రాజన్నా.. నీవే దిక్కు
వేములవాడ: వరుస సెలవులతో వేములవాడ రాజన్నకు ఆదివారం 55 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. మండుతున్న ఎండలను సైతం లెక్కచేయకుండా భక్తులు ధర్మగుండంలో స్నానాలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రాకతో ఆలయ ఆవరణ జనజాతరను తలపించింది. భక్తుల ద్వారా రూ.50లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. రాజన్నను రాష్ట్ర దేవాదాయశాఖ అడిషనల్ కమిషనర్ శ్రీనివాస్, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, ఢిల్లీ అర్బన్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ రవీందర్ దర్శించుకున్నారు.
● దర్శించుకున్న 55వేల మంది
● రూ.50లక్షల ఆదాయం
● వరుస సెలవులతో పెరిగిన రద్దీ
రాజన్నా.. నీవే దిక్కు


