
మా పొట్ట కొట్టొద్దు
రాజస్థాన్, గుజరాత్ నుంచి వచ్చిన హోల్‌సేల్ వ్యాపారులు మా పొట్టకొడుతున్నారని కరీంనగర్‌కు చెందిన మొబైల్ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం మొబైల్ టెక్నిషియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నపూర్ణ కాంప్లెక్స్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల వ్యాపారులు మొబైల్ వస్తువులు, జీరో రసీదులు ఇస్తూ స్థానిక వ్యాపారులకు అన్యాయం చేస్తున్నారన్నారు. నిరసనలో సీపీఎం నగర కార్యదర్శి సత్యం, కరీంనగర్ సెల్యూలర్–టెక్నీషియన్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎండీ అజ్మత్ అలీ, శ్రీనివాస్, సెల్యులర్ రిటైల్ అండ్ టెక్నిషియన్ అసోసియేషన్ సభ్యులు చిరంజీవి చారి, సతీశ్, రాజ్ కుమార్, శ్రీనివాస్, అక్బర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. – విద్యానగర్(కరీంనగర్)