
పారదర్శకంగా షెట్టర్లు
● 26 దుకాణాల కేటాయింపు ● నగరపాలకసంస్థ కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని శాతవాహన యూనివర్సిటీ వద్ద నగరపాలకసంస్థ నిర్మించిన దుకాణ సముదాయంలోని 26 షెట్టర్లను బుధవారం లక్కీడ్రా ద్వారా వ్యాపారులకు కేటాయించారు. అద్దె ప్రాతిపదికన 26 షెట్టర్లను రెండు సంవత్సరాలకు లీజుకు ఇచ్చేందుకు గతంలోనే నగరపాలకసంస్థ దరఖాస్తులు స్వీకరించింది. 26 షెట్టర్లకు 261 మంది దరఖాస్తు చేసుకున్నారు. బుధవారం నగరపాలకసంస్థ ఆవరణలోని కళాభారతిలో జరిగిన కార్యక్రమంలో దరఖాస్తు దారుల సమక్షంలో కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్ డ్రాతీసి కేటాయించారు. 26 షెట్టర్లలో రిజర్వేషన్ ప్రకారం ఎస్సీలకు 4, ఎస్టీలకు 2, దివ్యాంగులకు 1, నాయిబ్రాహ్మణులకు 1 కేటాయించగా, ముందుగా రిజర్వేషన్‌కేటగిరీ డ్రా తీశారు. ఎస్సీ రిజర్వేషన్ కేటగిరీలో డ్రాతీయగా అశోక్‌అనే వ్యక్తికి 6వ నెంబర్ షెట్టర్ దక్కింది. అయితే అశోక్‌కు సివిల్ హాస్పిటల్ దుకాణసముదాయంలో షెట్టర్ ఉన్నట్లు గుర్తించిన కమిషనర్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించి, మరొకరికి డ్రాద్వారా షాప్‌ను కట్టబెట్టారు. రిజర్వేషన్‌కేటగిరీ ముగిసిన తర్వాత మిగిలిన అన్ని దరఖాస్తులను జనరల్ కేటగిరీకి మార్చి డ్రాతీశారు.
పారదర్శకంగా కేటాయింపు: కమిషనర్
విద్యానగర్‌లోని షెట్టర్ల కేటాయింపు పారదర్శకంగా చేపట్టామని నరగపాలకసంస్థ కమిషనర్‌చాహత్ బాజ్‌పేయ్ తెలిపారు. మున్సిపల్ నిబంధనల మేరకు రిజర్వేషన్ ప్రకారం డ్రానిర్వహించామన్నారు. గతంలో పొందిన వారికి అవకాశం ఇవ్వలేదన్నారు. కుటుంబంలో ఒక్కరినే డ్రాకు అనుమతిచ్చామన్నారు. షెట్టర్లను దక్కించుకున్నవారు వారం రోజుల్లోగా నగరపాలకసంస్థతో ఒప్పందం చేసుకోవాలన్నారు. సబ్‌లీజుకు ఇచ్చినట్లు తేలితే ఒప్పందం రద్దు చేస్తామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ స్వరూపరాణి, ఆర్‌వో భూమానందం తదితరులు పాల్గొన్నారు.