
మహనీయుల అడుగుజాడల్లో నడవాలి
కరీంనగర్‌సిటీ: మహనీయుల అడుగుజాడల్లో నడిచి దేశాభివృద్ధికి పాటుపడాలని శాతవా హన యూనివర్శిటీ వైస్ చాన్స్‌లర్ ఉమేశ్‌కుమార్ అన్నారు. శాతవాహన లైబ్రరీ ఆడిటోరి యంలో అంబేడ్కర్, మహనీయుల జయంతోత్సవాల ముగింపు కార్యక్రమం సోమవారం నిర్వహించారు. రిజిస్ట్రార్ ఆచార్య రవికుమార్ జాస్తి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో వీసీ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అంబేడ్కర్ ప్రణాళికల వల్లే సమాజంలో అంద రూ సమాన అవకాశాలు అందుకుంటున్నారని తెలిపారు. విశిష్ట అతిథిలు ఆర్ట్స్ కళాశాల ప్రిన్సి పాల్ సూరేపల్లి సుజాత, కొండగట్టు జేఎన్టీ యూ ప్రిన్సిపాల్ ప్రభాకర్, సైన్స్ కళాశాల ప్రి న్సిపాల్ జయంతి మాట్లాడుతూ, అంబేడ్కర్ ఆశయాలను అమలుపరచడమే నిజమైన జ యంతి వేడుకలని, విద్యార్థులు బాగా చదువుకొని తమ సదుపాయాల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. అనంతరం వ్యాసరచన, రంగోలి, క్విజ్ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. మాజీ జాయింట్‌కలెక్టర్ గంగారాం, ఎన్‌ఎస్‌ఎస్ సమన్వయకర్త మనోహర్, ఓఎస్‌డీ టు వీసీ డా.హరికాంత్, ఎస్సీ, ఎస్టీ సెల్ డైరెక్టర్ డా.పద్మావతి, మైనార్టీ సెల్ డైరెక్టర్ డా.హుమెరా తస్నీమ్, బీసీ సెల్ డైరెక్టర్ డా.సరసిజ, అధ్యాపకులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ శ్రేణుల వాగ్వాదం
చిగురుమామిడి(హుస్నాబాద్): చిగురుమామిడి ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో సోమవారం సింగిల్ విండో మాజీ చైర్మన్ చిటుమల్ల శ్రీనివాస్, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్, కాంగ్రెస్ చిగురుమామిడి మండల అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ‘నీవు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తవు కాదు, నీకు నేను సభ్యత్వం ఇవ్వలేదు, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరతావు’ అంటూ శ్రీనివాస్‌పై తిరుపతిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు మంత్రి పొన్నం ప్రభాకర్ పార్టీ కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారని శ్రీనివాస్ బదులిచ్చారు. ‘నాకు తెలియకుండా మంత్రి ఎప్పుడు కండువా కప్పారు, ఇది అబద్ధం, నీ ప్రవర్తన సరిగా లేదు, రైతులకు లేనిపోని మాటలు చెప్తున్నావు జాగ్రత్త’ అంటూ తిరుపతిరెడ్డి హెచ్చరించారు. ఇద్దరు నాయకులను అక్కడ ఉన్నవారు సముదాయించడంతో వాగ్వాదం సద్దుమణిగింది.