మోదీకి శ్రీలంక మిత్ర విభూషణ పురస్కారం | PM Modi Srilanka Visit Live updates Day 1 Updates | Sakshi
Sakshi News home page

శ్రీలంక పర్యటన.. మోదీకి శ్రీలంక మిత్ర విభూషణ పురస్కారం

Published Sat, Apr 5 2025 9:37 AM | Last Updated on Sat, Apr 5 2025 1:52 PM

PM Modi Srilanka Visit Live updates Day 1 Updates

కొలంబో: మూడు రోజుల పర్యటన నిమిత్తం భారత ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) శ్రీలంకకు చేరుకున్నారు. ఘన స్వాగతంలో భాగంగా.. కొలంబోలోని ఇండిపెండెన్స్‌ స్క్వేర్‌ వద్ద భారత ప్రధానికి గార్డ్‌ ఆఫ్‌ ఆనర్‌ దక్కింది. ఇవాళ ఆ దేశ అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకేతో మోదీ భేటీ కానున్నారు. 

కాగా, ఈ పర్యటనలో ఇరు దేశాల మధ్య ఇంధనం, రక్షణ, వాణిజ్య, డిజిటల్‌ ఒప్పందాలు కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే.. భారత్‌ సహకారంతో ఆ దేశంలోనూ పలు ప్రాజెక్టులు నిర్మాణం జరిగే అవకాశం ఉంది.

మోదీకి శ్రీలంక అత్యున్నత పురస్కారం
శ్రీలంకలో పర్యటిస్తున్న భారత ప్రధాని నరేంద్రమోదీని ‘శ్రీలంక మిత్ర విభూషణ’ పురస్కారాన్ని అందజేశారు. ఈ అవార్డు అందుకోవడానికి మోదీ అన్నివిధాల అర్హుడని అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే అన్నారు. 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement