
దేర్ అల్ బలా: గాజాపై ఇజ్రాయెల్ నిరంతర దాడులకు తెగబడుతోంది. తాజాగా ఇజ్రాయెల్ సైన్యం(Israeli army) దక్షిణ గాజాలోని ప్రముఖ ఆస్పత్రిపై దాడి చేసింది. ఈ దాడిలో ఒకరు మరణించగా, పలువురు గాయపడ్డారు. ఇజ్రాయెల్ దాడుల అనంతరం ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం సంభవించిందని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
⭕️A key Hamas terrorist who was operating from within the Nasser Hospital compound in Gaza was precisely struck.
The strike was conducted following an extensive intelligence-gathering process and with precise munitions in order to mitigate harm to the surrounding environment as… pic.twitter.com/C3pZqlC6NO— Israel Defense Forces (@IDF) March 23, 2025
అంతకుముందు దక్షిణ గాజా ప్రాంతంలో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హమాస్ సీనియర్ నాయకునితో సహా 26 మంది పాలస్తీనియన్లు(Palestinians) మృతిచెందారు. ఖాన్ యూనిస్ నగరంలోని నాసర్ ఆసుపత్రిని లక్ష్యంగా చేసుకుని తాజాగా దాడి జరిగిందని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇటీవల ఇజ్రాయెల్ వైమానిక దాడులతో గాజాలో యుద్ధాన్ని తిరిగి ప్రారంభించింది. ఈ నేపధ్యంలో పెద్ద సంఖ్యలో మృతులు, గాయపడిన వారిని నాసర్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. మరోవైపు ఇజ్రాయెల్ సైన్యం ఆసుపత్రిపై దాడిని ధృవీకరించింది. యాక్టివ్‌గా ఉన్న హమాస్ ఉగ్రవాదులపై దాడి జరిగిందని తెలిపింది.
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం(Israel-Hamas war)లో ఇప్పటివరకూ 50 వేల మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ యుద్ధంలో ఇప్పటివరకు ఒక లక్షా 13 వేల మందికి పైగా జనం గాయపడ్డారని పేర్కొంది. కాల్పుల విరమణ ముగిసిన తర్వాత ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో 673 మంది మృతిచెందారు. మృతుల్లో 15,613 మంది చిన్నారులు ఉన్నారు. వీరిలో 872 మంది ఏడాది లోపు వయసు కలిగినవారు. ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం 2023, అక్టోబర్ 7న ప్రారంభమైంది.
ఇది కూడా చదవండి: కర్నాటక ముస్లిం కోటా బిల్లుపై రాజ్యసభలో రసాభాస