
శుక్రవారం శ్రీ 11 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
గన్నేరువరం/కరీంనగర్‌రూరల్: జిల్లాలోని పలుచోట్ల గురువారం వేకువజామున అకాల వర్షం బీభత్సం సృష్టించింది. అన్నదాతకు అపారనష్టం కలిగించింది. గన్నేరువరం మండలం మాదాపూర్, పీచుపల్లి, జంగపల్లి, గునుకులకొండాపూర్‌లో అకాల వర్షానికి చేతికందిన వరి, మొక్కజొన్న దెబ్బతిన్నాయి. మామిడితోటల్లో చెట్లకొమ్మలు విరిగిపడ్డాయి. కాయలు నేలరాలాయి. మాదాపూర్ శివారులో ఆదిరెడ్డికి చెందిన ఆరు ఎకరాల్లో వరిపూర్తిగా దెబ్బతింది. గునుకులకొండాపూర్‌లో న్యాలపట్ల రాజయ్యకు చెందిన దున్నపోతు మృతి చెందగా, రూ.30 వేల నష్టం వాటిల్లింది. నష్టపోయిన వరి, మొక్కజొన్న పంటను మాదాపూర్, పీచుపల్లి, జంగపల్లి గ్రామాల్లో క్షేత్రస్థాయిలో గురువారం పరిశీలించినట్లు ఏవో కిరణ్మయి తెలిపారు. 40 మంది రైతులకు చెందిన 126 ఎకరాల వరి, ఆరుగురికి చెందిన 15 ఎకరాల మొక్కజొన్న నష్టపోయినట్లు నివేదించామని వివరించారు. గురువారం సాయంత్రం ఒక్కసారిగా మబ్బులు కమ్మడంతో కరీంనగర్ రూరల్ మండలం మొగ్ధుంపూర్, చెర్లభూత్కూర్ తదితర గ్రామాల్లో పలువురు రైతులు ఆరబోసిన ధాన్యాన్ని కుప్పచేసి వర్షానికి తడవకుండా టార్పాలిన్లు కప్పారు.
గాలివాన బీభత్సం
అన్నదాతకు నష్టం
న్యూస్‌రీల్

శుక్రవారం శ్రీ 11 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025

శుక్రవారం శ్రీ 11 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025

శుక్రవారం శ్రీ 11 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025

శుక్రవారం శ్రీ 11 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025