
ఇంగ్లిష్ ఒలింపియాడ్‌లో అల్ఫోర్స్ విద్యార్థికి ర్యాంకు
కొత్తపల్లి(కరీంనగర్): హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ పోటీ పరీక్షల సంస్థలైన యునిఫైడ్ కౌన్సిల్ ఇటీవల నిర్వహించిన జాతీయస్థాయి ఇంగ్లిష్ ఒలింపియాడ్‌లో కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ టెక్నో స్కూల్ విద్యార్థి ఎం.శీవేన్‌రెడ్డి (7వ తరగతి) అత్యుత్తమ ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయిలో 2వ ర్యాంకు సాధించడంతో పాటు రూ.10 వేల నగదు బహుమతి గెల్చుకున్నట్లు విద్యా సంస్థల చైర్మన్ వి.నరేందర్‌రెడ్డి తెలిపారు. పాఠశాలలో బుధవారం విద్యార్థిని అభినందించారు. పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.
శీవేన్‌రెడ్డిని అభినందిస్తున్న అల్ఫోర్స్ చైర్మన్ నరేందర్ రెడ్డి