కిలోల కొద్దీ తీసుకొచ్చి.. ప్యాకెట్లుగా చేసి..
పెద్దపల్లిరూరల్: ఆటో నడిపితే అవసరమైనంత ఆదాయం రావడం లేదని భావించి సులువుగా డబ్బు సంపాదించాలనే దురాశతో గంజాయి విక్రయిస్తున్న షేక్ ఆసిఫ్ అనే యువకుడిని గురువారం పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను డీసీపీ కరుణాకర్ వెల్లడించారు. ఓ కాలేజీవద్ద విక్రయించేందుకు యత్నిస్తుండగా ఆసిఫ్‌ను అదుపులోకి తీసుకుని రూ.50వేల విలువైన 2,041 గ్రాముల గంజాయి, వేయింగ్‌మిషన్, సెల్‌ఫోన్, బైక్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి తక్కువ ధరకు కిలోల కొద్దీ గంజాయి కొనుగోలు చేసి, గ్రామాల్లో ప్యాకెట్లుగా తయారుచేసి అధిక ధరకు విక్రయిస్తున్నాడని పేర్కొన్నారు. ఇప్పటికే అతడిపై 8 కేసులు నమోదై ఉన్నాన్నారు. పీడీ యాక్టు కేసు కూడా నమోదైందన్నారు. పెద్దపల్లి ప్రాంతంలో పోలీసుల నిఘా ఎక్కువైందని భావించి కరీంనగర్ జిల్లా ముగ్గుంపూర్ గ్రామానికి మకాం మార్చి కరీంనగర్ పరిసరాల్లో ఆటోనడుపుతున్నాడన్నారు. ఇదేసమయంలో గంజాయి అమ్ముతున్నాడన్నారు. ఈమేరకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నామన్నారు. అతడిని పట్టుకున్న సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సైలు లక్ష్మణ్‌రావు, మల్లేశం, హెడ్‌కానిస్టేబుల్ మాడిశెట్టి రమేశ్‌తో పాటు కానిస్టేబుళ్లు ప్రభాకర్, సతీశ్, రాజు, అనిల్‌కుమార్‌ను డీసీపీ అభినందించారు.
గ్రామాలు, పట్టణాల్లో గంజాయి జోరు
జల్సాల కోసమే గంజాయి అమ్మకాలు
వివరాలు వెల్లడించిన డీసీపీ కరుణాకర్


