
కూలీకి వస్తూ కానరానిలోకాలకు..
● హార్వెస్టర్ కిందపడి మహిళా కూలీ మృతి
● మరొకరికి తీవ్రగాయాలు
● బూర్నపల్లి శివారులో ఘటన
● మృతురాలిది పెద్దపల్లి జిల్లా మొట్లపల్లి గ్రామం
కాల్వశ్రీరాంపూర్/టేకుమట్ల: కూలీ పనులకు వస్తూ ఓ మహిళ కానరానిలోకాలకు వెళ్లింది. హార్వెస్టర్ వె నక్కి వస్తుండగా దానికింద పడి మృతి చెందింది. ఈ ఘటన సోమ వారం సాయంత్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం బూర్నపల్లి శివారులో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం మొట్లపల్లి గ్రామానికి చెందిన కొందరు కూలీలు వరి పంటలో బెరుకులు తీసేందుకు ఆటోలో బూర్నపల్లికి వస్తున్నారు. ఈ క్రమంలో ఆటో ముందు హార్వెస్టర్ వెళ్తుండగా.. ఎదురుగా ఆర్టీసీ బస్సు వ స్తోంది. దీంతో హార్వెస్టర్ ఆపరేటర్ బస్సుకు దారి ఇచ్చేందుకు వెనక్కి తీస్తుస్తున్నాడు. ఈ క్రమంలో హార్వెస్టర్ వెనుక ఉన్న ఆటోను డ్రైవర్ కూ డా వెనక్కి తీస్తుండగా అందులో ఉన్న ఇద్దరు మహిళలు భయంతో కిందికి దిగారు. అయితే హార్వెస్టర్ వారిపైకి ఎక్కింది. ఈ ఘటనలో దాసరి కనుకమ్మ(55) అక్కడికక్కడే మృతి చెందగా, మరో కూలీ వస ంతకు తీవ్రగా యాలయ్యా యి. వసంతను వెంటనే వరంగ ల్ తరలించారు. సమాచారం అందుకున్న ఎస్సై సుధాకర్ ఘటనా స్థలికి చే రుకుని ప్రమాద వివరాలు సేకరించారు. అనంతరం కనుకమ్మ మృతదేహాన్ని చిట్యాల ఆస్పత్రి మార్చురీకి తరలించారు.
కన్నీరుమున్నీరైన కూలీలు..
క్షణం ముందు ప్రాణంతో అందరి మధ్య ప్రయాణించిన కనుకమ్మ రె ప్పపాటు క్షణంలో విగతజీవిగా మా రడం, మరోమహిళ తీవ్ర గాయాల తో కొట్టుమిట్టాడుతుండగా చలించి న తోటి కూలీలు కన్నీరుమున్నీరయ్యారు. సాయంత్రం కూలీకి రాకు న్నా బతికేదేమో అని విలపించారు.
ప్రాణాలు తీస్తున్న సాయంత్రం కూలి..
వేసవిలో ఎండలు తీవ్రంగా ఉండడంతో వ్యవసాయ కూలీలు ఉదయం, సాయంత్రం రెండు పూటలా పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల రామకిష్టాపూర్(టి) గ్రామానికి చెందిన మహిళా కూలీలు సాయంత్రం వేళ పొలంలోని బెరుకులు తీసేందుకు వెళ్లగా లారీ అదుపు తప్పి మీదపడిన ఘటనలో ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరవక ముందే మొట్లపల్లి నుంచి కూలీలు సాయంత్రం వేళ పొలంలోని బెరుకులు తీసేందుకు వస్తుండగా హార్వెస్టర్ మృత్యుశకటమై కనుకమ్మను కబళించింది.