హనుమాన్‌ విజయ యాత్రకు పటిష్ట బందోబస్తు | - | Sakshi
Sakshi News home page

హనుమాన్‌ విజయ యాత్రకు పటిష్ట బందోబస్తు

Apr 11 2025 1:05 AM | Updated on Apr 11 2025 1:05 AM

హనుమా

హనుమాన్‌ విజయ యాత్రకు పటిష్ట బందోబస్తు

కరీంనగర్‌క్రైం: హనుమాన్‌ చిన్న జయంతి సందర్భంగా ఈనెల 12వ తేదీ శనివారం కరీంనగర్‌లో నిర్వహించనున్న శ్రీ వీరహనుమాన్‌ విజ య యాత్రకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు సీపీ గౌస్‌ ఆలం తెలిపారు. టౌన్‌ ఏసీపీ కార్యాలయంలో గురువారం డివి జన్‌లోని పోలీసు అధికారులతో సమావేశం అయ్యారు. యాత్ర వైశ్య భవన్‌ పక్కన గల రామాలయం నుంచి ప్రారంభమై రాజీవ్‌ చౌక్‌, టవర్‌సర్కిల్‌, గంజ్‌ రోడ్‌, రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ చౌరస్తా, కమాన్‌ రోడ్‌ మీదుగా, బస్టాండ్‌, తెలంగాణ చౌక్‌, ఐబీచౌరస్తా, కోర్ట్‌ చౌరస్తా , మంచిర్యాల చౌరస్తా, గాంధీ విగ్రహం వీదుగా రామాలయం చేరుకుంటుందని తెలిపారు. ఈ యాత్రకు 500మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

నాలా సమస్య పరిష్కరిస్తాం

కరీంనగర్‌ కార్పొరేషన్‌: నగరంలోని శర్మనగర్‌, సాహెత్‌నగర్‌లకు ఇబ్బందిగా మారిన నాలా సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని నగరపాలకసంస్థ కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పేయ్‌ అన్నా రు. గురువారం నగరంలోని 44వ డివిజన్‌ పరి ధి శర్మనగర్‌లో నాలాను పరిశీలించారు. ప్రతి వర్షాకాలం నాలాతో ఎదురవుతున్న సమస్యలను మాజీ కార్పొరేటర్‌ మెండి చంద్రశేఖర్‌ కమిషనర్‌ దృష్టికి తీసుకువచ్చారు. సమస్యను పరిష్కరించాలని కమిషనర్‌ ఇంజినీరింగ్‌ అధి కారులకు సూచించారు. అనంతరం ఎన్‌టీఆర్‌చౌరస్తాలోని డ్రైనేజీ మరమ్మతు పనులను తనిఖీచేసి, వేగవంతం చేయాలని ఆదేశించారు. సహాయ కమిషనర్‌ వేణు మాధవ్‌, డీఈ ఓం ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోళ్లలో కోత వద్దు

కరీంనగర్‌ అర్బన్‌: రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యంలో ఎలాంటి తరు గు, కోతలు విధించవద్దని చొప్పదండి ఎమ్మె ల్యే మేడిపల్లి సత్యం అన్నారు. కరీంనగర్‌ కలెక్టరేట్‌లో కలెక్టర్‌ పమేలా సత్పతి, అడిషనల్‌ కలెక్టర్‌ లక్ష్మీకిరణ్‌తో కలిసి యాసంగి ధాన్యం కొనుగోళ్లపై పౌరసరఫరాలశాఖ అధికారులు, రైస్‌ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బ ంలు రాకుండా చూడాలన్నారు. కలెక్టర్‌ పమేలా సత్పతి మాట్లాడుతూ జిల్లాలో గత పంట సీజన్లలో ఎలాంటి కోతలూ లేకుండా ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరిగిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం అదే తరహాలో కొనుగోళ్లు జరపాలని అన్నారు. పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌ ఎం.రజనీకాంత్‌, జిల్లా పౌరసరఫరాల అధికారి నర్సింగరావు, రైస్‌మిల్లర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు బోయినపల్లి నర్సింగరావు, మిల్లర్లు పాల్గొన్నారు.

మార్కెట్‌ కార్యదర్శిగా హమీద్‌

కరీంనగర్‌ అర్బన్‌: మార్కెటింగ్‌శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల్లో అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం ‘సాక్షి’లో ‘56పోస్టులు.. 40 ఖాళీలు’ శీర్షికన కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. కరీంనగర్‌ మార్కెట్‌ కార్యదర్శిగా పెద్దపల్లి గ్రేడ్‌–3 కార్యదర్శి సయ్యద్‌ హమీద్‌ అలీని ఎఫ్‌ఎసీగా నియమించగా గంగాధర మార్కెట్‌కు అక్కడే సూపర్‌వైజర్‌గా పనిచేసే లక్ష్మ ణ్‌ను ఇన్‌చార్జిగా నియమించారు. కాగా జిల్లా మార్కెటింగ్‌ ఇన్‌చార్జి అధికారి షాబోద్దీన్‌ పత్రికా ప్రకటన విమర్శలకు తావి స్తోంది. మార్కెట్‌ కమిటీలో సి బ్బంది కొరత లేదని పేర్కొనడం విడ్డూరం.

‘మీ సేవ’లపై నిఘా

కరీంనగర్‌ అర్బన్‌: ధ్రువపత్రాల జారీలో అలసత్వం, మీ సేవ కేంద్రాల్లో విచ్చలవిడి దోపిడీకి అడ్డుకట్ట వేసేలా కలెక్టర్‌ పమేలా సత్పతి ప్రత్యేక దృష్టిసారించారు. ఈ నెల 8న ‘సాక్షి’లో ‘యువ వికాసంలో దళారుల దందా’ శీర్షికన కథనం ప్రచురితం కాగా ఆయా శాఖల అధికారులపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. మీ సేవ కేంద్రాల్లో నిర్ణీత రుసు ము మాత్రమే వసూలు చేయాలని, రూపాయి ఎక్కువ తీసుకున్నా సీజ్‌ చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇక దళారులకు ఎలాంటి అవకాశమివ్వవద్దని,దరఖాస్తుదారులు మాత్ర మే కార్యాలయాలకు వచ్చేలా పర్యవేక్షణ చేయాలని తహసీల్దార్లకు నిర్దేశించారు. ఎప్పటికప్పుడు సర్టిఫికెట్లను జారీ చేయాలని, అలసత్వం చేయొద్దని ఇప్పటికే అదనపు కలెక్టర్‌ లక్ష్మీకిరణ్‌ రెవెన్యూ అధికారులతో స్పష్టం చేశారు.

హనుమాన్‌ విజయ యాత్రకు పటిష్ట బందోబస్తు1
1/1

హనుమాన్‌ విజయ యాత్రకు పటిష్ట బందోబస్తు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement