
ట్రాక్టర్‌ను ఢీకొని ఒకరి మృతి
పెగడపల్లి: ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలకేంద్రంలో చోటుచేసుకుంది. ఎస్సై రవికిరణ్ కథనం ప్రకా రం.. మండలకేంద్రానికి చెందిన వడ్లూరి మల్ల య్య (59) సైకిల్‌పై చెరువు కట్ట వైపు వెళ్తున్నా డు. తలతిప్పడంతో అదుపు తప్పి నిలిపి ఉన్న ట్రాక్టర్‌కు తగిలి కిందపడిపోయాడు. తలకు గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. మల్ల య్య కుమారుడు మధూకర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.
ఇసుక ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్..
ఇబ్రహీంపట్నం: మండలకేంద్రం శివారులోని కాకతీయకాలువ పక్కన సోమవారం అర్ధరాత్రి ఇసుక ట్రాక్టర్ బోల్తాపడి డ్రైవర్ మృతి చెందినట్లు ఎస్సై అనిల్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మెట్‌పల్లి మండలం గాజులపేటకు చెందిన జక్కం భూమేశ్(30) మటంవాడకు చెందిన చింతల సాయిలుతో కలిసి ట్రాక్టర్‌లో ఇసుకను నింపుకొని ఇబ్రహీంపట్నంకు తీసుకొస్తున్నారు. మండల కేంద్రంలోని ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడటంతో భూమేశ్ టైర్ కింద పడిపోయాడు. ఈ ఘటనలో ఆయన అక్కడిక్కడే మృతి చెందాడు. సాయిలు కుడి కాలికి తీవ్ర గాయాలు కావడంతో మెట్‌పల్లి ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య జక్కం మాధురి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అనిల్ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి..
వేములవాడఅర్బన్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందాడు. స్థానికుల వివరాలు.. వేములవాడ మండలం అనుపురం గ్రామానికి చెందిన బండారి శ్రీహరి, చిలివేరి పర్శరాములు ద్విచక్రవాహనంపై కరీంనగర్–సిరిసిల్ల ప్రధాన రహదారిలో ఇంటికి వెళ్తుండగా, కరీంనగర్ నుంచి వేములవాడకు వస్తున్న కారు వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో బండారి శ్రీహరి (56) అక్కడికక్కడే మృతిచెందగా, పర్శరాములుకు గాయాలయ్యాయి. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్ తెలిపారు.
డీసీఎం కిందపడి వ్యక్తి..
జమ్మికుంట: పట్టణంలోని ఫ్లైఓవర్‌పై డీసీఎం కింద పడి వ్యక్తి మృతి చెందాడు. టౌన్ సీఐ రవి వివరాల ప్రకారం.. పట్టణంలోని దుర్గాకాలనీకి చెందిన పురంశెట్టి తిరుపతి(35) ఎలక్ట్రిక్ స్కూటీపై ఫ్లైఓవర్ మీదుగా బస్టాండ్ వైపు వెళ్తున్నాడు. పక్కనుంచి వెళ్తున్న డీసీఎం డ్రైవర్ స్కూటీని ఓవర్‌టేక్ చేస్తున్న క్రమంలో ఢీకొట్టాడు. స్కూటీ నడుపుతున్న తిరుపతి వ్యాన్ వెనక టైర్ కింద ప డి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భా ర్య సృజన, ఇద్దరు పిల్లలున్నారు. సృజన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని దివ్యాంగుడు..
మల్యాల: మండలంలోని ముత్యంపేట దిగువ కొండగట్టు పెట్రోల్ పంపు వద్ద జగిత్యాల–కరీంనగర్ జాతీయ రహదారిపై దివ్యాంగ యాచకుడి ని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మృతి చెందాడు. బల్వంతాపూర్ క్రాస్ రోడ్డు నుంచి కొండగట్టుకు వెళ్తుండగా యాచకుడిని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి వివరాలు తెలియలేదు. బ్లూకోల్ట్స్ కానిస్టేబుల్ మధుసూదన్ రెడ్డి చేరుకుని మృతదేహాన్ని జగిత్యాలకు తరలించి, కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్ తెలిపారు.

ట్రాక్టర్‌ను ఢీకొని ఒకరి మృతి

ట్రాక్టర్‌ను ఢీకొని ఒకరి మృతి