స్పోర్ట్స్ అకాడమీ, హాస్టళ్లలో ప్రవేశాలకు..
● నోటిఫికేషన్ విడుదల చేసిన క్రీడా శాఖ
● జూలై 1 నుంచి 5 వరకు ఎంపిక పోటీలు
కరీంనగర్‌స్పోర్ట్స్: క్రీడాకారుల ఉజ్వల భవితకు పునాది వేసేవి స్పోర్ట్స్ అకాడమీ, స్పోర్ట్స్ హాస్టళ్లు. ఈనేపథ్యంలో రాష్ట్రంలోని స్పోర్ట్స్ అకాడమీ, స్పోర్ట్స్ హాస్టళ్లలో 2025–26 సంవత్సరానికి ప్రవేశాలకు క్రీడాశాఖ ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. జూలై 1 నుంచి 5 వరకు బాలబాలికలకు ఎంపిక పోటీలు నిర్వహించనున్నారు.
ఎంపిక పోటీలు జరిగే ప్రదేశాలు
● సైక్లింగ్, రెజ్లింగ్ అకాడమీ, సైక్లింగ్ వెల్‌డ్రోమ్, ఓయు క్యాంప్‌లకు ఎంపిక పోటీలు ఉస్మానియా యూనివర్సిటీలోని సైక్లింగ్ వెల్‌డ్రోమ్ ఓయూలో జరగనున్నాయి.
● రీజినల్ స్పోర్ట్స్ హాస్టల్, హనుమకొండకు ఎంపిక పోటీలు డీఎస్‌ఏ హన్మకొండలో జరగనున్నాయి.
● అథ్లెటిక్స్ అకాడమీ, ఖమ్మంకు ఎంపిక పోటీలు డీఎస్‌ఏ హనుమకొండలో జరుగుతాయి.
● హాకీ అకాడమీ, వనపర్తికి ఎంపిక పోటీలు డీఎస్‌ఏ వనపర్తిలో జరుగనున్నాయి.
● వాలీబాల్ అకాడమీ, సరూర్‌నగర్‌కు ఎంపిక పోటీలు వాలీబాల్ అకాడమీ సరూర్‌నగర్‌లో జరుగనున్నాయి.
● వాలీబాల్ అకాడమీ, రాజన్న సిరిసిల్లకు ఎంపిక పోటీలు వాలీబాల్ అకాడమీ రాజన్న సిరిసిల్లలో జరుగనున్నాయి. వాలీబాల్ అకాడమీ, సిద్దిపేటకు ఎంపిక పోటీలు వాలీబాల్ అకాడమీ సిద్దిపేటలో జరుగనున్నాయి.
అర్హతలు ఇవే..
క్రీడాకారులు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారై ఉ ండాలి. సంబంధిత వేదికల్లో ఉదయం రిపోర్టు చే యాలి. అథ్లెటిక్స్, హాకీ, వాలీబాల్, రెజ్లింగ్, సైక్లింగ్‌లో ప్రవేశాలకు 12 నుంచి 16 ఏళ్లలోపు వయసు ఉండాలి. జాతీయస్థాయి సబ్ జూనియర్స్, ఎస్జీఎఫ్ పో టీల్లో పాల్గొన్న క్రీడాకారులకు ప్రాధాన్యం ఉంటుంది.
తీసుకెళ్లాల్సిన సర్టిఫికెట్లు..
క్రీడాకారులు వయసు ధ్రువీకరణ పత్రం, ప్రస్తుత విద్యార్హత సర్టిఫికెట్, రెసిడెన్షియల్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, 10 పాస్ పోర్టు సైజ్ ఫొటోలు, క్రీడా సర్టిఫికెట్లు.
సద్వినియోగం చేసుకోవాలి
రాష్ట్రంలోని క్రీడా అకాడమీ, స్పోర్ట్స్ హాస్టళ్లలో ప్రవేశ అవకాశాన్ని ఉమ్మడి కరీంనగర్ జిల్లా క్రీడాకారులు సద్విని యోగం చేసుకోవాలి. వీటిలోల్లో చేరేవారు భవిష్యత్‌లో క్రీడల్లో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. శిక్షణతో మేటి క్రీడాకారులుగా ఎదిగే అవకాశం ఉంటుంది. – శ్రీనివాస్‌గౌడ్, డీవైఎస్‌వో
స్పోర్ట్స్ అకాడమీ, హాస్టళ్లలో ప్రవేశాలకు..


