
‘జ్యోతిష్మతి’కి ఎన్‌బీఏ గుర్తింపు
తిమ్మాపూర్: మండల కేంద్రంలోని జ్యోతిష్మతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సైన్స్‌కు 2028 వరకు ఎన్‌బీఏ అక్రిడిటేషన్ మంజూరు చేసిందని కళాశాల చైర్మన్ జువ్వాడి సాగర్‌రావు తెలిపారు. గురువారం కళాశాలలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్‌న్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, విభాగాలు 2022–2025 మధ్య కాలంలో గుర్తింపు పొందాయన్నారు. నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషనన్ ద్వారా పునరుద్ధరించబడిన గుర్తింపు అకాడమిక్ ఎక్స్‌లెన్స్, నాణ్యత హామీ ఫలితాల ఆధారిత విద్యతో మరోసారి పొడిగించారని, అక్రిడిటేషన్‌న్ సంస్థ ఆశించిన విద్యా, పరిశోధన ప్రయత్నాలను మెరుగుపరచడానికి శక్తివంతమైన ప్రేరణగా పనిచేస్తోందన్నారు. పొడిగింపు కళాశాల పటిష్టత, అధ్యాపకుల నిబద్ధత, అధునాతన మౌలిక సదుపాయాలు వివిధ కార్యక్రమాలను బలోపేతం చేస్తుందని సెక్రటరీ కరస్పాండెంట్ జె సుమిత్‌సాయి తెలిపారు. కొనసాగింపునకు కృషిచేసినవారికి అభినందనలు తెలిపారు.