Karimnagar District News
-
రైలు కిందపడి వృద్ధుడి ఆత్మహత్య
జమ్మికుంట : రైలు కిందప డి ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రామగుండం రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ గంగారపు తి రుపతి తెలిపిన వివరాల ప్రకారం...హుజూరాబాద్ పట్టణంలోని మామిడ్లవాడకు చెందిన పొట్ట బ త్తిని సురేందర్ (69) కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. పట్టణంలోని రైల్వేస్టేషన్ రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని రైలు కిందపడి గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య సావిత్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు పేర్కొన్నారు. ‘పది’ ఫలితాలు రాకముందే విద్యార్థిని మృతి ● రూ.10 లక్షలు వెచ్చించినా దక్కని ప్రాణం బోయినపల్లి(చొప్పదండి): పదోతరగతి పరిక్షలు రాసి.. ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థిని ఆకుల నాగచైతన్య(15) అనారోగ్యంతో గురువారం మృతిచెందింది. బోయినపల్లి మండలం మల్లాపూర్‌కు చెందిన ఆకుల చిన్న రవి–రజిత దంపతులకు ముగ్గురు కూతుళ్లు. చిన్నకూతురు నాగచైతన్య ఆటో ఇమ్యూన్ వ్యాధితో ఏడాదిగా బాధపడుతోంది. గతంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నాగచైతన్యకు రూ.2.50లక్షల మేర ఎల్వోసీ ఇచ్చారు. హైదరాబాద్‌లోని నిమ్స్‌లో ఏడాదిగా చికిత్స పొందుతోంది. నాగచైతన్య చికిత్స కోసం తల్లిదండ్రులు దాదాపు రూ.10 లక్షల వరకు ఖర్చు చేశారు. గత మార్చిలో 10వ తరగతి పరీక్ష రాసింది. మూడు రోజుల క్రితం వ్యాధి తీవ్రం కావడంతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించి గురువారం మధ్యాహ్నం మృతిచెందింది. చురుకై నా విద్యార్థిని అర్ధంతరంగా ప్రాణాలు వదలడంతో ఆమె చదివిన స్కూల్ ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన వ్యక్తి అరెస్ట్కథలాపూర్: కథలాపూర్ మండలం సిరికొండ గ్రామానికి చెందిన చెరుకూరి శంకర్ విధుల్లో ఉన్న పోలీసులతో దురుసుగా ప్రవర్తించినందుకు గురువారం అరెస్టు చేసినట్లు ఎస్సై నవీన్‌కుమార్ తెలిపారు. ఈనెల 14న సిరికొండలో గొడవ జరుగుతుందన్న సమాచారం మేరకు పోలీసులు వెళ్లారు. శంకర్‌ను గొడవ చేయవద్దని పోలీసులు చెప్పగా.. వారిపై దురుసుగా ప్రవర్తించి విధులకు ఆటంకం కలిగించాడు. శంకర్‌ను గురువారం అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించామని ఎస్సై నవీన్‌కుమార్ పేర్కొన్నారు. అగ్నిప్రమాదంలో ఈతచెట్లు దగ్ధం కథలాపూర్: కథలాపూర్ మండలం సిరికొండ గ్రామశివారులో ప్రమాదవశాత్తు నిప్పంటుకోవడంతో 400 ఈత చెట్లు కాలిపోయినట్లు గీతకార్మికులు గరువారం తెలిపారు. రోజుమాదిరిగానే బుధవారం సాయంత్రం ఈతచెట్లకు కల్లు గీసేందుకు వెళ్లి ఇంటికి వచ్చామని పేర్కొన్నారు. ప్రమాదవశాత్తు నిప్పంటుకోవడంతో పిచ్చిమొక్కలతోపాటు 400 ఈతచెట్లు కాలిపోవడంతో తాము ఉపాధి కోల్పోయామని వాపోయారు. సంఘటన స్థలాన్ని ఆర్ఐ నాగేశ్ పరిశీలించి వివరాలు సేకరించారు. ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామని తెలిపారు. -
చందుర్తిలో మూడిళ్లలో చోరీ
చందుర్తి(వేములవాడ): చందుర్తి పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలోని మూడిళ్లలో బుధవారం అర్ధరాత్రి దొంగలు పడ్డారు. మండల కేంద్రంలోని రెండిళ్లలో చొరబడ్డ దొంగలు వస్తువులను చిందరవందరగా పడేశారు. సిర్రం రాజవ్వ ఇంట్లో రూ.15వేలు, వెంగళి వినోద ఇంట్లో రూ.25వేలు ఎత్తుకెళ్లారు. చర్చి పాస్టర్ ప్రశాంత్ ఇంటిలోకి ప్రవేశించి ఆరుబయట నిలిపిన బైక్‌ను ఎత్తుకెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై అంజయ్య దొంగతనం జరిగిన ఇళ్లలోని కుటుంబ సభ్యుల నుంచి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. అంతేకాకుండా వేలిముద్రల ఆధారంగా దొంగలు పట్టుకునేందుకు క్లూస్‌టీమ్‌తో ఆధారాలను సేకరించారు. మండలకేంద్రంలోని సీసీ పుటేజీలను సేకరించి దర్యాప్తు మమ్మురం చేస్తున్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు చందుర్తి ఎస్సై అంజయ్య తెలిపారు. ఠాణాకు కూతవేటు దూరంలో దొంగతనాలు -
అజ్ఞాతంలోనే నాలుగు దశాబ్దాలు
కోరుట్ల: మావోయిస్టుల్లో 1985లో చేరిన జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన పసుల వసంత (68) సుమారు 40 ఏళ్లపాటు అజ్ఞాతంలోనే గడిపారు. 2001లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా (ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా)లోని ఎల్లారెడ్డిపేట మండలం మద్దిమల్ల ఎన్కౌంటర్లో మావోయిస్టు ఉత్తర తెలంగాణ స్పెషల్ జోన్ కార్యదర్శిగా పనిచేస్తూ భర్త పసుల రాంరెడ్డి చనిపోయినా.. ఆమె ఉద్యమబాటను వదిలిపెట్టలేదు. ఆయన లేకున్నా.. భర్త అడుగుజాడల్లో మరో పాతికేళ్లపాటు ఉద్యమంలోనే గడిపి చివరగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ఉత్తర బస్తర్ డివిజన్ కార్యదర్శిగా పనిచేశారు. వయోభారం, అనారోగ్య కారణాలతో ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లా పోలీసులకు పసుల వసంత 2025 జనవరిలో లొంగిపోయారు. రెండు రోజుల క్రితం ఆమె కోరుట్లలోని తన బంధువుల చెంతకు చేరింది. ఆధార్‌కార్డు లేనే లేదు.. ఉద్యమబాటలోనే నాలుగు దశాబ్దాలు గడిపిన వసంతకు ఆధార్ కార్డు లేదు. అజ్ఞాతంలో ఉన్న ఆమె ఏనాడూ జనజీవన స్రవంతిలోకి రాకపోవడంతో ఆమెకు ఆధార్‌కార్డు అవసరమే రాలేదు. ఇప్పుడు పరిస్థితి వేరు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే వసంత పేరిట రూ.8 లక్షల రివార్డు ప్రకటించింది. దీంతోపాటు తెలంగాణ ప్రభుత్వ పరంగా రూ.ఐదు లక్షల రివార్డు ఉన్నట్లు ఇంటలిజెన్స్ పోలీసులు వసంత కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఈ రివార్డులు పొందాలంటే వసంతకు ప్రస్తుతం ఆధార్‌కార్డు తప్పనిసరి అయింది. ఉద్యమం నుంచి బయటకు వచ్చిన ఆమెకు కోరుట్లలో నివాస గృహం ఉంది. కోరుట్లలోని అంబేద్కర్‌నగర్‌లో ఉన్న ఇంటి ఆధారంగా రెసిడెన్స్ సర్టిఫికెట్ తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. కనికరించాలని వేడుకోలు కోరుట్లకు చెందిన వసంతకు అత్తగారింటికి చెందిన ఇల్లు తప్ప ఇతరత్రా ఆస్తులు లేవు. ఆ కాలంలో రేషన్‌కార్డు తీసుకోలేదు. భర్త పసుల రాంరెడ్డి సైతం మావోయిస్టు ఉద్యమంలోనే 2001లో చనిపోవడంతో వీరిద్దరికి దాదాపుగా ఆధార్‌కార్డు, రేషన్‌కార్డులు లేకపోవడం గమనార్హం. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో కాంకేర్ జిల్లా ఎస్పీ సమక్షంలో లొంగిపోయిన సందర్భంలో అక్కడి ప్రభుత్వం రూ.8 లక్షల రివార్డు ప్రస్తావన వచ్చినట్లు సమాచారం. ఈ సమయంలో ఛత్తీస్‌గఢ్ పోలీసులు వసంత లొంగిపోయినట్లు ఇచ్చిన ధ్రువీకరణ పత్రం ఆధారంగా ఆధార్‌కార్డును తయారు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ఆమె కూతురు భవానీ జిల్లా కలెక్టర్‌ను వేడుకుంటోంది. ఆధార్ కార్డు ఇప్పించండి ఉద్యమంలోనే జీవితం గడిచిపోయింది. నాకు ఆధార్ కార్డు, రేషన్‌కార్డు వంటి ఆధారాలు ఏమీ లేవు. పోలీసులకు లొంగిపోయిన నాకు ఆరోగ్య రీత్యా చాలా సమస్యలు ఉన్నాయి. నా పేరిట ఉన్న రివార్డును పొందగలిగితే కొంతలో కొంత నా ఆరోగ్య పరిస్థితిని మెరుగుపర్చుకోవచ్చని ఆశ. ఈ విషయంలో ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నా. – పసుల వసంత, లొంగిపోయిన మావోయిస్టు ఆధార్ కార్డుకు దిక్కులేదు సర్కార్ రివార్డులు దక్కేదెలా..? కనికరించాలని కలెక్టర్‌కు వేడుకోలు మాజీ మావోయిస్టు వసంత దీనస్థితి -
గిన్నిస్‌బుక్ రికార్డులో ‘మానేరు’ విద్యార్థి
జగిత్యాల: కొడిమ్యాల మండలం పూడూరు గ్రామంలోని మానేరు ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థి సర్వీన్ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. హైదరాబాద్‌లోని అంతర్జాతీయ హలెల్ మ్యూజిక్ స్కూల్ మేనేజ్మెంట్ బోర్డు ఈవెంట్లో గిన్నీస్ రికార్డుకు ఎంట్రీలను ఆహ్వానించింది. 2024 డిసెంబర్ 1న 1046 మందితో గంటపాటు ఆన్లైన్లో నాన్‌స్టాప్ కీబోర్డు ప్లే ఈవెంట్‌ను హలెల్ మ్యూజిక్ స్కూల్ నిర్వహించింది. 45 సెకెన్లలోనే కీబోర్డును వాయించి గిన్సీస్ వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఈ సందర్భంగా విద్యాసంస్థల చైర్మన్ అనంతరెడ్డి, డైరెక్టర్ సునీతరెడ్డి, ప్రిన్సిపాల్ అభినందించారు. -
న్యాయమూర్తులకు వీడ్కోలు
కరీంనగర్ క్రైం: ఇటీవల బదిలీ అయిన కరీంనగర్ జిల్లా జడ్జి బి.ప్రతిమ, ఏసీబీ జడ్జి కుమార్ వివేక్, ఫ్యామిలీ కోర్టు జడ్జి లక్ష్మీకుమారిలను గురువారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. అసోసియేషన్ అధ్యక్షుడు లింగంపల్లి నాగరాజు, ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్ ల ఆధ్వర్యంలో కార్యవర్గం జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయ సేవాసదన్ భవనంలో కార్యక్రమంలో ముగ్గురు న్యాయమూర్తులను మెమొంటో, శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బదిలీపై వెళ్తున్న జిల్లా జడ్జి ప్రతిమ మాట్లాడుతూ కరీంనగర్ జిల్లాకు ఎంతో గుర్తింపుఉందని, ఇక్కడ వృత్తిపరంగా తనకు ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. న్యాయమూర్తులు వెంకటేశ్ నీరజ, శ్రీలేఖ, వాణి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వెంకటేశ్, మేజిస్ట్రేట్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఆరెల్లి రాములు, కుమార్, గౌరు రాజిరెడ్డి, ఏజీపీ రమేశ్, అసోసియేషన్ ఉపాధ్యక్షుడు చందా రమేశ్, సంయుక్త కార్యదర్శి సిరికొండ శ్రీధర్, ట్రెజరర్ ముద్దసాని సంపత్, మహిళా ప్రతినిధి రజి, సీనియర్ న్యాయవాదులు డి.మల్లయ్య, పి. సజన్‌కుమార్, కె.సంజీవరెడ్డి, కొరివి వేణుగోపాల్, బాస సత్యనారాయణ, కుసుంబ కృష్ణరావు తదితరులు పాల్గొన్నారు. -
రాజన్న ఆలయానికి ప్రత్యేక బోర్డు !
వేములవాడ: దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్న ఆలయ పాలనలో రూపురేఖలు మారనున్నాయి. ఆదాయానికి.. బోర్డుకు సంబంధం ఉండడంతో ఏటా రూ.100కోట్లు ఆదాయం దాటే ఆలయాలకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలనే నిబంధన రాజన్న ఆలయానికి వర్తించనుంది. దీంతో వేములవాడ శ్రీరాజరాజేశ్వస్వామి ఆలయ ప్రత్యేక బోర్డు ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. దీనికి ఐఏఎస్ అధికారిని బాధ్యులుగా నియమించే అవకాశం ఉంటుంది. గతంలో బోర్డులు ఇలా.. వేములవాడ రాజన్న ఆలయం పాలనకు సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 1952లో కలెక్టర్‌ను చైర్మన్‌గా, ఐదుగురు సభ్యులతో ఆలయ బోర్డు ఏర్పాటైంది. 1956, 1958, 1962 సంవత్సరాల్లో మళ్లీ ఏర్పాటు చేశారు. 1967 నుంచి ప్రతీ రెండేళ్లకు కమిటీ మారుతూ వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అది నిలిచిపోయింది. ప్రత్యేక బోర్డుకు ప్రభుత్వం కసరత్తు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.100 కోట్లకుపైగా ఆదాయం గల ఆలయాలకు టీటీడీ తరహాలో ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈప్రక్రియలో వేములవాడ రాజన్న ఆలయం పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ సూత్రప్రాయంగా వెల్లడించారు. స్వయంప్రతిపత్తితో బోర్డు వేములవాడ ఆలయానికి ప్రత్యేక బోర్డు ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈక్రమంలో కొత్తతరం రానుంది. బోర్డుసభ్యులతో స్వయం ప్రతిపత్తి కల్పించే దిశలో చర్చలు చేపట్టనున్నారు. త్వరలోనే బోర్డు ఏర్పాటు జరగనున్నట్లు అధికార పార్టీలో చర్చ మొదలైంది. ఆలయ పాలనలో క్రియాశీలతకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఐఏఎస్ స్థాయి అధికారి నేతృత్వంలో బోర్డు ఏర్పాటు, స్వయం ప్రతిపత్తితో వ్యవస్థ తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీంతో ఆలయ పాలనలో స్వతంత్ర అధికార దిశగా ముందడుగు వేయబోతోంది. పాలన లోపాలకు ఈ కొత్తబోర్డు కృషి చేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఐఏఎస్ అధికారి నేతృత్వం, భక్తులకు పారదర్శక పాలన అందించాలన్న దిశలో ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. రూ.100కోట్లు దాటితే ఏర్పాటు ఏర్పాటు దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు ఐఏఎస్ అధికారిని నియమించే అవకాశం త్వరలోనే ఉత్తర్వులు రూ.100 కోట్లు దాటిన ఆలయాలకు ప్రత్యేక బోర్డు రాష్ట్రంలో రూ.100కోట్ల ఆదాయం దాటిన ఆలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలన్న ఆలోచనల్లో ప్రభుత్వం ఉంది. యాదగిరిగుట్ట తరహాలో వేములవాడ రాజన్నకు సైతం బోర్డు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. రాజన్న ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు, ఇదే పద్ధతిలో పట్టణం అభివృద్ధిపై సైతం కృషి చేస్తాం. – ఆది శ్రీనివాస్, ప్రభుత్వవిప్ -
‘జ్యోతిష్మతి’కి ఎన్బీఏ గుర్తింపు
తిమ్మాపూర్: మండల కేంద్రంలోని జ్యోతిష్మతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సైన్స్‌కు 2028 వరకు ఎన్బీఏ అక్రిడిటేషన్ మంజూరు చేసిందని కళాశాల చైర్మన్ జువ్వాడి సాగర్‌రావు తెలిపారు. గురువారం కళాశాలలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్న్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, విభాగాలు 2022–2025 మధ్య కాలంలో గుర్తింపు పొందాయన్నారు. నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషనన్ ద్వారా పునరుద్ధరించబడిన గుర్తింపు అకాడమిక్ ఎక్స్‌లెన్స్, నాణ్యత హామీ ఫలితాల ఆధారిత విద్యతో మరోసారి పొడిగించారని, అక్రిడిటేషన్న్ సంస్థ ఆశించిన విద్యా, పరిశోధన ప్రయత్నాలను మెరుగుపరచడానికి శక్తివంతమైన ప్రేరణగా పనిచేస్తోందన్నారు. పొడిగింపు కళాశాల పటిష్టత, అధ్యాపకుల నిబద్ధత, అధునాతన మౌలిక సదుపాయాలు వివిధ కార్యక్రమాలను బలోపేతం చేస్తుందని సెక్రటరీ కరస్పాండెంట్ జె సుమిత్సాయి తెలిపారు. కొనసాగింపునకు కృషిచేసినవారికి అభినందనలు తెలిపారు. -
కరీంనగర్ ప్రభుత్వాసుపత్రిలో అరుదైన దంత శస్త్ర చికిత్స
కరీంనగర్‌టౌన్: కరీంనగర్ ప్రభుత్వ ప్రధానాసుపత్రిలో అరుదైన దంత శస్త్రచికిత్స నిర్వహించినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వీరారెడ్డి తెలిపారు. మూడేళ్లుగా జీజీహెచ్‌లోని దంత విభాగం ఆరోగ్యశ్రీ సేవల్లో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలుపుకుంటుందన్నారు. ఈక్రమంలో ఆధునిక నైపుణ్యాన్ని అవసరమైన పేషంట్లకు అందించడం జరుగుతుందన్నారు. మొదటిసారిగా అనస్తీసియాలో అత్యాధునిక పద్ధతిలో రోడ్డు ప్రమాదంలో ముఖం, దౌడ, ముక్కు విరిగిన 33 ఏళ్ల శివకుమార్‌కు ఓరల్, మాక్సిలో ఫేషియల్ సర్జన్ డాక్టర్ డి.సతీశ్‌కుమార్ ఓపెన్ రిడక్షన్, ఇంటర్నల్ ఫిక్సేషన్ ద్వారా సర్జరీ నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ శస్త్రచికిత్సలో సీనియర్ ఫిజీషియన్ నవీన, సీనియర్ దంత వైద్య నిపుణులు రవిప్రవీణ్‌రెడ్డి, హఫీజ్, అనిస్తీషియా సతీశ్ కుమార్, వంశీ, సుగాత్రి, ఈఎన్టీ సందీప్‌రెడ్డి, జమున తదితరులు పాల్గొన్నారు. -
ఆవేదన జీవితాంతం
ఆవేశం అదే క్షణం● చిన్నచిన్న కారణాలకే బలవన్మరణాలు ● ఒంటరవుతున్న పిల్లలు, తల్లిదండ్రులు ● ఉమ్మడి జిల్లాలో ఆందోళన కలిగిస్తున్న ఆత్మహత్యలుసాక్షి ,పెద్దపల్లి ●: అనారోగ్యంతో కొందరు, కుటుంబ కలహాలతో మరికొందరు, అప్పుల బాధ, నిరుద్యోగం, పరీక్షల్లో ఫెయిల్, ప్రేమలో విఫలం, ఇష్టం లేని పెళ్లితో ఇంకొందరు.. వరకట్న వేధింపులు, అవమానం, ఆవేశం ఇలా కారణాలు ఎన్ని ఉన్నా మానసిక ఒత్తిడిలో బలహీనమైన క్షణంలో బలమైన నిర్ణయాలతో ప్రాణాలు తీసుకుంటున్నారు. ఆత్మహత్యలతో ఆయా కుటుంబాలు పెద్దదిక్కును కోల్పోయి ఇబ్బందులు పడుతున్నాయి. మహిళలు ఆత్మహత్య చేసుకుంటే వారి పిల్లలు అనాథలవుతున్నారు. ప్రేమ, ఉద్యోగం, పరీక్షలు తదితర కారణాలతో యువత ఆత్మహత్యలకు పాల్పడి తల్లిదండ్రులకు కడుపుకోత మిగుల్చుతున్నారు. రోజూ ఇద్దరు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచంలో సంవత్సరానికి 8లక్షల మందికి పైగా, అంటే ప్రతీ సెకనుకు ఒకరు ఆత్మబలిదానం చేసుకుంటున్నారు. ప్రపంచంలో జరిగే ప్రతి 4 ఆత్మహత్యల్లో ఒకటి ఇండియాలోనే నమోదవుతోంది. ఉమ్మడి జిల్లాలో గతేడాది 776 మంది సూసైడ్ చేసుకున్నారు. అంటే సగటున ప్రతీ రోజుకు ఇద్దరు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఏదో కారణంతో తమ ప్రాణాలు తీసుకుంటున్నారు. నివారిద్దాం ఇలా.. నిరాశ, నిస్పృహల్లో ఉన్నవారికి స్వాంతన కలిగించడం ద్వారా ఆత్మహత్యలను తగ్గించవచ్చు. ఆత్మహత్య ఆలోచన రావడమే తరువాయి వారికి కౌన్సెలింగ్ ఇవ్వడం ద్వారా వారిని మన వైపు మళ్లించవచ్చు. వారి బాధలను వినాలి, అర్థం చేసుకోవాలి. వారి సమస్యకు ఎలా పరిష్కారం దొరుకుతుందో వారితోనే చెప్పించాలి. ఇలాంటివారిని గుర్తించగానే ఒంటరిగా ఉంచకుండా నలుగురితో కలిసేలా కుటుంబసభ్యులంతా స్నేహంగా మెలగాలి. వారు సాధారణ జీవితం గడిపేంత వరకు వారిని గమనిస్తూ ఉండాలి. సమస్య మరీ తీవ్రంగా ఉంటే మానసిక వైద్యులను కలిసి చికిత్స ఇప్పించాలి. గుర్తించడం ఇలా.. ఆత్మహత్య గురించి పదేపదే మాట్లాడుతుండటం, తనకు తాను హాని కలిగించుకునేందుకు ప్రయత్నించడం, తీవ్ర ఒత్తిడితో చికాకు పడుతుండటం, ఒంటరితనాన్ని ఇష్టపడటం, ప్రతీ విషయం గురించి ప్రతికూలంగా ఆలోచించడం, నిద్రపోకుండా ఉండటం, చేసే ప్రతి పనిపట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తుండడం.. ఇలాంటి మార్పులు ఒక వ్యక్తిలో కనిపిస్తే, వారు ఆత్మహత్య గురించి ఆలోచనలు చేస్తుండొచ్చని భావించాలి. ● ‘ఏడాదిన్నర వయసు ఉన్న బిడ్డకు ఉరివేసి, అదే తాడుకు తల్లి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇటీవల పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగింది. తాను బక్కగా ఉన్నాననే బాధతో మనస్తాపం చెంది అఘాయిత్యానికి పాల్పడింది’. ● ‘ఈనెల 11న రామగుండం కార్పొరేషన్ 14వ డివిజన్ ఎల్కలపల్లి గేట్ గ్రామానికి చెందిన వివాహిత భర్త వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. దీంతో ముగ్గురు పిల్లలు తల్లిలేని బిడ్డలయ్యారు’. ● ‘గత నెల 6న చొప్పదండి మండలానికి చెందిన ఇద్దరు ప్రేమికులు తమ ప్రేమను పెద్దలు అంగీకరించడం లేదని మనస్తాపం చెంది ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఇలా ఓ కష్టం.. ఓ నష్టం.. ఆవేదన, ఆవేశం, ఆక్రోశం, మనిషిని తన ప్రాణం తాను తీసుకునేలా చేస్తోంది. దీంతో వారిపై ఆధారపడిన వారు ఒంటరవుతున్నారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం.. వారి కుటుంబాలను జీవితాంతం ఆవేదన మిగుల్చుతోంది. ...వీరంతా బతకాల్సిన వారే కౌన్సెలింగ్ తీసుకుంటే తప్పేంటి.. ఆత్మహత్య ఆలోచనలు వెంటాడుతున్న వారికి వీలైతే మానసిక వైద్యుడితో కౌన్సెలింగ్ ఇప్పించాలి. కానీ, మనదగ్గర మానసిక వైద్యం అంటే నామోషీ. మానసిక వైద్య చికిత్స అంటే.. అదేదో పిచ్చిపట్టినవాళ్లకు అందించే చికిత్స అనే భావన ప్రజల మెదళ్లలో నాటుకుపోవడం వల్లే ఈ సమస్య ఎక్కువ అవుతుంది. ఆత్మహత్యకు ముందు కొంతమంది ప్రదర్శించే నిర్దిష్ట లక్షణాలను అర్థం చేసుకోవడం ద్వారా చాలావరకు బలవన్మరణ కేసులను నివారించే అవకాశం ఉంటుందని మానసిక వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. -
మహిళా హక్కుల సాధనకు పోరాటాలను ఉధృతం చేస్తాం
కరీంనగర్: మహిళా హక్కుల పరిరక్షణ సాధనే లక్ష్యంగా, అంబేడ్కర్, పూలే ఆశయాల సాధన దిశగా ఐద్వా తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బస్సు యాత్ర సాగుతుందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి అన్నారు. మహిళా హక్కుల పరిరక్షణ యాత్ర గురువారం హన్మకొండ, హుజూరాబాద్ మీదుగా కరీంనగర్‌కు చేరుకోగా.. తెలంగాణ చౌక్‌లో ఐద్వా కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో యాత్ర బృందానికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మల్లు లక్ష్మి మాట్లాడుతూ.. దేశంలో మహిళలకు అడుగడుగునా ఆటంకాలే ఎదురవుతున్నాయని అన్నారు. యాత్రకు సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు గుడికందుల సత్యం, రైతు సంఘం అధ్యక్షుడు వర్ణ వెంకటరెడ్డి, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు సాగర్, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జి.తిరుపతి, నరేశ్పటేల్ సంపూర్ణ మద్దతు తెలిపారు. రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్.అరుణ జ్యోతి, రాష్ట్ర సహాయ కార్యదర్శులు కేఎన్ ఆశలత, నల్లిగంటి రత్నమాల, జిల్లా ప్రధాన కార్యదర్శి కోనేటి నాగమణి, ఉపాధ్యక్షురాలు ధ్యావా అన్నపూర్ణ, పాండ్రాళ్ల దేవేంద్ర, నగర కార్యదర్శి చేనిరోజా, సహాయ కార్యదర్శి మంచినీళ్ల లావణ్య, జిల్లా కమిటీ సభ్యులు ఉప్పునూటి లక్ష్మి, మేదర నాగమణి, టి.భవాని, ఎం.రామ, గొలుసుల రజిని, పోతర్ల మానస, తారపాకల మున్న, అంజలి పాల్గొన్నారు.24 నుంచి సెమిస్టర్ పరీక్షలుకరీంనగర్సిటీ: శాతవాహన విశ్వవిద్యాలయం బీ ఫార్మసీ పరీక్షల ప్రణాళికను విడుదల చేసిందని, రెండవ, నాలుగో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 24నుంచి 30వరకు నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి సురేశ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎం ఫార్మసీ మొదటి సెమిస్టర్ పరీక్షలు ఈనెల 24నుంచి 28వరకు జరగనున్నాయన్నారు. మరిన్ని వివరాలకు ఆయా కళాశాలలో సంప్రదించాలని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల మార్కింగ్ కంప్లీట్ చేయండికరీంనగర్ అర్బన్: జిల్లాలోని 15 మండలాల్లో పైలట్ గా ఎంపిక చేసిన గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల మార్కింగ్ ప్రక్రియ100 శాతంపూర్తి చేయాలని, రెండో దఫా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వేగవంతం చేయాలని అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రివ్యూ నిర్వహించారు. పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన 15 గ్రామాలలో 2027 మందికి ఇళ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. 730 ఇండ్లకు మార్కింగ్ పూర్తయిందని తెలిపారు. 114 ఇండ్లు బేస్మెంట్ లెవెల్ కు చేరాయన్నారు. రెండోదఫా ఇండ్లను గ్రామాలు, మున్సిపల్ వార్డులవారీగా మంజూరు చేసేందుకు అలాట్మెంట్ జాబితా తయారు చేయాలన్నారు. లబ్ధిదారుల ఎంపికలో పొరపాట్లు జరగొద్దని.. వచ్చిన దరఖాస్తుల్లో నిరుపేదలకు మాత్రమే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్, జెడ్పీ సీఈవో శ్రీ నివాస్, డీటీడీవో పవన్ కుమార్ పాల్గొన్నారు. అడ్మిషన్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం కరీంనగర్: 2025–26 విద్యాసంవత్సరానికి రెప్యూటెడ్ జూనియర్ కళాశాలల స్కీం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, వికలాంగులు, మైనార్టీ విద్యార్థులకు ప్రైవేట్ జూనియర్ కళాశాలలో అడ్మిషన్లు కల్పించేందుకు గాను జిల్లాలోని ప్రైవేట్ జూనియర్ కళాశాలల నుంచి రెప్యూటెడ్ జూనియర్ కళాశాలలను నూతనంగా ఎంపిక చేసేందుకు రెసిడెన్షియల్ వసతి కలిగిన విద్యాబోధనలో ఉన్నత ప్రమాణాలు కలిగి కాంపిటేటివ్ పరీక్షల్లో ఎక్కువ సంఖ్య ఉత్తీర్ణత శాతం కలిగిన రెప్యూటెడ్ జూనియర్ కళాశాలల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి నగైలేశ్వర్ తెలిపారు. ఆసక్తి ఉన్న కళాశాలలు తమ కళాశాలల అకాడమిక్ ప్రొఫైల్‌తోపాటు ఈ–పాస్ వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్లో తమ కళాశాలల ఈ–పాస్ యూజర్ ఐడీ పాస్ వర్డ్‌తో లాగిన్ అయి తమ కళాశాలలను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పేర్కొన్నారు. ఈనెల 30 లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, రిజిస్ట్రేషన్‌లో వివరాలను నమోదు చేసి మే 1 సాయంత్రం 5 గంటల్లోగా ఉప సంచాలకులు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. -
భూసమస్యల పరిష్కారమే లక్ష్యం
గన్నేరువరం/తిమ్మాపూర్: భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టం తీసుకువచ్చిందని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. గురువారం గన్నేరువరం కల్యాణమండపంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్‌తో కలిసి పాల్గొన్నారు. చట్టంలోని అంశాలను రైతులు, ప్రజలకు వివరించారు. సీసీఎల్ఏకు వెళ్లే అవసరం లేకుండా ఆర్డీవో, కలెక్టర్ వద్దే భూసమస్య పరిష్కరించుకునేందుకు అవకాశాలున్నాయన్నారు. అభ్యంతరాలు ఉంటే అప్పీల్ చేసుకోవచ్చన్నారు. చిన్న సమస్యలు మండల స్థాయిలోనే త్వరితగతిన పరిష్కారమవుతాయని వివరించారు. మనిషికి ఆధారుకార్డులాగే భూమికి భూధార్ సంఖ్య కేటాయిస్తారని తెలిపారు. తప్పుల సవరణ కోసం చట్టం అమల్లోకి వచ్చిన ఏడాదిలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న సాదాబైనామాల పరిష్కారం కోసం భూభారతిలో అవకాశం కల్పించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో మహేశ్వర్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి భాగ్యలక్ష్మి, తహసీల్దార్ ఇప్ప నరేందర్, ఇన్చార్జి ఎంపీడీవో శ్రీనివాస్, ఏవో కిరణ్మయి పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఆటపాటలతో... అంగన్వాడీల్లో ఆటపాటలతో కూడిన పూర్వ ప్రాథమిక విద్య బోధిస్తున్నామని, వచ్చే విద్యా సంవత్సరంలో ఆరేళ్లలోపు పిల్లలందరినీ కేంద్రాల్లో చేర్పించాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. ఐసీడీఎస్, కరీంనగర్ రూరల్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిమ్మాపూర్ మండలంలోని ఎల్‌ఎండీకాలనీలోని దుర్గాబాయి మహిళా శిశు వికాసకేంద్రంలో గురువారం వివిధ రకాలు ప్రదర్శనలు చేపట్టారు. కార్యక్రమానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. చిన్నారుల మానసిక పరిపక్వత కోసం ప్రత్యేకంగా సిలబస్ తయారు చేసినట్లు వివరించారు. ప్రదర్శనశాలలో అంగన్వాడీ కేంద్రాల్లో బోధించే పరికరాలు, నెలవారీగా సిలబస్ వివరాలు, కిచెన్ గార్డెన్స్ ఆకట్టుకున్నాయి. అనంతరం ఈఏడాది పూర్వ ప్రాథమిక విద్య పూర్తిచేసిన చిన్నారులకు కలెక్టర్ సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సబిత, సీడీపీవో, ప్రాంగణం మేనేజర్ సుధారాణి, డీసీపీవో పర్విన్ పాల్గొన్నారు. అమల్లోకి భూ భారతి కలెక్టర్ పమేలా సత్పతి -
సిరిసిల్ల కలెక్టరేట్లో లీకువీరుడు!
ఏళ్లుగా పాతుకుపోయిన అధికారి ● ఆయన శాఖలో తరచూ లోపాలు గుర్తిస్తున్న కార్యాలయం ● అటెన్షన్ డైవర్షన్ కోసం కార్యాలయంపై దుష్ప్రచారం ● సీఎం, మంత్రుల పర్యటనల సమయంలో ఇదే తంతు ● ధరణి, లే అవుట్ల విషయంలో పలుమార్లు భంగపాటు ● ప్రభుత్వానికి నివేదిక పంపేందుకు సిద్ధమవుతున్న కలెక్టర్?సాక్షిప్రతినిధి,కరీంనగర్ ●: రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కొంతకాలంగా పలుసంచలనాలు, వివాదాలకు కేంద్రంగా నిలుస్తున్న విషయం తెలిసిందే. ఓ అధికారి తీరే ఈ వివాదాలకు కేంద్ర బిందువుగా నిలుస్తోందని కార్యాలయ సిబ్బంది చర్చించుకుంటున్నారు. కొన్నినెలలుగా సిరిసిల్ల కలెక్టరేట్లో జరుగుతున్న పలు పరిణామాలను, విధాన పరమైన నిర్ణయాలను తప్పుడుగా ప్రచారం చేస్తున్న అధికారిపై కలెక్టర్ కార్యాలయ సిబ్బంది ఆగ్రహంగా ఉన్నారు. ఈ విషయంలో కలెక్టర్ సైతం అతని తీరుపై గుర్రుగా ఉన్నారని, జరుగుతున్న పరిణామాలపై ప్రభుత్వానికి నివేదిక పంపే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఇపుడు ఈ విషయం సిరిసిల్ల కలెక్టరేట్లో చర్చానీయాంశంగా మారింది. ఇంతకీ ఎవరాయన? ఐదారేళ్లుగా సిరిసిల్ల జిల్లాలో పాతుకుపోయిన సదరు అధికారికి స్థానిక రాజకీయ నాయకులతో మంచి పరిచయాలు ఉన్నాయి. దీంతో వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా భూవివాదాలకు సంబంధించిన విషయాల్లో సదరు అధికారి అమితాసక్తి ప్రదర్శిస్తున్నట్లు సమాచారం. తన శాఖలో ఏం జరుగుతుందన్న విషయం గాలికి వదిలి.. నిత్యం ధరణి, లే అవుట్ల విషయంలో తల దూరుస్తూ.. వివాదాస్పద విషయాలను కార్యాలయానికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని కలెక్టరేట్ వర్గాలు గుర్తించాయి. ఆయన పనిలో ఎపుడు లోపాల్ని గుర్తించినా.. వెంటనే తనపై ఎవరూ శ్రద్ధ పెట్టకుండా.. వెంటనే కలెక్టర్ కార్యాలయంపై ఏదో తప్పుడు ప్రచారం చేసి, తనపై చర్చ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వారాంతాల్లో హైదరాబాద్‌కు వెళ్లడం, కలెక్టర్ కార్యాలయానికి లీవులపై కనీస సమాచారం ఇవ్వకపోవడం, ప్రభుత్వ సమీక్షాసమావేశాలకు తరుచుగా ఆలస్యంగా వస్తుండటంతో అతని తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో రెండుసార్లు ఎమ్మెల్సీ, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరిగినా ఆయన బదిలీ కాకపోవడం గమనార్హం. భూములంటే అమితాసక్తి.. ఇటీవల ధరణి రికార్డుల్లో మార్పులు చేర్పులు, లేఅవుట్ల విషయంలో కలెక్టరేట్లో ఆయన అత్యూత్సాహం ప్రదర్శిస్తున్నారని కార్యాలయ సిబ్బంది గుర్తించారు. ఒక సందర్భంలో ఏకంగా కలెక్టర్ అనుమతి లేకుండా ధరణిలో రికార్డులు మార్చేందుకు సదరు అధికారి సిబ్బందిపై ఒత్తిడి తెచ్చారు. కానీ.. రికార్డులు మార్చే అధికారి ముందుజాగ్రత్తగా.. కలెక్టర్‌కు సమాచారం ఇవ్వడంతో అసలు విషయం వెలుగుచూసింది. పెద్దూరు, ఆగ్రహారంలో పలువురు ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారికి సహకరించిన విషయాన్ని కలెక్టర్ కార్యాలయ సిబ్బంది ముందస్తుగానే పసిగట్టడంతో అక్కడ ఆయన ఆటలు సాగలేదు. తన అక్రమాలు, శాఖలో లోపాలు బయటపడ్డ ప్రతీసారీ.. కలెక్టర్ కార్యాలయంలో ఏదో జరిగిపోతుందని తప్పుడు ప్రచారంచేసి ఇతరులపై దృష్టి మరల్చేలా చేస్తున్నారని సమాచారం. ఆ మధ్య సీఎం రేవంత్‌రెడ్డి పర్యటనలో భోజన ఖర్చులపై దుమారం, ఇటీవల మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి పర్యటన సందర్భంగానూ.. జరిగిన పరిణామాల వెనుక సదరు అధికారే ఉన్నారని కలెక్టర్ కార్యాలయం గుర్తించింది. తమకు తరచుగా ఆటంకాలు కలిగిస్తున్న ఆ అధికారిని సరెండర్ చేయాలని నివేదిక పంపేందుకు కలెక్టర్ సిద్ధమవుతున్నారని విశ్వసనీయ సమాచారం. -
యువవికాసం!
దరఖాస్తుల ● ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనూహ్య స్పందన ● వరుస సెలవులు, సర్వర్ సమస్యలతో దరఖాస్తులకు ఇబ్బందులు ● చాలా మందికి ఇంకా అందని కులం, ఆదాయం, రేషన్ కార్డులు ● గడువు పెంచాలని దరఖాస్తుదారుల వినతులుఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వచ్చిన దరఖాస్తులుపెద్దపల్లి: 47,470, జగిత్యాల: 31,128రాజన్నసిరిసిల్ల: 23,477, కరీంనగర్: 29,000సాక్షిప్రతినిధి, కరీంనగర్: యువత స్వయం ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రాజీవ్ యువవికాస పథకానికి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అనూహ్య స్పందన వచ్చింది. దరఖాస్తు ప్రక్రియలో తీవ్ర సమస్యలు ఎదురైన దరఖాస్తులు వెల్లువెత్తాయి. సర్వర్ లోపాలతో పాటు సాంకేతిక సమస్యలతో దరఖాస్తుల ప్రక్రియ మందకొడిగా సాగడంతో వేల మంది పథకం కోసం దరఖాస్తు చేసుకోకముందే గడువు ముగియటంతో నిరాశచెందుతున్నారు. ప్రభుత్వం మెరుగైన రాయితీతో రూ.4 లక్షల వరకు విలువైన యూనిట్లు మంజూరు చేయనుండటంతో యువత ఈ పథకానికి భారీగా దరఖాస్తు చేసుకోవాడానికి ఆసక్తి చూపారు. గడువు ముగిసేనాటికి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 1,31,075 మందికి ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. సర్వర్ సమస్యలతో కేంద్రాల వద్ద బారులు రాజీవ్ యువ వికాసం దరఖాస్తు చేయడానికి రూపొందించినటువంటి ఓబీఎంఎంఎస్ పోర్టల్‌లో సర్వర్ సమస్యలు నెలకొన్నాయి. దీంతో మీ సేవ కేంద్రాల వద్ద పడిగాపులు కాసారు. కొన్నిసార్లు అప్లికేషన్ చివరిదశకు వెళ్లిన సమయంలో సర్వర్ మొరాయించగా, దరఖాస్తు సమర్పించిన తర్వాత అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ కాకపోవడంలాంటి సమస్యలు ఎదురయ్యాయి. ఒకవేళ మళ్లీ దరఖాస్తు చేస్తే అల్రెడీ అప్లైడ్ అని రావడం, దరఖాస్తు సమయంలో తరచూ సర్వర్ ఎర్రర్ మెసేజ్ రావడమనేది పరిపాటిగా మారింది. దీంతో ఒక్కో దరఖాస్తు చేయడానికి కనీసం అరగంటకు పైగా ఎదురుచూడాల్సి వచ్చింది. ఆరేళ్ల తర్వాత.. 6 ఏళ్ల తరువాత నిరుద్యోగుల కోసం స్వయం ఉపాధి పథకాన్ని అమలు చేస్తుండటంతో యువత దీనిపైనే ఆశలు పెట్టుకున్నారు. ఈ పథకం దరఖాస్తుల స్వీకరణ మార్చి 15వ తేదీన ప్రారంభించినప్పటికీ అప్పటికీ రుణాల పరిమితి, కేటగిరీలు, రాయితీ నిధులకు సంబంధించి స్పష్టత రాలేదు. మార్చి 25న ఈ పథకం విధివిధానాలపై సర్కారు ఉత్తర్వులు జారీచేసింది. ఆ తరువాత ఈబీసీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరణ చేపట్టింది. గడవు పెంచుతూ 14 వరకు సమయం ఇచ్చింది. తాజాగా మరోసారి గడువు పెంపుపై ఆశలు పెట్టుకున్నారు. సెలవులతో అర్జీలు పెండింగ్‌లో రేషన్‌కార్డు లేకుంటే ఆదాయ ధ్రువీకరణ ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేయడంతో ఆ సర్టిఫికెట్స్ కోసం మీసేవ కేంద్రాలకు పరుగులు తీశారు. ఐతే రాజీవ్ యువవికాసం పథకం దరఖాస్తులు స్వీకరించినప్పటి నుంచి వరుస సెలువులు సైతం దరఖాస్తుదారులను ఇబ్బందులకు గురిచేశాయి. రంజాన్, ఉగాది, జగ్జీవన్‌రామ్ జయంతి, తాజాగా రెండో శనివారం, ఆదివారం, సోమవారం అంబేడ్కర్ జయంతి సందర్భంగా ప్రభుత్వ ఆఫీసులు పనిచేయలేదు. దీంతో ఆదాయం, కుల సర్టిఫికెట్స్ పెండింగ్ దరఖాస్తులు ఎలా పరిష్కారమవుతాయని దరఖాస్తుదారులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటివరకు మీసేవ కేంద్రాల ద్వారా రెవెన్యూ కార్యాలయాలకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా లక్షల్లో క్యాస్ట్, ఇన్‌కం ధ్రువీకరణ పత్రాలకు అర్జీలు వచ్చాయి. వీటిలో వేలల్లోనే దరఖాస్తులను మాత్రమే అధికారులు ఆమోదించారు. దీంతో ధ్రువీకరణ పత్రాలు అందని చాలామంది చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కుల ధ్రువీకరణ పత్రం లేక దరఖాస్తు తిరస్కరణ కుల ధ్రువీకరణ పత్రం కోసం వారం రోజుల క్రితం దరఖాస్తు చేసుకున్నా. తహసీల్దార్ కార్యాలయంలో సైట్ ఓపెన్ కావడం లేదని వారు దానిని అప్లోడ్ చేయలేదు. దీంతో నాకు కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ రాలేదు. దీంతో నేను దరఖాస్తు చేసుకోలేకపోయాను. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసే నంబరు వేసినప్పటికీ యువ వికాస్ పథకంలో తీసుకోవడం లేదు. దీంతో ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు వీలు లేకుండా పోయింది. – ఏదుల కిరణ్‌కుమార్, జగిత్యాల -
ప్రకృతి వైపరీత్యాలపై జాగ్రత్తగా ఉండాలి
● టీజీఎన్పీడీసీఎల్ చీఫ్ ఇంజినీర్ అశోక్ కొత్తపల్లి(కరీంనగర్): ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏర్పడే విద్యుత్ అంతరాయాలు, ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని టీఎజీఎన్పీడీసీఎల్ చీఫ్ ఇంజినీర్ (ఆపరేషన్) బి.అశోక్ సూచించారు. కరీంనగర్ విద్యుత్ భవన్‌లోని సమావేశ మందిరంలో బుధవారం డీఈలు, ఏడీఈలు, ఏఈలతో నిర్వహించిన సమావేశంలో పలు సూచనలు చేశారు. అధికారులు వారి హెడ్క్వార్టర్లలో ఉంటూ విద్యుత్‌ను పర్యవేక్షించాలని ఆదేశించారు. గాలి దుమారాలతో లైన్లు తెగడం, విద్యుత్ స్తంభాలు విరగడం వంటివి జరిగినప్పుడు తక్షణమే స్పందిస్తూ మరమ్మతు పనులు చేపట్టాలన్నారు. ఇంటర్ లింకింగ్ లైన్లను త్వరితగతిన పూర్తిచేయాలని, పవర్ ఇంట్రాక్షన్ వచ్చినప్పుడు ప్రత్యామ్నాయ లైన్ ద్వారా విద్యుత్ సరఫరా అందించాలన్నారు. ట్రాన్స్ఫార్మర్ల లోడ్, పిడుగుపాటుతో కాలిపోవడం వంటి వాటిపట్ల అప్రమత్తండా ఉండాలన్నారు. సమావేశంలో కరీంనగర్ సర్కిల్ ఎస్ఈ మేక రమేశ్‌బాబు, డీఈలు కె.ఉపేందర్, జంపాల రాజం, ఎం.తిరుపతి, ఎస్.లక్ష్మారెడ్డి, పి.చంద్రమౌళి, కాళీదాసు, ఏడీఈలు, ఏఈలు పాల్గొన్నారు. సన్నబియ్యంపై అసత్య ప్రచారం చేస్తే కఠినచర్యలుకరీంనగర్ అర్బన్: ప్రభుత్వం రేషన్ దుకాణాల్లో పంపిణీ చేస్తున్న సన్నబియ్యంపై కొందరు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అలాంటివారిపై చట్టరీత్యా చర్యలు తప్పవని జిల్లా పౌరసరఫరాల అధికారి నర్సింగరావు స్పష్టం చేశారు. సన్నబియ్యంలో ప్లాస్టిక్ బియ్యం వస్తున్నాయని కొందరు ఫేస్బుక్, ఎక్స్ వంటి సామాజిక మాధ్యమాల్లో వీడియోలు ప్రసారం చేశారని పేర్కొన్నారు. ప్రజల్లో భయాందోళన సృష్టిస్తే సామాజిక మాధ్యమాల్లో తప్పు ప్రచారం చేస్తే సదరు అకౌంట్ హోల్డ ర్లపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నాణ్యమైన సన్నబియ్యంతో కార్డుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. పవర్‌కట్ ప్రాంతాలుకొత్తపల్లి: విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు పనులు కొనసాగుతన్నందున గురువారం ఉదయం 7 నుంచి 10 గంటల వరకు 11 కేవీ వరలక్ష్మి ఫీడర్ పరిధిలోని డీమార్ట్, వరలక్ష్మీగార్డెన్, తులసీనగర్, హెచ్‌పీ గ్యాస్ గోదాం, రెడ్డి ఫంక్షన్‌హాల్ ప్రాంతాలు, ఏబీ స్విచ్‌లు బిగిస్తున్నందున ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు 11 కేవీ కిసాన్‌నగర్ ఫీడర్ పరిధిలోని కిసాన్‌నగర్ ప్రవిష్ట, అర్బన్ హెల్త్ సెంటర్, ఖాన్పుర, హుస్సేనిపుర, దుర్గమ్మగడ్డ, రజ్వీచమన్, బొమ్మకల్ బైసాప్, సిటిజన్‌కాలనీ, విజయలక్ష్మీకాలనీ, శ్రీపురం కాలనీ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్–1 ఏడీఈ పి.శ్రీనివాస్ తెలిపారు. కమాన్‌పూర్‌లో.. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 33/11 కేవీ శాతవాహన వర్సిటీ సబ్‌స్టేషన్ కమాన్‌పూర్ వ్యవసాయ ఫీడర్ పరిధిలోని కమాన్‌పూర్, గ్రానైట్ పరిశ్రమలకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు రూరల్ ఏడీఈ గాదం రఘు తెలిపారు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు 11 కేవీ వరలక్ష్మి ఫీడర్ పరిధిలోని సరస్వతీనగర్, హనుమాన్‌నగర్ ఏరియాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు వివరించారు. -
● ఎమ్మెల్యే గంగుల కమలాకర్
కొత్తపల్లి(కరీంనగర్):సాగునీరందించడంతో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అసహనం వ్యక్తంచేశారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బుధవారం మల్కాపూర్, బద్ధిపల్లి గ్రామాల్లో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం, ఎస్సారెస్పీ నీటితో చెరువులు, కుంటలు నింపి సాగునీటితో పాటు భూగర్భ జలాలు పెరిగాయని.. తద్వరా తాగునీటి సమ స్య తలెత్తేది కాదన్నారు. కరీంనగర్లో తాగునీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చకముందే తగిన ఏర్పా ట్లు చేయాలని, లేదంటే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. ఉపాధి కోల్పోయామని కూలీలు..రైతుబంధు రాలేదని రైతులు.. సబ్సిడీ గ్యాస్ అందడం లేదని, తులం బంగారం ఇవ్వడం లేదని మహిళలు.. కౌలురైతులకు రైతు భరోసా ఇవ్వటం లేదని పలువురు ఎమ్మెల్యే ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నగర, మండలశాఖ అధ్యక్షులు చల్ల హరిశంకర్, శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎంపీపీ పిల్లి శ్రీలత, మాజీ వైస్ ఎంపీపీ బి.తిరుపతినాయక్, మాజీ ఏఎంసీ చైర్మన్ మధు, వైస్ చైర్మన్ ఉప్పు రాజశేఖర్, జడ్పీ మాజీ కోఆప్షన్ సాబీర్ పాషా, రైతు సంఘం అధ్యక్షుడు నరహరి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. -
వాతావరణం
ఆకాశం నిర్మలంగా ఉంటుంది. అప్పుడప్పుడు మేఘావృతమవుతుంది. ఈదురుగాలులు వేగంగా వీస్తాయి. గ్రూప్–1లో అవకతవకలుగ్రూప్–1 ఫలితాల్లో అవకతవకలు జరిగాయని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం ఆయన కరీంనగర్లో మీడియాతో మాట్లాడారు. 8లోu కరీంనగర్ పట్టణంలోని పెట్రోల్‌పంపు వద్ద రోడ్డుపైన చెట్టుకింద బస్సు కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులుకూర్చునేందుకు కుర్చీ ఉండదు.. నిలబడదామంటే నీడ ఉండదు.. కనీసం తాగునీరు దొరకదు.. అత్యవసర పరిస్థితుల్లో మరుగుదొడ్లను వినియోగించుకుందామంటే ముక్కుపుటాలు అదిరే కంపు.. ఇవీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్టాండ్లలో కనిపించే పరిస్థితులు. నియోజకవర్గ కేంద్రాల్లో బస్టాండ్లు ఉన్నా సౌకర్యాలు లేకపోగా.. మండల కేంద్రాల్లో కనీసం బస్టాండ్లు కూడా కరువయ్యాయి. మరికొన్ని ప్రధాన గ్రామాల్లో ప్రయాణప్రాంగణాలు లేక ప్రయాణికులు ఎండలోనే బస్సుల కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మీ పథకాన్ని అమలు చేయడంతో మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగింది. వీరంతా ఎండలోనే నిల్చొని బస్సుల కోసం ఎదురుచూస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితం.. అంటూ ప్రచారం చేసుకునే అధికారులు ప్రయాణ ప్రాంగణాలలో కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. ఉమ్మడి జిల్లాలో ప్రయాణ ప్రాంగణాలు లేక.. ఉన్నా సౌకర్యాలు కరువై ప్రయాణికులు పడుతున్న కష్టాలపై ‘సాక్షి’ ఫోకస్. – వివరాలు 8లో..నీడ లేదు.. నీరూ లేదు..! -
● కలెక్టర్ పమేలా సత్పతి
హుజూరాబాద్ : ఽసన్నాలు, దొడ్డు రకం ధాన్యం కొనుగోళ్ల రికార్డులు పకడ్బందీగా ఉండాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. తుమ్మన్నపల్లిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆమె సందర్శించారు. తూకంలో కోతలు లేకుండా చూడాలన్నారు. దాన్యం తడవకుండా టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. 48 గంటల్లోగా ధాన్యం వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. కేంద్రాల వద్ద మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి కొనుగోలు కేంద్రాలకు వచ్చే మహిళలు,ఉపాధి కూలీల కు ‘ఆరోగ్య మహిళ’ పరీక్షలు నిర్వహించాలన్నారు. పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం గర్భిణులు, బాలింతలు, చిన్నారులు పౌష్టికాహారం తీసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో పోషణ్ పక్షోత్సవాల్లో భాగంగా అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్యను పూర్తి చేస్తున్న విద్యార్థులకు సర్టిఫికెట్లు అందించారు. అనంతరం గర్భిణులకు సీమంతం నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించి చెత్త సేకరణ విధానం గురించి కమిషనర్ సమ్మయ్య అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, తహసీల్దార్ కనకయ్య, ఎంపీడీవో సునీత, ఏఈవో సౌమ్య ఉన్నారు. -
పారదర్శకంగా షెట్టర్లు
● 26 దుకాణాల కేటాయింపు ● నగరపాలకసంస్థ కమిషనర్ చాహత్ బాజ్పేయ్కరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని శాతవాహన యూనివర్సిటీ వద్ద నగరపాలకసంస్థ నిర్మించిన దుకాణ సముదాయంలోని 26 షెట్టర్లను బుధవారం లక్కీడ్రా ద్వారా వ్యాపారులకు కేటాయించారు. అద్దె ప్రాతిపదికన 26 షెట్టర్లను రెండు సంవత్సరాలకు లీజుకు ఇచ్చేందుకు గతంలోనే నగరపాలకసంస్థ దరఖాస్తులు స్వీకరించింది. 26 షెట్టర్లకు 261 మంది దరఖాస్తు చేసుకున్నారు. బుధవారం నగరపాలకసంస్థ ఆవరణలోని కళాభారతిలో జరిగిన కార్యక్రమంలో దరఖాస్తు దారుల సమక్షంలో కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్ డ్రాతీసి కేటాయించారు. 26 షెట్టర్లలో రిజర్వేషన్ ప్రకారం ఎస్సీలకు 4, ఎస్టీలకు 2, దివ్యాంగులకు 1, నాయిబ్రాహ్మణులకు 1 కేటాయించగా, ముందుగా రిజర్వేషన్కేటగిరీ డ్రా తీశారు. ఎస్సీ రిజర్వేషన్ కేటగిరీలో డ్రాతీయగా అశోక్అనే వ్యక్తికి 6వ నెంబర్ షెట్టర్ దక్కింది. అయితే అశోక్‌కు సివిల్ హాస్పిటల్ దుకాణసముదాయంలో షెట్టర్ ఉన్నట్లు గుర్తించిన కమిషనర్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించి, మరొకరికి డ్రాద్వారా షాప్‌ను కట్టబెట్టారు. రిజర్వేషన్కేటగిరీ ముగిసిన తర్వాత మిగిలిన అన్ని దరఖాస్తులను జనరల్ కేటగిరీకి మార్చి డ్రాతీశారు. పారదర్శకంగా కేటాయింపు: కమిషనర్ విద్యానగర్‌లోని షెట్టర్ల కేటాయింపు పారదర్శకంగా చేపట్టామని నరగపాలకసంస్థ కమిషనర్‌చాహత్ బాజ్‌పేయ్ తెలిపారు. మున్సిపల్ నిబంధనల మేరకు రిజర్వేషన్ ప్రకారం డ్రానిర్వహించామన్నారు. గతంలో పొందిన వారికి అవకాశం ఇవ్వలేదన్నారు. కుటుంబంలో ఒక్కరినే డ్రాకు అనుమతిచ్చామన్నారు. షెట్టర్లను దక్కించుకున్నవారు వారం రోజుల్లోగా నగరపాలకసంస్థతో ఒప్పందం చేసుకోవాలన్నారు. సబ్లీజుకు ఇచ్చినట్లు తేలితే ఒప్పందం రద్దు చేస్తామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ స్వరూపరాణి, ఆర్వో భూమానందం తదితరులు పాల్గొన్నారు. -
ఇయ్యాల్టి నుంచి ‘భూ భారతి’
● మండలాలవారీగా షెడ్యూల్ ఖరారు ● 30 వరకు నిర్వహణకరీంనగర్ అర్బన్: భూభారతి పోర్టల్‌పై ప్రభుత్వ యంత్రాంగం గురువారం నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టనుంది. కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి మండలాల వారీగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు షెడ్యూల్ ఖరారు చేశారు. రైతు వేదికల కేంద్రంగా తహసీల్దార్లు సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. గుడ్ ఫ్రైడే, ఆదివారం సెలవు రోజులు మినహాయించి నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం ప్రజావాణి ఉండటంతో అవగాహన కార్యక్రమం నుంచి మినహాయించారు. కరీంనగర్, హుజూరాబాద్ రెవెన్యూ డివిజన్లకు ఆయా ఆర్డీవోలు నోడల్ అధికారులుగా వ్యవహరించనున్నారు. 17న తిమ్మాపూర్ రైతు వేదికలో ఉదయం 10.30 గంటలకు అవగాహన కార్యక్రమం ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు గన్నేరువరం, 19న హుజూరాబాద్ సాయిరూప గార్డెన్లో ఉదయం 10.30 గంటలకు, 22న రామడుగు రైతువేదికలో ఉదయం 10.30 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు గంగాధరలో, 23న చొప్పదండి రైతువేదికలో ఉదయం 10.30 గంటలకు, 24న మానకొండూరు రైతువేదికలో ఉదయం 10.30 గంటలకు, వంకాయ గూడెం(శంకరపట్నం)లో మధ్యాహ్నం 12 గంటలకు, 25న జమ్మికుంట ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్‌లో, మధ్యాహ్నం 12 గంటలకు ఇల్లందకుంట రైతువేదికలో, 26న దుర్శేడ్ రైతువేదికలో (కరీంనగర్ రూరల్) ఉదయం 10.30 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు కొత్తపల్లి రైతువేదికలో అవగాహన ఉంటుంది. 29న చిగురుమామిడి రైతువేదికలో ఉదయం 10.30 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు సైదాపూర్ రైతువేదిక, 30న వీణవంక రైతువేదికలో ఉదయం 10.30 గంటలకు అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. -
గురువారం శ్రీ 17 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
అపరభద్రాద్రి శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో 13 రోజులుగా జరుగుతున్న శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు బుధవారం రాత్రి ఏకాంత సేవతో ముగిశాయి. అర్చకులు శేషం రామాచార్యులు, శేషం వంశీధరాచార్యులు, సీతారామాచార్యులు, కిరణ్‌కుమార్‌ల మంత్రోచ్ఛారణల మధ్య సప్తవర్ణాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి అద్దాల మేడలో ఏకాంత సేవ నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఇంగిలే రామారావు, ఇన్చార్జి ఈవో సుధాకర్, ధర్మకర్తలు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. – ఇల్లందకుంటన్యూస్రీల్ముగిసిన బ్రహ్మోత్సవాలు -
● మంత్రి పొన్నం ప్రభాకర్
సైదాపూర్: రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమారం గ్రామంలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో సైదాపూర్‌లో సహకార సంఘం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి బుధవారం ప్రారంభించారు. అనంతరం వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు దొంత సుధాకర్ అధ్యక్షతన కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ ప్రజాప్రభుత్వం సన్నబియ్యం ఉచితంగా పంపిణీ చేస్తోందన్నారు. బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉన్నచోట సన్నబియ్యం ఎందుకు ఇవ్వడంలేదని మంత్రి ప్రశ్నించారు. ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనకు దమ్ములేదా? అని నిలదీశారు. తూకంలో కోత పెడితే కఠిన చర్యలు తీసుకోవాలని అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్, ఆర్డీవో రమేశ్‌ను ఆదేశించారు. ధరణి స్థానంలో భూ భారతి చట్టం తీసుకొచ్చామన్నారు. ఇల్లు లేనిప్రతీ పేద కుటుంబానికి రాజకీయ ప్రమేయం లేకుండా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఏఎంసీ చైర్మన్ దొంత సుధాకర్, ఎల్ఎస్సీఎస్ చైర్మన్ తిరుపతిరెడ్డి, తహసీల్దార్ మంజుల, ఎంపీడీవో యాదగిరి, మార్కెట్ కమిటీ, సహకార సంఘం డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు. -
ఆధ్యాత్మిక కేంద్రాలుగా అభివృద్ధి చేయండి
కరీంనగర్‌టౌన్: వేములవాడ, కొండగట్టు, ఇల్లందకుంట ప్రాంతాలను ఆధ్యాత్మిక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్ కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను కోరారు. రాష్ట్రాలకు మూలధన పెట్టుబడి కోసం ప్రత్యేక సహాయ (ఎస్ఏఎస్సీఐ) పథకం కింద నిధులను మంజూరు చేయాలని విన్నవించారు. సిరిసిల్ల లేదా సిద్దిపేట జిల్లాల్లో సైనిక్‌స్కూల్ ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు విన్నవించారు. ఈమేరకు న్యూఢిల్లీలో బుధవారం కలిసి వినతిపత్రాలు అందించారు. కేంద్రం సైనిక్‌స్కూల్‌ను మంజూరుచేస్తే భూమి, మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. సైనిక్‌స్కూల్ మంజూరు చేయండి కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, గజేంద్రసింగ్ షెకావత్‌లకు బండి సంజయ్ వినతి -
ప్రజాస్వామ్యంలో ప్రెస్ ఫోర్త్ ఎస్టేట్
వేములవాడ: ప్రజాస్వామ్యంలో ప్రెస్ ఫోర్త్ ఎస్టేట్‌గా ఉంటూ ప్రజలకు, ప్రభుత్వాలకు వారధులుగా పనిచేస్తున్నారని ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ప్రెస్‌క్లబ్‌లోని సమావేశ మందిరాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ తనకు పాత్రికేయ మిత్రులతో 1987 నుంచి అనుబంధం ఉందని, ఒకప్పుడు రుద్రంగి నుంచి వేములవాడకు వచ్చి వార్తలు అందించిన మిత్రులు ఉన్నారని గుర్తు చేసుకున్నారు. సోషల్ మీడియాతో మంచి, చెడు రెండు ఉంటున్నాయన్నారు. త్వరలోనే జర్నలిస్టులకు ఇళ్ల స్తలాలు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. త్వరలోనే వేములవాడ ట్రస్ట్ బోర్డు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏఐతో పొంచి ఉన్న ముప్పు – ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి పత్రికరంగంలో మార్పులు వస్తూనే ఉన్నాయని.. ప్రింట్ నుంచి ఎలక్ట్రానిక్.. ఆతర్వాత సోషల్‌మీడియా వచ్చిందని.. ఇప్పుడు ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్)తో మరించి ముప్పు పొంచి ఉందని ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. దేశ ప్రధాని, ఆర్థికశాఖ మంత్రి మాట్లాడినట్లు వీడియోలు వైరల్ చేస్తూ హైరానా సృష్టించిన విషయాలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఏఐ, దాని పరిణామాలపై అవగాహన కల్పించేందుకు హైదరాబాద్‌లో శిక్షణ తరగతులు నిర్వహించామని, త్వరలోనే వేములవాడలో రెండు రోజులపాటు శిక్షణ తరగతులు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఐజేయూ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు విరాహత్ అలీ మాట్లాడుతూ వేములవాడ ప్రెస్‌క్లబ్ ముందు నుంచి అన్ని రంగాల్లో ముందుందన్నారు. ఏఎంసీ చైర్మన్ రొండి రాజు, వైస్‌చైర్మన్ కనికరపు రాకేశ్, అధ్యక్షుడు పుట్టపాక లక్ష్మణ్, కార్యదర్శి మహేశ్, కార్యవర్గ సభ్యులు, పాత్రికేయులు పాల్గొన్నారు. పాత్రికేయులు ప్రజాసేవకులు కరోనా తర్వాత పాత్రికేయ రంగం మారింది ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రెస్ అకాడమీ చైర్మన్‌తో కలిసి ప్రెస్‌క్లబ్ సమావేశ మందిరం ప్రారంభం -
నీడ లేదు.. నీరూ లేదు..!
