హనుమ వాహనంపై రాములోరు
ఇల్లందకుంట: ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. స్వామివారు బుధవారం రాత్రి హనుమత్‌వాహనంపై విహరించారు. ముందుగా స్వామివారి ఉత్సవమూర్తులను పూలతో అలంకరించారు. అర్చకులు శేషం రామాచార్యుల మంత్రోచ్ఛరణల మధ్య ఆలయ ఆలయ మాఢవీధుల్లో స్వామివారు విహరించారు. అంతకుముందు ప్రభుత్వోత్సవం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఇన్‌చార్జి ఈవో సుధాకర్, ఆలయ కమిటీ చైర్మన్ ఇంగిలే రామారావు, కుమారస్వామి, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.


