
అశ్వవాహనంపై సీతారామచంద్రస్వామి
ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామి వారు అశ్వవాహనంపై ఊరేగారు. శేషం వంశీధరచార్యులు వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య సన్నాయిడోలు వాయిద్యాల మధ్య ఉత్సవమూర్తులను పూలతో అలంకరించగా...స్వామివారు మాడవీధుల గుండా ఊరేగారు. భక్తులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఇంగిలే రామారావు, ఇన్‌చార్జి ఈవో కందుల సుధాకర్, కడారి కుమారస్వామి, ధర్మకర్తలు మల్లేశ్, గోపాల్‌రెడ్డి, భక్తులు పాల్గొన్నారు. – ఇల్లందకుంట