
గురువారం శ్రీ 17 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
అపరభద్రాద్రి శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో 13 రోజులుగా జరుగుతున్న శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు బుధవారం రాత్రి ఏకాంత సేవతో ముగిశాయి. అర్చకులు శేషం రామాచార్యులు, శేషం వంశీధరాచార్యులు, సీతారామాచార్యులు, కిరణ్‌కుమార్‌ల మంత్రోచ్ఛారణల మధ్య సప్తవర్ణాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి అద్దాల మేడలో ఏకాంత సేవ నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఇంగిలే రామారావు, ఇన్‌చార్జి ఈవో సుధాకర్, ధర్మకర్తలు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. – ఇల్లందకుంట
న్యూస్‌రీల్
ముగిసిన బ్రహ్మోత్సవాలు

గురువారం శ్రీ 17 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025