అందేలా చూడటానికి... విద్య, వైద్యంలో అతి డబ్బు ప్రమేయాన్ని నిరోధించడానికి.... ఆచార వ్యవహారాలు గుదిబండలుగా మారకుండా, రాజ్యాంగస్ఫూర్తిని రక్షించుకోవడానికి మరింత ఆలోచన, చైతన్యం కలిగించుకోవాలి. మరింత ఉక్కుగుణం సముపార్జించుకోవాలి.ప్రతి స్త్రీకి తను, తన కుటుంబం, తన సమాజం, తన దేశం, తన ప్రపంచం... ఇవన్నీ ముఖ్యం. దుర్మార్గం అనేది కేవలం ఇతరుల పాలిట జరిగితే ఊరుకోగలిగేది కాదు. దుర్మార్గం అందరూ ఖండించదగ్గది. పురుష సమాజం తన దుర్మార్గాలకు అడ్డెవరు నిలుస్తారులే అనుకుంటే జవాబు స్త్రీల నుంచే వస్తుంది. స్త్రీలకు ఇంటిని చక్కదిద్దుకోవడమే కాదు... పరిస్థితులను చక్కదిద్దడం కూడా తెలుసు. ఉక్కు మహిళలకు స్వాగతం.అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా నేటి నుంచి సాక్షి ఫ్యామిలీలో వారం రోజుల పాటు విశిష్ట కథనాలను అందించనున్నాం. -
మా అమ్మ మాకు ఇన్స్పిరేషన్
-
International Women's Day 2025 : మీకు స్ఫూర్తినిచ్చిన వనితను గుర్తు చేసుకోండి!
ప్రతీ ఏడాది మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటాం. మహిళల హక్కులను గుర్తించడం, వారి సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక విజయాలను,గౌరవించడమే దీని లక్ష్యం. ఈ సందర్భంగా లింగ సమానత్వం, పునరుత్పత్తి హక్కులు, మహిళలపై హింసపై పోరాటం, సమాన హక్కులు అంశాలపై విస్తృతంగా చర్చించుకోవడం అవసరం. తల్లిగా, సోదరిగా, భార్యగా, కుమార్తెగా మహిళ పాత్ర మన జీవితాల్లో చాలా కీలకమైంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మీ జీవితంలో ప్రభావం చూపిన, లేదా మీరు మెచ్చిన నచ్చిన మహిళ గురించి ఒక నిమిషం వీడియో చేయండి. ఆమెతో మీ అనుబంధాన్ని మరోసారి గుర్తుచేసుకోండి. దీనికి #VanithaVandanam యాడ్ చేయడం మర్చిపోద్దు!