
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రి పదవుల కోసం కొట్టుకుంటున్
సుల్తానాబాద్(పెద్దపల్లి): ఉమ్మడి మూడు జిల్లాల్లోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రి పదవుల కోసం కొట్లాడుకుంటున్నారని, పాలనను గాలికి వదిలేశారని గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి విమర్శించారు. మండల కేంద్రంలో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భవిషత్‌లో తాము మళ్లీ గెలుస్తామో, లేదోననే భయం కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పట్టుకుందని ఎద్దేవా చేశారు. బీజేపీ రెండు ఎమ్మెల్సీ స్థానాలు గెలిచినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి ఓటమి భయం పట్టుకుందన్నారు. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు భయపడుతోందని అన్నారు. 450 ఎకరాలను హెసీయూకి రిజిస్ట్రేషన్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. భూభారతితో పేదలకు అన్యాయం జరకుండా చూడాలని కోరారు. బీఆర్‌ఎస్ హయాంలో ధరణి ద్వారా పేదల భూములను పెద్దలకు ధారాదత్తం చేశారని, ఇప్పుడలా జరిగితే బీజేపీ ఆందోళనలు చేస్తుందని హెచ్చరించారు. రాష్ట్రంలో వచ్చేది డబుల్ ఇంజిన్ సర్కార్ అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య, మాజీ ఎమ్మెల్యేలు గుజ్జుల రామకృష్ణారెడ్డి, కాసిపేట లింగయ్య, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి, కార్యదర్శి కడారి అశోక్‌రావు తదిరులు పాల్గొన్నారు.
వచ్చేది డబుల్ ఇంజిన్ సర్కార్
రాష్ట్రంలో వచ్చేది డబుల్ ఇంజిన్ సర్కారేనని, ఇందుకోసం కార్యకర్తలు, నాయకులు సమష్టిగా కృషి చేయాలని టీచర్స్ ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య కోరారు. వార్డు సభ్యుడి నుంచి ఎంపీపీ, జెడ్పీటీసీ వరకు అన్ని ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించడమే లక్ష్యంగా పనిచేయాలని కోరారు. పెద్దపల్లి, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాల్లో 98శాతం మంది ఉపాధ్యాయులు తనకు ఓట్లు వేశారని గుర్తుచేశారు. తన విద్యాభ్యాసం పెద్దపల్లి మండలం బంధంపల్లి, అప్పన్నపేట, కరీంనగర్, హెదరాబాద్‌లో సాగిందని గుర్తుచేశారు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి తీసుకుంటున్న జీతాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు వెచ్చిస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి మాట్లాడారు.
గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి