
నీడ లేదు.. నీరూ లేదు..!
సిరిసిల్ల పాత బస్టాండులో నీడలేని ప్లాట్‌ఫామ్స్
● కరీంనగర్ స్మార్ట్‌సిటీలో బస్‌షెల్టర్లు నామమాత్రం. వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌కు ఎదురుగా మానకొండూరు, తిమ్మాపూర్, బెజ్జంకి, కమాన్ ప్రాంతంలో ఉన్న నిలువనీడ కరువయ్యింది. కోర్టు ఎదురుగా చొప్పదండి , పెద్దపల్లికి వెళ్లే రూట్‌లో బస్‌షెల్టర్ లేకపోవడంతో జనం ఎండలో నిలబడుతున్నారు.
● రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం, సహా ఇల్లంతకుంట, గంభీరావుపేట, కోనరావుపేట, బోయినపల్లిలో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడంలేదు. పలుగ్రామాల్లో బస్సులు నిలిపే స్థలం, బస్సుషెల్టర్లు లేవు. జిల్లా కేంద్రంలో పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. పట్టణానికి దూరంగా ఉన్న కొత్తబస్టాండ్‌లో ప్రయాణికులు నామమాత్రంగా వెళ్తుంటారు. పాతబస్టాండ్ ఏరియానే నిత్యం వందలాది మందితో కిటకిటలాడుతోంది. ఇక్కడ ప్లాట్‌ఫామ్స్‌పై నిలువనీడలేదు. ప్రయాణికులు ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ బస్సుల కోసం నీరిస్తున్నారు. ఇల్లంతకుంటలో తాగునీటి వసతిలేదు. మూత్రశాలలు, మరుగుదొడ్ల సదుపాయం లేదు. కోనరావుపేట, గంభీరావుపేటలో ప్రయాణ ప్రాంగంణం నిరుపయోగంగా ఉంది. ప్రయాణికులు బస్సుల కోసం దుకాణాల నీడలో నిలబడుతున్నారు.
● జగిత్యాల జిల్లా రాయికల్, కథలాపూర్, ఇబ్రహీంపట్నం, పెగడపల్లిలో పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. రాయికల్ పాతబస్టాండ్‌లో కూర్చునేందుకు, నీడలేదు. ఇబ్రహీంపట్నంలో బస్ షెల్టర్ల వద్ద బస్సులు ఆపడంలేదు. దీంతో ప్రయాణికులు రోడ్లపై నిలబడుతున్నారు. తాగునీటి వసతీ లేదు. పెగడపల్లిలో తాగునీరు కరువైంది. ఉన్న టాయిలెట్స్ సరిగాలేవు. కథలాపూర్‌లో కనీస వసతులు లేవు. టాయిలెట్ కోసం దూరప్రాంతానికి వెళ్లాల్సి వస్తోంది. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్‌లో ప్రయాణికులు బస్సుల కోసం ఎండలో నిరీక్షిస్తున్నారు. కరీంనగర్–గోదావరిఖని రాజీవ్ రహదారిలో బస్‌షెల్ట ర్లు లేకపోవడంతో ప్రయాణికులు ఎండకు ఎండుతూ వానకు తడుస్తున్నారు. బొమ్మకల్, చల్మెడ ఆనందరావు ఆస్పత్రి, గోపాల్‌పూర్, ఇరుకుల్ల, మొగ్ధుంపూ ర్ గ్రామాల స్టేజీలపై బస్ షెల్టర్లు లేకపోవడంతో ప్ర యాణికులు బస్సుల కోసం ఎండలోనే నిరీక్షిస్తున్నారు.
– సిరిసిల్లటౌన్/ గంభీరావుపేట/ కోనరావుపేట/బోయినపల్లి/రాయికల్/ కథలాపూర్/కాల్వశ్రీరాంపూర్/పెగడపల్లి
అధ్వానంగా ఆర్టీసీ బస్టాండ్‌లు, షెల్టర్లు
ప్రయాణికులకు ఎండ కష్టాలు తాగడానికి నీరులేదు.. ఒంటికి, రెంటికి తిప్పలే
ఓ వైపు ఎండలు మండుతున్నాయి. ఎండవేడిమికి జనం నానా అవస్థలు పడుతున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారి కష్టాలు వర్ణనాతీతం. చంటిపిల్లల తల్లులు, మహిళలు, వృద్ధులు పడరానిపాట్లు పడుతున్నారు. బస్సుల కోసం ఎదురు చూడడం.. వేసవి తాపం.. గొంతు తడుపుకోవడానికి కనీసం నీటివసతి కరువు. డీహైడ్రేషన్.. బస్టాండ్, బస్టాప్లలో కనీస సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారు. ఎండవేడిమికి తట్టుకోలేక నరకం అనుభవిస్తున్నారు.

నీడ లేదు.. నీరూ లేదు..!