
రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా అంబానీ వ్యాపారవేత్తగా, మానవతావాదిగా మాత్రమే కాదు ఆధ్యాత్మికవాదిగా ఎప్పుడూ వార్తల్లో ఉంటుంటారు. ఇటీవల నీతా షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించింది. సాయినాధుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎప్పటి లాగానే ఈ సారి కూడా ఆమె సాంప్రదాయదుస్తుల్లో దుస్తుల్లో తన స్టైల్‌ని చాటుకున్నారు. తల్లి పూర్ణిమ దలాల్, సోదరి మమతా దలాల్‌తో కలిసి నీతా అంబానీ ఇక్కడికి రావడం విశేషంగా నిలిచింది.
నీతా అంబానీ వీడియోను అంబానీ అప్‌డేట్ పేజ్ ఇన్‌స్టాలో షేర్ చేసింది. తల్లి పూర్ణిమ దలాల్ ,సోదరి మమతా దలాల్‌తో కలిసి షిర్డీ ఆలయంలో బాబాను దర్శించుకున్నారు. అత్యంత భక్తి శ్రద్దలతో బాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాబా పాదాలకు మొక్కొ ఆశీర్వాదం తీసుకున్నారు. నీతా అంబానీ పువ్వులు సమర్పించడం, దీపాలు వెలిగించడం ,ఆలయంలో సమయం గడపడం ఈ వీడియోలో చూడవచ్చు. అలాగే ఆలయం తరుపున ఆమెకు షిర్డీ సాయిబాబా జ్ఞాపికను కూడా బహుకరించారు.
ముఖ్యంగా సింపుల్ గులాబీ రంగు బాంధానీ కుర్తాలో చాలా హుందాగా కనిపించారు. దీనికి జోడీగా పింక్ కలర్ మ్యాచింగ్ దుపట్టాతో సింపుల్ లుక్‌లో ఆకట్టుకున్నారు. అలాగే డైమండ్ స్టడ్‌లు, రత్నాలు పొదిగిన గాజులు , ఉంగరాలతో చాలా సరళంగా కనిపించారు.
కాగా ఇటీవల నీతా అంబానీ తన చిన్నకుమారుడు అనంత్ అంబానీ 30వ పుట్టిన రోజు సందర్భంగా అనంత్, కోడలు రాధిక మర్చంట్‌తో కలిసి రామ నవమి వేడుకల కోసం ద్వారకాధీష్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేసిన సంగతి తెలిసిందే.