
పూలే ఆశయాలు కొనసాగించాలి
శనివారం శ్రీ 12 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలు కొనసాగించాలని పలువురు వక్తలు కోరారు. శుక్రవారం శాతవాహన వర్సిటీ చౌరస్తాలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతి, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, అడిషనల్ కలెక్టర్లు ప్రపుల్ దేశాయ్, లక్ష్మీకిరణ్ సహా పలువురు బీసీ సంఘాల నేతలు, అధికారులు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారి అనిల్ ప్రకాశ్, పలువురు బీసీ సంఘాల నేతలు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. – కరీంనగర్

పూలే ఆశయాలు కొనసాగించాలి

పూలే ఆశయాలు కొనసాగించాలి