ఫుడ్ పాయిజన్‌తో మహిళ మృతి
రుద్రంగి(వేములవాడ): రుద్రంగి మండల కేంద్రానికి చె ందిన కాదాసు పుష్పలత(35) అనే మహిళ ఫుడ్ పాయిజన్‌తో ఆదివారం మృతి చెందింది. వి వరాలు ఇలా ఉన్నాయి. రుద్రంగి మండల కేంద్రానికి చెందిన కాదాసు పుష్పలత, ఆమె కు మారుడు కాదాసు నిహాల్(6) శుక్రవారం రాత్రి ఇ ంట్లో చేసిన రొట్టెలు తిని పడుకున్నారు. అనంతరం ఇద్దరికీ వాంతులు, విరేచనాలు కావడంతో కోరుట్లలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో కరీంనగర్‌కు తరలి ంచారు. పుష్పలత ఆదివారం మృతిచెందింది. మృతురాలికి భర్త కాదాసు రాజు, కొడుకు నిహాల్ ఉన్నారు. రాజు బతుకు దెరువు కోసం దుబాయ్ వెళ్లాడు.
కొడుకు నిహాల్ సీరియస్
పుష్పలత కొడుకు నిహాల్ పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. నిహాల్ వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. రుద్రంగి ఎస్సై అశోక్ మృతురాలి ఇంటి వద్ద ప్రాథమిక విచారణ చేపట్టి బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదు అందగానే పూర్తి విచారణ చేపడతామని తెలిపారు.
మరో చిన్నారి సీరియస్