సిరిసిల్ల పాత బస్టాండులో నీడలేని ప్లాట్‌ఫామ్స్ ● కరీంనగర్ స్మార్ట్‌సిటీలో బస్షెల్టర్లు నామమాత్రం. వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌కు ఎదురుగా మానకొండూరు, తిమ్మాపూర్, బెజ్జంకి, కమాన్ ప్రాంతంలో ఉన్న నిలువనీడ కరువయ్యింది. కోర్టు ఎదురుగా చొప్పదండి , పెద్దపల్లికి వెళ్లే రూట్లో బస్‌షెల్టర్ లేకపోవడంతో జనం ఎండలో నిలబడుతున్నారు. ● రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం, సహా ఇల్లంతకుంట, గంభీరావుపేట, కోనరావుపేట, బోయినపల్లిలో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడంలేదు. పలుగ్రామాల్లో బస్సులు నిలిపే స్థలం, బస్సుషెల్టర్లు లేవు. జిల్లా కేంద్రంలో పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. పట్టణానికి దూరంగా ఉన్న కొత్తబస్టాండ్‌లో ప్రయాణికులు నామమాత్రంగా వెళ్తుంటారు. పాతబస్టాండ్ ఏరియానే నిత్యం వందలాది మందితో కిటకిటలాడుతోంది. ఇక్కడ ప్లాట్‌ఫామ్స్‌పై నిలువనీడలేదు. ప్రయాణికులు ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ బస్సుల కోసం నీరిస్తున్నారు. ఇల్లంతకుంటలో తాగునీటి వసతిలేదు. మూత్రశాలలు, మరుగుదొడ్ల సదుపాయం లేదు. కోనరావుపేట, గంభీరావుపేటలో ప్రయాణ ప్రాంగంణం నిరుపయోగంగా ఉంది. ప్రయాణికులు బస్సుల కోసం దుకాణాల నీడలో నిలబడుతున్నారు. ● జగిత్యాల జిల్లా రాయికల్, కథలాపూర్, ఇబ్రహీంపట్నం, పెగడపల్లిలో పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. రాయికల్ పాతబస్టాండ్‌లో కూర్చునేందుకు, నీడలేదు. ఇబ్రహీంపట్నంలో బస్ షెల్టర్ల వద్ద బస్సులు ఆపడంలేదు. దీంతో ప్రయాణికులు రోడ్లపై నిలబడుతున్నారు. తాగునీటి వసతీ లేదు. పెగడపల్లిలో తాగునీరు కరువైంది. ఉన్న టాయిలెట్స్ సరిగాలేవు. కథలాపూర్‌లో కనీస వసతులు లేవు. టాయిలెట్ కోసం దూరప్రాంతానికి వెళ్లాల్సి వస్తోంది. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్‌లో ప్రయాణికులు బస్సుల కోసం ఎండలో నిరీక్షిస్తున్నారు. కరీంనగర్–గోదావరిఖని రాజీవ్ రహదారిలో బస్షెల్ట ర్లు లేకపోవడంతో ప్రయాణికులు ఎండకు ఎండుతూ వానకు తడుస్తున్నారు. బొమ్మకల్, చల్మెడ ఆనందరావు ఆస్పత్రి, గోపాల్పూర్, ఇరుకుల్ల, మొగ్ధుంపూ ర్ గ్రామాల స్టేజీలపై బస్ షెల్టర్లు లేకపోవడంతో ప్ర యాణికులు బస్సుల కోసం ఎండలోనే నిరీక్షిస్తున్నారు. – సిరిసిల్లటౌన్/ గంభీరావుపేట/ కోనరావుపేట/బోయినపల్లి/రాయికల్/ కథలాపూర్/కాల్వశ్రీరాంపూర్/పెగడపల్లి అధ్వానంగా ఆర్టీసీ బస్టాండ్లు, షెల్టర్లు ప్రయాణికులకు ఎండ కష్టాలు తాగడానికి నీరులేదు.. ఒంటికి, రెంటికి తిప్పలే ఓ వైపు ఎండలు మండుతున్నాయి. ఎండవేడిమికి జనం నానా అవస్థలు పడుతున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారి కష్టాలు వర్ణనాతీతం. చంటిపిల్లల తల్లులు, మహిళలు, వృద్ధులు పడరానిపాట్లు పడుతున్నారు. బస్సుల కోసం ఎదురు చూడడం.. వేసవి తాపం.. గొంతు తడుపుకోవడానికి కనీసం నీటివసతి కరువు. డీహైడ్రేషన్.. బస్టాండ్, బస్టాప్‌లలో కనీస సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారు. ఎండవేడిమికి తట్టుకోలేక నరకం అనుభవిస్తున్నారు. -
వైద్య కళాశాలకు దేహదానం
ఓదెల/సుల్తానాబాద్(పెద్దపల్లి): కొలనూర్ గ్రామానికి చెందిన జీగురు ఓదెలు అనారోగ్యంతో చనిపోయారు. ఆయన పార్థివదేహాన్ని బుధవారం కరీంనగర్ ప్రతిమ మెడికల్ కాలేజీకి అప్పగించారు. తొలుత మృతుడి నివాసంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నలిమెల భాస్కర్ సమక్షంలో సదాశయ ఫౌండేషన్, లయన్స్ క్లబ్, సుల్తానాబాద్ ఆధ్వర్యంలో నివాళి అర్పించారు. మృతుడి కుమారులు జీగురు నాగయ్య, ఐలయ్య, రవీందర్, రాంచందర్ నేతృత్వంలో పార్థివదేహాన్ని ప్రతిమ మెడికల్ కాలేజీ నిర్వాహకులకు అప్పగించారు. మృతుడి భార్య జీగురు కనకలక్ష్మి సైతం గతంలో శరీరదానానికి అంగీకరించారు. ఈకార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. -
మాజీ ఎంపీటీసీకి తహసీల్దార్ భరోసా
శంకరపట్నం: కొడుకు, కోడలు తిండి పెట్టకుండా ఇబ్బందులు పెడుతున్న రాజాపూర్ మాజీ ఎంపీటీసీ ఆసరి ఐలయ్యకు తహసీల్దార్ భాస్కర్ న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు. భార్య సారమ్మ, చిన్నకుమారుడు గణపతి చనిపోవడంతో వ్యవసాయ భూమిని పెద్దకుమారుడు సాగు చేసుకుంటున్నాడని, తిండిపెట్టకుండా ఇబ్బందులు పెడుతూ, దుర్భాషలాడుతున్నారని ఐలయ్య కేశవపట్నం పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. వ్యవసాయభూమి, ఇళ్లు తనకు ఇప్పించాలని తహసీల్దార్‌ను వేడుకున్నాడు. స్పందించిన తహసీల్దార్ వెంటనే విచారణ చేయాలని ఆర్ఐను ఆదేశించారు. కొడుకు, కోడలుకు కౌన్సిలింగ్ ఇచ్చారు. -
సమ్మర్ స్పెషల్ టూర్ ప్యాకేజీ
సిరిసిల్లకల్చరల్: వేసవి సెలవుల్లో భారత్ గౌరవ్ ట్రెయిన్ యాత్ర పేరుతో రైల్వేశాఖ స్పెషల్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ట్రెయిన్ యాత్ర ప్రారంభమవుతుందని టూరిజం జనరల్ మేనేజర్ డీఎస్‌జీపీ కిశోర్ తెలిపారు. రైలు, బస్సు ప్రయాణాలతోపాటు హోటల్, భోజన ఖర్చులు, గైడ్‌తో కలిపి సైట్ సీయింగ్ ఉంటాయని పేర్కొన్నారు. ప్యాకేజీల వివరాలు వెల్లడించారు. మొదటి ప్యాకేజీ : ఈనెల 23 నుంచి మే 2 వరకు హరిద్వార్, రిషికేష్, వైష్ణవదేవి, ఆనంద్‌పూర్, నైనాదేవి, అమృత్సర్. ఒక్కో వ్యక్తికి రూ.18,150 చార్జీ. రెండో ప్యాకేజీ : మే 8 నుంచి 17 వరకు వారణాసి, పూరీ, గయ, అయోధ్య, ప్రయాగరాజ్, కోణార్క్ ప్రాంతాలకు ఒక్కో వ్యక్తికి రూ.16,800 చార్జీ. మూడో ప్యాకేజీ: మే 22 నుంచి 30 వరకు అరుణాచలం, రామేశ్వరం, తంజావూర్, కన్యాకుమారి, త్రివేండ్రం, త్రిచి, మదురై ప్రాంతాలు.. ఒక్కో వ్యక్తికి రూ.14,700 చార్జీ వసూలు చేస్తారు. నాలుగో ప్యాకేజీ: జూన్ 4 నుంచి 12 వరకు మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్, త్రయంబకేశ్వర్, భీమాశంకర్, ఘృశ్నేశ్వర్, ఎల్లోర, మోహం, నాగ్‌పూర్ ప్రాంతాలు.. ఒక్కో వ్యక్తికి రూ.14,700 వసూలు చేస్తారు. ఆసక్తి గల వారు wwwirctctour ism.com వెబ్సైట్ ద్వారా లేదా సికింద్రాబాద్‌లోని ఐఆర్సీటీసీ ఆఫీస్‌లో బుక్ చేసుకోవచ్చని తెలిపారు. వివరాల కోసం 04027702407 లేదా 9701360701 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు. లాడ్జిల్లో తనిఖీలువేములవాడ: వేములవాడలోని లాడ్జీలపై పట్టణ సీఐ వీరప్రసాద్ ఆధ్వర్యంలో 50 మంది పోలీసులు బుధవారం రాత్రి ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాడ్జీలలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టరీత్య చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లాడ్జీలకు వచ్చే యాత్రికుల వద్ద గుర్తింపుకార్డులు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. -
గ్రూప్–1 ఫలితాల్లో అవకతవకలు
కరీంనగర్: గ్రూప్–1 ఫలితాల్లో అవకతవకలు జరిగాయని, పరీక్షను రద్దు చేయాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి డిమాండ్ చేశారు. కరీంనగర్‌లోని మాజీమంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దాదాపు 654 మంది అభ్యర్థులకు ఒకే సిరీస్‌లో సమానంగా మార్కులు వచ్చాయని ఆరోపించారు. రాముల్‌నాయక్ చాలెంజ్‌ను స్వీకరిస్తున్నట్లు స్పష్టం చేశారు. టీఎస్పీఎస్సీ మల్టీజోన్‌లో నంబర్–1 ర్యాంక్ రాములునాయక్ కొడలికి వచ్చిందన్నారు. తన కోడలు పద్దెనిమిది గంటలు చదివిందని రాములు నాయక్ చెప్పగా... ఆ అమ్మాయి మాత్రం కేవలం ఐదు గంటలే చదివానని చెప్తోందన్నారు. వీరిద్దరిలో ఎవరి మాటలు నమ్మాలో తెలియడం లేదన్నారు. రాముల్‌నాయక్ కోడలుకు గాంధీభవన్ నుంచి ముందే పరీక్ష పేపర్ వచ్చిందని ఆరోపణలు చేశారు. కోఠి ఉమెన్స్ కళాశాలలో ఎగ్జామ్ స్కాం జరిగిందని ఆరోపించారు. ఒకమ్మాయి రీకౌంటింగ్ అడిగితే 60 మార్కులు తగ్గాయన్నారు. కాంగ్రెస్ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం స్కాంల ప్రభుత్వమని దుయ్యబట్టారు. బండిసంజయ్ ఈ అంశంపై ఎందుకు నోరువిప్పడం లేదని ప్రశ్నించారు. సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డితో లాలుచీ ఉండడంతోనే ఎవరూ మాట్లడడం లేదన్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ.. టీఎస్పీఎస్సీ పరీక్ష రాసిన వారికి చాలా అన్యాయం జరిగిందన్నారు. టీఎస్పీఎస్సీ పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి ఉంటే.. తమకు కూడా ఉద్యోగాలు వచ్చేవని.. తమకు న్యాయం చేయాలని చాలా మంది బాధితులు తమ వద్దకు వస్తున్నారన్నారు. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి చేస్తున్న సవాల్‌ను ప్రభుత్వం స్వీకరించి జ్యుడీషియల్ ఎంక్వయిరీ గాని, కేంద్ర విజిలెన్స్ ద్వారా గానీ లేదా సీబీఐ ఎంక్వయిరీ వేసి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. కరీంనగర్ నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు చల్లా హరిశంకర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. సీబీఐతో విచారణ చేపట్టాలి హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి -
తాగునీటి సమస్యకు చెక్
● నీటి ఎద్దడి నియంత్రణకు చర్యలు ● జిల్లాకు రూ.కోటి నిధులు మంజూరు ● 24 గ్రామాల్లో అద్దెకు వ్యవసాయ బావులుకరీంనగర్రూరల్: వేసవి ప్రారంభంలోనే ఎండలు మండుతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఇప్పటికే నీటి ఎద్దడి ప్రారంభమైంది. ఈ క్రమంలో వేసవిలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం జిల్లాకు రూ.కోటి నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో చేపట్టనున్న పనులపై గైడ్‌లైన్స్ జారీ కాగా.. మిషన్ భగీరథ అధికారులు కసరత్తు చేపట్టారు. నీటి ఎద్దడి ప్రాంతాలు ఇవే.. జిల్లాలోని 15 మండలాల పరిధిలో ఉన్న 318 గ్రామపంచాయతీలు, 464 ఆవాసాలకు మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నారు. చొప్పదండి, గంగాధర, గన్నేరువరం మండలాలకు మిషన్ భగీరథ నీరు సరిపడా రావడంలేదు. కరీంనగర్ మండలంలో నగునూరు, ఎలబోతారం, ఫకీర్‌పేట, కొత్తపల్లి మండలంలో ఖాజీపూర్, మానకొండూరు మండలంలో బంజేరుపల్లి, జగ్గయ్యపల్లె, రంగపేట, వెల్ది, రామడుగు మండలంలో రామడుగు, వెంకట్రావుపల్లి, గోపాల్రావుపేట గ్రామాల్లో తాగునీటి ఎద్దడి ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. తాగునీటి ఎద్దడి నియంత్రణకు రూ.1.8కోట్లు అవసరమని ప్రభుత్వానికి అధికారులు నివేదిక సమర్పించారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం జిల్లాకు రూ.కోటి నిధులు మంజూరు చేసింది. అద్దెకు వ్యవసాయబావులు నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న గ్రామాల్లో వ్యవసాయ బావులను అద్దెకు తీసుకోవాలని నిర్ణయించారు. ప్రస్తుతం వరి కోతలు పూర్తిచేసిన రైతులను సంప్రదించి అందుబాటులో ఉన్న వ్యవసాయ బావులను అద్దెకు తీసుకుంటున్నారు. జిల్లాలో సైదాపూర్ మండలంలోని సర్వాయిపేట, అమ్మనగుర్తి, జాగిరిపల్లి, గొడిశాల, గుజ్జులపల్లి, ఎలబోతారం, రాంచంద్రపూర్, శివరాంపల్లి, చిగురుమామిడి మండలం నవాబ్‌పేట, కరీంనగర్ మండలం మొగ్ధుంపూర్, గన్నేరువరం మండలం చీమలకుంటపల్లి, హన్మాజీపల్లి, మానకొండూరు మండలం పెద్దబంజేరుపల్లి, జమ్మికుంట మండలం వెంకటేశ్వర్లపల్లె, గండ్రపల్లె, శంభునిపల్లె, ఇల్లందకుంట మండలం పతార్లపల్లె, వీణవంక మండలం కొండపాక, కోర్కల్, చొప్పదండి మండలం గుమ్లాపూర్, గుంటూరుపల్లి, గంగాధర మండలం నర్సింహులపల్లి, సర్వారెడ్డిపల్లి, గర్షకుర్తి గ్రామాల్లో బావులను అద్దెకు తీసుకుని తాగునీటిని సరఫరా చేస్తున్నారు. మరమ్మతుకు జెడ్పీ నిధులు గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నియంత్రణకు జెడ్పీ నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో కొత్తపైపులైన్ల నిర్మాణం, పైపులైన్లు, బోర్ల మరమ్మతు తదితర పనులు చేపడతారు. సైదాపూర్ మండలంలో ఆరు పనులకు రూ.8లక్షలు, శంకరపట్నం మండలంలో 12 పనులకు రూ.19.4లక్షలు, గన్నేరువరం మండలంలో 10 పనులకు రూ.16.70 లక్షలు, మానకొండూరులో 8 పనులకు రూ.48.15 లక్షలు మంజూరయ్యాయి. ఆయా గ్రామాల్లో పనులు వివిధ దశల్లో ఉన్నాయి.నీటి ఎద్దడి నివారణకు చర్యలు తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం రూ.కోటి నిధులు మంజూరు చేసింది. ప్రభుత్వ గైడ్‌లైన్స్ ప్రకారం తాగునీటి ఎద్దడి ఉన్న గ్రామాల్లో ఈ నిధులతో పనులు చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. ఇప్పటికే తాగునీటి ఎద్దడి ఉన్న గ్రామాల్లో అద్దె బావుల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నాం. – టి. అంజన్‌రావు, ఈఈ, ఆర్డబ్ల్యూఎస్ -
వైభవంగా చక్రస్నానం
ఇల్లందకుంట: ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామివారికి చక్రస్నానం వైభవంగా నిర్వహించారు. ఉత్సవమూర్తులకు అర్చకులు శేషం రామాచార్యులు, వంశీధరాచార్యులు వేద మంత్రాల నడుమ చక్రస్నానం నిర్వహించారు. ఊరేగింపుగా తీసుకెళ్లి ధర్మగుండంలో పవిత్రస్నానం ఆచరించారు. రాత్రి 108 కలశాభిషేకాలతో పుష్పయాగం(నాఖబలి) అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇన్చార్జి ఈవో కందుల సుధాకర్, ఆలయ కమిటీ చైర్మన్ ఇంగిలే రామారావు, ధర్మకర్తలు కడారి కుమారస్వామి, సురేందరెడ్డి, రవీందర్‌రెడ్డి, మోహన్ పాల్గొన్నారు. -
‘ఓపెన్’లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలి
● కలెక్టర్ పమేలా సత్పతికరీంనగర్: జిల్లాలో ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతి, ఇంటర్ పరీక్షలు రాస్తున్నవారు శ్రద్ధతో చదివి వందశాతం ఫలితాలు సాధించాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆకాంక్షించారు. ఓపెన్ స్కూల్ ద్వారా ఇంటర్, పదోతరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులతో మంగళవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో సన్నద్ధత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో ఏ చిన్న ఉద్యోగానికై నా, ఉపాధి అవకాశాలకై నా విద్యార్హతలు ముఖ్యమని అన్నారు. ఓపెన్ స్కూల్ విద్యార్హత రెగ్యులర్ అర్హతకు సమానమేనని అన్నారు. ఈనెల 20 నుంచి నిర్వహించనున్న ఇంటర్, పదో తరగతి ఓపెన్ స్కూల్ పరీక్షలకు ఫీజు చెల్లించిన విద్యార్థులంతా తప్పక హాజరై పరీక్ష రాయాలని సూచించారు. డీఈవో జనార్దన్‌రావు మాట్లాడుతూ పదోతరగతిలో 421మంది, ఇంటర్లో 881మంది ఓపెన్ స్కూల్ పరీక్షలు రాస్తున్నారని తెలిపారు. క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్‌రెడ్డి, జిల్లా సైన్స్ ఆఫీసర్ జైపాల్ రెడ్డి, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ సీహెచ్.నాగేశ్వరరావు పాల్గొన్నారు. భూ భారతిపై అవగాహన కల్పించండి కరీంనగర్ అర్బన్: భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం రూపొందించిన భూ భారతి చట్టంపై సదస్సులు ఏర్పాటు చేసి ప్రజలకు అవగా హన కల్పించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నా రు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం భూభారతి నూతన రెవెన్యూ చట్టంపై తహసీల్దార్లతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 17నుంచి ప్రతీ మండలంలో భూభారతి నూతన రెవెన్యూ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులు స్వీకరించాలని అ న్నారు. అడిషనల్ కలెక్టర్ లక్ష్మికిరణ్, డీఆర్వో వెంక టేశ్వర్లు, ఆర్డీవోలు మహేశ్వర్, రమేశ్ పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ పూర్తి చేయండి జిల్లాలోని పైలట్‌గా ఎంపిక చేసిన గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో ఇందిరమ్మ ఇండ్ల పథకంపై సమీక్ష నిర్వహించారు. పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన గ్రామాలలో కొంత మందికి ఇండ్లు మంజూరు చేశామని, మిగిలిన ఇండ్లను మంజూరు చేసేందుకు జాబితా తయారు చేయాలని అన్నారు. పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన గ్రామాల్లో అన్ని ఇండ్లకు త్వరితగతిన 100శాతం మార్కింగ్ పూర్తి చేయాలని ఆదేశించారు. -
తాగునీటి సరఫరాపై దృష్టి సారించాలి
● నగరపాలకసంస్థ కమిషనర్ చాహత్ బాజ్పేయ్కరీంనగర్ కార్పొరేషన్: నగరంలో తాగునీటి సరఫరాపై దృష్టి సారించాలని నగరపాలకసంస్థ కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొత్త విలీన గ్రామాలతో సహా నగరంలో తాగునీటి సరఫరాకు ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టాలన్నారు. విలీన గ్రామాల్లో మిషన్ భగీరథ నీటి సరఫరాపై ప్రజల నుంచి చాలా ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఎక్కడెక్కడ నీటి సమస్య ఉందో డీఈ, ఏఈలు పర్యవేక్షించాలని సూచించారు. నల్లానీరు రాని ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా అందించాలన్నారు. బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణానికి టెండర్ ప్రక్రి య చేపట్టాలన్నారు. పెండింగ్ పనులు పూర్తి చే యాలని, సీఎంఏ పనుల్లో గ్యాబ్స్ ఉంటే పరిష్కరించాలన్నారు. వీధి దీపాల నిర్వహణ సక్రమంగా చేపట్టాలన్నారు. బాక్స్‌ల్లో సమయ వేళలు మార్చాలన్నారు. నాలాల్లో సిల్ట్ తొలగించేందుకు టెండర్లు పిలవాలన్నారు. ఈఈలు యాదగిరి, సంజీవ్, డీఈలు లచ్చిరెడ్డి, వెంకటేశ్వర్లు, ఓంప్రకాశ్, ఏఈలు సతీశ్, గట్టు స్వామి పాల్గొన్నారు. -
విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సు
కరీంనగర్‌క్రైం: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కే.వెంకటేశ్ నగరంలోని ప్రభుత్వ బాలుర వసతి గృహం (షెడ్యూల్ కులాల)ను సందర్శించి, చట్టాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు మంచి నడవడిక అలవర్చుకోవాలని సూచించారు. చక్కగా చదువుకుని క్రమశిక్షణతో ఎంచుకున్న లక్ష్యాలను సాధించడానికి కృషి చేయాలన్నా రు. ధైర్యంతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు.ఎలాంటి న్యాయపరమైన సాయం అందించడానికై నా న్యాయ సేవాధికార సంస్థ సిద్ధంగా ఉంటుందన్నారు. వసతి గృహంలో అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. ‘ఆదాయ మార్గాలు లేక భూముల అమ్మకాలు’ కరీంనగర్‌టౌన్: కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆదా యం కావాలంటే, భూముల వేలం ఒక్కటే శరణ్యంగా మారిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి విమర్శించారు. మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ సంస్థాగత నిర్మాణంపై అసెంబ్లీ కన్వీనర్లు, మండల అధ్యక్షులతో ముఖ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ హెచ్‌సీయూ భూములు అమ్మడానికి ప్రయత్నించి కాంగ్రెస్ విఫలమైందన్నారు. రాష్ట్రంలో ఆదాయం పెంచుకునే మార్గాలే లేకుండా పోయాయని, అందుకే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం భూములు అమ్ముకునే దుస్థితికి వచ్చిందని అన్నారు. రాష్ట్ర పార్టీ సూచన మేరకు మండల కమిటీ మొదలుకుని బూత్‌స్థాయి వరకు సంస్థాగత నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేయాలన్నారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకట్‌రెడ్డి, పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు, జిల్లా ఉపాధ్యక్షుడు రంగు భాస్కరచారి, ఎర్రబెల్లి సంపత్ రావు, నిర్మలారెడ్డి పాల్గొన్నారు. సదస్సుకు తరలిరండి కరీంనగర్: దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ఈనెల 25న నిర్వహించే జిల్లా సదస్సును విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు గీట్ల ముకుందరెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం కోతిరాంపూర్‌లోని ముకుందలాల్ మిశ్రాభవన్లో జిల్లా ట్రేడ్ యూనియన్స్ సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ జిల్లాలో కార్మికవర్గాన్ని సమాయత్తం చేయడానికి సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపా రు. ఈనెల 25న బద్ధం ఎల్లారెడ్డి భవన్లో జరి గే సదస్సుకు అన్ని కార్మిక సంఘాలు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేశ్, బీఆర్టీయూ జిల్లా బొమ్మిడి శ్రీనివాస్‌రెడ్డి, టీఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు కల్యాడపు ఆగయ్య తదితరులు పాల్గొన్నారు. ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి కరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని దుకాణ దారులు విధిగా ట్రేడ్‌లైసెన్స్ తీసుకోవాలని నగరపాలకసంస్థ డిప్యూటీ కమిషనర్ స్వరూపరాణి అన్నారు. మంగళవారం నగరపాలకసంస్థ కార్యాలయంలో రెవెన్యూ, వార్డు అధికారులు, జవాన్లతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు ట్రేడ్ లైసెన్స్ తీసుకోని దుకాణదారులు లైసెన్స్ తీసుకోవాలని, లైసెన్స్ రెన్యువల్ చేసుకొన్న వాళ్లు పన్నులు చెల్లించాలన్నారు. లేకుంటే చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఆస్తి పన్ను చెల్లింపులో ఐదుశాతం రాయితీని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఆర్వో భూమానందం, ఆర్ఐ కలాముల్లాఖాన్ పాల్గొన్నారు. డ్రైనేజీలో బయోవేస్టేజ్ ● ఆర్ఎంపీకి రూ.20వేల జరిమానా మానకొండూర్: మానకొండూర్‌లో ఓ ఆర్ఎంపీ డ్రైనేజీలో బయోవేస్టేజ్ వేశాడు. దీంతో పంచాయతీ కార్యదర్శి రూ.20వేల జరిమానా విధించాడు. మానకొండూర్‌కు చెందిన ఆర్ఎంపీ దేవేంద్ర శ్రీనివాస్ ఉపయోగిస్తున్న సిరంజ్‌లు, ఇంజక్ట్బుల్స్, వయల్స్, హాజార్డ్ వేస్ట్‌ను గ్రామంలోని మురుగు కాలువలో వేస్తున్నాడు. గ్రహించిన పంచాయతీ కార్యదర్శి రేవంత్‌రెడ్డి ఇలా వేయడం కారణంగా పారిశుధ్య కార్మికులతో పాటు, మూగజీవాలకు ప్రమాదం కలిగే అవకాశం ఉందని ఆర్ఎంపీకి నోటీసులు జారీ చేసి, రూ.20వేల జరిమానా విధించాడు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. -
గురుకులం విద్యార్థులకు అస్వస్థత
కోరుట్ల: కోరుట్ల ప్రభుత్వ సాంఘిక సంక్షేమ పాఠశాలలో నాలుగు రోజులుగా 30 మంది విద్యార్థులు జ్వరాలతో అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఐదుగురిని కోరుట్ల ప్రభుత్వాసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. సాంఘిక సంక్షేమ పాఠశాలలో నాలుగు రోజులుగా వరుసగా రోజు పది మంది చొప్పున 7, 8, 9వ తరగతి విద్యార్థులు జ్వరాల బారిన పడుతున్నారు. మంగళవారం ఒక్కసారిగా 12 మంది విద్యార్థులు జ్వరాలతో బలహీనంగా మారడంతో వారిని కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 7వ తరగతికి చెందిన ఐదుగురు విద్యార్థులు మణిదీప్, వర్షిత్, వంశీకృష్ణ, సుశాంత్, సుమన్‌కు జ్వర తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆసుపత్రిలోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. మధ్యాహ్నం జగిత్యాల డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్ ఆధ్వర్యంలో సాంఘిక సంక్షేమ పాఠశాలలో విద్యార్థులందరికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఐదుగురు విద్యార్థులను కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ సందర్శించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులకు సూచించారు. విద్యార్థుల ఆరోగ పరిస్థితి నిలకడగా ఉందని పాఠశాల ప్రిన్సిపాల్ బండి బాబు తెలిపారు. మూడు రోజుల్లో 30 మంది పాఠశాలలో మూడురోజులుగా 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలో 7, 8, 9వ తరగతి విద్యార్థులకు పరీక్షలు నడుస్తున్నాయి. ఆది, సోమవారాల్లో మరో 15 మంది విద్యార్థులు జ్వరంతో అవస్థ పడ్డారు. మంగళవారం మరో పదిమంది జ్వరం బారిన పడ్డారు. వీరిని కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చి పరీక్షలు చేయించారు. వీరిలో ముగ్గురికి చికిత్స అందిస్తున్నారు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ప్రభుత్వాసుపత్రికి వెళ్లి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీశారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులకు సూచించారు. డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్ ఆధ్వర్యంలో పాఠశాలలో ప్రత్యేక వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. జ్వరపీడితులకు రక్త పరీక్షలు నిర్వహిస్తామని డీఎంహెచ్‌వో తెలిపారు. స్టాఫ్‌నర్సులు నామమాత్రమే.. గురుకులాల్లో విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలించి అవసరమైన సలహాలు సూచనలు ఇవ్వడానికి స్టాఫ్‌నర్సులు అందుబాటులో ఉండాలి. గతంలో వీరు విద్యార్థులకు అవసరమైన గోలీలు, టానిక్‌లు ఇచ్చేవారు. నెల క్రితం స్టాఫ్‌నర్సులు కేవలం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని మాత్రమే పరిశీలించి అవసరమైన వారిని సమీపంలోని పీహెచ్‌సీలు, ప్రభుత్వాసుపత్రులకు తరలించి వైద్యసేవలు అందేలా చూడాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు సమాచారం. కానీ వారంరోజులుగా కోరుట్ల గురుకులంలో విద్యార్థులు జ్వరాల పాలవుతున్నా స్టాఫ్‌నర్సులు మాత్రలు ఇచ్చే అవకాశం లేకపోయింది. మూడురోజుల్లో చాలామంది విద్యార్థులకు జ్వర తీవ్రత ఉందని అయిలాపూర్ పీహెచ్‌సీకి సమాచారం ఇచ్చినా సెలవులు ఉన్నాయని పట్టించుకోలేదని స్టాఫ్‌నర్సు విజయశ్రీ తెలిపారు. అకస్మాత్తుగా పది మంది విద్యార్థులు జ్వరంత నిలబడలేని పరిస్థితులు రావడంతో వారిని ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. ఆ వెంటనే మరో ఐదుగురు విద్యార్థులను అడ్మిట్ చేసుకుని చికిత్స అందిస్తున్నారు. నిలకడగా విద్యార్థుల ఆరోగ్యం జ్వరాల బారిన పడిన 14 మంది విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కోరుట్ల ఆర్డీవో జీవాకర్‌రెడ్డి తెలిపారు. 8మందికి పరీక్షలు చేసి డిశ్చార్జి చేశామని, మరో ఆరుగురికి జ్వర తీవ్రత కాస్త ఎక్కువగా ఉండటంతో చికిత్స అందిస్తున్నామని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం బుధవారం వరకు మెరుగుపడుతుందని, ఆ వెంటనే వారిని డిశ్చార్జి చేస్తామని పేర్కొన్నారు. 30 మందికి జ్వరాలు ఐదుగురికి కోరుట్ల ఆసుపత్రిలో చికిత్స నిలకడగా విద్యార్థుల ఆరోగ్యం విద్యార్థులను పరామర్శించిన ఎమ్మెల్యే సందర్శించిన డీఎంహెచ్‌వో -
కొండగట్టు ఘాట్‌రోడ్డుపై ప్రమాదం
మల్యాల: మల్యాల మండలం ముత్యంపేటలోని కొండగట్టు ఘాట్ రోడ్డుపై ద్విచక్ర వాహనం అదుపు తప్పి కింద పడిన సంఘటనలో నలుగురు గాయపడ్డారు. రాయికల్ మండలం తాట్లవాయికి చెందిన కుటుంబం వినోద్ కుటుంబ తగాదాలతో రెండు రోజుల క్రితం కొండగట్టుకు వచ్చాడు. ఆయన ఆచూకీ తెలుసుకున్న ఆయన భార్య శ్రీవాణి కూతురు వేదాంశిక, బంధువుతో కలిసి కొండగట్టుకు చేరుకున్నారు. అక్కడున్న భర్త వినోద్‌తో కలిసి బైక్‌పై నలుగురు ఘాట్ రోడ్డు వెంట వెళ్తుండగా.. బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపు తప్పి కిందపడ్డారు. ఈ సంఘటనలో నలుగురూ గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది ఈఎంటీ జ్యోతి, పైలట్ ఆంజనేయులు బాధితులను జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బ్రేక్ ఫెయిల్ అదుపు తప్పిన బైక్ నలుగురికి గాయాలు -
ప్రమాదవశాత్తు అటెండర్ మృతి
కరీంనగర్‌క్రైం: కరీంనగర్ డీఈవో కార్యాలయంలో నైట్ వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న వ్యక్తి ఉతికిన బట్టలు తెచ్చుకోవడానికి రెండో అంతస్తుకు వెళ్లి ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందాడు. వన్‌టౌన్ సీఐ బిల్లా కోటేశ్వర్ వివరాల ప్రకారం.. కట్టరాంపూర్‌కు చెందిన గడప రవీందర్(58)విద్యాశాఖలో అటెండర్‌గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం కట్టరాంపూర్లోని ప్రైమరీస్కూల్‌లో పనిచేస్తూ డిప్యూటేషన్‌పై డీఈవో కార్యాలయం నైట్ వాచ్‌మెన్‌గా కొనసాగుతున్నాడు. మంగళవారం మధ్యాహ్నం ఉతికిన బట్టలు తెచ్చుకోవడానికి కార్యాలయం రెండో అంతస్తుకు వెళ్లి, ప్రమాదవశాత్తు జారి పడ్డాడు. తల, చాతిపై బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. కార్యాలయం సూపరింటెండెంట్ నరసింహస్వామి రవీందర్ కుటుంబసభ్యులకు, పోలీసులకు సమాచారం అందించాడు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. -
ఆర్టీసీ అధికారులతో ఈడీ సమీక్ష
విద్యానగర్(కరీంనగర్): ఆర్టీసీ కరీంనగర్ జోన్ పరిధిలోని రీజినల్ మేనేజర్లు, డిప్యూటీ రీజినల్ మేనేజర్లు, అకౌంట్స్ ఆఫీసర్లు, పర్సనల్ ఆఫీసర్లు, డిప్యూటీ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్, వర్క్స్ మేనేజర్, డిప్యూటీ చీఫ్ పర్సనల్ మేనేజర్లతో మంగళవారం కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పగిడిమర్రి సోలమన్ కరీంనగర్ బస్ స్టేషన్ ఆవరణలోని సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. వివిధ రీజియన్ల పనితీరు, ఎలక్ట్రికల్ బస్సులు పనితీరు, వేసవి కాలం, అధిక పెళ్లిళ్ల దృష్ట్యా ప్రయాణికులకు సరిపడ బస్సులను అందుబాటులో ఉంచాలని, తాగునీటి సౌకర్యం కల్పించాలని సూచించారు. రీజినల్ మేనేజర్లు బి.రాజు, విజయభామ, సరిరాం, జ్యోత్స్న, సుగుణాకర్, వర్క్స్ మేనేజర్ స్వప్నకుమారి పాల్గొన్నారు. -
పోలీస్ ఇన్ఫార్మర్గా వ్యవహరిస్తున్నాడని..
