రామగుండంలో లోకోపైలెట్ల నిరసన
రామగుండం: ఆలిండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ కేంద్ర కమిటీ పిలుపు మేరకు స్థానిక లోలో పైలెట్లు ఆదివారం నిరసన తెలిపారు. కేంద్రప్రభుత్వం లోకో రన్నింగ్ స్టాఫ్ డిమాండ్ల కమిటీని ఇటీవల ఏర్పాటు చేయగా అందులో రన్నింగ్ స్టాఫ్, ప్రయాణికుల సేవలకు వ్యతిరేకంగా నిర్ణయాలు ఉన్నాయని పైలెట్లు ఆరోపించారు. దీంతో స్థానిక రైల్వే ప్లాట్‌ఫారం ఉన్న క్య్రూ కార్యాలయం ఎదుట లోకో పైలెట్లు ఆందోళనకు దిగారు. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులను పట్టుకొని నిరసన తెలిపారు. అనంతరం వాటిని దహనం చేశారు. రైల్వేబోర్డు నిర్ణయాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రామగుండం బ్రాంచి కార్యదర్శి సీహెచ్ రవి, ప్రతినిధులు ఎంబీ మీనా, అరుణ్‌తేజ్, నవీన్, రమణాచారి, పంకజ్ లష్కర్ తదితరులు పాల్గొన్నారు.


