కరీంనగర్‌క్రైం: కరీంనగర్ డీఈవో కార్యాలయంలో నైట్ వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న వ్యక్తి ఉతికిన బట్టలు తెచ్చుకోవడానికి రెండో అంతస్తుకు వెళ్లి ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందాడు. వన్‌టౌన్ సీఐ బిల్లా కోటేశ్వర్ వివరాల ప్రకారం.. కట్టరాంపూర్‌కు చెందిన గడప రవీందర్(58)విద్యాశాఖలో అటెండర్‌గా పనిచేస్తున్నాడు.
ప్రస్తుతం కట్టరాంపూర్‌లోని ప్రైమరీస్కూల్‌లో పనిచేస్తూ డిప్యూటేషన్‌పై డీఈవో కార్యాలయం నైట్ వాచ్‌మెన్‌గా కొనసాగుతున్నాడు. మంగళవారం మధ్యాహ్నం ఉతికిన బట్టలు తెచ్చుకోవడానికి కార్యాలయం రెండో అంతస్తుకు వెళ్లి, ప్రమాదవశాత్తు జారి పడ్డాడు. తల, చాతిపై బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.
కార్యాలయం సూపరింటెండెంట్ నరసింహస్వామి రవీందర్ కుటుంబసభ్యులకు, పోలీసులకు సమాచారం అందించాడు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.