వేములవాడ: తమతో కలిసి గంజాయి వ్యాపారం చేస్తూనే తమ పేర్లను పోలీసులకు చెప్పి, జైలుకు పంపించి.. తాను కుటుంబ సభ్యులతో ఎంజాయ్‌గా ఉంటున్నాడని, పోలీసు ఇన్ఫార్మర్గా వ్యవహరిస్తున్నాడని భావించి చెట్టిపల్లి పర్శరాములు (36)ను ఈనెల 13న వేములవాడ పట్టణ బైపాస్‌రోడ్డులోని మహాలింగేశ్వర ఫంక్షన్‌హాలులో గొడ్డళ్లు, కత్తులతో నరికి చంపేశారు. మంగళవారం టౌన్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి వివరాలు వెల్లడించారు. పట్టణంలోని శ్రీనగర్‌కాలనీకి చెందిన చెట్టిపెల్లి పరుశరాములు, బైరెడ్డి వినయ్, ఈర్ల సాయి, వస్తాద్ అఖిల్, నేదురి రాజేశ్, అడ్డగట్ల మనోజ్ గతంలో కలిసి తిరిగేవారు. వీరందరు గంజాయి, హత్య కేసులతో చాలాసార్లు జైలుకు వెళ్లి వచ్చారు. ఈక్రమంలో కొంతకాలంగా పర్శరాములు మిగతా ఐదుగురితో ఉండకుండా తన పని తాను చేసుకుంటూ ఇంటి వద్ద ఉంటున్నాడు. కొద్ది రోజుల క్రితం ఐదుగురు నిందితులపై వివిధ పోలీస్ స్టేషన్లలో గంజాయి కేసులు నమోదు కాగా, కేసులు కావడానికి పర్శరాములే కారణమని భావించారు. తమపై పోలీసులకు సమాచారం ఇస్తున్నాడని అనుమానించారు. అతడిని చంపితేనే తమపై గంజాయి కేసులు కావని, ఈజీగా తమ వ్యాపారం చేసుకోవచ్చని పథకం వేశారు. ఈనెల 13న మహాలింగేశ్వర ఫంక్షన్హాల్లోని స్టోర్‌రూమ్ బిల్డింగ్‌పై ఒంటరిగా ఉన్న పర్శరాములుపై రెండు గొడ్డళ్లు, కొబ్బరికాయలు కొట్టే కత్తితో బైరెడ్డి వినయ్, ఈర్ల సాయి, వస్తాద్ అఖిల్ విచక్షణారహితంగా దాడి చేసి చంపారు. మరో నిందితుడు రాజేశ్ బయట ఎవరూ రాకుండా గేటు వేశాడు. ఇంకో నిందితుడు అడ్డగట్ల మనోజ్‌కుమార్ వీళ్లందరూ జైలుకెళ్తే బెయిల్ తీసుకురావడానికి బయట ఉంటానని చెప్పి ఈ నలుగురితో హత్య చేయించాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు టౌన్ సీఐ వీరప్రసాద్ కేసు నమోదు చేశారు. మంగళవారం ఉదయం 10 గంటలకు అయ్యోరుపల్లి శివారులో నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. హత్యకు ఉపయోగించిన రెండు గొడ్డళ్లు, ఒక కత్తి, రెండు బైక్‌లు, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మనోజ్‌కుమార్ కోసం గాలిస్తున్నామని ఏఎస్పీ పేర్కొన్నారు. సమావేశంలో రూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్సైలు రమేశ్, వెంకట్రాజం, సిబ్బంది ఉన్నారు. వ్యక్తిని చంపిన నిందితుల అరెస్ట్ వివరాలు వెల్లడించిన ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి -
ధాన్యం కుప్ప వద్ద కుప్పకూలిన రైతు
కథలాపూర్(వేములవాడ): మండలంలోని దూలూర్ గ్రామానికి చెందిన రైతు పూండ్ర జలపతిరెడ్డి (50) కొనుగోలు కేంద్రం వద్ద తన ధాన్యం కుప్ప వద్ద గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. జలపతిరెడ్డి గ్రామ శివారులోని కొనుగోలు కేంద్రంలో ధాన్యం పోశాడు. ధాన్యాన్ని ఆరబెట్టేందుకు మంగళవారం ఉదయం వెళ్లాడు. ధాన్యాన్ని ఆరబోస్తుండగానే కింద పడిపోయాడు. అక్కడున్న రైతులు గమనించి గుండెపోటు వచ్చిందని సీపీఆర్ చేశారు. వెంటనే చికిత్స నిమిత్తం కథలాపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తుండగానే మృతిచెందాడు. జలపతిరెడ్డికి భార్య లక్ష్మి, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. స్వగ్రామానికి మృతదేహంఇల్లంతకుంట(మానకొండూర్): ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లి ఆత్మహత్య చేసుకున్న కార్మికుడి మృతదేహం 34 రోజులకు స్వగ్రామానికి చేరింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. ఇల్లంతకుంట మండలం నర్సక్కపేట గ్రామానికి చెందిన ముత్యం వెంకటేశంగౌడ్ (52) గత 32 ఏళ్లుగా ఉపాధి కోసం గల్ఫ్ వెళ్తున్నాడు. ఇటీవల ఇంటికి వచ్చి ఫిబ్రవరిలో తిరిగి గల్ఫ్ వెళ్లాడు. అనంతరం తన కొడుకును అక్కడి కంపెనీలోకి పనికి తీసుకున్నాడు. కొడుకు వెళ్లిన పక్షం రోజులకే వెంకటేశం తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం నర్సక్కపేటకు మతదేహాన్ని తీసుకొచ్చారు. మృతుడికి భార్య పద్మ, కొడుకు సాయికిరణ్, కూతురు ఉన్నారు. బైక్‌ను ఢీకొన్న లారీ● ఒకరి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు కామారెడ్డి క్రైం: అతివేగంతో లారీ ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. కామారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలోని ఉగ్రవాయి మైసమ్మ స్టేజీ వద్ద కామారెడ్డి–సిరిసిల్లా ప్రధాన రహదారిపై మంగళవారం చోటు చేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నాగంపేట గ్రామానికి చెందిన నాగుల వినోద్ కుమార్ (30) చేపలు పట్టడం, కూలీ పనులు చేసుకుంటూ జీవించేవాడు. చేపల పని మీద తన స్నేహితుడు జక్కుల దేవేందర్‌తో కలిసి బైక్‌పై కామారెడ్డికి బయల్దేరారు. ఉగ్రవాయి మైసమ్మ స్టేజీ సమీపంలోకి రాగానే బైక్‌ను లారీ ఢీకొనగా ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే కామారెడ్డిలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. కొద్దిసేపటికే చికిత్స పొందుతూ వినోద్ కుమార్ మృతి చెందాడు. దేవేందర్‌ను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు దేవునిపల్లి ఎస్సై రాజు తెలిపారు. పింఛన్ ఇప్పిస్తానని..● వృద్ధురాలి బంగారం దోచుకెళ్లాడు జమ్మికుంట: పింఛన్ ఇప్పిస్తానని, ఫొటో తీయాలని మాయమాటలు చెప్పి గుర్తు తెలియని వ్యక్తి వృద్ధురాలి మెడలోంచి రెండు తులాల బంగారం ఎత్తుకెళ్లాడు. ఈ ఘటన జమ్మికుంటలో మంగళవారం చోటు చేసుకుంది. టౌన్ సీఐ వివరాల ప్రకారం.. వీణవంక మండలం కనపర్తి గ్రామానికి చెందిన అల్ల పురెడ్డి కమలమ్మ భర్త కొమరరెడ్డితో కలిసి జమ్మికుంటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చింది. అనంతరం కూరగాయలు కొనుగోలు చేసేందుకు కొండూరు కాంప్లెక్స్ అంగడికి వెళ్లింది. అక్కడ ఓ షాపు వద్ద మెట్లపై కూర్చుంది. గుర్తు తెలియని వ్యక్తి వృద్ధురాలి వద్దకు వచ్చి ‘నేను గ్రామానికి కార్యదర్శిని. మీ ఇద్దరికి పింఛన్ ఇప్పిస్తాను. మిమ్మల్ని ఫొటో తీయాలి’ అని నమ్మించాడు. ఫొటో తీసే సమయంలో ఒంటిపై బంగారం ఉండొద్దని, రెండు తులాల బంగారు పుస్తెలతాడు తీసుకున్నాడు. మెల్లిగా అక్కడి నుంచి పరారయ్యాడు. కాసేపటికి తేరుకున్న బాధితురాలు బోరున విలపించింది. అనంతరం పోలీసులకు పిర్యాదు చేయగా.. దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. -
ధర్మపురిలో దొంగతనం
ధర్మపురి: ధర్మపురిలోని బోయవాడలోని ఓ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి రూ.80వేలు, ఏడున్నర తులాల బంగారం, 30 తులాల వెండి అపహరించిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితుడు గడప రమేశ్ కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన గడప రమేశ్, లక్ష్మి దంపతులతోపాటు రమేశ్ తల్లి ఇంట్లో ఉంటున్నారు. ఇంట్లో బీరువాపై ఓ పాత డబ్బాలో రూ.80 వేలు, ఏడున్నర తులాల బంగారం, 30 తులాల వెండిని దాచిపెట్టారు. అనంతరం గదికి తాళం వేశారు. ఈనెల 2న తన తండ్రి సంవత్సరీకం కోసం పాత ఇంటికి వెళ్లారు. మంగళవారం కొన్ని డబ్బులు అవసరం ఉండడంతో డబ్బాలో దాచిన డబ్బును తీసుకుందామని చూడగా అందులో బంగారం, నగదు, వెండి వస్తువులు కనిపించలేదు. దీంతో గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించుకుపోయినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఎస్సై ఉదయ్‌కుమార్ తన సిబ్బందితో చేరుకుని చోరీ జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. డబ్బాలో ‘అరేయ్ నిన్ను ఎప్పటికై నా వదిలిపెట్టను..’ అనే చీటీ కనిపించగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ● రూ.80వేలు.. ఏడున్నర తులాల బంగారం, వెండి అపహరణ ● సంఘటనా స్థలానికి క్లూస్‌టీం -
ట్రాక్టర్‌ను ఢీకొని ఒకరి మృతి
పెగడపల్లి: ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలకేంద్రంలో చోటుచేసుకుంది. ఎస్సై రవికిరణ్ కథనం ప్రకా రం.. మండలకేంద్రానికి చెందిన వడ్లూరి మల్ల య్య (59) సైకిల్‌పై చెరువు కట్ట వైపు వెళ్తున్నా డు. తలతిప్పడంతో అదుపు తప్పి నిలిపి ఉన్న ట్రాక్టర్‌కు తగిలి కిందపడిపోయాడు. తలకు గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. మల్ల య్య కుమారుడు మధూకర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. ఇసుక ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్.. ఇబ్రహీంపట్నం: మండలకేంద్రం శివారులోని కాకతీయకాలువ పక్కన సోమవారం అర్ధరాత్రి ఇసుక ట్రాక్టర్ బోల్తాపడి డ్రైవర్ మృతి చెందినట్లు ఎస్సై అనిల్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మెట్పల్లి మండలం గాజులపేటకు చెందిన జక్కం భూమేశ్(30) మటంవాడకు చెందిన చింతల సాయిలుతో కలిసి ట్రాక్టర్లో ఇసుకను నింపుకొని ఇబ్రహీంపట్నంకు తీసుకొస్తున్నారు. మండల కేంద్రంలోని ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడటంతో భూమేశ్ టైర్ కింద పడిపోయాడు. ఈ ఘటనలో ఆయన అక్కడిక్కడే మృతి చెందాడు. సాయిలు కుడి కాలికి తీవ్ర గాయాలు కావడంతో మెట్పల్లి ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య జక్కం మాధురి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అనిల్ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి..వేములవాడఅర్బన్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందాడు. స్థానికుల వివరాలు.. వేములవాడ మండలం అనుపురం గ్రామానికి చెందిన బండారి శ్రీహరి, చిలివేరి పర్శరాములు ద్విచక్రవాహనంపై కరీంనగర్–సిరిసిల్ల ప్రధాన రహదారిలో ఇంటికి వెళ్తుండగా, కరీంనగర్ నుంచి వేములవాడకు వస్తున్న కారు వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో బండారి శ్రీహరి (56) అక్కడికక్కడే మృతిచెందగా, పర్శరాములుకు గాయాలయ్యాయి. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్ తెలిపారు. డీసీఎం కిందపడి వ్యక్తి..జమ్మికుంట: పట్టణంలోని ఫ్లైఓవర్‌పై డీసీఎం కింద పడి వ్యక్తి మృతి చెందాడు. టౌన్ సీఐ రవి వివరాల ప్రకారం.. పట్టణంలోని దుర్గాకాలనీకి చెందిన పురంశెట్టి తిరుపతి(35) ఎలక్ట్రిక్ స్కూటీపై ఫ్లైఓవర్ మీదుగా బస్టాండ్ వైపు వెళ్తున్నాడు. పక్కనుంచి వెళ్తున్న డీసీఎం డ్రైవర్ స్కూటీని ఓవర్టేక్ చేస్తున్న క్రమంలో ఢీకొట్టాడు. స్కూటీ నడుపుతున్న తిరుపతి వ్యాన్ వెనక టైర్ కింద ప డి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భా ర్య సృజన, ఇద్దరు పిల్లలున్నారు. సృజన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని దివ్యాంగుడు..మల్యాల: మండలంలోని ముత్యంపేట దిగువ కొండగట్టు పెట్రోల్ పంపు వద్ద జగిత్యాల–కరీంనగర్ జాతీయ రహదారిపై దివ్యాంగ యాచకుడి ని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మృతి చెందాడు. బల్వంతాపూర్ క్రాస్ రోడ్డు నుంచి కొండగట్టుకు వెళ్తుండగా యాచకుడిని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి వివరాలు తెలియలేదు. బ్లూకోల్ట్స్ కానిస్టేబుల్ మధుసూదన్ రెడ్డి చేరుకుని మృతదేహాన్ని జగిత్యాలకు తరలించి, కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్ తెలిపారు. -
ఆగి ఉన్న కారును ఢీకొన్న మరో కారు
వేములవాడ: వారు అటవీశాఖ ఉన్నతాధికారులు.. ఆపై తనిఖీకి వెళ్లి ఫుల్లుగా డ్రింక్ చేసి రోడ్డుపై పార్క్ చేసిన వాహనాన్ని ఢీకొట్టారు. స్థానికులు తెలిపిన వివరాలు.. పట్టణంలోని తెలంగాణచౌక్ ప్రాంతంలో వాసుదేవా టవర్స్ వద్ద ఆగి ఉన్న ఇన్నోవా వాహనాన్ని అటవీశాఖాధికారి షిఫ్ట్ వాహనం ఢీకొట్టింది. దీంతో కారు దెబ్బతింది. కారులో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పినట్లైంది. బాధ్యాతాయుతమైన పోస్టులో ఉన్న అధికారుల తీరుపై అక్కడున్న ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. బ్యాంకులో పని నిమిత్తం వచ్చిన మాజీ సెస్ చైర్మన్ అల్లాడి రమేశ్ తన ఇన్నోవా వాహనం నిలిపి లోనికి వెళ్లారు. ఇంతలోనే ప్రైవేట్ వాహనంలో వచ్చిన అటవీశాఖ అధికారులు ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొట్టారు. పెద్ద శబ్దం రావడంతో ఒక్కసారిగా అక్కడికి ప్రజలు ఆందోళనకు గురయ్యారు. వాహనం నడుపుతున్న వ్యక్తి మద్యం సేవించి ఉన్నాడని స్థానికుల ద్వారా తెలిసింది. వేములవాడ రేంజ్ అటవీశాఖ అధికారి కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సదరు ఇద్దరు ఉద్యోగులు తనిఖీలకు వెళ్లి వస్తున్నట్లుగా తెలిసింది. గాయపడిన అటవీశాఖ అధికారులను 108లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ప్రాథమిక చికిత్స అనంతరం అక్కడి నుంచి కరీంనగర్ వెళ్లినట్లు తెలిసింది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలపై ఆరా తీశారు. -
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రి పదవుల కోసం కొట్టుకుంటున్నారు
సుల్తానాబాద్(పెద్దపల్లి): ఉమ్మడి మూడు జిల్లాల్లోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రి పదవుల కోసం కొట్లాడుకుంటున్నారని, పాలనను గాలికి వదిలేశారని గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి విమర్శించారు. మండల కేంద్రంలో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భవిషత్లో తాము మళ్లీ గెలుస్తామో, లేదోననే భయం కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పట్టుకుందని ఎద్దేవా చేశారు. బీజేపీ రెండు ఎమ్మెల్సీ స్థానాలు గెలిచినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి ఓటమి భయం పట్టుకుందన్నారు. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు భయపడుతోందని అన్నారు. 450 ఎకరాలను హెసీయూకి రిజిస్ట్రేషన్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. భూభారతితో పేదలకు అన్యాయం జరకుండా చూడాలని కోరారు. బీఆర్ఎస్ హయాంలో ధరణి ద్వారా పేదల భూములను పెద్దలకు ధారాదత్తం చేశారని, ఇప్పుడలా జరిగితే బీజేపీ ఆందోళనలు చేస్తుందని హెచ్చరించారు. రాష్ట్రంలో వచ్చేది డబుల్ ఇంజిన్ సర్కార్ అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య, మాజీ ఎమ్మెల్యేలు గుజ్జుల రామకృష్ణారెడ్డి, కాసిపేట లింగయ్య, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి, కార్యదర్శి కడారి అశోక్‌రావు తదిరులు పాల్గొన్నారు. వచ్చేది డబుల్ ఇంజిన్ సర్కార్ రాష్ట్రంలో వచ్చేది డబుల్ ఇంజిన్ సర్కారేనని, ఇందుకోసం కార్యకర్తలు, నాయకులు సమష్టిగా కృషి చేయాలని టీచర్స్ ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య కోరారు. వార్డు సభ్యుడి నుంచి ఎంపీపీ, జెడ్పీటీసీ వరకు అన్ని ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించడమే లక్ష్యంగా పనిచేయాలని కోరారు. పెద్దపల్లి, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాల్లో 98శాతం మంది ఉపాధ్యాయులు తనకు ఓట్లు వేశారని గుర్తుచేశారు. తన విద్యాభ్యాసం పెద్దపల్లి మండలం బంధంపల్లి, అప్పన్నపేట, కరీంనగర్, హెదరాబాద్లో సాగిందని గుర్తుచేశారు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి తీసుకుంటున్న జీతాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు వెచ్చిస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి -
జార్జిరెడ్డి ఆశయ సాధన కోసం ఉద్యమించాలి
కరీంనగర్: జార్జిరెడ్డి ఆశయసాధన కోసం విద్యార్థులు ఉద్యమించాలని, మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడటమే జార్జిరెడ్డికి ఇచ్చే నిజమైన నివాళి అని పీడీఎస్‌యూ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి కుతాటి రాణాప్రతాప్ అన్నారు. పీడీఎస్‌యూ సంస్థాపకుడు, ఉస్మానియా యూనివర్సిటీ అరుణతార జార్జిరెడ్డి 53వ వర్ధంతి సందర్భంగా సోమవారం నగరంలోని బీసీ బాయ్స్ హాస్టల్లో జార్జిరెడ్డి చిత్రటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. 1970లో ఉస్మానియా యూనివర్సిటీలో పేద విద్యార్థుల గొంతుకగా విద్యార్థుల తరఫున పోరాటం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు కెంసారపు రవితేజ, నాయకులు కొయ్యడ బాబు, ఎండీ అస్లాం, రమేశ్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. -
మహనీయుల అడుగుజాడల్లో నడవాలి
కరీంనగర్‌సిటీ: మహనీయుల అడుగుజాడల్లో నడిచి దేశాభివృద్ధికి పాటుపడాలని శాతవా హన యూనివర్శిటీ వైస్ చాన్స్‌లర్ ఉమేశ్‌కుమార్ అన్నారు. శాతవాహన లైబ్రరీ ఆడిటోరి యంలో అంబేడ్కర్, మహనీయుల జయంతోత్సవాల ముగింపు కార్యక్రమం సోమవారం నిర్వహించారు. రిజిస్ట్రార్ ఆచార్య రవికుమార్ జాస్తి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో వీసీ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అంబేడ్కర్ ప్రణాళికల వల్లే సమాజంలో అంద రూ సమాన అవకాశాలు అందుకుంటున్నారని తెలిపారు. విశిష్ట అతిథిలు ఆర్ట్స్ కళాశాల ప్రిన్సి పాల్ సూరేపల్లి సుజాత, కొండగట్టు జేఎన్టీ యూ ప్రిన్సిపాల్ ప్రభాకర్, సైన్స్ కళాశాల ప్రి న్సిపాల్ జయంతి మాట్లాడుతూ, అంబేడ్కర్ ఆశయాలను అమలుపరచడమే నిజమైన జ యంతి వేడుకలని, విద్యార్థులు బాగా చదువుకొని తమ సదుపాయాల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. అనంతరం వ్యాసరచన, రంగోలి, క్విజ్ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. మాజీ జాయింట్‌కలెక్టర్ గంగారాం, ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త మనోహర్, ఓఎస్డీ టు వీసీ డా.హరికాంత్, ఎస్సీ, ఎస్టీ సెల్ డైరెక్టర్ డా.పద్మావతి, మైనార్టీ సెల్ డైరెక్టర్ డా.హుమెరా తస్నీమ్, బీసీ సెల్ డైరెక్టర్ డా.సరసిజ, అధ్యాపకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ శ్రేణుల వాగ్వాదం చిగురుమామిడి(హుస్నాబాద్): చిగురుమామిడి ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో సోమవారం సింగిల్ విండో మాజీ చైర్మన్ చిటుమల్ల శ్రీనివాస్, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్, కాంగ్రెస్ చిగురుమామిడి మండల అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ‘నీవు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తవు కాదు, నీకు నేను సభ్యత్వం ఇవ్వలేదు, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరతావు’ అంటూ శ్రీనివాస్‌పై తిరుపతిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు మంత్రి పొన్నం ప్రభాకర్ పార్టీ కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారని శ్రీనివాస్ బదులిచ్చారు. ‘నాకు తెలియకుండా మంత్రి ఎప్పుడు కండువా కప్పారు, ఇది అబద్ధం, నీ ప్రవర్తన సరిగా లేదు, రైతులకు లేనిపోని మాటలు చెప్తున్నావు జాగ్రత్త’ అంటూ తిరుపతిరెడ్డి హెచ్చరించారు. ఇద్దరు నాయకులను అక్కడ ఉన్నవారు సముదాయించడంతో వాగ్వాదం సద్దుమణిగింది. -
అంబేడ్కర్ ఆలోచనలు స్ఫూర్తిదాయకం
మంగళవారం శ్రీ 15 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025కరీంనగర్: అంబేడ్కర్ ఆలోచన విధానం ప్రపంచానికి స్ఫూర్తిదాయకమని, ఆయన ఆశయ సాధన దిశగా ప్రభుత్వం పని చేస్తోందని మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. సోమవారం కరీంనగర్‌లోని కోర్టు చౌరస్తాలో అంబేడ్కర్ 134వ జయంతోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈసందర్భంగా ఎమ్మెల్యే కవ్వంపల్లి, కలెక్టర్ పమేలా సత్పతి, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్, అదనపు కలెక్టర్ ప్రఫుల్‌దేశాయ్, తెలంగాణ అంబేడ్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గజ్జెల కాంతం, ప్రజాసంఘాల నాయకులు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, సామాజిక సాధికారత దిశగా ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపడుతోందని తెలిపారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ, అన్ని వర్గాలకు సమాన హక్కులు కల్పించాలన్న ఉద్దేశంతో అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రచించారని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ ప్రఫుల్‌దేశాయ్ మాట్లాడుతూ, ప్రపంచస్థాయిలో మన దేశం పేరు నిలిచిపోయేలా చేసిన మహనీయుడు అంబేడ్కర్ అని కొనియాడారు. మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్ మాట్లాడుతూ, 70 ఏళ్ల తర్వాత కూడా దేశ పౌరులంతా ఐక్యంగా ఉన్నారంటే అందుకు అంబేడ్కర్ రచనలే కారణ మన్నారు. జయంతోత్సవ కమిటీ చైర్మన్ కొండ్ర స్వరూప అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి పవన్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, జయంతోత్సవ కమిటీ, దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. న్యూస్‌రీల్ -
అంజన్నకు రూ.1.67కోట్ల ఆదాయం
జగిత్యాల: హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాల సందర్భంగా స్వామివారికి రూ.1,67,73,800 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో శ్రీకాంత్‌రావు తెలిపారు. ఈనెల 11 నుంచి చిన్న జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. స్వామివారి సన్నిధిలో 2.50 లక్షల మంది భక్తులు దీక్ష విరమణ చేశారని తెలిపారు. కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్‌కుమార్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సహకారంతో ఉత్సవాలు ప్రశాంతంగా ముగిశాయని పేర్కొన్నారు. లడ్డూప్రసాదాల ద్వారా రూ.81,74,600, పులిహోర ద్వారా రూ.15,42,200, దీక్ష విరమణల ద్వారా రూ.40,17,500, కేశఖండనం ద్వారా రూ.11,78,000, శీఘ్రదర్శనం ద్వారా రూ.18,61,500, మొత్తంగా రూ.1,67,73,800 ఆదాయం వచ్చిందన్నారు. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది రూ.17,68,265 అదనంగా వచ్చిందని పేర్కొన్నారు. మళ్లీ వస్తాం అంజన్న.. మూడురోజులపాటు కొండపైన శ్రీరామ నామం మార్మోగింది. ఆదివారం అర్ధరాత్రి వరకు మాల విరమణ చేసిన దీక్షాపరులు సోమవారం ఉదయం ఇంటికి బయల్దేరారు. మూడు రోజులుగా వివిధ ప్రాంతాల నుంచి కాలినడక, వాహనాల్లో వచ్చారు. హనుమాన్ భక్తులు దీక్ష విరమణ అనంతరం మొక్కులు చెల్లించుకుని ఇంటికి బయల్దేరారు. వైభవంగా చిన్న జయంతి ఉత్సవాలు 2.50 లక్షల మంది భక్తుల రాక ఆలయ ఈవో శ్రీకాంత్‌రావు -
ఏమీ తెలియని వయసులోనే..
కోరుట్ల: ‘అప్పటికి నాది ఏమి తెలియని వయసు.. ఆ సమయంలోనే మావోయిస్టుల్లో కలిశాను. నా భర్త పసుల రాంరెడ్డితో కలిసి కొన్నాళ్లు పనిచేశాను. తరువాత కొంత కాలానికి ఒక్కదానినే బస్తర్ డివిజన్లో మావోయిస్టు అజ్ఞాతదళాలతో కలిసి పనిచేసిన. నాలుగైదు సార్లు కాల్పుల నుంచి తప్పించుకున్న. ఉత్తర బస్తర్ కమిటీ కార్యదర్శిగా పనిచేస్తున్న సమయంలో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాను. ఈ ఏడాది జనవరిలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ పోలీసులకు లొంగిపోయాను. సుమారు 45ఏళ్ల తరువాత మా వాళ్లు నన్ను ఆదరిస్తారని అనుకోలేదు. నా కూతురు భవానీ, కోరుట్ల, కథలాపూర్ మండలం సిరికొండకు చెందిన బంధువులు అంతా నన్ను అక్కున చేర్చుకున్నారు. భర్త రాంరెడ్డి చనిపోయి పాతికేళ్లు గడుస్తున్నా.. బంధువులంతా నా వెంట నిలిచారు’.. అంటూ కన్నీటి పర్యంతమయ్యారు ఇటీవల లొంగిపోయి.. సుమారు 45 ఏళ్ల తరువాత ఇంటికి తిరిగొచ్చిన మావోయిస్టు వసంత అలియాస్ గంబాలు. రెండు రోజుల క్రితం ఇంటికి.. రెండురోజుల క్రితం ఛత్తీస్‌గఢ్ పోలీసులు వసంతను తన కూతురు భవానీకి అప్పగించి ఇంటికి పంపించిన క్రమంలో సోమవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వసంత బంధువులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆమెను ఆప్యాయతతో పలకరించి అక్కున చేర్చుకుని కంటతడి పెట్టారు. వసంత కూతురు భవానీ మాట్లాడుతూ తనకు తల్లి లేదని అనుకున్నానని, కానీ బతికే ఉందని తెలిసి ఎంతో సంతోషపడ్డానని చెప్పారు. ఎంత కష్టమైన సరే తన తల్లిని తన వద్దకు తెచ్చుకుని ఆప్యాయంగా చూసుకోవాలని నిర్ణయించుకుని తన పెద్ద నాన్న కుమారుడు పసుల కృష్ణప్రసాద్, అంబేడ్కర్ సంఘాల నాయకులు వుయ్యాల నర్సయ్య సాయంతో ఛత్తీస్‌గఢ్ వెళ్లానని అక్కడి పోలీసులు పూర్తిగా సహకరించారని పేర్కొన్నారు. పార్టీలోనే చనిపోయిందనుకున్నాం: బంధువులు లొంగిపోయిన మావోయిస్టు పసుల వసంత సోదరి పెద్ద గంబాలు మాట్లాడుతూ.. తమ చెల్లి ఎప్పుడో పార్టీలోనే చనిపోయిందని అనుకున్నామని, ఇప్పటికి తిరిగి రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మావోయిస్టు పార్టీలో నిర్వహించిన కార్యకలాపాల గురించి పసుల వసంత ఏమీ వెల్లడించలేదు. తనకు పెద్దగా ఏమీ గుర్తులేదని చెప్పడం గమనార్హం. పసుల వసంత అనారోగ్యంతో ఉండటంతోపాటు తెలుగు సరిగా రాకపోవడం.. ఛత్తీస్‌గఢ్ వాసులు గోండు భాష ఎక్కువగా మాట్లాడటంతో వివరాల వెల్లడి ఇబ్బందికరంగా మారింది. వసంతకు వచ్చే రివార్డు డబ్బులు త్వరలో అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆమె కూతురు భవానీ విజ్ఞప్తి చేశారు. భర్తతో కలిసి పార్టీలోకి వెళ్లాను.. నన్ను మళ్లీ ఆదరిస్తారని అనుకోలేదు కన్నీటి పర్యంతమైన ‘మాజీ’ వసంత -
నువ్వు సాగు వైపు రైతుల చూపు
జగిత్యాలఅగ్రికల్చర్: యాసంగి సీజన్లో రైతులు వరి, మొక్కజొన్న వంటి సాధారణ పంటలు సాగు చేస్తారు. వానాకాలం సీజన్లో పసుపు పంట సాగు చేసిన రైతులు.. అదే భూమిలో యాసంగి సీజన్లో నువ్వులు సాగు చేసి మంచి ఆదాయం పొందుతున్నారు. ఇటీవల నువ్వులకు ఓపెన్ మార్కెట్లో మంచి ధర ఉండటం, స్వల్పకాలంలో చేతికొచ్చే పంట కావడంతో రైతులు నువ్వు పంట వైపు ఆసక్తి పెంచుకున్నారు. జగిత్యాలలో 25వేల ఎకరాల్లో సాగు.. జగిత్యాల జిల్లాలో దాదాపు 25 వేల ఎకరాల్లో నువ్వుల పంట సాగవుతుంది. ముఖ్యంగా పసుపును సాగు చేసే ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, మెట్పల్లి, కోరుట్ల, జగిత్యాల, రాయికల్, మేడిపల్లి వంటి మండలాల్లో నువ్వుల పంట విస్తీర్ణం అధికంగా ఉంది. ఆయా మండలాల్లోని గ్రామాల్లో ఒక్కో రైతు కనీసం 2 నుంచి మూడెకరాల్లో నువ్వులు సాగుచేస్తుంటారు. అత్యధిక దిగుబడినిచ్చే విత్తనాలను పొలాస శాస్త్రవేత్తలు రూపోందించినప్పటికీ చాలామంది రైతులు గతేడాది నువ్వుల పంటల్లోని నాణ్యమైన విత్తనాలు సేకరించి విత్తనాలుగా వాడుతున్నారు. పసుపును తవ్విన తర్వాత, ట్రాక్టర్‌తో దున్ని.. ఇసుకలో విత్తనాలను కలిపి చల్లుతారు. 20 రోజల తర్వాత ఒకసారి కలుపు మొక్కలు లేకుండా చూస్తారు. పంట కాలంలో కేవలం నాలుగైదు నీటి తడులు ఇస్తే సరిపోతుంది. నూనెకు డిమాండ్ పెరగడంతో ఇటీవల ప్రజల్లో ప్యాకెట్ నూనెను వాడటం తగ్గిస్తూ.. నువ్వులు, వేరుశెనగ నూనెను వాడుతున్నారు. దీంతో నువ్వులకు డిమాండ్ పెరుగుతోంది. నువ్వులు పండించిన రైతులు ఆ నువ్వులను బాగా ఆరబెట్టి, పురుగులు పట్టకుండా చూసుకుని, ఇంట్లో నిల్వ చేసుకుంటారు. సంక్రాంతికి డిమాండ్ ఉంటుందనే ఉద్దేశంతో నిల్వ చేసుకుంటారు. ప్రస్తుతం క్వింటాల్‌కు రూ.12వేల నుంచి రూ.15వేల వరకు ధర పలుకుతోంది. పంట పండించడంలోనూ వినూత్నమే.. వానాకాలం పంటగా పసుపు వేసిన పంట భూమిలోనే వేసవి పంటగా నువ్వు పంట వేస్తారు. పసుపు పంటకు కోళ్ల ఎరువు, గొర్రెల మంద, పశువుల ఎరువు వేస్తారు కాబట్టి నువ్వుల పంటకు పెద్దగా ఎలాంటి ఎరువులు వేయరు. పసుపు పంట పూర్తి కాగానే ఒక్కటి, రెండు సార్లు దున్ని, ఎకరానికి 2 కిలోల విత్తనాలు ఇసుకతో కలిపి చల్లుతారు. తర్వాత డ్రిప్ ద్వారా నీరు ఇస్తారు, 20 రోజులకు ఒక్కసారి, 55 రోజులకు ఒక్కసారి డ్రిప్ ద్వారా తక్కువ మోతాదులో యూరియా ఇస్తారు. పంట కాలం 90 రోజులు కాబట్టి చివరి దశలో గింజ గట్టి పడేందుకు పొటాష్ ఇస్తారు. పూత దశలో ఓ సారి పురుగులు ఆశించకుండా వేపనూనె పిచికారీ చేస్తారు. అన్ని రకాల యాజమాన్య పద్దతులు పాటిస్తుండటంతో ఎకరాకు 5 నుంచి 6 క్వింటాళ్ల వరకు దిగుబడి తీస్తున్నారు. యాసంగిలో పసుపు తర్వాత నువ్వు పంట స్వల్పకాలంలో చేతికందే అవకాశం మార్కెట్లో అందనున్న మంచి ధర ఏటా పంట సాగు ఏటా నువ్వు పంటను కనీ సం రెండు ఎకరాల్లో సాగు చేస్తాను. పసుపు పంటకు వే సిన సేంద్రియ ఎరువులే ను వ్వు పంటకు ఉపయోగపడుతుండటంతో కొత్తగా ఎలాంటి ఎరువులు వేయం. నువ్వుల పంట ద్వారా మంచి ఆదాయం వస్తుంది. మా విత్తనాలను మే మే తయారు చేసుకుంటాం. – లక్ష్మారెడ్డి, నువ్వుల రైతు, జోగిన్‌పల్లి, కోరుట్ల(మం) నువ్వులపై పరిశోధనలు నువ్వుల పంటపై విస్త్రృతంగా పరిశోధనలు చేస్తున్నాం. ఇప్పటికే పరిశోధన స్థానం నుంచి శ్వేత, థిల్, హిమ, జీసీఎస్–1020, జేసీయస్–3287 వంటి రకాలను విడుదల చేశాం. జిల్లాలో ఎక్కువ మొత్తంలో యాసంగి సీజన్లో నువ్వుల పంట సాగు చేస్తుండటం రైతులకు కలిసి వస్తోంది. – పద్మజ, శాస్త్రవేత్త, పొలాస -
పిచ్చికుక్క దాడిలో 14 మందికి గాయాలు
జగిత్యాలరూరల్: జగిత్యాల రూరల్ మండలం మోరపల్లిలో ఓ పిచ్చికుక్క 14 మందిపై దాడిచేసింది. ఈ ఘటనలో వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం సాయంత్రం గ్రామంలోకి వచ్చిన పిచ్చికుక్క వీధుల్లో వెళ్తున్న నలుగురిపై దాడిచేసింది. సోమవారం మధ్యాహ్నం కూడా మళ్లీ ఊళ్లోకి వచ్చి 10 మందిపై దాడిచేసింది. బాధితులను జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తాళం వేసిన ఇళ్లలో చోరీ ధర్మారం(ధర్మపురి): గోపాల్రావుపేట గ్రామంలో తాళం వేసిన మూడు ఇళ్లలో ఆదివారం రాత్రి చోరీ జరిగినట్లు ఎస్సై లక్ష్మణ్ సోమవారం తెలిపారు. గ్రామానికి చెందిన లింగాల ఆనందరావు బంధువుల ఇంట్లో పెళ్లి వేడుక కోసం తన ఇంటికి తాళం వేసి నాలుగు రోజుల క్రితం వెళ్లాడు. సోమవారం ఇంటికి వచ్చి చూడగా తాళం పగులగొట్టి ఉంది. లోనికి వెళ్లి చూడగా బీరువా ధ్వంసమై కనిపించింది. అందులోని మూడు తులాల బంగారు నక్లెస్ కనిపించలేదు. ఆనందరావు కుమారుడు అనిల్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అదేవిధంగా ఇదే గ్రామానికి చెందిన చింతల లక్ష్మారెడ్డి, కొమ్మ కనకయ్య తమ ఇళ్లకు తాళంవేసి ఊరెళ్లారు. వారి ఇళ్ల తాళాలు పగులగొట్టి దొంగతనానికి యత్నించారు. ఈ సంఘటనలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు. గంజాయి స్వాధీనంవేములవాడరూరల్: వేములవాడరూరల్ మండలం ఫాజుల్‌నగర్ శివారులో ముగ్గురు గంజాయి విక్రేతలపై కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు. జగిత్యాల జిల్లాకు చెందిన సాయికుమార్, రాకేశ్, బిహార్‌కు చెందిన సునీల్‌కుమార్ ఫాజుల్‌నగర్‌లో గంజాయి విక్రయించేందుకు వచ్చారు. పోలీసుల తనిఖీలో ముగ్గురి నుంచి 100 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. అదృశ్యమైన యువకుని బైక్ కెనాల్లో లభ్యంమెట్పల్లి: మూడు రోజుల క్రితం అదృశ్యమైన పట్టణంలోని వెంకట్రావ్‌పేటకు చెందిన గొల్లెన రాకేశ్ (18) ద్విచక్ర వాహనం కోరుట్ల మండలం యెఖీన్‌పూర్ వద్ద ఎస్సారెస్పీ కెనాల్లో లభ్యమైంది. స్థానికుల కథనం ప్రకారం.. ఇంటర్ పూర్తి చేసిన రాకేశ్ ఈనెల 10న సాయంత్రం సమయంలో కథలాపూర్‌కు వెళ్తున్నట్లు ఇంట్లో తల్లికి చెప్పి బైక్‌పై బయటకు వచ్చాడు. తిరిగి ఇంటికి చేరుకోకపోవడంతో మరుసటి రోజు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి ఆచూకీ కోసం వెతుకుతుండగా సోమవారం యెఖీన్‌పూర్ శివారులోని కెనాల్లో అతని బైక్ కనిపించింది. రాకేశ్ కెనాల్లో పడి ఉంటాడని అనుమానిస్తున్నారు. పోలీసులు రాకేశ్ చివరి కదలికలను సిరికొండ గ్రామంలోని సీసీ కెమెరాల్లో గుర్తించినట్లు సమాచారం. -
ఈ తరం మారాలి నాటికతో..
1985లో చైతన్య కళాభారతి నాటకసంస్థను స్వర్గీయ శ్రీరాముల సత్యనారాయణ ఆధ్వర్యంలో నేను మరి కొంతమందిమి కలిసి స్థాపించాం. ఈ తరం మారాలి నాటికతో నా నాటక రంగ ప్రస్థానం మొదలైంది. వృత్తిరీత్యా ఆర్టీసీ ఉద్యోగిని. చైతన్య కళాభారతి ద్వారా నాటకాలు వేసి 6 నంది అవార్డులు పొందాం. – తిప్పర్తి ప్రభాకర్, నాటకరంగ నటుడు, చైతన్య కళాకారతి అధ్యక్షుడు ఆదరణ లేదు ఆ రోజుల్లో కళాకారుల్లో నిబద్ధత, చిత్తశుద్ధి ఉండేది. ప్రస్తుతం కళాకారులకు ఆదరణ లేదు. రాష్ట్రం ఏర్పడిన తర్వా త నాటక రంగం ఊసేలేకుండా పో యింది. ప్రభుత్వం కళాకారులకు ప్రాధాన్యత ఇస్తూ అవకాశాలు కల్పించి వారి జీవన ప్రమాణాలు పెంపొందించాలి. – జి.కృపాదానం, జిల్లా ఫోక్ ఆర్ట్స్ వ్యవస్థాపకుడు మంచి పేరు తెచ్చాయి వ్యవసాయ శాఖ 1990లో నిర్వహించిన సాంస్కృతిక పోటీల్లో ప్రేమ పిచ్చోళ్ళు నాటిక ద్వారా నాటక రంగంలోకి అడుగుపెట్టా. చైతన్య కళాభారతి సంస్థలో భాగమై వందలాది ప్రదర్శనలు ఇచ్చాను. 1994లో ఎన్టీఆర్ చేతుల మీదుగా రాష్ట్రస్థాయి ఉత్తమ విలన్, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న. మనిషి, దేవతరూపం, చెల్ల ని పైసలు, క్షతగాత్రుడు, దొంగలు, ఖరీదైన జైళ్లు నాటికలు మంచి పేరు తెచ్చాయి. –గద్దె ఉదయ్‌కుమార్, కళాకారుడు ఎన్నో అవార్డులు నాటక రంగంలో 32 ఏళ్లుగా రాణిస్తూ అవార్డులు, రివార్డులు అందుకున్నా. బండారి దేవరాజ్ ప్రోత్సాహంతో వారి రచన, దర్శకత్వంలో భద్రం కొడుకో నాటిక ద్వారా రంగస్థల ప్రవేశం చేసిన. ఇప్పటి వరకు 30 నాటికల్లో నటించా. – కొత్తకొండ సత్యనారాయణ, చైతన్య కళాభారతి కళాకారుడు -
కూలీకి వస్తూ కానరానిలోకాలకు..
