
సర్ధాపూర్‌లో ఆయుధాగారం ప్రారంభం
సిరిసిల్ల: జిల్లా కేంద్రంలోని సర్ధాపూర్ 17వ పోలీస్ బెటాలియన్‌లో కొత్తగా నిర్మించిన ఆయుధగారం (బెల్ ఆఫ్ ఆర్‌మ్స్)ను వర్చువల్‌గా టీజీఎస్పీ బెటాలియన్స్ అడిషనల్ డీజీపీ సంజయ్‌కుమార్ జైన్ బుధవారం ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో సంజయ్‌కుమార్ జైన్ మాట్లాడుతూ బెటాలియన్ పోలీసులు అంకితభావంతో విధులు నిర్వహించాలన్నారు. తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ క్రమశిక్షణ గల ఆర్గనైజేషన్ అని వివరించారు. బెటాలియన్ అభివృద్ధిలో అధికారులు, సిబ్బంది పాత్ర అభినందనీయమన్నారు. సర్ధాపూర్ బెటాలియన్‌కు వచ్చిన డీఐజీ సన్నీకి కమాండెంట్ సురేష్ పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. బెటాలియన్‌లో నూతనంగా నిర్మించిన దోభీ, బార్బర్ రూమ్‌లను డీఐజీ సన్నీ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
వర్చువల్‌గా ప్రారంభించిన అడిషనల్ డీజీపీ సంజయ్‌కుమార్ జైన్