
మూడు దేశాల్లో జిన్‌పింగ్ పర్యటన
బీజింగ్: అమెరికా టారిఫ్‌ల పోరు నేపథ్యంలో ప్రాంతీయ బంధాలను బలోపేతం చేసుకోవడంపై చైనా దృష్టి పెట్టింది. అధ్యక్షుడు జిన్ పింగ్ వచ్చే వారం మూడు ఆగ్నేయాసియా దేశాల్లో పర్యటించనున్నారు. ఏప్రిల్ 14 నుంచి 15 వరకు వియత్నాంలో, 18 వరకు మలేసియా, కంబోడియాల్లో ఆయన పర్యటిస్తారని చైనా విదేశాంగ శాఖ శుక్రవారం ప్రకటించింది.
సుంకాల బాదుడు నుంచి ఇతర దేశాలన్నింటికీ 90 రోజుల ఉపశమనం కలి్పంచిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై మాత్రం టారిఫ్‌లు ఎడాపెడా పెంచేసిన నేపథ్యంలో జిన్‌పింగ్ పర్యటనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అమెరికా వాణిజ్య యుద్ధాన్ని ఎదుర్కోవడంలో కలిసి రావాల్సిందిగా భారత్‌కు కూడా చైనా విజ్ఞప్తి చేసింది.