
న్యాయమూర్తులకు వీడ్కోలు
కరీంనగర్ క్రైం: ఇటీవల బదిలీ అయిన కరీంనగర్ జిల్లా జడ్జి బి.ప్రతిమ, ఏసీబీ జడ్జి కుమార్ వివేక్, ఫ్యామిలీ కోర్టు జడ్జి లక్ష్మీకుమారిలను గురువారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. అసోసియేషన్ అధ్యక్షుడు లింగంపల్లి నాగరాజు, ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్ ల ఆధ్వర్యంలో కార్యవర్గం జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయ సేవాసదన్ భవనంలో కార్యక్రమంలో ముగ్గురు న్యాయమూర్తులను మెమొంటో, శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బదిలీపై వెళ్తున్న జిల్లా జడ్జి ప్రతిమ మాట్లాడుతూ కరీంనగర్ జిల్లాకు ఎంతో గుర్తింపుఉందని, ఇక్కడ వృత్తిపరంగా తనకు ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. న్యాయమూర్తులు వెంకటేశ్ నీరజ, శ్రీలేఖ, వాణి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వెంకటేశ్, మేజిస్ట్రేట్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఆరెల్లి రాములు, కుమార్, గౌరు రాజిరెడ్డి, ఏజీపీ రమేశ్, అసోసియేషన్ ఉపాధ్యక్షుడు చందా రమేశ్, సంయుక్త కార్యదర్శి సిరికొండ శ్రీధర్, ట్రెజరర్ ముద్దసాని సంపత్, మహిళా ప్రతినిధి రజి, సీనియర్ న్యాయవాదులు డి.మల్లయ్య, పి. సజన్‌కుమార్, కె.సంజీవరెడ్డి, కొరివి వేణుగోపాల్, బాస సత్యనారాయణ, కుసుంబ కృష్ణరావు తదితరులు పాల్గొన్నారు.