భూ మాఫియా!
మళ్లీ నిద్రలేచిన
● సిటీలో అన్ని రకాల ఇండ్లు కూల్చబడును! ● రివాజుగా మారుతున్న నిర్మాణాల కూల్చివేత ● కోర్టులు, పోలీసులను లెక్క చేయని నిందితులు ● పాత సీపీ ఉన్నంత కాలం చప్పుడు లేని భూపంచాయితీలు ● ఆయా కేసుల్లో వివాదాలు మళ్లీ తెరపైకి
సాక్షిప్రతినిధి, కరీంనగర్:
కరీంనగర్.. స్మార్ట్ సిటీగా రాష్ట్రంలో మంచిపేరు సంపాదించింది. అలాగే, ఐటీలో ద్వితీయ శ్రేణి నగరంగా ఇప్పుడిప్పుడే ఎదుగుతోంది. రోజురోజుకూ నలుచెరుగులా విస్తరిస్తోంది. త్వరలో రింగ్‌రోడ్డు కూడా రాబోతోంది. ఇదంతా నాణేనికి ఒకేవైపు.. నగరంతోపాటు భూవివాదాలు కూడా రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. వివాదా లు పోలీసుస్టేషన్‌కి వెళ్లడం లేదా బాధితులు జిల్లా కోర్టులు, హైకోర్టును ఆశ్రయించడం ఒక పద్ధతి. కానీ, వివాదాలు తలెత్తిన వెంటనే.. బలమున్న వారు ఆ ఇంటిని లేదా నిర్మాణాన్ని కూల్చివేయడం ఆనవాయితీగా వస్తోంది. గతంలో 2022లో మొదలైన ఈ ఆచారం మధ్యలో సీపీ మహంతి కాలంలో సుప్తావస్తకు చేరింది. భూవివాదాలపై ఆయన ఉక్కుపాదం మోపిన తీరుకు అంతా సర్దుకుంది. కా నీ, ఇపుడు తిరిగి భూ వివాదాలు నిద్రలేస్తుండడం బాధితుల్లో కలవరపాటుకు కారణమవుతోంది.
గతంలోనూ సంచలన ఘటనలు..
2022లో కరీంనగర్ సీతారాంపూర్‌లో నిర్మాణంలో ఉన్న మూడు ఇళ్లను కూల్చిన ఘటన కలకలం రేపింది. ఘటనాస్థలాన్ని అప్పటి సీపీ, కలెక్టర్ ఘటనాస్థలాన్ని సందర్శించారు. వివాదం చెలరేగితే పంతం నెగ్గించుకునేందుకు ఇళ్లను బుల్డోజర్లు వేసుకుని వెళ్లి మరీ.. అర్ధరాత్రి నేలమట్టం చేసిన తీరు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అప్పటి నుంచి అదేదుర్ఘటన మిగిలిన వారికీ మార్గదర్శంగా మారడం దురదృష్టకరం. తర్వాత తీగలగుట్టపల్లిలో ఓ వైద్యుడి ఇంటి స్థలం విషయంలో వివాదం చెలరేగింది. రాత్రిపూట బుల్డోజర్‌తో వచ్చి.. కూల్చివేయడం కలకలంరేపింది. ఆ తర్వాత కూడా అదేప్రాంతంలో కడుతున్న ఇంటిని సుత్తెలతో మోది ధ్వంసం చేశారు. అనంతరకాలంలో సీపీ మహంతి రావడంతో పరిస్థితులు మారిపోయాయి. భూవివాదాలపై ఆయన ప్రత్యేక దృష్టి సారించి, పలువురిని అరెస్టు చేయడంతో కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. కానీ, ఇటీవల మహంతి ఇక్కడ నుంచి బదిలీపై వెళ్లిపోవడంతో భూవివాదాలు మళ్లీ తెరపైకి వస్తున్నాయి. ఆయన హయాంలో కేసులు నమోదు అయినా ఘటనల్లో బాధితులు, నిందితుల మధ్య ఘర్షణ పూరిత వాతావరణం నెలకొంటోంది.
తాజాగా మరోఇల్లు..
వల్లంపహాడ్‌లో తాజాగా కొందరు రాత్రిపూట వచ్చి ఓ నిర్మాణాన్ని ధ్వంసం చేయడానికి యత్నించారు. వారిచర్యతో నిర్మాణం చాలావరకు దెబ్బతింది. ఈ పరిణామంతో బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. ఈ వివాదంపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయని, కోర్టులోనూ వివాదం కొనసాగుతోందని బాధితుడు సాంబమూర్తి ‘సాక్షి’కి తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో తన భూమిలోకి వచ్చి.. తన ఇంటిని ధ్వంసం చేయడం ఏమిటని వాపోయారు. భూవివాదాలపై పోలీసుల విచారణ, కోర్టులో కేసులు నడుస్తుండగా.. ఇలా స్వయంగా వచ్చి ఎవరికివారు నిర్మాణాలు కూల్చడంపై నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భూ మాఫియా!
భూ మాఫియా!
భూ మాఫియా!