● హార్వెస్టర్ కిందపడి మహిళా కూలీ మృతి ● మరొకరికి తీవ్రగాయాలు ● బూర్నపల్లి శివారులో ఘటన ● మృతురాలిది పెద్దపల్లి జిల్లా మొట్లపల్లి గ్రామం కాల్వశ్రీరాంపూర్/టేకుమట్ల: కూలీ పనులకు వస్తూ ఓ మహిళ కానరానిలోకాలకు వెళ్లింది. హార్వెస్టర్ వె నక్కి వస్తుండగా దానికింద పడి మృతి చెందింది. ఈ ఘటన సోమ వారం సాయంత్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం బూర్నపల్లి శివారులో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం మొట్లపల్లి గ్రామానికి చెందిన కొందరు కూలీలు వరి పంటలో బెరుకులు తీసేందుకు ఆటోలో బూర్నపల్లికి వస్తున్నారు. ఈ క్రమంలో ఆటో ముందు హార్వెస్టర్ వెళ్తుండగా.. ఎదురుగా ఆర్టీసీ బస్సు వ స్తోంది. దీంతో హార్వెస్టర్ ఆపరేటర్ బస్సుకు దారి ఇచ్చేందుకు వెనక్కి తీస్తుస్తున్నాడు. ఈ క్రమంలో హార్వెస్టర్ వెనుక ఉన్న ఆటోను డ్రైవర్ కూ డా వెనక్కి తీస్తుండగా అందులో ఉన్న ఇద్దరు మహిళలు భయంతో కిందికి దిగారు. అయితే హార్వెస్టర్ వారిపైకి ఎక్కింది. ఈ ఘటనలో దాసరి కనుకమ్మ(55) అక్కడికక్కడే మృతి చెందగా, మరో కూలీ వస ంతకు తీవ్రగా యాలయ్యా యి. వసంతను వెంటనే వరంగ ల్ తరలించారు. సమాచారం అందుకున్న ఎస్సై సుధాకర్ ఘటనా స్థలికి చే రుకుని ప్రమాద వివరాలు సేకరించారు. అనంతరం కనుకమ్మ మృతదేహాన్ని చిట్యాల ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కన్నీరుమున్నీరైన కూలీలు.. క్షణం ముందు ప్రాణంతో అందరి మధ్య ప్రయాణించిన కనుకమ్మ రె ప్పపాటు క్షణంలో విగతజీవిగా మా రడం, మరోమహిళ తీవ్ర గాయాల తో కొట్టుమిట్టాడుతుండగా చలించి న తోటి కూలీలు కన్నీరుమున్నీరయ్యారు. సాయంత్రం కూలీకి రాకు న్నా బతికేదేమో అని విలపించారు. ప్రాణాలు తీస్తున్న సాయంత్రం కూలి.. వేసవిలో ఎండలు తీవ్రంగా ఉండడంతో వ్యవసాయ కూలీలు ఉదయం, సాయంత్రం రెండు పూటలా పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల రామకిష్టాపూర్(టి) గ్రామానికి చెందిన మహిళా కూలీలు సాయంత్రం వేళ పొలంలోని బెరుకులు తీసేందుకు వెళ్లగా లారీ అదుపు తప్పి మీదపడిన ఘటనలో ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరవక ముందే మొట్లపల్లి నుంచి కూలీలు సాయంత్రం వేళ పొలంలోని బెరుకులు తీసేందుకు వస్తుండగా హార్వెస్టర్ మృత్యుశకటమై కనుకమ్మను కబళించింది. -
రోడ్డు దాటుతుండగా కారు ఢీ
● చికిత్స పొందుతూ రైతు మృతి బోయినపల్లి(చొప్పదండి): పంట చేనుకు నీరు పెట్టి ఇంటికొస్తూ రోడ్డు దాటుతున్న రైతును కారు ఢీకొట్టగా.. తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతిచెందాడు. గ్రామస్తులు, ఎస్సై పృధ్వీధర్‌గౌడ్ వివరాల ప్రకారం.. నీలోజిపల్లి గ్రామానికి చెందిన హన్మాండ్లు(60) అనే రైతుకు మూడెకరాల భూమి ఉంది. మిడ్ మానేరు కట్ట పరిసరాల్లో ఉన్న భూమిలో కూరగాయలు, ఇతర పంటలు సాగు చేస్తున్నాడు. ఆదివారం ఉదయం పంట చేన్లో నీరు పెట్టడానికి వెళ్లి తిరిగి ఇంటికొస్తున్నాడు. రోడ్డు దాటే క్రమంలో వేములవాడ నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న కారు హన్మాండ్లును ఢీకొంది. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబీకులు కరీంనగర్ ఆసుసత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందాడు. హన్మాండ్లుకు భార్య అమృతవ్వ, కుమారులు మధూకర్, నాగరాజు ఉన్నారు. ట్రాక్టర్ దొంగతనం కేసులో ఇద్దరి అరెస్టు మంథని: పుట్టపాక గ్రామానికి చెందిన మిట్ట రాజశేఖర్‌కు చెందిన ట్రాక్టర్, రోటవేటర్ జనవరి 24న చోరీకి గురి కాగా.. ఈ కేసులో ఇద్దరిని అరెస్టు చేసినట్లు సీఐ రాజు తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. గ్రామంలో రోడ్డు పక్కన తన షెడ్డులో నిలిపి ఉంచిన ట్రాక్టర్, రోటవేటర్ దొంగతనానికి గురైంది. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా.. అదే గ్రామానికి చెందిన ముప్పిడి రమేశ్ ఆర్థిక ఇబ్బందులతో ఏదైనా ట్రాక్టర్‌ను దొంగతనం చేయాలని ఆలోచించుకున్నాడు. ఈ క్రమంలో మున్సిపాలిటీలోని గంగాపురికి చెందిన ట్రాక్టర్ మెకానిక్ ప్రసాద్‌ను సంప్రదించాడు. రమేశ్ ట్రాక్టర్, రోటవేటర్ దొంగతనం చేసి మెకానిక్ వద్దకు తీసుకెళ్లి దాచిపెట్టాడు. శనివారం ట్రాక్టర్‌ను అమ్మడానికి ప్రయత్నించగా.. వారిని పట్టుకున్నారు. ట్రాక్టర్, రెండు టైర్లు, రోటవేటర్, ట్రాక్టర్ టాప్‌ను స్వాధీనపర్చుకున్నట్లు సీఐ తెలిపారు. -
గుండెపోటుతో యువకుడి మృతి
కోనరావుపేట: వెంకట్రావుపేట గ్రామానికి చెందిన ప్రశాంత్ అనే యువకుడు గుండెపోటుతో మృతిచెందాడు. కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న ప్రశాంత్‌కు శనివారం ఫిట్స్ రావడంతో అంబులెన్స్‌లో సిరిసిల్లలోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతున్న ప్రశాంత్ గుండెపోటుకు గురై మృతిచెందాడు. మృతదేహాన్ని గ్రామానికి తరలించి ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడికి భార్య రాణి, కుమారుడు అద్విత్, అమ్మమ్మ ఎల్లవ్వ ఉన్నారు. కత్తి పోటుకు గురైన బాలుడు..సిరిసిల్లక్రైం: శాంతినగర్ భూవివాదంలో మంగళవారం ముగ్గురు కత్తి పోట్లకు గురైన విషయం తెలిసిందే. జిల్లా కేంద్రంలో ఇంటి సమీపంలో రెండున్నర ఫీట్ల భూమి తగాదాలో వెంకటేశ్ కుటుంబానికి, అతడి అన్న కొడుకు పథ్వీ మధ్య కొద్ది రోజులుగా వివాదముంది. మంగళవారం పృథ్వీ, అతడి స్నేహితుడు వెంకటేశ్ ఇంటికెళ్లారు. వెంకటేశ్, అతడి భార్య, కొడుకు శివనేత్ర(3)పై కత్తితో దాడి చేశారు. శివనేత్ర పొట్టలో తగిలిన కత్తి పోటుతో పేగులు బయట పడ్డాయి. చికిత్స కోసం హైదరాబాద్ తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు. గాయపడ్డ వెంకటేశ్, అతడి భార్య కోలుకుంటున్నారని పోలీసులు తెలిపారు. బీజేపీ నాయకుల ఇళ్లపై కాంగ్రెస్ దాడి● ఫ్లెక్సీ ఏర్పాటుతో ముదిరిన వివాదం ● పోలీసులుండగానే ఘటన ● గొల్లపల్లిలో ఉద్రిక్తత ● నలుగురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు గొల్లపల్లి: బీజేపీ నాయకుల ఇళ్లపై కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు దాడులు చేయడం కలకలం సృష్టించింది. ఇది మండల కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. మండల కేంద్రంలోని రామాలయం గుట్టపై కాంగ్రెస్ నాయకులు కట్టుకున్న ఫ్లెక్సీని గుర్తుతెలియని వ్యక్తులు చించేశారు. దీనికి బీజేపీ మండల అధ్యక్షుడు కట్ట మహేశ్, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు సంగెం కల్యాణ్ కారణమని పేర్కొంటూ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముస్కు నిషాంత్‌రెడ్డి, నేరెళ్ల మహేశ్, ఓర్సు విజయ్, నల్ల విక్రంరెడ్డి, మరో 30 మంది దాడికి పాల్పడ్డారు. దీంతో బాధితులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వచ్చినా వారి ఎదుటనే మరోసారి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు సంఘెం కల్యాణ్ వీపులో గాయాలయ్యాయి. ఇంటి అద్దాలు, ఇతర సామగ్రిని ధ్వంసం చేశారు. కుటుంబ సభ్యులపైనా దాడికి పాల్పడి కట్ట మహేశ్, సంగెం కల్యాణ్‌ను చంపుతామని బెదిరించారు. తనను కులం పేరుతో దూషించి చంపుతామని బెదిరించారని కల్యాణ్ ఫిర్యాదు మేరకు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముస్కు నిషాంత్‌రెడ్డి, నేరెల్ల మహేశ్‌గౌడ్, ఓర్సు విజయ్, నల్ల విక్రంరెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై సతీశ్ తెలిపారు. -
రాజన్నా.. నీవే దిక్కు
వేములవాడ: వరుస సెలవులతో వేములవాడ రాజన్నకు ఆదివారం 55 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. మండుతున్న ఎండలను సైతం లెక్కచేయకుండా భక్తులు ధర్మగుండంలో స్నానాలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రాకతో ఆలయ ఆవరణ జనజాతరను తలపించింది. భక్తుల ద్వారా రూ.50లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. రాజన్నను రాష్ట్ర దేవాదాయశాఖ అడిషనల్ కమిషనర్ శ్రీనివాస్, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, ఢిల్లీ అర్బన్ డెవలప్మెంట్ డైరెక్టర్ రవీందర్ దర్శించుకున్నారు. ● దర్శించుకున్న 55వేల మంది ● రూ.50లక్షల ఆదాయం ● వరుస సెలవులతో పెరిగిన రద్దీ -
ఎలుగుబంటి దాడిలో ఒకరికి గాయాలు
హుజూరాబాద్: కాట్రపల్లి గ్రామంలో ఆదివారం ఎలుగుబంటి హల్చల్ చేసింది. ఎలుగుబంటి దాడిలో ఓ యువకుడు సైతం గాయపడ్డాడు. గ్రామస్తుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బాణాల హరీశ్ అనే యువకుడు ఉదయం బహిర్భూమికి వెళ్లగా.. ఎలుగుబంటి అకస్మాతుగా వచ్చి దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. హరీశ్‌ను జమ్మికుంట పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కొద్ది రోజులుగా ఎలుగుబంటి సంచరిస్తోందని అటవీ శాఖాధికారులకు చెప్పినా వచ్చి వెళ్లారే తప్ప చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఎలుగుబంటిని వెంటనే పట్టుకోవాలని వేడుకుంటున్నారు. -
టిప్పర్ ఢీ.. ఒకరు దుర్మరణం
తిమ్మాపూర్: కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని అల్గునూర్ ప్రధాన చౌరస్తాలో ఆదివారం ఓ టిప్పర్ బీభత్సం సృష్టించింది. అతివేంగా దూసుకొచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీకొనగా.. వేల్పుల లచ్చయ్య(49) అనే వ్యక్తి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. అల్గునూర్‌కు చెందిన లచ్చయ్య తన మోటార్ సైకిల్‌పై కరీంనగర్ వైపు వెళ్తుండగా.. కరీంనగర్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కంకర టిప్పర్(నంబర్ ఏపీ16టీజే5716) డ్రైవర్ అతివేగంతో, అజాగ్రత్తగా వాహనాన్ని నడుపుతూ లచ్చయ్య నడుపుతున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. లచ్చయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. కొన ఊపిరితో ఉండగా.. స్థానికుడైన శ్రీకాంత్ అనే వ్యక్తి ఆటోలో కరీంనగర్‌లోని మెడికేర్ ఆసుపత్రికి తరలించారు. మధ్యాహ్నం లచ్చయ్య మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి భార్య రాజవ్వ ఫిర్యాదు చేయగా.. ఎల్ఎండీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
తండ్రి వచ్చేలోపే.. తనువు చాలించింది
దండేపల్లి: అదనపు కట్నం వేధింపులు ఓ వివాహితను బలి తీసుకున్నాయి. పెళ్లయి ఎనిమిదేళ్లయినా అత్తింటివారి వేధింపులు ఆగలేదు. నాలుగేళ్లపాటు భర్త, అత్తామామ, బావ, మరిది వేధింపులు తట్టుకుంది. ఆర్నెళ్ల క్రితం ఆడపిల్ల పుట్టడంతో మరింత ఎక్కువయ్యాయి. పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ అయినా తీరు మారలేదు. చివరకు ఆ వివాహిత చావే శరణ్యనుకుంది. ఉరేసుకుని తనువు చాలించింది. ఫలితంగా ఆమె కుమారుడు (6), కూతురు (ఆర్నెళ్లు) తల్లిలేనివారయ్యారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా దండేపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్సై తహాసీనొద్దీన్ కథనం ప్రకారం.. దండేపల్లికి చెందిన గంగధరి మల్లేశ్‌కు, బుగ్గారం మండలం యశ్వంత్‌రావుపేటకు చెందిన వరలక్ష్మి అలియాస్ మేఘనతో 2017లో వివాహమైంది. పెళ్లి సమయంలో రూ.4 లక్షల కట్నం, 4 తులాల బంగారం, ఇతర సామగ్రి ఇచ్చారు. నాలుగేళ్లపాటు వీరి కాపురం బాగానే సాగింది. కూలీ పనులకు వెళ్లే మల్లేశ్‌కు అదనపు కట్నంపై ఆశపుట్టింది. అప్పటి నుంచి భార్యను వేధిస్తున్నాడు. దీనికి మల్లేశ్ తల్లిదండ్రులు లక్ష్మి, నర్సయ్య, సోదరులు తోడయ్యారు. కుటుంబమంతా వేధించడంతో మేఘన భరించలేకపోయింది. విషయాన్ని పుట్టింటివారికి చెప్పడంతో ఏడాది క్రితం పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. నచ్చజెప్పి మళ్లీ కాపురానికి పంపించారు. ఆరు నెలల క్రితం పాప జననం.. ఆర్నెళ్ల క్రితం మేఘన పాపకు జన్మనిచ్చింది. అప్పటినుంచి కట్నం వేధింపులు మొదలయ్యాయి. భీవండిలో ఉండే తన తండ్రి రాజమల్లుకు 10 రోజుల క్రితం ఫోన్ చేసి చెప్పింది. త్వరలోనే యశ్వంత్‌రావ్‌పేటకు వస్తానని, వచ్చాక పుట్టింటికి తీసుకొస్తానని నచ్చజెప్పాడు. శనివారం స్వగ్రామానికి వచ్చిన రాజమల్లు ఆదివారం భార్య అమ్మాయితో కలిసి దండేపల్లిలోని కూతురు ఇంటికి వెళ్లాడు. అక్కడ కూతురు కనిపించకపోవడంతో లోపలికి వెళ్లి చూడగా చీరతో ఉరేసుకుని కనిపించింది. కన్నబిడ్డను విగతజీవిగా చూసిన తల్లిదండ్రులో బోరున విలపించారు. పుట్టింటికి తీసుకుపోతానంటిని కదా బిడ్డా.. అంతలోనే ఇలా అయ్యిందా అంటూ తండ్రి విలపించిన తీరు అందరినీ కన్నీరు పెట్టించింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తన కూతురు మృతికి అల్లుడు, అతని తల్లిదండ్రులు, అన్న, తమ్ముడే కారణమని రాజమల్లు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు. తల్లి ప్రేమకు దూరమైన చిన్నారులు.. వరలక్ష్మి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె కుమారుడు శ్రీనాథ్, కూతురు శరణ్య తల్లిప్రేమకు దూరమయ్యారు. తల్లి ఏమైందో కూడా ఆ చిన్నారులకు తెలియడం లేదు. కనీసం ఆ తల్లికి ఆత్మహత్య చేసుకునే ముందు తన పిల్లలైన గుర్తుకు రాలేదా అని పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు. అత్తింటి వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య పలుమార్లు పెద్దల పంచాయితీ అయినా తీరు మారకపోవడంతో బలవన్మరణం దండేపల్లిలో ఘటన.. కేసు నమోదు మృతిరాలిది బుగ్గారం మండలం యశ్వంత్‌రావుపేట -
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
చొప్పదండి: పట్టణంలోని బీసీ కాలనీలో నివాసముండే ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. మృతురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గాజుల కనకలక్ష్మి అనే మహిళ భర్త చనిపోవడంతో బీసీ కాలనీలోని ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. ఆమె కూతురు ఆర్నకొండకు చెందిన నెల్లి నాగమణి రోజులాగే శనివారం రాత్రి, ఆదివారం ఉదయం ఫోన్ చేసి తల్లితో మాట్లాడటానికి ప్రయత్నించగా.. ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అనుమానం వచ్చి ఇంటి పక్కన ఉన్నవారిని చూడుమని కోరగా.. ఇంటి లోపల గేటుకు తాళం ఉందని, పిలిస్తే పలకడం లేదని చెప్పారు. ఆర్నకొండ నుంచి వచ్చి చూడగా.. ఇంట్లో చనిపోయి ఉంది. కనకలక్ష్మి పుస్తెల తాడు తెగిపోయి ఉండగా.. రెండు తులాల బంగారు గొలుసు కనిపించలేదు. దీంతో గుర్తుతెలియని వ్యక్తులు బంగారు ఆభరణం కోసం హత్య చేసి చోరీ చేసినట్లు అనుమానముందని నాగమణి ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కనకలక్ష్మికి మొదట మంద రాజయ్యతో వివాహం కాగా.. నాగరాజు అనే కుమారుడు జన్మించాడు. మంద రాజయ్య మృతిచెందడంతో.. నెల్లి రాజయ్యను వివాహం చేసుకుంది. వీరికి నాగమణి జన్మించింది. నెల్లి రాజయ్య కూడా మృతిచెందడంతో.. పదేళ్ల క్రితం ఆర్మీలో రిటైర్డ్ అయిన గాజుల చంద్రయ్యను పెళ్లి చేసుకుంది. చంద్రయ్యకు వివాహం జరిగి ముగ్గురు కుమారులు జన్మించిన తర్వాత ఆయన భార్య మృతిచెందడంతో కనకలక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి పిల్లలు లేకపోవడంతో ఏడేళ్ల కిత్రం నాగమణి వివాహం చేశారు. రెండేళ్ల కిత్రం చంద్రయ్య కూడా మృతిచెందడంతో.. కనకలక్ష్మి బీసీ కాలనీలో ఒంటరిగా ఉంటోంది. అనుమానాస్పద మృతిపై ఎస్సై మామిడాల సురేందర్ కేసు నమోదు చేశారు. -
ఈ ఆటో శిక్షణతో కొత్త అడుగు
తిమ్మాపూర్: మహిళల ఆర్థిక బలోపేతం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. రాష్ట్ర మహిళా సహకార సంస్థ, మోవో సొసైటీ సహకారంతో తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలోని దుర్గాబాయి దేశ్‌ముఖ్ కేంద్రంలో 20 మంది మహిళలకు ఈ– ఆటో డ్రైవింగ్ శిక్షణ కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. కలెక్టర్ సత్పతితో కలిసి ఎమ్మెల్యే హాజరై ప్రారంభించారు. ఈ ఆటో శిక్షణతో మహిళలు స్వయం ఉపాధి పొంది, ఆర్థికంగా బలపడతారని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఈ శిక్షణతో చాలామంది ఉపాధి పొందుతున్నారని, రానున్న రోజుల్లో మొబైల్, టీవీ రంగాల్లోనూ శిక్షణ ఇస్తామని మహిళా కార్పొరేషన్ చైర్పర్సన్ శోభారాణి తెలిపారు. మహిళల రవాణా సేవలు సురక్షితంగా ఉంటాయని, కరీంనగర్ ఆదర్శంగా నిలవాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ‘రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన’హుజూరాబాద్: రాష్ట్రంలో ప్రజాపాలన పేరిట కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పేర్కొన్నారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండలంలోని ఇప్పలనర్సింగపూర్ గ్రామంలో గావో చలో అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. బీజేపీని రాష్ట్రంలో అడుగబెట్టనివ్వని సీఎం చెబితే.. క్షేత్రస్థాయిలో ప్రజలు బీజేపీని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. గతంలో బీజేపీ గురించి హేళనగా మాట్లాడిన కేసీఆర్‌కు బీజేపీ శక్తి ఏంటో తెలిసి, ఫాంహౌస్‌లో రెస్ట్ తీసుకుంటున్నారని గుర్తుచేశారు. నాయకులు తూర్పాటి రాజు, యాళ్ల సంజీవరెడ్డి, పైళ్ల వెంకట్‌రెడ్డి, పల్లె వీరయ్య, యాళ్ల లీల, బొడ్డు మహేశ్, గంగిశెట్టి ప్రభాకర్, పోతుల సంజీవ్ పాల్గొన్నారు. సరస్వతి ఆలయంలో పల్లకీ సేవ చొప్పదండి: పట్టణంలోని జ్ఞాన సరస్వతి ఆలయంలో శనివారం అమ్మవారికి పల్లకీ సేవ నిర్వహించారు. అర్చకులు ఊంజల్ సేవ నిర్వహించగా, ఆలయం అమ్మవారి నామస్మరణతో మార్మోగింది. అనంతరం భక్తులకు అన్నదా నం నిర్వహించారు. చైత్ర పౌర్ణమిని పురస్కరించుకుని సాయిబాబా ఆలయంలో అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నగరంలో పవర్‌కట్ ప్రాంతాలు కొత్తపల్లి: సబ్స్టేషన్లలో నెలవారి నిర్వహణలో భాగంగా ఆదివారం ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు 33/11 కె.వీ.శాతవాహన వర్సిటీ సబ్‌స్టేషన్ పరిధిలోని చింతకుంట, శ్రీరాంనగర్, మల్కాపూర్, కమాన్‌పూర్, గ్రానైట్ పరిశ్రమలు గల ప్రాంతాలు, 33/11 కె.వీ.కొత్తపల్లి సబ్‌స్టేషన్ పరిధిలోని కొత్తపల్లి, వెలిచాల, దేశ్రాజ్పల్లి, వెదిర గ్రామాలతో పాటు మిషన్ భగీరథ, ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 33/11 కె.వీ.నగునూర్ సబ్‌స్టేషన్ పరిధిలోని నగునూర్, వల్లంపహాడ్, తీగలగుట్టపల్లి ప్రాంతాలు, 33/11 కె.వీ.మొగ్ధుంపూర్, చెర్లభూత్కూర్ సబ్స్టేషన్ల పరిధిలోని నల్లకుంటపల్లి, ఇరుకుల్ల, మొగ్ధుంపూర్, చెర్లభూత్కూర్, తాహెర్‌కొండాపూర్, దుబ్బపల్లి, చామన్‌పల్లి, జూబ్లీనగర్, ఫకీర్‌పేట, బహద్దూర్‌ఖాన్‌పేట, ఎలబోతారం గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు కరీంనగర్ రూరల్ ఏడీఈ గాదం రఘు తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 11కె.వీ.ఉజ్వల పార్కు ఫీడర్ పరిధిలోని ఎన్టీఆర్ విగ్రహం నుంచి ఉజ్వల పార్కురకు, పాలిటెక్నిక్ కళాశాల, ఐటీ హబ్, ఐటీఐ కళాశాల, డీమార్ట్, గణేశ్‌నగర్ బైపాస్, తిరుమల థియేటర్, వసంత్‌వ్యాలీ స్కూల్, ధ్రువాసి కార్ఖానా, జెప్టో ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్–2 ఏడీఈ ఎ.లావణ్య తెలిపారు. -
హై కమాండ్‌కు చెప్పుకుందాం
● కాంగ్రెస్ మాజీ కార్పొరేటర్ల ప్రత్యేక భేటీ కరీంనగర్ కార్పొరేషన్: ‘పార్లమెంట్ ఎన్నికలకు ముందు మమ్మల్ని పార్టీలోకి తీసుకొచ్చారు. వచ్చాక మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. అధికార కాంగ్రెసోళ్లమైనా మున్సిపల్ కార్పొరేషన్లో పనులయితలేవు. అధికారులను బదిలీ చేయించే శక్తి మాకు లేకుండా పోయింది. కనీసం సీఎంఆర్ఎఫ్ చెక్కులు కూడా మా డివిజన్లలో ఎవరెవరో పంచుతున్నరు. పార్టీలో మా పరిస్థితి ఏమిటో మాకే అర్థం కావడం లేదు.’.. అంటూ కాంగ్రెస్ మాజీ కార్పొరేటర్లు, పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలి చాల రాజేందర్రావు ఎదుట తమ బాధలను ఏకరువు పెట్టారు. నగరంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న కార్యాలయంలో వెలిచాల రాజేందర్రావు శనివారం పూజా కార్యక్రమం నిర్వహించా రు. అనంతరం‘కారా?..కమలమా?’ అనే శీర్షికన ‘సాక్షి’లో శనివారం వచ్చిన కథనం నేపథ్యంలో ఆయన మాజీ కార్పొరేటర్లతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటిలో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను మాజీ కార్పొరేటర్లు వెలిచాల దృష్టికి తీసుకొచ్చారు. ఎవరు ఏ పార్టీలోకి వెళ్తున్నారన్నది ప్రస్తుతానికి పక్కనపెడితే, పార్టీపై అసంతృప్తిగా ఉండడం వాస్తవమంటూ అంగీకరించారు. నగరపాలకసంస్థ ఎన్నికలు ముందున్నందున ఇలాంటి పరిస్థితి పార్టీకి నష్టం కలిగిస్తుందని తెలిపారు. ఈ క్రమంలోనే ‘పార్టీ హైకమాండ్ వద్దకు వెళ్దాం. పరిస్థితిలో మార్పు వస్తుందనుకొంటున్నాం. రాకపోతే అందరు రాజీనామా చేస్తే వాళ్లే వింటరు’.. అంటూ ఓ నేత వ్యాఖ్యానించినట్లు సమాచారం. సుదీర్ఘ చర్చల అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి, పార్టీ అధిష్టానం వద్దకు వెళ్లాలని, తమ బాధలేంటో చెప్పుకోవాలని తీర్మాణించారు. ఈ మేరకు పొన్నం ప్రభాకర్ అపాయింట్మెంట్ తీసుకోవాలని నిర్ణయించారు. ఈ భేటీలో మాజీ కార్పొరేటర్లు చాడగొండ బుచ్చిరెడ్డి, నేతికుంట యాదయ్య, ఆకుల నర్సయ్య, పిట్టల శ్రీనివాస్, సరిళ్ల ప్రసాద్, పడిశెట్టి భూమయ్య, ఆకుల ప్రకాశ్, కోటగిరి భూమాగౌడ్, నడిపెల్లి అశోక్‌రావు పాల్గొన్నారు. -
నీ దర్శన భాగ్యమెప్పుడో..
తిరుమలేశా...విద్యానగర్(కరీంనగర్): అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడైన శ్రీవేంకటేశ్వరస్వామి నిత్యపూజల ప్రియుడు. తిరుమల తిరుపతి దేవస్థానంలో నిత్యం ప్రత్యూషతో మొదలై ఆరు సమయాల్లో వేదమంత్రోచ్ఛరణలతో దేవదేవుడికి నిర్వహించే నిత్య కై ంకర్య వైభోగాన్ని కరీంనగర్ జిల్లావాసులు ప్రత్యక్షంగా వీక్షించడానికి నగరంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి 31మే 2023న భూమి పూజ నిర్వహించారు. అదేరోజు ఆలయ నిర్మాణ స్థలంలో శ్రీవారి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఆ తరువాత జరిగిన పరిణామాలతో ఆలయ నిర్మాణ పనులు అడుగు కూడా ముందుకు సాగలేదు. ఉభయ రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పడడంతో ఆలయ నిర్మాణం నిలిచిపోయింది. బ్రహ్మోత్సవాల స్ఫూర్తితో.. కరీంనగర్ మార్కెట్‌రోడ్డు శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహోత్సవాలకు 2018లో అప్పటి మంత్రి, ప్రస్తుత కరీంనగర్ ఎమ్మెల్యే గుంగుల కమలాకర్ నాంది పలికారు. 2022లో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌తో కలిసి కరీంనగర్లో స్వామివారి ఆలయం నిర్మించాలని అప్పటి ముఖ్యమంత్రి కేసీ ఆర్కు విన్నవించారు. విషయాన్ని అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి కేసీఆర్ తీసుకెళ్లారు. ఏపీ సీఎం ఆదేశాలతో టీటీడీ బోర్డు ఆలయ నిర్మాణానికి సమ్మతించింది. పద్మనగర్ పరిధిలోని పశుసంవర్ధకశాఖ స్థలంలో పది ఎకరా లు ప్రభుత్వం కేటాయించింది. మార్చి 15, 2022న సంబంధిత పత్రాలను గంగుల కమలాకర్, టీటీడీ హైదరాబాద్ లోకల్ అడ్వైజరీ కమిటీ అప్పటి చైర్మన్ జీవీ.భాస్కర్ రావుకు కేసీఆర్ అందించారు. రూ.20 కోట్లతో ఆలయ నిర్మాణం చేపట్టనున్నట్లు టీటీడీ ప్రకటించింది. 31మే 2023న వేదమంత్రోచ్ఛరణలతో భూమిపూజ నిర్వహించి, సాయంత్రం శ్రీవారి కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. నగరంలో భూమి పూజకే పరిమితమైన టీటీడీ వేంకటేశ్వరాలయం బ్రహ్మాండ నాయకుడి దర్శన భాగ్యం కోసం భక్తుల ఎదురుచూపులు రెండేళ్లవుతున్నా.. జాడలేని పనులు సర్కారు చొరవ చూపాలంటున్న భక్తులుప్రభుత్వాలు మారడంతో.. తరువాత జరిగిన పరిణామాలతో ఆలయ నిర్మాణ పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయా యి. 2023 నవంబర్, డిసెంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లోనూ ప్రభుత్వం మారడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచి పోయాయి. ఇటుక కూడా పేర్చకుండా ఆలయ నిర్మాణ ఊసే లేకుండా పోయింది. భక్తులకు శ్రీవారి నిత్య దర్శనం కలగానే మిగిలిపోయింది. మంత్రులు, కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి ఆలయ నిర్మాణానికి చొరవ తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. -
బ్రహ్మోత్సవాల స్ఫూర్తితోనే..
కరీంనగర్‌లోని శ్రీవేంకటేశ్వర ఆలయంలో బ్రహ్మోత్సవాల నిర్వహణతో శ్రీవారి ఆలయం నిర్మించాలనే ఆలోచన కలిగింది. ఆలయ నిర్మాణానికి భూమిపూజ కూడా చేయడం జరిగింది. తరువాత పనులు ప్రారంభం కావాల్సి ఉండే. జరిగిన పరిణామాలతో కాలేదు. అధికారులు ఈ విషయంలో శ్రద్ధ తీసుకుని శ్రీవారి ఆలయాన్ని త్వరగా నిర్మించి, భక్తులకు స్వామివారి దర్శనం భాగ్యం కల్పించాలి. – చకిలం గంగాధర్, శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ వంశపారంపర్య చైర్మన్, కరీంనగర్ -
దళారుల చేతిలో మోసపోవద్దు
గంగాధర/రామడుగు: ఆరుగాలం శ్రమించి పండించిన పంటను రైతులు తక్కువ ధరకు దళారులకు అమ్ముకోకుండా మద్దతు ధర పొంది ప్ర భుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని కలెక్టర్ పమేలా సత్పతి, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. గంగాధర మండలం కురిక్యాల గ్రామంలో ప్రాథమిక సహకార సంఘం, రామడుగులో సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చే రైతులకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. రైతులు నాణ్యమైన ధాన్యం తీసుకొచ్చి మద్దతు ధర పొందాలన్నారు. అదనపు కలెక్టర్ లక్ష్మికిరణ్, డీసీవో రామానుజాచా ర్యులు, సివిల్ సప్లై డీఎం రజినీకాంత్, గంగాధర సింగిల్‌విండో చైర్మన్ వెలిచాల తిరుమల్‌రావు, తహసీల్దార్ అనుపమ, గోపాల్రావుపేట మార్కె ట్ కమిటీ చైర్మన్ బొమ్మరవేని తిరుమల, వైస్ చైర్మన్ పిండి సత్యంరెడ్డి, రామడుగు, కొక్కెరకుంట సింగిల్ విండో చైర్మన్లు వీర్ల వేంకటేశ్వర్రావు, ఒంటెల మురళీకృష్ణారెడ్డి, మాజీ మార్కెట్ కమి టీ చైర్మన్ ఉప్పుల అంజనీప్రసాద్ పాల్గొన్నారు. మద్దతు ధరకు ధాన్యం విక్రయించాలి కలెక్టర్ పమేలా సత్పతి, చొప్పదండి ఎమ్మెల్యే సత్యం పలుచోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం -
జై శ్రీరాం.. జై హనుమాన్
ఆదివారం శ్రీ 13 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025● ఘనంగా హనుమాన్ చిన్న జయంతి ● అట్టహాసంగా వీరహనుమాన్ విజయయాత్రకరీంనగర్టౌన్/కరీంనగర్‌క్రైం: రామలక్ష్మణ జానకీ జైబోలో హనుమాన్‌కీ.. జై శ్రీరాం.. జై హనుమాన్ నామస్మరణలతో నగరంలోని ఆలయాలు మార్మోగాయి. శనివారం హనుమాన్ చిన్నజయంతి సందర్భంగా ఆలయాలు కిక్కిరిశాయి. సాయంత్రం విశ్వహిందూ పరిషత్, భజరంగదళ్ ఆధ్వర్యంలో వీరహనుమాన్ విజయయాత్ర పేరుతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. గాంధీరోడ్ రామాలయం వద్ద వీహెచ్‌పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ రాంసింగ్ యాత్రను ప్రారంభించారు. టవర్‌సర్కిల్, రూరల్ పోలీస్‌స్టేషన్, కమాన్, వన్‌టౌన్ పోలీస్ స్టేషన్, బస్టాండ్, గీతాభవన్, కోర్డు, మంచిర్యాల చౌరస్తా, గాంధీరోడ్ చౌరస్తా మీదుగా హనుమాన్ ఆలయానికి ర్యాలీ చేరుకుంది. యాత్రకు 450 మందితో పటిష్టమైన బందోబస్తు నిర్వహించినట్లు సీపీ గౌస్ఆలం వెల్లడించారు. వీహెచ్‌పీ బాధ్యులు ఇనుగంటి మునీందర్, గో రక్షా రాష్ట్ర కమిటీ మెంబర్ రాధాకృష్ణారెడ్డి, వీహెచ్‌పీ నగర అధ్యక్షుడు ఇనుగుర్తి రమేశ్, భజరంగదళ్ బాధ్యులు తోట ప్రదీప్, కన్నం శంకర్ పాల్గొన్నారు. కొండగట్టుకు వేలాది మంది తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకుని ఇరుముడులు సమర్పించి మాల విరమణ చేశారు.న్యూస్‌రీల్ -
బీ–థర్మల్‌లో బదిలీల కలకలం
రామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండం థర్మల్ పవర్ స్టేషన్(ఆర్టీపీఎస్–బీ) 62.5 మెగావాట్ల సామర్ధ్యం గల విద్యుత్ కేంద్రం మూతపడి పది నెలలు గడిచింది. ఈక్రమంలో శనివారం తెలంగాణ పవర్ జనరేషన్ కార్పొరేషన్, విద్యుత్ సౌధ నుంచి స్థానికంగా పనిచేసే 85 మంది ఉద్యోగులకు మూకుమ్మడి బదిలీ ఉత్తర్వులు వచ్చాయి. ఇందులో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్(ఓఅండ్ఎం) విభాగానికి చెందిన ఉద్యోగులు ఉన్నారు. సూపరింటెండెంట్ ఇంజినీర్ పి.విజేందర్‌తోపాటు ఓఅండ్‌ఎంకు చెందిన –72, ఇంజినీర్లు–11మంది, ఏడీఈలు–ఒకరు బదిలీ అయిన వారిలో ఉన్నారు. మరోరెండు రోజుల్లో రెండోజాబితాలో మిగతా విభాగాల ఉద్యోగులకు బదిలీ ఉత్తర్వులు రానున్నాయనే ఊహాగానాలు వస్తున్నాయి. మరోవైపు.. ఉద్యోగ విరమణకు మరో మూడేళ్ల వ్యవధి ఉండే వారిని బదిలీచేసే అవకాశం లేదని తెలుస్తోంది. కాలంచెల్లిన జాబితాలో బీ–థర్మల్.. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే తొలి విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా ఉన్న రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ అనేక రికార్డుల సాధించింది. అరవై ఏళ్ల జీవితకాలం పూర్తవడంతో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తాయి. అప్పటి సాంకేతిక పరిజ్ఞానానికి సరిపడే విడిభాగాలు లభించడంలేదు. దీంతో గతేడాది జూన్ 6వ తేదీన విద్యుత్ కేంద్రం మూతపడింది. మూడు తరాలతో విడదీయరాని బంధం.. తాతలు, తండ్రులు, చివరగా కుమారులు.. ఇలా మూడు తరాలు విద్యుత్ కేంద్రంతో విడదీయరాని బంధం కలిగి ఉన్నారు. ఇక్కడే ప్రస్తుతం యాదాద్రి విద్యుత్ కేంద్రానికి బదిలీ చేస్తూ ఒక్కసారిగా ఉ త్తర్వులు వెలువడడంతో ఉద్వేగానికి లోనవుతున్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్‌కు 85 మంది ఉత్తర్వులు జారీచేసిన పవర్ జనరేషన్ కార్పొరేషన్ స్థానికంగా కొందరు యాదాద్రిలో 800 మెగావాట్ల సామర్థ్యంతో ఐదు విద్యుత్ కేంద్రాలు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఒక యూనిట్ పూర్తయ్యింది. త్వరలో రెండో యూనిట్ కమీషన్డ్ చేసే అవకాశం ఉంది. ఇలా దశలవారీగా అన్నియూనిట్లను విద్యుత్ ఉత్పత్తి దశలోకి వేగవంతంగా తీసుకురావాలనే ఉద్దేశంతో ఇక్కడి ఉద్యోగులను మూకుమ్మడిగా యాదాద్రికి బదిలీ చేసినట్లు తెలిసింది. రెండో లిస్టులో ఎంతమందిని బదిలీ చేస్తారనే విషయమై స్పష్టత లేదు. ప్రస్తుతం ఉన్న బీ–థర్మల్ను కూలదోసే క్రమంలో స్థానికంగా కొంతమంది ఇంజినీర్లను స్థానికంగానే కొనసాగించే అవకాశాలున్నట్లు విశ్వసనీయ సమాచారం. – దాసరి శంకరయ్య, ఇన్చార్జి ఎస్ఈ, బీ–థర్మల్ విద్యుత్ కేంద్రం, రామగుండం -
వనజీవి రామయ్యకు జిల్లాతో అనుబంధం
సిరిసిల్ల/కోనరావుపేట(వేములవాడ): వనజీవి దర్పల్లి రామయ్యతో జిల్లాకు అనుబంధం ఉంది. జిల్లాకు చెందిన ప్రకృతి ప్రేమికులు చేస్తున్న వనసంరక్షణ చర్యలను గుర్తించి జిల్లాలో పర్యటించారు. చెట్ల ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రచారం చేశారు. జిల్లాకు 2019వ సంవత్సరం జనవరి 13న వచ్చారు. కోనరావుపేట మండలం సుద్దాలకు చెందిన ప్రకృతి ప్రకాశ్ పర్యావరణ సేవలను గుర్తించి ఆ గ్రామానికి వచ్చారు. చెట్ల ప్రాముఖ్యతను ఆ గ్రామ పాఠశాల విద్యార్థులకు వివరించారు. జనవరి 19న సిరిసిల్ల కాలేజీగ్రౌండ్‌లో పర్యావరణ సదస్సుకు హాజరై.. మొక్కల ఆవశ్యకతను విద్యార్థులకు వివరించారు. అంతకుముందు మూడుసార్లు సిరిసిల్లకు వచ్చారు. అప్పటి కలెక్టర్ కృష్ణభాస్కర్ వనజీవి రామయ్యను సత్కరించారు. ఆయన మరణంపై పలువురు జిల్లా వాసులు సంతాపం తెలిపారు. రామయ్య మృతిపై సిరిసిల్లకు చెందిన ప్రకృతి ప్రకాశ్(దొబ్బల), సామాజిక సేవకుడు వేముల మార్కండేయులు సంతాపం తెలిపారు. రామయ్య మరణవార్త తెలియగానే ప్రకృతి ప్రకాశ్ ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి వెళ్లారు. రామయ్య మృతదేహం వద్ద నివాళి అర్పించారు. జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటున్న జిల్లా వాసులు రాజన్న సిరిసిల్లకు పలుమార్లు రాక -
రైస్‌మిల్లులో అగ్నిప్రమాదం
● తగలబడిన ఐదు వేల క్వింటాళ్ల ధాన్యం ● 85 వేల గన్నీ సంచులు దగ్ధం మెట్‌పల్లిరూరల్: మెట్పల్లి మండలం కొండ్రికర్ల శివారులోని మహలక్ష్మీ రైస్‌మిల్లులో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మిల్లులో నిల్వ చేసిన ధాన్యం, గన్నీ సంచులు దగ్ధమైనట్లు రైస్‌మిల్ యజమాని గంగారెడ్డి తెలిపారు. శనివారం వేకువజామున మిల్లులో మంటలు చెలరేగుతున్నట్లు అందులో పనిచేసే ఓ కార్మికుడు యజమాని గంగారెడ్డికి ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. అక్కడికి చేరుకున్న ఆయన మంటలను గమనించి అగ్నిమాపకశాఖ అధికారులకు సమాచారం చేరవేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. డీసీఎస్ జితేందర్‌రెడ్డి, డీటీసీఎస్ ఉమాపతి, ఫుడ్ ఇన్స్పెక్టర్ రాజేందర్రావు, అగ్నిమాపక శాఖ అధికారి మల్లికార్జున్, ఆర్ఐ ఉమేశ్, పోలీసులు రైస్‌మిల్లు వద్దకు చేరుకొని ఘటనపై ఆరా తీశారు. ప్రమాదం ఎలా జరిగిందనే విషయాలతోపాటు నష్టంపై ఆరా తీశారు. మిల్లులో దాదాపు 20 వేల క్వింటాళ్ల వరకు ధాన్యం నిల్వ ఉంది. అందులోంచి సుమారు 5 వేల క్వింటాళ్ల ధాన్యం, 85 వేల గన్నీ సంచులు దగ్ధమైనట్లు యజమాని అధికారులకు తెలిపారు. సుమారు రూ.10 లక్షల వరకు నష్టం వాటిల్లిందని అగ్నిమాపక శాఖ అధికారులు అంచనా వేసినట్లు తెలిసింది. -
విద్య, వైద్యానికి ప్రాధాన్యం ఇచ్చాం
కరీంనగర్‌రూరల్: బీఆర్ఎస్ హయాంలో విద్య, వైద్యరంగానికి మొదటి ప్రాధాన్యం ఇచ్చినట్లు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. బొమ్మకల్‌లోని చల్మెడ ఆనందరావు మెడికల్ కళాశాలలో శనివారం 2019 సంవత్సరం ఎంబీబీఎస్ బ్యాచ్ విద్యార్ధుల స్నాతకోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రతీ జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాలలను మంజూరు చేసినట్లు తెలిపారు. తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చుతూ వైద్యులుగా మారుతున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే రోజుల్లో వైద్యులకు ఏఐ చాలెంజ్‌గా మారుతుందని తెలిపారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ చల్మెడ మెడికల్ కళాశాల హైదరాబాద్ కళాశాలలకు దీటుగా వైద్యవిద్యను నేర్పిస్తుండటంతో తన కూతురును చేర్పించినట్లు తెలిపారు. కళాశాల చైర్మెన్ లక్ష్మినర్సింహరావు మాట్లాడుతూ..తెలంగాణలో ఏ మెడికల్ కళాశాలలో లేని సిమ్యులేషన్ ల్యాబ్‌ను చల్మెడ వైద్య విద్యార్ధులకు అందుబాటులోకి తీసుకరావడం జరిగిందన్నారు.అనంతరం 124మంది ఎంబీబీఎస్ విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్, కళాశాల డైరెక్టర్ సూర్యనారాయణరెడ్డి, ప్రిన్సిపాల్ ఆసీంఅలీ, వైస్ ప్రిన్సిపాల్ అనిత, సూపరింటెండెంట్ రామకృష్ణప్రసాద్ పాల్గొన్నారు. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ చల్మెడ మెడికల్ కళాశాలలో స్నాతకోత్సవం -
మెట్పల్లిలో లారీ, కంటైనర్ ఢీ
మెట్పల్లి: పట్టణంలోని జాతీయ రహదారిపై శనివారం ఓ లారీ, కంటైనర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ అందులోనే ఇరుక్కపోయాడు. సుమారు రెండు గంటల పాటు తీవ్ర అవస్థలు పడగా.. పోలీసులు శ్రమించి అతడిని బయటకు తీశారు. ఎస్సై కిరణ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. అక్షయ ట్రాన్స్‌పోర్టుకు చెందిన లారీ కరీంనగర్ నుంచి గ్రానైట్ లోడ్‌తో మహారాష్ట్ర వైపు వెళ్తోంది. మార్గమధ్యంలో మెట్పల్లి ఎస్సారెస్పీ వంతెన మీదకు రాగానే ఎదురుగా కంటైనర్ వచ్చి ఢీ కొట్టింది. ఈ సంఘటనలో గ్రానైట్ లారీ ముందు భాగం దెబ్బతింది. అందులో ఉన్న డ్రైవర్ పరదేశీ కుడికాలు అందులోనే చిక్కుకుపోయింది. సమాచారం అందుకున్న డీఎస్పీ రాములు, ఎస్సైలు కిరణ్‌కుమార్, అనిల్ అక్కడకు చేరుకొని రెండు గంటల పాటు శ్రమించి డ్రైవర్‌ను బయటకు తీశారు. చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరోవైపు గ్రానైట్ లారీని అక్కడి నుంచి తొలగించడం కష్టంగా మారడంతో కొన్ని గంటలపాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. చివరకు రెండు క్రేన్ల సహాయంతో తొలగించారు. ట్రాన్స్‌పోర్టు సూపర్వైజర్ వెంకట్రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. లారీలో ఇరుక్కుపోయిన డ్రైవర్ రెండు గంటల పాటు నరకయాతన -
అంకుల్ ఫోన్ చేసుకుంటాం అంటూ..
● ఆర్టీసీ డ్రైవర్ సెల్‌ఫోన్‌తో ఉడాయించిన యువకులు ● డయల్ 100కు ఫోన్ చేస్తే స్పందించని పోలీసులు శంకరపట్నం: ‘అంకుల్ మా సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ అయ్యింది. ఒకసారి మీ ఫోన్ ఇస్తే.. ఒక కాల్ చేసుకుని ఇస్తాం’.. అంటూ ముగ్గురు యువకులు ఓ ఆర్టీసీ డ్రైవర్‌కు చెందిన సెల్‌ఫోన్ తీసుకుని ఉడాయించారు. ఈ ఘటన శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. బాధితుడి వివరాల ప్రకారం.. మొలంగూర్ గ్రామానికి చెందిన సాయిరెడ్డి మెట్పల్లి డిపోలో ఆర్టీసీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. విధులు ముగించుకుని శుక్రవారం అర్ధరాత్రి మొలంగూర్ క్రాస్‌రోడ్డు వద్ద ఆర్టీసీ బస్సు దిగాడు. ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న సాయిరెడ్డికి ముగ్గురు యువకులు తారసపడ్డారు. ‘అంకుల్ మా ఫోన్లు స్విచ్ఛాఫ్ అయ్యాయి. ఫోన్ చేసుకుంటాం. ఒకసారి ఫోన్ ఇస్తారా’ అని అడగడంతో సాయిరెడ్డి ఇచ్చాడు. వెంటనే బైక్ స్టార్ట్‌చేసి ముగ్గురు యువకులు సెల్‌ఫోన్‌తో ఉడాయించారు. సమీపంలోని ఇంటికి పరుగెత్తుకెళ్లిన సాయిరెడ్డి ఇంట్లో బ్యాగ్ పెట్టి, బైక్ తీసుకుని యువకులను వెంబడించాడు. జమ్మికుంటలో వారిని పట్టుకున్నాడు. రూ.1000 ఇస్తే సెల్‌ఫోన్ ఇస్తామని ఆ యువకులు చెప్పారు. ఇవ్వననడంతో మరోసారి సాయిరెడ్డి కళ్లుగప్పి పరారయ్యారు. సాయిరెడ్డి హడావుడిగా బయటికి వెళ్లడం గమనించిన ఆయన భార్య ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడంతో కంగారుతో డయల్ 100ను సంప్రదించింది. వారినుంచి ఎలాంటి స్పందన రాలేదని తెలిపింది. కేశవపట్నం పోలీస్‌స్టేషన్‌కు శనివారం ఫిర్యాదు చేసేందుకు సాయిరెడ్డి వెళ్లాడు. వారు జమ్మికుంటలో ఫిర్యాదు చేయమన్నారని, జమ్మికుంట పోలీసులు కేశ వపట్నంలో ఫిర్యాదు చేయాలని అంటున్నారని తెలిపాడు. వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు యువకులకు తీవ్రగాయాలు ఓదెల(పెద్దపల్లి): వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల కథనం ప్రకారం.. కాల్వశ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామానికి చెందిన తెట్టె సురేశ్ గోపరపల్లిలో చేపట్టిన సీసీరోడ్డు పనులు చేసేందుకు వచ్చాడు. భోజన విరామ సమయంలో గోపరపల్లి నుంచి పెగడపల్లికి బైక్‌పై వెళ్తున్నాడు. ప్రమాదవశాత్తు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టాడు. తలపగిలి తీవ్రగాయాలు కావడంతో సుల్తానాబాద్‌లో ప్రాథమిక చికిత్స అనంతరం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. బైక్ అదుపుతప్పిన మరో ఘటనలో.. మడక గ్రామానికి చెందిన పోశారం సారంగపాణి బైక్‌పై పొత్కపల్లి నుంచి మడకకు వస్తున్నాడు. ఈక్రమంలో ప్రమాదవశావాత్తు బైక్ అదుపుతప్పి కిందపడ్డాడు. ఈ ఘటనలో చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. 108 సిబ్బంది సుల్తానాబాద్‌లోని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. -
ఒలింపియాడ్‌లో అల్ఫోర్స్ విద్యార్థులకు పతకాలు
కొత్తపల్లి: అల్ఫోర్స్ ఈ– టెక్నో పాఠశాల విద్యార్థులు జోనల్‌స్థాయి అంతర్జాతీయ సాంఘికశాస్త్ర ఒలింపియాడ్ పోటీల్లో బంగారు పతకాలను సాధించడంతో వారిని అల్ఫోర్స్ విద్య సంస్థల ఆధినేత వి.నరేందర్‌రెడ్డి శనివారం అభినందించారు. పాఠశాలకు చెందిన విద్యార్థులు బొంగోని కార్తికేయ, హరిశ్రీ హరిణి, ఎం.విఘ్నేష్చంద్ర, హిమేశ్చంద్ర బంగారు పతకాలను సాధించడం జరిగింది. టైనీటాట్స్లో గ్రాడ్యుయేషన్ డే అల్ఫోర్స్ టైనీటాట్స్ పాఠశాలలో శనివారం యూకేజీ విద్యార్థులకు గ్రాడ్యూయేషన్ డే నిర్వహించారు. అల్ఫోర్స్ విద్య సంస్థల ఆధినేత వి.నరేందర్‌రెడ్డి చిన్నారులకు పట్టాలు అందజేశారు. చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. -
నృసింహుని సన్నిధికి పోటెత్తిన భక్తులు
ధర్మపురి: ధర్మపురిలోని శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయం హనుమాన్ భక్తులతో శనివారం పోటెత్తింది. కొండగట్టు అంజన్నను దర్శించుకున్న భక్తులంతా లక్ష్మినృసింహస్వామి సన్నిధికి చేరుకున్నారు. హనుమాన్ చిన్నజయంతి సందర్భంగా స్వామి అనుబంధం శ్రీప్రసన్నాంజనేయ స్వామివారికి వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య ప్రత్యేక పూజలు చేశారు. హనుమాన్ భక్త భజన మండలి ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. నృసింహస్వామిని పలువురు నాయకులు దర్శించుకున్నారు. వీరిలో విశ్వహిందూ పరిషత్ తెలంగాణ ప్రాంత ఉపాధ్యక్షుడు రామ్‌సింగ్, ప్రాంత గోరక్ష టోలి సభ్యులు ఊట్కూరి రాధాకృష్ణరెడ్డి, వాయుపుత్ర విభాగ కార్యదర్శి జనార్ధన్‌రెడ్డి ఉన్నారు. -
ట్రాక్టర్ ఢీకొని పలువురికి గాయాలు
రామగిరి(మంథని): కల్వచర్ల గ్రామ పరిధిలో శనివారం ట్రాక్టర్, కారు ఢీకొన్న ఘటనలో పలువురికి గాయాలయ్యారు. ఎస్సై చంద్రకుమార్, స్థానికుల కథనం ప్రకారం.. మహదేవపూర్ మండల సూరారం గ్రామానికి చెందిన ములకల్ల ఆశాలు కుటుంబసభ్యులతో కలిసి కారులో కొండగట్టు వెళ్లి తిరిగి మహదేవపూర్ వెళ్తున్నాడు. కల్వచర్ల వద్ద లారీని ఓవర్టేక్ చేసే సమయంలో ఎదురుగా సెంటినరీకాలనీ నుంచి పెద్దపల్లి వెళ్తున్న బ్లేడ్ ట్రాక్టర్‌ను కారు ఢీకొట్టింది. దీంతో కారులోని ఆశాలు, భార్య సువర్ణ, కూతురు సుజాత, అల్లుడు రామకృష్ణకు స్వల్పగాయాలయ్యాయి. రామకృష్ణ తల్లి రమాదేవికి సైతం గాయాలయ్యాయి. 108 అంబులెన్స్‌లో పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తండ్రిని చంపిన తనయుడి రిమాండ్: సీఐ శ్రీనివాస్‌గౌడ్ ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఒడ్డెరకాలనీకి చెందిన కుంచెపు కనకయ్యను కర్రతో కొట్టి చంపి పరారీలో ఉన్న అతని తనయుడిని శనివారం పోలీసులు పట్టుకున్నారు. ఎల్లారెడ్డిపేట ఠాణాలో శనివారం కేసు వివరాలను సీఐ శ్రీనివాస్‌గౌడ్ వెల్లడించారు. టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా నిందితుడు కుంచెపు పర్శరాములు ఎల్లారెడ్డిపేటకు వచ్చినట్లు తెలుసుకుని గాలించామన్నారు. స్థానిక కొత్త బస్టాండ్ వద్ద సంచరిస్తున్నట్లు అందిన సమాచారంతో పట్టుకున్నట్లు తెలిపారు. తండ్రి మందలించాడని ఆవేశంతో కన్న తండ్రినే హత్య చేసిన నిందితుడిని పట్టుకొని విచారించగా.. తానే హత్య చేసినట్లు అంగీకరించాడన్నారు. వెంటనే రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. కేసు దర్యాప్తులో సహకరించిన ఎస్సై రమాకాంత్, సిబ్బందిని సీఐ అభినందించారు. భర్తకు అంత్యక్రియలు చేసిన భార్య ● క్షణికావేశంలో జైలులో కొడుకు ● ప్రాణాలు కోల్పోయిన భర్త ● ఒంటరైన మహిళ ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): కడుపున పుట్టిన కొడుకు వృద్ధాప్యంలో ఆసరాగా ఉంటాడనుకుంటే కాలయముడిగా మారి కన్నతండ్రి ప్రాణాలు తీసి జైలుపాలయ్యాడు. కట్టుకున్న భర్త అంత్యక్రియలు భార్య నిర్వహించిన ఘటన ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో శనివారం చోటుచేసుంది. ఎల్లారెడ్దిపేట మండల కేంద్రానికి చెందిన కుంచెపు కనకయ్య(50) శుక్రవారం కన్నకొడుకు పర్శరాములు చేతిలో హతమైన విషయం తెలిసిందే. తండ్రి మృతికి కారణమైన కుమారుడు కుంచెపు పర్శరాములును పోలీసులు జైలుకు పంపించారు. కనకయ్య అంత్యక్రియలను అతని భార్య దేవవ్వ నిర్వహించడంతో స్థానికులు కన్నీటిపర్యంతమయ్యారు. -
అపురూప శిల్పాలపై పట్టింపు కరువు
వేములవాడ: రాజన్న ఆలయ అనుబంధ భీమేశ్వరస్వామి గుడిలో ఏళ్లనాటి అపురూప శిల్పకళపై రాష్ట్ర దేవాదాయశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పురావస్తు పురావాస్తు పరిశీలకుడు నాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం భీమేశ్వరాలయంలోని మూలనపడేసిన శిల్పకళా రూపాలను స్థానిక చరిత్రకారుడు సంకెపల్లి నాగేంద్రశర్మతో కలసి పరిశీలించారు. 9వ శతాబ్దం నాటి గణేశ్, ఛాముండి, సప్తమాతలు, శివలింగాలు, నంది, కుబేర, జైన మహవీర, పార్శ్వనాథ శిల్పాలను ఆలయన ఆవరణలో పడేశారన్నారు. అపురూప శిల్పాలను కాపాడాల్సిన బాధ్యత దేవాదాయశాఖ అధికారులపై ఉందన్నారు. పురావస్తు పరిశీలకుడు నాగిరెడ్డి -
చల్గల్లో మామిడి కొనుగోళ్లు ప్రారంభం
జగిత్యాలఅగ్రికల్చర్: జగిత్యాల రూరల్ మండలంలోని చల్గల్ మామిడి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. వ్యాపారుల్లో కొందరు బహిరంగ వేలం ద్వారా.. మరికొందరు కమీషన్ ప్రతిపాదికన కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్ నిబంధనల ప్రకారం ప్రతి వ్యాపారి బహిరంగ వేలం ద్వారా కొనుగోలు చేయాలని మార్కెట్ అధికారులు చెపుతున్నప్పటికీ కొందరు వ్యాపారులు పట్టించుకోవడం లేదు. ఇటీవల మాజీమంత్రి జీవన్ రెడ్డితోపాటు రైతు సంఘం నాయకులు, మామిడి మార్కెట్లో బహిరంగ వేలం ద్వారా కొనుగోలు చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్‌కు వినతిపత్రం అందించారు. మార్కెట్ ప్రారంభమైనా విధివిధానాలు నిర్ణయించకపోవడంతో రైతులు, వ్యాపారులు ఆందోళనకు గురవుతున్నారు. రైతుల నుంచి వ్యాపారులు ఏమైనా కటింగ్‌లు చేస్తారా..? మార్కెట్ కమిటీకి వ్యాపారులు ఏ మేరకు మార్కెట్ ఫీజు చెల్లిస్తారు..? వంటి విషయాలు ఎవరికీ అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. బంగినపల్లికి కిలో రూ.35 నుంచి రూ.46 చల్గల్ మార్కెట్లో బంగినపల్లి మామిడికి కిలో రూ.35 నుంచి రూ.46 వరకు పలుకుతోంది. దశేరికి రూ.65 నుంచి రూ.70, హిమాయత్ రకానికి రూ.70 నుంచి రూ.80 వరకు పలుకుతోంది. చల్గల్ మార్కెట్‌కు 30 నుంచి 35 టన్నుల మామిడికాయలు వచ్చినట్లు వ్యాపారులు చెబుతున్నారు. -
మహనీయులను స్మరించుకోవాలి
కరీంనగర్‌సిటీ: మహత్ములను నిత్యం స్మరించుకుంటూ వారి సూచించిన బాటలో నడవాలని శాతవాహన యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఉమేశ్‌కుమార్ తెలిపారు. శాతవాహన విశ్వవిద్యాలయంలో మహనీయుల జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని గీతాభవన్ వద్ద మహాత్మా జ్యోతిబాపూలే పార్కు నుంచి యూనివర్సిటీ వరకు నిర్వహించిన ర్యాలీని శుక్రవారం ప్రారంభించారు. మహనీయుల త్యాగాలను గుర్తుచేసుకోవాలని సూచించారు. రిజిస్ట్రార్ ఆచార్య జాస్తి రవికుమార్ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ పూలే, అంబేడ్కర్ గొప్ప దార్శనికులన్నారు. ర్యాలీలో విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ, పీజీ కళాశాలల విద్యార్థులు, జాతీయ సేవా పథకం వలంటీర్లు, ఆల్ఫోర్స్, వాగేశ్వరీ, ఎస్సారార్, ఉమెన్స్ డిగ్రీ కళాశాల, సోషల్ వెల్ఫేర్, శ్రీ చైతన్య వివేకానంద, అక్షయ కళాశాల నుంచి అధ్యాపకులు ప్రోగ్రాం అధికారులు పాల్గొన్నారు. విశ్వవిద్యాలయం అధ్యాపకులు, ఓఎస్డీ టు వీసీ హరికాంత్, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సుజాత, సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ డా.జయంతి, డా. పద్మావతి, శ్రీవాణి, రంగప్రసాద్, అబ్రరూల్ బాఖీ వివిధ విభాగాల అధిపతులు అధ్యాపకులు పాల్గొన్నారు. ర్యాలీ సందర్భంగా యూనివర్సిటీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో తాగునీటికి విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతికథలాపూర్(వేములవాడ): కథలాపూర్‌కు చెందిన పల్లికొండ అజయ్(18) శుక్రవారం రాత్రి బైక్‌పై వెళ్తూ అదుపుతప్పి రోడ్డు పక్కన పడిపోవడంతో మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు. అజయ్ తన స్నేహితుడితో కలిసి కథలాపూర్ గ్రామం నుంచి గుండు పెరమాండ్ల ఆలయం వైపు బైక్‌పై వెళ్తున్నారు. గ్రామశివారులో రోడ్డు పక్కన బైక్‌తోపాటు పడిపోయాడు. తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మరో యువకుడికి గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం కోరుట్ల పట్టణంలోని ఆసుపత్రిలో చేర్పించారు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. అజయ్ బైక్‌ను ఏదైనా వాహనం ఢీకొట్టడంతో ప్రమాదానికి గురయ్యారా? లేక అదుపు తప్పి పడిపోయారా అనే విషయాలపై పోలీసులు, గ్రామస్తులు ఆరా తీస్తున్నారు. సీసీ పుటేజీలను పరిశీలించి కారణాలు తెలుసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. భ్రూణహత్యలో నలుగురిపై కేసుచందుర్తి(వేములవాడ): భ్రూణహత్యల ఘటనలో ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యం, ఆర్ఎంపీ,సదరు దంపతులపై శుక్రవారం కేసు నమోదైంది. డీఎంహెచ్‌వో రజిత తెలిపిన వివరాలు.. చందుర్తి మండలంలో విధులు నిర్వర్తిస్తున్న రేగుల రాజు భార్య నవ్యకు అబార్షన్ చేయించారు. ఇందుకు సహకరించిన మూడపల్లికి చెందిన ఆర్ఎంపీ అల్లె రాజు, అబార్షన్ చేసిన వేములవాడకు చెందిన నందిని ఆస్పత్రి యాజమాన్యంపై డీఎంహెచ్‌వో వేములవాడ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మాతృమూర్తి మనోవేదన కట్టుకున్న భర్త మాటలు నమ్మి ఆ ఇల్లాలు ఐదు నెలల గర్భాన్ని తీయించుకుంది. భార్య కడుపులో పెరుగుతున్న శిశువుకు అవయవాలు పూర్తిగా రాలేదని, అంగవైకల్యంతో జన్మింఏ అవకాశం ఉందని నమ్మించిన భర్త ఆమెను అబార్షన్‌కు ఒప్పించాడు. భర్త మాటలు నమ్మి అబార్షన్ చేయించుకుంది. ఇప్పుడు ఆ మాతృమూర్తికి గర్భశోకంతోపాటు కేసు నమోదుకావడంతో ఆ తల్లి మనోవేదనకు అంతులేకుండా పోయింది. భార్యను వేధించిన భర్తకు ఏడాది జైలుఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): అదనపు వరకట్నం కోసం భార్యను వేధించిన భర్తకు ఏడాది జైలుశిక్ష విధిస్తూ సిరిసిల్ల మొదటి అదనపు ప్రథమశ్రేణి న్యాయమూర్తి కె.సృజన శుక్రవారం తీర్పు వెల్లడించినట్లు ఎస్సై రమాకాంత్ తెలిపారు. మండలంలోని పోతిరెడ్డిపల్లికి చెందిన అడిగే మాధవికి చిన్నబోనాలకు చెందిన పడిగే తిరుపతితో 2007లో వివాహమైంది. ఆ సమయంలోనే రూ.4లక్షలు నగదు, ఐదు తులాల బంగారం, 30 తులాల వెండి, ఇతర సామగ్రి వరకట్నంగా ముట్టజెప్పారు. తర్వాత కొద్ది రోజులకు అదనపు వరకట్నం కోసం తిరుపతితోపాటు అత్తమామలు వేధించారు. వేధింపులు భరించలేక తల్లి గారింటికి రాగా.. భర్త తిరుపతి మరొకరిని పెళ్లి చేసుకున్నాడు. దీంతో మాధవి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన జడ్జి.. నిందితుడు తిరుపతికి ఏడాది జైలు, రూ.వేయి జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు ఎస్సై వివరించారు. -
సన్నద్ధం.. సందిగ్ధం
● గ్రామాల్లో సమ్మర్ క్యాంపులకు సై ● క్రీడాశాఖ ఆధ్వర్యంలో నిర్వహణకు శ్రీకారం ● పట్టణాల్లో నగరపాలక, మున్సిపల్ ఆధ్వర్యంలో సందిగ్ధంకరీంనగర్ స్పోర్ట్స్: పాఠశాల విద్యా సంవత్సరం ముగుస్తోంది. త్వరలో సెలవులు ప్రకటించనున్నారు. వేసవి సెలవుల్లో తల్లిదండ్రులతో పాటు పిల్లలు సైతం ఏదేని క్రీడలో తర్ఫీదు పొందాలని ఆసక్తి చూపుతుంటారు. ఇలాంటి వారికి సమ్మర్ క్యాంపులు ఉపయుక్తంగా ఉంటున్నాయి. 2025 ఏడాదిలో సమ్మర్ క్యాంపు నిర్వహణకు ఉమ్మడి జిల్లా క్రీడాశాఖ శ్రీకారం చుట్టింది. అయితే కరీంనగర్, రామగుండం నగరపాలకతో పాటు జగిత్యాల, సిరిసిల్ల మున్సిపాలిటీల్లో ఆ ఊసే లేకపోవడం గమనార్హం. మే 1 నుంచి క్రీడాశాఖల ఆధ్వర్యంలో.. జిల్లా యువజన, క్రీడాశాఖల ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంప్‌లు నిర్వహించడానికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఉత్తర్వులు జారీ చేసింది. మే 1 నుంచి 31వరకు వేసవి శిబిరాలు నిర్వహించాలని ఆదేశించింది. ఆయా జిల్లాల్లోని పాపులారిటీ ఉన్న క్రీడాంశాల్లో ఎంపిక చేసిన 10 గ్రామీణ ప్రాంతాల్లో శిక్షణనివ్వాలని సూచించింది. పీఈటీలకు నెల రోజుల శిక్షణ కాలానికి గౌరవ వేతనం కింద రూ.4వేలు ఇవ్వనున్నారు. పట్టణాల్లో ఊసేలేదు! క్రీడాశాఖ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో శిక్షణ శిబిరాలు నిర్వహిస్తుండగా.. అర్బన్ ప్రాంతాల్లో ఊసే లేకుండా పోయింది. వారం రోజుల్లో పాఠశాల విద్యా సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో కరీంనగర్ నగరపాలక సంస్థ, రామగుండం నగరపాలక సంస్థ, సిరిసిల్లలో ఎలాంటి సన్నాహాలు ప్రారంభించడం లేదు. జగిత్యాలలో ఈసారైనా సమ్మర్ క్యాంపు నిర్వహించాలని పలువురు తల్లిదండ్రులు, క్రీడా విశ్లేషకులు కోరుతున్నారు. ఆయా బల్దియాల్లో పాలకవర్గం పదవీకాలం ముగియగా.. ప్రత్యేకాధికారులు ఈ విషయమై చొరవ తీసుకోవాలని సూచిస్తున్నారు.క్రీడాశాఖ ఆధ్వర్యంలో దరఖాస్తులు ఇలా..జిల్లా చివరి తేదీ రాజన్న సిరిసిల్ల ఈ నెల 18 జగిత్యాల ఈ నెల 19 కరీంనగర్ ఈ నెల 20 పెద్దపల్లి ఈ నెల 22 -
‘సుస్థిరం’.. గండ్రపల్లి గ్రామం
జమ్మికుంట: రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనలో జిల్లాలోని జమ్మికుంట మండలం గండ్రపల్లి గ్రామపంచాయతీ పని తీరు సుస్థిరంగా నిలిచింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వల బృందాలు సందర్శించి నివేదికలు అందజేశాయి. ఫలితంగా సుస్థిర గ్రామ అభివృద్ధి లక్ష్య సాధనలో అత్యంత ప్రతిభ కనబరిచిన గండ్రపల్లి జిల్లాలో రెండవదిగా నిలి చింది. రాష్ట్రంలో 11వ స్థానంలో 80.19 శాతం మార్కులు దక్కించుకుంది. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ గణాంకాల్లో రాష్ట్రంలోని 25 పంచాయతీల్లో ప్రత్యేక స్థానం సాధించింది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు పేదరికం లేని వ్యవస్థ నిర్మాణం, ఆహార భద్రత్ర, పరిశుభ్రమైన నీరు, పారిశుధ్యం, ఆరోగ్యం, నాణ్యమైన విద్య, లింగ సమానత్వం, ఆర్థిక అభివృద్ధి, అసమానతలు తగ్గించడం తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి కృషి చేశారు. 2022–23, 2023–24 సంవత్సరంలో విధులు నిర్వహించిన పంచాయతీ కార్యదర్శి ఝాన్సి జిల్లా అధికారుల అభినందనలు, శుభాకాంక్షలు పొందారు. నిధుల సద్వినియోగం గండ్రపల్లిలో 2022–23, 2023–24 సంవత్సరంలో సుస్థిరమైన అభివృద్ధికి గ్రామ పంచాయతీ అధికారి, సర్పంచ్, పాలక వర్గంతోపాటు గ్రామస్తుల సహకారం ఎంతో కీలకంగా పని చేశాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను సమర్థవంతంగా ప్రజలకు చేరేలా కృషి చేశారు. గండ్రపల్లి వివరాలు..గ్రామ జనాభా 1,566 గృహాలు 476 పురుషులు 796 మహిళలు 770 తాగునీటి కనెక్షన్లు 469 రేషన్‌కార్డులు 476 పెన్షన్‌దారులు 219 ఉపాధి జాబ్‌కార్డులు 501 ఎస్‌హెచ్‌జీ గృహాలు 26 బ్యాంక్ లోన్ తీసుకున్న సంఘాలు 14 గ్యాస్ కనెక్షన్లు 459 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు సద్వినియోగం అత్యుత్తమ ప్రతిభతో 80.19శాతం మార్కులు కేంద్ర, రాష్ట్ర బృందాల సందర్శన, నివేదికలులక్ష్యం దిశగా కృషి ప్రభుత్వ నిధులు, సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకొని, ప్రజలకు మౌలిక వసతులు కల్పిస్తాం. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజల సహాయ సహకారాలతో వంద శాతం సుస్థిర అభివృద్ధి లక్ష్యం దిశగా కృషి చేస్తూ ముందుకు సాగుతాం. – వెంగల రాములు, పంచాయతీ కార్యదర్శి, గండ్రపల్లి నిధులు సద్వినియోగం ప్రభుత్వ నిధులు సద్వినియోగం చేసుకొని గ్రామ అభివృద్ధికి కృషి చేశాం. రానున్న రోజుల్లో వందశాతం మెరుగైన అభివృద్ధికి సహకారం అందిస్తాం. – బల్మూరి పద్మసమ్మారావు, మాజీ సర్పంచ్, గండ్రపల్లి -
రూ.13.67కోట్లకు తలనీలాల టెండర్
● రూ.5.34 కోట్లకు తగ్గిన రాజన్న ఆదాయం ● గత టెండర్ రూ.19.01 కోట్లు ● కమిషనర్‌కు నివేదిక సమర్పించిన ఆలయ అధికారులు ● టెండర్లో 33వ నిబంధనతో కాంట్రాక్టర్‌కు మేలువేములవాడ: రాజన్నకు భక్తులు సమర్పించుకునే తలనీలాలు సేకరించుకునేందుకు రెండేళ్ల కాలపరిమితితో శుక్రవారం నాలుగోసారి టెండర్ నిర్వహించినట్లు ఆలయ ఈవో వినోద్‌రెడ్డి తెలిపారు. ఆన్లైన్లో ఇద్దరు, బహిరంగ వేలం పాటలో ఇద్దరు పాల్గొన్నారు. ఇందులో బహిరంగ వేలంపాటకు హాజరైన కళావతి ఎంటర్ ప్రైజేస్, నాగకుమారి ఎంటర్ప్రైజేస్ పాట పాడలేకపోయారు. తమిళనాడు కు చెందిన దొరై ఎంటర్ ప్రైజేస్, కేఎం ఎంటర్ప్రైజేస్లు ఆన్లైన్లో వేలంలో పాల్గొన్నారు. ఇందులో రూ.13.67 కోట్లకు దొరై ఎంటర్ప్రైజేస్ హెచ్చుపాటదారుడిగా నిలిచారు. దీనిపై ఆలయ అధికారులు రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్‌కు నివేదిక సమర్పిస్తున్నట్లు ఈవో తెలిపారు. కమిషనర్ ఆదేశాలతో సదరు టెండర్ ఫైనల్ చేస్తామని స్పష్టం చేశారు. గతంలో కంటే తక్కువ.. ఏప్రిల్ 11తో ముగిసే కాంట్రాక్ట్ వేలం గతంలో రూ.19.01కోట్లకు నిలిచిన విషయం తెలిసిందే. ఈసారి వచ్చిన వేలంలో రూ.13.67కోట్లు హెచ్చుపాట వద్ద నిలిచిపోవడంతో రాజన్న ఆదాయానికి రూ.5.34 కోట్లు ఎసరు పడనున్నట్లు తెలుస్తోంది. అయితే గత కాంట్రాక్టర్ డబ్బులు చెల్లించుకుండా కాలయాపన చేయడం, ఆలయ అధికారులే తలనీలాలు పోగుచేయడం కొనసాగింది. ఈ నేపథ్యంలో స్పెషల్ పర్మిషన్ ఇచ్చేసి సదరు కాంట్రాక్టర్‌కు జూన్ వరకు చెల్లింపులకు అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. ఇక శుక్రవారం జరిగిన తలనీలాల టెండర్‌పై కమిషనర్ ఏ మేరకు స్పందిస్తారో వేచి చూడాల్సింది. ఒకవేళ రూ.13.67కోట్లు హెచ్చుపాటను ఒప్పుకుంటే రాజన్నకు రూ.5.34కోట్ల ఆదాయం తగ్గింది. టెండర్లో 33వ నిబంధన ఇదీ.. ఈసారి టెండర్ నిర్వహించే క్రమంలో 33వ నిబంధనలో భాగంగా అధికారులు కాంట్రాక్టర్‌కు పలు సూచనలిచ్చారు. ఆలయ విస్తరణ పనులు చేపట్టనున్న క్రమంలో ఎప్పుడైనా భీమేశ్వరాలయంలోకి దర్శనాలు కొనసాగించే అవకాశాలు ఉంటాయని.. ఈక్రమంలో రూ.13.67కోట్ల టెండర్ ప్రకారం ఏరోజు వరకు రాజన్న గుడి వద్ద తలనీలాల సేకరించారో అదే రోజు వరకు లెక్కలేసుకునే సౌలభ్యం కల్పించారు. ఒకవేళ భీమేశ్వరాలయంలో కల్యాణకట్ట ఏర్పాటు చేసి అవకాశం కల్పిస్తే సదరు కాంట్రాక్టర్‌కు ఇష్టమైతే ఉండొచ్చు లేదా తప్పుకోవచ్చనే నిబంధన పెట్టారు. దీంతో తలనీలాల టెండర్‌కు ఆదాయం తగ్గినట్లు కనిపిస్తోంది. ఈ సౌలభ్యాన్ని కాంట్రాక్టర్ తెలివిగా వినియోగించుకుని రాజన్న ఆదాయానికి గండికొట్టే ప్రమాదం లేకపోలేదని స్థానిక నాయీబ్రాహ్మణులు చర్చించుకుంటున్నారు. -
నేడు బీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా ముఖ్యనేతల సమావేశం
కొత్తపల్లి(కరీంనగర్): చింతకుంటలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావుతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల సమావేశం నిర్వహిస్తున్నట్లు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వెల్లడించారు. చింతకుంటలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని శుక్రవారం మాజీ ఎంపీ బి.వినోద్‌కుమార్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మాజీ జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు తదితరులతో కలిసి సందర్శించారు. పార్టీ సమావేశానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని నిర్వాహకులకు సూచించారు.సింగిల్ విండో చైర్మన్ వీర్ల వేంకటేశ్వర్రావు, కొత్తపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ రుద్ర రాజు, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్లు పొన్నం అనిల్ కుమార్ గౌడ్, ఏనుగు రవీందర్ రెడ్డి, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, మాజీ వైస్ ఎంపీపీ తిరుపతి నాయక్, మాజీ కార్పొరేటర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
నేరెళ్ల ఘటనపై ఎస్సీ కమిషన్‌ను తప్పుపడతారా?
