నృసింహుని సన్నిధికి పోటెత్తిన భక్తులు
ధర్మపురి: ధర్మపురిలోని శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయం హనుమాన్ భక్తులతో శనివారం పోటెత్తింది. కొండగట్టు అంజన్నను దర్శించుకున్న భక్తులంతా లక్ష్మినృసింహస్వామి సన్నిధికి చేరుకున్నారు. హనుమాన్ చిన్నజయంతి సందర్భంగా స్వామి అనుబంధం శ్రీప్రసన్నాంజనేయ స్వామివారికి వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య ప్రత్యేక పూజలు చేశారు. హనుమాన్ భక్త భజన మండలి ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. నృసింహస్వామిని పలువురు నాయకులు దర్శించుకున్నారు. వీరిలో విశ్వహిందూ పరిషత్ తెలంగాణ ప్రాంత ఉపాధ్యక్షుడు రామ్‌సింగ్, ప్రాంత గోరక్ష టోలి సభ్యులు ఊట్కూరి రాధాకృష్ణరెడ్డి, వాయుపుత్ర విభాగ కార్యదర్శి జనార్ధన్‌రెడ్డి ఉన్నారు.
నృసింహుని సన్నిధికి పోటెత్తిన భక్తులు


