
మరింత చేరువయ్యేలా..
● ఇక అన్నదాతలందరికీ ‘రైతునేస్తం’ ● ప్రతి మండలంలో మరో రెండు వేదికల్లో ప్రారంభం
కొత్తగా రైతునేస్తం ప్రారంభించనున్న రైతు వేదికలు
మండలం క్లస్టర్
కరీంనగర్‌రూరల్ దుర్శేడ్, మొగ్ధుంపూర్
కొత్తపల్లి కమాన్‌పూర్, బద్ధిపల్లి
మానకొండూరు చెంజర్ల, పచ్చునూరు
తిమ్మాపూర్ పర్లపల్లి, రేణికుంట
శంకరపట్నం మెట్‌పల్లి, కాచాపూర్
గన్నేరువరం గుండ్లపల్లి, మాదాపూర్
చిగురుమామిడి ఇందుర్తి, సుందరగిరి
హుజూరాబాద్ కందుగుల, సిర్సాపల్లి
జమ్మికుంట జమ్మికుంట, వావిలాల
వీణవంక వీణవంక, వల్భపూర్
సైదాపూర్ దుద్దెనపల్లి, రాయికల్
ఇల్లంతకుంట సిరిసేడు, బుజునూరు
గంగాధర గర్షకుర్తి, బూరుగుపల్లి
చొప్పదండి ఆర్నకొండ, గుమ్లాపూర్
రామడుగు గోపాల్‌రావుపేట,
రుద్రారం
కరీంనగర్‌రూరల్: రైతు నేస్తం కార్యక్రమాన్ని రైతులందరికీ మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు మండల కేంద్రాల్లోని రైతువేదికల్లో ప్రతీ మంగళవారం రైతునేస్తం కార్యక్రమంలో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు ప్రత్యక్ష ప్రసారం చేశారు. ప్రస్తుతం రైతులకు మరింత సేవలందించేందుకుగాను అదనంగా ప్రతీ మండలంలోని రెండు క్లస్టర్లలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
మండలానికో క్లస్టర్ రైతువేదిక..
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్మించిన రైతువేదికల ద్వారా రైతులకు సేవలందించేందుకు వీలుగా ఆధునిక, సాంకేతిక పద్ధతులను ఉపయోగించుకుని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సలహాలు, సూచనలు అందించేందుకు రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించింది. మూడేళ్లక్రితం మొదటి విడతలో ప్రయోగాత్మకంగా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కొత్తపల్లి రైతువేదిక, హుజూరాబాద్‌లో హుజూరాబాద్, చొప్పదండిలో గంగాధర, మానకొండూరులో తిమ్మాపూర్ రైతువేదికలను ఎంపిక చేశారు. అనంతరం రెండో విడతలో మండలానికో రైతు వేదిక చొప్పున కరీంనగర్‌రూరల్ మండలంలోని చామనపల్లి రైతువేదిక, మానకొండూరు, గన్నేరువరం మండల కేంద్రాలు, శంకరపట్నంలో కేశవపట్నం, చిగురుమామిడి, చొప్పదండి, రామడుగు, సైదాపూర్ మండల కేంద్రాలు, జమ్మికుంటలోని తనుగుల, ఇల్లంందకుంట మండల కేంద్రం, వీణవంకలోని చల్లూరు రైతువేదికలను ఎంపిక చేసి ప్రతి మంగళవారం రైతునేస్తం కార్యక్రమాలను ప్రసారం చేశారు. ప్రస్తుతం మూడో విడతలో జిల్లాలోని మొత్తం 15 మండలాల్లో రెండు క్లస్టర్ల చొప్పున రైతువేదికలను ఎంపిక చేసి వీడియో కాన్ఫరెన్స్ పరికరాలను ఏర్పాటు చేయనున్నారు.
కేవీకే ఆధ్వర్యంలో..
జిల్లాలో సాగు చేసే పంటలలో యాజమాన్య పద్ధతులపై వ్యవసాయ విశ్వవిద్యాలయం కేంద్రంగా శాస్త్రవేత్తలు సలహాలు, సూచనలు అందించారు. అయి తే జిల్లాల వారీగా పంటల సాగు పద్ధతులు, ఆశించే తెగుళ్లు వేర్వేరుగా ఉండటంతో రైతులకు సరైన సలహాలు లభించలేదు. ఇక నుంచి కృషి విజ్ఞన కేంద్రం ద్వారా స్థానిక శాస్త్రవేత్తలతో రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు అందించేందుకు అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.