● తక్షణమే దుష్ప్రచారం నిలిపేయండి ● లేనిపక్షంలో చర్యలు తప్పవు ● జాతీయ ఎస్సీ కమిషన్ హెచ్చరికసిరిసిల్ల/కరీంనగర్‌టౌన్: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం నేరెళ్లలో 2017లో జరిగిన ఘటనపై జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు వడ్డెపల్లి రామచందర్ స్పందించారు. నేరెళ్ల ఘటనపై కొందరు సోషల్ మీడియా వేదికగా జాతీయ ఎస్సీ కమిషన్‌ను బద్నాం చేస్తున్నట్లు తెలుసుకున్న కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రామచందర్ శుక్రవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. దళితుల పక్షాన పనిచేసే ఎస్సీ కమిషన్‌ను దుష్ప్రచారం చేయడాన్ని నిలిపివేయాలని, లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నేరెళ్ల ఘటనలో ఎస్సీ కమిషన్ చేపట్టిన విచారణతోపాటు ప్రభుత్వానికి పంపిన మధ్యంతర నివేదికను విడుదల చేశారు. బాధితులకు న్యాయం జరిగేలా, బాధ్యులపై చర్యలు తీసుకునేలా నివేదిక రూపొందించిన విషయాన్ని గుర్తుచేశారు. నేరేళ్ల గ్రామంలో విచారణ చేపట్టడంతోపాటు కరీంనగర్ జైలుకు వెళ్లి బాధితులను కలిసి స్టేట్మెంట్ రికార్డు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అప్పటి కలెక్టర్, పోలీసు అధికారుల స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసినట్లు స్పష్టం చేశారు. 2017 ఆగస్టు 7న అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మధ్యంతర నివేదికలోని ఐదు ప్రధాన అంశాలను సైతం బహిర్గతం చేశారు. ఈ ఘటనపై హైలెవల్ కమిటీ ఏర్పాటు చేయాలని, అప్పటి ఎస్పీని బదిలీ చేయాలని, సంబంధిత డీఎస్పీ, సీఐ, ఎస్ఐలను విచారణ పూర్తయ్యే వరకు సస్పెండ్ చేయాలని, బాధితులకు పూర్తి వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించాలని, ఒక్కో బాధితుడికి రూ.5లక్షల పరిహారం అందించాలని నివేదికలో స్పష్టం చేసినట్లు రామచందర్ వివరించారు. జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ బాధ్యతాయుతంగా పనిచేస్తుంటే.. తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు. -
ఏసీబీకి చిక్కిన ట్రెజరీ ఉద్యోగి● రూ.7వేలు తీసుకుంటూ పట్టుపడిన సీనియర్ అకౌంటెంట్ రఘు
జగిత్యాల: కలెక్టరేట్ సముదాయంలోని ట్రెజరీ కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ దాడులు జరిగాయి. రూ.7వేల లంచం తీసుకుంటూ ట్రెజరీ సీనియర్ అకౌంటెంట్ అరిగె రఘుకుమార్ పట్టుపడ్డాడు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి వివరాల ప్రకారం.. ఓ ప్రభుత్వశాఖలో పనిచేసే ఉద్యోగి లోను కోసం కంట్రిబ్యూటరీ పెన్షన్స్కీంలో దరఖాస్తు చేసుకున్నాడు. రూ.1.04 లక్షలు మంజూరు కాగా.. చెల్లించడం సైతం జరిగింది. అయితే ట్రెజరీలో సీనియర్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న అరిగె రఘుకుమార్ ఆ వ్యక్తికి తరుచూ ఫోన్ చేసి రూ.7 వేలు డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీబీ అధికారుల సూచన మేరకు శుక్రవారం 11గంటలకు డబ్బులు ఇస్తానని రఘుతో చెప్పాడు. ఉదయం 10 గంటల సమయంలో ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో బృందం కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకున్నారు. సదరు ఉద్యోగి నుంచి రఘుకుమార్ తన కార్యాలయంలో రూ.7వేలు తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి కరీంనగర్ తరలించారు. యువకుడిపై పోక్సో కేసు ఎలిగేడు(పెద్దపల్లి): మండలంలోని ఓ గ్రామంలో బాలికపై అత్యాచార యత్నం కేసులో నిందితుడు నవదీప్‌పై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై సనత్‌కుమార్ తెలిపారు. గ్రామాని కి చెందిన దంపతులు తమ చిన్నారిని ఇంటి వ ద్ద వదిలి పనులకు వెళ్లారు. ఒంటరిగా ఉన్న బాలికకు మాయమాటలు చెప్పిన యువకుడు.. అత్యాచారానికి యత్నించగా భయపడి ఇంటికి పరుగులు తీసింది. తల్లిదండ్రులు వ చ్చాక విషయం చెప్పింది. దీంతో తల్లిదండ్రు లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు ఎస్సై గ్రామంలో శుక్రవారం విచారణ జరిపా రు. నిందితుడి సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకుని, పోక్సో కేసు నమోదు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. -
మా పొట్ట కొట్టొద్దు
రాజస్థాన్, గుజరాత్ నుంచి వచ్చిన హోల్‌సేల్ వ్యాపారులు మా పొట్టకొడుతున్నారని కరీంనగర్‌కు చెందిన మొబైల్ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం మొబైల్ టెక్నిషియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నపూర్ణ కాంప్లెక్స్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల వ్యాపారులు మొబైల్ వస్తువులు, జీరో రసీదులు ఇస్తూ స్థానిక వ్యాపారులకు అన్యాయం చేస్తున్నారన్నారు. నిరసనలో సీపీఎం నగర కార్యదర్శి సత్యం, కరీంనగర్ సెల్యూలర్–టెక్నీషియన్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎండీ అజ్మత్ అలీ, శ్రీనివాస్, సెల్యులర్ రిటైల్ అండ్ టెక్నిషియన్ అసోసియేషన్ సభ్యులు చిరంజీవి చారి, సతీశ్, రాజ్ కుమార్, శ్రీనివాస్, అక్బర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. – విద్యానగర్(కరీంనగర్) -
బీఆర్ఎస్ 25 ఏళ్ల సభ విజయవంతం చేయాలి
● కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్‌కుమార్ ● మానేరు రివర్ ఫ్రంట్‌కు నిధులివ్వాలి ● కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్కరీంనగర్కల్చరల్: బీఆర్ఎస్ స్థాపించి 25 ఏళ్లను పురస్కరించుకొని ఈనెల 27న ఎల్కతుర్తిలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు మాజీ ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు. శుక్రవారం నగరంలోని ప్రతిమ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. 25 ఏళ్ల పార్టీ వైభవాన్ని, కోట్లాది మంది ప్రజల ఆదరాభిమానాలను స్మరించుకుంటూ ఈ సభను నిర్వహిస్తున్నామన్నారు. ఎల్కతుర్తిలో సభ కోసం రైతులు 1,200 ఎకరాల భూమిని స్వచ్ఛందంగా ఇచ్చారని అన్నారు. గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పర్యాటక అభివృద్ధిపై కనీస శ్రద్ధ చూపడం లేదన్నారు. ఆర్టీసీ నుంచి పెద్దఎత్తున బస్సులు బుక్ చేసి డబ్బులు చెల్లించామని వివరించారు. ఉమ్మడి జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు బస్సులిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జెడ్పీ మాజీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణ రావు, నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ తదితరులున్నారు. -
ఆ ఉపాధ్యాయుడు మాకొద్దు
విద్యార్థులు, మధ్యాహ్నభోజన సిబ్బందిని ఇబ్బందులకు గురిచేస్తున్న ఆ ఉపాధ్యాయుడు మాకొద్దంటూ స్టూడెంట్స్, తల్లిదండ్రులు, గ్రామస్తులు శుక్రవారం పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టారు. గన్నేరువరం మండలం మైలారం గ్రామ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడు పాఠాలు చెప్పకుండా నిద్రపోతున్నారని, ఇదేమిటని ప్రశ్నిస్తే పిల్లలను చితకబాదుతున్నారని ఆరోపించారు. ఈ విషయమై ఉపాధ్యాయుడి వివరణ కోరగా పరిసరాల పరిశుభ్రత ఉండడంలేదని, మోను ప్రకారం మాధ్యాహ్న భోజనం అందడంలేదన్నారు. టీచర్లు సమయపాలన పాటించడం లేదని.. దీనిని ప్రశ్నించినందుకే విధులకు ఆటంకం కలిగిస్తున్నారని తెలిపారు. ఆరోపణలు నిజం కాదన్నారు.– గన్నేరువరం -
కారా? కమలమా?
● క్లియరెన్స్ వస్తే పార్టీ జంప్ ● కాంగ్రెస్‌కు మాజీ కార్పొరేటర్లు గుడ్‌బై?కరీంనగర్ కార్పొరేషన్: గత పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరిన పలువురు మాజీ కార్పొరేటర్లు పక్క చూపులు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై నారాజుతో ఉన్న వీళ్లలో కొందరు పార్టీని వీడేందుకు సమాయత్తమవుతున్నారు. నగరపాలకసంస్థ ఎన్నికలకు ముందుగానే బెర్త్ ఖాయం చేసుకునేందుకు బీఆర్ఎస్, బీజేపీల వైపు చూస్తున్నారు. ఇప్పటికే ఆయా పార్టీల నేతలతో టచ్‌లో ఉంటున్నారు. కాంగ్రెస్‌పై నారాజ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా 11 మంది అప్పటి కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్కు రాజీనామాచేసి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో మూడు రంగుల జెండా అందుకున్నారు. రాష్ట్రంలో అధికార పార్టీగా నగరపాలకసంస్థలో ఆధిపత్యం తమదే అనుకున్న సదరు కార్పొరేటర్ల భ్రమలు కొద్దిరోజుల్లోనే తొలగిపోయాయి. పాలకవర్గం ముగిసి ప్రత్యేకాధికారి పాలనలోనూ పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించలేదు. పార్టీ నాయకత్వం తమను పట్టించుకున్నట్లుగా కనిపించలేదు. పైగా కరీంనగర్ పార్టీలో ఉన్న వర్గపోరు మాజీ కార్పొరేటర్లను మరింత ఇబ్బందికి గురిచేసింది. తాము అనుకున్నది జరగకపోవడం, పార్టీ పరిస్థితి అంతంతమాత్రంగా ఉండడం, భవిష్యత్‌పై బెంగ.. తదితర కారణాలతో పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. 11 మందిలో కనీసం సగం మంది కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌ను వీడడం ఖాయమని, బీజేపీలోకి వెళ్లాలని తమ డివిజన్ వాసులు ఒత్తిడి తెస్తున్నారని ఓ మాజీ కార్పొరేటర్ ‘సాక్షి’ కి వెల్లడించారు. త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. క్లియరెన్స్ వస్తే... కాంగ్రెస్‌ను వీడేందుకు సిద్ధమైన మాజీ కార్పొరేటర్లు బీఆర్ఎస్, బీజేపీలో ఏదో ఒక పార్టీలో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో కొంతమంది బీఆర్ఎస్, మరికొంత మంది బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. మొత్తంగా కార్పొరేషన్ ఎన్నికల్లో తమకు టికెట్లపై భరోసా ఇచ్చే పార్టీలోకి చేరేందుకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌కు ఈ మేరకు మాజీ కార్పొరేటర్లు ప్రతిపాదనలు పెట్టగా, ఇప్పట్లో ఎన్నికలు లేవు కదా వచ్చాక చూద్దామని వాయిదా వేసినట్లు విశ్వసనీయ సమాచారం. అదేవిధంగా ఒకప్పటి సహచర కార్పొరేటర్ అయిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వైపు మరికొంతమంది మొగ్గు చూపుతున్నారు. పాత పరిచయాలతో తమకు ప్రాధాన్యం ఉంటుందని, నగరంలో బీజేపీ పుంజుకునే అవకాశం ఉంటుందనే ఆలోచనతో కాషాయ నేతలతోనూ టచ్‌లో ఉన్నారు. నగర రాజకీయాల్లో ఆరితేరిన ఈ ఇద్దరు నేతల్లో ఎవరు క్లియరెన్స్ ఇస్తే ఆ పార్టీలో చేరేందుకు మాజీ కార్పొరేటర్లు రంగం సిద్ధం చేసుకొంటున్నారు. -
పూలే ఆశయాలు కొనసాగించాలి
శనివారం శ్రీ 12 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలు కొనసాగించాలని పలువురు వక్తలు కోరారు. శుక్రవారం శాతవాహన వర్సిటీ చౌరస్తాలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతి, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, అడిషనల్ కలెక్టర్లు ప్రపుల్ దేశాయ్, లక్ష్మీకిరణ్ సహా పలువురు బీసీ సంఘాల నేతలు, అధికారులు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారి అనిల్ ప్రకాశ్, పలువురు బీసీ సంఘాల నేతలు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. – కరీంనగర్ -
ఆన్లైన్ స్లాట్ బుకింగ్ రద్దు చేయాలె
భూముల రిజిస్ట్రేషన్ కోసం ఆన్లైన్ స్లాట్ బుకింగ్ రద్దు చేయాలని డాక్యుమెంట్ రైటర్లు డిమాండ్ చేశారు. గంగాధర సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రిజిస్ట్రేషన్ వ్యవస్థను డిజిటలైజేషన్ చేయడంతో వేలాది మంది డాక్యుమెంటు రైటర్లు జీవనోపాధి కోల్పోతామన్నారు. ధరణి సమస్యలే ఇప్పటికి పరిష్కారం కాలేదన్నారు. నిరసనలో డాక్యుమెంట్ రైటర్లు తోట చంద్రయ్య, గంట కిషన్, రమేష్, సూర్యప్రతాప్, కమలాకర్ ,ప్రతాప్, అనిల్, అచ్యుత్, శ్రీనివాస్, మహేశ్, హరీశ్, యోనా, రాజశేఖర్, రఘు, తిరుపతి, గగన్ తదితరులు పాల్గొన్నారు. – గంగాధర -
భూ మాఫియా!
మళ్లీ నిద్రలేచిన● సిటీలో అన్ని రకాల ఇండ్లు కూల్చబడును! ● రివాజుగా మారుతున్న నిర్మాణాల కూల్చివేత ● కోర్టులు, పోలీసులను లెక్క చేయని నిందితులు ● పాత సీపీ ఉన్నంత కాలం చప్పుడు లేని భూపంచాయితీలు ● ఆయా కేసుల్లో వివాదాలు మళ్లీ తెరపైకిసాక్షిప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్.. స్మార్ట్ సిటీగా రాష్ట్రంలో మంచిపేరు సంపాదించింది. అలాగే, ఐటీలో ద్వితీయ శ్రేణి నగరంగా ఇప్పుడిప్పుడే ఎదుగుతోంది. రోజురోజుకూ నలుచెరుగులా విస్తరిస్తోంది. త్వరలో రింగ్‌రోడ్డు కూడా రాబోతోంది. ఇదంతా నాణేనికి ఒకేవైపు.. నగరంతోపాటు భూవివాదాలు కూడా రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. వివాదా లు పోలీసుస్టేషన్‌కి వెళ్లడం లేదా బాధితులు జిల్లా కోర్టులు, హైకోర్టును ఆశ్రయించడం ఒక పద్ధతి. కానీ, వివాదాలు తలెత్తిన వెంటనే.. బలమున్న వారు ఆ ఇంటిని లేదా నిర్మాణాన్ని కూల్చివేయడం ఆనవాయితీగా వస్తోంది. గతంలో 2022లో మొదలైన ఈ ఆచారం మధ్యలో సీపీ మహంతి కాలంలో సుప్తావస్తకు చేరింది. భూవివాదాలపై ఆయన ఉక్కుపాదం మోపిన తీరుకు అంతా సర్దుకుంది. కా నీ, ఇపుడు తిరిగి భూ వివాదాలు నిద్రలేస్తుండడం బాధితుల్లో కలవరపాటుకు కారణమవుతోంది. గతంలోనూ సంచలన ఘటనలు.. 2022లో కరీంనగర్ సీతారాంపూర్‌లో నిర్మాణంలో ఉన్న మూడు ఇళ్లను కూల్చిన ఘటన కలకలం రేపింది. ఘటనాస్థలాన్ని అప్పటి సీపీ, కలెక్టర్ ఘటనాస్థలాన్ని సందర్శించారు. వివాదం చెలరేగితే పంతం నెగ్గించుకునేందుకు ఇళ్లను బుల్డోజర్లు వేసుకుని వెళ్లి మరీ.. అర్ధరాత్రి నేలమట్టం చేసిన తీరు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అప్పటి నుంచి అదేదుర్ఘటన మిగిలిన వారికీ మార్గదర్శంగా మారడం దురదృష్టకరం. తర్వాత తీగలగుట్టపల్లిలో ఓ వైద్యుడి ఇంటి స్థలం విషయంలో వివాదం చెలరేగింది. రాత్రిపూట బుల్డోజర్తో వచ్చి.. కూల్చివేయడం కలకలంరేపింది. ఆ తర్వాత కూడా అదేప్రాంతంలో కడుతున్న ఇంటిని సుత్తెలతో మోది ధ్వంసం చేశారు. అనంతరకాలంలో సీపీ మహంతి రావడంతో పరిస్థితులు మారిపోయాయి. భూవివాదాలపై ఆయన ప్రత్యేక దృష్టి సారించి, పలువురిని అరెస్టు చేయడంతో కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. కానీ, ఇటీవల మహంతి ఇక్కడ నుంచి బదిలీపై వెళ్లిపోవడంతో భూవివాదాలు మళ్లీ తెరపైకి వస్తున్నాయి. ఆయన హయాంలో కేసులు నమోదు అయినా ఘటనల్లో బాధితులు, నిందితుల మధ్య ఘర్షణ పూరిత వాతావరణం నెలకొంటోంది. తాజాగా మరోఇల్లు.. వల్లంపహాడ్‌లో తాజాగా కొందరు రాత్రిపూట వచ్చి ఓ నిర్మాణాన్ని ధ్వంసం చేయడానికి యత్నించారు. వారిచర్యతో నిర్మాణం చాలావరకు దెబ్బతింది. ఈ పరిణామంతో బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. ఈ వివాదంపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయని, కోర్టులోనూ వివాదం కొనసాగుతోందని బాధితుడు సాంబమూర్తి ‘సాక్షి’కి తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో తన భూమిలోకి వచ్చి.. తన ఇంటిని ధ్వంసం చేయడం ఏమిటని వాపోయారు. భూవివాదాలపై పోలీసుల విచారణ, కోర్టులో కేసులు నడుస్తుండగా.. ఇలా స్వయంగా వచ్చి ఎవరికివారు నిర్మాణాలు కూల్చడంపై నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
అశ్వవాహనంపై సీతారామచంద్రస్వామి
ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామి వారు అశ్వవాహనంపై ఊరేగారు. శేషం వంశీధరచార్యులు వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య సన్నాయిడోలు వాయిద్యాల మధ్య ఉత్సవమూర్తులను పూలతో అలంకరించగా...స్వామివారు మాడవీధుల గుండా ఊరేగారు. భక్తులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఇంగిలే రామారావు, ఇన్చార్జి ఈవో కందుల సుధాకర్, కడారి కుమారస్వామి, ధర్మకర్తలు మల్లేశ్, గోపాల్‌రెడ్డి, భక్తులు పాల్గొన్నారు. – ఇల్లందకుంట -
శుక్రవారం సభలో సమస్యలు పరిష్కారం
● జిల్లా సంక్షేమ అధికారి సబిత కరీంనగర్‌రూరల్: మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు శుక్రవారం సభ వేదికగా నిలుస్తుందని జిల్లా సంక్షేమ అధికారి సబిత అన్నారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో కరీంనగర్ మండలం జూబ్లీనగర్‌లో శుక్రవారం సభను నిర్వహించారు. మహిళలు తమ సమస్యలు తెలిపితే పరిష్కరించే అవకాశముందన్నారు. గర్భిణిలు, బాలింతలు, మహిళలు తప్పనిసరిగా సభకు హాజరు కావాలన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి వెంకట రమణ మాట్లాడుతూ.. ఆరోగ్య మహిళా కార్యక్రమంలో 50 రకాల వైద్యపరీక్షలను మహిళలకు ఉచితంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అనంతరం అంగన్వాడీలోని చిన్నారులకు అన్నప్రాసన చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో సంజీవరావు, డీఐవో సాజీదా, ఎంఈవో రవీందర్, వైద్యాధికారి మనోహర్, ఐసీడీఎస్ సూపర్వైజరు నిర్మల, డీపీఏ రోమిలా,బీసీ సతీష్, సఖి సెంటర్ ఇన్చార్జి లక్ష్మి, చైల్డ్‌లైన్ సంపత్, ప్రధానోపాధ్యాయురాలు జలజరాణి, పంచాయతీ కార్యదర్శి రమాదేవి, అంగన్వాడీ టీచరు స్వరూపరాణి తదితరులు పాల్గొన్నారు. పత్తి మార్కెట్‌కు మూడురోజులు సెలవుజమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ పత్తిమార్కెట్‌కు శని, ఆది, సోమవారం సెలవు ఉంటుందని ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేశం, గ్రేడ్–2 కార్యదర్శి రాజాలు తెలిపారు. శుక్రవారం క్వింటాల్ పత్తి రూ.7,650 పలికిందని వివరించారు. తిరిగి మంగళవారం కొనుగోళ్లు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. నేడు మద్యం దుకాణాలు బంద్: సీపీకరీంనగర్క్రైం: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈనెల 12న మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వైన్‌షాపులు, బార్లు, క్లబ్, మద్యం డిపోలు మూసివేస్తున్నట్లు కరీంనగర్ సీపీ గౌస్ ఆలం తెలిపారు. హనుమాన్ జయంతి సందర్భంగా మూసివేస్తున్నట్లు ప్ర కటించారు.ఆదేశాలను ఎవరైన ఉల్లంఘిస్తే చట్టరీత్యా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కరీంనగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నాగరాజుకరీంనగర్క్రైం: కరీంనగర్ బార్ అసోసియేషన్ 2025–26 నూతన కార్యవర్గానికి శుక్రవారం ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్షుడిగా లింగంపల్లి నాగరాజు, ఉపాధ్యక్షుడిగా చందా రమేశ్ గెలుపొందినట్లు ఎన్నికల అధికారి కాసుగంటి మాధవరావు ప్రకటించారు. సంయుక్త కార్యదర్శిగా సిరికొండ శ్రీధర్‌రావు, ట్రెజరర్‌గా సంపత్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ కార్యదర్శిగా గుగులోతు బలరాం, లైబ్రరీ సెక్రటరీగా తుమ్మ ప్రభాకర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా వెన్న ఆనందం, సందూరి భూమిరెడ్డి, గుంటి మధు, జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా కోల ప్రభాకర్, కొలిపాక ప్రియాంక, సంతోష్ కుమార్ ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శి పదవికి పోటీచేసిన వారిలో అరుణ్ కుమార్‌కు 222 ఓట్లు రాగా, చంద్రపాటి కిరణ్ కుమార్‌కు 221 వచ్చాయి. దీంతో కిరణ్‌కుమార్ రీకౌంటింగ్ చేయాలని కోరడంతో ఓట్లు మళ్లీ లెక్కిస్తున్నారు. ఫలితం వచ్చేవరకు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఎన్నికల్లో మొత్తం 859 మంది న్యాయవాదులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
సన్నబియ్యం.. పప్పుచారు
● లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేసిన కలెక్టర్ పమేలా సత్పతి, మానకొండూర్ ఎమ్మెల్యే సత్యనారాయణశంకరపట్నం: సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో కలెక్టర్ పమేలా సత్పతి, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, అదనపు కలెక్టర్లు లక్ష్మి కిరణ్, ప్రఫుల్ దేశాయ్ భోజనం చేశారు. శంకరపట్నం మండలం వంకాయగూడెం గ్రామంలోని దళిత సామాజికవర్గానికి చెందిన చలిగంటి గణేశ్–మమత ఇంట్లో గురువారం సన్నబియ్యం అన్నం, పప్పుచారుతో భోజనం చేశారు. గణేశ్ ఇంటికి కలెక్టర్, ఎమ్మెల్యే రావడంతో గ్రామస్తులు తరలివచ్చారు. సన్నబియ్యంతో భోజనం చేస్తున్నారా? ఎలా ఉందని కలెక్టర్ మహిళలను ఆరా తీశారు. అన్నం రుచిగా ఉందని వివరించారు. భోజనం వడ్డించిన గణేశ్– మమత దంపతులను సత్కరించారు. అక్కడే ప్రభుత్వ పాఠశాల యూని ఫాంతో కనిపించిన గణేశ్ కూతురు అక్షయనందనను కలెక్టర్ పలకరించారు. ఏ క్లాసు, ఎలా చదువుతున్నావని ఆరా తీశారు. బాగా చదువుకుని, మంచిపేరు తీసుకురావాలని సూచించారు. -
బువ్వ బాగుంది
● అప్పుడు విముఖత.. ఇప్పుడు సుముఖత ● సన్నబియ్యం కోసం రేషన్‌షాపుల ఎదుట కార్డుదారుల బారులు ● వారంలోనే 90 శాతం పూర్తయిన పంపిణీ ● వండుకోవడానికే ఆసక్తి చూపుతున్న పేదలు ● నూకలు వస్తున్నా, గంజి వార్చితే అన్నం బాగుంటుందంటున్న మహిళలుసాక్షి, పెద్దపల్లి: ‘అన్నా.. వేలిముద్ర వేసిపో.. కిలోకు రూ.10 చొప్పున నీ అమౌంట్ ఇస్తా’ అని రేషన్ డీలర్లు గతంలో లబ్ధిదారులతో బేరసారాలకు దిగేవారు. ప్రస్తుతం ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేయడంతో సీన్ రివర్స్ అయ్యింది. దుకాణం తెరిచావా.. బియ్యం తీసుకోవడానికి వస్తున్నామంటూ లబ్ధిదారులే రేషన్ డీలర్లను సంప్రదిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రేషన్ షాపుల ఎదుట బారులు తీరుతున్నారు. ‘పైసలు వద్దు.. సన్నబియ్యం కావాలి’ అంటున్నారు. ఉగాది నుంచి పంపిణీ చేస్తున్న సన్నబియ్యానికి కార్డుదారుల నుంచి మంచి స్పందనే వస్తోంది. గతంలో దొడ్డుబియ్యం తీసుకోవడానికి ఆసక్తి చూపనివారు.. ఇప్పుడు సన్నంబియ్యం తీసుకోవడానికి దుకాణాల వద్ద క్యూ కడుతున్నారు. నమ్మకం కలిగిస్తున్న అధికారులు, పాలకులు ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు, కలెక్టర్లు తదితర అధికారులు సన్నబియ్యం తీసుకునే వారి ఇళ్లలో భోజనం చేస్తున్నారు. బియ్యం నాణ్యత, మన్నికపై నమ్మకం కల్పిస్తున్నారు. ఇప్పటికే అన్నిరేషన్ షాపులకు అధికారులు నెలవారీ బియ్యం కోటా సరఫరా చేయగా, దాదాపు అన్నిదుకాణాల్లో బియ్యం పంపిణీ 90శాతానికిపైగా పంపిణీ చేశారు. నూకలు వస్తున్నా... ముద్ద అవుతున్నా సన్న బియ్యంలో నూకలు ఎక్కువగా వస్తున్నాయని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ఒకేరకంగా అనేక రకాలు ఉంటున్నాయని, కొన్నిదొడ్డుగా, పొట్టిగా ఉన్నాయని రేషన్‌కార్డుదారులు చెబుతున్నారు. వండితే ముద్ద అవుతుందని కొందరు, గంజి వార్చితే బాగుంటోందని మరికొందరు చెబుతున్నారు. రేషన్ దందాకు అడ్డుకట్ట ప్రతీనెల ఒకటి నుంచి 15 వ తేదీ వరకు రేషన్ దు కాణాల్లో బియ్యం పంపిణీ చేసేవారు. లబ్ధిదారుల వేలిముద్రని/ఐరిస్ స్కాన్ ద్వారా కుటుంబసభ్యుల సంఖ్య ఆధారంగా ఒక్కో వ్యక్తి పేరిట 6కిలోల బియ్యం ఇచ్చేవారు. చాలామంది అనర్హులు ఉండటం, మరోవైపు బీపీఎల్ కుటుంబాలు సైతం రేషన్ బియ్యం తినడానికి ఆసక్తి చూపేవారు కాదు. దీంతో రేషన్ డీలర్లు కిలోకు రూ.10చొప్పున చెల్లించి, దొడ్డుబియ్యాన్ని దారి మళ్లించేవారు. కొందరు బియ్యం తీసుకునేందుకు వచ్చేవారు కాదు. మిగిలిన బియ్యం నిల్వ చూపించేవారు. తర్వాత నెలలో మిగిలినవి కలిపి దుకాణానికి కేటాయింపులు చేసేవారు. ఈనెలలో ఆ పరిస్థితి కనిపించడం లేదని, సన్నబియ్యం తీసుకునేందుకు కార్డుదారులు ఆసక్తి చూపటమే కారణమని డీలర్లు వివరిస్తున్నారు.సన్నబియ్యం పంపిణీ సమాచారం జిల్లా రేషన్‌కార్డులు లబ్ధిదారులు రేషన్‌షాపులు ప్రతీనెల సరఫరా చేసే బియ్యం(మెట్రిక్ టన్నుల్లో..) కరీంనగర్ 2,75,320 8,45,761 566 5,074 పెద్దపల్లి 2,19,952 6,21,836 413 4,013 జగిత్యాల 3,07,000 8,91,000 592 5,500 సిరిసిల్ల 1,73,745 4,97,103 345 3,250డీలర్లపై తరుగు భారం కార్డుదారులంద రూ సన్నంబి య్యం తీసుకుంటున్నా.. చాలా తరుగు వస్తుందని రేషన్‌డీలర్లు వాపోతున్నారు. బియ్యం బస్తా 50.650 కేజీలకు 49– 48 కేజీల వరకే బరువు ఉంటోందని, తద్వారా ఒక్కోషాపులో తరుగు పేరిట క్వింటాలు నుంచి 2 క్వింటాళ్ల వరకు బియ్యం తక్కువ వస్తున్నాయని డీలర్లు వాపోతున్నారు. -
దారులన్నీ కొండగట్టుకే..
జగిత్యాల: జై శ్రీరాం.. జై హనుమాన్ అంటూ తమ ఇష్టదైవమైన కొండగట్టు అంజన్నను దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. శుక్రవారం అంజన్న చిన్న జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లాలోని కొండగట్టులోగల శ్రీఆంజనేయస్వామి ఆలయం ముస్తాబైంది. మూడురోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అడుగడుగునా సీసీ కెమెరాల ఏర్పాటుతోపాటు, మూడు రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందుకోసం లైటింగ్స్ సిద్ధం చేశారు. ఆలయ ఆవరణలో చలువ పందిళ్లు వేశారు. కల్యాణకట్ట వద్ద నాయీబ్రాహ్మణులను అధిక సంఖ్యలో నియమించారు. జయంతి సందర్భంగా ఇప్పటికే మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. దీక్షాపరులు మాలవిరమణ చేసి అంజన్నకు ముడుపు కట్టనున్నారు.రెండు లక్షల మంది అంచనా..అంజన్న సన్నిధి కొండమీదకు కాలినడకన, వాహనాల్లో సుమారు రెండు లక్షల మంది రానున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు. శుక్రవారం వరకు భక్తులందరూ కొండగట్టుకు చేరుకుని అంజన్న సన్నిధిలో అర్ధరాత్రి వరకు సేదతీరి క్యూలైన్లలో నిలబడి మాల విరమణ చేయనున్నారు. జై హనుమాన్, జై శ్రీరాం అంటూ కొండ ప్రాంగణమంతా మారుమోగనుంది.భక్తుల దర్శనం ఇలా..ఘాట్‌రోడ్ మీదుగా వాహనాలపై.. మెట్లదారిలో కాలినడకన గుట్టపైకి చేరుకోవాలి. నాచుపల్లి జేఎన్టీయూ వైపు నుంచి వచ్చే భక్తుల కోసం బొజ్జ పోతన్న సమీపంలో పార్కింగ్ స్థలం సిద్ధం చేశారు. ఇక్కడ వాహనాలను పార్కింగ్ చేసి కాలినడకన కొండమీదకు చేరుకోవాలి. కొండపైకి చేరుకున్నాక ముందుగా పాత కోనేరు ఎదురుగా ఉన్న మెట్లదారి వెంట వెళ్లి అక్కడి కల్యాణకట్టలో క్యూలైన్ పద్ధతిలో మాల విరమణ చేసుకోవాలి. నూతన కోనేరు పక్కనున్న చలువ పందిళ్ల దిగువ, శ్రీరామ కోటి స్తూపం వెనకాల షెడ్డులో తలనీలాలు సమర్పించాలి. నూతన కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించాలి. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన క్యూలైన్ ద్వారా వెళ్లి స్వామి వారిని దర్శించుకోవాలి. ఆలయం వెనక వైపు నుంచి తిరుగు పయనం కావాలి. -
శుక్రవారం శ్రీ 11 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
గన్నేరువరం/కరీంనగర్‌రూరల్: జిల్లాలోని పలుచోట్ల గురువారం వేకువజామున అకాల వర్షం బీభత్సం సృష్టించింది. అన్నదాతకు అపారనష్టం కలిగించింది. గన్నేరువరం మండలం మాదాపూర్, పీచుపల్లి, జంగపల్లి, గునుకులకొండాపూర్‌లో అకాల వర్షానికి చేతికందిన వరి, మొక్కజొన్న దెబ్బతిన్నాయి. మామిడితోటల్లో చెట్లకొమ్మలు విరిగిపడ్డాయి. కాయలు నేలరాలాయి. మాదాపూర్ శివారులో ఆదిరెడ్డికి చెందిన ఆరు ఎకరాల్లో వరిపూర్తిగా దెబ్బతింది. గునుకులకొండాపూర్‌లో న్యాలపట్ల రాజయ్యకు చెందిన దున్నపోతు మృతి చెందగా, రూ.30 వేల నష్టం వాటిల్లింది. నష్టపోయిన వరి, మొక్కజొన్న పంటను మాదాపూర్, పీచుపల్లి, జంగపల్లి గ్రామాల్లో క్షేత్రస్థాయిలో గురువారం పరిశీలించినట్లు ఏవో కిరణ్మయి తెలిపారు. 40 మంది రైతులకు చెందిన 126 ఎకరాల వరి, ఆరుగురికి చెందిన 15 ఎకరాల మొక్కజొన్న నష్టపోయినట్లు నివేదించామని వివరించారు. గురువారం సాయంత్రం ఒక్కసారిగా మబ్బులు కమ్మడంతో కరీంనగర్ రూరల్ మండలం మొగ్ధుంపూర్, చెర్లభూత్కూర్ తదితర గ్రామాల్లో పలువురు రైతులు ఆరబోసిన ధాన్యాన్ని కుప్పచేసి వర్షానికి తడవకుండా టార్పాలిన్లు కప్పారు.గాలివాన బీభత్సం అన్నదాతకు నష్టంన్యూస్రీల్ -
హనుమాన్ విజయ యాత్రకు పటిష్ట బందోబస్తు
కరీంనగర్‌క్రైం: హనుమాన్ చిన్న జయంతి సందర్భంగా ఈనెల 12వ తేదీ శనివారం కరీంనగర్లో నిర్వహించనున్న శ్రీ వీరహనుమాన్ విజ య యాత్రకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు సీపీ గౌస్ ఆలం తెలిపారు. టౌన్ ఏసీపీ కార్యాలయంలో గురువారం డివి జన్‌లోని పోలీసు అధికారులతో సమావేశం అయ్యారు. యాత్ర వైశ్య భవన్ పక్కన గల రామాలయం నుంచి ప్రారంభమై రాజీవ్ చౌక్, టవర్‌సర్కిల్, గంజ్ రోడ్, రూరల్ పోలీస్ స్టేషన్ చౌరస్తా, కమాన్ రోడ్ మీదుగా, బస్టాండ్, తెలంగాణ చౌక్, ఐబీచౌరస్తా, కోర్ట్ చౌరస్తా , మంచిర్యాల చౌరస్తా, గాంధీ విగ్రహం వీదుగా రామాలయం చేరుకుంటుందని తెలిపారు. ఈ యాత్రకు 500మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నాలా సమస్య పరిష్కరిస్తాం కరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని శర్మనగర్, సాహెత్నగర్లకు ఇబ్బందిగా మారిన నాలా సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని నగరపాలకసంస్థ కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్ అన్నా రు. గురువారం నగరంలోని 44వ డివిజన్ పరి ధి శర్మనగర్‌లో నాలాను పరిశీలించారు. ప్రతి వర్షాకాలం నాలాతో ఎదురవుతున్న సమస్యలను మాజీ కార్పొరేటర్ మెండి చంద్రశేఖర్ కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. సమస్యను పరిష్కరించాలని కమిషనర్ ఇంజినీరింగ్ అధి కారులకు సూచించారు. అనంతరం ఎన్టీఆర్చౌరస్తాలోని డ్రైనేజీ మరమ్మతు పనులను తనిఖీచేసి, వేగవంతం చేయాలని ఆదేశించారు. సహాయ కమిషనర్ వేణు మాధవ్, డీఈ ఓం ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లలో కోత వద్దు కరీంనగర్ అర్బన్: రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యంలో ఎలాంటి తరు గు, కోతలు విధించవద్దని చొప్పదండి ఎమ్మె ల్యే మేడిపల్లి సత్యం అన్నారు. కరీంనగర్ కలెక్టరేట్లో కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్‌తో కలిసి యాసంగి ధాన్యం కొనుగోళ్లపై పౌరసరఫరాలశాఖ అధికారులు, రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బ ంలు రాకుండా చూడాలన్నారు. కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ జిల్లాలో గత పంట సీజన్లలో ఎలాంటి కోతలూ లేకుండా ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరిగిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం అదే తరహాలో కొనుగోళ్లు జరపాలని అన్నారు. పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఎం.రజనీకాంత్, జిల్లా పౌరసరఫరాల అధికారి నర్సింగరావు, రైస్‌మిల్లర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు బోయినపల్లి నర్సింగరావు, మిల్లర్లు పాల్గొన్నారు. మార్కెట్ కార్యదర్శిగా హమీద్కరీంనగర్ అర్బన్: మార్కెటింగ్‌శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల్లో అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం ‘సాక్షి’లో ‘56పోస్టులు.. 40 ఖాళీలు’ శీర్షికన కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. కరీంనగర్ మార్కెట్ కార్యదర్శిగా పెద్దపల్లి గ్రేడ్–3 కార్యదర్శి సయ్యద్ హమీద్ అలీని ఎఫ్ఎసీగా నియమించగా గంగాధర మార్కెట్‌కు అక్కడే సూపర్వైజర్గా పనిచేసే లక్ష్మ ణ్ను ఇన్చార్జిగా నియమించారు. కాగా జిల్లా మార్కెటింగ్ ఇన్చార్జి అధికారి షాబోద్దీన్ పత్రికా ప్రకటన విమర్శలకు తావి స్తోంది. మార్కెట్ కమిటీలో సి బ్బంది కొరత లేదని పేర్కొనడం విడ్డూరం. ‘మీ సేవ’లపై నిఘాకరీంనగర్ అర్బన్: ధ్రువపత్రాల జారీలో అలసత్వం, మీ సేవ కేంద్రాల్లో విచ్చలవిడి దోపిడీకి అడ్డుకట్ట వేసేలా కలెక్టర్ పమేలా సత్పతి ప్రత్యేక దృష్టిసారించారు. ఈ నెల 8న ‘సాక్షి’లో ‘యువ వికాసంలో దళారుల దందా’ శీర్షికన కథనం ప్రచురితం కాగా ఆయా శాఖల అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. మీ సేవ కేంద్రాల్లో నిర్ణీత రుసు ము మాత్రమే వసూలు చేయాలని, రూపాయి ఎక్కువ తీసుకున్నా సీజ్ చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇక దళారులకు ఎలాంటి అవకాశమివ్వవద్దని,దరఖాస్తుదారులు మాత్ర మే కార్యాలయాలకు వచ్చేలా పర్యవేక్షణ చేయాలని తహసీల్దార్లకు నిర్దేశించారు. ఎప్పటికప్పుడు సర్టిఫికెట్లను జారీ చేయాలని, అలసత్వం చేయొద్దని ఇప్పటికే అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్ రెవెన్యూ అధికారులతో స్పష్టం చేశారు. -
వేర్వేరుగా సన్న, దొడ్డు వడ్ల కొనుగోళ్లు
● నేటినుంచి ధాన్యం కొనుగోళ్లు ● ఏఈవోలకే కీలక బాఽధ్యత ● 15లోపు అన్ని కేంద్రాలు ప్రారంభంకరీంనగర్ అర్బన్: యాసంగి ధాన్యం కొనుగోళ్లకు జిల్లా యంత్రాంగం కసరత్తు చేపట్టింది. శుక్రవారం నుంచి జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని అధికారులు నిర్ణయించగా.. చొప్పదండిలో ప్రారంభించనున్నారని సమాచారం. క్వింటాల్‌కు రూ.500 బోనస్ ప్రకటించడంతో అన్నదాతలు సన్న ధాన్యానికే ప్రాధాన్యం ఇచ్చారని వ్యవసాయ గణాంకాలు చాటుతున్నాయి. ఇప్పటికే కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ లక్ష్మికిరణ్ పౌరసరఫరాల, వ్యవసాయ, ఐకేపీ, మార్కెటింగ్ అధికారులతో సమీక్షించారు. ఐకేపీ, ప్రాథమిక సహకార సంఘాలు, డీసీఎంఎస్, హాకాలు కొనుగోళ్లలో భాగస్వామ్యమవనుండగా ఇక ఏఈవోలే ప్రధాన భూ మిక పోషించనున్నారు. కాగా యాసంగి ధాన్యం సేకరణకు గానూ 347 కొనుగోలు కేంద్రాలు అవసరమని ప్రతిపాదించారు. ఈ నెల 15వరకు అన్ని కేంద్రాలను ప్రారంభిస్తామని పౌరసరఫరాల సంస్థ డీఎం మంగళారపు రజనీకాంత్ స్పష్టం చేశారు. అత్యధిక విస్తీర్ణం ఇక్కడే సన్నరకాలను హుజూరాబాద్, శంకరపట్నం, మానకొండూరు, వీణవంక మండలాల్లో అత్యధిక విస్తీర్ణంలో సాగు చేశారు. చిగురుమామిడి, చొప్పదండి, గంగాధర, రామడుగు, తిమ్మాపూర్, కరీంనగర్ రూరల్, సైదాపూర్ మండలాల్లో దొడ్డురకం అత్యధిక విస్తీర్ణంలో సాగైంది. కాగా సన్న ధాన్యానికి ఏ గ్రేడ్ రకం మద్దతు ధరతో పాటు క్వింటాల్‌కు రూ.500 అదనంగా ఇవ్వనున్నారు. జిల్లాలో 70,500 ఎకరాల్లో సన్నరకం సాగవగా 1.90లక్షల క్వింటాళ్ల ధాన్యం దిగుబడి రానుంది. సీడ్ మిల్లులకు పోనూ మార్కెట్‌కు వస్తుందని అంచనా. గన్నీ సంచులు, రవాణే సమస్య జిల్లాలో 347కేంద్రాలను ఏర్పాటు చేయనుండగా గతంలో రైతుల ఎదుర్కొన్న సమస్యలను దూరం చేయాల్సి ఉంది. గన్నీ సంచుల కొరత, రవాణాలో ఆలస్యం, మిల్లర్ల దోపిడీ సమస్యల్లేకుండా చూడాలని అన్నదాతలు కోరుతున్నారు. ప్రతీ సంవత్సరం ఏప్రిల్, మే నెలలో అకాల వర్షాలు కురుస్తుండటంతో నష్టం వాటిల్లుతోంది. నెలల తరబడి పంటను కాపాడుకునేందుకు శ్రమించిన రైతులకు వడగళ్ల వాన గంటలోనే తుడిచేస్తోంది. గత సంవత్సరం వరి, మామిడి, మొక్కజొన్న సాగు చేసిన రైతులు నష్టపోయారు. ధాన్యం రంగు మారడం తేమ సాకుతో కళ్లాల వద్దే వ్యాపారులు కొనుగోలు చేశారు. ఈ నేపథ్యంలో ధాన్యం విక్రయించేవరకు ఎలా గడుస్తుందోనన్న భయం వెంటాడుతోంది.జిల్లాలో సాగువిస్తీర్ణం: 2,90,000 సాగైన వరి: 2,66,896 ఎకరాలు రానున్న దిగుబడి: 6లక్షల క్వింటాళ్లు మద్దతు ధర: ఏ గ్రేడ్: రూ.2,320 సాధారణ రకం: రూ.2,300 -
ఇండియన్ ఓపెన్ అథ్లెటిక్స్‌లో ప్రతిభ
కరీంనగర్‌స్పోర్ట్స్: జిల్లాకు చెందిన అథ్లెటిక్ క్రీడాకారిణి సీహెచ్.పూజ అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. ఇండియన్ ఓపెన్ అథ్లెటిక్స్‌కు అర్హత సాధించిన తొలి క్రీడాకారిణి కాగా.. పోటీల్లోనూ రాణించి శభాష్ అనిపించుకుంది. లాంగ్ జంప్ అంశంలో పోటీ పడిన పూజ గురువారం జరిగిన హీట్స్‌లో అద్భుతంగా రాణించి 5.25 మీటర్ల దూరాన్ని దూకి 7వ స్థానంలో నిలిచింది. పూజ ప్రస్తుతం కరీంనగర్‌లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో చదువుతోంది. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు నందెల్లి మహిపాల్, కడారి రవి అభినందించారు. -
కిలోల కొద్దీ తీసుకొచ్చి.. ప్యాకెట్లుగా చేసి..
