ఇయ్యాల్టి నుంచి ‘భూ భారతి’
● మండలాలవారీగా షెడ్యూల్ ఖరారు ● 30 వరకు నిర్వహణ
కరీంనగర్ అర్బన్: భూభారతి పోర్టల్‌పై ప్రభుత్వ యంత్రాంగం గురువారం నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టనుంది. కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి మండలాల వారీగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు షెడ్యూల్ ఖరారు చేశారు. రైతు వేదికల కేంద్రంగా తహసీల్దార్లు సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. గుడ్ ఫ్రైడే, ఆదివారం సెలవు రోజులు మినహాయించి నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం ప్రజావాణి ఉండటంతో అవగాహన కార్యక్రమం నుంచి మినహాయించారు. కరీంనగర్, హుజూరాబాద్ రెవెన్యూ డివిజన్లకు ఆయా ఆర్డీవోలు నోడల్ అధికారులుగా వ్యవహరించనున్నారు. 17న తిమ్మాపూర్ రైతు వేదికలో ఉదయం 10.30 గంటలకు అవగాహన కార్యక్రమం ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు గన్నేరువరం, 19న హుజూరాబాద్ సాయిరూప గార్డెన్‌లో ఉదయం 10.30 గంటలకు, 22న రామడుగు రైతువేదికలో ఉదయం 10.30 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు గంగాధరలో, 23న చొప్పదండి రైతువేదికలో ఉదయం 10.30 గంటలకు, 24న మానకొండూరు రైతువేదికలో ఉదయం 10.30 గంటలకు, వంకాయ గూడెం(శంకరపట్నం)లో మధ్యాహ్నం 12 గంటలకు, 25న జమ్మికుంట ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్‌లో, మధ్యాహ్నం 12 గంటలకు ఇల్లందకుంట రైతువేదికలో, 26న దుర్శేడ్ రైతువేదికలో (కరీంనగర్ రూరల్) ఉదయం 10.30 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు కొత్తపల్లి రైతువేదికలో అవగాహన ఉంటుంది. 29న చిగురుమామిడి రైతువేదికలో ఉదయం 10.30 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు సైదాపూర్ రైతువేదిక, 30న వీణవంక రైతువేదికలో ఉదయం 10.30 గంటలకు అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు.


