
విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సు
కరీంనగర్‌క్రైం: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కే.వెంకటేశ్ నగరంలోని ప్రభుత్వ బాలుర వసతి గృహం (షెడ్యూల్ కులాల)ను సందర్శించి, చట్టాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు మంచి నడవడిక అలవర్చుకోవాలని సూచించారు. చక్కగా చదువుకుని క్రమశిక్షణతో ఎంచుకున్న లక్ష్యాలను సాధించడానికి కృషి చేయాలన్నా రు. ధైర్యంతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు.ఎలాంటి న్యాయపరమైన సాయం అందించడానికై నా న్యాయ సేవాధికార సంస్థ సిద్ధంగా ఉంటుందన్నారు. వసతి గృహంలో అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు.
‘ఆదాయ మార్గాలు లేక భూముల అమ్మకాలు’
కరీంనగర్‌టౌన్: కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆదా యం కావాలంటే, భూముల వేలం ఒక్కటే శరణ్యంగా మారిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి విమర్శించారు. మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ సంస్థాగత నిర్మాణంపై అసెంబ్లీ కన్వీనర్లు, మండల అధ్యక్షులతో ముఖ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ హెచ్‌సీయూ భూములు అమ్మడానికి ప్రయత్నించి కాంగ్రెస్ విఫలమైందన్నారు. రాష్ట్రంలో ఆదాయం పెంచుకునే మార్గాలే లేకుండా పోయాయని, అందుకే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం భూములు అమ్ముకునే దుస్థితికి వచ్చిందని అన్నారు. రాష్ట్ర పార్టీ సూచన మేరకు మండల కమిటీ మొదలుకుని బూత్‌స్థాయి వరకు సంస్థాగత నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేయాలన్నారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకట్‌రెడ్డి, పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు, జిల్లా ఉపాధ్యక్షుడు రంగు భాస్కరచారి, ఎర్రబెల్లి సంపత్ రావు, నిర్మలారెడ్డి పాల్గొన్నారు.
సదస్సుకు తరలిరండి
కరీంనగర్: దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ఈనెల 25న నిర్వహించే జిల్లా సదస్సును విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు గీట్ల ముకుందరెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం కోతిరాంపూర్‌లోని ముకుందలాల్ మిశ్రాభవన్‌లో జిల్లా ట్రేడ్ యూనియన్స్ సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ జిల్లాలో కార్మికవర్గాన్ని సమాయత్తం చేయడానికి సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపా రు. ఈనెల 25న బద్ధం ఎల్లారెడ్డి భవన్‌లో జరి గే సదస్సుకు అన్ని కార్మిక సంఘాలు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేశ్, బీఆర్టీయూ జిల్లా బొమ్మిడి శ్రీనివాస్‌రెడ్డి, టీఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు కల్యాడపు ఆగయ్య తదితరులు పాల్గొన్నారు.
ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని దుకాణ దారులు విధిగా ట్రేడ్‌లైసెన్స్ తీసుకోవాలని నగరపాలకసంస్థ డిప్యూటీ కమిషనర్ స్వరూపరాణి అన్నారు. మంగళవారం నగరపాలకసంస్థ కార్యాలయంలో రెవెన్యూ, వార్డు అధికారులు, జవాన్లతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు ట్రేడ్ లైసెన్స్ తీసుకోని దుకాణదారులు లైసెన్స్ తీసుకోవాలని, లైసెన్స్ రెన్యువల్ చేసుకొన్న వాళ్లు పన్నులు చెల్లించాలన్నారు. లేకుంటే చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఆస్తి పన్ను చెల్లింపులో ఐదుశాతం రాయితీని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఆర్‌వో భూమానందం, ఆర్‌ఐ కలాముల్లాఖాన్ పాల్గొన్నారు.
డ్రైనేజీలో బయోవేస్టేజ్
● ఆర్‌ఎంపీకి రూ.20వేల జరిమానా
మానకొండూర్: మానకొండూర్‌లో ఓ ఆర్‌ఎంపీ డ్రైనేజీలో బయోవేస్టేజ్ వేశాడు. దీంతో పంచాయతీ కార్యదర్శి రూ.20వేల జరిమానా విధించాడు. మానకొండూర్‌కు చెందిన ఆర్‌ఎంపీ దేవేంద్ర శ్రీనివాస్ ఉపయోగిస్తున్న సిరంజ్‌లు, ఇంజక్ట్‌బుల్స్, వయల్స్, హాజార్డ్ వేస్ట్‌ను గ్రామంలోని మురుగు కాలువలో వేస్తున్నాడు. గ్రహించిన పంచాయతీ కార్యదర్శి రేవంత్‌రెడ్డి ఇలా వేయడం కారణంగా పారిశుధ్య కార్మికులతో పాటు, మూగజీవాలకు ప్రమాదం కలిగే అవకాశం ఉందని ఆర్‌ఎంపీకి నోటీసులు జారీ చేసి, రూ.20వేల జరిమానా విధించాడు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాడు.

విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సు

విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సు