
ఆ ఉపాధ్యాయుడు మాకొద్దు
విద్యార్థులు, మధ్యాహ్నభోజన సిబ్బందిని ఇబ్బందులకు గురిచేస్తున్న ఆ ఉపాధ్యాయుడు మాకొద్దంటూ స్టూడెంట్స్, తల్లిదండ్రులు, గ్రామస్తులు శుక్రవారం పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టారు. గన్నేరువరం మండలం మైలారం గ్రామ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడు పాఠాలు చెప్పకుండా నిద్రపోతున్నారని, ఇదేమిటని ప్రశ్నిస్తే పిల్లలను చితకబాదుతున్నారని ఆరోపించారు. ఈ విషయమై ఉపాధ్యాయుడి వివరణ కోరగా పరిసరాల పరిశుభ్రత ఉండడంలేదని, మోను ప్రకారం మాధ్యాహ్న భోజనం అందడంలేదన్నారు. టీచర్లు సమయపాలన పాటించడం లేదని.. దీనిని ప్రశ్నించినందుకే విధులకు ఆటంకం కలిగిస్తున్నారని తెలిపారు. ఆరోపణలు నిజం కాదన్నారు.– గన్నేరువరం