
ఇండియన్ ఓపెన్ అథ్లెటిక్స్‌లో ప్రతిభ
కరీంనగర్‌స్పోర్ట్స్: జిల్లాకు చెందిన అథ్లెటిక్ క్రీడాకారిణి సీహెచ్.పూజ అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. ఇండియన్ ఓపెన్ అథ్లెటిక్స్‌కు అర్హత సాధించిన తొలి క్రీడాకారిణి కాగా.. పోటీల్లోనూ రాణించి శభాష్ అనిపించుకుంది. లాంగ్ జంప్ అంశంలో పోటీ పడిన పూజ గురువారం జరిగిన హీట్స్‌లో అద్భుతంగా రాణించి 5.25 మీటర్ల దూరాన్ని దూకి 7వ స్థానంలో నిలిచింది. పూజ ప్రస్తుతం కరీంనగర్‌లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో చదువుతోంది. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు నందెల్లి మహిపాల్, కడారి రవి అభినందించారు.