అడిషనల్ కలెక్టర్ సందర్శన
కరీంనగర్: మహిళాభివృద్ధి శిశు సంక్షేమశాఖ పరిధిలోని భగత్‌నగర్‌లో ఉన్న జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయాన్ని అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ ఆకస్మికంగా సందర్శించారు. హాజరు రిజిస్టర్ పరిశీలించారు. సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ అధి కారి సబిత, డీసీపీవో పర్వీన్ వెంట ఉన్నారు.
సమీక్ష సమావేశం
విద్యానగర్(కరీంనగర్): ఆర్టీసీ కరీంనగర్ రీజియన్ పరిధిలోని 11 డిపోల మేనేజర్లతో బుధవారం ఆర్‌ఎం బి.రాజు సమీక్ష నిర్వహించారు. వేసవికాలంలో అన్ని బస్‌స్టేషన్లలో తాగునీరు, తగినన్ని బస్సులు అందుబాటులో ఉంచాలని సూచించారు. డిప్యూటీ రీజనల్ మేనేజర్(మెకానిక్)బి.వెంకటేశ్వర్ రావు, డి ప్యూటీ రీజినల్ మేనేజర్(ఆపరేషన్స్) ఎస్.భూపతిరెడ్డి, జి.మనోహర్‌రెడ్డి పాల్గొన్నారు.
గల్ఫ్ సమస్యలు పరిష్కరించాలి
రామడుగు: గల్ఫ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ను కలిసి గల్ఫ్ జేఏసీ జిల్లా ఆధ్యక్షుడు చిలుముల రమేశ్ వినతిపత్రం అందజేశారు. గల్ఫ్ దేశాల్లో మృతి చెందిన కార్మికుల కుటుంబాలతో పాటుగా ప్రమాదంలో వైకల్యంబారిన పడిన వారికి ఉపాధి మార్గం కల్పించాలని కోరారు. నకిలీ ఏజెంట్లుపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
అక్రమాలకు పాల్పడితే సహించం
● ‘సాక్షి’ కథనంపై అదనపు కలెక్టర్ ఆరా
కరీంనగర్ అర్బన్: జిల్లా గ్రామీణాభివద్ధి సంస్థలో అక్రమాలు, అన్యాయంపై బుధవారం ‘గాడి తప్పిన డీఆర్డీవో’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ ఆరా తీశారు. ధాన్యం కొనుగోళ్లపై జరిగిన సమావేశంలో నిబద్ధతతో పని చేయకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వీవోఏల వేతనాల విషయంలో పొరపాటు జరిగితే విధుల నుంచి తొలగించడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. సిబ్బందికి ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ఎల్‌సీ యాప్‌ను అనుసరించాలి
కొత్తపల్లి(కరీంనగర్): ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ రూపొందించిన ఎల్‌సీ యాప్‌ను తప్పనిసరిగా అనుకరిస్తూనే విద్యుత్ పనులు చేపట్టాలని ఎస్‌ఈ మేక రమేశ్‌బాబు సూచించారు. కరీంనగర్‌లోని విద్యుత్ భవన్ లో బుధవారం 11 కె.వీ.‘ఎల్‌సీ’(లైన్‌క్లియర్) యాప్‌పై నిర్వహించిన శిక్షణ తరగతులను ప్రారంభించారు. వినియోగదారులకు మెరుగైన విద్యుత్ అందించడంతో పాటు విద్యుత్ ప్రమాదాల నివారణకు ఈ ఆన్‌లైన్ ఎల్‌సీ యాప్ దోహదపడుతుందన్నారు. డీఈటీ కె.ఉపేందర్, డీఈ జంపాల రాజం, ఏడీఈలు, ఏఈలు, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.
అడిషనల్ కలెక్టర్ సందర్శన
అడిషనల్ కలెక్టర్ సందర్శన