పెద్దపల్లిరూరల్: ఆటో నడిపితే అవసరమైనంత ఆదాయం రావడం లేదని భావించి సులువుగా డబ్బు సంపాదించాలనే దురాశతో గంజాయి విక్రయిస్తున్న షేక్ ఆసిఫ్ అనే యువకుడిని గురువారం పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను డీసీపీ కరుణాకర్ వెల్లడించారు. ఓ కాలేజీవద్ద విక్రయించేందుకు యత్నిస్తుండగా ఆసిఫ్‌ను అదుపులోకి తీసుకుని రూ.50వేల విలువైన 2,041 గ్రాముల గంజాయి, వేయింగ్‌మిషన్, సెల్‌ఫోన్, బైక్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి తక్కువ ధరకు కిలోల కొద్దీ గంజాయి కొనుగోలు చేసి, గ్రామాల్లో ప్యాకెట్లుగా తయారుచేసి అధిక ధరకు విక్రయిస్తున్నాడని పేర్కొన్నారు. ఇప్పటికే అతడిపై 8 కేసులు నమోదై ఉన్నాన్నారు. పీడీ యాక్టు కేసు కూడా నమోదైందన్నారు. పెద్దపల్లి ప్రాంతంలో పోలీసుల నిఘా ఎక్కువైందని భావించి కరీంనగర్ జిల్లా ముగ్గుంపూర్ గ్రామానికి మకాం మార్చి కరీంనగర్ పరిసరాల్లో ఆటోనడుపుతున్నాడన్నారు. ఇదేసమయంలో గంజాయి అమ్ముతున్నాడన్నారు. ఈమేరకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నామన్నారు. అతడిని పట్టుకున్న సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సైలు లక్ష్మణ్‌రావు, మల్లేశం, హెడ్‌కానిస్టేబుల్ మాడిశెట్టి రమేశ్‌తో పాటు కానిస్టేబుళ్లు ప్రభాకర్, సతీశ్, రాజు, అనిల్‌కుమార్‌ను డీసీపీ అభినందించారు. గ్రామాలు, పట్టణాల్లో గంజాయి జోరు జల్సాల కోసమే గంజాయి అమ్మకాలు వివరాలు వెల్లడించిన డీసీపీ కరుణాకర్ -
అంతర్ జిల్లా దొంగ అరెస్ట్
● 28.6 తులాల బంగారం స్వాధీనం ● నిందితుడిపై 25 చోరీ కేసులు జగిత్యాలక్రైం: జగిత్యాలలో తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఎస్పీ కార్యాలయంలో వివరాలు వెల్ల డించారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రాగంపేటకు చెందిన రాగుల రామమ్మ, కొంరయ్య కుమారుడు రాగుల అజయ్‌కుమార్ అలియాస్ బక్కశెట్టి కొంరయ్య ప్రస్తుతం మంచిర్యాల జిల్లాకేంద్రంలోని తిలక్‌నగర్‌లో ఉంటున్నాడు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు పట్టించుకోకపోవడంతో హైదరాబాద్ పారిపోయి ఓ లారీ ట్రాన్స్‌పోర్ట్‌లో పనికి కుదిరాడు. ఈ క్రమంలోనే దొంగతనాలకు అలవాటుపడ్డాడు. ఇలా సుమారు 25 దొంగతనం కేసుల్లో పట్టుబడ్డాడు. జగిత్యాలపై పట్టు ఉండడంతో ఇక్కడకు చేరుకుని మార్చి 28న అరవింద్‌నగర్‌లో, మార్చి 16న హన్మాన్‌వాడలో, జనవరి 18న పురాణిపేటలో, ఫిబ్రవరి 16న గణేష్‌నగర్‌లో, ఫిబ్రవరి 23న పద్మనగర్‌లో, మార్చి 7న గోవిందుపల్లెలో, మార్చి 18న కృష్ణానగర్‌లో తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడి బంగారు అభరణాలను ఎత్తుకెళ్లాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న జగిత్యాల పోలీసులు నిందితుడి కదలికలపై నిఘా వేశారు. ఈ నేపథ్యంలోనే పట్టణ పోలీసులు గురువారం కొత్త బస్టాండ్ చౌరస్తాలో వాహనాల తనిఖీ చేస్తుండగా కొంరయ్య అనుమానాస్పదంగా కనిపించాడు. అతడిని పట్టుకుని విచారణ చేపట్టగా అసలు నిజం ఒప్పుకున్నాడు. అతడి నుంచి 28.6 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. నిందితుడిని పట్టుకోవడంలో కృషి చేసిన పోలీసులను రివార్డుతో అభినందించారు. కార్యక్రమంలో డీఎస్పీ రఘుచందర్, పట్టణ సీఐ వేణుగోపాల్, ఎస్సైలు కిరణ్, గీత, కానిస్టేబుళ్లు జీవన్, విశాల్, సంతోష్, మల్లేషం, గంగాధర్, రమేశ్ పాల్గొన్నారు. -
గాలిలో దీపం.. గల్ఫ్‌లో జీవనం
సిరిసిల్ల: ఉన్న ఊరిలో ఉపాధి కరువై.. పొ ట్ట చేత పట్టకుని గల్ఫ్ దేశాలకు వలస వెళ్లే ప్రస్థానం 45 ఏళ్ల కిందటే మొదలైంది. భాష రాని దేశంలో ఇబ్బందులు పడుతూ వలసజీవులు కాలం వెళ్లదీస్తున్నారు. గల్ఫ్ దేశాలైన యూఏఈ(దుబాయ్), మ స్కట్(ఒమన్), బహ్రెయిన్, కువైట్, ఖతర్, సౌదీ అరేబియా, ఇరాక్ వంటి దేశాలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి సుమారు 2.50 లక్షల మంది ఉపాధి కోసం వెళ్లారు. గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందుతున్న వలస కార్మికుల సంక్షేమానికి సమగ్ర పాలసీ రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం సలహా సంఘాన్ని గురువారం ఏర్పాటు చేసింది. ఐఎఫ్ఎస్ అధికారి డాక్టర్ బీఎం వినోద్‌కుమార్ చైర్మన్‌గా, మంద భీంరెడ్డి వైస్‌చైర్మన్‌గా, కమిటీ సభ్యులుగా వేములవాడ ఎ మ్మెల్యే ఆది శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ టి.జీవన్రె డ్డి, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, నిజా మాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్.భూపతిరెడ్డి, టీజీఎండీసీ చైర్మన్ ఈ.అనిల్‌కుమార్‌లతోపాటు మరో ఏడుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశా రు. రెండేళ్ల కాలపరిమితితో ఈ సలహా సంఘం క మిటీ గల్ఫ్ కార్మికుల సమస్యలపై అధ్యయనం చేసి సమగ్ర ఎన్ఆర్ఐ పాలసీని రూపొందించాల్సి ఉంది. కడసారి చూపులకు దూరమై.. ఈ వలస ప్రస్థానంలో ఎందరో అభాగ్యులు అనేక కారణాలతో మరణించారు. నెలల తరబడి మృతదేహాలు సైతం కన్నవారికి కడసారి చూపులకు నోచుకోలేదు. భారత విదేశాంగ శాఖ చొరవతో ఆ యా దేశాల్లోని భారత రాయభార కార్యాలయం స్పందించి శవాలను పంపించిన సందర్భాలు ఉన్నా యి. స్వచ్ఛంద సంస్థలు, ఎన్ఆర్ఐ విభాగాలు శవపేటికలను స్వస్థలాలకు చేర్చాయి. ఇలాంటి విషాద ఘటనల్లో మృతుల కుటుంబాలకు ఆయా దేశాల్లో కంపెనీ వీసాలు ఉంటే.. కొంతమేరకు పరిహారం అందింది. అదే వీసా లేకుండా ఆజాద్ వీసాలపై ప నిచేసే వారు.. కంపెనీ వీసాలపై వెళ్లి కల్లివెల్లి అయి న వారికి మాత్రం కంపెనీలు ఏమీ ఇవ్వలేదు. ఫలి తంగా ఆయా కుటుంబాలు ఇప్పటికీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయి. మృతుల కుటుంబాలకు భరోసా రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి ఎన్నికల హామీలో భాగంగా గల్ఫ్‌లో ఏ కారణంగా మరణించినా ఆ కుటుంబానికి రూ.5లక్షలు అందించాలని నిర్ణయించింది. 2023 డిసెంబర్ 7 నుంచి గల్ఫ్ దేశాల్లో మరణించిన వారికి పరిహారం అందిస్తున్నా రు. రాజన్నసిరిసిల్ల జిల్లాకు చెందిన 17 మంది గ ల్ఫ్ మృతుల వారసులకు రూ.5లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియాగా రూ.85లక్షలు మంజూరు చేసింది. ఇది వలస బాధిత కుటుంబాలకు కొండంత భరోసానిస్తుంది. కేరళ విధానం ఆచరణీయం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2.50 లక్షల మంది గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందుతుండగా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సలహా కమిటీతో వారికి మేలు జరుగుతుందని ఆశిస్తున్నారు. కేరళ ప్రభుత్వం దశాబ్దం కిందటే ఎన్ఆర్ఐ పాలసీని అమలు చేస్తుంది. ఆ పాలసీ తెలంగాణలోనూ అమలు కు ఆచరణీయంగా ఉంటుంది. పాస్‌పోర్టు నుంచి వీసాల వరకు అన్ని పారదర్శకంగా ఉంటాయి. ఎవరికై నా వీసా వస్తే.. అక్కడి బ్యాంకుల అవసరమైన మేరకు రుణవసతి కల్పిస్తాయి. గల్ఫ్ దేశాలకు వెళ్లే వారు మోసాలకు గురికాకుండా ప్రభుత్వమే అధికా రిక ఏజెన్సీల ద్వారా వీసాలను సమకూర్చుతుంది. గల్ఫ్ వెళ్లే వారికి ముందే వివిధ పనుల్లో శిక్షణ ఇచ్చి .. అక్కడి భాషను, అక్కడి వాతావరణం, పనితత్వంపై అవగాహన కల్పిస్తారు. ఏదైనా కారణం చే త అక్కడ పనిచేయలేక.. ఇంటికి తిరిగొస్తే.. ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పించి పాత అప్పును తీర్చుకునే వీలు కల్పిస్తారు. ఇది చట్టబద్ధంగా సాగడంతో వలసజీవులకు ఇబ్బందులు రాకుండా కేరళ ప్రభుత్వం కట్టడి చేస్తుంది. విదేశీ మారకాన్ని మన దేశాని కి ఆర్జించి పెట్టేవాళ్లుగా అన్ని సంక్షేమ పథకాలను గల్ఫ్ వలస జీవులకు అమలు చే స్తుంది. ఈ విధానాన్ని మన రాష్ట్రంలో అమలు చేసేలా విధానాలకు రూపకల్పన చేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం కమిటీకి అప్పగించింది. ఆ కమిటీపై జిల్లాలోని గల్ఫ్ వలస జీవులు ఆశలు పెట్టుకున్నారు. ఉపాధి వేటలో పోతున్న ప్రాణాలు గల్ఫ్ వలస కార్మికుల సంక్షేమానికి సలహా కమిటీ ఎన్ఆర్ఐ పాలసీ రూపకల్పనకు అవకాశం కమిటీ చైర్మన్‌గా ఐఎఫ్ఎస్ అధికారి కమిటీలో ఐదుగురు గౌరవ సభ్యులు.. మరో ఏడుగురు సభ్యులు -
కాజీపేట– దాదర్ ఎక్స్‌ప్రెస్ రైలు పునరుద్ధరణ
సాక్షిప్రతినిధి, కరీంనగర్: కుంభమేళా సందర్భంగా కాజీపేట నుంచి ముంబాయిలోని దాదర్ సెంట్రల్ రైల్వే స్టేషన్‌కు నడిచే వారాంతపు రైలు రద్దు చేయగా, తిరిగి మూడు నెలల తరువాత ఈనెల 12 నుంచి పునరుద్ధరిస్తున్నారు. ప్రతి శనివారం కాజీపేట నుంచి ఉదయం 11.30కి బయలుదేరే ఈ ట్రైన్ జమ్మికుంట, పెద్దపల్లి మీదుగా వయా బాల్లార్షా– ఆదిలాబాద్–నాందేడు నుంచి దాదర్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. తిరిగి ఆదివారం మధ్యాహ్నం 3.25కు దాదర్ రైల్వేస్టేషన్ నుంచి కాజీపేటకు చేరుకోనుంది. పెద్దపల్లి, జమ్మికుంటలో సదరు ట్రైన్‌కు రన్నింగ్ స్టాప్ సదుపాయం కల్పించటంతో ఉమ్మడి జిల్లాప్రజలకు ఉపయోగకరంగా మారనుంది. నిజామాబాద్– దాదర్ రైలు పునరుద్ధరణ ఎప్పుడో? రెండు మార్గాలల్లో దాదర్ సెంట్రల్ రైల్వే స్టేషన్‌కు కాజీపేట నుంచి రైలు నడవగా కుంభమేళా సందర్భంగా మూడు నెలల క్రితం రైల్లు రద్దు చేశారు. తాజాగా పెద్దపల్లి నుంచి వెళ్లే వారాంతపు రైలును పునరుద్ధరిస్తున్నా రైల్వే శాఖ, నిజామాబాద్ నుంచి వయా నాందేడ్ మీదుగా ప్రయాణించే వారాంతరపు రైలును సైతం పునరుద్ధరిస్తే 200కిలోమీటర్ల దూరం తగ్గటంతో పాటు, సమయం, రైలు చార్జీలు కలిసివస్తాయని ప్రయాణికులు అంటున్నారు. ఈ ప్రాంత ఎంపీలైన కేంద్రమంత్రి బండి సంజయ్, ధర్మపురి అరవింద్ చొరవ తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అంతర్జాతీయ చెస్ పోటీలకు జిల్లా క్రీడాకారులు కరీంనగర్‌స్పోర్ట్స్: కర్ణాటక రాష్ట్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నమ్మ బెంగళూరు ఇంటర్నేషనల్ గ్రాండ్ మాస్టర్స్ బీ కేటగిరీ ఫిడే రేటింగ్ చదరంగ పోటీల్లో కరీంనగర్‌లోని విశ్వనాథ్ చెస్ అకాడమీ క్రీడాకారులు పాల్గొంటున్నట్లు అకాడమీ డైరెక్టర్ రాజేంద్రప్రసాద్, కోచ్ అంతగిరి విశ్వనాథ్ ప్రసాద్ తెలపారు. గురువారం నుంచి ప్రారంభమైన ఈ పోటీలు 13 వరకు బెంగళూరులోని కంఠీరవ ఇండోర్ స్టేడియంలో జరుగనున్నట్లు తెలిపారు. స్విస్ లీగ్ పద్ధతిలో 10 రౌండ్ల పాటు జరిగే ఈ పోటిల్లో అకాడమీ నుంచి కోచ్ అంతగిరి విశ్వనాథ్ ప్రసాద్, చిట్టుమల్ల కశ్యప్, బాలసంకుల అమన్ రామ్, డి.అక్షిత్, ఈగ లిఖిత్ చైతన్య, బత్తిని శ్రీహన్, గంట అభయ్‌రామ్, కనుకుంట్ల అకీరా, ఈగ శివ చైతన్య పాల్గొంటున్నారని తెలిపారు. -
భర్త వేధింపులు భరించలేక భార్య ఆత్మహత్య
ఫెర్టిలైజర్‌సిటీ(రామగుండం): రామగుండం కార్పొరేషన్ 14వ డివిజన్ ఎల్కలపల్లి గేట్ గ్రామానికి చెందిన వివాహిత కట్ల మమత(28) భర్త వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కొత్తపల్లి గ్రామానికి చెందిన నెత్టేట్ల లక్ష్మయ్యకు ఇద్దరు కుమార్తెలు కాగా పెద్ద కుమార్తె మమతను ఎల్కలపల్లి గెట్ గ్రామానికి చెందిన కట్ల గణేశ్‌కు ఇచ్చి 2017లో వివాహం జరిపించారు. అయితే, కొద్దిరోజుల క్రితం గణేశ్.. తన భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్నాడు. మానసికంగా వేధిస్తున్నాడు. భరించలేని మమత మంగళవారం ఇంట్లో క్రిమిసంహారకమందు తాగింది. ఫోన్‌ద్వారా తల్లిదండ్రులకు సమాచారం అందించిది. వారు అత్తారింటికి చేరుకొని మమతను గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు వరంగల్ ఎంజీఎంకు తరలించగా.. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. మమతకు కృతిక(6), మనస్వి(4), కార్తికేయ(8 నెలల) బాబు ఉన్నారు. మృతురాలి తండ్రి నెత్టేట్ల్ల లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు ఎన్టీపీసీ ఎస్సై ఉదయ్ కిరణ్ కేసు నమోదు చేసుకున్నారు. చెట్టుకు బైక్ ఢీకొని ఒకరి మృతిరామడుగు: రామడుగు మండలం వెదిర గ్రామ పరిధిలోని రాజాజీనగర్‌కు చెందిన కుమ్మరి రాజు(28) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. గ్రామస్తుల వివరాల ప్రకారం.. కుమ్మరి రాజు గురువారం సాయంత్రం ఇంటి నుంచి ద్విచక్రవాహనంపై పనినిమిత్తం వెదిర వైపు వస్తున్నాడు. వెదిర– రామడుగు దారిలో బైక్ అదుపుతప్పి చెట్టుకు ఢీకొనడంతో అక్కడికక్కడే చనిపోయాడు. రాజుకు భార్య, కూతురు ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తేలుకాటుకు ప్రైవేట్ వైద్యమే దిక్కు ఇల్లంతకుంట(మానకొండూర్): తేలు కుట్టిందని ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే తాళం వేసి ఉండడంతో ప్రైవేట్ వైద్యం చేయించుకున్నట్లు బాధితుడు వాపోయాడు. బాధితుడు తెలిపిన వివరాలు. మండలంలోని నర్సక్కపేటకు చెందిన దూది సుధీర్‌రెడ్డి గురువారం తన మక్క చేనులో పనులు చేస్తుండగా తేలు కుట్టింది. వైద్యం కోసం ఇల్లంతకుంట పీహెచ్‌సీకి వెళ్లాడు. ఆస్పత్రి పల్లె దవాఖానాకు మారిందని బోర్డు చూసి అక్కడికి వెళ్లాడు. అప్పుడు సాయంత్రం 4.10గంటల సమయం కావడంతో ఆస్పత్రికి తాళం వేసి ఉండడంతో ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకున్నట్లు తెలిపాడు. దీనిపై వైద్యాధికారిణి వివరణ కోరగా.. పల్లె దవాఖానాలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకే వైద్యసేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఆతర్వాత వైద్యసేవలకు సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి వెళ్లాలన్నారు. కేసీఆర్ కుటుంబం జైలుకు వెళ్లడం ఖాయం● ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం కరీంనగర్: అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేలకోట్ల రూపాయలు సంపాదించిన కేసీఆర్, కేటీఆర్, కవిత ఆస్తులపై విచారణ జరుగుతోందని.. వారు జైలుకు వెళ్లడం ఖాయమని ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్, కాంగ్రెస్ నేత గజ్జెల కాంతం అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో మాట్లాడుతూ గత ప్రభుత్వం ధరణి పేరుతో వేల కోట్ల రూపాయల భూములు కాజేసి, బినామీ పేర్ల మీద అమ్ముకుందని ఆరోపించారు. సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోందన్నారు. ఎస్సీ వర్గీకరణ చేసి, బీసీలకు 42శాతం రిజర్వేషన్ల కోసం కృషి చేస్తోందన్నారు. కేసీఆర్, కేటీఆర్, బండి సంజయ్ కలిసి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి బీసీ రిజర్వేషన్ అమలు చేయించాలని డిమాండ్ చేశారు. హెచ్‌సీయూ భూముల విషయంలో కేసీఆర్, కేటీఆర్ విద్యార్థులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. గజ్జెల ఆనందరావు, సముద్రాల అజయ్, సుద్దాల లక్ష్మణ్, అనిల్, ప్రభాకర్, శంకర్, స్వరూప, లత, రాజయ్య పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలు
మల్లాపూర్: మండలంలోని పాతదాంరాజుపల్లి శివారులో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. గొర్రెపల్లికి చెందిన చింతకుంట రవితేజ నిర్మల్ జిల్లా ఖానాపూర్ నుంచి ఆటోలో వస్తున్నాడు. కొత్తదాంరాజుపల్లికి చెందిన బోయిని హన్మంతు, పంజాల రమణ పాతదాంరాజుపల్లి నుంచి వస్తున్నారు. గ్రామ శివారులోకి రాగానే ఆటో, ద్విచక్రవాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ రవితేజ, ద్విచక్రవాహనదారులు హన్మంతు, రమణ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గాయపడిన ముగ్గురిని జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. మల్లాపూర్ ఎస్సై రాజు, పోలీసు సిబ్బందితో ఘటనస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. -
నాలుగు దశాబ్దాల క్రితం పేలిన తూటా
● కొండాపూర్ ఎన్‌కౌంటర్‌కు 40 ఏళ్లు ● సీపీఐ(ఎంఎల్) జనశక్తికి తొలి ఎదురుదెబ్బ ● ఐదుగురు నక్సలైట్ల మృతి.. తప్పించుకున్న ఒకరు ● సంఘటన స్థలానికి వచ్చిన అప్పటి మాజీ సీఎం రుద్రంగిలో నిర్మించిన కొండాపూర్ అమరుల స్మారక స్తూపం రుద్రంగిలో స్మారకస్తూపం కొండాపూర్ అమరుల స్మారకార్థం 1991లో అప్పటి సిరిసిల్ల ఎమ్మెల్యే ఎన్వీ కృష్ణయ్య నాయకత్వంలో రుద్రంగిలో నిర్మించారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఎన్వీ కృష్ణయ్య 1989లో జనశక్తి నక్సలైట్ల మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా సిరిసిల్ల ఎమ్మెల్యేగా గెలుపొందారు. రుద్రంగిలోని ఆ స్థూపంపై కొండాపూర్ ఎన్కౌంటర్ మృతుల పేర్లు ఉన్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌కు ఇన్ఫార్మర్గా పేర్కొంటూ వెంకట్రావుపేటకు చెందిన కదిరె మల్లేశంగౌడ్ను అదే పెంటివాగు సమీపంలో జనశక్తి నక్సలైట్లు ఆ తరువాత కొద్ది రోజులుగా హతమార్చారు. అప్పటికే వెంకట్రావుపేటలో పోలీస్క్యాంపు ఉండగానే మల్లేశంగౌడ్ హత్య జరిగింది. ఎన్కౌంటర్ మృతుడు: గొట్టె కిరణ్ దళనేత(ఫైల్) సిరిసిల్ల: రెండున్నర దశాబ్దాల క్రితం వరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అడవిలోని అన్నలదే రాజ్యం. సీపీఐ(ఎంఎల్) పీపుల్స్‌వార్, సీపీఐ(ఎంఎల్) జనశక్తి విప్లవ గ్రూపులు తమకు పట్టున్న ప్రాంతాల్లో సమాంతర ప్రభుత్వాన్ని నడిపించాయి. అప్పట్లో నక్సలైట్లు చెప్పిందే వేదం.. చేసిందే శాసనంగా ఉండేది. ఈతరం వారికి నక్సలైట్లు అంటే.. ఎవరు? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అప్పటి సమాజంలో అన్యాయాన్ని ఎదిరించేందుకు పుట్టుకొచ్చిన విప్లవోద్యమాల ప్రతినిధులే నక్సలైట్లు. 40 ఏళ్ల క్రితం జరిగిన ఓ ఎన్కౌంటర్ ఘటన సీపీఐ(ఎంఎల్) జనశక్తి (చండ్రపుల్లారెడ్డి గ్రూప్) నక్సలైట్ల చరిత్రలో నెత్తుటిగాయంగా మిగిలింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కోనరావుపేట మండలం కొండాపూర్–వెంకట్రావుపేట శివారులోని పెంటివాగు పక్కన 1985 ఏప్రిల్ 11న అర్ధరాత్రి జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు జనశక్తి నక్సలైట్లు మరణించారు. ఆ ఎన్కౌంటర్ నుంచి ఒక్కరు తప్పించుకొని.. ఆ తర్వాత ఎన్కౌంటర్ గురించి పూసగుచ్చినట్లు చెప్పడం సంచలనంగా మారింది. అప్పటి మాజీ ముఖ్యమంత్రి ఎన్కౌంటర్ స్థలాన్ని చూసేందుకు కొండాపూర్‌కు వచ్చారంటే దాని ప్రభావాన్ని స్పష్టం చేస్తుంది. రక్తపుటేరుగా పెంటివాగు కోనరావుపేట మండలం నిమ్మపల్లి భూపోరాటం కేంద్రంగా ఆవిర్భవించిన నక్సలైట్ల ఉద్యమం అప్పుడే పల్లెలకు విస్తరిస్తోంది. కోనరావుపేట మండల కేంద్రానికి చెందిన దళనాయకుడు గొట్టె రఘుపతి అలియాస్ కిరణ్, మరో దళనాయకుడు చెట్కూరి నారాయణగౌడ్ అలియాస్ రామన్న(అక్కపల్లి), దళసభ్యులు పణి సత్తయ్య(మల్కపేట), తాడి రాజయ్య(వెంకట్రావుపేట), లక్ష్మీరాజం(వెంకట్రావుపేట), దాసరి గంగారాం(రుద్రంగి) సాయుధులు. వెంకట్రావుపేటలో జనశక్తి పార్టీ సానుభూతిపరుడి వద్ద రాత్రి భోజనం చేసి కొండాపూర్ సమీపంలోని పెంటివాగు పక్కనే బావి గడ్డ వద్ద నిద్రపోయారు. ఈ విషయం అందుకున్న సిరిసిల్ల సీఐ యూసుఫ్ షరీఫ్, వేములవాడ ఎస్సై ప్రాన్సిస్, సిరిసిల్ల ఎస్సై మురళీధర్‌రావు, కోనరావుపేట ఎస్సై వీరస్వామిగౌడ్లు సాయుధ పోలీసులతో అక్కడికి చేరుకున్నారు. పోలీసుల కాల్పుల్లో దళనేత కిరణ్‌తోపాటు మరో నలుగురు దళసభ్యులు మరణించారు. ఇంకో దళనేత చెట్కూరి నారాయణగౌడ్ త్రుటిలో తప్పించుకున్నాడు. శవాలను మృతుల బంధువులకు ఇవ్వకుండా అక్కడే మర్రిచెట్టు కిందనే పోస్టుమార్టం చేసి పోలీసుల పర్యవేక్షణలో పెంటివాగులో దహనం చేశారు. ఘటన స్థలికి మాజీ సీఎం, పౌరహక్కుల సంఘాల నేతలు కొండాపూర్ ఎన్కౌంటర్ స్థలానికి అప్పటి మాజీ ముఖ్యమంత్రి నాదేండ్ల భాస్కర్‌రావు, పౌరహక్కుల సంఘం నాయకులు రమామేల్కోటే, కన్నాభిరాన్, బాలగోపాల్, దామోదర్‌రెడ్డిలు వచ్చారు. పోలీసుల తీరు, అప్పటి సీఎం ఎన్టీ రామారావు ప్రభుత్వ తీరును ఖండించారు. ఇది బూటకపు ఎన్కౌంటర్ అని పేర్కొన్నారు. ఎన్కౌంటర్లో ప్రత్యక్ష సాక్షి రహస్యంగా బతికి ఉండడంతో పోలీసులు డిఫెన్స్‌లో పడ్డారు. మూడు రోజులకు కలకలం పోలీసుల కాల్పుల నుంచి తప్పించుకున్న జనశక్తి దళనేత నారాయణగౌడ్ అలియాస్ రామన్న ఎన్కౌంటర్ ఎలా జరిగిందో కళ్లకు కట్టినట్లుగా తెలపడంతో ఆ కాలంలో దినపత్రికల్లో ధారావాహికంగా కథనాలు వచ్చాయి. ఎన్కౌంటర్ జరిగిన రోజు రాత్రి తప్పించుకున్న నారాయణగౌడ్ అదే రోజు రాత్రి గద్దెగట్టు చెరువుతూమ్ వద్ద నీరు తాగి, రక్తం ఎక్కువగా కారిపోకుండా రేగడి మట్టితో కట్టువేసుకుని అక్కడి నుంచి శివంగాళపల్లి వరకు నడుచుకుంటూ చేరుకున్నాడు. అక్కడి నుంచి జనశక్తి సానుభూతిపరుడి సాయంతో సైకిల్‌పై వేములవాడ మండలం మారుపాకకు చేరుకుని, మరో దళనేత బోడ లక్ష్మారెడ్డి అలియాస్ భూపతిరెడ్డిని కలిసి జీపులో వరంగల్‌కు, అటు నుంచి అటే ఖమ్మంకు చేరుకున్నాడు. అక్కడే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మూడో రోజు నుంచే ఆ ఎన్‌కౌంటర్‌కు ఎలా జరిగిందనే విషయాన్ని అప్పటి పత్రికలకు వివరిచారు. నారాయణగౌడ్ తరువాత రామన్నపేరుతో అజ్ఞాతంలో పనిచేస్తూ గల్ఫ్‌కు వెళ్లి వచ్చి కోనరావుపేట మండలం ధర్మారంలో స్థిరపడి అనారోగ్యంతో తొమ్మిదేళ్ల కిందట మరణించాడు. నేను ఆ రోజు రంగంపేటలో ఉన్న మాది వెంకట్రావుపేట. నేను అప్పటికే జనశక్తిలో చంద్రశేఖర్ పేరుతో దళనేతగా పనిచేస్తున్నాను. ఆ ఎన్కౌంటర్ జరిగిన రోజు నేను రంగంపేటలో ఉన్న. చెట్కూరి నారాయణ ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు. ఎన్కౌంటర్ తరువాత కూడా ఆయన మళ్లీ పనిచేశారు. ఆ ఎన్కౌంటర్ ఎలా జరిగిందో నారాయణ వివరంగా చెప్పారు. 1991లో నేను సిరిసిల్లలో అరెస్ట్ అయ్యాను. – ఇటిక్యాల నర్సయ్య, జనశక్తి మాజీ దళనేత నేను కోనరావుపేట ఎస్సైగా పనిచేశాను కొండాపూర్ ఎన్‌కౌంటర్‌కు ముందు నేను కోనరావుపేట ఎస్సైగా పనిచేశాను. నేను సిరిసిల్లలో ఎస్సైగా ఉండగా ఆ ఎన్కౌంటర్ జరిగింది. అప్పటి ఎస్పీ అశోక్‌ప్రసాద్ ఆదేశాలతో అక్కడే పోస్టుమార్టం చేయించాం. కొండాపూర్ ఎన్కౌంటర్ అప్పట్లో సంచలనమే. – ముళీధర్‌రావు, అప్పటి సిరిసిల్ల ఎస్సై, ప్రస్తుతం రిటైర్డు ఏఎస్పీ భయం గుప్పిట్లో పల్లెలు ఆ ఎన్కౌంటర్ జరిగినప్పుడు వరికోతలు ఉండేవి. నేను వెంకట్రావుపేటలో సర్పంచ్‌గా ఉ న్నాను. ఆ రోజుల్లో పల్లెల్లో ఎంతో భయం ఉండేది. ఎ ప్పుడు ఏం జరుగుతుందో తె లియని పరిస్థితి. మా గ్రామపంచాయతీలోనే పో లీస్క్యాంపు ఏర్పాటు చేశారు. సాయుధ పోలీసుల రక్షణ ఉండేది. వైర్లెస్ సెట్లు ఉండేవి. వెంకట్రావుపేట–కొండాపూర్ మధ్య జరిగిన ఆ ఎన్‌కౌంటర్‌ను ఆ కాలం వారు ఎప్పటికీ మరిచిపోరు. – పల్లం నర్సయ్య, మాజీ సర్పంచ్, వెంకట్రావుపేట -
తనిఖీలు చేస్తున్నా.. మారని తీరు
కోల్‌సిటీ(రామగుండం): రామగుండం నగరంలోని కొన్ని హోటళ్లు, బేకరీలు, స్వీట్‌హౌస్‌లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ల నిర్వాహకులు నాణ్యతను గాలికి వదిలేస్తున్నారు. బల్దియా అధికారులు ఆకస్మికంగా చేపట్టే తనిఖీల్లో విస్తుపోయే బాగోతాలు వెలుగు చూస్తున్నాయి. ఇటీవల ఓ బేకరీలో నాణ్యతలేని ఆహార పదార్థాలు, గడువు పూర్తయిన రసాయనాలు, ముడిసరుకులతో తయారు చేసిన తినుబండరాలను విక్రయిస్తున్నట్లు బహిర్గతమయ్యింది. దీంతో ఆ వ్యాపారికి రూ.20వేలు జరిమానా విధించారు. దీనినుంచి తేరుకోకముందే మరో నిర్లక్ష్యం వెలుగు చూసింది. గోదావరిఖని మార్కండేయకాలనీలోని తాజ్ ఫ్యామిలీ రెస్టారెంట్, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌ను హెల్త్ అసిస్టెంట్ కిరణ్, ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ మధుకర్, ఎంఐఎస్ ఆపరేటర్ శ్రీకాంత్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నాణ్యతలేని సరుకులతో ఆహార పదార్థాలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వాహకునికి రూ.8వేలు జరిమానా విధించారు. నాణ్యతలేని సరుకులతో ఫాస్ట్‌ఫుడ్ మరో రెస్టారెంట్‌కు రూ.8వేలు జరిమానా -
సర్ధాపూర్లో ఆయుధాగారం ప్రారంభం
సిరిసిల్ల: జిల్లా కేంద్రంలోని సర్ధాపూర్ 17వ పోలీస్ బెటాలియన్‌లో కొత్తగా నిర్మించిన ఆయుధగారం (బెల్ ఆఫ్ ఆర్మ్స్)ను వర్చువల్‌గా టీజీఎస్పీ బెటాలియన్స్ అడిషనల్ డీజీపీ సంజయ్‌కుమార్ జైన్ బుధవారం ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో సంజయ్‌కుమార్ జైన్ మాట్లాడుతూ బెటాలియన్ పోలీసులు అంకితభావంతో విధులు నిర్వహించాలన్నారు. తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ క్రమశిక్షణ గల ఆర్గనైజేషన్ అని వివరించారు. బెటాలియన్ అభివృద్ధిలో అధికారులు, సిబ్బంది పాత్ర అభినందనీయమన్నారు. సర్ధాపూర్ బెటాలియన్‌కు వచ్చిన డీఐజీ సన్నీకి కమాండెంట్ సురేష్ పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. బెటాలియన్‌లో నూతనంగా నిర్మించిన దోభీ, బార్బర్ రూమ్‌లను డీఐజీ సన్నీ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. వర్చువల్‌గా ప్రారంభించిన అడిషనల్ డీజీపీ సంజయ్‌కుమార్ జైన్ -
పర్మినెంట్ కాకుండానే పదవీవిరమణ
గన్నేరువరం: కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం చీమలకుంటపల్లె గ్రామ ప్రాథమిక పాఠశాలలో స్వీపర్‌గా పనిచేస్తున్న లింగన్న బుధవారం ఉద్యోగవిరమణ పొందారు. జిల్లాలోని తిమ్మాపూర్ మండలం వచ్చునూర్ గ్రామానికి చెందిన లింగన్న 1985లో రూ.75 జీతానికి తాత్కాలిక స్వీపర్‌గా విధుల్లో చేరారు. రూ.5 వేల జీతంతో బుధవారం ఉద్యోగ విరమణ పొందాడు. పర్మింనెట్ కాకుండా ఉద్యోగ విరమణ చేయడం బాధకరమని స్థానికులు తెలిపారు. 40ఏళ్లు విద్యార్థులకు, పాఠశాలకు చేసిన సేవలకు గుర్తింపుగా పూర్వ విద్యార్థులు, గ్రామస్తులు రూ.41,116ను ఆర్థికంగా సాయంగా అందించారు. ప్రధానోపాధ్యాయుడు రవీందర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రూ.75తో ప్రారంభమై.. రూ.5వేల వేతనంతో ఉద్యోగ విరమణ -
రివర్ ఫ్రంట్‌పై తలోమాట!
