
న్యూయార్క్: ఎన్నో ఆశలతో అమెరికాలో అడుగుపెడుతున్న కొందరు భారతీయ విద్యార్థుల భవిత అర్ధంతరంగా ముగిసిపోతోంది. ఆ విషాదపర్వంలో మరో ఉదంతం తాజాగా చోటుచేసుకుంది. భారతీయ మూలాలున్న విద్యార్థి సమీర్ కామత్ సోమవారం సాయంత్రం ఇండియానా రాష్ట్రంలో విగతజీవిగా కనిపించారు. 23 ఏళ్ల సమీర్ మెకానికల్ ఇంజనీరింగ్‌లో పీహెచ్‌డీ చేస్తున్నారు. క్రోవ్స్ గ్రో ప్రాంతంలోని స్థానిక నేచర్ ప్రిసర్వ్‌లో సమీర్ మృతదేహాన్ని కనుగొన్నట్లు వారెంట్ కౌంటీ అధికారి వెల్లడించారు. పోస్ట్‌మార్టమ్ నివేదిక వచ్చాకే మరణానికి కారణాలపై అంచనాకు రాగలమన్నారు.
హైదరాబాద్ విద్యార్థిపై దాడి
అమెరికాలో భారతీయ విద్యార్థులపై దాడుల పరంపర కొనసాగుతోంది. తాజాగా హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ మజహర్ అలీ అనే విద్యారి్థపై దుండుగులు దాడికి పాల్పడ్డారు. అతను ఇండియానా వెస్లియాన్ యూనివర్సిటీలో ఐటీలో మాస్టర్స్ చదువుతూ షికాగోలో నివసిస్తున్నాడు. ఈ నెల 4న ఇంటి సమీపంలో ముగ్గురు దండగులు దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. ఇటీవల పలువురు భారత విద్యార్థులు అమెరికాలో హత్యకు గురవడం తెలిసిందే.