
ఆస్తిపన్ను వసూళ్లు సంతృప్తికరం
● నగరపాలకసంస్థ కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్
కరీంనగర్ కార్పొరేషన్: గత ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్ను వసూళ్లు సంతృప్తికరంగా ఉన్నాయని నగరపాలకసంస్థ కమిషనర్‌చాహత్ బాజ్‌పేయ్ తెలిపారు. 15వ ఆర్థిక సంఘం నిధుల లక్ష్యాన్ని చేరుకోవడంతో ఆమె అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. సోమవారం కళాభారతిలో రెవెన్యూ అధికారులు, వార్డు అధికారులు, సపోర్టింగ్ ఉద్యోగులతో సమీక్ష నిర్వహించారు. గత ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్ను వసూళ్లలో సాధించిన ప్రగతి స్ఫూర్తిగా ఈ ఆర్థిక సంవత్సరం (2026–26) లక్ష్యం చేరుకోవాలన్నారు. పన్ను ఎక్కువ, తక్కువగా ఉన్న అసెస్‌మెంట్లను తప్పకుండా సరిచేయాలన్నారు. ట్రేడ్ లైసెన్స్‌లపై వార్డు అధికారులు ప్రత్యేక దృష్టిసారించాలని ఆదేశించారు. సమావేశంలో నగర పాలకసంస్థ అదనపు కమిషనర్ సువార్త, డిప్యూటీ కమిషనర్ స్వరూపరాణి, ఆర్‌వో భూమానందం,ఆర్‌ఐలు విజయలక్ష్మి, కిష్టయ్య పాల్గొన్నారు.