● వరద నివారణ పనులే చేపట్టామన్న నీటిపారుదల విభాగం ● పర్యావరణ అనుమతులు పొందుతామన్న టూరిజం ● తన నష్టాన్ని నీటిపారుదలశాఖ భరించాలన్న కాంట్రాక్టర్సాక్షిప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్‌కు తలమానికంగా చేపడుతున్న మానేరు రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టు పనులకు పర్యావరణ అనుమతులపై ఇరిగేషన్, టూరిజం విభాగాలు, కాంట్రాక్టు సంస్థ తలోమాట అంటున్నాయి. వీణవంక మండలానికి చెందిన వెంకటరెడ్డి అనే వ్యక్తి గతేడాది మానేరు రివర్‌ఫ్రంట్‌కు పర్యావరణ అనుమతులు లేవని జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆశ్రయించారు. ఈ కేసులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, రాష్ట్ర పర్యాటక శాఖ, జిల్లా కలెక్టర్, జిల్లా నీటిపారుదల శాఖలను ప్రతివాదులుగా చేర్చారు. దీనిపై ఆయా విభాగాలు తలోమాట అంటున్నాయి. ● నీటి పారుదల విభాగం అఫిడవిట్లో.. ‘మానేరు రివర్ ఫ్రంట్ (ఎంఆర్ఎఫ్) మా ప్రాజెక్టు కాదు. మేం అక్కడ కేవలం వరద నియంత్రణ చర్యలు మాత్రమే చేపడుతున్నాం. నీటి నాణ్యత పెంచడం, అక్కడి సహజ జీవావరణం పునరుద్ధరించడమే మా లక్ష్యం. వాస్తవానికి మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు పర్యాటక శాఖకు సంబంధించింది. మేం కేవలం మానేరు నది పరిసరాల్లో వరద నియంత్రణ చర్యలు మాత్రమే చేపడుతున్నాం. ఎల్ఎండీ దిగువ ప్రవాహంలో నదికి రెండువైపులా రక్షణ గోడలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రస్తుతం ఉన్న చెక్ డ్యాం–2ను బలోపేతం చేయడం, హాఫ్ బరాజ్‌ని నిర్మించడం, ఫీడర్ కెనాల్లో తవ్వకాలు జరిపి మంచినీటిగా మార్చడం. ఇందుకోసం మేం ఎలాంటి భూసేకరణ చేపట్టలేదు. ఎలాంటి నీటి నిల్వ చేపట్టలేదు. ఈ పనులకు పర్యావరణ అనుమతులు అక్కరలేదు’ అని వివరించింది. ● మరోవైపు తాము కేవలం పర్యాటకం కోసం మాత్రమే ఎంఆర్ఎఫ్ ప్రాజెక్టును 1.50 లక్షల చదరపు మీటర్లలో చేపట్టామని పర్యాటకశాఖ ఎన్జీటికి సమర్పించిన లేఖలో పేర్కొంది. ఇందులో ‘ఎంట్రన్స్ ప్లాజా’ కోసం 2.59 ఎకరాలు, ‘వ్యూ గ్యాలరీ’ కోసం 1.15 ఎకరాలు, నదిలో కడుతున్న ‘ఫౌంటేన్’ కోసం 350 గజాల స్థలం మాత్రమే సరిపోతుందని తెలిపింది. ఈ ప్రాజెక్టు పర్యావరణ అనుమతుల కోసం ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ (ఈఐఏ) సర్వే చేపడతామని కూడా స్పష్టం చేసింది.మానేరు రివర్ ఫ్రంట్నష్టాన్ని భరించాల్సింది మీరే: కాంట్రాక్టు సంస్థ తమ పనులు నిలిపివేయాలని ఆదేశించిన ఇరిగేషన్ విభాగానికి ఈ ప్రాజెక్టు పనులు నిర్వహిస్తున్న ఎస్ఎల్ఆర్, హెచ్‌ఈఎస్ (వీజే) సంస్థ కూడా తన ఇబ్బందులను వివరిస్తూ లేఖ రాసింది. ప్రాజెక్టులో భూసేకరణ, డ్రాయింగ్స్, డిజైన్స్, పర్యావరణ సర్వే తదితరాలు పూర్తిగా డిపార్ట్మెంట్లకు సంబంధించినవని తెలిపింది. సంక్లిష్ట దశలో పనులు నిలిపివేయాల్సి వచ్చిందని, ఈ దశలో పనులు ఆపడం వల్ల బరాజ్‌లకు జరిగే నష్టానికి తాను బాధ్యత వహించబోనని స్పష్టం చేసింది. ప్రాజెక్టు నిర్మాణానికి కావాల్సిన మానవ వనరులు, యంత్రాలు, సామగ్రి అన్నీ తమ వద్ద ఉన్నాయి. ఆకస్మికంగా పనులు ఆపివేయడం వల్ల ఇవి పనికి రాకుండా పాడయ్యే ప్రమాదం ఉంది. తమ యంత్రాలు, సామగ్రిని తరలించేందుకు కావాల్సిన ఖర్చును అదనంగా డిపార్ట్మెంట్ భరించాల్సి ఉంటుంది. ప్రాజెక్టులో నిలుస్తున్న నీటిని తోడేందుకు అదనంగా డీ వాటరింగ్ చేయాల్సి ఉంటుంది. దీనికి అయ్యే ఖర్చు కూడా భరించాలని స్పష్టంచేసింది. -
‘రెడీ’మేడ్ ఉపాధి సిద్ధం
సిరిసిల్ల: సిరిసిల్ల ప్రాంతంలోని మహిళలకు శాశ్వత ఉపాధిని అందించేందుకు ఆధునిక వస్త్రాల తయారీ యూనిట్ సిద్ధమైంది. జిల్లా కేంద్రం సమీపంలోని పెద్దూరు అపెరల్ పార్క్‌లో రెడీమేడ్ వస్త్రాల తయారీసంస్థ టెక్స్‌ఫోర్ట్ కంపెనీ యూనిట్‌ను శుక్రవారం రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, తుమ్మల నాగేశ్వర్రావు, పొన్నం ప్రభాకర్ ప్రారంభించనున్నారు. మంత్రుల పర్యటన నేపథ్యంలో కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, చేనేత, జౌళిశాఖ జేడీ ఎన్.వెంకటేశ్వర్రావు, సిరిసిల్ల ఆర్డీవో రాధాబాయి, డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, జౌళిశాఖ ఏడీ రాఘవరావు, టెక్స్‌ఫోర్ట్ కంపెనీ ప్రతినిధులతో బుధవారం సమీక్షించారు. రెండు వేల మందికి ఉపాధి రాజన్నసిరిసిల్ల జిల్లాలోని రెండు వేల మందికి ఉపాధి కల్పించే లక్ష్యంతో టెక్స్‌ఫోర్ట్ కంపెనీ ముందుకొచ్చింది. రెండు ఎకరాల్లో టెక్స్‌ఫోర్ట్ గార్మెంట్ యూనిట్‌ను నిర్మించారు. అపెరల్ పార్క్‌లో ఇప్పటికే గోకుల్దాస్ ఇమేజెస్ గార్మెంట్ సంస్థ యూనిట్‌ను మూడేళ్ల క్రితం ఏర్పాటు చేశారు. ఇక్కడ 500 మంది మహిళలకు ఉపాధి లభిస్తుంది. మరో వెయ్యి మందికి ఉపాధి కల్పించే దిశగా ఆ కంపెనీ యూనిట్‌ను విస్తరిస్తోంది. గోకుల్దాస్ సంస్థలో లోదుస్తులను తయారీచేస్తూ విదేశాలకు ఎగుమతి చేస్తోంది. సిరిసిల్ల నుంచి నేరుగా అమెరికాకు వస్త్రాలు వెళ్తున్నాయి. ఇప్పుడు టెక్స్‌ఫోర్ట్ అనే మరో అంతర్జాతీయ సంస్థ సిరిసిల్లలో పరిశ్రమను స్థాపించేందుకు ముందుకు రావడంతో 1600 మంది మహిళలు, మరో 400 మంది స్టాఫ్‌కు ఉపాధి లభించనుంది. శుక్రవారం టెక్స్‌ఫోర్ట్ యూనిట్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆధునిక జీన్స్, టీషర్ట్, అండర్‌వేర్స్ కుట్టుపై మహిళలకు ఇప్పటికే శిక్షణ ఇస్తున్నారు. రేపు అపెరల్ పార్క్‌లో టెక్స్‌ఫోర్ట్ యూనిట్ ప్రారంభం హాజరవుతున్న నలుగురు మంత్రులు ఏర్పాట్లు పర్యవేక్షించిన కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా -
అడిషనల్ కలెక్టర్ సందర్శన
కరీంనగర్: మహిళాభివృద్ధి శిశు సంక్షేమశాఖ పరిధిలోని భగత్‌నగర్‌లో ఉన్న జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయాన్ని అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ ఆకస్మికంగా సందర్శించారు. హాజరు రిజిస్టర్ పరిశీలించారు. సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ అధి కారి సబిత, డీసీపీవో పర్వీన్ వెంట ఉన్నారు.సమీక్ష సమావేశంవిద్యానగర్(కరీంనగర్): ఆర్టీసీ కరీంనగర్ రీజియన్ పరిధిలోని 11 డిపోల మేనేజర్లతో బుధవారం ఆర్ఎం బి.రాజు సమీక్ష నిర్వహించారు. వేసవికాలంలో అన్ని బస్స్టేషన్లలో తాగునీరు, తగినన్ని బస్సులు అందుబాటులో ఉంచాలని సూచించారు. డిప్యూటీ రీజనల్ మేనేజర్(మెకానిక్)బి.వెంకటేశ్వర్ రావు, డి ప్యూటీ రీజినల్ మేనేజర్(ఆపరేషన్స్) ఎస్.భూపతిరెడ్డి, జి.మనోహర్‌రెడ్డి పాల్గొన్నారు. గల్ఫ్ సమస్యలు పరిష్కరించాలి రామడుగు: గల్ఫ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ను కలిసి గల్ఫ్ జేఏసీ జిల్లా ఆధ్యక్షుడు చిలుముల రమేశ్ వినతిపత్రం అందజేశారు. గల్ఫ్ దేశాల్లో మృతి చెందిన కార్మికుల కుటుంబాలతో పాటుగా ప్రమాదంలో వైకల్యంబారిన పడిన వారికి ఉపాధి మార్గం కల్పించాలని కోరారు. నకిలీ ఏజెంట్లుపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అక్రమాలకు పాల్పడితే సహించం● ‘సాక్షి’ కథనంపై అదనపు కలెక్టర్ ఆరా కరీంనగర్ అర్బన్: జిల్లా గ్రామీణాభివద్ధి సంస్థలో అక్రమాలు, అన్యాయంపై బుధవారం ‘గాడి తప్పిన డీఆర్డీవో’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ ఆరా తీశారు. ధాన్యం కొనుగోళ్లపై జరిగిన సమావేశంలో నిబద్ధతతో పని చేయకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వీవోఏల వేతనాల విషయంలో పొరపాటు జరిగితే విధుల నుంచి తొలగించడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. సిబ్బందికి ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎల్సీ యాప్‌ను అనుసరించాలి కొత్తపల్లి(కరీంనగర్): ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ రూపొందించిన ఎల్సీ యాప్‌ను తప్పనిసరిగా అనుకరిస్తూనే విద్యుత్ పనులు చేపట్టాలని ఎస్ఈ మేక రమేశ్‌బాబు సూచించారు. కరీంనగర్‌లోని విద్యుత్ భవన్ లో బుధవారం 11 కె.వీ.‘ఎల్సీ’(లైన్‌క్లియర్) యాప్‌పై నిర్వహించిన శిక్షణ తరగతులను ప్రారంభించారు. వినియోగదారులకు మెరుగైన విద్యుత్ అందించడంతో పాటు విద్యుత్ ప్రమాదాల నివారణకు ఈ ఆన్లైన్ ఎల్సీ యాప్ దోహదపడుతుందన్నారు. డీఈటీ కె.ఉపేందర్, డీఈ జంపాల రాజం, ఏడీఈలు, ఏఈలు, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు. -
మహిళల భద్రతకు షీటీం
కరీంనగర్‌క్రైం: మహిళలు, బాలికల భద్రతకు కరీంనగర్ కమిషనరేట్‌లోని షీటీం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని సీపీ గౌస్ ఆలం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యా సంస్థలు, మహిళలు పనిచేసే ప్రదేశాల్లో విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తోందన్నారు. గడిచిన నెల రోజుల్లో మహిళలను వేధిస్తున్న వారిపై ఎనిమిది క్రిమినల్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. 15మందికి కుటుంబసభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చామన్నారు. 65 హాట్స్పాట్లలో నిఘా ఉంచామని, ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద 16మంది పోకిరీలను పట్టుకొని కౌన్సెలింగ్ నిర్వహించడం జరి గిందన్నారు. ఒంటరిగా ప్రయాణిస్తున్న వారు టీసేఫ్ యాప్ వినియోగించుకోవాలని తెలిపారు. విద్యార్థినులు, మహిళలు వేధింపులకు గురైతే షీటీం 8712670759 నంబర్‌కు లేదా డయల్ 100కు లేదా పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. అపరిచిత వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితో పంచుకోవద్దని సూచించారు. -
56 పోస్టులు.. 40 ఖాళీలు
● జిల్లా మార్కెటింగ్‌శాఖలో వెక్కిరిస్తున్న ఖాళీలు ● డీఎంవో నుంచి మార్కెట్ కార్యదర్శుల వరకు అదనపు బాధ్యతలు ● సీజనొస్తున్నా.. సిబ్బంది భర్తీ ఏది?కరీంనగర్ అర్బన్: మరోవారం, పది రోజుల్లో పంటల కొనుగోళ్లతో కళకళలాడనున్న వ్యవసాయ మార్కెట్లలో ఖాళీలు వెక్కిరిస్తున్నాయి. సిబ్బంది లేమితో పరిపాలన కునారిల్లుతుంటే భర్తీ మాటే లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. పొరుగు సేవల సిబ్బంది ఉండగా ఇచ్చే వేతనానికి నిబద్ధతతో పనిచేసే అవకాశముండదన్నది నిర్వివాదాంశం. ఆ క్రమంలో మార్కెటింగ్‌శాఖను గాడిన పెట్టాల్సిన అవసరం ఉంది. జిల్లా మార్కెటింగ్‌శాఖలో ఇద్దరే వ్యవసాయ మార్కెట్లపై పర్యవేక్షణ, అధికారుల పనితీరు, రైతుల సమస్యలపై ఎప్పటికప్పుడు సమీక్షించాల్సిన గురుతర బాధ్యత జిల్లా మార్కెటింగ్ శాఖది. కానీ జిల్లా విభజనతో కార్యాలయం బోసిపోయింది. సదరు కార్యాలయ మంజూరు పోస్టులు పది. ఏడీఎం, సీనియర్ మార్కెటింగ్ అసిస్టెంట్, రికార్డర్, టైపిస్టు, జూనియర్ ఆడిటర్ ఒక్కొక్కరు ఉండాల్సి ఉండగా ఇద్దరు అటెండర్లు ఉండాలి. కానీ కార్యాలయంలో ఒక జూనియర్ ఆడిటర్, ఒక అటెండర్ మాత్రమే మిగిలారు. మిగతా పోస్టులన్ని ఖాళీయే. పొరుగు సేవల కింద డాటా ఎంట్రీ ఆపరేటర్ విధులు నిర్వహిస్తున్నారు. ఒక్కో అధికారికి జోడు పదవులు జిల్లా మార్కెటింగ్‌శాఖ ఖాళీలు అటుంచితే వ్యవసాయ మార్కెట్లలోనూ అదే పరిస్థితి. జిల్లాలో 8 వ్యవసాయ మార్కెట్ యార్డులుండగా ప్రధాన మార్కెట్లలోనూ ఖాళీల కొరత వెక్కిరిస్తోంది. జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి మల్లేశం మినహా మిగతా మార్కెట్లకు జోడు పదవులే రాజ్యమేలుతున్నాయి. జమ్మికుంట గ్రేడ్–1 సెక్రటరీ రాజా హుజూరాబాద్ మార్కెట్ ఇన్చార్జి సెక్రటరీగా వ్యవహరిస్తుండగా గోపాల్రావుపేట, మానకొండూరు మార్కెట్లకు సెక్రటరీగా శ్రావణ్, చొప్పదండి, సైదాపూర్ మార్కెట్లకు ఇన్చార్జిలతో కాలం వెళ్లదీస్తున్నారు. కరీంనగర్ మార్కెట్ సెక్రటరీ ఏసీబీకి పట్టుబడగా ఎవరిని నియమించలేదు. మార్కెట్ ఆదాయాన్ని బట్టి సెలక్షన్ గ్రేడ్, స్పెషల్ గ్రేడ్, గ్రేడ్–1, గ్రేడ్–2, గ్రేడ్–3 కార్యదర్శుఽల నియామకం ఉంటుండగా రూ.6కోట్ల ఆదాయం గల కరీంనగర్, జమ్మికుంట మార్కెట్లకు సెలక్షన్ గ్రేడ్ కార్యదర్శి విధులు నిర్వహిస్తుంటారు. కరీంనగర్ వ్యవసాయ మార్కెట్లో సెలక్షన్ గ్రేడ్ కార్యదర్శి, గ్రేడ్–2 కార్యదర్శి పోస్టు ఖాళీగా ఉన్నాయి. యార్డుల్లో పర్యవేక్షణకు సంబంధించి కరీంనగర్ వ్యవసాయ మార్కెట్లో ఒక పోస్టయిన సహాయ కార్యదర్శి, అకౌంటెంట్, పర్యవేక్షకుడు, జేఎంఎస్, డ్రైవర్, వాచ్మెన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జమ్మికుంటలో టైపిస్టు, ఏఎంఎస్ ఒకటి, జూనియర్ మార్కెట్ సూపర్వైజర్ (జేఎంఎస్) మూడింటికి రెండు, అటెండర్ రెండింటికి రెండు, వాచ్మెన్ అయిదింటికి నాలుగు ఖాళీలే. ఆడ్తిదారులు, ఖరీదుదారులదే రాజ్యం వ్యవసాయ మార్కెట్లలో నిబంధనల మేరకు కొనుగోళ్లు, చెల్లింపుల ప్రక్రియ జరగాల్సి ఉండగా రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారు. ప్రధాన మార్కెట్లలో తక్పట్టీల్లోనూ నిబంధనలకు విరుద్ధంగా నగదు కోత పెట్టడం పరిపాటిగా సాగుతోంది. ఏ వ్యాపారమైనా మార్కెట్‌కు ఒక శాతం పన్ను కట్టాల్సి ఉండగా పూర్తిస్థాయి అధికారి లేక లక్షల ఆదాయం కోల్పోతోంది. జమ్మికుంట మార్కెట్లో ఈ– నామ్ అమలు అంతంతమాత్రమే కాగా వేలంలా ధరలను నిర్ణయించడం గమనార్హం. మార్కెట్ యార్డుల్లో పర్యవేక్షకులు, సహాయ మార్కెట్ పర్యవేక్షకులు, జూనియర్ మార్కెట్ పర్యవేక్షకుల పాత్ర కీలకం. అయితే సిబ్బంది లేకపోవడం, ఉన్న అధికారుల్లో కొందరు వీరికే దాసోహమవడం రైతన్నకు తీరని నష్టం కలుగుతోంది. ఖాళీల భర్తీపై గతంలో నివేదికలు అందజేశామని, ప్రభుత్వ నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని సంబంధిత అధికారి వివరించారు.ఇది కరీంనగర్ వ్యవసాయ మార్కెట్. మార్కెట్ కార్యదర్శి పురుషోత్తం ఇటీవల ఏసీబీకీ పట్టుబడగా సస్పెండ్ అయ్యారు. అప్పటి నుంచి ఎవరిని నియమించకపోగా సదరు కార్యదర్శే గంగాధర మార్కెట్‌కు ఇన్చార్జి. ఇప్పుడు ఈ రెండు మార్కెట్లకు కార్యదర్శులు లేరు.మార్కెటింగ్‌శాఖ జిల్లా కార్యాలయమిది. జిల్లా విభజనతో సిబ్బందిని ఇతర జిల్లాలకు సర్దుబాటు చేయడంతో అన్నీ ఖాళీలే. జిల్లా మార్కెటింగ్ అధికారిగా మంచిర్యాల డీఎంవో షాబుద్దీన్ ఇన్చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్నా రు. మిగతావారంత పొరుగు సేవల సిబ్బందే. మంజూరు పోస్టుల ప్రకారం భర్తీ శూన్యం. -
29 మంది బదులు వర్కర్ల నియామకం
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థలో తాత్కాలిక పద్ధతిలో 29మంది బదులు వర్కర్లను నియమించారు. ఔట్సోర్సింగ్ కింద పనిచేస్తూ అనారోగ్యానికి గురైన వర్కర్లకు బదులుగా అర్హులైన వారి కుటుంబ సభ్యులను నియమించాలనే డిమాండ్ కొంతకాలంగా ఉండడం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వ్యవహారాన్ని తేల్చేందుకు ఫోర్‌మెన్ కమిటీని కమిషనర్ నియమించగా, ఆ కమిటీ వర్కర్ల అనారోగ్యం నిజమేనా, వారి కుటుంబసభ్యులు అర్హులేనా అనే అంశాలపై విచారణ చేపట్టింది. విచారణ పూర్తి కావడంతో 29 మందికి బుధవారం నగరపాలకసంస్థ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్ తాత్కాలిక నియామక పత్రాలు అందజేశారు. దరఖాస్తు పెట్టుకున్న మరికొంతమంది వర్కర్లపై పూర్తిస్థాయిలో విచారణ అనంతరం నిర్ణయం తీసుకుంటామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో సహాయ కమిషనర్ వేణుమాధవ్, ఈఈ సంజీవ్ పాల్గొన్నారు. రికార్డు విభాగం తనిఖీ నగరపాలకసంస్థ కార్యాలయంలోని రికార్డు విభాగాన్ని కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్ బుధవారం తనిఖీ చేశారు. పలు రికార్డులను పరిశీలించారు. రికార్డుల నిర్వహణపై సెక్షన్ ఇన్చార్జి నుంచి వివరాలు సేకరించారు. -
కొత్త రేషన్‌కార్డుల ఎంపిక ప్రక్రియ షురూ
● నేటి నుంచి క్షేత్రస్థాయిలో వార్డు అధికారుల విచారణకరీంనగర్ కార్పొరేషన్: నగరవాసులు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న కొత్త రేషన్‌కార్డు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఎట్టకేలకు మొదలైంది. నగర పాలకసంస్థకు చెందిన వార్డు అధికారులు కొత్త రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన దరఖాస్తుల ఆధారంగా క్షేత్రస్థాయిలో ఎంపిక ప్రక్రియను చేపడుతున్నారు. గురువారం నుంచి రేషన్‌దుకాణాల వారీగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియపై విచారణ చేపట్టనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూపొందించిన ప్రత్యేక ఆప్ ద్వారా సమాచారాన్ని అప్లోడ్ చేయనున్నారు. సంవత్సరాలుగా కొత్తగా రేషన్‌కార్డులు ఇవ్వకపోవడం, రేషన్‌కార్డులో కుటుంబసభ్యులను చేర్చడం, తొలగించడం లేకపోవడంతో ప్రజలకు ఎదురుచూపులు తప్పడం లేదు. గతంలో కొత్త రేషన్‌కార్డులతో పాటు, సవరణల కోసం ప్రభుత్వం దరఖాస్తులు తీసుకోవడం తెలిసిందే. వచ్చిన దరఖాస్తులను ఆయా రేషన్‌దుకాణాల వారీగా జాబితాగా రూపొందించారు. ఆ జాబితా ఆధారంగా వార్డు అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టనున్నారు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కూడా వివరాలు సేకరించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను చేపట్టనున్నారు. పకడ్బందీగా చేపట్టాలి రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పగడ్బందీగా నిర్వహించాలని నగరపాలకసంస్థ కమిషనర్ చాహత్ బాజ్‌పేయి ఆదేశించారు. బుధవారం నగరపాలకసంస్థ సమావేశ మందిరంలో వార్డు అధికారులతో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వం ఇచ్చిన యాప్, మార్గదర్శకాలకు అనుగుణంగా విచారణ చేపట్టాలన్నారు. ముఖ్యంగా వార్షిక ఆదాయ ధ్రువీకరణపత్రాన్ని పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. నిబంధనల ప్రకారం వి చారణ చేసి వివరాలు అప్లోడ్ చేయాలన్నారు. -
వంటగ్యాస్ ధర తగ్గించాలి
కరీంనగర్: కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధర రూ.50ని వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కురి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం జిల్లాకేంద్రంలోని తెలంగాణ చౌక్‌లో పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధర రూ.50 పెంచడం మూలంగా పేద, మధ్యతరగతి ప్రజలపై తీరని భారం పడుతోందన్నారు. పెంచిన గ్యాస్ ధర తగ్గించేంతవరకు సీపీఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు వర్ణ వెంకటరెడ్డి, గుడికందుల సత్యం, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
హనుమ వాహనంపై రాములోరు
ఇల్లందకుంట: ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. స్వామివారు బుధవారం రాత్రి హనుమత్‌వాహనంపై విహరించారు. ముందుగా స్వామివారి ఉత్సవమూర్తులను పూలతో అలంకరించారు. అర్చకులు శేషం రామాచార్యుల మంత్రోచ్ఛరణల మధ్య ఆలయ ఆలయ మాఢవీధుల్లో స్వామివారు విహరించారు. అంతకుముందు ప్రభుత్వోత్సవం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఇన్చార్జి ఈవో సుధాకర్, ఆలయ కమిటీ చైర్మన్ ఇంగిలే రామారావు, కుమారస్వామి, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
స్వాతంత్య్ర సమరయోధుడు మృతి
పెగడపల్లి: మండలంలోని బతికపల్లి గ్రామానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీమంత్రి జీవన్‌రెడ్డికి స్వయాన మామ కాలగిరి ముత్యంరెడ్డి (94) మంగళవారం రాత్రి మృతి చెందాడు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ముత్యంరెడ్డి కరీంనగర్లో మృతిచెందగా.. స్వగ్రామమైన బతికపల్లిలో బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, మేడిపల్లి సత్యం, పలు వురు ప్రముఖు లు ఆయన మృతదేహానికి నివా ళులర్పించారు. అనంతరం అంత్యక్రియల్లో పాల్గొన్నారు. మృతుడు మాజీమంత్రి జీవన్‌రెడ్డికి స్వయాన మామ -
వాగులో పడి వృద్ధురాలి దుర్మరణం
ధర్మపురి: ధర్మపురిలోని శ్రీఅక్కపల్లి రాజరాజేశ్వరస్వామి ఆలయం సమీపంలోని వాగులో పడి బుధవారం కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మెట్టుపల్లికి చెందిన ఆకారపు మల్లమ్మ(68) మృతిచెందిందని ఎస్సై ఉదయ్ కుమార్ తెలిపారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బావిలో పడి వ్యక్తి మృతివెల్గటూర్: బావిలో పడి వ్యక్తి మృతిచెందిన సంఘటన మండలంలోని జగదేవుపేట గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ధర్మపురి మండలం జైన గామానికి చెందిన సంగెపు మహేశ్ (40) ఉపాధి నిమిత్తం ముంబయిలో కూలి పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. పదేళ్లుగా ఫిట్స్ వ్యాధితో బాధపడుతున్నాడు. గ్రామంలోని బంధువుల ఇంట్లో శుభకార్యం నిమిత్తం సోమవారం కుటుంబంతో కలిసి వచ్చాడు. బుధవారం బహిర్భూమికని గ్రామ శివారులోని వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. అదే సమయంలో ఫిట్స్ రావడంతో ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందాడు. మృతుడి భార్య మంగ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తునట్లు ఎస్సై ఉమాసాగర్ తెలిపారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతివెల్గటూర్: క్రిమిసంహారక మందు తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన ఎండపల్లి మండలం గొడిశెలపేటలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన అల్లె లచ్చయ్య (58) కూలి పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. పదిహేనేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్నా ఆరోగ్యం బాగుపడడంలేదు. జీవితంపై విరక్తి చెంది సోమవారం క్రిమిసంహారక మందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించారు. బుధవారం మృతిచెందాడు. మృతుడి భార్య విజయ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉమాసాగర్ తెలిపారు. తండ్రికి కూతురు తలకొరివిగొల్లపల్లి: కూతురే కొడుకై కన్నతండ్రికి తలకొరివి పెట్టిన ఘటన మండలంలోని భీంరాజ్‌పల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బక్కయ్యకు ఒక్కతే కూతురు. దండేపల్లి మండలం పాతగూడూరుకు చెందిన ఓ వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశాడు. కొద్దిరోజులుగా కూతురు వద్దనే ఉంటున్నాడు. మంగళవారం రాత్రి హఠాన్మరణం చెందాడు. దీంతో ఆయన స్వగ్రామమైన భీంరాజ్‌పల్లికి బుధవారం ఉదయం తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. బక్కయ్యకు కుమారులు లేకపోవడంతో కూతురు రజిత తండ్రికి తలకొరివి పెట్టింది. అక్రమ కట్టడాలు కూల్చివేతమేడిపల్లి: భీమారం మండల కేంద్రంలో ప్రభుత్వ భూములు కబ్జా చేసి చేపట్టిన నిర్మాణాలను తహసీల్దార్ జి.రవికిరణ్ రెవెన్యూ, పోలీస్ సిబ్బంది సహకారంతో కూల్చివేయించారు. మండల కేంద్రంలోని 1308 సర్వే నంబర్లో ఉన్న ప్రభుత్వ భూమిలో కొందరు సంఘాల పేరిట నిర్మాణాలు చేపట్టారు. మరికొందరు ఆలయాలు, ఈద్గాలు నిర్మించారు. ప్రభుత్వ కార్యాలయాలకు స్థలం లేకపోవడంతో వేరే గ్రామంలో నిర్మిస్తారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో గ్రామస్తులు భూములకబ్జా విషయాన్ని తెరపైకి తీసుకొచ్చి వాటిని తొలగించాలని, ఆ ప్రాంతంలో ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించాలని తీర్మానించారు. రెండురోజుల క్రితం రైతు, కుల సంఘాలు తహసీల్దార్ కార్యాలయం ముందు బైటాయించి ఆందోళనకు దిగారు. స్పందించిన రెవెన్యూ అధికారులు సున్నితప్రాంతాలైన గుడి, ఈద్గాల అంశాన్ని ఉన్నతాధికారులకు వివరించారు. అలాగే అందులో ఉన్న కొన్ని అక్రమ నిర్మాణలను తొలగించారు. ఆర్ఐ రాజారాం, ప్రవీణ్, మేడిపల్లి ఎస్సై శ్యామ్‌రాజ్, గ్రామ పంచాయతీ సిబ్బంది ఉన్నారు. -
ఇంగ్లిష్ ఒలింపియాడ్‌లో అల్ఫోర్స్ విద్యార్థికి ర్యాంకు
కొత్తపల్లి(కరీంనగర్): హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ పోటీ పరీక్షల సంస్థలైన యునిఫైడ్ కౌన్సిల్ ఇటీవల నిర్వహించిన జాతీయస్థాయి ఇంగ్లిష్ ఒలింపియాడ్‌లో కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ టెక్నో స్కూల్ విద్యార్థి ఎం.శీవేన్రెడ్డి (7వ తరగతి) అత్యుత్తమ ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయిలో 2వ ర్యాంకు సాధించడంతో పాటు రూ.10 వేల నగదు బహుమతి గెల్చుకున్నట్లు విద్యా సంస్థల చైర్మన్ వి.నరేందర్‌రెడ్డి తెలిపారు. పాఠశాలలో బుధవారం విద్యార్థిని అభినందించారు. పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు. శీవేన్రెడ్డిని అభినందిస్తున్న అల్ఫోర్స్ చైర్మన్ నరేందర్ రెడ్డి -
హోమియోతో మొండి వ్యాధులకు చెక్
కరీంనగర్‌టౌన్: హోమియోపతి ప్రపంచవ్యాప్తంగా రెండవ ప్రధాన వైద్యంగా గుర్తించబడింది. సాంప్రదాయ వైద్యానికి స్పందించని దీర్ఘకాలిక వ్యాధుల చికిత్సకు ఈ వైద్యం ఎంతగానో పనిచేస్తుంది. గతంలో తెలుగు రాష్ట్రాల్లో మెదడువాపును నయం చేయడంలో, చికెన్‌గున్యా, స్వైన్‌ఫ్లూ వంటి ఎన్నో వ్యాధులను నయం చేయడంలో హోమియో వైద్యం పనితనం అందరికి తెలిసింది. పలు మొండి వ్యాధులను నయం చేయగల శక్తి ఉందనే నమ్మకంతో ఈ వైద్య విధానాన్ని ఆశ్రయిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉంది. జర్మనీలో 1755 ఏప్రిల్ 10వ తేదీన జన్మించిన డాక్టర్ శామ్యూల్ హానిమన్ తన రెండు దశాబ్దాల పరిశోధన అనంతరం.. ప్రపంచానికి హోమియో వైద్యాన్ని అందించారు. ఆయన స్మృత్యర్థం ఏటా ఏప్రిల్ 10వ తేదీన ప్రపంచ హోమియోపతి దినోత్సవంగా జరుపుకుంటున్నారు. జీవనశైలికి అనుగుణంగా మారుతున్న జీవనశైలికి అనుగుణంగా ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. సైడ్ ఎఫెక్ట్లు లేని మందులు వాడుతూ రోగాలు నయం చేసుకునేందుకు మొగ్గుచూపుతున్నారు. ఏళ్ల తరబడి మందులు వాడాల్సి వచ్చే దీర్ఘకాలిక వ్యాధులను నయం చేసుకునేందుకు హోమియో సేవలను వినియోగంచుకుంటున్నారు. కీళ్ల, మోకాళ్ల, నడుం నొప్పులు, అర్థరైటిస్, సైనసైటిస్, షుగర్, బీపీ, థైరాయిడ్, కిడ్నీలో రాల్లు, అస్తమా, మలబద్దకం, అర్షమొలుల, సోరియాసిస్, బొల్లి వంటి చర్మవ్యాధులకు హోమియోపతిలో చికిత్స అందుబాటులో ఉంది. శాశ్వత పరిష్కారం కోసం రోగం నయం చేయడంలో కాస్త ఆలస్యమైనా ఖచ్చితంగా ఫలితం ఉంటుందనే నమ్మకమే హోమియోపతి సేవలు పెరగడానికి కారణంగా తెలుస్తోంది. శాశ్వత పరిష్కారం దొరుకుతుండడం ఒక కారణం. ముఖ్యంగా మొండి వ్యాధులకు మెరుగైన చికిత్స అందుతుండడంతో రోగులు హోమియోపతి వైపు మొగ్గుచూపుతున్నారు. రెండో ప్రధాన వైద్యంగా గుర్తింపు నేడు ప్రపంచ హోమియోపతి దినోత్సవం అన్ని వ్యాధులకు చికిత్స హోమియోలో అన్ని వ్యాధులకు చికిత్స అందుబాటులో ఉంది. సంతానసాఫల్యత, కీళ్లనొప్పులు, మెడనరాల నొప్పి, నడుమునొప్పి, సయాటికా, థైరాయిడ్, హర్మోన్ సంబంధ వ్యాధులు, కిడ్నీ స్టోన్స్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఖచ్చితమైన చికిత్స అందుతుంది. అస్తమా, తరచు జలుబు, జ్వరం, టాన్సిల్స్ పెరుగుదల, జ్ఞాపకశక్తి తగ్గడం, నిద్రలోమూత్ర విసర్జన వంటి అన్ని వ్యాధులకు హోమియో సమాధానం చెబుతుంది. అందువల్ల హోమియోకు ఆదరణ పెరుగుతోంది. – డాక్టర్ కొడిత్యాల శ్రీనివాస్, మాతృశ్రీ హోమియోక్లినిక్ -
హనుమాన్ చిన్న జయంతికి ఏర్పాట్లు చేయండి
జగిత్యాల: హనుమాన్ చిన్న జయంతికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఎస్పీ అశోక్‌కుమార్‌తో కలిసి బుధవారం అధికారులతో సమావేశమయ్యారు. ఈనెల 11 నుంచి జయంతి కార్యక్రమాల నేపథ్యంలో పదో తేదీలోపు ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. కిందిస్థాయి ఉద్యోగులతో సమన్వయం చేసుకుంటూ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. మూడు రోజులపాటు లైటింగ్, హోర్డింగ్‌లు ఏర్పాటు చేయాలని, 11న రాత్రి నుంచి 13వ తేదీ ఉదయం వరకు సుమారు రెండు లక్షలకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని, సుమారు 45వేల మంది భక్తులు మాలవిరమణ చేస్తారని, మూడు రోజులపాటు 14 కౌంటర్లను ఏర్పాటు చేసి సుమారు 5 లక్షల లడ్డూ ప్రసాదాలను అందుబాటులో ఉంచుతామని వివరించారు. ఆలయ ప్రాంగణంలో 64 సీసీకెమెరాలు ఉన్నాయని, అదనంగా 50 సీసీకెమెరాలను ఏర్పాటు చేస్తామని, ఆరు మెడికల్ క్యాంప్‌లు ఏర్పాటు చేయాలని తెలిపారు. మూడురోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని, ఇందుకోసం వేదిక ఏర్పాటు చేసి వందమంది కూర్చునేలా సిట్టింగ్ ఉండాలని సూచించారు. చలువ పందిళ్లు, కోనేరు వద్ద పారిశుధ్య పనులు చేపట్టాలని ఆదేశించారు. 24 గంటల పాటు నిరంతర విద్యుత్ సరఫరా ఉండాలని, కల్యాణ కట్ట వద్ద నాయీబ్రాహ్మణులను ఎక్కువగా నియమించుకోవాలని ఆదేశించారు. అధికారులందరూ సమన్వయంతో షిఫ్ట్‌ల వారిగా కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, డీఎస్పీ రఘుచందర్, కొండగట్టు ఆలయ ఈవో శ్రీనివాస్‌రావు, మదన్మోహన్, మున్సిపల్ కమిషనర్ స్పందన పాల్గొన్నారు. జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ -
కోడికోసం వెళ్లి.. బావిలో పడి
కమాన్‌పూర్(మంథని): వరి పంటను కోసేందుకు సిద్ధమైన రైతు నామని రాజేశం(70) ఆచారం ప్రకారం పొలం వద్ద కోడిని బలిచ్చే ప్రయత్నంలో సమీప వ్యవసాయ బావిలోపడి దుర్మరణం చెందాడు. పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండలం సిద్దిపల్లెలో బుధవారం ఈ ఘటన జరిగింది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామ శివారులో తనకున్న వరిపొలం వద్దకు బుధవారం ఉదయం కోడిని పట్టుకుని వెళ్లాడు. వరి పైరు కోసేందుకు ముందుగా కోడిని బలి ఇవ్వాలని నిర్ణయించాడు. తనవెంట తెచ్చుకున్న సంచిలోనుంచి కోడిని తీస్తుండగా అది ఎగిరిపోయి పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో పడింది. రాజేశం ఆ కోడిని పట్టుకునే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు ఆ బావిలో పడి మృతి చెందాడు. చాలాసేపటి వరకు రాజేశం ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పొలం వద్దకు వెళ్లారు. అక్కడ అటూఇటూ చూడగా ఎక్కడా కనిపించలేదు. చివరకు వ్యవసాయ బావిలో చూడగా శవమై కనిపించాడు. అప్పటిదాకా తమతో ఉన్న రాజేశం బావిలోపడి విగతజీవిగా మారడంతో కుటుంబసభ్యుల విలపించారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై ప్రసాద్ కేసు నమోదు చేసుకొన్నారు. వ్యవసాయ బావిలో పడి రైతు దుర్మరణం -
హార్వెస్టర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
తిమ్మాపూర్: మండలంలోని ఇందిరానగర్ గ్రామంలోని సాయిబాబా ఆలయం సమీపంలో రాజీవ్ రహదారిపై బుధవారం అర్ధరాత్రి ఆర్టీసీ బస్సు హార్వెస్టర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆర్టీసీ బస్సులోని పలువురితోపాటు, హార్వెస్టర్‌పై ఉన్న ఇద్దరు గాయపడ్డారు. డ్రైవర్ వాహనంలోనే ఇరుక్కుపోవడంతో పోలీసుల రెండు గంటలు శ్రమించి బయటకు తీశారు. ఎల్ఎండీ పోలీసుల కథనం ప్రకారం.. బుధవారం రాత్రి 12:40 గంటల సమయంలో ఇందిరానగర్ గ్రామ సాయిబాబా గుడివద్ద కరీంనగర్ వైపు వెళుతున్న హార్వెస్టర్‌ను హైదరాబాద్ నుంచి కరీంనగర్‌వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వేగంగా ఢీకొట్టింది. దీంతో హార్వెస్టర్ రోడ్డు అవతలివైపుదూసుకెళ్లి బోల్తాపడింది. బ్లేడ్లు మాత్రం బస్సులు ఇరుక్కుపోయాయి. ఈ ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో బస్సులోని పలువురితోపాటు హార్వెస్టర్‌పై ఉన్న ఇద్దరు గాయపడ్డారు. హార్వెస్టర్ డ్రైవర్ వాహనంలో ఇరుక్కుపోయాడు. స్థానికులు వెంటనే 108, ఎల్ఎండీ పోలీసులు సమాచారం అందించారు. దాదాపు 2 గంటలకు పైగా పోలీసులు, గ్రామస్తులు, హైవే పెట్రోల్ సిబ్బంది, మూడు 108 అంబులెన్స్ సిబ్బంది శ్రమించి బయటకు తీయగా.. మోకాలు విరిగి తీవ్ర గాయాలు అయ్యాయి. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివేక్ తెలిపారు. -
భర్తతోనే కలిసి ఉంటా..
● కరీంపేటలో మహిళ ఆందోళన శంకరపట్నం: భర్తతోనే కలిసి ఉంటానని ఓ మహిళ ఆందోళనకు దిగగా.. పలు మహిళా సంఘాలు మద్దతుగా నిలిచాయి. బాధితురాలి వివరాల ప్రకారం.. మండలంలోని కరీంపేట గ్రామానికి చెందిన గడ్డం రాజు మొదటి భార్య, ఇద్దరు పిల్లలు చనిపోయారు. చొప్పదండి మండలం మంగళపల్లి గ్రామానికి చెందిన స్వప్నను రెండో వివాహం చేసుకున్నారు. మూడు నెలలుగా స్వప్నను భర్త, అత్తింటివారు వేధిస్తున్నారు. కొంత డబ్బు ఇచ్చి, వదిలించుకోవాలని చూస్తున్నారని, భర్తతోనే కలిసి ఉంటానని స్వప్న ఆరోపించింది. ఆల్ ఇండియా పోలీస్ హ్యాండ్‌బాల్ పోటీలకు ఎంపిక కరీంనగర్‌స్పోర్ట్స్: ఉత్తరప్రదేశ్‌లోని లక్నో జరుగుతున్న ఆల్ ఇండియా పోలీస్ హ్యాండ్‌బాల్ చాంపియన్ షిప్ క్లస్టర్ పోటీలకు కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు చెందిన సీనియర్ క్రీడాకారులు ఎంపికై నట్లు ఉమ్మడి జిల్లా హ్యాండ్‌బాల్ సంఘం అధ్యక్ష,కార్యదర్శులు తెలిపారు. రామడుగుకు చెందిన అనుపురం సాయికృష్ణ ప్రస్తుతం మంచిర్యాలలో, కుర్మపల్లికి చెందిన పులి మాధవి ప్రస్తుతం రామగుండం కమిషనరేట్‌లో పనిచేస్తున్నారు. వీరి ఎంపికపై ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్ష కార్యదర్శులు నందెల్లి మహిపాల్, గసిరెడ్డి జనార్దన్‌రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ కాసర్ల ఆనంద్ కుమార్, రమణారావు, సంయుక్త కార్యదర్శి ప్రభాకర్, కోచ్ మూల వెంకటేశ్, వేల్పుల సురేందర్, కృష్ణహరి, శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. -
నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
కరీంనగర్‌రూరల్: ఓ వ్యక్తి నిర్లక్ష్యానికి పసి ప్రాణం బలైంది. సదరు వ్యక్తి ట్రాక్టర్‌కు ఉన్న తాళం చెవిని తీయకపోవడంతో తెలియక స్టార్ట్ చేసిన చిన్నారి ట్రాక్టర్‌తో సహా బావిలో పడి మృతి చెందడం తీవ్ర విషాదం నింపింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ధర్మారం మండలం బొమ్మారెడ్డిపల్లెకు చెందిన గడ్డం రమ్య– అజీందర్రెడ్డికి ఇద్దరు కూతుర్లున్నారు. పెద్దకూతురు జశ్విత(3)ను మూడు రోజుల క్రితం తన అక్కబావలు అన్నాడి మంజుల– రాజిరెడ్డి ఊరైన కరీంనగర్ మండలం బహుదూర్ఖాన్పేటకు పంపించారు. బుధవారం చింతచెట్టు కొట్టేందుకు కూలీలు రావడంతో చెట్టుకింద ఉన్న ట్రాక్టర్‌ను రాజిరెడ్డి కుమారుడు అభిరామ్‌రెడ్డి చిన్నారి జశ్వితను సీటు పక్కనే కూర్చుండబెట్టుకుని వ్యవసాయబావి ముందు నిలిపి కిందకుదిగి వెళ్లిపోయాడు. ట్రాక్టర్‌పై ఉన్న జశ్విత తాళం చెవిని తిప్పడంతో స్టార్ట్ అయిన ట్రాక్టర్ వేగంగా ముందుకుపోయి బావిలో పడిపోయింది. స్ధానికులు క్రేన్‌సాయంతో ట్రాక్టర్‌ను బావిలో నుంచి బయటకు తీశారు. ట్రాక్టర్ కింద పడిన జశ్విత ఊపిరి ఆడక బావిలోనే మృతిచెందింది. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు అక్కడికి వచ్చి మృతిచెందిన చిన్నారిని గుండెలకు హత్తుకుని రోధించిన తీరు చూసి స్థానికులు కంటతడిపెట్టారు. పోలీసులు చిన్నారి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చిన్నారి జశ్విత తండ్రి అజీందర్రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ సీఐ ప్రదీప్‌కుమార్ తెలిపారు. ట్రాక్టర్‌తో సహా బావిలో పడి చిన్నారి మృతి -
తల్లీకొడుకుల మృతితో రుద్రంగిలో ఉద్రిక్తం
రుద్రంగి(వేములవాడ): రుద్రంగికి చెందిన తల్లీకొడుకులు కాదాసు పుష్పలత, నిహాన్ మృతితో మండల కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అత్తమామలే విషమిచ్చి చంపారంటూ మృతురాలి తల్లిగారి కుటుంబ సభ్యులు పుష్పలత అత్తమామల ఇంటిపై సోమవారం దాడి చేశారు. వారి మృతికి కారకులను శిక్షించాలని కోరుతూ ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు అడ్డుకోవడంతో ధర్నాకు యత్నించారు. బాధితులకు న్యాయం చేస్తామని, తప్పు చేసిన వారు ఎంతటి వారైనా శిక్షిస్తామని చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు, రుద్రంగి ఎస్సై అశోక్ హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. గ్రామంలో అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా బందోబస్తు చేపట్టారు. పుష్పలత భర్త దుబాయ్ నుంచి మంగళవారం వస్తుండడంతో అంత్యక్రియలు సోమవారం జరుపలేదు. పుష్పలత మృతదేహాన్ని వేములవాడ ఏరియా ఆస్పత్రిలో భద్రపరిచారు. అనుమానితుల ఇంటిపై మృతురాలి కుటుంబీకుల దాడి సముదాయించిన పోలీసులు -
విద్యుత్ అధికారులు అప్రమత్తంగా ఉండాలి
● టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి హన్మకొండ: వాతావరణ శాఖ ఈదురు గాలులు, భారీ వర్షాలు ఉన్నాయని హెచ్చరించిన నేపథ్యంలో గోదావరి పరీవాహక ప్రాంతాల విద్యుత్ అధికారులు, ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని టీజీఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్‌రెడ్డి సూచించారు. సోమవారం హనుమకొండలోని టీజీఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంనుంచి 16 సర్కిళ్ల ఎస్ఈలు, డీఈలు, ఏడీఈలు, ఏఈలతో వీడీయో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వరుణ్‌రెడ్డి మాట్లాడుతూ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం పరిధిలో ఎప్పటికప్పుడు విద్యుత్ సరఫరా మానిటర్ చేస్తూ ఏదైనా అంతరాయం జరిగితే వెంటనే పునరుద్ధరించాలని అదేశించారు. చెట్లు విరిగి విద్యుత్ లైన్లపై పడితే, ట్రిపింగ్స్, బ్రేడౌన్లు సంభవిస్తే త్వరితగతిన పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని సూచించారు. పంటల కోతలు జరుగుతున్నందున పెండింగ్‌లో ఉన్న వ్యవసాయ సర్వీస్‌ల మంజూరు వేగవంతం చేయాలన్నారు. అత్యవసర సమయంలో కావాల్సిన మెటీరియల్‌ను సమకూర్చుతామన్నారు. వ్యవసాయానికి అవసరమైన చోట 63 కేవీఏ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి సర్కిల్లో ఎల్సీ యాప్‌పై సిబ్బందికి శిక్షణ ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జి డైరెక్టర్ టి.సదర్లాల్, జీఎంలు, ఎస్ఈలు, డీఈలు, ఏడీఈలు, ఏఈలు పాల్గొన్నారు. -
అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య
ధర్మపురి: ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధతో ఓ వ్యక్తి రాయపట్నం వద్ద గోదా వరిలో దూకి ఆ త్మహత్య చేసుకున్నాడు. ఎస్సై ఉదయ్‌కుమార్ వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన మహ్మద్ అలీ అహ్మద్(45) కొంతకాలంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు. జీవితంపై విరక్తి చెంది, ఆదివారం ఇంటి నుంచి బయటికొచ్చాడు. ధర్మపురి మండలం రాయపట్నం చేరుకుని గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం మృతదేహం లభ్యమైంది. మృతుడి కుమారుడు హసామ్ అహ్మద్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.ఉరేసుకుని ఒకరు..జగిత్యాలక్రైం: జగిత్యాల అర్బన్ మండలం గోపాల్రావుపేట గ్రామానికి చెందిన అనుసూ రి శ్యామ్‌సుందర్(46) సోమవారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నా డు. శ్యామ్సుందర్కు అతని సోదరునికి మధ్య కొద్దికాలంగా భూ వివాదం కొనసాగుతోంది. భూపత్రాలు ఇవ్వడం లేదనే మనస్తాపంతో సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య శ్రీలక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై సదాకర్ తెలిపారు.దుబాయ్‌లో అయిలాపూర్ వాసి మృతికోరుట్ల రూరల్: మండలంలోని అయిలాపూర్ గ్రామానికి చెందిన గాజర్ల శ్రీనివాస్(55) దుబాయ్ లో ఆదివారం గుండెపోటుతో మృతి చెందాడు. శ్రీనివాస్ గత 10ఏళ్లుగా జీవనోపాధి కోసం దుబా య్ వెళ్లి వస్తున్నాడు. రెండేళ్ల క్రితం సెలవుపై వచ్చి వెళ్లాడు. ఆదివారం ఉదయం తను ఉండే గదిలోనే గుండెపోటుతో మృతి చెందాడు. శ్రీని వాస్కు భార్య జల, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నాడు. పెద్ద కూతురు లాస్యకు వివాహం కాగా చిన్న కూతురు రమ్య డిగ్రీ పూర్తి చేసింది, కుమారుడు రణధీర్ ఎంసీఏ చది వాడు. ఇంటి పెద్ద మృతి చెందటంతో శ్రీనివాస్ మృతదేహం కోసం ఎదురుచూస్తూ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి..మెట్పల్లి: పట్టణంలోని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై కిరణ్‌కుమార్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ఈ నెల 5న స్థానిక పాత నటరాజ్ థియేటర్ సమీపంలో సుమారు 25ఏళ్ల యువకుడు అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. సమాచారమందుకున్న 108 సిబ్బంది అతన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి మరణించాడు. అప్పటి నుంచి మృతదేహాన్ని పోస్టుమార్టం గదిలో ఉంచగా, అతని సంబంధీకులు ఎవరు రాలేదు. దీంతో మృతదేహాన్ని దహన సంస్కారాల నిమిత్తం సోమవారం మున్సిపల్ సిబ్బందికి అప్పగించినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.స్తంభంపల్లిలో ఒకరు..వెల్గటూర్: వెల్గటూర్ మండలం స్తంభంపల్లికి చెందిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ చనిపోయాడు. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన జక్కుల రమేశ్(41)గత పదేళ్లుగా మద్యానికి బానిసయ్యాడు. జీవితంపై విరక్తి చెంది ఈ నెల 4న పురుగుల మందు తాగాడు. కుటుంబసభ్యులు జగిత్యాల ఏరియా ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ ఆదివా రం రాత్రి మృతి చెందాడు. మృతుడి భార్య వనిత ఫిర్యాదుతో సోమవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఉమాసాగర్ తెలిపారు.రైలు నుంచి పడి వివాహిత..జమ్మికుంట(హుజూరాబాద్): ప్రమాదవశాత్తు రైలు నుంచి పడి వివాహిత మృతిచెందింది. రామగుండం రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ తిరుపతి తెలిపిన వివరాలు.. మహా రాష్ట్రలోని రాజురా పట్ట ణానికి చెందిన వివాహిత ప్రతిభ రమేశ్గజ్ (46) వైద్యం కోసం కూతురు, సోదరుడితో కలిసి బల్హార్షా నుంచి సికింద్రాబాద్‌కు దక్షిణ్ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరింది. ఈ క్రమంలో జమ్మికుంట రైల్వే స్టేషన్లో ప్రమాదవశాత్తు రైలు నుంచి కింద పడి మృతిచెందింది. మృతురాలికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. భర్త రమేశ్కోండ్గజ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ తెలిపారు.నిరుద్యోగ మహిళలు, యువతులకు ఈ ఆటో డ్రైవింగ్‌లో శిక్షణచిగురుమామిడి: చిగురుమామిడి మండలంలోని నిరుద్యోగ యువతులు, మహిళలకు ఈ–ఆటో డ్రైవింగ్‌లో శిక్షణ ఇవ్వనున్నట్లు ఎంపీడీవో మధుసూదన్ సోమవారం తెలిపారు. 18 నుంచి 45ఏళ్ల వయస్సున్న వారికి 60 రోజులపాటు ఎల్‌ఎండీకాలనీలోని దుర్గాబాయి మహిళా, శిశువికాస ప్రాంగణంలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. 50మంది నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన యువతులకు ఎలక్ట్రిక్ ఆటో నడపడంలో శిక్షణ ఇచ్చి డ్రైవింగ్ లైసెన్సు జారీ చేస్తామన్నారు. ఆసక్తిగలవారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. -
రూ.10లక్షలు ఖర్చు చేసినా దక్కని ప్రాణం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ యువకుడు ఎనిమిది రోజులు మృత్యువుతో పోరాడి ఓడిపోయాడు. యువకుడి ప్రాణాలు కాపాడుకోవడానికి తల్లిదండ్రులు రూ.10లక్షలు ఖర్చు చేసినా ప్రాణాలు దక్కలేదు. ఈ సంఘటన ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్‌లో విషాదం నింపింది. ఎస్సై రమాకాంత్, గ్రామస్తులు తెలిపిన వివరాలు. నారాయణపూర్‌కు చెందిన షేక్ అవేజ్(18) గత నెల 30న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. ఆదివారం రాత్రి మృతి చెందాడు. రంజాన్ పండుగకు ముందు రోజు సిరిసిల్లలోని ఓ టైలర్లో కుట్టించిన కొత్త బట్టలు తీసుకురావడానికి తన మిత్రుడు షేక్ అఫ్రోజ్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. ఎదురుగా వస్తున్న ఆటోను బలంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఇద్దరిని మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అవేజ్ పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఏడు రోజులపాటు చికిత్స అందించారు. ఒక్కగానొక్క కొడుకును కాపాడుకోవడానికి తల్లిదండ్రులు అప్పు చేసి వైద్యం అందించారు. అయినా ప్రాణాలు దక్కకపోవడంతో తండ్రి సమద్, తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గాయపడ్డ మరో యువకుడు అఫ్రోజ్ చికిత్స పొందుతున్నాడు. మృతుని కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, రెడ్డి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు గుండారపు కృష్ణారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య, పార్టీ మండల అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి తదితరులు పరామర్శించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఎనిమిది రోజులు మృత్యువుతో పోరాటం గాయపడ్డ యువకుడి మృతి నారాయణపూర్‌లో విషాదం -
దళారుల దందా!
