
పర్మినెంట్ కాకుండానే పదవీవిరమణ
గన్నేరువరం: కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం చీమలకుంటపల్లె గ్రామ ప్రాథమిక పాఠశాలలో స్వీపర్‌గా పనిచేస్తున్న లింగన్న బుధవారం ఉద్యోగవిరమణ పొందారు. జిల్లాలోని తిమ్మాపూర్ మండలం వచ్చునూర్ గ్రామానికి చెందిన లింగన్న 1985లో రూ.75 జీతానికి తాత్కాలిక స్వీపర్‌గా విధుల్లో చేరారు. రూ.5 వేల జీతంతో బుధవారం ఉద్యోగ విరమణ పొందాడు. పర్మింనెట్ కాకుండా ఉద్యోగ విరమణ చేయడం బాధకరమని స్థానికులు తెలిపారు. 40ఏళ్లు విద్యార్థులకు, పాఠశాలకు చేసిన సేవలకు గుర్తింపుగా పూర్వ విద్యార్థులు, గ్రామస్తులు రూ.41,116ను ఆర్థికంగా సాయంగా అందించారు. ప్రధానోపాధ్యాయుడు రవీందర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
రూ.75తో ప్రారంభమై.. రూ.5వేల వేతనంతో ఉద్యోగ విరమణ