తనిఖీలు చేస్తున్నా.. మారని తీరు
కోల్‌సిటీ(రామగుండం): రామగుండం నగరంలోని కొన్ని హోటళ్లు, బేకరీలు, స్వీట్‌హౌస్‌లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ల నిర్వాహకులు నాణ్యతను గాలికి వదిలేస్తున్నారు. బల్దియా అధికారులు ఆకస్మికంగా చేపట్టే తనిఖీల్లో విస్తుపోయే బాగోతాలు వెలుగు చూస్తున్నాయి. ఇటీవల ఓ బేకరీలో నాణ్యతలేని ఆహార పదార్థాలు, గడువు పూర్తయిన రసాయనాలు, ముడిసరుకులతో తయారు చేసిన తినుబండరాలను విక్రయిస్తున్నట్లు బహిర్గతమయ్యింది. దీంతో ఆ వ్యాపారికి రూ.20వేలు జరిమానా విధించారు. దీనినుంచి తేరుకోకముందే మరో నిర్లక్ష్యం వెలుగు చూసింది. గోదావరిఖని మార్కండేయకాలనీలోని తాజ్ ఫ్యామిలీ రెస్టారెంట్, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌ను హెల్త్ అసిస్టెంట్ కిరణ్, ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ మధుకర్, ఎంఐఎస్ ఆపరేటర్ శ్రీకాంత్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నాణ్యతలేని సరుకులతో ఆహార పదార్థాలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వాహకునికి రూ.8వేలు జరిమానా విధించారు.
నాణ్యతలేని సరుకులతో ఫాస్ట్‌ఫుడ్
మరో రెస్టారెంట్‌కు రూ.8వేలు జరిమానా


