● కరీంపేటలో మహిళ ఆందోళన
శంకరపట్నం: భర్తతోనే కలిసి ఉంటానని ఓ మహిళ ఆందోళనకు దిగగా.. పలు మహిళా సంఘాలు మద్దతుగా నిలిచాయి. బాధితురాలి వివరాల ప్రకారం.. మండలంలోని కరీంపేట గ్రామానికి చెందిన గడ్డం రాజు మొదటి భార్య, ఇద్దరు పిల్లలు చనిపోయారు. చొప్పదండి మండలం మంగళపల్లి గ్రామానికి చెందిన స్వప్నను రెండో వివాహం చేసుకున్నారు. మూడు నెలలుగా స్వప్నను భర్త, అత్తింటివారు వేధిస్తున్నారు. కొంత డబ్బు ఇచ్చి, వదిలించుకోవాలని చూస్తున్నారని, భర్తతోనే కలిసి ఉంటానని స్వప్న ఆరోపించింది.
ఆల్ ఇండియా పోలీస్ హ్యాండ్‌బాల్ పోటీలకు ఎంపిక
కరీంనగర్‌స్పోర్ట్స్: ఉత్తరప్రదేశ్‌లోని లక్నో జరుగుతున్న ఆల్ ఇండియా పోలీస్ హ్యాండ్‌బాల్ చాంపియన్ షిప్ క్లస్టర్ పోటీలకు కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు చెందిన సీనియర్ క్రీడాకారులు ఎంపికై నట్లు ఉమ్మడి జిల్లా హ్యాండ్‌బాల్ సంఘం అధ్యక్ష,కార్యదర్శులు తెలిపారు. రామడుగుకు చెందిన అనుపురం సాయికృష్ణ ప్రస్తుతం మంచిర్యాలలో, కుర్మపల్లికి చెందిన పులి మాధవి ప్రస్తుతం రామగుండం కమిషనరేట్‌లో పనిచేస్తున్నారు. వీరి ఎంపికపై ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్ష కార్యదర్శులు నందెల్లి మహిపాల్, గసిరెడ్డి జనార్దన్‌రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ కాసర్ల ఆనంద్ కుమార్, రమణారావు, సంయుక్త కార్యదర్శి ప్రభాకర్, కోచ్ మూల వెంకటేశ్, వేల్పుల సురేందర్, కృష్ణహరి, శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు.
భర్తతోనే కలిసి ఉంటా..