
గాలిలో దీపం.. గల్ఫ్‌లో జీవనం
సిరిసిల్ల: ఉన్న ఊరిలో ఉపాధి కరువై.. పొ ట్ట చేత పట్టకుని గల్ఫ్ దేశాలకు వలస వెళ్లే ప్రస్థానం 45 ఏళ్ల కిందటే మొదలైంది. భాష రాని దేశంలో ఇబ్బందులు పడుతూ వలసజీవులు కాలం వెళ్లదీస్తున్నారు. గల్ఫ్ దేశాలైన యూఏఈ(దుబాయ్), మ స్కట్(ఒమన్), బహ్రెయిన్, కువైట్, ఖతర్, సౌదీ అరేబియా, ఇరాక్ వంటి దేశాలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి సుమారు 2.50 లక్షల మంది ఉపాధి కోసం వెళ్లారు. గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందుతున్న వలస కార్మికుల సంక్షేమానికి సమగ్ర పాలసీ రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం సలహా సంఘాన్ని గురువారం ఏర్పాటు చేసింది. ఐఎఫ్‌ఎస్ అధికారి డాక్టర్ బీఎం వినోద్‌కుమార్ చైర్మన్‌గా, మంద భీంరెడ్డి వైస్‌చైర్మన్‌గా, కమిటీ సభ్యులుగా వేములవాడ ఎ మ్మెల్యే ఆది శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ టి.జీవన్‌రె డ్డి, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, నిజా మాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్.భూపతిరెడ్డి, టీజీఎండీసీ చైర్మన్ ఈ.అనిల్‌కుమార్‌లతోపాటు మరో ఏడుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశా రు. రెండేళ్ల కాలపరిమితితో ఈ సలహా సంఘం క మిటీ గల్ఫ్ కార్మికుల సమస్యలపై అధ్యయనం చేసి సమగ్ర ఎన్‌ఆర్‌ఐ పాలసీని రూపొందించాల్సి ఉంది.
కడసారి చూపులకు దూరమై..
ఈ వలస ప్రస్థానంలో ఎందరో అభాగ్యులు అనేక కారణాలతో మరణించారు. నెలల తరబడి మృతదేహాలు సైతం కన్నవారికి కడసారి చూపులకు నోచుకోలేదు. భారత విదేశాంగ శాఖ చొరవతో ఆ యా దేశాల్లోని భారత రాయభార కార్యాలయం స్పందించి శవాలను పంపించిన సందర్భాలు ఉన్నా యి. స్వచ్ఛంద సంస్థలు, ఎన్‌ఆర్‌ఐ విభాగాలు శవపేటికలను స్వస్థలాలకు చేర్చాయి. ఇలాంటి విషాద ఘటనల్లో మృతుల కుటుంబాలకు ఆయా దేశాల్లో కంపెనీ వీసాలు ఉంటే.. కొంతమేరకు పరిహారం అందింది. అదే వీసా లేకుండా ఆజాద్ వీసాలపై ప నిచేసే వారు.. కంపెనీ వీసాలపై వెళ్లి కల్లివెల్లి అయి న వారికి మాత్రం కంపెనీలు ఏమీ ఇవ్వలేదు. ఫలి తంగా ఆయా కుటుంబాలు ఇప్పటికీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయి.
మృతుల కుటుంబాలకు భరోసా
రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి ఎన్నికల హామీలో భాగంగా గల్ఫ్‌లో ఏ కారణంగా మరణించినా ఆ కుటుంబానికి రూ.5లక్షలు అందించాలని నిర్ణయించింది. 2023 డిసెంబర్ 7 నుంచి గల్ఫ్ దేశాల్లో మరణించిన వారికి పరిహారం అందిస్తున్నా రు. రాజన్నసిరిసిల్ల జిల్లాకు చెందిన 17 మంది గ ల్ఫ్ మృతుల వారసులకు రూ.5లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియాగా రూ.85లక్షలు మంజూరు చేసింది. ఇది వలస బాధిత కుటుంబాలకు కొండంత భరోసానిస్తుంది.
కేరళ విధానం ఆచరణీయం
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2.50 లక్షల మంది గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందుతుండగా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సలహా కమిటీతో వారికి మేలు జరుగుతుందని ఆశిస్తున్నారు. కేరళ ప్రభుత్వం దశాబ్దం కిందటే ఎన్‌ఆర్‌ఐ పాలసీని అమలు చేస్తుంది. ఆ పాలసీ తెలంగాణలోనూ అమలు కు ఆచరణీయంగా ఉంటుంది. పాస్‌పోర్టు నుంచి వీసాల వరకు అన్ని పారదర్శకంగా ఉంటాయి. ఎవరికై నా వీసా వస్తే.. అక్కడి బ్యాంకుల అవసరమైన మేరకు రుణవసతి కల్పిస్తాయి. గల్ఫ్ దేశాలకు వెళ్లే వారు మోసాలకు గురికాకుండా ప్రభుత్వమే అధికా రిక ఏజెన్సీల ద్వారా వీసాలను సమకూర్చుతుంది. గల్ఫ్ వెళ్లే వారికి ముందే వివిధ పనుల్లో శిక్షణ ఇచ్చి .. అక్కడి భాషను, అక్కడి వాతావరణం, పనితత్వంపై అవగాహన కల్పిస్తారు. ఏదైనా కారణం చే త అక్కడ పనిచేయలేక.. ఇంటికి తిరిగొస్తే.. ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పించి పాత అప్పును తీర్చుకునే వీలు కల్పిస్తారు. ఇది చట్టబద్ధంగా సాగడంతో వలసజీవులకు ఇబ్బందులు రాకుండా కేరళ ప్రభుత్వం కట్టడి చేస్తుంది. విదేశీ మారకాన్ని మన దేశాని కి ఆర్జించి పెట్టేవాళ్లుగా అన్ని సంక్షేమ పథకాలను గల్ఫ్ వలస జీవులకు అమలు చే స్తుంది. ఈ విధానాన్ని మన రాష్ట్రంలో అమలు చేసేలా విధానాలకు రూపకల్పన చేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం కమిటీకి అప్పగించింది. ఆ కమిటీపై జిల్లాలోని గల్ఫ్ వలస జీవులు ఆశలు పెట్టుకున్నారు.
ఉపాధి వేటలో పోతున్న ప్రాణాలు
గల్ఫ్ వలస కార్మికుల
సంక్షేమానికి సలహా కమిటీ
ఎన్‌ఆర్‌ఐ పాలసీ రూపకల్పనకు అవకాశం
కమిటీ చైర్మన్‌గా ఐఎఫ్‌ఎస్ అధికారి
కమిటీలో ఐదుగురు గౌరవ సభ్యులు..
మరో ఏడుగురు సభ్యులు

గాలిలో దీపం.. గల్ఫ్‌లో జీవనం

గాలిలో దీపం.. గల్ఫ్‌లో జీవనం