
హార్వెస్టర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
తిమ్మాపూర్: మండలంలోని ఇందిరానగర్ గ్రామంలోని సాయిబాబా ఆలయం సమీపంలో రాజీవ్ రహదారిపై బుధవారం అర్ధరాత్రి ఆర్టీసీ బస్సు హార్వెస్టర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆర్టీసీ బస్సులోని పలువురితోపాటు, హార్వెస్టర్‌పై ఉన్న ఇద్దరు గాయపడ్డారు. డ్రైవర్ వాహనంలోనే ఇరుక్కుపోవడంతో పోలీసుల రెండు గంటలు శ్రమించి బయటకు తీశారు. ఎల్‌ఎండీ పోలీసుల కథనం ప్రకారం.. బుధవారం రాత్రి 12:40 గంటల సమయంలో ఇందిరానగర్ గ్రామ సాయిబాబా గుడివద్ద కరీంనగర్ వైపు వెళుతున్న హార్వెస్టర్‌ను హైదరాబాద్ నుంచి కరీంనగర్‌వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వేగంగా ఢీకొట్టింది. దీంతో హార్వెస్టర్ రోడ్డు అవతలివైపుదూసుకెళ్లి బోల్తాపడింది. బ్లేడ్‌లు మాత్రం బస్సులు ఇరుక్కుపోయాయి. ఈ ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో బస్సులోని పలువురితోపాటు హార్వెస్టర్‌పై ఉన్న ఇద్దరు గాయపడ్డారు. హార్వెస్టర్ డ్రైవర్ వాహనంలో ఇరుక్కుపోయాడు. స్థానికులు వెంటనే 108, ఎల్‌ఎండీ పోలీసులు సమాచారం అందించారు. దాదాపు 2 గంటలకు పైగా పోలీసులు, గ్రామస్తులు, హైవే పెట్రోల్ సిబ్బంది, మూడు 108 అంబులెన్స్ సిబ్బంది శ్రమించి బయటకు తీయగా.. మోకాలు విరిగి తీవ్ర గాయాలు అయ్యాయి. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివేక్ తెలిపారు.