యువ వికాసంలో● సర్టిఫికెట్ల పేరుతో విచ్చలవిడిగా వసూళ్లు ● మీ సేవ కేంద్రాల్లో అదనపు దోపిడీ ● భారీగా దరఖాస్తులు.. మంజూరు అంతంతేఇతని పేరు మురళీకృష్ణ. కరీంనగర్ రూరల్ మండలం తీగలగుట్టపల్లి గ్రామం. బీసీ–డీ కాగా తన కుమారుడికి ఓబీసీ సర్టిఫికెట్ కోసం గత 16 రోజుల క్రితం మీసేవలో దరఖాస్తు చేశాడు. సదరు ఫారంతో తహసీల్దార్ కార్యాలయానికి వెళితే ఇంటి పేరుపై అనుమానమంటూ తిప్పుకుంటున్నారు. ఇప్పటికే రేషన్‌కార్డు, కుల సర్టిఫికెట్ జారీ చేసినవి ఉండగా వాటిని చూపినా కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారు.కరీంనగర్ అర్బన్: ప్రభుత్వం పథకాలు ప్రకటించడమే తరువాయి దళారుల జేబు నిండుతోంది. సామాన్యులు చేతిలో దరఖాస్తుల ఫారాలతో రెవెన్యూ కార్యాలయాలను ఆశ్రయిస్తుండగా మామూళ్లతో పనులు కానిచ్చేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ఇటీవల రాజీవ్ యువ వికాసం పథకాన్ని అమలు చేయగా దరఖాస్తులు కోరిన విషయం తెలిసిందే. గత నెలాఖరు గడువు కాగా, ఈ నెల 14వరకు పొడిగించింది. ధ్రువీకరణ పత్రాలు ఇప్పించడంతో పాటు పథక లబ్ధిదారులయ్యేలా చేస్తామని దళారులు బీరాలు పలకడం విశేషం. మొత్తంగా జిల్లాలో ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. కుల, అదాయ సర్టిఫికెట్లతో పాటు రేషన్ కార్డు అవసరం కాగా ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగడం పరిపాటిగా మారింది. దళారులకు మాత్రం అప్పటికప్పుడే ధృవీకరణ పత్రాలకు అప్రూవ్ ఇస్తున్నారని దరఖాస్తుదారులు వాపోతున్నారు. విచ్చలవిడిగా వసూళ్లు పథకం ప్రయోజనం అందుతుందో లేదో కానీ లంచాల బెడద అనివార్యమైందని తెలుస్తోంది. దరఖాస్తు చేసేందుకు మీ సేవ, ఈ సేవ కార్యాలయాలకు వెళితే నిర్ణీత రుసుంకు రెండింతలు వసూలు చేస్తున్నారు. ఇదెక్కడి అన్యాయమంటే మాకు ఖర్చులు ఎక్కువ.. ఎక్కువ తీసుకుంటేనే గిట్టుబాటవుతుందంటూ సమర్థింపు మాటలు మాట్లాడటం విశేషం. దరఖాస్తు తదుపరి తహసీల్దార్ కార్యాలయానికి వెళితే బ్రోకర్ల బెడద తప్పడం లేదన్నది బాధితుల మాట. గత కొన్నేళ్లుగా మీ సేవ కేంద్రాలపై పర్యవేక్షణ లేకపోగా తనిఖీల మాటే మరిచారు. దీంతో ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇక కరీంనగర్ రూరల్, చిగురుమామిడి, మానకొండూరు, తిమ్మాపూర్, గన్నేరువరం, గంగాధర, చొప్పదండి, రామడుగు, ఇల్లందకుంట, జమ్మికుంట తహసీల్దార్ కార్యాలయాల్లో దళారులే అన్నీ తామై వ్యవహరిస్తున్నారు. సర్టిఫికెట్లకు రూ.500ల నుంచి రూ.2వేల వరకు వసూలు చేస్తున్నారని సమాచారం. సర్టిఫికెట్ల జారీలో ఎందుకింత జాప్యం ఈ నెల 1 నుంచి వచ్చిన దరఖాస్తుల సంఖ్య, జారీ సంఖ్యను పరిశీలిస్తే అధికారుల నిర్లక్ష్యం స్పష్టమవుతోంది. ఈ నెల 7వరకు అంటే వారం రోజుల్లో జిల్లావ్యాప్తంగా కుల సర్టిఫికెట్ కోసం 3,621 దరఖాస్తులు రాగా అప్రూవ్ అయినవి కేవలం 567 మాత్రమే. ఈబీసీ కోసం 130 దరఖాస్తులు రాగా జారీ అయినవి 18. ఇక ఆదాయ ధృవీకరణ పత్రం కోసం 6,928 దరఖాస్తులు రాగా అప్రూవ్ అయినవి 1,945 మాత్రమే. సదరు గణాంకాలే రెవెన్యూ అధికారుల పనితీరుకు అద్దం పడుతున్నాయి. కరీంనగర్ రూరల్, గంగాధర, కరీంనగర్ అర్బన్, మానకొండూరు మండలాల్లో ఎక్కువగా పెండింగ్‌లో ఉండగా మిగతా అన్ని మండలాల్లోనూ కొంతమేర పెండింగ్ ఉన్నాయని తెలుస్తోంది. సర్టిఫికెట్ల కోసం వచ్చే అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలించి జారీ చేయాలని ఆదేశించామని, నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా ఈ నెల 1 నుంచి వచ్చిన అర్జీలు.. సర్టిపికెట్ల జారీ సంఖ్య గణాంకాల్లో కుల సర్టిఫికెట్‌కు దరఖాస్తులు: 3,621 జారీ అయినవి: 567 ఈబీసీ: 130, జారీ: 18 ఆదాయ ధృవీకరణ: 6,928, జారీ: 1,945 -
‘కేవీ’ పిలుస్తోంది
● ఒకటో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం ● ఈనెల 11వ తేదీ వరకు చివరి గడువు ● 2 నుంచి 10వ తరగతి వరకు ఖాళీలు ఉంటేనే అడ్మిషన్లుకరీంనగర్: ఆధునాతన సాంకేతిక విద్యనందించే కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు వేళయింది. ఈనెల 2నుంచి అన్ని కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాల సందడి మొద లైంది. కేంద్రీయ విద్యాలయ సంఘటన్ 2025–26 సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు జారీ చేసిన నోటిఫికేషన్ విద్యాలయాలకు చేరింది. ఆన్లైన్ ద్వారా అర్హుల నుంచి దరఖాస్తు స్వీకరణ జరుగనుంది. దరఖాస్తుల గడువు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రవేశాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఈనెల 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు స్వీకరిస్తారు. ఈనెల 18 నుంచి తేదీ నుంచి అడ్మిషన్లు జరుగుతాయి. విద్యార్థులకు మెరిట్ జాబితా ప్రకారం ప్రవేశాలను కల్పిస్తారు. లిస్టులో ఉన్నవారు మాత్రమే తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో కేంద్రీయ విద్యాలయంలో సంప్రదించి ప్రవేశాలను పొందాలి. ఒకటో తరగతిలో ప్రవేశానికి 2025 మార్చి 31వ తేదీ నాటికి ఐదేళ్లు వయస్సు నిండి ఏడేళ్ల వయస్సు కలిగి ఉండాలి. రెండో తరగతికి అరేళ్లు, 3వ తరగతికి ఏడేళ్లు, 4వ తరగతికి ఎనిమిదేళ్లు, 5వ తరగతికి తొమ్మిదేళ్లు, ఆరో తరగతికి పదేళ్లు, ఏడో తరగతికి 11 ఏళ్లు, ఎనిమిదో తరగతికి 12 ఏళ్లు, తొమ్మిదో తరగతికి 13, పదో తరగతికి 14 ఏళ్లు నిండి ఉండాలి. ఒక్కో కేంద్రీయ విద్యాలయంలో తరగతికి 40 చొప్పున సీట్లు ఉంటాయి. తాజాగా ఒకటో తరగతికి ప్రతి విద్యాలయంలో 40 చొప్పున ప్రవేశాలను నూతనంగా కల్పిస్తారు. ఆపై విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాలనుకుంటే కేంద్రీయ విద్యాలయ సంఘటన్ ఉన్నతస్థాయి అధికారులు, కేంద్ర మానవ వనరులమంత్రిత్వ శాఖ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. వీరికి ప్రాధాన్యం ప్రవేశాల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రక్షణ రంగంలో పనిచేసే వారికి తొలి ప్రాధాన్యత ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ అనుబంధ సంస్థల ఉద్యోగులు(ఆర్టీసీ, ఎన్పీడీసీఎల్, తదితర) ఒకే సంతానం కలిగిన కుటుంబాల్లోని వారికి ప్రాధాన్యం ఉంటుంది. పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ, కేవీఎస్ ఉన్నతాధికారులు సిఫార్సు చేసిన విద్యార్థులకు ప్రవేశాల్లో ప్రాధాన్యం కల్పిస్తారు. తొమ్మిదో తరగతిలో ప్రవేశానికి పరీక్ష ఉంటుంది. మూడు గంటల వ్యవధిలో 100 మార్కులకు పరీక్ష రాయాలి. హిందీ, ఆంగ్లం, గణితం, సైన్స్, సోషల్ పాఠ్యాంశాల్లో ఈ పరీక్ష ఉంటుంది. 100 మార్కులకు ఇతరులు కనీసం 33, ఎస్సీ,ఎస్టీ దివ్యాంగులు 25 మార్కులు సాధించాలి. ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు ప్రతిభ ఆధారంగా చేపడతారు. ఎస్సీలకు 15 శాతం(12 సీట్లు), ఎస్టీలకు 7.5 శాతం(6 సీట్లు), 3 శాతం సీట్లను దివ్యాంగులకు రిజర్వు అవుతాయి. మిగిలిన సీట్లు ఇతరులకు కేటాయిస్తారు. సీటు లభిస్తే దశ తిరిగినట్లే సీబీఎస్ఈ సిలబస్‌లో కేంద్రీయ విద్యాలయాల్లో బోధన ఉంటుంది. పిల్లలపై ఎటువంటి ఒత్తిడి లేకుండా నాణ్యమైన విద్యను అందిస్తారు. ఒకటో తరగతి నుంచే సాంకేతిక పరిజ్ఞానంతో పరిచయం, శాస్త్ర సాంకేతికపై అవగాహన పెంపొందించే కార్యక్రమాలు ఉంటాయి. మిగిలిన పాఠశాలలకు భిన్నంగా దీని పనివేళలు, సెలవులు ఉంటాయి. ఆటపాటలు, స్వేచ్ఛతో కూడిన విద్య అందుతుంది. 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు నవోదయ స్కూల్స్‌ల్లో 9వ తరగతిలో ప్రవేశానికి ఎంట్రెన్స్ పరీక్ష ఉంటుంది.ఫీజు వివరాలు అడ్మిషన్ పొందే విద్యార్థులు రూ.25 ప్రవేశ రుసుం చెల్లించాలి. ఒకటో తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థి వరకు నెలకు రూ.500 చెల్లించాలి. 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కంప్యూటర్ బోధన కోసం అదనంగా నెలకు రూ.100 చెల్లించాలి. 9వ, 10వ తరగతి విద్యార్థులకు ట్యూషన్ ఫీజు కింద అదనంగా నెలకు రూ.200 చెల్లించాలి. 11,12వ తరగతి విద్యార్థులకు ట్యూషన్ ఫీజు కింద అదనంగా నెలకు రూ.400 చెల్లించాలి. -
ఓపెన్ స్కూల్ పరీక్షలకు ఏర్పాట్లు
● కలెక్టర్ పమేలా సత్పతికరీంనగర్: ఈ నెల 20నుంచి నిర్వహించనున్న ఇంటర్, పదోతరగతి ఓపెన్‌స్కూల్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో వివిధశాఖల అధికారులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రశ్నపత్రాలను కేంద్రాలకు తరలించే సమయంలో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ఇతరులు ఎవరూ కూడా పరీక్ష కేంద్రాల్లో ఉండరాదని, గుర్తింపు పొందిన వారిని తప్ప ఎవరినీ కేంద్రాలకు అనుమతించరాదని ఆదేశించారు. ఇంటర్ పరీక్షల కోసం జిల్లాలో 4 సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని, 881 మంది పరీక్ష రాస్తున్నారని తెలిపారు. 10వ తరగతి ఓపెన్ స్కూల్ పరీక్షల కోసం 3 సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని, 421 మంది పరీక్షలు రాస్తున్నారని అన్నారు. ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్లను నియమించాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన చోట మహిళా పోలీస్ సిబ్బందికి డ్యూటీ కేటాయించాలని సూచించారు. ఓపెన్ స్కూల్ కో– ఆర్డినేటర్ సీహెచ్ నాగేశ్వరరావు, జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు, జిల్లా సైన్స్ అధికారి జైపాల్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఆస్తిపన్ను వసూళ్లు సంతృప్తికరం
● నగరపాలకసంస్థ కమిషనర్ చాహత్ బాజ్పేయ్కరీంనగర్ కార్పొరేషన్: గత ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్ను వసూళ్లు సంతృప్తికరంగా ఉన్నాయని నగరపాలకసంస్థ కమిషనర్‌చాహత్ బాజ్‌పేయ్ తెలిపారు. 15వ ఆర్థిక సంఘం నిధుల లక్ష్యాన్ని చేరుకోవడంతో ఆమె అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. సోమవారం కళాభారతిలో రెవెన్యూ అధికారులు, వార్డు అధికారులు, సపోర్టింగ్ ఉద్యోగులతో సమీక్ష నిర్వహించారు. గత ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్ను వసూళ్లలో సాధించిన ప్రగతి స్ఫూర్తిగా ఈ ఆర్థిక సంవత్సరం (2026–26) లక్ష్యం చేరుకోవాలన్నారు. పన్ను ఎక్కువ, తక్కువగా ఉన్న అసెస్మెంట్లను తప్పకుండా సరిచేయాలన్నారు. ట్రేడ్ లైసెన్స్‌లపై వార్డు అధికారులు ప్రత్యేక దృష్టిసారించాలని ఆదేశించారు. సమావేశంలో నగర పాలకసంస్థ అదనపు కమిషనర్ సువార్త, డిప్యూటీ కమిషనర్ స్వరూపరాణి, ఆర్వో భూమానందం,ఆర్ఐలు విజయలక్ష్మి, కిష్టయ్య పాల్గొన్నారు. -
కనుల పండువగా రామయ్య పట్టాభిషేకం
మంగళవారం శ్రీ 8 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025ఇల్లందకుంట రాములోరి పట్టాభిషేకం సోమవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా రామయ్యకు కిరీటాన్ని ధరించారు. వివిధ నదుల తీర్థాలతో అభిషేకం నిర్వహించారు. రాత్రి హంసవాహనంపై స్వామివారిని ఊరేగింంచారు. 108 స్వర్ణ పుష్పాలతో అలంకరించారు. ఆలయ అర్చకులు వంశీధరచార్యులు, సీతారామాచార్యుల మంత్రోచ్ఛరణల మధ్య స్వామివారు హంసవాహనంపై దర్శనమిచ్చారు. పట్టువస్త్రాలు సమర్పించిన కేంద్ర మంత్రి కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పట్టభిషేకానికి హాజరయ్యారు. స్వామివారికి పట్టువస్త్రాలు అందజేజేసి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆయనను ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఇన్చార్జి ఈవో కందుల సుధాకర్, ఆలయ కమిటీ చైర్మన్ ఇంగిలే రామారావు, కడారి కుమారస్వామి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, నాయకులు అనిల్‌రెడ్డి, రమణారెడ్డి, సంపత్‌రావు, శ్రీరామ్ శ్యాం, మల్లేశ్, పల్లపు రవి, పవన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. – ఇల్లందకుంటన్యూస్రీల్ -
ద్విచక్ర వాహనం దహనం
కోరుట్ల రూరల్: మండలంలోని యూసుఫ్‌నగర్ గ్రామంలో ఓ యువకుడు తన తాతకు చెందిన ద్విచక్ర వాహనాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ఈ ఘటనలో బైక్ పూర్తిగా దగ్ధమైంది. వివరాల్లోకి వెళితే మరిపెల్లి లింబయ్య ఆదివారం తన ద్విచక్ర వాహనాన్ని ఇంటి ఎదుట నిలిపి, ఇంట్లో నిద్రించాడు. తన మనవడు మరిపెల్లి లింబాద్రి రాత్రి 10గంటల ప్రాంతంలో మధ్యం సేవించి వచ్చి, ద్విచక్ర వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఇంట్లో నిద్రిస్తున్న లింబయ్య బయటకు వచ్చే సరికే బైక్ పూర్తిగా కాలిపోయింది. లింబయ్య పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఎస్సై శ్రీకాంత్ ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ద్విచక్ర వాహనం చోరీ జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లా కేంద్రంలోని కొత్తబస్టాండ్‌లో నిలిపిన ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. బుగ్గారం మండలం మద్దునూర్ గ్రామానికి చెందిన గంగిపెల్లి నాగరాజు ఈనెల 1న కొత్తబస్టాండ్‌లో బైక్ నిలిపి కళాశాలకు వెళ్లి వెళ్లాడు. మధ్యాహ్నం ఒంటి గంటకు తిరిగి వచ్చేసరికి గుర్తుతెలియని దొంగలు ద్విచక్ర వాహనాన్ని ఎత్తుకెళ్లారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్సై మన్మధరావు తెలిపారు. -
పరుగెత్తితే పతకమే..
● క్రీడా పోటీల్లో ‘మోడల్’ విద్యార్థుల సత్తా ● రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణిస్తున్న చిన్నారులు వాలీబాల్‌లో సత్తా ఇంటర్ సీఈసీ మొదటి సంవత్సరం చదువుతున్న సింధూ అండర్–19 వాలీబాల్ పోటీల్లో జాతీయస్థాయి పోటీలకు ఎంపికై ంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ విజయవాడలో నిర్వహించిన జాతీయస్థాయి వాలీబాల్ పోటీల్లో సత్తా చాటింది. – బి.సింధూ పట్టుదలతోనే ఇంటర్ ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న శరణ్య రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీల్లో రాణించి జాతీయస్థాయి పోటీలకు ఎంపికై ంది. అండర్–19లో మణిపూర్ రాష్ట్రంలోని ఇంపాలో ఈనెల 15 నుంచి 21 వరకు నిర్వహించే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు సన్నద్ధమవుతోంది. – బైకని శరణ్య ఆనందంగా ఉంది తొమ్మిదో తరగతి చదువుతున్న మనోజ్ఞ ఎస్జీఎఫ్ అండర్ –17లో ఇటీవల మెదక్‌లో జరిగిన రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీల్లో ప్రతిభ కనబర్చింది. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ంది. జమ్ముకాశ్మీర్‌లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లోనూ పాల్గొని సత్తా చాటడం ఆనందంగా ఉంది. – తుమ్మల మనోజ్ఞ ధర్మారం(ధర్మపురి): వాళ్లు పల్లెవాసులు.. క్రీడా నేపథ్యం లేని కుటుంబాల నుంచి వచ్చారు.. ఎక్క డా తర్ఫీదు కూడా తీసుకోలేదు.. కానీ, చదువుతోపాటు ఆటల్లోనూ రాణిస్తూ ఔరా అనిపిస్తున్నారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో సత్తా చాటుతు న్నారు ధర్మారం తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థులు. పీఈటీ కొమురయ్య, ప్రిన్సిపాల్ రాజ్‌కుమార్ ప్రోత్సాహంతో మెలకువలు నేర్చుకుంటున్నారు. ఈ విద్యాలయం నుంచి ఏటా 40 నుంచి 50 మంది విద్యార్థులు రాష్ట్రస్థాయి, ఐదుగురు జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటున్నారు. 2024–25 సంవత్సరంలో జాతీయస్థాయి పోటీలకు ఆరుగురు విద్యార్థులు హాజరవుతున్నారు. ఈ విద్యార్థులు పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేక శిక్షణ పొందిన క్రీడాకారులతో తలపడి ఆద్భుత రికార్డులో నమోదు చేస్తున్నారు. వివిధ పట్టణాలు, నగరాల్లో నిర్వహించే రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలకు సొంత ఖర్చులతోనే వెళ్తూ పతకాలు సాధిస్తున్నారు. పట్టుదలతోనే సాధ్యం పీఈటీ ప్రోత్సాహంతో సాఫ్ట్‌బాల్‌పై ఆసక్తి పెంచుకున్న. పట్టుదలతో ఆడుతూ రాష్ట్రస్థాయి నుంచి జాతీయ స్థాయి పోటీలకు చేరుకున్న. మహారాష్ట్రలోని నాందేడ్‌లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో రాణించడం సంతోషంగా ఉంది. – బండి వైష్ణవి జాతీయ స్థాయిలో ప్రతిభ ఎనిమిదో తరగతి చదువుతున్న ఓరం సౌజ్ఞ అథ్లెటిక్స్ అండర్ –14లో జాతీయ స్తాయికి ఎదిగింది. ఆమె పరుగెత్తుతే పతకం ఖాయం. రాష్ట్రస్థాయి నుంచి జాతీయస్థాయికి ఎదిగి గుజరాత్ హమ్మదాబాద్లో జరిగిన పోటీల్లో సత్తాచాటింది. – ఓరం సౌజ్ఞ -
తల్లీబిడ్డల ఆరోగ్యం అందరి బాధ్యత
కరీంనగర్‌టౌన్: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సోమవారం ర్యాలీ నిర్వహించారు. డీఎంహెచ్‌వో వెంకటరమణ జెండాఊపి ర్యాలీ ప్రారంభించారు. అంతకు ముందు వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయ సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. మహిళా సిబ్బందికి ఆరోగ్య మహిళ క్లినిక్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో వెంకటరమణ మాట్లాడుతూ... తల్లీబిడ్డల ఆరోగ్య రక్షణను ప్రభుత్వం, ప్రజలు బాధ్యతగా స్వీకరించడం అవసరమన్నారు. స్త్రీ సురక్షిత గర్భధారణ, నాణ్యమైన ప్రసూతి ప్రతీ స్త్రీ ప్రాథమిక హక్కన్నారు. కార్యక్రమంలో వైద్యులు సుధా, ఉమాశ్రీ, సాజిదా, శైలేంద్ర కుమార్, సన జవేరియా, రాజగోపాల్, విమల, స్వామి, ప్రణీత, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.క్వింటాల్ పత్తి రూ. 7,550జమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ పత్తి మార్కెట్లో సోమవారం క్వింటాల్ పత్తి రూ. 7,550 పలికింది. క్రయ విక్రయాలను మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేశం, గ్రేడ్–2 కార్యదర్శి రాజాలు పర్యవేక్షించారు.మామిడి తోటలను కాపాడుకోండిజగిత్యాలఅగ్రికల్చర్/మల్యాల: మామిడి తోట లకు ఆశిస్తున్న పురుగులను నివారించేందుకు రైతులు అప్రమత్తంగా ఉండాలని ఉద్యానవన శాస్త్రవేత్తలు సూచించారు. సోమవారం జగిత్యాల జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో శ్రీకొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు పర్యటించి, తోటలను పరిశీలించారు. ప్రస్తుతం మామిడికాయ వృద్ధి చెంది, టెంక గట్టిపడే దశలో ఉన్నాయని, పలు తోటల్లో తామర పురుగు ఉధృతిని గమనించినట్లు తెలిపారు. పురుగుల ఉధృతిని బట్టి లీటరు నీటిలో వేపనూనె 3మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేయాలన్నారు. అనంతరం ఫిప్రోనిల్ 80శాతం డబ్ల్యూజీ 0.2 గ్రాములు, లేదా స్పైనోసాడ్ 45శాతం ఎస్సీ 0.3 మిల్లీ లీటర్లు, లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని, సింథటిక్ పైరిత్రాయిడ్ కీటకనాశినిలను ఉపయోగించవద్దని సూచించారు. కృషి విజ్ఞాన కేంద్రం రామగిరిఖిల్లా శాస్త్రవేత్త డాక్టర్ వై.వెంకన్న, ఫామ్ మేనేజర్ బండారి నరేశ్, సంగారెడ్డి ఫల పరిశోధన స్థానం శాస్త్రవేత్త ఎ.నితీశ్, ఉద్యాన అధికారి మహేశ్ పాల్గొన్నారు.జాతీయ స్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు ఎంపికజమ్మికుంట: మండలంలోని కోరపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎనిమిదో తరగతి విద్యార్థి వనరస్ సుశాంత్ జాతీయ స్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు ఎంపికై నట్లు ఫిజికల్ డైరెక్టర్ జిట్టబోయిన శ్రీను సోమవారం తెలిపారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెలెక్షన్ ట్రయల్స్‌తో అత్యంత ప్రతిభ కనబరిచాడని, 8వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఒడిశా కెయిన్ జార్ స్టేడియంలో జరిగే 39వ సబ్ జూనియర్ జాతీయ స్థాయి హ్యాండ్ బాల్ పోటీల్లో పాల్గొంటారని, విద్యార్థి ఎంపిక పట్ల హెచ్ఎం మిడిదొడ్డి సమ్మయ్య, ఎంఈవో హేమలత, ఉపాధ్యాయులు రాజయ్య, దేవదాస్, ప్రకాశ్, శ్రీనివాస్, నరహరి, రాజు, రవికాంత్ రాజ్, శ్రీనివాస్‌రెడ్డి, పద్మ, సంపత్, శ్రీమాన్, గీత గ్రామస్తులు అభినందించారు. -
పింఛన్ ఇప్పించండి
కూతురు పుట్టుక నుంచి మానసిక, శారీరక వికలాంగురాలు. ఇప్పుడు 7 సంవత్సరాల వయ సు. దివ్యాంగుల పింఛన్ మంజూరు చేయాలని కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న. వస్తదంటరు.. కానీ రాదు. సదరం సర్టిఫికెట్ కూడా ఇచ్చిన. ఎన్నాళ్లని తిరగాలే. – వడ్లూరి రవళి, వెల్ది, మానకొండూరురెండేళ్లుగా అందని ‘ఉపకారం’.. బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీంలో భాగంగా విద్యార్థులను చేర్చుకుంటున్నాం. ప్రభుత్వం లక్కీడ్రా ద్వారా పాఠశాలలకు విద్యార్థులను కేటాయిస్తున్నారు. కానీ.. స్కాలర్షిప్లు మాత్రం రావడం లేదు. రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి.. అధికారులను కలవడం వినతిపత్రాలు ఇవ్వడం పరిపాటిగా మారింది. – శేఖర్‌రావు, నందిని కాన్వెంట్ స్కూల్ -
అమ్మా.. ఆలకించరూ!
● ప్రజావాణిలో కలెక్టర్‌తో బాధితుల ఏకరవు ● సమస్యలు పరిష్కరించాలని వేడుకోలుకరీంనగర్ అర్బన్: సమస్యలను పరిష్కరించాలని కలెక్టరేట్ బాట పట్టారు బాధితులు. నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా.. సాంత్వన కరవైందని వాపోయారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణికి వినతులు వెల్లువలా వచ్చాయి. కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మీకిరణ్లు అర్జీలను స్వీకరించారు. పలు సమస్యలను కలెక్టర్ అక్కడికక్కడే పరిష్కరించేందుకు చొరవ చూపారు. భూ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, రేషన్ కార్డుల అర్జీలే ఎక్కువగా వచ్చాయి. మొత్తం 246 అర్జీలు వచ్చినట్లు కలెక్టరేట్ ఏవో సుధాకర్ తెలిపారు.ప్రజావాణికి వచ్చిన అర్జీలు: 246 ఎక్కువగా మునిసిపల్ కార్పొరేషన్, కరీంనగర్: 41, ఆర్డీవో కరీంనగర్: 18 కరీంనగర్ రూరల్ తహసీల్దార్: 13 డీపీవో: 13, వీణవంక తహసీల్దార్: 9 -
కేసీఆర్ రాసిందే ‘బండి’ చదివేది!
● సుడా చైర్మన్ నరేందర్రెడ్డికరీంనగర్ కార్పొరేషన్: కేసీఆర్ రాసి పంపిన స్క్రిప్ట్‌ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చదువుతున్నారని సుడా చైర్మన్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి విమర్శించారు. సోమవారం నగరంలోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు అర్థ్ధరహితమన్నారు. గతంలో సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు దీక్ష చేస్తే అవసరం లేకున్నా.. పోలీసులతో హంగామా సృష్టించి కేసీఆర్ అరెస్ట్ చేయించారన్నారు. మ్యాచ్ ఫిక్సింగ్‌లో భాగంగా సంజయ్‌కి మైలేజీ రావడానికి అరెస్ట్ నాటకమాడిన కేసీఆర్, మరోసారి సంజయ్‌ని బీజేపీ అధ్యక్షుడిగా చేసేందుకు ప్రయత్నిస్తున్నరని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ చట్టంచేసి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల పట్ల చిత్తశుద్ధిని ప్రదర్శించిందన్నారు. సంజయ్‌కి ఏ మాత్రం బీసీల పట్ల చిత్తశుద్ధి ఉన్నా.. కేంద్రం ఆమోదించేలా చూడాలన్నారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు ఎండీ తాజ్, కొరివి అరుణ్‌కుమార్, శ్రవణ్‌నాయక్, చర్ల పద్మ, జీడి రమేశ్, సాయిరాం, గుండేటి శ్రీనివాస్‌రెడ్డి, మాసం ఖాన్, బషీర్ , భారి, వాసు, శ్రీధర్, కీర్తికుమార్ పాల్గొన్నారు. -
సప్తసాహితీ పుస్తకాల ఆవిష్కరణ
కరీంనగర్‌కల్చరల్: కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత డా.నలిమెల భాస్కర్ రచించిన మాటల మూటలు, ప్రణయ హృదయాలు, చెలిమెలు, ఆరు బెంగాలీ కథలు, తెలుగు క్రియా పదకోశం, తెలంగాణ పలుకుబడి, కుండి పుస్తకాలను సప్తతి మహోత్సవం సందర్భంగా ఆదివారం సాహితీ సోపతి ఆధ్వర్యంలో ఫిలింభవన్‌లో ఆవిష్కరించారు. మాటల మూటలు పుస్తకాన్ని ప్రముఖ కవి, సీనియర్ పాత్రికేయులు నగునూరి శేఖర్, ప్రణయ హృదయాలు పుస్తకాన్ని ప్రముఖ కవి, విమర్శకులు అన్నాడి గజేంద్రరెడ్డి ఆవిష్కరించారు. చెలిమెలు పుస్తకాన్ని ప్రముఖ కవి, రచయిత కాలమిస్ట్ అన్నవరం దేవేందర్, ఆరు బెంగాలీ కథలను రచయిత, కవి, గాయకులు గాజోజు నాగభూషణం, తెలుగు క్రియా పదకోశాన్ని కవి, రచయిత విమర్శకులు బూర్ల వెంకటేశ్వర్లు, తెలంగాణ పలుకుబడిని కవి కందుకూరి అంజయ్య, అనువాద నవల కుండిని కవి, విమర్శకులు కూకట్ల తిరుపతి ఆవిష్కరించారు. సీనియర్ ఫిజీషియన్ డాక్టర్ డి.రఘురామన్, జూకంటి జగన్నాథం, పొన్నం రవిచంద్ర, పెద్దింటి అశోక్‌కుమార్, రంగినేని మోహన్‌రావు, పీఎస్ రవీంద్ర, మాడిశెట్టి గోపాల్, డా.వాసరవేణి పరశురాం, మనోహర్‌రెడ్డి, మోత్కుల నారాయణ, బూరె దేవానందం, మద్దికుంట లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవంకరీంనగర్టౌన్: బీజేపీ 45వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదివారం కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. మాజీ మేయర్ సునీల్‌రావు తన క్యాంపు కార్యాలయంలో బీజేపీ జెండా ఆవిష్కరించి, డాక్టర్ శ్యామప్రసాద్, పండిట్ దీన్‌దయాళ్ చిత్రపటాలకు పూలమాల వేశారు. అనంతరం మిఠాయిలు పంపిణీ చేశారు. విద్యానగర్‌లోని మోదీచౌక్ జెండా గద్దె వద్ద బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పార్టీ జెండా ఆవిష్కరించారు. నరహరి లక్ష్మారెడ్డి, జాడి బాల్‌రెడ్డి, కోమాల ఆంజనేయులు, గుండారపు సంపత్, రెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రేకుర్తి 18వ డివిజన్లో పశ్చిమ జోన్ కన్వీనర్ జాడి బాల్‌రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ జెండా ఆవిష్కరించారు. నాయకులు పొన్నాల రాములు, గోదరి నరేశ్, ఎర్రోళ్ల ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. 59వ డివిజన్ సుష్మా స్వరాజ్ చౌరస్తాలో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరించారు. నాయకులు పబ్బాల్ల ఆంజనేయులు, దయ్యాల కరుణాకర్, సంజీవ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.విజయవంతం చేయాలికరీంనగర్: ట్రైకార్లో 2019–21లో రుణాలు మంజూరై చెక్కులు సిద్ధంచేసి బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు పడని లబ్ధిదారులు సోమవారం హైదరాబాద్‌లోని గిరిజన సంక్షేమ భవన్ ఎదుట జరిగే నిరసన కార్యక్రమానికి తరలివచ్చి విజయవంతం చేయాలని తెలంగాణ గిరిజన సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బోడ మోహన్‌నాయక్, జి.బీమాసాహెబ్ పిలుపునిచ్చారు. జిల్లా కార్యాలయంలో వారు మాట్లాడుతూ, రాజీవ్ యువ వికాసం పేరుతో రాష్ట్రప్రభుత్వం హడావిడిగా పథకాన్ని ప్రారంభించడం వల్ల ట్రైకార్ సంస్థ పూర్తిగా నిర్వీర్యమవుతుందనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. దాదాపు 30 వేల మంది గిరిజన యువతీయువకులకు రుణాలు మంజూరు చేసి వారి ఖాతాల్లో డబ్బులు వేయకుండా రద్దు చేయాలనే కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ట్రైకార్ లబ్ధిదారులు తరలిరావాలని కోరారు. సమావేశంలో గిరిజన సంఘం నాయకులు పాల్గొన్నారు.పవర్‌కట్ ప్రాంతాలుకొత్తపల్లి: విద్యుత్ మరమ్మతు పనులు చేపడుతున్నందున సోమవారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు టౌన్ 2 ఏడీఈ ఎం.లావణ్య తెలిపారు. ఉదయం 8.30 నుంచి 10.30 గంటల వరకు 11 కేవీ రామచంద్రాపూర్ ఫీడర్ పరిధిలోని ఆర్సీపీ బైపాస్‌రోడ్, లేక్ పోలీస్‌స్టేషన్, సప్తగిరికాలనీ, సాయిబాబా ఆలయం రోడ్, అంజనాద్రి ఆలయం, శ్రీనగర్‌కాలనీ, ఏఓస్ కాలనీ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని పేర్కొన్నారు. -
విద్యుత్ ప్రమాదాల నివారణకు ‘ఎల్సీ’
● యాప్‌తో సిబ్బంది భద్రతకు భరోసాకొత్తపల్లి(కరీంనగర్): విద్యుత్ మరమ్మతుల్లో భాగంగా మానవ తప్పిదాల వల్ల ప్రమాదాల నివారణకు టీజీఎన్పీడీసీఎల్ సంస్థ ఎల్సీ (లైన్ క్లియర్) యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎల్సీ తీసుకొని పనులు చేపడుతున్న సమయంలో చాలా మానవ తప్పిదాలు చోటుచేసుకోవడం, ఒక ఫీడర్‌కు బదులు మరో ఫీడర్ ఎంచుకోవడం, సమాచార లోపం తదితర కారణాల వల్ల ఉద్యోగులు ప్రమాదా లకు గురవుతున్నారు. దీంతో యాజమాన్యం ఎల్సీ యాప్‌ను రూపొందించింది. ఎల్సీ యాప్ అమలు విధానం మొదట ఎల్సీ తీసుకోవాలనుకునే లైన్మెన్ యాప్ ఓపెన్ చేసి అందులో సంబంధిత ఫీడర్లో ఎల్సీ కావాలని సంబంధిత ఏఈకి విన్నవించాలి. ఏఈ లైన్మెన్ విన్నపాన్ని ప రిశీలించి ఆ ఫీడర్లో ఎల్సీ ఇవ్వచ్చా, లేదా.. అత్యవసర అ వసరాలేమైనా ఉన్నాయా, మరే ఇతర షెడ్యూల్ చేయబ డిన పనులు ఉన్నాయా అని ఆలోచించి నిర్ణయం తీసుకో వాల్సి ఉంటుంది. ఏఈ అనుమతి ఇవ్వగానే సంబంధిత లై న్మెన్కి సమాచారం వెళ్తోంది. అలాగే సబ్‌స్టేషన్ ఆపరేటర్‌కు ఏ ఫీడర్ ఇవ్వాలో యాప్ ద్వా రా తెలుస్తోంది. ఎల్సీ ఇవ్వాల్సిన సమయంలో సబ్‌స్టేషన్ ఆపరేటర్ ఏమరపాటుగా చేసే పొరపాట్లను నివారించుటకు యాప్ తగు సూచనలు, జాగ్రత్తలు తెలియజేస్తుంది. అనగా.. హెల్మెట్ పెట్టుకోవాలని, హ్యాండ్ గ్లౌజ్ వేసుకోవాలని, ఎర్త్ రాడ్ వెయ్యాలని, ఏబీ స్విచ్ ఓపెన్ చేశారా లేదా అన్న విషయాలను యాప్ గుర్తు చేయనుంది. వీటన్నింటినీ సబ్ స్టేషన్ ఆపరేటర్ ఫొటో తీసి యాప్‌లో అప్లోడ్ చేయాలి. ఆ ఫొటోను యాప్ ద్వారా లైన్మెన్ చూసుకొని ఆ ఫొటోలో కన్పిస్తున్న ఫీడర్, ఏబీ స్విచ్ ఓపెన్ చేశారా లేదా అని ధ్రువీకరించుకొని పనికి ఉపక్రమించాల్సి ఉంటుంది. పనిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు సైతం యాప్‌లో సూచించనున్నాయి. లైన్మెన్ ఎంత మంది సిబ్బంది చేత పని చేయిస్తున్నాడో వారి పేర్లు యాప్‌లో పొందుపరచాలి. పని పూర్తికాగానే లైన్మెన్ ఆ పనికి సంబంధించిన ఫొటో, సిబ్బంది వచ్చారా లేదా అని యాప్‌లో పొందుపరచి ఎల్సీ రిటర్న్ చేయాల్సి ఉంది. దీంతో సబ్‌స్టేషన్ ఆపరేటర్‌కు యాప్ ద్వారా ఎల్సీ రిటర్న్ ఆదేశాలు వెళ్లనున్నాయి. అప్పుడు సబ్ స్టేషన్ ఆపరేటర్ ఎల్సీ రిటర్న్ చేసే క్రమంలో ఎర్త్ రాడ్ తీసారా, ఏబీ స్విచ్ ఓపెన్ చేశారా లేదా అని యాప్ అడుగుతోంది. ఇలా ఎల్సీ పూర్తయి సంబంధిత ఏఈకి సమాచారం వెళ్తుంది.ప్రమాదాల నివారణకు.. విద్యుత్ సేవల్లో భాగంగా మానవ తప్పిదాల వల్ల జరిగే ప్రమాదాల నివారణకు సంస్థ ఎల్సీ యాప్‌ను రూపొందించింది. యాప్‌తో ఉద్యోగుల మధ్య సమన్వయంతో పాటు ఏ లైన్‌పై పనులు చేపడుతున్నారో తెలియజేయనుంది. దీంతో భద్రతా ప్రమాణాలు పెరిగి ప్రమాదాలను నివారించవచ్చు. అలాగే అనవసరమైన ఎల్సీలను తగ్గించవచ్చు. – రమేశ్‌బాబు, ఎస్ఈ, కరీంనగర్ సర్కిల్ -
గ్రామ పాలనకు కసరత్తు
● మళ్లీ ఆప్షన్లకు ఈ నెల 16వరకు అవకాశం ● వీఎల్వో సేవలకు పోటాపోటీ ● జిల్లాలో 600కు పైగా ఆశావహులుకరీంనగర్ అర్బన్: గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే వీఆర్వో, వీఆర్ఏల నుంచి ఆప్షన్లు స్వీకరించగా మరో అవకాశమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 16వరకు అవకాశమివ్వగా మరోసారి దరఖాస్తు చేయాలని నిర్దేశించింది. రెవెన్యూశాఖలో కీలకమైన వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థను గత ప్రభుత్వం రద్దు చేయగా కాంగ్రెస్ ప్రభుత్వం వీఎల్వో పేరుతో రెవెన్యూశాఖకు జవసత్వాలిచ్చేలా చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ భూముల పరిరక్షణ వంటి అంశాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ.. విలేజ్ లెవల్ ఆఫీసర్‌ను నియమించాలని నిర్ణయించింది. ఈ మేరకు కలెక్టర్‌కు ఆదేశాలు రాగా ఇప్పటికే ఆన్లైన్ ఆప్షన్లను స్వీకరించారు. ఇతర శాఖల్లో సర్దుబాటు అయిన వీఆర్వో, వీఆర్ఏలను తిరిగి రెవెన్యూలో కొనసాగించనుండగా సదరు ఉద్యోగులు ఆప్షన్లు ఇచ్చారు. ఇతరశాఖల్లో సర్దుబాటుకు ముందు జిల్లాలో 658 మంది వీఆర్ఏలు, 350 మంది వీఆర్వోలు ఉండేవారు. గూగుల్‌లో ఆప్షన్ ఫారం అందుబాటులో ఉంచగా ఆసక్తిగలవారు తమ వివరాలను నమోదు చేస్తున్నారు. జిల్లాలో 313 గ్రామ పంచాయతీలుండగా ఐదు మునిసిపాలిటీలున్నాయి. పోటీ ఎక్కువగా ఉండగా ఎవరిని సదరు పోస్టులో కొనసాగిస్తారో అన్న ఉత్కంఠ నెలకొంది. స్థానికత ఎక్కడ.. విద్యార్హత ఏంటీ డిగ్రీ లేదా ఇంటర్ అర్హతతో ఐదేళ్ల సర్వీసు ఉన్న వారికి అవకాశం ఇవ్వనున్నారు. మొదట పూర్వ వీఆర్వో, వీఆర్ఏలకే అవకాశం ఉండగా వీఆర్ఏల నుంచి ఉద్యోగ క్రమబద్ధీకరణ పొంది జూనియర్ అసిస్టెంట్లుగా లేదా రికార్డు అసిస్టెంట్లుగా విధులు నిర్వర్తిస్తున్నవారిని పరిగణనలోకి తీసుకుంటారు. సీసీఎల్ఏ పరిధిలో ఎంపిక చేసి జిల్లాకు కేటాయింపులు చేస్తారని ఓ రెవెన్యూ ఉన్నతాధికారి వివరించారు. కాగా ఫారంలో పుట్టిన తేదీ, విద్యార్హత, స్థానికత ఎక్కడ, ప్రస్తుతం ఏ జిల్లాలో పని చేస్తున్నారు, ఏ శాఖలో ఉన్నారు, ఏ బాధ్యతలు నిర్వహిస్తున్నారు, ఐడీ నంబర్, ఎప్పుడు రెగ్యులర్ అయింది, ఎప్పుడు నియామకమయ్యారు, సదరు ప్రతిని అప్లోడ్ చేయాలనే ఆప్షన్లు ఉన్నాయి. దాదాపు విధులు ఇవే వీఆర్వోలు, వీఆర్ఏలు ప్రస్తుతం వివిధశాఖల్లో విధులు నిర్వహిస్తున్నారు. వీఆర్వోలను పంచాయతీరాజ్, మునిసిపల్, నీటిపారుదల శాఖకు కేటాయించగా వీఆర్ఏలను మిషన్ భగీరథ, మున్సిపల్, నీటిపారుదల శాఖల్లో విధులు నిర్వహిస్తున్నారు. కాగా గ్రామ పాలన అధికారులకు వివిధ రకాల విధులు ఉండనున్నాయని సమాచారం. ఇదిలాఉండగా 61ఏళ్లు పైబడిన వీఆర్ఏల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలో సర్దుబాటైన వీఆర్వో, వీఆర్ఏలను తిరిగి రెవెన్యూ శాఖలో కొనసాగించే ప్రక్రియ చేపడుతుండగా వీరి విషయంలో స్పష్టత లేకపోవడం గమనార్హం. జిల్లాలో 80కి పైగా 61 సంవత్సరాలు పైబడినవారుండగా ఇందులో కొందరు మరణించగా పలువురు మంచంపట్టారు.ఇప్పటికే ఆప్షన్లు ఇచ్చినవారు: 605 వీఆర్వో కేటగిరీ: 254 వీఆర్ఏ కేటగిరీ: 351 -
మరింత చేరువయ్యేలా..
● ఇక అన్నదాతలందరికీ ‘రైతునేస్తం’ ● ప్రతి మండలంలో మరో రెండు వేదికల్లో ప్రారంభం కొత్తగా రైతునేస్తం ప్రారంభించనున్న రైతు వేదికలుమండలం క్లస్టర్ కరీంనగర్‌రూరల్ దుర్శేడ్, మొగ్ధుంపూర్ కొత్తపల్లి కమాన్‌పూర్, బద్ధిపల్లి మానకొండూరు చెంజర్ల, పచ్చునూరు తిమ్మాపూర్ పర్లపల్లి, రేణికుంట శంకరపట్నం మెట్పల్లి, కాచాపూర్ గన్నేరువరం గుండ్లపల్లి, మాదాపూర్ చిగురుమామిడి ఇందుర్తి, సుందరగిరి హుజూరాబాద్ కందుగుల, సిర్సాపల్లి జమ్మికుంట జమ్మికుంట, వావిలాల వీణవంక వీణవంక, వల్భపూర్ సైదాపూర్ దుద్దెనపల్లి, రాయికల్ ఇల్లంతకుంట సిరిసేడు, బుజునూరు గంగాధర గర్షకుర్తి, బూరుగుపల్లి చొప్పదండి ఆర్నకొండ, గుమ్లాపూర్ రామడుగు గోపాల్రావుపేట, రుద్రారంకరీంనగర్రూరల్: రైతు నేస్తం కార్యక్రమాన్ని రైతులందరికీ మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు మండల కేంద్రాల్లోని రైతువేదికల్లో ప్రతీ మంగళవారం రైతునేస్తం కార్యక్రమంలో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు ప్రత్యక్ష ప్రసారం చేశారు. ప్రస్తుతం రైతులకు మరింత సేవలందించేందుకుగాను అదనంగా ప్రతీ మండలంలోని రెండు క్లస్టర్లలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మండలానికో క్లస్టర్ రైతువేదిక.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన రైతువేదికల ద్వారా రైతులకు సేవలందించేందుకు వీలుగా ఆధునిక, సాంకేతిక పద్ధతులను ఉపయోగించుకుని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సలహాలు, సూచనలు అందించేందుకు రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించింది. మూడేళ్లక్రితం మొదటి విడతలో ప్రయోగాత్మకంగా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కొత్తపల్లి రైతువేదిక, హుజూరాబాద్‌లో హుజూరాబాద్, చొప్పదండిలో గంగాధర, మానకొండూరులో తిమ్మాపూర్ రైతువేదికలను ఎంపిక చేశారు. అనంతరం రెండో విడతలో మండలానికో రైతు వేదిక చొప్పున కరీంనగర్‌రూరల్ మండలంలోని చామనపల్లి రైతువేదిక, మానకొండూరు, గన్నేరువరం మండల కేంద్రాలు, శంకరపట్నంలో కేశవపట్నం, చిగురుమామిడి, చొప్పదండి, రామడుగు, సైదాపూర్ మండల కేంద్రాలు, జమ్మికుంటలోని తనుగుల, ఇల్లంందకుంట మండల కేంద్రం, వీణవంకలోని చల్లూరు రైతువేదికలను ఎంపిక చేసి ప్రతి మంగళవారం రైతునేస్తం కార్యక్రమాలను ప్రసారం చేశారు. ప్రస్తుతం మూడో విడతలో జిల్లాలోని మొత్తం 15 మండలాల్లో రెండు క్లస్టర్ల చొప్పున రైతువేదికలను ఎంపిక చేసి వీడియో కాన్ఫరెన్స్ పరికరాలను ఏర్పాటు చేయనున్నారు. కేవీకే ఆధ్వర్యంలో.. జిల్లాలో సాగు చేసే పంటలలో యాజమాన్య పద్ధతులపై వ్యవసాయ విశ్వవిద్యాలయం కేంద్రంగా శాస్త్రవేత్తలు సలహాలు, సూచనలు అందించారు. అయి తే జిల్లాల వారీగా పంటల సాగు పద్ధతులు, ఆశించే తెగుళ్లు వేర్వేరుగా ఉండటంతో రైతులకు సరైన సలహాలు లభించలేదు. ఇక నుంచి కృషి విజ్ఞన కేంద్రం ద్వారా స్థానిక శాస్త్రవేత్తలతో రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు అందించేందుకు అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. -
ఫుడ్ పాయిజన్‌తో మహిళ మృతి
రుద్రంగి(వేములవాడ): రుద్రంగి మండల కేంద్రానికి చె ందిన కాదాసు పుష్పలత(35) అనే మహిళ ఫుడ్ పాయిజన్‌తో ఆదివారం మృతి చెందింది. వి వరాలు ఇలా ఉన్నాయి. రుద్రంగి మండల కేంద్రానికి చెందిన కాదాసు పుష్పలత, ఆమె కు మారుడు కాదాసు నిహాల్(6) శుక్రవారం రాత్రి ఇ ంట్లో చేసిన రొట్టెలు తిని పడుకున్నారు. అనంతరం ఇద్దరికీ వాంతులు, విరేచనాలు కావడంతో కోరుట్లలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో కరీంనగర్‌కు తరలి ంచారు. పుష్పలత ఆదివారం మృతిచెందింది. మృతురాలికి భర్త కాదాసు రాజు, కొడుకు నిహాల్ ఉన్నారు. రాజు బతుకు దెరువు కోసం దుబాయ్ వెళ్లాడు. కొడుకు నిహాల్ సీరియస్ పుష్పలత కొడుకు నిహాల్ పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. నిహాల్ వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. రుద్రంగి ఎస్సై అశోక్ మృతురాలి ఇంటి వద్ద ప్రాథమిక విచారణ చేపట్టి బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదు అందగానే పూర్తి విచారణ చేపడతామని తెలిపారు. మరో చిన్నారి సీరియస్ -
రామగుండంలో లోకోపైలెట్ల నిరసన
రామగుండం: ఆలిండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ కేంద్ర కమిటీ పిలుపు మేరకు స్థానిక లోలో పైలెట్లు ఆదివారం నిరసన తెలిపారు. కేంద్రప్రభుత్వం లోకో రన్నింగ్ స్టాఫ్ డిమాండ్ల కమిటీని ఇటీవల ఏర్పాటు చేయగా అందులో రన్నింగ్ స్టాఫ్, ప్రయాణికుల సేవలకు వ్యతిరేకంగా నిర్ణయాలు ఉన్నాయని పైలెట్లు ఆరోపించారు. దీంతో స్థానిక రైల్వే ప్లాట్ఫారం ఉన్న క్య్రూ కార్యాలయం ఎదుట లోకో పైలెట్లు ఆందోళనకు దిగారు. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులను పట్టుకొని నిరసన తెలిపారు. అనంతరం వాటిని దహనం చేశారు. రైల్వేబోర్డు నిర్ణయాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రామగుండం బ్రాంచి కార్యదర్శి సీహెచ్ రవి, ప్రతినిధులు ఎంబీ మీనా, అరుణ్‌తేజ్, నవీన్, రమణాచారి, పంకజ్ లష్కర్ తదితరులు పాల్గొన్నారు. -
స్పోర్ట్స్ అకాడమీ, హాస్టళ్లలో ప్రవేశాలకు..
● నోటిఫికేషన్ విడుదల చేసిన క్రీడా శాఖ ● జూలై 1 నుంచి 5 వరకు ఎంపిక పోటీలు కరీంనగర్‌స్పోర్ట్స్: క్రీడాకారుల ఉజ్వల భవితకు పునాది వేసేవి స్పోర్ట్స్ అకాడమీ, స్పోర్ట్స్ హాస్టళ్లు. ఈనేపథ్యంలో రాష్ట్రంలోని స్పోర్ట్స్ అకాడమీ, స్పోర్ట్స్ హాస్టళ్లలో 2025–26 సంవత్సరానికి ప్రవేశాలకు క్రీడాశాఖ ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. జూలై 1 నుంచి 5 వరకు బాలబాలికలకు ఎంపిక పోటీలు నిర్వహించనున్నారు. ఎంపిక పోటీలు జరిగే ప్రదేశాలు ● సైక్లింగ్, రెజ్లింగ్ అకాడమీ, సైక్లింగ్ వెల్డ్రోమ్, ఓయు క్యాంప్‌లకు ఎంపిక పోటీలు ఉస్మానియా యూనివర్సిటీలోని సైక్లింగ్ వెల్డ్రోమ్ ఓయూలో జరగనున్నాయి. ● రీజినల్ స్పోర్ట్స్ హాస్టల్, హనుమకొండకు ఎంపిక పోటీలు డీఎస్ఏ హన్మకొండలో జరగనున్నాయి. ● అథ్లెటిక్స్ అకాడమీ, ఖమ్మంకు ఎంపిక పోటీలు డీఎస్ఏ హనుమకొండలో జరుగుతాయి. ● హాకీ అకాడమీ, వనపర్తికి ఎంపిక పోటీలు డీఎస్ఏ వనపర్తిలో జరుగనున్నాయి. ● వాలీబాల్ అకాడమీ, సరూర్‌నగర్‌కు ఎంపిక పోటీలు వాలీబాల్ అకాడమీ సరూర్‌నగర్‌లో జరుగనున్నాయి. ● వాలీబాల్ అకాడమీ, రాజన్న సిరిసిల్లకు ఎంపిక పోటీలు వాలీబాల్ అకాడమీ రాజన్న సిరిసిల్లలో జరుగనున్నాయి. వాలీబాల్ అకాడమీ, సిద్దిపేటకు ఎంపిక పోటీలు వాలీబాల్ అకాడమీ సిద్దిపేటలో జరుగనున్నాయి. అర్హతలు ఇవే.. క్రీడాకారులు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారై ఉ ండాలి. సంబంధిత వేదికల్లో ఉదయం రిపోర్టు చే యాలి. అథ్లెటిక్స్, హాకీ, వాలీబాల్, రెజ్లింగ్, సైక్లింగ్‌లో ప్రవేశాలకు 12 నుంచి 16 ఏళ్లలోపు వయసు ఉండాలి. జాతీయస్థాయి సబ్ జూనియర్స్, ఎస్జీఎఫ్ పో టీల్లో పాల్గొన్న క్రీడాకారులకు ప్రాధాన్యం ఉంటుంది. తీసుకెళ్లాల్సిన సర్టిఫికెట్లు.. క్రీడాకారులు వయసు ధ్రువీకరణ పత్రం, ప్రస్తుత విద్యార్హత సర్టిఫికెట్, రెసిడెన్షియల్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, 10 పాస్ పోర్టు సైజ్ ఫొటోలు, క్రీడా సర్టిఫికెట్లు. సద్వినియోగం చేసుకోవాలి రాష్ట్రంలోని క్రీడా అకాడమీ, స్పోర్ట్స్ హాస్టళ్లలో ప్రవేశ అవకాశాన్ని ఉమ్మడి కరీంనగర్ జిల్లా క్రీడాకారులు సద్విని యోగం చేసుకోవాలి. వీటిలోల్లో చేరేవారు భవిష్యత్‌లో క్రీడల్లో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. శిక్షణతో మేటి క్రీడాకారులుగా ఎదిగే అవకాశం ఉంటుంది. – శ్రీనివాస్‌గౌడ్, డీవైఎస్వో -
మాతృ మరణాలు తగ్గించడమే లక్ష్యం
సుల్తానాబాద్: మాతా, శిశు మరణాలను తగ్గించడమే లక్ష్యంగా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేందుకు జిల్లావాసుల్లో అవగాహన కల్పించేలా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జాతీయ ఆరోగ్య మిషన్ కార్యక్రమంలో భాగంగా కేంద్రప్రభుత్వం ఈమేరకు పలు రకాల కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో వ్యాధి నిరోధక టీకాలు వేస్తోంది. పౌష్టికాహారం అందిస్తోంది. నిత్యం వ్యాయామం చేయిస్తోంది. మరణాలను నివారించి ఆరోగ్యంగా ఉంటే కుటుంబం, సమాజం.. మొత్తంగా ప్రపంచ కూడా ఆరోగ్యం ఉంటుందని భావిస్తోంది. మానసిక ప్రశాంతత ముఖ్యం మనిషి శారీరకంగా ఎంత ఆరోగ్యంగా ఉన్నా.. మానసిక ప్రశాంతత లేకపోతే జీవనగమనం లయ తప్పుతుంది. దీర్ఘకాలిక వ్యాధులకు దారితీసే అవకాశం ఉంది. విపరీతమైన ఆలోచనలతో ఆత్మహత్యలకు ప్రేరేపిస్తుంది. కరోనా తర్వాత మనిషి తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాడని డబ్ల్యూహెచ్‌వో ఇటీవల హెచ్చరించింది. నేడు ర్యాలీలు.. జిల్లావ్యాప్తంగా జిల్లాకేంద్రంతోపాటు అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, మండల కేంద్రాలలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మండల కేంద్రాల్లో ర్యాలీ నిర్వహించనున్నారు. ఆరోగ్య సంరక్షణపై అవగాహన నేడు జిల్లాలో అవగాహన ర్యాలీలు విజయవంతం చేయాలి జిల్లా, మండల కేంద్రాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆధ్వర్యంలో వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. సిబ్బంది విధిగా పాల్గొని విజయవంతం చేయాలి. గర్భిణులను చైతన్యవంతం చేయడంతోపాటు నిత్యం వ్యాయామం చేసి పౌష్టికాహారం తీసుకునేలా ప్రజల్ని ప్రోత్సహించాలి. – అన్నప్రసన్న కుమారి, డీఎంహెచ్‌వో