
సమ్మర్ స్పెషల్ టూర్ ప్యాకేజీ
సిరిసిల్లకల్చరల్: వేసవి సెలవుల్లో భారత్ గౌరవ్ ట్రెయిన్ యాత్ర పేరుతో రైల్వేశాఖ స్పెషల్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ట్రెయిన్ యాత్ర ప్రారంభమవుతుందని టూరిజం జనరల్ మేనేజర్ డీఎస్‌జీపీ కిశోర్ తెలిపారు. రైలు, బస్సు ప్రయాణాలతోపాటు హోటల్, భోజన ఖర్చులు, గైడ్‌తో కలిపి సైట్ సీయింగ్ ఉంటాయని పేర్కొన్నారు. ప్యాకేజీల వివరాలు వెల్లడించారు.
మొదటి ప్యాకేజీ : ఈనెల 23 నుంచి మే 2 వరకు హరిద్వార్, రిషికేష్, వైష్ణవదేవి, ఆనంద్‌పూర్, నైనాదేవి, అమృత్‌సర్. ఒక్కో వ్యక్తికి రూ.18,150 చార్జీ.
రెండో ప్యాకేజీ : మే 8 నుంచి 17 వరకు వారణాసి, పూరీ, గయ, అయోధ్య, ప్రయాగరాజ్, కోణార్క్ ప్రాంతాలకు ఒక్కో వ్యక్తికి రూ.16,800 చార్జీ.
మూడో ప్యాకేజీ: మే 22 నుంచి 30 వరకు అరుణాచలం, రామేశ్వరం, తంజావూర్, కన్యాకుమారి, త్రివేండ్రం, త్రిచి, మదురై ప్రాంతాలు.. ఒక్కో వ్యక్తికి రూ.14,700 చార్జీ వసూలు చేస్తారు.
నాలుగో ప్యాకేజీ: జూన్ 4 నుంచి 12 వరకు మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్, త్రయంబకేశ్వర్, భీమాశంకర్, ఘృశ్నేశ్వర్, ఎల్లోర, మోహం, నాగ్‌పూర్ ప్రాంతాలు.. ఒక్కో వ్యక్తికి రూ.14,700 వసూలు చేస్తారు. ఆసక్తి గల వారు wwwirctctour ism.com వెబ్‌సైట్ ద్వారా లేదా సికింద్రాబాద్‌లోని ఐఆర్‌సీటీసీ ఆఫీస్‌లో బుక్ చేసుకోవచ్చని తెలిపారు. వివరాల కోసం 04027702407 లేదా 9701360701 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
లాడ్జిల్లో తనిఖీలు
వేములవాడ: వేములవాడలోని లాడ్జీలపై పట్టణ సీఐ వీరప్రసాద్ ఆధ్వర్యంలో 50 మంది పోలీసులు బుధవారం రాత్రి ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాడ్జీలలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టరీత్య చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లాడ్జీలకు వచ్చే యాత్రికుల వద్ద గుర్తింపుకార్డులు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు.