రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలు
మల్లాపూర్: మండలంలోని పాతదాంరాజుపల్లి శివారులో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. గొర్రెపల్లికి చెందిన చింతకుంట రవితేజ నిర్మల్ జిల్లా ఖానాపూర్ నుంచి ఆటోలో వస్తున్నాడు. కొత్తదాంరాజుపల్లికి చెందిన బోయిని హన్మంతు, పంజాల రమణ పాతదాంరాజుపల్లి నుంచి వస్తున్నారు. గ్రామ శివారులోకి రాగానే ఆటో, ద్విచక్రవాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ రవితేజ, ద్విచక్రవాహనదారులు హన్మంతు, రమణ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గాయపడిన ముగ్గురిని జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. మల్లాపూర్ ఎస్సై రాజు, పోలీసు సిబ్బందితో ఘటనస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు.
రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలు


