
మాజీ ఎంపీటీసీకి తహసీల్దార్ భరోసా
శంకరపట్నం: కొడుకు, కోడలు తిండి పెట్టకుండా ఇబ్బందులు పెడుతున్న రాజాపూర్ మాజీ ఎంపీటీసీ ఆసరి ఐలయ్యకు తహసీల్దార్ భాస్కర్ న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు. భార్య సారమ్మ, చిన్నకుమారుడు గణపతి చనిపోవడంతో వ్యవసాయ భూమిని పెద్దకుమారుడు సాగు చేసుకుంటున్నాడని, తిండిపెట్టకుండా ఇబ్బందులు పెడుతూ, దుర్భాషలాడుతున్నారని ఐలయ్య కేశవపట్నం పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. వ్యవసాయభూమి, ఇళ్లు తనకు ఇప్పించాలని తహసీల్దార్‌ను వేడుకున్నాడు. స్పందించిన తహసీల్దార్ వెంటనే విచారణ చేయాలని ఆర్‌ఐను ఆదేశించారు. కొడుకు, కోడలుకు కౌన్సిలింగ్ ఇచ్చారు.