
ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్ రద్దు చేయాలె
భూముల రిజిస్ట్రేషన్ కోసం ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్ రద్దు చేయాలని డాక్యుమెంట్ రైటర్లు డిమాండ్ చేశారు. గంగాధర సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రిజిస్ట్రేషన్ వ్యవస్థను డిజిటలైజేషన్ చేయడంతో వేలాది మంది డాక్యుమెంటు రైటర్లు జీవనోపాధి కోల్పోతామన్నారు. ధరణి సమస్యలే ఇప్పటికి పరిష్కారం కాలేదన్నారు. నిరసనలో డాక్యుమెంట్ రైటర్లు తోట చంద్రయ్య, గంట కిషన్, రమేష్, సూర్యప్రతాప్, కమలాకర్ ,ప్రతాప్, అనిల్, అచ్యుత్, శ్రీనివాస్, మహేశ్, హరీశ్, యోనా, రాజశేఖర్, రఘు, తిరుపతి, గగన్ తదితరులు పాల్గొన్నారు. – గంగాధర